problam
-
త్వరలో ప్రతి రైలులో ‘పాతాళ గంగ’.. అడక్కుండానే వాడుక నీరు!
మనం రైలులో ప్రయాణించినప్పుడు ఏదో ఒక సందర్భంలో రైలు టాయిలెట్లో లేదా బయట వాష్ బేసిన్ వద్ద నీరు లేకపోవడాన్ని గమనించే ఉంటాం. లేదా ఎవరో ఒకరు ఇటువంటి ఫిర్యాదు చేయడాన్ని మనం వినేవుంటాం. వేలాది మంది ప్రయాణికులతో రైలు రాకపోకలు సాగిస్తుంటుంది. అందువల్ల ప్రయాణికులందరికీ అందుబాటులో సరైన సౌకర్యాలు కల్పించడం రైల్వేశాఖకు పెద్ద సవాలే. ఇలాంటి పరిస్థితుల్లో కొన్నిసార్లు రైలు ప్రయాణం మధ్యలో నీటి కొరత లాంటి సందర్భాలు తలెత్తుతాయి. ఫలితంగా ప్రయాణికులు ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అయితే ఇకపై ఇలాంటి పరిస్థితి ఎదురుకాదు. ఇకపై రైలులోని టాయిలెట్, వెలుపలి వాష్‌బేసిన్ దగ్గర నీరు అయిపోవడమన్నదే ఉండదు. ఎందుకంటే ఈ సమస్యను పరిష్కరించేందుకు రైల్వేశాఖ కొత్త సాంకేతికతను ఉపయోగించనుంది. భారతీయ రైల్వే ఇందుకోసం ఐఓటీ ఆధారిత పర్యవేక్షణ వ్యవస్థను ఉపయోగించనుంది. ఐఓటీ అంటే అంటే ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్. సమస్య పరిష్కారంలో ఇంటర్నెట్ ఉపయోగించినప్పుడు, దానిని ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అని అంటారు. ఇకపై రైలు ట్యాంక్‌లోని నీటిని పర్యవేక్షించడానికి ఐఓటీని ఉపయోగించనున్నారు. ఇది ప్రతి బోగీకీ వర్తింపజేయనున్నారు. ఈ విషయాన్ని సెంట్రల్ రైల్వే సీపీఆర్వో తెలియజేశారు. ఈ సాంకేతికత ప్రస్తుతం పరీక్ష దశలో ఉంది. ఇప్పటి వరకు 3 రైళ్లలోని 11 కోచ్‌లలో దీనిని పరీక్షించారు. ఈ టెక్నిక్ విజయవంతమైంది. త్వరలో మిగతా రైళ్లలో కూడా అమలు చేయనున్నారు. ప్రయాణం సాగిస్తున్న రైలులో వాటర్ ట్యాంక్‌లోని నీరు 40 శాతం కన్నా తగ్గినప్పుడు ఈ సమాచారం రైల్వే సిబ్బందికి అందుతుంది. దీంతో తదుపరి స్టేషన్లో ఆ రైలు ట్యాంక్‌లో నీరు నింపుతారు. ఈ విధంగా రైళ్లలో నీటి కొరతకు పరిష్కారం లభించనుంది. ఇది కూడా చదవండి: నింగిలో ‘నీలి సూరీడు’.. శాస్త్రవేత్తలు ఏమంటున్నారు? -
ఈ బిడ్డది ఏ దేశం!
సాక్షి, బెంగళూరు: ఆయనది భారత్.. ఆమెది పాకిస్తాన్. ఆమె అక్రమంగా భారత్‌లోకి చొరబడింది. వారికి ఈ మధ్యే ఓ అమ్మాయి పుట్టింది. ఆ బిడ్డ జాతీయతను నిర్ధారించడం బెంగళూరు పోలీసులకు పెద్ద సమస్యగా మారింది. కేరళకు చెందిన మహ్మద్ శిహాబ్ 2010లో దుబాయ్‌కి వెళ్లి ఓ నిర్మాణ కంపెనీలో కార్మికుడిగా చేరాడు. పాకిస్తాన్‌లోని కరాచీ నుంచి వచ్చిన సమీరా అబ్దుల్ రెహమాన్ అనే యువతితో అతడు అక్కడ ప్రేమలో పడి వివాహం చేసుకున్నాడు. ఇందుకు యువతి తల్లిదండ్రులు ఒప్పుకోకపోవడంతో వారు మరో ఇద్దరు పాకిస్తాన్‌కే చెందిన దంపతులతో కలసి నేపాల్ మీదుగా కోల్‌కతాకు అక్కడి నుంచి బెంగళూరు చేరుకున్నారు. వీరంతా కుమారస్వామి లేఔట్లో అద్దె ఇంట్లో కలిసే ఉంటూ కూలి పనులు చేసుకుంటున్నారు. మిగిలిన ముగ్గురుకి మహ్మద్ శిహాబ్ నకిలీ ఆధార్ కార్డులను సంపాదించి పెట్టాడు. ఈ సంగతి తెలియడంతో మే నెలలో పోలీసులు నలుగురినీ అరెస్టుచేశారు. అరెస్టు సమయంలో గర్భిణిగా ఉన్న రెహమాన్ సెప్టెంబర్ 19న ఇక్కడి వాణి విలాస్ ఆసుపత్రిలో ఆడబిడ్డకు జన్మినిచ్చింది. తల్లీబిడ్డ ఆస్పత్రిలోనే ఉన్నారు. నిబంధనలు ఏమంటున్నాయి? ద సిటిజన్‌షిప్ యాక్ట్ 1955 ప్రకారం 2004 డిసెంబర్ 3 తర్వాత భారత్‌లో పుట్టే శిశువు భారతీయుడు లేదా భారతీయురాలే. శిశువు తల్లిదండ్రుల్లో కనీసం ఒకరు భారతీయుడై ఉండాలి. మరొకరు అక్రమ వలసదారు కాకూడదు. ఈ సందర్భంలో తల్లి అక్రమంగా వలసొచ్చిందికాబట్టి శిశువు జాతీయత ఏమిటనేది తేల్చలేకపోతున్నారు. నకిలీ ఆధార్ కార్డు కలిగి ఉండటం, అక్రమంగా భారత్‌లో నివసిస్తుండటంలాంటి 9 కేసులను సమీరాతో పాటు మిగిలిన ఇద్దరిపై నమోదుచేశారు. విదేశీ వ్యక్తి ఏదేని కేసులో ఇరుక్కుంటే విచారణ పూర్తయ్యేంత వరకూ అతను లేదా ఆమె దేశం దాటి వెళ్లడానికి లేదు. ప్రస్తుతానికి సమీరా జైలులోనే ఉండాల్సిన పరిస్థితి తలెత్తింది. బిడ్డను కొద్ది నెలల పాటు తల్లితోనే ఉంచాక∙శిశు సంక్షేమ శాఖకు అప్పగించాలా లేక తండ్రికా అనే విషయంపై పోలీసులు న్యాయనిపుణుల సలహాలు తీసుకునే అవకాశముంది. -
బాటిల్ షిప్పర్‌లో ఇరుక్కున్న నాలుక
– తీవ్రంగా ఇబ్బంది పడ్డ చిన్నారి – అత్యంత చాకచక్యంగా తీసేసిన వైద్యుడు పలమనేరు: పాలలో కలుపుకుని తాగే పేరొందిన ఓ బ్రాండ్ పొడి తీసుకుంటే ఉచితంగా వచ్చే వాటర్‌బాటిల్ షిప్పర్‌లో నీళ్లు తాగుతూ ఓ బాలిక తన నాలుకను అందులో ఇరికిచ్చుకుంది. ఇబ్బంది పడుతున్న బాలిక నాలుక నుంచి వైద్యుడు చాకచక్యంగా తొలగించాడు. ఈసంఘటన శనివారం సాయంత్రం పలమనేరులో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించి వివరాలు వైద్యుడు ఆదివారం ‘సాక్షి’కి తెలియజేశారు. పట్టణంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో రంజిత అనే బాలిక రెండో తరగతి చదువుతోంది. శనివారం బాలిక పాఠశాలకు వెళ్ళేటపుడు తల్లిదండ్రులు వాటిర్బాటిల్తో షిప్పర్‌ను ఇచ్చిపంపారు. బాలిక షిప్పర్‌తో నీరు తాగుతుండగా నీటిని లాగినపుడు లోని ప్రెషర్‌తో నాలుక షిప్పర్లోకి వెళ్లి ఇరుక్కుపోయింది. దీంతో బాటిల్‌ను బాలిక నోట్లోంచి తీసేందుకు ఏమాత్రం వీలుకాకుండా పోయింది. దీంతో సమీపంలోని సాయిరామ్ ఆస్పత్రకి తీసుకెళ్లగా డా.యుగంధర్ తొలుత బాటిల్‌ను వేరుచేసి ఆపై నాలుకకు మత్తు మందు ఇచ్చి లాక్ అయిన షిప్పర్‌ను అత్యంత చాకచక్యంగా వేరుచేశారు. షిప్పర్ల వాడకం ప్రస్తుతం ఫ్యాషన్‌గా మారిందని, దీంతో నీరు ఎలా తాగాలో కూడా లె లియని చిన్నారులకు వీటిని ఇవ్వడం చాలా ప్రమాదమని డాక్టర్ యుగంధర్ సూచించారు. ఇప్పటికైనా తల్లిదండ్రులు షిప్పర్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలని తెలిపారు.