Prof K. Nageshwar
-
మైత్రి మూవీస్‌లో ప్రొఫెసర్ నాగేశ్వర్ ,లక్ష్మీనారాయణల సినిమా
డాక్టర్ బత్తిని కీర్తిలత గౌడ్,రాజా నరేందర్ చెట్లపెల్లి నిర్మించిన చిత్రం 'భీమదేవరపల్లి బ్రాంచి'. ఈ చిత్రంలో బలగం ఫేమ్ సుధాకర్ రెడ్డి, అంజి వల్గమాన్, సాయి ప్రసన్న, అభి, రూప ప్రధాన పాత్రలలో నటించారు. రమేష్ చెప్పాల రచన-దర్శకత్వంలో గ్రామీణ నేపథ్యంలో అత్యంత సహజమైన పాత్రలతో ... నవ్విస్తూనే భావోద్వేగానికి గురిచేసేలా ఈ సినిమాను తీర్చిదిద్దారు. ఈ సినిమాలో రాజకీయ విశ్లేషకులు ప్రొఫెసర్ నాగేశ్వర్ , సిబిఐ మాజీ డైరెక్టర్ లక్ష్మీనారాయణ , సీనియర్ నేత అద్దంకి దయాకర్ నటించడం సినిమా మీద ఆసక్తి రేకిస్తోంది. ఈ మధ్య "భీమదేవరపల్లి బ్రాంచి" ప్రివ్యూ షో చూసిన సినీ ప్రముఖులు, పలువురు రాజకీయ నేతలు.. ఈ సినిమా ఆద్యంతం ఆకట్టుకుంటుందని రచయిత, దర్శకుడు రమేష్ చెప్పాల మీద ప్రశంసలు కురిపించారు. (ఇదీ చదవండి: ఆ చిత్రం రీమేక్‌లో నాగచైతన్య.. క్లారిటీ ఇచ్చిన టీం!) ‘భీమదేవరపల్లి బ్రాంచి" ఒక ఆర్గానిక్ గ్రామీణ చిత్రం. రెండు గంటల పాటు ప్రేక్షకుడిని నవ్వించే చిత్రమిది. ఒక మారుమూల గ్రామంలో జరిగిన సంఘటన దేశవ్యాప్తంగా సెన్సేషనల్ అయ్యింది. ఆ హాట్ టాపిక్ ఆధారంగా ఈ సినిమాను "నియో రియలిజం" జానర్లో చిత్రీకరించారు. ఈ జానర్లో వస్తున్న మొదటి తెలుగు చిత్రం ఇదే కావడం విశేషం. రెండు గంటలు పల్లె వాతావరణం కళ్ళ ముందు కదలాడుతుంది. ప్రతి ఒక్కరిని తమ గ్రామానికి తీసుకెళ్తుంది. ప్రమోషనల్ స్టఫ్ సినిమా మీద ఆసక్తి రేకెత్తించగా ఈ సినిమా కంటెంట్ నచ్చి మైత్రి మూవీ మేకర్స్ సంస్థ రిలీజ్ చేసేందుకు ముందుకు వచ్చింది. ఈ సినిమాను జూన్ 23న రిలీజ్ చేసేందుకు మేకర్స్ నిర్ణయం తీసుకున్నారు. (ఇదీ చదవండి: రజనీ కాంత్ కాదన్న బాబీకి గోల్డెన్ ఛాన్స్ ఇచ్చిన బాలకృష్ణ?) -
నమో అమెరికా
-
ఆర్టీసీని నాకివ్వండి.. లాభాల్లో నడిపిస్తా!
సాక్షి, హైదరాబాద్ : ‘ఆర్టీసీని నడపడం మీకు చేతకాకుంటే నాకివ్వండి. వేల కోట్ల లాభాల్లో నడిపిస్తాను’ అని ప్రొఫెసర్ నాగేశ్వర్ ప్రభుత్వానికి సవాల్ చేశారు. ప్రభుత్వం తన సవాల్‌ను స్వీకరించాలని డిమాండ్ చేశారు. గురువారం ఇందిరాపార్క్ వద్ద వామపక్షాలు చేపట్టిన సామూహిక దీక్షను ఆయన ప్రారంభించి సమ్మెకు తన మద్దతును తెలిపారు. అనంతరం ప్రొఫెసర్ నాగేశ్వర్ మాట్లాడతూ.. తమిళనాడు తరహాలో డీజిల్ ధరలను ప్రభుత్వం భరిస్తే ఆర్టీసీకి నష్టాలు రావని వెల్లడించారు. ప్రభుత్వం ఆర్టీసీకి నయాపైసా ఇవ్వకపోయినా పర్వాలేదు. కానీ ఆదాయం తీసుకోకుండా ఉంటే చాలన్నారు. ఆర్టీసీ ఏటా డీజిల్‌పై 1300 కోట్లు ఖర్చు చేస్తే 300 కోట్లు పన్నుల రూపంలో ప్రభుత్వానికి చెల్లిస్తుందని పేర్కొన్నారు. నష్టాలొచ్చినా ఆర్టీసీపై పన్నులు వసూలు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణేనని విమర్శించారు. ప్రైవేటు బస్సులను అరికడితే ఆర్టీసీ లాభాల బాటలో నడుస్తుందని సూచించారు. ప్రభుత్వం అబద్దపు ప్రచారాలను మానుకోవాలని నాగేశ్వర్ కోరారు. అంతకు ముందు సీపీఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ.. సమ్మె విషయంలో ప్రస్తుతం సీఎం వర్సెస్ తెలంగాణ సమాజం అనే విధంగా మారిందన్నారు. తెలంగాణ సమాజం బస్సులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు కూడా సమ్మె న్యాయమైందే అంటున్నారని వ్యాఖ్యానించారు. సీఎం మొండి వైఖరి వల్ల చీకటి రోజులు వస్తున్నాయని ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని అభిప్రాయపడ్డారు. సీపీఐ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ.. కేసీఆర్ తనకు ఎదురులేదని విర్రవీగుతున్నాడని విమర్శించారు. ఐదుగురు కార్మికులు మరణించిన తర్వాత కూడా మానవత్వం లేదా? అని ప్రశ్నించారు. కార్మికులపై కక్ష కట్టిన కేసీఆర్ సమ్మెను నిర్వీర్యం చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ జేఏసీ నేతలు తదితరులు పాల్గొన్నారు. -
అర్థరహితం..అసంబద్ధం
సాక్షి, అమరావతి: ఎన్నికల సంఘంపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరోపణలు, విమర్శలు చేయడం దారుణమని వివిధ రంగాల నిపుణులు పేర్కొన్నారు. ఈవీఎంలు, వీవీ ప్యాట్ల పనితీరుపై ఆయన లేవనెత్తిన సందేహాలు అసంబద్ధమైనవని కొట్టిపారేశారు. 2014 ఎన్నికల్లో గెలిచినప్పుడు లేని అభ్యంతరం ప్రస్తుతం ఎందుకని ప్రశ్నించారు. ఎన్నికల్లో ఓటమి ఖాయమని తెలిసి చంద్రబాబు సాకులు వెతుక్కుంటున్నారని విమర్శించారు. బాబు ఆరోపణలు ప్రజాస్వామ్య విరుద్ధం రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో భారీ సంఖ్యలో ప్రజలు ఓట్లు వేయడం ప్రజాస్వామ్య వ్యవస్థల పట్ల వారికి ఉన్న నమ్మకానికి నిదర్శనం. నిష్పక్షపాతంగా పనిచేయడం లేదని భావించిన కొందరు అధికారులను కేంద్ర ఎన్నికల సంఘం బదిలీ చేసింది. కేంద్ర ఎన్నికల సంఘంపై సీఎం చంద్రబాబు చేసిన ఆరోపణలు ప్రజాస్వామ్య విరుద్ధంగా ఉన్నాయి. నిరాధార ఆరోపణలు చేసిన నేతలపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలి. – ఈఏఎస్ శర్మ, కేంద్ర ఇంధన శాఖ రిటైర్డ్ కార్యదర్శి ఎన్నికలపై అనవసర రాద్ధాంతం తగదు ఎన్నికల సంఘానికి రాజకీయ దురుద్దేశాలు ఆపాదించడం దారుణం. ఈవీఎంలపై సందేహాలు వ్యక్తం చేయడం విడ్డూరంగా ఉంది. దేశంలో కంప్యూటర్లను, టెక్నాలజీని తానే తెచ్చానని చంద్రబాబు అంటారు. కానీ, ఈవీఎంలను వ్యతిరేకిస్తారు. టీడీపీ గెలిచి అధికారంలోకి వచ్చిన 2014 ఎన్నికల్లో ఈవీఎంలనే వినియోగించారు. అప్పుడెందుకు ఈవీఎంల పనితీరును తప్పుబట్టలేదు? ఈవీఎంతో పాటు ప్రస్తుతం వీవీ ప్యాట్లను కూడా వినియోగంలోకి తీసుకువచ్చారు. ఎన్నికలు సక్రమంగా, సజావుగా జరిగాయి. ఎన్నికలపై అనవసరంగా రాద్ధాంతం చేయడం సరికాదు. – ప్రొ.వేణుగోపాల్‌రెడ్డి, మాజీ వీసీ, ఏయూ, ఏఎన్‌యూ ఓటమి భయంతోనే చంద్రబాబు సాకులు ఎన్నికల్లో ఓటమి భయంతోనే చంద్రబాబు ఈవీఎంలపై రాద్ధాంతం చేస్తున్నారు. 2014 ఎన్నికల్లో, 2016 నంద్యాల ఉప ఎన్నికల్లోనూ ఈవీఎంలను ఉపయోగించారు. ప్రస్తుతం ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయే అవకాశం ఉంది కాబట్టి ఈవీంఎంలు చెడ్డవా? ఎన్నికల్లో తన ఓటమి ఖాయమని తెలిసి చంద్రబాబు ముందుగా సాకులు వెతుక్కుంటున్నారు. – ముప్పాళ్ల సుబ్బారావు, రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యుడు అప్పుడెందుకు ఫిర్యాదు చేయలేదు తన ఓటు ఎవరికి పడిందో తనకే తెలియదని చంద్రబాబు అనడం సరైంది కాదు. అలాగైతే అప్పుడే పోలింగ్ అధికారులకు ఎందుకు ఫిర్యాదు చేయలేదు? ఒక్క చంద్రబాబే కాదు... లక్షలాది మంది ఓటర్లు ఓట్లేశారు. వారిలో టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, అభ్యర్థులు, కార్యకర్తలు కూడా ఉన్నారు. వారెవరూ ఫిర్యాదు చేయలేదు. ఒకవేళ ఓటు ఎవరికి వేశారో తెలియకపోతే పోలింగ్ బూత్‌ల వద్ద అలజడులు జరిగేవి. అలా జరగలేదంటే పోలింగ్ సక్రమంగా జరిగినట్లే కదా. ఈవీఎంలపై సందేహాలుంటే 2014 నుంచి 2018 వరకు కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉండగా ఒక్కసారైనా ఆ విషయాన్ని టీడీపీ ప్రస్తావించిందా? పార్లమెంటులో లేవనెత్తిందా? చంద్రబాబు ఆరోపణలు అసంబద్ధంగా ఉన్నాయి. – ప్రొఫెసర్ కె.నాగేశ్వర్, సీనియర్ పాత్రికేయుడు -
అజెండా సెట్ చేసేది జగన్ ఫాలో అయ్యేది చంద్రబాబు
రాజకీయాల్లో 40 ఏళ్ల అనుభవమని చెప్పుకునే చంద్రబాబుతో 40 ఏళ్ల వయసున్న వైఎస్ జగన్ ఈ ఐదేళ్లలో అనేక పిల్లిమొగ్గలు వేయించాడని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. జగన్ వ్యూహాలను, నిర్ణయాలను వారు అభినందిస్తున్నారు. తాజాగా ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు, మాజీ ఎమ్మెల్సీ, ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను విశ్లేషిస్తూ మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. మరోవైపు వైఎస్ జగన్ ప్రకటించిన నవరత్నాలను, వైఎస్సార్సీపీ మేనిఫెస్టోలోని పలు అంశాలను చంద్రబాబు కాపీ కొట్టారని సోషల్ మీడియాలో తీవ్ర చర్చజరుగుతోంది. సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏ అజెండాను సెట్ చేసినా.. చంద్రబాబు దాన్ని పాటిస్తూ వచ్చారని ప్రముఖ రాజకీయ విళ్లేషకుడు, మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వరరావు అన్నారు. జగన్ ప్రత్యేక హోదా నినాదం ఎత్తుకుంటే.. ప్యాకేజీ ముద్దు అని అన్న చంద్రబాబు కూడా చివరకు యూటర్న్ తీసుకొన్నారని చెప్పారు. కేంద్ర మంత్రి వర్గం నుంచి టీడీపీ సభ్యులు బయటకు రావాల్సిందనేని జగన్ పట్టుబడితే.. చంద్రబాబు దాన్ని పాటించారని గుర్తు చేశారు. ఇలా జగన్ ఏ అజెండా నిర్ణయిస్తే.. చంద్రబాబు దాన్ని ఫాలో అవుతూ వచ్చారన్నారు. అజెండాను సెట్ చేసే వాళ్లే లాభపడతారు ’ఎవరైతే రాజకీయాల్లో అజెండా సెట్ చేస్తారో వాళ్లు లాభపడతారు. ఎవరైతే ఆ అజెండాకు స్పందిస్తుంటారో వాళ్లు నష్టపోతుంటారు. దేశ రాజకీయాల్లో, రాష్ట్ర రాజకీయాల్లో జరుగుతున్నది అదే. మోదీ అజెండాను సృష్టిస్తూ వచ్చారు.. ప్రత్యర్థులందరూ దానిపై ప్రతిస్పందిస్తూ వచ్చారు. ఫలితమేమైంది? మోదీకి లాభం జరిగింది. తెలంగాణలో కూడా అదే జరిగింది. ఉద్యమ కాలంలో కేసీఆర్ అజెండాను సృష్టిస్తే.. ఇతర పార్టీలు ఆ అజెండాను పాటిస్తూ వచ్చాయి. ఈరోజు ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్నది కూడా అదే. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ అజెండాను సెట్ చేస్తున్నాడు.. దానికి సీఎం చంద్రబాబు రియాక్ట్ అవుతున్నాడు. ఇందుకు నేను ఐదు ఉదాహరణలు చెబుతాను. జగన్ హోదా కోసం నినదిస్తే.. బాబు ఫాలో అయ్యాడు మొదటిది ప్రత్యేక హోదా. ప్రత్యేక హోదా ఏపీ హక్కు అని మొదట్నుంచీ ఊరూవాడా తిరిగిన వ్యక్తి జగన్మోహన్రెడ్డి. ఆ సమయంలో చంద్రబాబు ఏమని వాదన పెట్టాడు? ‘అసలు ప్రత్యేక హోదా సంజీవని కాదు. హోదా కన్నా ప్రత్యేక ప్యాకేజీ బాగుంటుంది. ప్రత్యేక హోదా మంచిదని చెప్పిందెవరు? హోదా వచ్చిన రాష్ట్రాలు ఏమైనా బాగుపడ్డాయా? ప్రత్యేక హోదా వస్తే ఏదో మూడు, నాలుగు వేల కోట్లు వస్తాయి? అంతకు మించి ఒరిగేదేముంది?’ అని చంద్రబాబు వాదించాడు. ప్రత్యేక ప్యాకేజీ బాగుందని ప్రకటనలు చేయడమే కాకుండా.. వెంకయ్యనాయుడికి సన్మానాలు కూడా చేశారు. ఆ తర్వాత ఏమైంది? జగన్ తన పాదయాత్రలో ప్రత్యేక హోదా డిమాండ్‌నే వినిపించారు. జగనే కాదు.. ఇతర విపక్ష రాజకీయ పార్టీలు కూడా ప్రత్యేక హోదా డిమాండ్‌ను పట్టుకునే పోరాడాయి. దీంతో చంద్రబాబు తప్పనిసరై ఇప్పుడు ప్రత్యేక హోదా కావాలంటున్నాడు. కానీ అప్పటికే హోదా కంటే ప్యాకేజీ మంచిదని చెప్పిన వ్యక్తిగా చంద్రబాబు అపప్రద మూటకట్టుకున్నాడు. చంద్రబాబే కదా.. ప్రత్యేక ప్యాకేజీకి ఒప్పుకున్నది. ఇప్పుడు ఆయన యూటర్న్ తీసుకుంటే ఎలా? అని బీజేపీ కూడా ప్రశ్నిస్తోంది. రాజకీయంగా చంద్రబాబుకు ఇది పెద్ద సెట్‌బ్యాక్‌గా మారిపోయింది. జగన్ డిమాండ్ చేస్తే.. కేంద్రం నుంచి వైదొలిగారు ఇక రెండో ఉదాహరణ. జగన్ మొదట్నుంచీ ఒక మాట అంటున్నాడు.. ‘ఎన్డీఏలో భాగస్వామిగా ఉంటూ.. మోదీ మంత్రివర్గంలో సభ్యులుగా ఉంటూ బీజేపీతో ఎలా పోరాడగలరు? మొదట ఎన్డీఏ నుంచి, కేంద్ర మంత్రివర్గం నుంచి బయటకు రండి’ అని జగన్ డిమాండ్ చేస్తూ వచ్చాడు. ‘కేంద్రంలో మీరే(ఎన్డీఏ భాగస్వామిగా టీడీపీ ఉన్నప్పుడు) బడ్జెట్‌ను ఆమోదిస్తారు? ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం చేశారనని మళ్లీ మీరే అంటుంటారు’ అని చంద్రబాబుపై జగన్ దాడి చేశారు. అప్పుడు చంద్రబాబు ఏమన్నారు? ‘కేంద్ర మంత్రివర్గంలో ఉంటేనే కదా కొద్దోగొప్పో నిధులు తీసుకురాగలం. బీజేపీ ప్రభుత్వమేమీ మాపై ఆధారపడి లేదు. కేంద్ర మంత్రివర్గంలో కొనసాగితే తప్పేంటి’ అని చంద్రబాబు ఎదురుదాడికి దిగారు. కానీ, ఆ తర్వాత జరిగిందేంటి? కేంద్ర మంత్రివర్గం నుంచి టీడీపీ సభ్యులు వైదొలిగారు. వైఎస్ జగన్ డిమాండ్ చేసిన మొదట్లోనేమో.. కేంద్ర మంత్రివర్గం నుంచి బయటకు రావాల్సిన అవసరం లేదని చంద్రబాబు అన్నారు. చివరకు కేంద్రం నుంచి వైదొలిగి జగన్ డిమాండ్‌ను చంద్రబాబు అమలు చేశారు. ఇదేమి రాజకీయమని ప్రశ్నిస్తే.. ఎన్డీఏ నుంచి బయటకు వచ్చారు ఇక మూడోది. ‘మంత్రివర్గం నుంచి బయటకు వచ్చారు సరే.. ఎన్డీఏలో కొనసాగడమేమిటి? ఇదేమి రాజకీయం’ అంటూ చంద్రబాబుపై మళ్లీ జగన్మోహన్రెడ్డి విమర్శలు చేశారు. దానికి చంద్రబాబు, టీడీపీ వాళ్లు ఏం బదులిచ్చారు? ‘ఎస్. బీజేపీకి, మోదీకి ఇంకా అవకాశమిస్తున్నాం. ఇప్పుడైనా.. వాళ్లు మనసు మార్చుకుని ఏపీకి సాయం చేస్తారు’ అని చంద్రబాబు చెప్పుకొచ్చారు. కానీ చివరకు ఏమైంది? జగన్ కోరినట్లుగానే టీడీపీ వాళ్లు ఎన్డీఏకు కూడా గుడ్‌బై చెప్పేశారు. అవిశ్వాసంలోనూ అనుసరణే.. ఇక నాలుగోది అవిశ్వాసం. ప్రత్యేక హోదా కోసం ఎన్డీఏ ప్రభుత్వంపై అవిశ్వాసం పెడతామని జగన్ టైం టేబుల్ ఇచ్చారు. అప్పుడు చంద్రబాబు.. ‘అసలు అవిశ్వాసానికి బలం ఉందా? అవిశ్వాసం అంటే జోక్ అనుకున్నారా? అనేక పార్టీల మద్దతు కూడగట్టాలి? ఈ అవిశ్వాసంతో బీజేపీ ప్రభుత్వం పడిపోతుందా? అలా పడిపోనప్పుడు అవిశ్వాసం దేనికి? దాని వల్ల లాభమేమిటి?’ అని ప్రశ్నించాడు. కానీ, జగన్మోహన్రెడ్డి వెనక్కి తగ్గకుండా అవిశ్వాసం పెడతామని స్పష్టం చేశారు. ‘టీడీపీ వాళ్లు అవిశ్వాసం పెడితే దానికి కూడా మద్దతు ఇస్తాం.. లేదా మేము పెట్టే అవిశ్వాసానికి మద్దతు ఇవ్వండి’ అని జగన్ పిలుపిచ్చాడు. ఆ తర్వాత వైఎస్సార్సీపీ ఎంపీలు అవిశ్వాసానికి నోటీసిచ్చారు. ఆ నోటీసు ఇచ్చిన కొద్ది రోజులకు చంద్రబాబు అసెంబ్లీలో మాట్లాడుతూ.. ‘రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎవరు అవిశ్వాసం పెట్టినా మద్దతిస్తాం’ అని ప్రకటించారు. కానీ ఆ మరుసటి రోజుకు సీన్ అంతా మారిపోయింది. ‘జగన్ కేంద్రంతో లాలూచీ పడుతూ అవిశ్వాసం పెడుతున్నాడు. ఆయనకు మేమెందుకు మద్దతిస్తాం. అసలు మేమే అవిశ్వాసం పెడతాం’ అని చంద్రబాబు చెప్పుకొచ్చారు. ముందేమో అసలు అవిశ్వాసంతో లాభమేమిటి? అని ప్రశ్నించిన చంద్రబాబు.. చివరకు మేమే అవిశ్వాసం పెడతామంటూ అనేక వంకర్లు తిరిగారు. అయినా అవిశ్వాసం ముందు పెట్టింది ఎవరు? వైఎస్సార్సీపీ. ఆ తర్వాతే టీడీపీ పెట్టింది. అంటే ఎవరు ఎవర్ని అనుసరించినట్టు? -
రైతు పోరాటం ఆరంభమే
ఆర్మూర్: రైతులు నామినేషన్లు వేసింది గెలుపు కోసం కాదని, తమ కడుపు మంట పాలకుల దృష్టికి తీసుకెళ్లడానికేనని మాజీ ఎమ్మెల్సీ, రాజకీయ విశ్లేషకులు ప్రొఫెసర్ నాగేశ్వర్రావు వ్యాఖ్యానించారు. ఈ పోరాటం ఆరంభం మాత్రమేనని చెప్పారు. మంగళవారం ఆర్మూర్‌లో నిర్వహించిన నిజామాబాద్ లోక్‌సభ స్థానానికి నామినేషన్లు వేసిన 178 మంది రైతుల ఐక్యత సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే పసుపు, ఎర్రజొన్న రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వడం చాలా చిన్న విషయమని పేర్కొన్నారు. రైతులు ఆత్మహత్యల నుంచి ఎన్నికల్లో పోటీ చేసే స్థాయికి పోరాటాన్ని తీసుకురావడం అభినందనీయమని చెప్పారు. కేవలం పసుపు బోర్డును సాధించుకోవడంతో ఆపేయకుండా పసుపు, ఎర్రజొన్నలకు గిట్టుబాటు ధర, రైతుల సమస్యలకు శాశ్వత పరిష్కారం అయ్యేంత వరకు ఉద్యమాన్ని కొనసాగించాలని సూచించారు. నిజామాబాద్, జగిత్యాల జిల్లాల రైతాంగం చేస్తున్న పోరాటం యావత్ దేశంలోని రైతులకు ఆదర్శంగా నిలవాలన్నారు. ఐదు రూపాయలకు కిలో టమాటలు లభించే సమయంలో సూపర్మార్కెట్లో టమాట పచ్చడి వంద రూపాయలకు లభిస్తోందని, అంటే పంట పండించిన రైతులకు కాకుండా ఆ పంటపై వ్యాపారం చేసే వ్యాపారస్తులకే అధిక లాభాలు రావడం విచారకరమన్నారు. పదేళ్లు అధికారంలో ఉండి రైతుల డిమాండ్లను పరిష్కరించలేని వారు ఇప్పుడు రైతులు నామినేషన్లు వేయగానే అధికారంలోకి వచ్చిన ఐదు రోజుల్లో సమస్యలను పరిష్కరిస్తామని హామీలు ఇవ్వడం రైతుల విజయమన్నారు. ‘స్థానిక’ఎన్నికల్లోనూ నామినేషన్లు వేయాలి నామినేషన్లు వేసిన రైతులకే ఓటు వేయాలని తీర్మానించారు. పసుపు పంట క్వింటాలుకు 15 వేల రూపాయలు, ఎర్రజొన్న పంట క్వింటాలుకు 3,500 రూపాయలకు ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. స్వామినాథన్ కమిషన్‌ను అమలు చేయాలని, సమస్యలపై రైతులంతా ఒక్కటిగా ఉండి పోరాటాన్ని కొనసాగించాలని, ఎన్నికల వేళ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాక రైతుల సమస్యలు పరిష్కరించని రాజకీయ పార్టీలను గ్రామాల్లోకి రానివ్వకుండా బహిష్కరించాలని తీర్మానించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో సైతం రైతులు నామినేషన్లు వేసి నిరసన తెలపాలని, రైతులపై పెట్టిన కేసులు ఎత్తివేయాలని, మల్లాపూర్, ముత్యంపేట, బోధన్ షుగర్ ఫ్యాక్టరీలను పునరుద్ధరించాలని, రైతుల ఓట్లు రైతులకే వేయాలని తీర్మానాలు చేశారు. ఈ సభలో సుమారు ఐదు వేల మంది రైతులు పాల్గొన్నారు. -
విద్యాభివృద్ధితోనే సామాజిక ఎదుగుదల
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: అన్ని వర్గాల వారిని ప్రోత్సహించి విద్యాభివృద్ధికి కృషి చేయడం ద్వారానే జ్ఞాన సముపార్జన జరిగి సామాజిక ఎదుగుదల సాధ్యమవుతుందని ప్రముఖ ఆర్థికవేత్త ప్రొఫెసర్ జయతీఘోష్ అన్నారు. ఆదివారం ఖమ్మంలో తెలంగాణ ఐక్య ఉపాధ్యాయ సమాఖ్య (టీఎస్‌యూటీఎఫ్) రాష్ట్ర తృతీయ మహాసభలు ప్రారంభమయ్యాయి. ఈ సభలకు ముఖ్య అతిథిగా హాజరైన జయతీఘోష్ మాట్లాడుతూ.. కులం, మతం, లింగ ఆర్థిక విషయాల్లో పాలకులు ప్రజల్లో విభే దాలను సృష్టిస్తున్నారన్నారు. భిన్నత్వాన్ని నిర్వీ ర్యం చేసేందుకు కేంద్రంలో మోదీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. భిన్నత్వాన్ని ప్రోత్సహించే యూనివర్సిటీలు, ఉన్నత విద్యాసంస్థలపై జరుగుతున్న దాడులే దీనికి కారణమన్నారు. హైదరాబాద్ తదితర యూనివర్సిటీల్లో జరుగుతున్న పరిణామాలు ప్రభుత్వం చేయిస్తున్న దాడులకు నిదర్శనమని చెప్పారు. విద్యావ్యవస్థలో భయంకర పరిస్థితి: చుక్కా రామయ్య ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్య మాట్లాడుతూ..ప్రస్తుతం దేశంలో, రాష్ట్రంలో విద్యావ్యవస్థలో భయంకర పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు. మనసులోని మాటను కూడా చెప్పలేని స్థితి రాష్ట్రంలో ఉందన్నారు. ఛాందస భావాలకు వ్యతిరేకంగా పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. గురుకులాలతో పాటు ప్రభుత్వ పాఠశాలలన్నీ బలోపేతం చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఉపాధ్యాయులంతా విద్యా వ్యవస్థను మెరుగుపర్చేలా పోరాడాలని కోరారు. ప్రతీ విద్యార్థిలో ప్రశ్నించే తత్వాన్ని ప్రోత్సహించాలని, అందుకు తగిన విధంగా ఉపాధ్యాయుల బోధనలు ఉండాలని సూచించారు. రాజ్యాంగ లక్ష్యాలకు తూట్లు: ప్రొఫెసర్ నాగేశ్వర్, హరగోపాల్ ప్రొఫెసర్ నాగేశ్వర్ మాట్లాడుతూ..రాజ్యాంగ నిబంధనల ప్రకారం ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలు అదే రాజ్యాంగ లక్ష్యాలకు తూట్లు పొడుస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తున్నారని, ఇది సరైన పద్ధతి కాదని అన్నారు. ప్రొఫెసర్ హరగోపాల్ మాట్లాడుతూ..పాఠశాలల్లో ఆట స్థలాలే ఏర్పాటు చేయని దేశంలో కామన్వెల్త్ గేమ్స్ నిర్వహించడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు శ్రీరాములు, చావా రవి, ఉపాధ్యక్షురాలు దుర్గాభవాని, బి.నర్సింహారావు, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు నాగమల్లేశ్వరరావు, వీరబాబు తదితరులు పాల్గొన్నారు. -
చంద్రబాబు క్షమాపణలు చెప్పాలి: ప్రొ.కె.నాగేశ్వర్
రాష్ట్ర విభజనపై భారతీయ జనతాపార్టీ, తెలుగుదేశం పార్టీలు అనుసరించిన వైఖరిపై మల్కాజ్గిరి స్వతంత్ర అభ్యర్థి ప్రొఫెసర్ కె.నాగేశ్వర్ గురువారం హైదరాబాద్‌లో నిప్పులు చెరిగారు. ప్రతి జిల్లాను హైదరాబాద్‌లా మారుస్తానంటున్న టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ... ఆయన సీఎంగా ఉండగా ఎందుకు మార్చలేకపోయారని ప్రశ్నించారు. చంద్రబాబు చేతగాని తనమా లేక ప్రజలపై ఉన్న కోపమా చెప్పాలని చంద్రబాబును నాగేశ్వర్ డిమాండ్ చేశారు. తమ ఆస్తుల కోసమే హైదరాబాద్‌ను అభివృద్ది చేశారా లేక మరే కారణం ఏదైనా ఉందో చెప్పాలని అన్నారు. చేతిలో చక్రం ఉన్నప్పుడు బాబు ఒక్క జిల్లానైనా హైదరాబాద్‌లా ఎందుకు చేయలేకపోయారని ప్రశ్నించారు. ఇప్పుడు అభివృద్ధి చేస్తానంటున్న చంద్రబాబును ఎలా నమ్మెది అని ఆయన అన్నారు. విభజన నేపథ్యంలో సీమాంధ్రకు బీజేపీ ప్యాకేజీలు అడగలేదని, చంద్రబాబు కూడా అందుకు ఒత్తిడి చేయలేదని నాగేశ్వర్ ఈ సందర్బంగా గుర్తు చేశారు. ప్యాకేజీలనే అడగని చంద్రబాబు ప్రజలకు క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఎన్నికల వేళ సీమాంధ్రకు 15 ఏళ్ల ప్రత్యేక ప్యాకేజీ అంటున్న బీజేపీ.. లోక్‌సభలో ఆ అంశాన్ని ఎందుకు చర్చించలేదని ఆ పార్టీని నాగేశ్వర్ సూటిగా ప్రశ్నించారు. ప్యాకేజీ కోసం లోక్‌సభలో ప్రతిపక్ష నేత సుష్మ స్వరాజ్ అంతగా పట్టుపట్టలేదని ఆయన గుర్తు చేశారు. అదే అంశంపై రాజ్యసభలో ప్రస్తావించినా ప్రయోజనం ఉండదని తెలిసీ బీజేపీ సీనియర్ నేత వెంకయ్యనాయుడు తన ఇమేజ్‌ని కాపాడుకోవడం కోసం ప్యాకేజీపై ఒక్క మాట కూడా ఉచ్చరించకుండా ఉండేందుకు ఆరాటపడ్డారంటూ ఎద్దేవా చేశారు. విభజనపై బీజేపీకి చిత్తశుద్ది ఉంటే పార్లమెంట్‌లోనే సవరణలకు పట్టుబట్టేదని ఆయన అభిప్రాయపడ్డారు. ఆ సమయంలో ప్యాకేజీలను బీజేపీ కోరితే యూపీఏ సర్కారు తప్పకుండా అంగీకరించి ఉండేదని కె.నాగేశ్వర్ అన్నారు.