Private Schools Managements
-
అప్పుడు కేరళలో.. ఇప్పుడు తమిళనాడులో.. ఆ హక్కు మీకు ఉంది!
కేరళ, తమిళనాడు రాష్ట్రాలు సేల్స్‌గర్ల్స్‌ను అన్నేసి గంటలు నిలబడి డ్యూటీ చేయించడాన్ని నిరోధించాయి. కేరళలో ‘రైట్ టు సిట్’ ఉద్యమం మొదలయ్యాక వచ్చిన మార్పు ఇది. దేశంలో కోట్లాది మంది స్త్రీలు సేల్స్ గర్ల్స్‌గా 8 నుంచి 12 గంటలు నిలబడి పని చేస్తున్నారు. వారికి కూచునే హక్కు ఉంది. ఆ హక్కు ప్రభుత్వాలు కల్పించాల్సి ఉంది. మాలతి (20) హైదరాబాద్ అమీర్‌పేటలో సేల్స్ గర్ల్. ఉదయం 9 గంటలకు క్లాత్ షోరూమ్‌లో డ్యూటీ ఎక్కుతుంది. తిరిగి రాత్రి 9కి డ్యూటీ దిగుతుంది. మధ్యలో అరగంట లంచ్ విరామం. మిగిలిన సమయం? అంతా నిలబడి ఉండటమే. కస్టమర్లు ఉన్నా లేకున్నా ఆమె నిలబడే ఉంటుంది. కూచోవడానికి వీల్లేదు. ఎందుకంటే కూచోవడానికి అక్కడ కుర్చీలు గానీ స్టూల్స్‌గాని ఉండవు. బద్దకానికి అలవాటు పడతారని లేదా కూచుని సుఖపడతారని షాప్ వాళ్లు వారిని కూచోకుండా స్టూల్స్ తీసేస్తారు. మాలతి నిలబడే ఉంటుంది. నిలబడి... నిలబడి... నిలబడి... ఆమెకు కూచునే హక్కు లేదా? జయవాణి (35) నెల్లూరులో ప్రయివేట్ టీచర్. క్లాస్‌రూమ్‌లో నిలబడే పాఠం చెప్పాలి. బ్లాక్‌బోర్డ్ దగ్గర కుర్చీ కానీ టేబుల్ కానీ ఉండవు. టీచర్లు తాము ఇచ్చే జీతానికి ప్రతి నిమిషం రెక్కలు ముక్కలు చేసుకోవాలనుకున్న ప్రయివేటు స్కూళ్ల యాజమాన్యాలు చాలా కాలంగా క్లాస్ రూముల్లో కుర్చీలు తీసేశాయి. పాఠం ఎగ్గొట్టి టీచర్లు విశ్రాంతి తీసుకుంటారనో కునుకు తీస్తారనో వారి అనుమానం కావొచ్చు. అయితే క్లాసుకు క్లాసుకు మధ్య గ్యాప్ ఇస్తారా? స్టాఫ్‌రూమ్‌కు వెళ్లి విశ్రాంతి తీసుకోనిస్తారా? రోజులో దాదాపు 4 నుంచి 6 క్లాసులు చెప్పాల్సి ఉంటుంది. ప్రతి క్లాసు నిలబడి చెప్పి చెప్పి జయవాణికి మోకాళ్ల నొప్పులు మొదలయ్యాయి. కాని ఏమిటి చేయడం. ఆమె నిలబడి చెప్పాల్సిందే. కూచుని పాఠం చెప్పే హక్కు ఆమెకు లేదా? నిలబడటం పనిలో ఒక భాగం కావచ్చు. కాని నిలబడి ఉండటమే పని కాబోదు. కారాదు. మనిషి కేవలం నిలబడి మాత్రమే పని చేయడు. మధ్యలో విశ్రాంతి కావాలి. కూచోవాలి. కాని కూచుని పని చేయడాన్ని దేశంలో అనధికారికంగా కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్లో తొలగించి చాలాకాలం అయ్యింది. బట్టల దుకాణాలు, నగల దుకాణాలు, ఎలక్ట్రానిక్ షోరూమ్‌లో, ప్రయివేటు పాఠశాలలు... ఒకటేమిటి ప్రయివేటు రంగంలో ఎక్కడ వీలైతే అక్కడ నిలబడి పని చేయించడం ఆనవాయితీ అయ్యింది. ఇంకా దారుణం ఏమంటే కూచుని కనిపిస్తే, తోటి ఉద్యోగులతో కబుర్లు చెప్తూ కనిపిస్తే కొన్ని షాపుల్లో ‘ఫైన్’ వేస్తారు. షాపింగ్ మాల్స్‌లో సేల్స్ గర్ల్స్ చేత, సేల్స్ బాయ్స్ చేత ఎంత ఊడిగం చేస్తారో వారిని ఎలా నిలబెట్టి పని చేయిస్తారో తమిళంలో ‘షాపింగ్ మాల్’ అనే సినిమా చూపించింది. కేరళలో కదలిక దేశంలో బట్టల షోరూమ్‌లలో దాదాపు నాలుగున్నర కోట్ల మంది సేల్స్‌గర్ల్స్‌గా/సేల్స్‌మెన్‌గా ఉపాధి పొందుతున్నారని ఒక అంచనా. వీరిలో దాదాపు 70 శాతం యువతులు, స్త్రీలు ఉంటారు. వీరందరూ రోజుకు 8 నుంచి 12 గంటలు నిలబడి పని చేయాలని షోరూమ్‌ల యజమానులు అన్యాపదేశంగా సూచిస్తారు. కస్టమర్లు ఒకరి వెంట ఒకరుగా రావడం వల్లగాని లేదా స్టూల్స్ లేకపోవడం వల్లగాని వీరు కూర్చునే వీలు లేదు. నీరసం ఉన్నా, పిరియడ్స్‌లో ఉన్నా, నిలబడే శక్తి లేకున్నా వీరు నిలబడి ఉండాల్సిందే. దీని వల్ల వీరికి ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. అరికాళ్లు, మోకాళ్లు బాధిస్తున్నాయి. దాంతో 2018లో ‘రైట్ టు సిట్’ అని కూచునే హక్కు కోసం అక్కడ కొంతమంది సేల్స్ గర్ల్స్ నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వారి డిమాండ్‌లో సబబును గ్రహించింది. 2019 జనవరిలో కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్లలో పని చోట ఉద్యోగులందరూ తప్పనిసరిగా కూచునే ఏర్పాటు చేయాలని ఆ రాష్ట్ర ‘కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్’ను సవరించింది. దేశంలో ప్రయివేటు ఉద్యోగుల కూచునే హక్కుకు హామీ పలికిన తొలి రాష్ట్రంగా కేరళ గుర్తింపు పొందింది. ఇప్పుడు తమిళనాడులో మొన్నటి సెప్టెంబర్ 13న తమిళనాడు అసెంబ్లీలో కూడా ప్రయివేటు ఉద్యోగుల కూచునే హక్కుకు హామీ ఇస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం ‘తమిళనాడు షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్స్ యాక్ట్ – 1947’ను సవరించింది. ఏ షాప్ అయినా షోరూమ్ అయినా ప్రయివేటు ఉపాధి స్థలం అయినా ఉద్యోగులు కూచునే ఏర్పాటు తప్పనిసరిగా చేయాలని యజమానులను ఈ సవరణ ఆదేశిస్తుంది. కూచుంటే ఎక్కడ యజమాని తిడతాడో అని భయపడాల్సిన అవసరం ఇక మీదట లేదు. రెండు రాష్ట్రాలే... మిగిలిన దేశంలో? అయితే ఇది మొదలు మాత్రమే. దేశంలో ఇంకా ఎంతో కదలిక రావాల్సి ఉంది. ఆయా ప్రభుత్వాలు ఈ సమస్యను గుర్తించాల్సి ఉంది. ఉద్యోగిని నిలబెట్టి ఉంచడం ఆ ఉద్యోగి ఆత్మగౌరవానికి భంగం కలిగించడం. అవమానించడం. బాధించడం. అనవసర శ్రమకు, ఒత్తిడికి గురి చేయడం. గౌరవంతో కూడిన పని చేసే హక్కు, గౌరవాన్ని పొందుతూ పని చేసే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంది. ‘స్త్రీలను గౌరవించడం మన సంప్రదాయం’ అని అంటాం. కాని వందలాది దుకాణాల్లో వేలాది సేల్స్ ఉమెన్, రిసెప్షనిస్ట్స్, టీచర్లు, ఇతర ప్రయివేటు ఉద్యోగులు ఎందుకు నిలుచుంటున్నారో... అంత నిలబడాల్సిన అవసరం ఏమిటో ఆలోచించాల్సి ఉంది. అవును. ‘కూచుని పని చేసే హక్కు’ ప్రతి ఒక్కరికీ ఉంది. చదవండి: Neetu Yadav And Kirti Jangra: ‘ఇంత చదువు చదివి బర్రెలు అమ్ముతావా? -
ఫీజు వసూళ్లపై ప్రైవేటు విద్యాసంస్థలకు తెలంగాణ సర్కారు హెచ్చరిక
సాక్షి, హైదరాబాద్: సెప్టెంబర్ 1 నుంచి విద్యాసంస్థలను ప్రారంభిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం.. కళాశాలలు, స్కూళ్లలో కరోనా నిబంధనల అమలుతో పాటు ప్రైవేటు విద్యా సంస్థల ఫీజుల వసూళ్లపై దృష్టి సారించింది. కరోనా కష్టకాలంలో ఫీజుల కోసం తల్లిదండ్రులను ఒత్తిడి చేసే విద్యాసంస్థల విషయంలో కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించింది. ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో ప్రైవేటు సంస్థలు మానవత్వంతో వ్యవహరించాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విజ్ఞప్తి చేశారు. ఆదివారం మీడియా ప్రతినిధులతో ఆమె ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. ప్రైవేటు విద్యాసంస్థలు ఫీజుల కోసం వేధిస్తున్న ఉదంతాలు తమ దృష్టికొచ్చాయని మంత్రి తెలిపారు. దీనిపై నిఘా పెట్టాల్సిందిగా అధికారులకు సూచించామన్నారు. ఫీజుల కోసం వేధిస్తే రాష్ట్ర ప్రభుత్వం సహించదని హెచ్చరించారు. ఇందుకు సంబంధించి ఉత్తర్వులు కూడా ఇచ్చామని, అయితే ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాలు కూడా మానవీయ కోణంలో ఆలోచించాల్సిన అవసరం ఉందని అన్నారు. తల్లిదండ్రుల కోరిక మేరకే.. విద్యార్థుల తల్లిదండ్రుల కోరిక మేరకే వచ్చేనెల ఒకటి నుంచి అన్ని విద్యాసంస్థలను తిరిగి ప్రారంభిస్తున్నట్లు మంత్రి సబిత తెలిపారు. కరోనా నిబంధనల అమల్లో ప్రభుత్వం రాజీపడబోదని, ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లలో పర్యవేక్షణకు అధికారులను నియమించామని వెల్లడించారు. తల్లిదండ్రులు ఇష్టపడితేనే పిల్లలను స్కూళ్లకు పంపాలని చెబుతున్నామని తెలిపారు. ఈ విషయంలో ఎలాంటి ఒత్తిడీ లేదన్నారు. అవసరమైతే అందరికీ పరీక్షలు పాఠశాలలకు పంపే విద్యార్థులకు అనారోగ్య సమస్యలొస్తే తమదే బాధ్యతంటూ.. తల్లిదండ్రుల నుంచి ప్రైవేటు స్కూళ్ల యాజమాన్యాలు ముందుగానే అంగీకారపత్రం తీసుకుంటున్న వైనంపై మంత్రి ఘాటుగా స్పందించారు. విద్యార్థులు కరోనా బారిన పడకుండా చూసే విషయంలో అందరూ భాగస్వాములు కావాల్సిందేనన్నారు. తరగతి గదిలో ఎవరికైనా కరోనా లక్షణాలుంటే క్లాసులోని పిల్లలందరికీ పరీక్షలు చేయిస్తామని, ఎక్కువ మందికి లక్షణాలుంటే స్కూలు మొత్తం పరీక్షలు చేయిస్తామని మంత్రి తెలిపారు. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ విద్యాసంస్థను మొత్తం మూసేసే ఆలోచన లేదన్నారు. నేడు డీఈవోలతో భేటీ.. విద్యాసంస్థల పునఃప్రారంభంపై సోమవారం డీఈవోలతో సమీక్షించనున్నట్లు మంత్రి తెలిపారు. అవసరమైతే కొత్త మార్గదర్శకాలూ ఇస్తామని ఓ ప్రశ్నకు బదులిచ్చారు. ఇప్పటికే క్షేత్రస్థాయి సమాచారం సేకరిస్తున్నామని, ఏ పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సన్నాహాలు చేస్తున్నామని చెప్పారు. విశ్వవిద్యాలయాల సమస్యలపై త్వరలో వీసీలతో సమావేశం కానున్నట్లు తెలిపారు. ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు రాయాల్సిందే.. ఇంటర్ సెకండియర్‌కు ప్రమోట్ అయిన విద్యార్థులంతా ఫస్టియర్ పరీక్షలు రాయాల్సిందేనని మంత్రి సబిత స్పష్టం చేశారు. పరీక్షలు ఎప్పుడనేది త్వరలో ప్రకటిస్తామన్నారు. రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నేపథ్యంలో గతేడాది ఇంటర్ ఫస్టియర్ విద్యార్థులను ప్రభుత్వం పరీక్షలు నిర్వహించకుండా సెకండియర్‌కు ప్రమోట్ చేసింది. వీరికి ఫస్టియర్ పరీక్షలు ఐచ్ఛికమనే ప్రచారం తొలుత జరిగింది. కానీ మంత్రి సబిత దీన్ని కొట్టిపారేశారు. విద్యార్థులంతా పరీక్షలు రాయాల్సిందేనంటూ స్పష్టత ఇచ్చారు. దీని వెనుక బలమైన కారణాలున్నట్టు తెలుస్తోంది. కరోనా మూడోదశ ప్రచారం నేపథ్యంలో ఒకవేళ సెకండియర్ పరీక్షలనూ నిర్వహించలేకపోతే అప్పుడు పరిస్థితి ఏమిటనే సందేహాలు విద్యాశాఖ వర్గాల్లో వ్యక్తమయ్యాయి. ఫస్టియర్ మార్కుల్నే ప్రాతిపదికగా తీసుకోవాల్సి ఉంటుందని ఇంటర్ బోర్డు అధికారులు అభిప్రాయపడినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలోనే ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు నిర్వహించాలనే నిర్ణయానికి ప్రభుత్వం వచ్చినట్లు స్పష్టమవుతోంది. -
ప్రైవేటు పాఠశాలలకు ఏబీవీపీ డిమాండ్లు
సాక్షి, హైదరాబాద్: ప్రైవేటు విద్యా సంస్థలు ఇష్టానుసారంగా ఫీజులు పెంచి, ధనార్జనే ధ్యేయంగా ముందుకు సాగుతున్నాయని ఏబీవీపీ ఆరోపించింది. ఫీజుల దోపిడీకి అడ్డుకట్ట వేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. నిబంధనలకు లోబడి ఫీజును నియంత్రణలో ఉంచేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ ఏబీవీపీ ప్రతినిధులు మంగళవారం తెలంగాణ రాష్ట్ర పాఠశాల విద్యా కమిషనర్ విజయ్ కుమార్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. ప్రైవేటు యాజమాన్యాలు అధికంగా ఫీజులు పెంచడం వల్ల ప్రైవేటు పాఠశాలల్లో చదవాలనుకునే పేద విద్యార్థులు ఆ కోరిక కలగానే మిగులుతోందని ఏబీవీపీ పేర్కొంది. ప్రైవేటు పాఠశాల యాజమాన్యాలు నిబంధనలను తుంగలో తొక్కి విద్యార్థుల నుంచి ఎక్కువ ఫీజులు వసూలు చేయడం అలవాటుగా మారిందని ధ్వజమెత్తింది. రాష్ట్రంలో ప్రైవేటు పాఠశాల విద్యలో నెలకొన్న సమస్యలను ప్రభుత్వం ముందువుంచింది. ఏబివీపీ డిమాండ్లు ఇవి.. తరగతుల వారిగా ప్రైవేటు పాఠశాల ఫీజు వివరాలను వెల్లడించాలి. తప్పనిసరిగా ఫీజు నియంత్రణ చట్టం అమలుపరచాలి. ప్రతి పాఠశాలలో పేరెంట్స్ కమిటీలను ఏర్పాటు చేయాలి. వీటిని మండల, జిల్లా, రాష్ట్ర స్థాయికి కూడా విస్తరించాలి. విద్యా హక్కు చట్టాన్ని ఈ విద్య సంవత్సరం నుంచే పటిష్టంగా అమలుపరచాలి. పేద విద్యార్థులకు 25 శాతం సీట్లు కేటాయించాలి. పాఠశాల ఆవరణలో విద్యార్థులను తప్పుదారి పట్టించే ఎలాంటి అమ్మకాలు లేకుండా చర్యలు తీసుకోవాలి. ప్రమాదాలు జరగకుండా పాఠశాల బస్సుల ఫిటినెస్ పరీక్షించే విధంగా చూడాలి. చదువుతో పాటు విద్యార్థులు శారీరకంగా దృఢంగా ఉండటానికి ప్రతి స్కూల్‌కు క్రీడా మైదానం ఉండేట్టు చూడాలి. లాబ్స్, అగ్నిప్రమాద నివారణ వ్యవస్థ, టాయిలెట్స్ తదితర కనీస సౌకర్యాలు ఉండేలా చర్యలు తీసుకోవాలి. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న డీఈఓ, ఎంఈఓ పోస్టులను భర్తీ చేయాలి. ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేసి పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలి. పాఠశాలలు తప్పనిసరిగా అనుమతులు తీసుకునే విధంగా చూడాలి. అనుమతి తీసుకోని పాఠశాలల యాజమాన్యాలపై క్రిమినల్ కేసులు నమోదు చేసి ఆ లిస్ట్ ను బహిర్గతం చేయాలి. -
ప్రైవేటు విద్యాసంస్థల మూత కేసీఆర్ ఘనతే
హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్ ఘనత కారణంగానే తెలంగాణాలో ఎన్నో ప్రైవేటు విద్యాసంస్థలు మూతపడ్డాయని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌లో ఉత్తమ్ కుమార్ విలేకరులతో మాట్లాడుతూ..తెలంగాణ సాధన, టీఆర్ఎస్ ప్రభుత్వ ఏర్పాటు, కేసీఆర్ సీఎం అవ్వటంలో ప్రైవేటు విద్యాసంస్థల పాత్ర ఉందని తెలిపారు. కానీ ప్రభుత్వ ఏర్పాటు ముందు ఒకలా ఏర్పాటు తర్వాత మరోలా అందరినీ దూరం పెట్టారని విమర్శించారు. చిన్న చిన్న విద్యాసంస్థలను కార్పొరేట్ విద్యాసంస్థలకు అడ్డుకట్ట వేసి ఆదుకోవాల్సిందని వ్యాఖ్యానించారు. ప్రైవేటు విద్యాసంస్థలకు అండగా నిలబడాల్సింది పోయి అవమానపరిచి నిర్వీర్యం చేసేలా వ్యవహరించారని అన్నారు. కోళ్ల ఫారాలలో విద్యాసంస్థలు నడుపుతారా అని కేసీఆర్ శాసనసభలో నిరాధార ఆరోపణలు చేశారని చెప్పారు. పోలీసుల సోదాలతో వేధించారని, మీ భార్యలు కూడా మీకు ఓటెయ్యరని కేటీఆర్‌ను అవమానించారని పేర్కొన్నారు. ప్రైవేటు విద్యాసంస్థలకు అండగా నిలబడతామని హామీ ఇస్తున్నామని, ఏ ఏడాది కా ఏడాది ఫీజు రీయింబర్స్మెంట్ వచ్చేలా చేస్తామని చెప్పారు. ఎలాంటి ఆంక్షలు లేకుండా అర్హులందరికీ నూటికి నూరు శాతం రీయింబర్స్మెంట్ చెల్లిస్తామని చెప్పారు. ప్రభుత్వ గుర్తింపు విద్యాసంస్థల టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బందికి ప్రమాద బీమా, గృహ వసతి కల్పిస్తామని తెలిపారు. ప్రైవేటు విద్యాసంస్థల విద్యుత్ ఛార్జీలు డొమెస్టిక్ కింద మార్చుతామని తెలిపారు. బడ్జెట్ వీళ్ల అబ్బ సొమ్ముగా జేబుల నుంచి తీసి ఇస్తున్నట్లు దుర్మార్గంగా వ్యవహరించారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాబోయే కూటమి ప్రభుత్వంలో విశ్వ విద్యాలయాలను పెద్ద ఎత్తున నిధులతో బలోపేతం చేసి గ్లోబల్ యూనివర్సిటీలుగా తీర్చి దిద్దుతామని హామీ ఇచ్చారు. ప్రభుత్వ స్కూళ్లను బలోపేతం చేసేలా 100 రోజుల్లో 20 వేల పోస్టులతో మెగా డీఎస్సీ నిర్వహిస్తామని తెలిపారు. -
ప్రైవేటు స్కూళ్ల ఆగడాలు ఎక్కువయ్యాయ్
హైదరాబాద్: కవాడిగూడలోని లిటిల్ ఫ్లవర్ స్కూల్ దగ్గర పేరెంట్స్ అసోసియేషన్ సభ్యులు ధర్నా నిర్వహించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. తెలంగాణలోని ప్రైవేట్ స్కూళ్ల ఆగడాలు ఎక్కువ అయ్యాయని విమర్శించారు. ఇష్టారీతిగా ఫీజులు వసూలు చేస్తున్నారు తప్ప విద్యార్థుల బాగోగులు చూసే మేనేజెంట్లు లేవని మండిపడ్డారు. ఫీజు కట్టలేదని యాజమాన్యం, స్కూల్‌కు ఎందుకు వెళ్లలేదని తండ్రి రెండింటి మధ్య పిల్లలు నలిగిపోయి ఆత్మహత్యలు చేసుకుంటున్నారని అన్నారు.బాధితులకు అండగా ఉండాల్సిన పోలీసులు యాజమాన్యాలకు వంత పాడుతున్నారని ఆరోపించారు. యాజమాన్యాల దగ్గర పోలీసులు డబ్బులు దండుకుని..కేసులను తప్పు దోవ పట్టిస్తున్నారని చెప్పారు. స్కూళ్లల్లో మౌలిక సదుపాయాలు సరిగా ఉండటం లేదని, ఇందులో బాలికల పరిస్థితి చాలా దారుణంగా ఉంటుందని వ్యాఖ్యానించారు. చేతగాని ప్రభుత్వం, స్కూళ్లల్లో ఇన్ని దారుణాలు జరుగుతున్నా చర్యలు మాత్రం తీసుకోవడం లేదని, ఫీజులు ఇష్టారీతిన పెంచుకుంటూ పోతున్నా ప్రభుత్వం ఏమాత్రం చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. కవాడీగూడ పరిధిలో ఉన్న అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో అధ్వాన్నపరిస్థితి నెలకొందని వెల్లడించారు. నగరంలో జరిగేది ఒకటి కేంద్ర ప్రభుత్వానికి మునిసిపల్ శాఖ మంత్రి ఇచ్చే నివేదిక మరోలా ఉందని మండిపడ్డారు. ప్రైవేట్ యాజమాన్యాల ఆగడాలు అరికట్టకపోతే పేరెంట్స్ అసోసియేషన్ తరుపున రాబోయే రోజున మరింత ఆందోళనలు నిర్వహిస్తామని హెచ్చరించారు. -
10 రోజులు ప్రైవేట్ పాఠశాలలు బంద్: ట్రాస్మా
సాక్షి, కరీంనగర్ : తెలంగాణలో ప్రైవేట్ స్కూల్స్ వర్సెస్ గవర్నమెంట్ స్కూల్స్ వార్ రోజు రోజుకు ముదురుతోంది. బుధవారం కరీంనగర్లో తెలంగాణ రికగ్నైస్డ్ స్కూల్ మేనేజ్మెంట్ అసోసియేషన్ (ట్రాస్మా) సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా ట్రాస్మా అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, కార్యదర్శి శేఖర్ రావు మీడియాతో మాట్లాడుతూ.. ప్రైవేట్ స్కూల్స్‌పై ప్రభుత్వ కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు. సమస్యలను పదిరోజుల్లో పరిష్కరించకుంటే ప్రైవేట్ పాఠశాలలను బంద్ చేయాలని నిర్ణయించుకున్నామని తెలిపారు. ప్రైవేట్ స్కూల్స్‌ను నడపడమే నేరం అన్నట్లుగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని విమర్శించారు. ప్రైవేట్ పాఠశాలలపై దుష్ప్రచారం మానుకోవాలని కోరారు. గ్రామీణ ప్రాంతాల్లోకి ప్రవేట్ పాఠశాలల బస్సులు రాకుండా అడ్డుకుంటున్న ప్రభుత్వ పాఠశాలల టీచర్లు, తమ పిల్లలను ప్రెవేట్ స్కూల్స్‌కు ఎందుకు పంపిస్తున్నారని ప్రశ్నించారు. ప్రైవేటు పాఠశాలలకు అనవసరమైన నిబంధనలను ఫైర్ పోలీసులు నోటీసులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. తమ సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించకుంటే విద్యార్థుల తల్లిదండ్రుల సమ్మతితో ప్రైవేట్ పాఠశాలలను బంద్ చేస్తామని వారు హెచ్చరించారు. -
ప్రైవేటు పాఠశాలల ఫీజుల దందా!
సాక్షి ప్రతినిధి, కడప : ప్రైవేటు పాఠశాలల దందా అప్పుడే మొదలైంది. గత సంవత్సరం మొదలైన ముందస్తు విద్యావిధానం రెండో సంవత్సరంలోకి అడుగుపెట్టింది. ఈ ఏడాది అది కొనసాగుతుందా లేదా అన్న విషయమై స్పష్టత లేకున్నా.. దానిని ఆసరాగా చేసుకుంటున్న కొన్ని ప్రైవేటు విద్యాసంస్థలు ఇంకా ప్రస్తుత సంవత్సర ఆఖరి త్రైమాసిక పరీక్షలు పూర్తికాకముందే పిల్ల లపై ఫీజుల పేర ఒత్తిడి తీసుకొస్తున్నారు. నెలాఖరులోపు పుస్తకాలు కొనుగోలు చేయాలని ఒత్తిడి తీసుకురావడమే కాదు.. పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులు ఒక్కొక్కరిపైనా కచ్చితంగా కొత్త పిల్లలను చేర్పించే బాధ్యతను పెడుతున్నారు. లేకపోతే మరుసటి ఏడాది ఉద్యోగాలకు రానక్కర్లేదని ఒక నెల జీతం కత్తిరిస్తామని కొన్ని పాఠశాలల యాజమాన్యాలు కరాఖండిగా తెగేసి చెబుతున్నాయి. జిల్లాలో 1151 ప్రైవేటు పాఠశాలలు ఉన్నాయి. వీటిలో నర్సరీ నుంచి పదో తరగతి వరకు సగటు ఫీజు పాఠశాల స్థాయిని బట్టి రూ. 15 వేల నుంచి రూ. 40 వేల వరకు ఉంది. సాధారణంగా ప్రతీ సంవత్సరం జూన్‌లో విద్యా సంవత్సరం ప్రారంభమయ్యేది. దీంతో ఆ సమయంలోనే పుస్తకాలు కొనుగోలు చేసేవారు. ఫీజు కూడా మొదటి విడతను జూన్ లేదా జూలైలో చెల్లించే వారు. ఈ విద్యా సంవత్సరం నుంచి సీబీఎస్ఈ విధానం తరహాలో మార్చిలోనే విద్యార్థులకు పరీక్షలు పూర్తిచేసి ఏప్రిల్ నుంచి తర్వాత విద్యా సంవత్సరం తరగతులు ప్రారంభింప చేయాలని ఆదేశించారు. ఈ విధానం మంచిదనే అభిప్రాయం అందరిలోనూ ఉంది. ప్రభుత్వ మార్గదర్శకాలు ఇలా.. తర్వాతి విద్యా సంవత్సరం తరగతులు ముందస్తుగా ప్రారంభించినా దానికి సంబంధించిన పాఠ్యపుస్తకాలను పిల్లలతో కొనుగోలు చేయించకుండా తమ వద్ద అందుబాటులో ఉన్న పుస్తకాలతో ప్రాథమికంగా నెలరోజులపాటు అవగాహన కల్పించాలని సూచించారు. ఇక ఫీజు విషయానికొస్తే ఎప్పటి మాదిరిగానే విద్యా సంవత్సరం ప్రారంభమయ్యాక చెల్లింపు ప్రక్రియ ప్రారంభించాలని చెప్పారు. అయితే ఆచరణ మాత్రం అందుకు భిన్నంగా ఉంది. కొన్ని కార్పొరేట్ పాఠశాలల్లో ఇప్పటికే పరీక్షలన్నీ పూర్తికాగా వారం రోజుల నుంచి ఫీజులు చెల్లించాలని సతాయిస్తున్నారు. పిల్లల పోరు పడలేక కొందరు తల్లిదండ్రులు చెల్లిస్తున్నారు. కొంత మంది అయితే అప్పులు చేసి ఫీజులు చెల్లించడానికి సిద్ధమవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒక్కో కుటుంబంపై రూ. 47 వేలు భారం జిల్లాలో 7లక్షల కుటుంబాలుండగా వీరిలో సుమారు 4 లక్షల కుటుంబాల్లో ఎల్కేజీ నుంచి పదో తరగతి వరకూ చదివేవారు ఉన్నారు. ఒక్కో ఇంటికి ఇద్దరేసి పిల్లలున్నా.. ఒక్కొక్కరికి విద్యా సంవత్సరం మొత్తానికి సరాసరిన రూ. 25 వేల వరకూ ఫీజు ఉంది. కుటుంబానికి ఇద్దరనుకుంటే 8 లక్షల మంది పిల్లలకు కలిపి పైలెక్కలు ప్రకారం 2 వేల కోట్ల భారం తల్లిదండ్రులపై పడుతుంది. ఇక మొదటి విడత ఫీజు కింద దీనిలో 50 శాతం వరకూ అంటే రూ. 1,000 కోట్లు వసూలు చేస్తున్నారు. ఒక్కో కుటుంబంపై భారం లెక్కిస్తే ఇద్దరు పిల్లలకు రూ. 50 వేల చొప్పున మొదటి విడత కింద రూ. 25 వేలు చెల్లించాలి. ఇదికాకుండా పుస్తకాల కోసం ఒకొక్కరికి సరాసరిన రూ. 6 వేల చొప్పున రూ. 12 వేలు చెల్లించాలి. బస్సు ఫీజు నిమిత్తం కూడా కొందరు అడ్వాన్సుగా కట్టించుకుంటున్నారు. మొదటి విడతగా ఇద్దరికీ కలిపి 10 వేల వరకూ ఉంటుంది. సరాసరిన ఇద్దరు పిల్లలున్న ఒక్కో కుటుంబంపై రూ. 47 వేల వరకూ భారం పడుతుంది. సగటు తల్లిదండ్రులు ఈ భారాన్ని జూన్, జూలైలలో మోసేవారు. తమ జీతాల నుంచి నెలవారీ మినహాయించుకుని ఆర్థికంగా ఇబ్బంది పడకుండా చేసుకునే వారు. ఇప్పుడు ఒక్కసారిగా ఈ భారం మీదపడడంతో ఏం చేయాలో దిక్కుతోచని స్థితిని ఎదుర్కొంటున్నారు. -
హింసిస్తున్న ఎంఈఓ
పటాన్చెరు: మండల విద్యాధికారి తమను అనవసరంగా వేధిస్తున్నారని మండల పరిధిలోని ప్రైవేట్ పాఠశాలల యజమానుల సంఘం ఆరోపించింది. ఆదివారం వారు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డిని కలిసి తమ బాధలను ఆయనతో ఏకరువు పెట్టారు. తమను బూతులు తిడుతున్నారని వారు ఎమ్మెల్యేకు వివరించారు. మరో రకంగా చెప్పాలంటే తమను హింసిస్తున్నాడని, ఆ ఎంఈఓపై తగిన చర్యలు తీసుకోవాలని వారు కోరారు. కొన్ని పాఠశాలల మహిళా కరస్పాండెంట్లను వ్యక్తిగతంగా రావాలంటూ వేధిస్తున్నాడని ఆరోపించారు. అక్రమ కేసులు పెడతానని బెదిరిస్తున్నాడని చెప్పారు. కొన్ని దశాబ్దాలుగా తాము ఇలాంటి విద్యాధికారిని చూడలేదన్నారు. ఇటీవల ఓ కరస్పాండెంట్‌ను సమావేశం పేరుతో పిలిచి ఇష్టానుసారంగా వ్యవహరించారని ఎమ్మెల్యేకు వివరించారు. ఆ సంఘటనతో ఆ కరస్పాండెంట్ కన్నీటి పర్యంతమయ్యారని వారు చెప్పారు. చాలా ఇబ్బందికరంగా, అసభ్యకరంగా వ్యవహరిస్తున్నారని వారు ఎమ్మెల్యేకు వివరించారు. పటాన్చెరు ఎంఈఓపై తగిన చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పటాన్చెరు, అమీన్‌పూర్‌కు చెందిన ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాల ప్రతినిధులందరూ పాల్గొన్నారు. వీరిలో సంఘం ప్రతినిధులు టి.ప్రమోద్, రాఘవేందర్‌రెడ్డి తదితరులు ఉన్నారు. -
ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యం నిరాహారదీక్ష
కథలాపూర్ (కరీంనగర్ జిల్లా) : ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు ప్రైవేట్ పాఠశాలలపై దుష్ర్పచారానికి పాల్పడుతున్నారని ఆరోపిస్తూ వాటి యాజమాన్యాలు ఒక్క రోజు నిరాహారదీక్షకు దిగాయి. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా కథలాపూర్ మండల కేంద్రంలో గురువారం జరిగింది. ఒక్కరోజు పాటు జరుగుతున్న ఈ దీక్షలో మండలంలోని ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు పాల్గొన్నాయి.