మనం రైలులో ప్రయాణించినప్పుడు ఏదో ఒక సందర్భంలో రైలు టాయిలెట్‌లో లేదా బయట వాష్ బేసిన్ వద్ద నీరు లేకపోవడాన్ని గమనించే ఉంటాం. లేదా ఎవరో ఒకరు ఇటువంటి ఫిర్యాదు చేయడాన్ని మనం వినేవుంటాం. వేలాది మంది ప్రయాణికులతో రైలు రాకపోకలు సాగిస్తుంటుంది. అందువల్ల ప్రయాణికులందరికీ అందుబాటులో సరైన సౌకర్యాలు కల్పించడం రైల్వేశాఖకు పెద్ద సవాలే.
ఇలాంటి పరిస్థితుల్లో కొన్నిసార్లు రైలు ప్రయాణం మధ్యలో నీటి కొరత లాంటి సందర్భాలు తలెత్తుతాయి. ఫలితంగా ప్రయాణికులు ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అయితే ఇకపై ఇలాంటి పరిస్థితి ఎదురుకాదు. ఇకపై రైలులోని టాయిలెట్, వెలుపలి వాష్‌బేసిన్ దగ్గర నీరు అయిపోవడమన్నదే ఉండదు. ఎందుకంటే ఈ సమస్యను పరిష్కరించేందుకు రైల్వేశాఖ కొత్త సాంకేతికతను ఉపయోగించనుంది. భారతీయ రైల్వే ఇందుకోసం ఐఓటీ ఆధారిత పర్యవేక్షణ వ్యవస్థను ఉపయోగించనుంది.
ఐఓటీ అంటే అంటే ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్. సమస్య పరిష్కారంలో ఇంటర్నెట్ ఉపయోగించినప్పుడు, దానిని ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అని అంటారు. ఇకపై రైలు ట్యాంక్‌లోని నీటిని పర్యవేక్షించడానికి ఐఓటీని ఉపయోగించనున్నారు. ఇది ప్రతి బోగీకీ వర్తింపజేయనున్నారు. ఈ విషయాన్ని సెంట్రల్ రైల్వే సీపీఆర్వో తెలియజేశారు.
ఈ సాంకేతికత ప్రస్తుతం పరీక్ష దశలో ఉంది. ఇప్పటి వరకు 3 రైళ్లలోని 11 కోచ్‌లలో దీనిని పరీక్షించారు. ఈ టెక్నిక్ విజయవంతమైంది. త్వరలో మిగతా రైళ్లలో కూడా అమలు చేయనున్నారు. ప్రయాణం సాగిస్తున్న రైలులో వాటర్ ట్యాంక్‌లోని నీరు 40 శాతం కన్నా తగ్గినప్పుడు ఈ సమాచారం రైల్వే సిబ్బందికి అందుతుంది. దీంతో తదుపరి స్టేషన్‌లో ఆ రైలు ట్యాంక్‌లో నీరు నింపుతారు. ఈ విధంగా రైళ్లలో నీటి కొరతకు పరిష్కారం లభించనుంది.
ఇది కూడా చదవండి: నింగిలో ‘నీలి సూరీడు’.. శాస్త్రవేత్తలు ఏమంటున్నారు?
Comments
Please login to add a commentAdd a comment