Prohibition and Excise officers
-
చెక్‌పోస్టుల్లో ముమ్మర తనిఖీలు
సాక్షి, నెల్లూరు(క్రైమ్): సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా నాలుగు చెక్‌పోస్టుల్లో ముమ్మర తనిఖీలు చేస్తున్నట్లు నెల్లూరు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ వి.రాధయ్య తెలిపారు. మంగళవారం ఆయన నెల్లూరులోని తన కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నిబంధనల మేరకే మద్యం విక్రయాలు సాగించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. రాజకీయనేతలకు మద్యం సరఫరా చేసి నిబంధనలు ఉల్లంఘించే దుకాణాలపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఎన్నికల సందర్భంగా ఇప్పటివరకు జిల్లాలో సుమారు 300 మందిని బైండోవర్ చేసుకున్నామన్నారు. ఎన్నికల నోడల్ అధికారిగా ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాలకు తమ శాఖ జాయింట్ కమిషనర్ జోసఫ్‌ను ఉన్నతాధికారులు నియమించారన్నారు. అదనంగా ఇచ్చే ప్రసక్తే లేదు ఎన్నికల్లో మద్యం ప్రభావం అధికంగా ఉండే అవకాశం ఉందన్నారు. విక్రయాలను నియంత్రించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. గతేడాది మార్చిలో ఎంత మద్యం దుకాణాలకు సరఫరైందో దానికన్నా తక్కువగా సరఫరా చేసేలా చర్యలు తీసుకున్నామన్నారు. గత మార్చిలో రూ.108 కోట్లు విలువచేసే 2,03,512 మద్యం కేసులు, 1,35,3920 బీరు కేసులు దేవరపాళెం, ఓజిలిలోని ఐఎంఎల్ డిపోల నుంచి మద్యం దుకాణాలకు సరఫరా అయిందన్నారు. ఈ ఏడాది మార్చి ఒకటి నుంచి 11వ తేదీ వరకు రూ.54.23 కోట్లు విలువచేసే 94,553 మద్యం కేసులు, 62,215 బీరు కేసుల సరఫరా జరిగిందన్నారు. నిర్ణీత స్టాక్ కంటే ఒక్క కేసు అదనంగా ఇచ్చే ప్రసక్తేలేదని స్పష్టంచేశారు. ప్రతిరోజూ తనిఖీలు మద్యం దుకాణాలు, బార్లలో ప్రతిరోజూ తనిఖీలు నిర్వహిస్తామన్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు ఎంత విక్రయాలు జరిగాయి?, ఒకవేళ విక్రయాలు పెరిగితే అందుకు గల కారణాలు? స్టాక్ రిజిస్టర్ సక్రమంగా నిర్వహిస్తున్నారా? నిర్ణీత వేళల్లో దుకాణాలు నడుస్తున్నాయా? బెల్టుషాపులు ఉన్నాయా? రాజకీయ నేతలకు మద్యం సరఫరా చేస్తున్నారా? తదితర వివరాలను సేకరిస్తామన్నారు. ప్రతి స్టేషన్ పరిధిలో ఈ ప్రక్రియ ఎన్నికలు ముగిసేంతవరకూ కొనసాగుతుందన్నారు. నిబంధనల ఉల్లంఘునలపై కఠినంగా వ్యవహరిస్తామన్నారు. 24 గంటలూ.. ఎన్నికల వేళ తమిళనాడు, కర్నాటక, పాండిచేరి, గోవాల నుంచి మద్యం సరఫరా అయ్యే అవకాశం ఉన్న దృష్ట్యా వాటి నిరోధానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇప్పటికే తడ బీవీపాళెం వద్ద శాశ్వత చెక్‌పోస్టు ఉందన్నారు. దీంతోపాటు ఎన్నికల దృష్ట్యా రాపూరు పరిధిలోని పంగిలి వద్ద, ఉదయగిరి – బద్వేల్ రోడ్డులోని వై జంక్షన్ వద్ద, నాయుడుపేట శివార్లలో చెక్‌పోస్టులను ఏర్పాటు చేశామన్నారు. ప్రతిచోట ఒక సీఐతోపాటు కొందరు సిబ్బంది ఉంటారని, వీరు 24 గంటలపాటు వాహనాలను తనిఖీలు నిర్వహిస్తారన్నారు. నాన్‌డ్యూటీపెయిడ్ లిక్కర్‌పై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. రెండు ఇంటిలిజెన్స్ బృందాలు నెల్లూరు, గూడూరు ఎక్సైజ్ జిల్లాల పరిధిలో రెండు ఇంటిలిజెన్స్ బృందాలను ఏర్పాటు చేశామన్నారు. ఒక సీఐతో పాటు ఆరుగురు సభ్యులు ఈ బృందాల్లో ఉంటారన్నారు. మద్యం నియంత్రణ, పంపిణీ, ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి, సారా తయారీ, పంపిణీ తదితరాలపై బృందాలు నిఘా ఉంచి వాటి నియంత్రణకు చర్యలు తీసుకుంటారన్నారు. సమావేశంలో నెల్లూరు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్ డి.శ్రీరామచంద్రమూర్తి, నెల్లూరు, గూడూరు ఎక్సై జ్ సూపరింటెండెంట్లు శ్రీనివాసాచారి, వెంకటరామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. కంట్రోల్‌రూమ్ ఏర్పాటు మద్యం అక్రమ రవాణా, విక్రయాలు, నిల్వలను అడ్డుకునేందుకు నెల్లూరు డీసీ కార్యాలయం (0861–2331159)లో కంట్రోల్‌రూమ్ ఏర్పాటు చేశామన్నారు. ఐదుగురు సిబ్బంది 24 గంటలపాటు విధులు నిర్వహిస్తారన్నారు. ఎక్కడైనా అక్రమ నిల్వలున్నా, మద్యం అక్రమ రవాణా, పంపిణీ జరుగుతున్నా ప్రజలు ఫోన్ చేసి సమాచారమందిస్తే తగిన చర్యలు తీసుకుంటామన్నారు. అంతేకాకుండా ఆ మద్యం ఎక్కడినుంచి వచ్చిందో తెలుసుకుని సరఫరా చేసిన దుకాణదారుని లైసెన్స్‌ను రద్దు చేస్తామని హెచ్చరించారు. -
408 మద్యం షాపులకు లెసైన్స్
- 154 షాపులకు దరఖాస్తులు నిల్ - 80 షాపులకు ఒకే ఒక్క దరఖాస్తు - దరఖాస్తు రుసుం ద్వారా రూ. 14.89 కోట్ల ఆదాయం కాకినాడ క్రైం : జిల్లాలో 562 మద్యం షాపులకు గాను 408 షాపులకు మాత్రమే లెసైన్స్‌లు మంజూరయ్యాయి. లక్కీడిప్ ద్వారా వ్యాపారులకు ఈ షాపులను కేటాయించారు. జిల్లాలో 555 మద్యంషాపులు ఉండగా రాష్ట్ర విభజన నేపథ్యంలో భద్రాచలం డివిజన్లోని 7 షాపులు కొత్తగా చేరాయి. దాంతో వీటి సంఖ్య 562కు చేరింది. 154 షాపులకు దరఖాస్తులేవీ అందలేదు. రెండేళ్ల క్రితం జారీ చేసిన మద్యంషాపుల లెసైన్స్‌ల గడువు ఈ నెలాఖరుతో ముగుస్తుండడంతో కొత్తగా లెసైన్స్‌ల మంజూరుకు ఈ నెల 23 నుంచి 27వ తేదీ వరకూ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారులు దరఖాస్తులను స్వీకరించిన సంగతి తెలిసిందే. గతసారి 555 షాపులకు దరఖాస్తులు ఆహ్వానించగా 434 షాపులకు 4500 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ దఫా 562 షాపులకుగాను 408 షాపులకు మాత్రమే 5,957 మంది దరఖాస్తు చేసుకున్నారు. రాజమండ్రి డివిజన్లో 96 షాపులకు 1,654, కాకినాడ డివిజన్లో 149 షాపులకు 2,563, అమలాపురం డివిజన్లో 163 షాపులకు 1,740 దరఖాస్తులు అందాయి. కాకినాడ నార్త్ స్టేషన్ పరిధిలోని ఒక షాపునకు అత్యధికంగా 117 దరఖాస్తులు వచ్చాయి. రాజమండ్రి డివిజన్లో15 షాపులకు, కాకినాడ డివిజన్లో 23 షాపులకు, అమలాపురం డివిజన్లో 42 షాపులకు ఒక్కో దరఖాస్తు మాత్రమే వచ్చాయి. భద్రాచలంలోని ఏడు షాపులకు గాను రెండు షాపులకు మాత్రమే దరఖాస్తులు అందాయి. మిగిలిన 154 షాపులకు మరోమారు దరఖాస్తులు ఆహ్వానించవచ్చని వ్యాపారులు పేర్కొంటున్నారు. ఈ ఏడాది కేవలం మద్యంషాపుల దరఖాస్తుల ద్వారానే ప్రభుత్వానికి రూ. 14.89 కోట్ల ఆదాయం లభించింది. లక్కీడిప్ ద్వారా కేటాయింపు మద్యం షాపుల లెసైన్స్‌లను లక్కీడిప్ ద్వారా వ్యాపారులకు కేటాయించారు. కాకినాడ అంబేద్కర్ భవన్లో భారీ ఏర్పాట్ల మధ్య శనివారం డీఆర్ఓ బి. యాదగిరి రాజమండ్రి డివిజన్లోని షాపులకు లక్కీ డ్రా తీశారు. అలాగే కాకినాడ డివిజన్‌కు కాకినాడ ఆర్డీఓ అంబేద్కర్, అమలాపురం డివిజన్‌కు జెడ్పీ సీఈఓ భగవాన్ లక్కీడిప్ తీశారు. లక్కీ డిప్లో షాపులు దక్కించుకున్న వారికి ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ లెసైన్స్‌లు అందజేశారు. భారీ బందోబస్తు జిల్లా నలుమూలల నుంచి సుమారు ఆరు వేల మంది వ్యాపారులు, వారి అనుచరులు కాకినాడ అంబేద్కర్ భవన్‌కు చేరుకోవడంతో డీఎస్పీ రామిరెడ్డి విజయభాస్కర రెడ్డి నేతృత్వంలో సీఐలు, ఎస్సైలు, పోలీసు సిబ్బందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పాతబస్టాండు సెంటర్ నుంచి వార్ఫు రోడ్డు మీదుగా ట్రాఫిక్ మళ్లించారు. -
కర్నూలులో కొకైన్ పట్టివేత
కర్నూలు, న్యూస్‌లైన్ : ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారులు అజ్ఞాత వ్యక్తుల సమాచారంతో కర్నూలు కొత్త బస్టాండ్‌లో ముగ్గురు వ్యక్తుల నుంచి రెండు ప్యాకెట్లలో భద్రపరిచిన కొకైన్(మత్తు పదార్థం)ను స్వాధీనం చేసుకున్నారు. బుధవారం కర్నూలులో నిర్వహించిన విలేకరుల సమావేశంలో అసిస్టెంట్ కమిషనర్ హేమంత్ నాగరాజు వివరాలు వెల్లడించారు. ఆత్మకూరు డిపోకు చెందిన బస్సులో కొకైన్‌ను తరలిస్తున్నట్లు తనకు సమాచారం రావడంతో సీఐలు కృష్ణకుమార్, రాజశేఖర్ గౌడ్, పద్మావతి, ఎస్ఐలు ప్రసాదరావు, నాగమణి, రమణ తదితరులను అప్రమత్తం చేశానని తెలిపారు. వీరు కర్నూలు కొత్త బస్టాండ్ వద్ద కాపు కాసి మత్తు పదార్థాలను రవాణా చేస్తున్న కృష్ణా జిల్లా గుడ్ల వల్లేరుకు చెందిన బొల్ల శివశంకర్, జి.కొండూరు గ్రామానికి చెందిన కొర్లపాటి సుబ్బారావు, హైదరాబాద్‌లోని మణికొండకు చెందిన అనూషలను అదుపులోకి తీసుకుని, వారి నుంచి రూ.6 లక్షలు విలువ చేసే 300 గ్రాముల కొకైన్‌ను స్వాధీ నం చేసుకున్నట్లు పేర్కొన్నారు. ప్రకాశం జిల్లా అద్దంకికి చెందిన అనూష, శివశంకర్, సుబ్బారావు ముఠాగా ఏర్పడి ఆరు నెలలుగా ఈ వ్యాపారం కొనసాగిస్తున్నట్లు విచారణలో బయటపడిందన్నారు. ఈ కొకైన్‌ను విజయవాడలో కొని, బెంగళూరుకు తరలిస్తున్నట్లు తెలిసిందని చెప్పారు.