ఎక్సైజ్ పదోన్నతుల ఫైలుకు కదలిక! | Excise SI Promotions file moves ahead by effect of Sakshi news | Sakshi
Sakshi News home page

ఎక్సైజ్ పదోన్నతుల ఫైలుకు కదలిక!

Published Fri, Nov 15 2013 4:09 AM | Last Updated on Sat, Sep 2 2017 12:36 AM

Excise SI Promotions file moves ahead by effect of Sakshi news

 ‘సాక్షి’ కథనానికి స్పందన
 సాక్షి, హైదరాబాద్: ఎక్సైజ్ సబ్‌ఇన్‌స్పెక్టర్ల(ఎస్‌ఐ) పదోన్నతుల ఫైలుకు ఎట్టకేలకు కదలిక వచ్చింది. ‘కావాలనే పదోన్నతుల్లో జాప్యం’ శీర్షికతో గురువారం ‘సాక్షి’లో ప్రచురితమైన వార్తకు ఎక్సైజ్ కమిషనర్ స్పందించారు. పదోన్నతుల ఫైలుపై ఆరా తీశారు. ఎస్‌ఐ నుంచి సీఐల పదోన్నతుల ప్రతిపాదనలను పంపాలని కమిషనర్ కార్యాలయం ఎల్ సెక్షన్ అధికారులు అక్టోబర్ 24న వివిధ జిల్లాల డి ప్యూటీ కమిషనర్లను కోరారు. అయితే, ఒక్క విశాఖ పట్టణం నుంచి మాత్రమే ప్రతిపాదన వచ్చింది. దీంతో ఈ ప్రక్రియ అటకెక్కిందని ఎల్ సెక్షన్ అధికారులు కమిషనర్‌కు తెలిపారు. మిగిలిన జిల్లాల వారు పదోన్నతులపై స్పందించలేదని పేర్కొన్నారు. దీంతో మిగిలిన జిల్లాల నుంచి కూడా పదోన్నతులపై ప్రతిపాదనలు తెప్పించి ప్రక్రియ పూర్తి చేయాలని కమిషనర్ తాజాగా ఆదేశించినట్టు తెలిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement