pregnancy tests
-
కాసులకు కక్కుర్తిపడి కడుపులోనే కరిగిస్తున్నారు!
సాక్షి ప్రతినిధి, వరంగల్: కాసులకు కక్కుర్తిపడుతున్న కొందరు ప్రైవేట్ స్కానింగ్ సెంటర్ల నిర్వాహకులు, వైద్య సిబ్బంది లింగనిర్ధారణ పరీక్షలు చేస్తూ కడుపులోని బిడ్డను కరిగించేస్తున్నారు. ఆడపిల్లలు వద్దనుకునే వారి బలహీనతను ఆసరాగా చేసుకొని లింగనిర్ధారణ పరీక్షల పేరుతో విచ్చలవిడిగా దోపిడీ చేస్తున్నారు. రెండేళ్ల కిందట హైదరాబాద్‌కు చెందిన వైద్యాధికారులు బృందాలుగా ఏర్పడి ఉమ్మడి వరంగల్, నిజామాబాద్, కరీంనగర్, ఖమ్మం జిల్లాల్లో లింగనిర్ధారణ పరీక్షలు చేస్తున్న ఆస్పత్రులు, సెంటర్లపై పోలీసులతో కలిసి డెకాయ్ ఆపరేషన్ నిర్వహించారు. దీంతో కొంతకాలం దందాకు అడ్డుకట్టపడింది. అనంతరం మళ్లీ ఈ దందా రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లా కేంద్రాలు, పట్టణాల్లో సాగుతోంది. దీనిని అరికట్టకపోతే 2031 జనాభా లెక్కల నాటికి అడపిల్లల సంఖ్య గణనీయంగా పడిపోయే ప్రమాదం ఉందన్న ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది. ఆందోళన కలిగిస్తున్న గణాంకాలు గర్భస్థ లింగ నిర్ధారణ నేరం అని అన్ని స్కానింగ్ కేంద్రాల్లో, ఆస్పత్రుల్లో బోర్డు కనిపిస్తుంది. కానీ ఆయా కేంద్రాల నిర్వాహకులు, వైద్యులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ పవిత్రమైన వైద్య వృత్తికే కళంకం తెస్తున్నారు. వైద్యారోగ్యశాఖ అధికారుల పర్యవేక్షణలోపంతో ఆడశిశువులు భ్రూణహత్యకు గురవుతున్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్ర జనాభా 3,50,03,674. 2011లో దేశంలోని మొత్తం జనాభాలో 2.89 శాతం. జాతీయ జనాభా కమిషన్, కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ గణాంకాల ప్రకారం 2021లో తెలంగాణ జనాభా 3,77,25,000 కాగా, 2031 నాటికి 3,92,07,000కు చేరుకోగలదని అంచనా. ఇవి 2021, 2031 సంవత్సరాల్లో వరుసగా దేశ జనాభాలో 2.77 శాతం, 2.66 శాతం. 2011 గణాంకాల ప్రకారం రాష్ట్రంలో లింగ నిష్పత్తి (ప్రతి వెయ్యిమంది పురుషులకు మహిళల సంఖ్య) 988 కాగా, వివిధ జిల్లాల్లో ఇది 950 నుంచి 1046 వరకు నమోదైంది. లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే చర్యలు తప్పవు పోలీసు శాఖ సహకారంతో స్కానింగ్ సెంటర్లపై డెకాయ్ ఆపరేషన్లు నిర్వహిస్తున్నాం. సంబంధిత చట్టంపై ఆరోగ్య సిబ్బంది ద్వారా గర్భిణులకు అవగాహన కల్పిస్తాం. మొదట ఆడ సంతానం కలిగి ఉండి తిరిగి గర్భం దాల్చిన వారిపై ప్రత్యేక దృష్టి పెడతాం. స్వచ్ఛంద సంస్థలు ఐసీడీఎస్, మెప్మాతో కలిసి స్కానింగ్ కేంద్రాలపై నిఘా పెంచుతాం. ఎవరైనా చట్టాన్ని ఉల్లంఘిస్తే 104 లేదా 1098 లేదా డయల్ 100కు సమాచారం ఇస్తే చర్యలు తీసుకుంటాం. –డాక్టర్ సాంబశివరావు,డీఎంహెచ్ఓ, హనుమకొండ బేటీ బచావో బేటీ పఢావోతో అవగాహన బాలురకు దీటుగా బాలికల సంఖ్యను పెంచేందుకు బేటీ బచావో బేటీ పఢావో కార్యక్రమం ద్వారా అవగాహన కల్పిస్తున్నాం. అవకతవకలకు పాల్పడే స్కానింగ్ సెంటర్ నిర్వాహకులపై చర్యలు తీసుకుంటున్నాం. –సంతోష్, జిల్లా బాలల పరిరక్షణ అధికారి -
గర్భ నిర్ధారణ పరీక్షలు..వివాదాస్పదంగా సామూహిక వివాహ పథకం
మధ్యప్రదేశ్‌లో ముఖ్యమంత్రి సాముహిక వివాహ పథకం వివాదాస్పదంగా మారింది. ఆ పథకంలో భాగంలో మధ్యప్రదేశ్‌లోని గడ్సరాయ్ ప్రాంతంలో శనివారం 219 మందికి సాముహిక వివాహాలు నిర్వహించారు. ఐతే అందులో ఐదుగురు యువతులు గర్భవతులు అని తెలియడంతో వారిని సాముహిక వివాహాలకు అనుమతించలేదు. దీంతో ఈ వ్యవహారం కాస్త రాజకీయ వివాదానికి తెరలేపింది. అయినా పెళ్లి చేసుకోడానికి వచ్చిన యువతులకు గర్భ నిర్ధారణ పరీక్షలు చేయడం ఏమిటని కాంగ్రెస్ పశ్నించింది. ప్రెగ్నెన్సీ టెస్ట్‌లు నిర్వహించి రాష్ట్ర ప్రభుత్వం మహిళలను అవమానించిందని ఆరోపణలు చేసింది. ఈ మేరకు రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి 200 మంది యువతులకు ప్రెగన్సీ టెస్ట్‌లు నిర్వహించారంటూ కథనాలు వస్తున్నాయి. ఈ వార్త నిజమా కాదా అనేది ముఖ్యమంత్రి నుంచే వినాలనుకుంటున్నాం. ఈ వార్త నిజమైతే సామాజికంగా వెనుకబడిని యువతులను ఘెరంగా అవమానించడమే అవుతుంది. ముఖ్యమంత్రి దృష్టిలో పేద, గిరిజన వర్గాల ఆడబిడ్డలకు పరువు లేదా అని నిలదీశారు. శివరాజ్ ప్రభుత్వంలో మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించడంలో ఇప్పటికే మధ్యప్రదేశ్ అగ్రస్తానంలో ఉంది. ఈ మొత్తం వ్యవహారంపై ఉన్నత స్థాయి విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలి. ఇది కేవలం గర్భ నిర్ధారణ పరీక్షకు సంబంధించింది కాదని ఇది మొత్తం స్త్రీ జాతి పట్ల దురుద్దేశంలో కూడిన వైఖరి అని మండిపడుతూ ట్వీట్ చేశారు. అయితే డిండోరి చీఫ్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ రమేష్ ఆ వ్యాఖ్యలను కొట్టిపారేశారు. సాధారణంగా వయస్సు ధృవీకరణ, సికిల్ సెల్ అనీమియా వంటి శారీరక దృఢత్వాన్ని నిర్థారించే పరీక్షలు నిర్వహించాలనే మార్గదర్శకాలు ఉన్నాయిని తెలిపారు. అందులో కొందరు యువతులకు పీరియడ్ సంబంధిత సమస్యలు ఉన్నాయి. దీంతోనే వారికి వైద్యులు గర్భ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారని తెలిపారు. తాము కేవలం పరీక్షలు నిర్వహించి నివేదికలు ఇస్తామని చెప్పారు. అయితే ఆరోగ్య శాఖ నివేదికల ఆధారంగా యువతలను పథకంలో మినహాయించే నిర్ణయం మాత్రం సామాజికి న్యాయ శాఖ తీసుకుంటుందని వివరించారు. కాగా, ముఖ్యమంత్రి వివాహ యోజన పథకం / నికా యోజన ఏప్రిల్ 2006లో ప్రారంభమైంది. ఈ పథకం కింద, రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా వెనుకబడిన వర్గాల మహిళల వివాహానికి ఆర్థిక సహాయంగా రూ. 56,000/- నగదును అందిస్తోంది. (చదవండి: భార్య అరెస్టు అవుతుందనే భయంతో అమృత్‌పాల్ సింగ్ లొంగిపోయాడా?) -
కర్నూలులో ‘శంకర్‌దాదా’
కర్నూలు(హాస్పిటల్): కర్నూలు నగరంలో నకిలీ వైద్యుడి ఉదంతం వెలుగులోకి వచ్చింది. శంకర్‌దాదా ఎంబీబీఎస్ సినిమాలో తరహాలో అర్హత లేకున్నా ఆస్పత్రి, స్కానింగ్ సెంటర్ నిర్వహిస్తున్న వ్యక్తిని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు రెక్కీ నిర్వహించి, పకడ్బందీగా పట్టుకున్నారు. కర్నూలు నగరంలోని ప్రకాష్‌నగర్‌లో నివాసం ఉంటున్న వై.వేణుగోపాల్‌శెట్టి ఇంట్లోనే స్కానింగ్ సెంటర్ నిర్వహిస్తున్నాడు. ఇతను చదివింది పదో తరగతి మాత్రమే. కానీ స్థానిక బళ్లారి చౌరస్తాలో కేకేహెచ్ హాస్పిటల్, మెడికల్ షాపుతో పాటు ప్రకాష్‌నగర్‌లోని తన ఇంట్లో స్కానింగ్ సెంటర్ నిర్వహిస్తున్నాడు. జిల్లాలోని పలువురు ఆర్ఎంపీలు ఇతని వద్దకు గర్భిణులను తీసుకొచ్చి లింగనిర్ధారణ పరీక్షలు చేయిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఆర్ఈవో బాబురావు తన సిబ్బందితో వేణుగోపాల్‌శెట్టి ఇంటి వద్ద రెక్కీ నిర్వహించారు. శనివారం మధ్యాహ్నం ఆయన మారువేషంలో వెళ్లి.. స్కానింగ్ చేస్తుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఆయన వెంట డీసీటీవో వెంకటరమణ, సీఐ లక్ష్మయ్య, ఎస్ఐ జయన్న, సిబ్బంది శేఖర్‌బాబు, సుబ్బరాయుడు, శివరాముడు ఉన్నారు. డీఎంహెచ్‌వో డాక్టర్ జేవీవీఆర్‌కే ప్రసాద్ సమక్షంలో స్కానింగ్ మిషన్ సీజ్ చేశారు. వేణుగోపాల్‌శెట్టి వద్ద పాత స్కానింగ్ మిషన్‌తో పాటు గ్లౌజులు, అబార్షన్‌కు అవసరమైన ఆపరేషన్ థియేటర్ పరికరాలు లభించాయి. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
పుట్టే బిడ్డకు వస్తుందా?
నా వయసు 23. సంవత్సరం క్రితం పెళ్లయ్యింది. అంతకు రెండేళ్ల ముందే నాకు హెచ్ఐవీ ఉందని తెలిసింది. దిగులు పడ్డాను. కానీ అదే సమస్య ఉన్న నా స్నేహితుడొకరు నన్ను పెళ్లి చేసుకుంటానని ముందుకొచ్చారు. ఇద్దరం పెళ్లి చేసుకుని ఆనందంగా ఉన్నాం. మందులు వాడుతున్నాం. నాకో బిడ్డను కనాలని ఉంది. కానీ పుట్టే బిడ్డకు కూడా హెచ్ఐవీ వస్తుందేమోనని భయం. అలా రాకుండా ఏమైనా జాగ్రత్తలు తీసుకోవచ్చా? – ఓ సోదరి హెచ్ఐవీ అనేది ఓ వైరస్. ఇది శరీరంలోని రోగ నిరోధక కణాలలో చేరి, అక్కడ వృద్ధి చెందుతూ, ఆ కణాలను నశింపజేస్తాయి. దానివల్ల రోగనిరోధక శక్తి తగ్గిపోయి అనేక రకాల ఇన్ఫెక్షన్లు శరీరాన్ని చుట్టుముడతాయి. మనిషిని మెల్లమెల్లగా కృశింపజేస్తాయి. ఈ పరిస్థితినే ఎయిడ్స్ అంటారు. ఈ వ్యాధి అసురక్షిత రక్తమార్పిడి వల్ల, లైంగిక కలయికల వల్ల ఒకరి నుంచి ఒకరికి సంక్రమిస్తుంది. హెచ్ఐవీ ఉన్న మహిళ గర్భం దాలిస్తే... మాయ ద్వారా, రక్తం ద్వారా బిడ్డకి వైరస్ సంక్రమించే అవకాశం ఉంటుంది. తల్లి పాల ద్వారా కూడా బిడ్డకు సంక్ర మిస్తుంది. అయితే ఇప్పుడు మిగతా జబ్బుల లాగానే దీనికి కూడా యాంటి వైరల్ మందుల్ని కనుగొన్నారు. ఇవి దీర్ఘకాలం వాడటం వల్ల హెచ్ఐవీ వైరస్ చాలావరకు నశించిపోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరిద్దరూ ఓసారి వైరల్ లోడ్ ఎంత ఉందో పరీక్ష చేయించుకోండి. ఎక్కువగా ఉంటే, ఇంకొన్ని రోజులు మందులు వాడి, తర్వాత గర్భం కోసం ప్రయత్నించండి. అప్పుడు కడుపులో బిడ్డకి హెచ్ఐవీ వైరస్ సంక్రమించే అవకాశాలు తగ్గుతాయి. గర్భం దాల్చిన తర్వాత కూడా డాక్టర్ పర్యవేక్షణలో సక్రమంగా మందులు వాడాలి. దానివల్ల బిడ్డకి వైరస్ తక్కువగా సంక్రమిస్తుంది. కాన్పు సమయంలో తల్లి నుంచి బిడ్డకి యోని ద్వారా వైరస్ ఎక్కువగా సంక్ర మించే అవకాశాలుంటాయి. కాబట్టి వైరల్ లోడ్ తక్కువగా ఉంటే సాధారణ కాన్పుకి ప్రయత్నం చేయవచ్చు. మరీ ఎక్కువగా ఉంటే సిజేరియన్ ఆపరేషన్ ద్వారా కాన్పు చేయించేసుకోవాలి. దానివల్ల బిడ్డకి హెచ్ఐవీ సోకే అవకాశాలు తక్కువ. బిడ్డ పుట్టిన తర్వాత బిడ్డకు కూడా పరీక్ష చేయించి, ఆరు వారాల వరకు హెచ్ఐవీ మందులు వాడటం వల్ల... వైరస్ బిడ్డకు సోకి ఉంటే, అది కాస్తా నాశనమవుతుంది. తల్లిలో వైరల్ లోడ్ ఎక్కువ ఉంటే మాత్రం తల్లిపాలు ఇవ్వకుండా బయటి పాలే ఇవ్వాలి. లేదంటే వైరస్ బిడ్డకు సోకేస్తుంది. నా వయసు 23. నాకిప్పుడు అయిదు నెలల బాబు ఉన్నాడు. ఆపరేషన్ అయింది. కుట్లన్నీ త్వరగా మానిపోయాయి. డెలివరీ అయిన మూడు నెలలకు నేను, మావారు శారీరకంగా కలిశాం. ఆ మరుసటి నెల పీరియడ్ వచ్చింది. కానీ తర్వాత నెల అంటే.. ఇప్పుడు (అయిదో నెల) పీరియడ్ రాలేదు. ఇంట్లో ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకుంటే నెగెటివ్ అని వచ్చింది. పీరియడ్ ఎందుకు రాలేదో తెలియడం లేదు. మళ్లీ ప్రెగ్నెంట్ అయ్యానేమోనని భయంగా ఉంది. నా సమస్యకు పరిష్కారం చెప్పండి?– పేరు రాయలేదు కొందరిలో కాన్పు తర్వాత బిడ్డకు పాలు పట్టేటప్పుడు, హార్మోన్లలో మార్పు ఉండటం వల్ల కొన్ని నెలలపాటు పీరియడ్స్ సక్రమంగా రాకపోవచ్చు. పీరియడ్ సరైన సమయానికి రాకపోతే తప్పనిసరిగా ప్రెగ్నెన్సీ ఉండాలని ఏమీ లేదు. కొందరిలో అండాశయాలలో నీటిగడ్డలు (ఒవేరియన్ సిస్ట్) ఏర్పడటం వల్ల కూడా పీరియడ్ ఆలస్యంగా రావచ్చు. కాకపోతే కొందరిలో కాన్పు తర్వాత హార్మోన్ల అసమతుల్యత వల్ల అండం విడుదల ఆలస్యమై కూడా గర్భం లేట్‌గా నిర్ధారణ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మీకు కాన్పు జరిగి అయిదు నెలలే కాబట్టి పీరియడ్స్ కోసం కొన్నిరోజులు ఆగి చూడొచ్చు. అలాగే 15 రోజులకొకసారి యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకుంటూ ఉండటం మంచిది. ఒకవేళ మధ్యలో ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయితే... గర్భం వద్దనుకుంటే, మొదట్లోనే మందులతో అబార్షన్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాకపోతే అబార్షన్ మందులు డాక్టర్ పర్యవేక్షణలోనే వాడాల్సి ఉంటుంది. మళ్లీ ప్రెగ్నెన్సీ రాకుండా... ఇప్పటి నుంచే డాక్టర్ సలహా తీసుకుని లూప్, పిల్స్, హార్మోన్ ఇంజక్షన్స్ వంటి పద్ధతులను పాటించడం మంచిది. అలా కాదనుకుంటే, మీవారు కండోమ్స్ వాడొచ్చు. డా‘‘ వేనాటి శోభ రెయిన్బో హాస్పిటల్స్ కూకట్పల్లి హైదరాబాద్ -
అవివాహిత బాక్సర్లకు గర్భనిర్ధారణ పరీక్షలు!
న్యూఢిల్లీ: భారత క్రీడారంగం సిగ్గు పడే, మహిళలు క్రీడలను ఎంచుకునేందుకు తటపటాయించే ఘటన బాక్సింగ్ లో చోటు చేసుకుంది. ప్రపంచ చాంఫియన్ షిప్ లో పాల్గొనబోతున్న ఎనిమిది మంది మహిళా బాక్సర్లకు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(సాయ్) గర్బ నిర్ధారణ పరీక్షలు నిర్వహించడం సంచలనం సృష్టించింది. బాక్సింగ్ ఇండియా (బీఐ) సూచనల మేరకు ఇది జరిగింది. ఈ విషయాన్ని స్వయంగా సాయ్ వైద్య సలహాదారు డాక్టర్ పీఎస్ఎం చంద్రన్ బయటపెట్టారు. వీరిలో పెళ్లికానివారు, జూనియర్ బాక్సర్లు కూడా ఉన్నారు. భారత్ కు ఆడాలనే ఆశతో ఉన్న మహిళా బాక్సర్లు తమ బాధను బయటికి వ్యక్త పర్చలేకపోయారని, ఆధికారుల ఆదేశాలను పాటిస్తూ పరీక్షకు హాజరయ్యారని చంద్రన్ చెప్పారు. అసలు ఏఐబీఏ నిబంధన ప్రకారం బాక్సర్లకు గర్భ నిర్ఱారణ పరీక్షలు జరపాలని ఎక్కడా లేదు. సాధారణ వైద్య పరీక్షల అనంతరం ఆ సర్టిఫికెట్ తో పాటు బాక్సర్లు సొంత పూచీపై నాన్ ప్రెగ్నెన్సీ సర్టిఫికెట్ మాత్రం ఇవ్వాల్సి ఉంటుంది. 18 ఏళ్ల లోపువారైతే తల్లితండ్రులు ఈ డిక్లరేషన్ సమర్పించాలి.