Premature Rain
-
ధాన్యం తడిసిందని.. మహిళా రైతు బలవన్మరణం
ఆత్మకూర్/నేలకొండపల్లి: కొనుగోలు కేంద్రంలో అకాల వర్షానికి ధాన్యం తడిసిపోయిందని ఓ మహిళా రైతు ఆత్మహత్య చేసుకోగా.. నెలరోజులైనా కాంటా వేయలేదని మనస్తాపానికి గురైన మరో రైతు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన వనపర్తి, ఖమ్మం జిల్లాల్లో మంగళవారం చోటు చేసుకుంది. వనపర్తి జిల్లా ఆత్మకూర్ మండలం జూరాలకు చెందిన పద్మ (36) మూడెకరాల పొలంలో వరి సాగుచేశారు. వారం రోజులు ధాన్యం ఆరబెట్టి గ్రామంలో ఏర్పా టు చేసిన కొనుగోలు కేంద్రంలో 15 రోజుల క్రితం తూకం వేయించారు. కొనుగోలు చేసి న ధాన్యం తరలించే వరకు రైతులదే బాధ్య త అని చెప్పడంతో రేయింబవళ్లు ధాన్యం బస్తాల వద్దే ఆమె కాపలా కాసింది. ఈనెల 16, 17 తేదీల్లో కురిసిన అకాల వర్షంతో ధాన్యం తడిసిపోయింది. ఇంకెన్ని రోజులు ఇలా కాపలా కాయా లంటూ ఐకేపీ నిర్వాహ కులతో సోమవారం సాయంత్రం వాగ్వాదానికి దిగింది. అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయింది. మంగళవారం తెల్లవారుజామున ఓ చెట్టుకు ఉరేసుకుని బలవన్మరణం చెందింది. నెలరోజులైనా కాంటా వేయలేదని.. ఖమ్మం జిల్లా నేలకొండపల్లికి చెందిన కౌలు రైతు గడ్డం లింగయ్య నెల రోజుల క్రితం మార్కెట్ యార్డుకు ధాన్యాన్ని తీసుకొచ్చా డు. ధాన్యాన్ని ఆరబెట్టి ప్రతిరోజు కాపలా కాస్తూ తనకిచ్చిన సీరియల్ నంబరు ప్రకా రం కాంటా వేయించుకునేందుకు ఎదురుచూస్తున్నాడు. అయితే తనకంటే వెనుక తీసుకొచ్చిన దళారుల ధాన్యాన్ని మాత్రం కాంటా వేస్తున్నారు. ఈ అన్యాయాన్ని తట్టుకోలేని లింగయ్య తీవ్ర మనస్తాపంతో మంగళవారం పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. తోటి రైతులు అతడిని స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించా రు. కరోనా విపత్కర పరిస్థితుల్లో ఇలా రోజుల తరబడి తిప్పించుకోవడం ఏమిటని ఆగ్రహించిన రైతులు తహసీల్దార్ కార్యాల యం ఎదుట ధర్నా చేశారు. ఇకపై వేగంగా కాంటాల ప్రక్రియ పూర్తి చేయిస్తామని తహసీల్దార్ హామీనివ్వడంతో వారు ఆందోళన విరమించారు. చదవండి: స్ఫూర్తిమంతంగా నిలిచిన మహిళా సర్పంచ్ -
అకాలవర్షంతో అతలాకుతలం
సాక్షి నెట్వర్క్: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో శుక్ర, శనివారాల్లో కురిసిన అకాల వర్షం అన్నదాతలను అతలాకుతలం చేసింది. చేన్లలో చివరి దశ ఏరేందుకు సిద్ధంగా ఉన్న పత్తి మొత్తం వానకు తడిసి నేలరాలింది. పీచు దశలో ఉన్న మొక్కజొన్న పంట నేలకొరిగింది. మామిడి తోటల్లో చెట్లకు ఇప్పుడే వస్తున్న పూత మొత్తం రాలిపోయింది. పలుచోట్ల ఈదురుగాలలు, భారీ వర్షానికి చెట్లు, విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. ఇండ్ల పైకప్పులు గాలికి ఎగిరిపోయాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో పాటు రాకపోకలకు అంతరాయం కలిగింది. మల్యాల అడ్డరోడ్డు సమీపంలో జగిత్యాల–కరీంనగర్ రహదారిపై వెళ్తున్న కారుపై ఎండిన చెట్టు కొమ్మ విరిగిపడటంతో కారు ముందుభాగం దెబ్బతిన్నది. రామడుగు మండలం తిర్మలాపూర్‌లో పొన్ను దేవయ్యకు చెందిన కోళ్లఫామ్ రేకుల షెడ్డు కూలిపోవడంతో 2,500 కోడిపిల్లలు చనిపోయి రూ.3 లక్షల వరకు నష్టం జరిగిందని రైతు తెలిపాడు. గంగాధర వ్యవసాయ మార్కెట్ యార్డులోని కొనుగోలు కేంద్రంలో రైతులు అమ్మకానికి తెచ్చిన కందులు అకాల వర్షానికి తడిసిపోయాయి. పెద్దపల్లి మండలం రాఘవపూర్‌లో చెట్లు విరిగిపడగా, విద్యుత్ స్తంభం కూలిపోయింది. హన్మంతునిపేట వద్ద ఓ చెట్టు విరిగి రోడ్డుపై పడటంతో రాకపోకలకు కొంత ఇబ్బంది ఏర్పడింది. మంథని నియోజకవర్గంలో మిర్చి కొన్ని చోట్ల కాయ దశలో ఉండటంతో వర్షానికి తడిసి నల్లబడే అవకాశముందని రైతులు పేర్కొన్నారు. జగిత్యాల జిల్లా మేడిపెల్లి మండలం దమ్మన్నపేటలో నిమ్మ మోహన్‌రెడ్డికి చెందిన బొప్పాయితోటలో దాదాపు 200 చెట్లు విరిగిపోయాయి. -
అకాల వర్షానికి 2500 కోళ్లు మృతి
-
అకాల దెబ్బ
ఉమ్మడి జిల్లాలో అకాల వర్షం తీవ్ర పంట నష్టం కలిగించింది. కోతకొచ్చిన వరిపైరు దెబ్బతిన్నది. కల్లాల్లో ఆరబెట్టిన ధాన్యం, కొనుగోలు కేంద్రాల్లో మక్కలు తడిసి పోయాయి. ఇందల్వాయి, వర్ని, సదాశివనగర్, నిజాంసాగర్, కామారెడ్డి, దోమకొండ, బాన్సువాడ, పిట్లం తదితర మండలాల్లో మంగళవారం రాత్రి నుంచి బుధవారం వేకువజాము వరకు మోస్తారు వర్షం కురిసింది. సాక్షి, కామారెడ్డి: వరుణుడు రైతులపై పగ బట్టినట్లున్నాడు.. ఖరీఫ్ సాగు ప్రారంభం నుంచి ముఖం చాటేశాడు. తీవ్ర వర్షాభావ పరిస్థితుల్లో రైతులు ఎలాగోలా పంటలను కాపాడుకుంటూ వచ్చారు. తీరా చేతికందిన పంటను అమ్ముకునే సమయంలో వరుణుడు రైతులను నిండా ‘ముంచాడు’. జిల్లాలోని కొన్ని ప్రాంతా ల్లో మంగళవారం అర్ధరాత్రి దాటిన తరు వాత ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం రైతుల ఆశల్ని నిలువునా ముంచేసింది. కామారెడ్డి డివిజన్ పరిధిలోని దోమకొండ మండలంలో అత్యధికంగా 73.9 మి.మీ. వర్షపాతం నమోదైంది. అర్ధరాత్రి పూట ఒక్కసారిగా వర్షం విరుచుకుపడడంతో కొనుగోలు కేంద్రాల వద్దకు ధాన్యం తీసుకువచ్చిన రైతులు లబోదిబోమన్నారు. వర్షం నుంచి అప్పటికప్పుడు ధాన్యాన్ని కాపాడుకునేందుకు అవకాశం లేకుండా పోయింది. అలాగే, మక్కలు కూడా పెద్ద ఎత్తున తడిసి ముద్ద య్యాయి. పక్కనే ఉన్న బీబీపేట మండ లంలోని పలు గ్రామాల్లో కూడా వర్షం కురిసి పంటలకు నష్టం వాటిల్లింది. గాం ధారి మండలంలో 50.1 మి.మీ., తాడ్వాయిలో 36.6 మి.మీ., మాచారెడ్డిలో 23.1 మి.మీ., రామారెడ్డిలో 26.8 మి.మీ., సదాశివనగర్‌లో 12.8 మి.మీ. వర్షం కురిసింది. అలాగే బాన్సువాడ, కామారెడ్డి, నస్రుల్లాబాద్ తదితర మండలాల్లోనూ కురిసిన వర్షంతో ధాన్యం రాశులు తడిసి పోయాయి. నస్రుల్లాబాద్ మండలంలోని బొమ్మన్‌దేవ్‌పల్లి, బాన్సువాడ మండలం హన్మాజీపేట గ్రామాల్లో ధాన్యం నానిపోయింది. మాచారెడ్డి మండలంలోని పలు గ్రామాల్లో వరి పంట నేలవాలింది. సదాశివనగర్ మండలంలో వర్షం తక్కువ కురిసినప్పటికీ ఈదురుగాలులతో కోతకొచ్చిన వరి నేలవాలింది. ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికందే సమయంలో ప్రకృతి పగ బట్టినట్టు చేసిందని రైతులు ఆవేదన చెందుతున్నారు. తడిసిన ధాన్యాన్ని ఆరబెట్టేందుకు అవస్థలు.. జిల్లాలోని ఆయా ప్రాంతాల్లో అకాల వర్షంతో నానిన ధాన్యాన్ని ఆరబెట్టేందుకు రైతులు నానా కష్టాలు పడాల్సి వస్తోంది. కల్లాలు లేకపోవడంతో రోడ్లపై ఆరబెట్టాల్సి వస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొనుగోలు కేంద్రాలకు ధాన్యాన్ని తీసుకువెళ్లిన రైతులు ఒక్కసారిగా భారీ వర్షం రావడంతో ఏమీ చేయలేక పోయారు. ఒక్కసారిగా భారీ వర్షం కురవడంతో ఆరబెట్టిన ధాన్యం నానిపోవడమే గాకుండా వర్షపు నీటితో కొట్టుకు పోయింది. బుధవారం ఉదయం నుంచి రైతులు తడిసిన ధాన్యాన్ని ఆరబెట్టడానికి పడిన ఇబ్బందులు అన్నిఇన్ని కావు. కష్టపడి పండించిన పంట చేతికందిన తరువాత కూడా ప్రకృతి తమకు పరీక్ష పెడుతోందని అన్నదాతలు వాపోతున్నారు. నేలవాలిన వరి పైర్లు.. ఈదురుగాలులతో చాలా గ్రామాల్లో వరి నేలవాలింది. పంట కోయాల్సిన సమయంలో ఒక్కసారిగా ప్రకృతి బీభత్సం సృష్టించడంతో రైతులు ఇబ్బంది పడుతున్నారు. తెల్లారేసరికి పంటంతా నేలవాలడంతో ఆందోళనకు గురయ్యారు. ఇప్పటికే పెట్టుబడులు అడ్డగోలుగా పెరగడం, దిగుబడులు తగ్గుతుండడంతో ఏమీ మిగిలే పరిస్థితి లేదని రైతులు చెబుతున్నారు. జిల్లాలోని ఆయా ప్రాంతాల్లో మంగళవారం అర్ధరాత్రి కురిసిన వర్షాలతో దెబ్బతిన్న పంటలను అధికారులు పరిశీలించి ఆదుకోవాలని కోరుతున్నారు. -
సమస్యలు చర్చకు వచ్చేనా?
నేడు జెడ్పీ భేటీ - ఆగని అన్నదాతల ఆత్మహత్యలు - వెంటాడుతున్న అకాల వర్షాలు - తీర్మానాలు చేసినా కానరాని కరువు ప్రకటన - పల్లెల్లో తాగునీటి కోసం ప్రజల పాట్లు - మిషన్ కాకతీయ పనులపై అసంతృప్తి సాక్షి, సంగారెడ్డి: జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం సోమవారం వాడివేడిగా జరగనుంది. ప్రజా సమస్యలు, ప్రభుత్వ పథకాలు, తాగునీటి అంశాలపై గళమిప్పేందుకు విపక్షాలు రంగం సిద్ధం చేశాయి. ప్రతి సమావేశంలోనూ ఎజెండా అంశాలపై పూర్తిస్థాయిలో చర్చించకుండానే ముగిస్తున్నారు. జెడ్పీ చైర్పర్సన్ రాజమణి అధ్యక్షతన సోమవారం జరిగే ఈ సమావేశంలోనైనా సమస్యలు, అంశాలు పూర్తిగా చర్చకు వస్తాయా అన్న సంశయం వ్యక్తమవుతోంది. జిల్లాలో రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. జిల్లా వ్యాప్తంగా అప్పుల బాధతో రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఖరీఫ్‌లో దెబ్బతిన్న రైతులు రబీలోనైనా గట్టెక్కవచ్చని ఆశించారు. అయితే అకాలవర్షాలు రైతులపాలిట శాపంగా మారాయి. గత నెల, ఈ నెలలో కురిసిన అకాల వర్షాల వల్ల సుమారు రెండువేల హెక్టార్ల మేర పంటలు దెబ్బతిన్నాయి. వర్షం కారణంగా మార్కెట్ యార్డుల్లో ధాన్యం, మక్కలు తడిసి తీవ్ర నష్టం మిగిల్చాయి. నారాయణఖేడ్, జహీరాబాద్, సిద్దిపేట, దుబ్బాక, మెదక్, నర్సాపూర్, గజ్వేల్ నియోజకవర్గాల్లోని రైతులు అకాల వర్షాల కారణంగా పంటనష్టం చవిచూడాల్సి వచ్చింది. మామిడి, కూరగాయల పంటలు 7వేల ఎకరాలకుపైగా దెబ్బతిన్నాయి. ప్రభుత్వం పరిహారం అందజే సి తమను ఆదుకోవాలని కోరుతున్నారు. రైతులను ఆదుకునేందుకు వీలుగా జిల్లాను కరువు ప్రాంతంగా ప్రకటించాలని జెడ్పీ సమావేశంలో పలుమార్లు తీర్మానం చేసినా ఇప్పటికీ ప్రకటన వెలువడలేదు. రైతుల ఆశల్ని ప్రజాప్రతినిధులు ఏమేరకు తీరుస్తారో చూడాల్సి ఉంది. పల్లెల్లో తాగునీటి ఇక్కట్లు జిల్లాలోని సుమారు 500 జనావాసాల్లో తాగునీటి సమస్య ఉంది. జిల్లాలోని నారాయణఖేడ్, జహీరాబాద్, అందోలు, నర్సాపూర్ నియోజకవర్గాల్లో గ్రామాలతో పాటు గిరిజన తండాల్లో నీటి సమస్య అధికంగా ఉంది. 276 గ్రామాల్లో నీటి ఎద్దడి తీవ్రంగా ఉండటంతో ప్రజలు దాహార్తితో అల్లాడుతున్నారు. ప్రజల తాగునీటి సమస్యను పరిష్కరించటంలో ఆర్డబ్ల్యూఎస్ అధికారులు విఫలమయ్యారన్న ఆరోపణలున్నాయి. కాగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయ పనులపైనా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. పనులు చేపట్టిన కాంట్రాక్టర్లు సక్రమంగా పనిచేయంలేదని, పూడికతీత పనుల్లో అవినీతి జరుగుతోందని ఆరోపిస్తున్నారు. జెడ్పీ సమావేశంలో మిషన్ కాకయతీయ పనులను విపక్ష సభ్యులు ప్రధానంగా లేవనెత్తే అవకాశం ఉంది. జెడ్పీ సభ్యులు పెన్షన్లు, రేషన్‌కార్డులు, అభివృద్ది నిధుల కేటాయింపు, జెడ్పీ ద్వారా చేపడుతున్న పనులపై చర్చించే అవకాశం ఉంది. జెడ్పీ అధికారులు సమావేశంలో బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు సన్నద్ధం అవుతున్నారు. కొత్తహంగులు జిల్లా పరిషత్ సమావేశ మందిరం కొత్తహంగులతో ముస్తాబైంది. జెడ్పీ సమావేశ మందిరంలో ఫర్నిచర్, లైటింగ్ ఇతర సదుపాయాలు సరిగ్గా లేకపోవటంతో జెడ్పీ చైర్పర్సన్ రాజమణి మురళీయాదవ్ సమావేశ మందిరానికి మరమ్మతులు చేయించారు. కొత్తఫర్నిచర్, నూతన లైటింగ్‌తో జెడ్పీ హాల్ కొత్త సొబగులతో సోమవారం నాటికి సిద్ధమైంది.