Promotions file
-
21 ఏళ్ల తర్వాత..!
నల్లగొండ : ఎంపీడీఓలకు శుభవార్త.. పదోన్నతుల కోసం ఎప్పుడెప్పుడా అని సుదీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న వారికి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు తీపికబురు అందించారు. ఎంపీడీఓల పదోన్నతుల ఫైల్‌పై సోమవారం సీఎం సంతకం చేశారు. దీంతో 21 ఏళ్ల నిరీక్షణకు తెరదించినట్టయింది. ఎంతోకాలం నుంచి ప్రమోషన్లు రాక ఎంపీడీఓలు అదే కేడర్లోనే రిటైర్డ్ అయి న వారు ఎంతో మంది ఉన్నారు. ఈ విషయమై ఎంపీడీఓలు సీఎంను కలిసి విన్నవించుకోవడంతో ఎట్టకేలకు తుది నిర్ణయం తీసుకుని పదోన్నతుల ఫైల్‌పై సంతకం చేశారు. ఎంపీడీఓలతో పాటు కింది స్థాయి కేడర్‌కు కూడా పదోన్నతులు వస్తుండడంతో వారిలో ఆనందం నెలకొంది. ఎట్టకేలకు.. ఎంపీడీఓలు 21 సంవత్సరాలుగా పదోన్నతుల కోసం ఎదురుచూస్తున్నారు. వీరి సమస్యను ఎవ రూ కూడా పట్టించుకోలేదు. అప్పుడు టీడీపీ, ఆ తర్వాత వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వాలు కూడా ఏమి చేయలేని పరిస్థితి నెలకొంది. ప్రమోషన్ల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోకపోవడం వల్లనే ఎంపీడీఓలు ఏళ్ల తరబడి అదే పోస్టులో పనిచేసి రిటైర్డ్ అయ్యారు. ఎంపీడీఓలకు ప్రమోషన్లు రా కపోవడంతో ఆ శాఖలోని కిందిస్థాయి ఉద్యోగులకు కూడా పదోన్నతులు రాలేదు. వేతనం పెరిగి నా పదోన్నతులు రాకపోవడంతో భారీ ఎత్తున నష్టపోవాల్సి వచ్చింది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా మొత్తం 54 మంది ఎంపీడీఓలు ఉన్నారు. వీరిలో సుమారుగా 20మందికి పైగా ఎంపీడీఓలు పదోన్నతులు పొందనున్నారు. డీఆర్డీఓ, జెడ్పీసీఈఓ, డిప్యూటీ సీఓ, అడిషనల్ డీఆర్డీఓలుగా వారి సీనియారిటీ బట్టి పదోన్నతులు లభిస్తాయి. కిందిస్థాయి ఉద్యోగులకూ పదోన్నతులు ఎంపీడీఓలకు పదోన్నతులు లభిస్తుండడంతో వా రి పోస్టుల్లోకి పదోన్నతులపై ఈఓపీఆర్డీ, జిల్లా పరిషత్ సూపరింటెండెంట్లు పదోన్నతులు పొం దుతారు. కాగా ఖాళీ అయిన వీరి స్థానాల్లోకి సీని యర్ అసిస్టెంట్లు, వారి స్థానాల్లోకి జూనియర్ అసిస్టెంట్లు వీరి స్థానాల్లోకి రికార్డ్ అసిస్టెంట్లు, అటెండర్లు, వాచ్మెన్లు అర్హతను బటి పదోన్నతులు పొందుతున్నారు. మొత్తం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా వివిధ కేటగిరుల్లో 150 మంది వరకు పదోన్నతులు పొందే అవకాశం ఉంది. కోర్టు కేసుల ఉపసంహరణతో.. ఎంపీడీఓల పదోన్నతుల విషయంలో కోర్టులో కేసులు పెండింగ్‌లో ఉండడంతో 21 ఏళ్లుగా ప దోన్నతులకు అవకాశం కలగలేదు. అయితే ఎంపీడీఓ కేడర్‌లో ఉమన్ వెల్ఫేర్, ఈఓఆర్డీ డైరెక్ట్ రిక్యూర్మెంట్ ద్వారా వచ్చిన వారు ఉన్నారు. ఈ మూ డు కేటగిరీల వారు ప్రమోషన్ల విషయంలో తమకే ముందు పదోన్నతులలో అవకాశాలు కల్పించా లంటే, తమకే ముందు కల్పించాలని పోటీపడి కోర్టుకు ఎక్కారు. ఈ విషయాన్ని గత ప్రభుత్వాలు పట్టించుకోలేదు. ఎట్టకేలకు ముఖ్యమంత్రి కేసీఆర్ మూడు కేటగిరీల వారిని పిలిపించి చర్చలు జరిపారు. ఒక్కొక్క కేడర్ నుంచి వచ్చిన వారికి 1ః1 పద్ధతిలో పదోన్నతులు కల్పిస్తానని చెప్పడంతో వారు సమ్మతించారు. కోర్టులో కేసులను ఉçపసంహరించుకుంటే పదోన్నతి కల్పిస్తానని చెప్పడంతో ఉద్యోగులు కేసులు ఉపసంహరించుకున్నారు. దీంతో ముఖ్యమంత్రి పదోన్నతుల ఫైల్‌పై సోమవారం సంతకం చేశారు. దీంతో 21 ఏళ్ల పాటు ఎంపీడీఓల పదోన్నతుల నిరీక్షణకు తెర పడినట్లయింది. సీఎంకు కృతజ్ఞతలు 21ఏళ్ల పాటు పదోన్నతులు లేక ఎంతో ఆందోళన చెందాం. పదోన్నతి పొందకుండానే ఉద్యోగ విరమణ పొందుతామనే బాధ కలిగేది. ఎట్టకేలకు ముఖ్య మంత్రి కేసీఆర్ స్పందించి పదోన్నతులు కల్పించినందుకు ఎంపీడీఓల సంఘం తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాం. – గోనె మోహన్‌రావు, గెజిటెడ్ అధికారుల సంఘం జిల్లా అధ్యక్షుడు -
సమయం ఒక్కరోజు మాత్రమే...
సాక్షి, మహబూబ్‌నగర్ న్యూటౌన్ : ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో వీఆర్ఏల పదోన్నతుల ప్రక్రియపై కస రత్తు ముమ్మరం చేశారు. కొద్దిరోజుల క్రితం పదో న్నతులు ఇచ్చినా అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు రావడంతో తాజాగా మరో కొత్త కోణానికి తెరతీశారు. వీఆర్ఏల తాత్కాలిక జాబితాను రూపొందించి ఒక్కరోజు సమయమిస్తూ పరిశీలన కోసం ఉమ్మడి జిల్లాలోని అన్ని మండలాలకు పంపారు. తాజాగా 436 మందితో మెరిట్ ప్రకారం ఫైనల్ సీనియారిటీ తాత్కాలిక జాబితాను సిద్ధం చేసిన అధికారులు తహసీల్దార్ల నుండి నివేదిక కోరారు. ఈనెల 21న అంటే గురువారం జాబితాను తహసీల్దార్లకు పంపి శుక్రవారమే నివేదిక పంపించాలని సూచించారు. ఒక్కరోజే సమయం ఇవ్వడంతో ఒకరు, ఇద్దరు తప్ప మిగతా వారెవరూ నివేదికను కలెక్టర్‌కు పంపించలేదు. భూప్రక్షాళన కార్యక్రమంలో బిజీగా ఉన్న తహసీల్దార్లు పరిశీలన నివేదికను ఒక్కరోజులో కావాలని ఆదేశించడంపై పెదవి విరుస్తున్నారు. జిల్లా కలెక్టర్ రొనాల్డ్‌రోస్ ఢిల్లీ నుండి రాకముందే ఈ ప్రక్రియను ముగించాలన్న ఉద్దేశంతో ఇలా చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాగా, ఈ నెల 13న ఉమ్మడి జిల్లాలో 80 మంది వీఆర్ఏలకు వీఆర్వోలుగా పదోన్నతులు పలు అక్రమాలు చోటు చేసుకున్నాయని ‘సాక్షి’ వరుస కథనాలను ప్రచురించింది. దీంతో స్పందించిన కలెక్టర్ జాబితా పునఃపరిశీలనకు ఆదేశించా రు. జాబితాను మూడు రోజులు పరిశీలించగా అక్రమాలు వాస్తవమని తేలడంతో తాజాగా మరోసారి తాత్కాలిక జాబితా రూపొందించారు. ఆయన అనుకున్నదే చేస్తారా.. కలెక్టరేట్లో తనదైన ముద్ర వేసుకున్న కీలక అధి కారి తాను చెప్పిందే వేదంగా ఈ తతంగాన్ని నడుపుతున్నట్లు ఆరోపణలున్నాయి. అక్రమాలు బయటపడడంతో తన చేతికి మట్టి అంటకుండా కింది స్థాయి సిబ్బందిపై నెడుతున్నట్లు సమాచారం. తప్పుడు వివరాలు పొందుపరిచి ఏకంగా జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా పదోన్నతి ఉత్తర్వులు ఇప్పించారంటే ఆయన పనితీరుపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు జిల్లాలో కలెక్టర్ లేని సమయంలో పరిశీలన నివేదికల కోసం ఆదేశించడాన్ని పలువురు తప్పు పడుతున్నారు. తాను అనుకున్నదే చేసి తీరాలని, తనను వ్య తిరేకిస్తున్న వారిపై గుర్రుగా ఉన్నట్లు సమాచారం. 15రోజుల సమయం ఇవ్వాలి వీఆర్ఏల పదోన్నతుల్లో మరోసారి తప్పిదాలు చేస్తే ఆందోళనలు తప్పవని డైరెక్ట్ రిక్రూట్ వీఆర్ఏల సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులుగౌడ్ తెలిపారు. కలెక్టర్ ఆదేశాల మేరకు తాత్కాలిక జాబితాను రూపొందించిన కలెక్టరేట్ అధికారులు పరిశీలన నివేదిక కోసం తహసీల్దార్ కార్యాలయ అధికారులకు ఒక్క రోజు సమయమివ్వడం సరికాదని పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ చొరవతో పదోన్నతుల జాబితాపై పునపరిశీలన జరిగిందని, అక్రమాలు జరిగాయని స్ఫష్టం కావడంతో మరోసారి తాత్కాలిక జాబితాను తయారు చేశారని పేర్కొన్నారు. ఈ మేరకు పరిశీలనకు పదిహేను రోజులు సమయం ఇవ్వాలని కోరుతూ శుక్రవారం డీఆర్వో వెంకటేశ్వర్లుకు వినతిపత్రం సమర్పించారు. అలాగే, ఈ నెల 21 నాటికి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఐదేళ్ల సీనియారిటీ, ఇంటర్ అర్హత కలిగిన వీఆర్ఏలందరినీ తాత్కాలిక జాబితాలో చేర్చాలని, ఆ జాబితాను నోటీసు బోర్డుపై పబ్లిష్ చేయాలని, అభ్యంతరాలు స్వీకరించాలని డిమాండ్ చేశారు. -
ఎక్సైజ్ పదోన్నతుల ఫైలుకు కదలిక!
‘సాక్షి’ కథనానికి స్పందన సాక్షి, హైదరాబాద్: ఎక్సైజ్ సబ్ఇన్స్పెక్టర్ల(ఎస్ఐ) పదోన్నతుల ఫైలుకు ఎట్టకేలకు కదలిక వచ్చింది. ‘కావాలనే పదోన్నతుల్లో జాప్యం’ శీర్షికతో గురువారం ‘సాక్షి’లో ప్రచురితమైన వార్తకు ఎక్సైజ్ కమిషనర్ స్పందించారు. పదోన్నతుల ఫైలుపై ఆరా తీశారు. ఎస్ఐ నుంచి సీఐల పదోన్నతుల ప్రతిపాదనలను పంపాలని కమిషనర్ కార్యాలయం ఎల్ సెక్షన్ అధికారులు అక్టోబర్ 24న వివిధ జిల్లాల డి ప్యూటీ కమిషనర్లను కోరారు. అయితే, ఒక్క విశాఖ పట్టణం నుంచి మాత్రమే ప్రతిపాదన వచ్చింది. దీంతో ఈ ప్రక్రియ అటకెక్కిందని ఎల్ సెక్షన్ అధికారులు కమిషనర్‌కు తెలిపారు. మిగిలిన జిల్లాల వారు పదోన్నతులపై స్పందించలేదని పేర్కొన్నారు. దీంతో మిగిలిన జిల్లాల నుంచి కూడా పదోన్నతులపై ప్రతిపాదనలు తెప్పించి ప్రక్రియ పూర్తి చేయాలని కమిషనర్ తాజాగా ఆదేశించినట్టు తెలిసింది.