Priyansh Arya
-
రూ.30 లక్షల ధరతో ఎంట్రీ.. కట్ చేస్తే కోట్ల వర్షం! ఎవరీ ప్రియాన్ష్?
ఐపీఎల్-2025 మెగా వేలంలో ఢిల్లీ యువ సంచలనం ప్రియాన్ష్ ఆర్యపై కాసుల వర్షం కురిసింది. ప్రియాన్ష్ ఆర్యను రూ. 3.80 కోట్ల భారీ ధరకు పంజాబ్ కింగ్స్ కైవసం చేసుకుంది. రూ. 30 లక్షల కనీస ధరతో వేలంలోకి వచ్చిన ఆర్య కోసం తొలుత ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ పోటీ పడ్డాయి. ఆ తర్వాత పంజాబ్ కింగ్స్ ఎంట్రీ ఇచ్చింది. కాసేపు పంజాబ్, ఢిల్లీ మధ్య పోటీ నెలకొంది. అనంతరం ఢిల్లీ పోటీ నుంచి తప్పుకోవడంతో ప్రియాన్ష్య పంజాబ్ సొంతమయ్యాడు.ఎవరీ ప్రియాన్ష్ ఆర్య..?23 ఏళ్ల ప్రియాన్ష్ ఆర్య లిస్ట్-ఎ క్రికెట్లో ఢిల్లీ తరపున ఆడుతున్నాడు. ప్రియాన్స్ ఆర్యా 2019లో భారత్ అండర్-19 జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. ఇప్పుడు భారత సీనియర్ జట్టు తరఫున ఆడుతున్న యశస్వి జైస్వాల్, రవి బిష్ణోయ్‌తో కలిసి అతడు ఆడాడు.అయితే ఢిల్లీ ప్రీమియర్ లీగ్-2024 ద్వారా ప్రియాన్ష్ వెలుగులోకి వచ్చాడు. ఈ ఏడాది డీపీఎల్‌లో సౌత్ ఢిల్లీ సూపర్ స్టార్స్ తరపున ఆర్య ఆరు బంతుల్లో ఆరు సిక్స్‌లు కొట్టి ఓవర్‌నైట్ స్టార్‌గా మారిపోయాడు. టోర్నీ ఆసాంతం ప్రియాన్ష్ అద్బుతమైన ప్రదర్శన కనబరిచాడు.ఈ టోర్నీలో ఆర్య 198.69 స్ట్రైక్‌రేటుతో 608 పరుగులు చేశాడు. టీ20ల్లో కూడా మంచి రికార్డు ఈ యువ క్రికెటర్‌కు ఉంది. ఇప్పటివరకు 11 మ్యాచ్‌లు ఆడి 356 పరుగులు చేశాడు. ఈ క్రమంలోనే అతడిని ఐపీఎల్ మెగా వేలంలో పంజాబ్ సొంతం చేసుకుంది. -
ప్రియాన్ష్.. నీ కోసం ఐపీఎల్ ఎదురుచూస్తోంది
ప్రియాంష్ ఆర్య.. ఢిల్లీ ప్రీమియర్ లీగ్‌లో ఒక యువ సంచలనం. ఈ లీగ్‌లో సౌత్ ఢిల్లీ సూపర్ స్టార్జ్కు ప్రాతినిథ్యం వహిస్తున్న ప్రియాన్ష్ ఆర్య తన అద్బుత ప్రదర్శనలతో అందరని ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా గత వారంలో . నార్త్ ఢిల్లీ స్ట్రైకర్స్‌తో మ్యాచ్‌లో ఒకే ఓవర్లో ఆరు సిక్స్‌లు బాదిన ఈ యువ సంచలనం.. ఓవర్ నైట్ స్టార్‌గా మారిపోయాడు. అతడి హిట్టింగ్ స్కిల్స్ గురించి ఎంతచెప్పుకున్న తక్కువే.ఈ ఎడమ చేతి వాటం ఆటగాడు తన సిక్సర్లతో భారత దిగ్గజం యువరాజ్ సింగ్‌ను గుర్తు చేస్తున్నాడు. ఇప్పటివరకు ఈ టోర్నీలో 8 మ్యాచ్‌లు ఆడిన ప్రియాన్ష్.. 576 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా కొనసాగుతున్నాడు. ఈ లీగ్‌లో దుమ్ములేపుతున్న ఆర్య తన మనసులోని మాటను బయట పెట్టాడు.ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున ఆడాలన్న తన కోరికను 23 ఏళ్ల ఆర్య వ్యక్తం చేశాడు. అందుకు గల కారణాన్ని కూడా ఆర్య వెల్లడించాడు. కోహ్లి తనకు రోల్‌మోడల్ అని, అతడితో కలిసి డ్రెస్సింగ్ రూమ్‌ను పంచుకోవాలనకుంటున్నాని ప్రియాన్ష్ చెప్పుకొచ్చాడు.ఐపీఎల్ ఎదురుచూస్తోంది..ఇక ఈ ఏడాది ఆఖరిలో ఐపీఎల్-2025 మెగా వేలం జరగనుంది. ఈ వేలంలో ప్రియాంష్ ఆర్యపై కాసుల వర్షం కురిసే అవకాశముంది. ఇటువంటి యువ సంచలనాల కోసమే ఫ్రాంఛైజీలు వేయికళ్లుతో ఎదురుచూస్తున్నాయి. ఇప్పటికే ఐపీఎల్ ఫ్రాంచైజీలు ఆర్యపై ఓ కన్నేసి ఉంటాయి.నా దృష్టి అంతా ఆ టోర్నీపైనే..ఐపీఎల్ గురించి ప్రస్తుతం నేను ఆలోచించడం లేదు. ఎందుకంటే ఐపీఎల్ చాలా పెద్ద క్రికెట్ టోర్నీ. ఈ లీగ్ కోసం ఆలోచించడం, ఒత్తడిని ఎదుర్కొవడం రెండూ ఒకటే. వేలం కూడా నా ఆలోచన లేదు. ఆడే అవకాశం వస్తే అది నా శ్రమకు దక్కిన ఫలితంగా భావిస్తాను. అయితే నా దృష్టింతా ప్రస్తుతం సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీపైనే ఉంది. నా రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించడానికి ఇది గొప్ప అవకాశం. అక్కడ అద్భుతప్రదర్శన జట్టును గెలిపించడమే నా లక్ష్యమని ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆర్య పేర్కొన్నాడు.