Excise commissioner
-
కష్టాలపై ‘నాగా’స్త్రం
దేశ వ్యాప్తంగా వివిధ హోదాల్లో స్థిరపడి పలువురికి ఆదర్శంగా నిలిచిన గిరిజన ముద్దుబిడ్డలను ఇటీవల మహిళా శిరోమణి అవార్డుతో ఇంటర్నేషనల్ హెల్త్ కేర్ ఆర్గనైజేషన్ సన్మానించింది. వీరిలో నాగలక్ష్మి ఒకరు. ఆమెతో పాటు జిల్లాకు చెందిన పలువురు గిరిజన ముద్దుబిడ్డ లను అఖిల భారత బంజారా సేవాసంఘ్ ఆదివారం సన్మానించనుంది. జిల్లా గర్వించదగిన మహిళల్లో ఒకరైన సన్మాన గ్రహీత నాగలక్ష్మి ఆదర్శ జీవిత విశేషాలు ఆమె మాటల్లోనే.. సాక్షి, అనంతపురం: మాది పెనుకొండ మండలం అడదాకులపల్లి తండా. నాన్న రామానాయక్, తల్లి సక్కుబాయి. మేము ముగ్గురం సంతానం. అందరం ఆడపిల్లలమే. ఎలాంటి ఆస్తిపాస్తులు లేకపోవడంతో వ్యవసాయ కూలీలుగా అమ్మ, నాన్న కష్టపడి కుటుంబాన్ని పోషిస్తూ వచ్చారు. కూలి పనులు లేనప్పుడు కొండలపైకి వెళ్లి చీపురు పుల్లలు తీసుకొచ్చి వాటిని కట్టకట్టి అమ్ముకుని జీవించేవాళ్లం. వారిలా మేము కష్టపడకూడదని అమ్మ, నాన్న భావించి.. మమ్మల్ని బాగా చదివించాలని అనుకున్నారు. ఏఐఐసీ చైర్పర్సన్ రోజా చేతుల మీదుగా సన్మానం అందుకుంటున్న నాగలక్ష్మి (ఫైల్) అక్కడే ఉంటే ఆ పరిస్థితులు మమ్మల్ని కూలీలుగా ఎక్కడ మారుస్తాయోనని భయపడి అమ్మ మమ్మల్ని పిలుచుకుని ఒంటరిగా అనంతపురానికి చేరుకుంది. ఇక్కడ నాలుగిళ్లలో పాచిపనులు చేస్తూ జీవనం మొదలు పెట్టాం. ఆ తర్వాత ఇంటిలో గ్రైండర్ ఏర్పాటు చేసుకుని, అమ్మ స్వశక్తితో మమ్మల్ని చదివించసాగింది. మా ఉన్నతి కోసం అమ్మ పడిన కష్టం నేనెన్నటికీ మరువలేను. కూలి పనులు చేశా.. మా అక్కచెల్లెళ్లలో నేనే పెద్దదాన్ని. మా అమ్మ కష్టమేమిటో చాలా దగ్గరగా చూసిన దాన్ని కూడా నేనే. ఇంటికి ఆసరాగా ఉంటుందని అమ్మతో పాటు కూలీ పనులకు నేను కూడా వెళ్లేదాన్ని. అయితే చదువును మాత్రం నిర్లక్ష్యం చేయలేదు. ఏ మాత్రం తీరిక దొరికినా పుస్తకాలు ముందేసుకుని కూర్చొనేదాన్ని. అనంతపురానికి వచ్చేసిన తర్వాత ఇక్కడి తొలుత అశోక్‌నగర్‌లోని నీలి షికారీ పాఠశాలలో, తర్వాత గిల్డ్ ఆఫ్ సర్వీసు పాఠశాలల్లో 7వ తరగతి వరకు చదువుకున్నా. ఇల్లు జరగడం కష్టంగా ఉండడం గమనించి, మదనపల్లిలోని సీఎస్ఐ మిషనరీ వారు అక్కడి హాస్టల్లో సీటు ఇచ్చారు. అక్కడే ఉంటూ పదో తరగతి పూర్తి చేశాను. తిరిగి ఇంటర్, డిగ్రీ ఇక్కడే అనంతపురంలోనే పూర్తి చేశాను. ఎంఏ., ఎంఫిల్‌ను సెంట్రల్ యూనివర్సిటీలో పూర్తి చేశా. జీవిత గమ్యాన్ని మార్చిన చదువు చిన్నప్పటి నుంచి తండాలో పెరగడం వల్ల చాలా కష్టాలు, ఇబ్బందులు చూశా. నిరక్షరాస్యత, తాగుడు వల్ల ఎంతో మంది జీవితాలు నా కళ్ల ముందే నాశనమైపోతుంటే ఏడుపొచ్చేది. చిరుప్రాయంలోనే భర్తలను కోల్పోయి వితంతువులుగా మారిన తోటి ఈడువారిని చూసినప్పుడల్లా కన్నీళ్లు ఆగేవి కావు. ఈ సమస్యలకు పరిష్కారం చదువు ఒక్కటేనని భావించా. అలా నాన్న ప్రోత్సాహం, అమ్మ కష్టంతో ఉన్నత చదువులు అభ్యసించగలిగాను. ఆడపిల్ల అబల కాదు సబల అని నిరూపించే విషయంలో నా వరకు నా జీవితమే పెద్ద పాఠమైంది. అనుకోని విధంగా మా నాన్న చనిపోయిన తర్వాత నా చెల్లెళ్లు జీవితంలో స్థిరపడేలా చేయగలిగాను. ఉద్యోగానికీ పోరాటమే.. ఉన్నత చదువులు ముగిసిన తర్వాత రెండేళ్ల పాటు మహిళా యూనివర్సిటీలో లెక్చరర్‌గా, అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేశాను. అక్కడే ఉంటే నేను నిర్దేశించుకున్న లక్ష్యానికి చేరువ కాలేనని అనుకున్నా. దీంతో గ్రూప్స్‌కు సిద్ధమయ్యా. తొలిసారే 2001 ఆఖరులో జిల్లా ఉపాధి కల్పనాధికారిగా అవకాశం వచ్చింది. అయితే ఓ ఓసీ అమ్మాయి అందజేసిన తప్పుడు సరి్టఫికెట్ కారణంగా ఆ ఉద్యోగం కాస్తా నాకు దక్కకుండా పోయింది. దీంతో న్యాయస్థానాన్ని ఆశ్రయించాల్సి వచ్చింది. రెండేళ్ల పాటు విచారణ అనంతరం 2004లో నాకు అనుకూలంగా కోర్టు తీర్పునివ్వడంతో హైదరాబాద్‌లో ఉపాధి కల్పనాధికారిగా బాధ్యతలు తీసుకున్నా. అక్కడ ఓ రెన్నెల్ల పాటు పనిచేశా. ప్రొహిబిషన్ ఎక్సైజ్ జాయింట్ కమిషనర్ నాగలక్ష్మి నేను చేస్తున్న పని నాకు తృప్తినివ్వలేదు. ఆ సమయంలోనే గ్రూప్స్ పోటీ పరీక్షల్లో విజయం సాధించి, శ్రీకాకుళంలో ప్రొహిబిషన్ ఎక్సైజ్ శాఖ అసిస్టెంట్ సూపరింటెండెంట్‌గా విధుల్లో చేరా. 2009లో ఇదే శాఖలో విజయనగరం సూపరింటెండెంట్‌గా పనిచేశాను. 2012 నుంచి శ్రీకాకుళం, కడప జిల్లాల్లో డిప్యూటీ కమిషనర్‌గా పనిచేశాను. ఈ ఏడాది జాయింట్ కమిషనర్‌గా పదోన్నతి పొందాను. నేను చెప్పేది ఒక్కటే ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుని శ్రమిస్తే దాన్ని సులువుగా సాధించవచ్చు. ఇందుకు నేనే నిదర్శనం. నేడు సత్కారం దేశవ్యాప్తంగా వివిధ హోదాలలో స్థిరపడిన గిరిజన ముద్దు బిడ్డలను ‘ఆల్ ఇండియా బంజరా సేవా సంఘ్’ అనంతపురం జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఆదివారం సన్మానించనున్నారు. స్థానిక రెండో రోడ్డులోని బంజారా భవన్లో మధ్యాహ్నం 3 గంటలకు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు బాలానాయక్, రంగ్లానాయక్, అశ్వత్థనాయక్, శేఖర్ నాయక్ తెలిపారు. ఈ సత్కారాన్ని అందుకునేందుకు విజయవాడ నుంచి నాగలక్ష్మితో పాటు వేర్వేరు ప్రాంతాల్లో వివిధ హోదాల్లో స్థిరపడిన గిరిజన ఉద్యోగులు 35 మంది రానున్నారు. నా జీవితమే ఓ పాఠం చిన్నప్పటి నుంచి తండాలో పెరగడం వల్ల చాలా కష్టాలు, ఇబ్బందులు చూశా. నిరక్షరాస్యత, తాగుడు వల్ల ఎంతో మంది జీవితాలు నా కళ్ల ముందే నాశనమైపోతుంటే ఏడుపొచ్చేది. చిరుప్రాయంలోనే భర్తను కోల్పోయి వితంతువులుగా మారిన తోటి ఈడువారిని చూసినప్పుడల్లా కన్నీళ్లు ఆగేవి కావు. ఈ సమస్యలకు పరిష్కారం చదువు ఒక్కటేనని భావించా. అలా నాన్న ప్రోత్సాహం, అమ్మ కష్టంతో ఉన్నత చదువులు అభ్యసించగలిగాను. ఆడపిల్ల అబల కాదు సబల అని నిరూపించే విషయంలో నా వరకు నా జీవితమే పెద్ద పాఠమైంది. – నాగలక్ష్మి.టి.రమావత్, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ జాయింట్ కమిషనర్ -
మద్యం వ్యాపారులకు షాక్
సాక్షి, న్యూఢిల్లీ : కల్తీ మద్యానికి చెక్ పెట్టేందుకు ఢిల్లీ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు మద్యం వ్యాపారులకు షాక్ ఇస్తున్నాయి. ఎనిమిది రోజులకు మించి పాతబడిన మద్యం నిల్వలను ఆగస్ట్ 31 నుంచి ధ్వంసం చేయాలని ఢిల్లీ సర్కార్ స్పష్టం చేసింది. కస్టమర్లకు నాణ్యతతో కూడిన మద్యాన్ని అందుబాటులోకి తేవడంతో పాటు కల్తీ మద్యం, పాత, కొత్త ఆల్కహాల్‌ను మిక్స్ చేసే వ్యాపారుల ఆగడాలకు కళ్లెం వేసేందుకు ఎక్సైజ్ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. మద్యం వ్యాపారులు తరచూ గడువు ముగిసే బీర్లను పెద్దసంఖ్యలో తక్కువ ధరలకు కొనుగోలు చేసి వాటిని కస్టమర్లకు అందిస్తున్నారు. తొలుత కొనుగోలు చేసిన మద్యం నిల్వలను ముందుగా విక్రయించాలని బీర్, వైన్, షాంపేన్ వంటివి మూడు రోజుల వరకే కౌంటర్లలో ఉంచాలని ఎక్సైజ్ శాఖ స్పష్టం చేసింది. రూ 1500 ఖరీదు కలిగిన విస్కీ, జిన్, వోడ్కా, రమ్, స్కాచ్‌లను ఐదు రోజుల్లోగా విక్రయించాలని, రూ 1500 నుంచి రూ 6000 విలువైన మద్యాన్ని ఎనిమిది రోజుల్లోగా అమ్మకాలు జరిపి మిగిలిన నిల్వలను ధ్వంసం చేయాలని పేర్కొంది. ఆయా గడువులోగా స్టాక్స్ మిగిలితే వాటిని అమ్మినట్టుగానే భావించి కౌంటర్ల నుంచి పక్కనపెట్టాలని తెలిపింది. ఈ నిల్వలను వారం రోజుల్లో నిర్వీర్యం చేయాలని పేర్కొంటూఈ ఉత్తర్వులను పాటించని బార్లు, పబ్‌లు, రెస్టారెంట్లు, హోటళ్లు, డిస్కోథెక్‌ల లైసెన్లను రద్దు చేసేందుకూ ప్రభుత్వం వెనుకాడబోదని ఢిల్లీ ఎక్సైజ్ శాఖ అసిస్టెంట్ కమిషనర్ అజయ్ కుమార్ గంభీర్ స్పష్టం చేశారు. వినియోగదారుల ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇస్తామని ఆయన పేర్కొన్నారు. మరోవైపు ప్రభుత్వ నిర్ణయంపై పబ్‌లు, హోటల్స్, బార్ యజమానులు భగ్గుమంటున్నారు. ఈ నిర్ణయంతో అవినీతి మరింత పెరుగుతుందని, మద్యం కల్తీని అరికట్టాలంటే ఎక్సైజ్ శాఖ తమ అవుట్లెట్లను తనిఖీ చేయవచ్చని ఇలా తమను టార్గెట్ చేయడం సరికాదని ఆర్ధర్ 2 పబ్ యజమాని సువీత్ కార్లా ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్ణయం తమ వ్యాపారాన్ని దెబ్బతీస్తుందని అన్నారు. ప్రీమియం బ్రాండ్స్ వ్యాపారంపై ఈ నిర్ణయం తీవ్ర ప్రభావం చూపుతుందని మద్యం వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు కస్టమర్లు ఢిల్లీ సర్కార్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు. ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకుందని, నాణ్యమైన మద్యం తమకు అందుబాటులోకి వచ్చేలా ఈ నిర్ణయం వెసులుబాటు కల్పిస్తుందని థామస్ కుక్‌లో పనిచేసే పర్వ్ పేర్కొన్నారు. కల్తీ మద్యం నివారించకపోతే పలు అనారోగ్య సమస్యలు వెంటాడుతాయని సీనియర్ వైద్యులు విక్రంజిత్ సింగ్ అన్నారు. బార్లలో తరచూ పాత, కొత్త మద్యాలను మిక్స్ చేసి కస్టమర్లకు ఇవ్వడం తగ్గుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. కల్తీ మద్యం పలు అనారోగ్య సమస్యలకు దారితీస్తోందని చెప్పారు. -
తొలి ఏడాదిలోనే 20% మద్యం షాపులు తగ్గింపు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో దశల వారీ మద్యపాన నిషేధానికి ప్రభుత్వం తొలి అడుగు వేసింది. ఈ ఏడాది (2019–20)కి మద్యం పాలసీని ప్రకటించింది. ఈ మేరకు విధివిధానాలు ఖరారు చేస్తూ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డి.సాంబశివరావు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించిన నవరత్నాల్లో భాగంగా.. దశలవారీ మద్యపాన నిషేధానికి అనుగుణంగా.. అక్టోబర్ 1 నుంచి ప్రభుత్వ మద్యం దుకాణాలు నడవనున్నాయి. ఇప్పటివరకు రాష్ట్రంలో 4,380 మద్యం షాపులుండగా తొలి ఏడాదే వీటిలో 880 తగ్గించి 3,500కి కుదించింది. వీటిని ప్రభుత్వమే నిర్వహించనుంది. షాపులను ఆంధ్రప్రదేశ్ స్టేట్ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీఎస్‌బీసీఎల్) ఏర్పాటు చేయనుంది. వీటికి ఏపీఎస్‌బీసీఎల్ రిటైల్ ఔట్‌లెట్‌గా నామకరణం చేస్తారు. వీటిపై షాపు నెంబర్ కూడా ఉంటుంది. జిల్లాలవారీగా షాపుల సంఖ్యపై ఎక్సైజ్ కమిషనర్ గెజిట్ నోటిఫికేషన్ ఇస్తారు. షాపుల ఏర్పాటుపై విధివిధానాలివే.. - మద్యం షాపులను ఎక్సైజ్ చట్టం–1968 రూల్స్ ప్రకారం ఏర్పాటు చేయాలి. ఒక్కో షాపు 150 చదరపు అడుగుల నుంచి 300 చదరపు అడుగుల లోపు ఉండాలి. పక్కా నిర్మాణంతో రోడ్డుకు అభిముఖంగా, ఒకే డోర్‌తో నిర్మించాలి. మొదటి అంతస్తులోనే షాపు ఉండాలి. ఎమ్మార్పీ ధరలను సూచించే బోర్డును ఖచ్చితంగా ఏర్పాటు చేయాలి. - మద్యం షాపులో సీలింగ్ ఫ్యాన్లు, టేబుళ్లు, కుర్చీలు, ఐరన్ ర్యాక్‌లు, ఎలక్ట్రికల్ సబ్ మీటర్, దొంగ నోట్లను గుర్తించే డిటెక్టర్, సీసీ కెమెరాలు, అవసరమైన సాఫ్ట్వేర్ ఉండాలి. - ఏడాదికి మాత్రమే షాపు అద్దె అగ్రిమెంట్ చేసుకోవాలి. ఆ తర్వాత టైమ్ టు టైమ్ పొడిగించుకోవాలి. - ప్రతి మద్యం షాపులో అర్బన్ ప్రాంతాల్లో ఐదుగురు, గ్రామీణ ప్రాంతాల్లో నలుగురు ఉంటారు. అర్బన్ ప్రాంతాల్లో ప్రతి మద్యం షాపులో ఒక సూపర్వైజర్, ముగ్గురు సేల్స్‌మెన్, ఒక వాచ్మెన్, గ్రామీణ ప్రాంతాల్లోని షాపులో సూపర్వైజర్, ఇద్దరు సేల్స్‌మెన్, ఒక వాచ్మెన్ ఉంటారు. - షాపు సూపర్వైజర్కు వయోపరిమితి 21 ఏళ్ల నుంచి 40 ఏళ్ల వరకు ఉండి, మద్యం షాపు ఎక్కడ ఏర్పాటవుతుందో ఆ మండలానికి చెందినవారై ఉండాలి. విద్యార్హత డిగ్రీ. బీకాం ఉత్తీర్ణులకు ప్రాధాన్యత ఉంటుంది. షాపు సేల్స్‌మెన్‌కు ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణతతోపాటు స్థానికులై ఉండాలి. సూపర్వైజర్కు నెలకు రూ.17,500 జీతంతోపాటు పీఎఫ్, ఈఎస్ఐ, సేల్స్‌మెన్‌కు నెలకు రూ.15 వేల జీతంతోపాటు పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాలు కల్పిస్తారు. కాంట్రాక్టు విధానంలో సిబ్బంది ఎంపిక ప్రభుత్వ మద్యం దుకాణాల్లో మొత్తం 15 వేల మందికి ఉద్యోగాలు దక్కనున్నాయి. నోటిఫికేషన్ జారీ చేసిన తర్వాత అర్హులైనవారు ఆన్లైన్లో ఏపీఎస్‌బీసీఎల్ వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఎంపికైనవారికి కాంట్రాక్టు విధానంలో ఏడాది పాటు మద్యం షాపులో పనిచేసే అవకాశం ఉంటుంది. సిబ్బందికి వీక్లీ ఆఫ్‌ను ఆయా డిపో మేనేజర్ అనుమతితో ఇస్తారు. సూపర్వైజర్ లేదా సేల్స్‌మెన్ సేవలు సంతృప్తిగా ఉంటే వారిని రెండో ఏడాది కొనసాగించవచ్చు. రెండో ఏడాదిలో ఓ నెల రెమ్యునరేషన్‌ను బోనస్‌గా ఇస్తారు. మద్యం షాపులో రోజువారీ లావాదేవీలు, స్టాకు రిజిస్టర్ల నిర్వహణ, డిపో మేనేజర్ సూచించే పనులను సూపర్వైజర్ నిర్వహించాలి. వినియోగదారుల బిల్లింగ్, మద్యం బాటిళ్ల లోడింగ్, సూపర్వైజర్ సూచించే బాధ్యతలను సేల్స్‌మెన్ నిర్వహించాల్సి ఉంటుంది. మద్యం షాపును ఉదయం 10 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు నడపాలి. మద్యం షాపులో ఏదైనా నష్టం సంభవిస్తే సిబ్బందిదే పూర్తి బాధ్యత. జిల్లాల సంయుక్త కలెక్టర్ల ఆధ్వర్యంలోని జిల్లా స్థాయి కమిటీలు మద్యం షాపుల ఏర్పాటు, రవాణా, సిబ్బంది ఎంపికలను పర్యవేక్షిస్తాయి. -
పల్లెల్లో ఈతవనాలకు పెద్దపీట
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఈత వనాల పెంపకానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. గత ఏడాది మార్చిలో జరిగిన శాసనసభ సమావేశాల్లో సీఎం కేసీఆర్ హామీ ఇచ్చిన విధంగా ప్రతి గ్రామంలో ఈత వనాలు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఉపాధి హామీ పథకం కింద ప్రత్యేక నర్సరీ లను ఏర్పాటు చేసి ఈత మొక్కలు పెంచాలని, రానున్న వర్షాకాలంలో హరితహారంలో భాగంగా వీటిని పెంచేందుకు స్థలాలు గుర్తించాలని కలెక్టర్లకు ఎక్సైజ్ శాఖ కమిషనర్ సోమేశ్‌కుమార్ ఇటీవల లేఖ రాశారు. వీలున్నంత త్వరగా ఏర్పాట్లు పూర్తి చేయాలని ఈ లేఖలో ఆయన ఆదేశించారు. వనాల పెంపకం... వారి సంక్షేమం కోసమే.. గీత కార్మికుల సంక్షేమంలో భాగంగా ఈత వనాల పెంపకాన్ని ప్రభుత్వం తొలి ప్రాధాన్యంగా ఎంచుకున్నట్టు అర్థమవుతోంది. అందులో భాగంగానే ఎక్సైజ్ కమిషనర్ జిల్లా కలెక్టర్లకు రాసిన లేఖలో ప్రతి గ్రామంలో ఖచ్చితంగా 3 వేల నుంచి 6 వేల ఈత మొక్క లు నాటేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఆ గ్రామంలో గీతకార్మికులున్నారా లేదా అనే దానితో సంబంధం లేకుండా చెట్లు పెంచాలని, గీత కార్మికులు ఎక్కువగా ఉండే గ్రామాల్లో వారి అవసరాలకు అనుగుణంగా ఈ సంఖ్యను పెంచాలని తెలిపారు. ఈత వనాల పెంపకానికి గ్రామీణాభివృద్ధి, ఎక్సైజ్ శాఖ, ఉద్యాన, రెవెన్యూ, అటవీ అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించింది. -
పర్మిట్ రూముల్లో తనిఖీలు చేయండి
సాక్షి, హైదరాబాద్: జీహెచ్ఎంసీ పరిధిలోని ఏ4 మద్యంషాపుల పక్కన నిబంధనలకు విరుద్ధంగా ఆహార పదార్థాలను సరఫరా చేస్తున్న పర్మిట్ రూములను తనిఖీ చేయాలని ఎక్సైజ్ కమిషనర్‌ను హైకోర్టు ఆదేశించింది. మద్యం షాపుల యజమానులు తమ షాపుల పక్కనే పర్మిట్ రూమ్‌లు ఏర్పాట్లు చేసి అందులో ఆహార పదార్థాలను సరఫరా చేస్తున్నా అధికారులు వారిపై చర్యలు తీసుకోవడం లేదంటూ హైదరాబాద్‌కు చెందిన ఎస్.రాములు నాయక్ దాఖలు చేసిన పిల్‌పై హైకోర్టు ఇటీవల విచారణ జరిపింది. ఏయే ప్రాంతాల్లోని పర్మిట్ రూమ్‌లలో తనిఖీలు చేయాలో అధికారుల నిర్ణయానికి వదిలేసింది. ఒక్కో పర్మిట్ రూమ్ ఎంత ఉంది? నిబంధనల మేరకే ఆ పర్మిట్ రూమ్ సైజు ఉందా? నిబంధనలకు లోబడే పర్మిట్ రూమ్‌ను నిర్వహిస్తున్నారా? ఆహార పదార్థాల సరఫరా నిబంధనల్లో ఏమైనా మినహాయింపులు ఉన్నాయా? తదితర వివరాలతో నివేదికను తమ ముందుంచాలని కమిషనర్‌ను ఆదేశించింది. విచారణను జనవరి 1కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ తొట్టతిల్ బి.రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్ల ధర్మాసనం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ, పర్మిట్ రూమ్‌ల వల్ల ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్‌కు ఇబ్బంది కలుగుతోందని తెలిపారు. పర్మిట్ రూమ్‌లలో ఆహార పదార్థాల సరఫరాకు నిబంధనలు అంగీకరించవన్నారు. -
'మద్యం షాపుల్లో ఏం జరుగుతుందో మాకు తెలుసు'
సాక్షి, అమరావతి : ‘‘మద్యం షాపుల్లో ఏం జరుగుతుందో మాకు అంతా తెలుసు. ఓపెన్ డ్రింకింగ్.. బ్రాండ్ మిక్సింగ్.. మాకు తెలియదనుకుంటున్నారా? పోలీసులను వచ్చి కలవడం కర్టసీ. ఇప్పటివరకు మామూళ్లు ఎలా ఇచ్చారో అలాగే నడవాలి. అది సిస్టం. కుదరదంటే రోజూ మా వెహికల్ మీ మద్యం దుకాణం ముందే ఉంటుంది. చట్టం ప్రకారం పోతాం.. ఆ తర్వాత మీ ఇష్టం..’’ అనంతపురం జిల్లాలో ఓ సీఐ మద్యం మామూళ్ల కోసం బరితెగించి చేసిన వ్యాఖ్యలివి. అక్కడి మద్యం వ్యాపారులకు, సీఐకి మధ్య జరిగిన సంభాషణ ఇప్పుడు కలకలం రేపుతోంది. మద్యం అమ్మకాల్లో అక్రమాలు, ఉల్లంఘనలను నియంత్రించాల్సిన పోలీస్, ఎక్సైజ్ మామూళ్ల కోసం సిండికేట్లకు కొమ్ము కాస్తున్నారు. తమ ప్రాంతాల్లో మద్యం షాపులు వద్దన్న స్థానికులను బెదిరిస్తూ.. మద్యం వ్యాపారానికి రక్షణ కవచంలా నిలుస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నిడమర్రు మండలం పత్తేపురం గ్రామంలో మద్యం దుకాణాన్ని నిరసిస్తూ సాగిన ఉద్యమంలో పాల్గొని గుండెపోటుతో ముదునూరి సుబ్బమ్మ అనే మహిళ మరణించినా.. పోలీసుల సహకారంతో గ్రామంలో మద్యం షాపు ఏర్పాటుకు ఇంకా ప్రయత్నించడమే ఇందుకు చక్కటి ఉదాహరణ. వేళాపాళా లేని మద్యం అమ్మకాలు, బెల్టు షాపులు, ఎమ్మార్పీ ఉల్లంఘనలకు గాను మద్యం సిండికేట్లు ఎక్సైజ్ అధికారులకు, పోలీసులకు ఠంఛనుగా నెలవారీ మామూళ్లు ముట్టజెప్పేవారు. ఎక్సైజ్ కమిషనర్‌గా లక్ష్మీ నరసింహం బాధ్యతలు చేపట్టిన వెంటనే మద్యం ఎమ్మార్పీ ఉల్లంఘనలపై ఉక్కుపాదం మోపారు. అప్పటివరకూ నెలకు రూ.లక్షల్లో ముడుపులు అందుకుంటున్న కొందరు ఎక్సైజ్ అధికారులపై సస్పెన్షన్ వేటు వేశారు. కమిషనర్ వ్యవహార శైలితో ఎక్సైజ్ అధికారుల తీరులో కొంత మార్పు వచ్చింది. కానీ, పోలీసులు మాత్రం సిండికేట్లకు ఇతోధిక సహకారం అందిస్తున్నారు. దీంతో రాష్ట్రంలో మద్యం అమ్మకాలు అడ్డూ, అదుపులేకుండా సాగుతున్నాయి. మామూళ్ల కోసం పోలీసులు సాగిస్తున్న దందాపై ఎక్సైజ్ కమిషనర్ లక్ష్మీనరసింహం డీజీపీ సాంబశివరావుకు కొద్దిరోజుల క్రితం లేఖ రాశారు కూడా. మద్యం సిండికేట్లతో జత కట్టిన పోలీసులను కట్టడి చేయాలని ఆ లేఖలో కోరారు. అయినా పరిస్థితిలో మార్పులేకపోగా.. పోలీసుల అండతో సిండికేట్లు రెచ్చిపోతున్నారు. చివరకు బార్ల నిర్వాహకులు పదుల సంఖ్యలో విచ్చలవిడిగా బెల్టు షాపులు నడుపుతున్నారు. విజయవాడ శివారు ప్రాంతంలో ఓ బార్ యజమాని స్థానిక పోలీసు అధికారి సహకారంతో ఏకంగా పది బెల్టు షాపులు నడుపుతున్నారంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో మద్యం సిండికేట్ల నుంచి మామూళ్ల కోసం అనంతపురం టౌన్‌లోని ఓ సీఐ మద్యం సిండికేట్ నేతకు ఫోన్‌చేసి బెదిరించడం ఇప్పుడు వైరల్‌గా మారింది. మామూళ్లు ఇవ్వకుంటే ప్రతిరోజూ మద్యం షాపు ఎదుట తన వాహనం పెడతానని, వ్యాపారం ఎలా చేస్తారో.. చూస్తానని సదరు సీఐ హెచ్చరించడం గమనార్హం. ఈ తరహా హెచ్చరికల కారణంగానే సిండికేట్లు మద్యం బాటిల్‌పై రూ.20 నుంచి రూ.30 వరకు అదనంగా పెంచి అమ్ముతున్నారు. పర్మిట్ రూమ్‌లతో అమ్మకాలు, ఘర్షణలు వృద్ధి రాష్ట్రవ్యాప్తంగా 4,380 మద్యం షాపులకు అనుబంధంగా పర్మిట్ రూమ్‌లు ఏర్పాటుచేశారు. ఈ పర్మిట్ రూమ్లవల్ల మద్యం అమ్మకాలు గణనీయంగా పెరిగాయి. నిబంధనల ప్రకారం వీటిని ఏర్పాటు చేయకుండా మినీ బార్లులా ఏర్పాటుచేయడంతో నవంబరు నెలలో రూ.1,400 కోట్ల అమ్మకాలను దాటిపోయాయి. మరోవైపు.. పర్మిట్ రూమ్‌లలో ఘర్షణలూ పెరుగుతున్నాయి. ఒక్క ప్రకాశం జిల్లాలోనే నవంబరులోనే పర్మిట్ రూమ్‌లలో మద్యం సేవించి ఘర్షణలు చోటుచేసుకున్న సంఘటనలు పదికి పైగా జరిగాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. నెలనెలా రూ.87.60 కోట్ల ముడుపులు ఎమ్మార్పీ ఉల్లంఘనల ద్వారా రాష్ట్రంలో నెలకు రూ.87.60 కోట్ల మామూళ్లు అందుతున్నట్లు అంచనా. ఈ మామూళ్ల జాబితాలో అధికార పార్టీ నేతల నుంచి పోలీస్, ఎక్సైజ్ అధికారులున్న సంగతి బహిరంగ రహస్యమే. రాష్ట్రంలో మొత్తం 4,380 మద్యం షాపులుంటే, ఎమ్మార్పీ ఉల్లంఘనలకుగాను షాపునకు రూ.లక్ష , బెల్టు షాపు నిర్వహిస్తే మరో రూ.లక్ష వసూలు చేస్తారని గతంలో ఎక్సైజ్ వర్గాలే పలు సందర్భాల్లో వెల్లడించాయి. ఎమ్మార్పీ ఉల్లంఘనల ద్వారా నెలకు రాష్ట్రవ్యాప్తంగా రూ.43.80 కోట్లు వసూలు అవుతాయని, బెల్టు షాపుల ద్వారా నెలకు మరో రూ.43.80 కోట్లు మొత్తం రూ.87.60 కోట్లు, అదే ఏడాదికి రూ. 1,050 కోట్లుకు పైగా వసూలు చేస్తున్నారు. గతంలో ఏసీబీ దాడుల్లోనూ ఈ విషయం స్పష్టమైంది. -
వారికి ‘మామూలే’!
► మద్యం అమ్మకాల్లో ఎమ్మార్పీ తప్పనిసరి చేసిన ఎక్సైజ్ కమిషనర్ ► ఎక్సైజ్ అధికారులకు మామూళ్ల నిలిపివేసిన వ్యాపారులు ► అర్ధరాత్రి అమ్మకాల కోసం పోలీస్ శాఖకు మామూళ్లు ► రక్షకభటుల్లోనూ మార్పు వస్తే అక్రమ అమ్మకాలకు చెక్ సాక్షి, అమరావతిబ్యూరో: మద్యం అక్రమంగా విక్రయించడం వల్ల అనేక అనర్థాలు జరుగుతున్నాయి. వాటిని అరికట్టాల్సిన పోలీసులే పరోక్షంగా ఇందుకు కారణమవుతున్నారు. మద్యం వ్యాపారుల వద్ద మమూళ్లు తీసుకుని అక్రమ అమ్మకాలను చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారు. దీనివల్ల పేద, మధ్య తరగతి కుటుంబాల్లో అనేక సమస్యలు తలెత్తుతున్నాయి. ఈ విషయాన్ని గుర్తించిన ఎక్సైజ్ శాఖ కమిషనర్ లక్ష్మీనరసింహం... ఎమ్మార్పీకే మద్యం విక్రయించాలని ఆదేశించారు. ఈ మేరకు వ్యాపారులు ఎమ్మార్పీకే మద్యం విక్రయిస్తున్నందున ఎక్సైజ్ శాఖకు నెలవారీ మామూళ్లను నిలిపివేశారు. అయితే, అర్ధరాత్రి వరకు అమ్మకాలు కొనసాగిస్తున్నప్పటికీ పట్టించుకోని పోలీసులు మాత్రం యథావిధిగా డబ్బులు తీసుకుంటూనే ఉన్నారు. ఇదే విషయాన్ని తెలియజేస్తూ ఎక్సైజ్ శాఖ కమిషనర్ లక్ష్మీనరసింహం స్వయంగా డీజీపీకి లేఖ రాశారు. దీంతో ఎవరూ మామూళ్లు తీసుకోవద్దని డీజీపీ అన్ని జిల్లాల ఎస్పీలకు చెప్పినట్లు సమాచారం. పోలీసులు కూడా లంచాలు తీసుకోకుండా... నిబంధనలు పాటించాలని వ్యాపారులను హెచ్చరిస్తే మద్యం అక్రమ విక్రయాలను అరికట్టే అవకాశం ఉంటుంది. ఎక్సైజ్‌కు చెక్..! రాజధాని ప్రాంతంలో కృష్ణా, గుంటూరు జిల్లాల్లో విజయవాడ, మచిలీపట్నం, గుంటూరు, తెనాలి, నరసరావుపేట ఎక్సైజ్ సూపరింటెండెంట్ కార్యాలయాల పరిధిలో 695 మద్యం దుకాణాలు ఉన్నాయి. నెలకు ఒక వైన్ షాపు నుంచి రూ.30వేలు చొప్పున మామూళ్లు ఇచ్చేవారు. ఈ లెక్కన 695 షాపుల నుంచి రూ.2.85 కోట్లు వసూలు చేసేవారు. ఆ నగదును ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారుల నుంచి కానిస్టేబుల్ వరకు పంచుకునేవారు. మరోవైపు స్టేట్ టాస్క్‌ఫోర్స్, జిల్లా టాస్క్‌ఫోర్స్ పేరుతో అదనపు మామూళ్లు ఇచ్చేవాళ్లమని వైన్ షాపుల యజమానులు తెలిపారు. ఇందుకు ప్రతిఫలంగా నిబంధనలకు విరుద్ధంగా అమ్మకాలు సాగించేవారు. ఎమ్మార్పీ ఉల్లంఘించేవారు. బెల్టు దుకాణాలు నిర్వహించేవారు. లూజు విక్రయాలు, రాత్రి, పగలు అనే తేడా లేకుండా విక్రయించడం, మద్యంలో కల్తీ చేయడం.. ఇలా అడుగడుగునా ఇష్టానుసారంగా వ్యవహరించేవారు. ఇటీవల ఎక్సైజ్ కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన లక్ష్మీనరసింహం నిర్ణయాల వల్ల నెలవారీ మామూళ్లకు చెక్ పడింది. ఎమ్మార్పీ తప్పకుండా అమలు చేయడంతో వైన్ షాపుల యజమానులకు మామూళ్ల బెడద తగ్గింది. అదే సమయంలో ఆదాయం కూడా కాస్త తగ్గింది. దీంతో ఎక్సైజ్ శాఖకు మామూళ్లు ఇచ్చుకోలేమని చెప్పేశారు. నెలవారీ ఆదాయం రాక అధికారులు మథనపడుతూ ఇండెంట్ల పేరుతో ఎంతో కొంత రాబట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నా, వ్యాపారులు మాత్రం ససేమిరా అంటున్నారు. పోలీస్ శాఖ విషయంలో మార్పు లేదు ఎక్సైజ్ శాఖకు మామూళ్లు నిలిపివేసిన మద్యం వ్యాపారులు... పోలీస్ శాఖకు మాత్రం యథావిధిగానే ఇస్తున్నారు. ఒక్కో మద్యం షాపు నుంచి ప్రతి నెలా పోలీస్‌స్టేషన్‌కు రూ.13 వేల చొప్పున సమర్పించుకుంటున్నట్లు వ్యాపారులు తెలిపారు. ఈ క్రమంలో 695 దుకాణాలకు నుంచి నెలకు రూ.90 లక్షల వరకు ముట్టజెబుతున్నట్లు చెప్పారు. ఇప్పటికే ఎమ్మార్పీకి మద్యం విక్రయిస్తున్నందున లాభాలు తగ్గాయని, పోలీసులు కూడా కఠినంగా వ్యవహరిస్తే తాము నష్టపోతామని వ్యాపారులు చెబుతున్నారు. పగలు, రాత్రి అనే తేడా లేకుండా విక్రయాలు సాగిస్తే తమకు లాభాలు వస్తాయని, అందుకోసం పోలీసులకు మామూళ్లు ఇస్తున్నామని స్పష్టం చేస్తున్నారు. ఈ క్రమంలో రాత్రిళ్లు షాపులు మూసివేసి, పక్కనే బడ్డీ కొట్లు, చిన్న గదుల్లో బెల్ట్ దుకాణాలు ఏర్పాటు చేసి తెల్లవారే వరకు మద్యం విక్రయిస్తున్నారు. పోలీసులు కూడా మమూళ్లు తీసుకోకుండా ఉంటే మద్యం షాపులు నిబంధనల ప్రకారం నడిపే అవకాశం ఉంటుంది. ఈ విషయంపై పోలీసు ఉన్నతాధికారులు దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. -
రమ్య ఘటనతో ఎక్సైజ్ శాఖ అలర్ట్
-
బార్లపై ఇదేం బాదుడు!
- బార్ల అసోసియేషన్ ఆందోళన - లెసైన్సు, రెన్యూవల్ ఫీజుల పెంపు, సిట్టింగ్ కెపాసిటీని బట్టి రుసుము వసూలుకు ఆబ్కారీ శాఖ ప్రతిపాదన - నేడు ఎక్సైజ్ కమిషనర్‌ను కలసి నిరసన సాక్షి, హైదరాబాద్: ఆబ్కారీశాఖ ప్రతిపాదనలపై బార్ల యజమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫీజుల రూపేణా బాదడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. వచ్చే నెల నుంచి అమలులోకి రానున్న ‘నూతన బార్ పాలసీ’లో భాగంగా ఫీజులను పెంచాలని ఆబ్కారీ శాఖ ప్రతిపాదించింది. ప్రతి రెండేళ్లకోసారి ఇష్టానుసారంగా లెసైన్సు ఫీజులు, రెన్యూవల్ దరఖాస్తు ఫీజు ధరలను ఇష్టానుసారంగా పెంచుతున్నారని తెలంగాణ రెస్టారెంట్, బార్ల అసోసియేషన్ ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఈ మేరకు అసోసియేషన్ అధ్యక్షుడు మనోహర్‌గౌడ్ అధ్యక్షతన ఆదివారం ఇక్కడ జరిగిన సమావేశంలో లెసైన్సు, రెన్యూవల్ దరఖాస్తు ఫీజుల పెంపు ప్రతిపాదనలను వ్యతిరేకించాలని యజమానులు నిర్ణయించారు. ఈ ఫీజులతోపాటు సీటింగ్ కెపాసిటీ ఆధారంగా రుసుము వసూలు చేస్తే ఆ భారం వినియోగదారులపైనే పడుతుందని, మద్యం ధరలు పెంచక తప్పని పరిస్థితి ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఐదేళ్లలో రూ.2 నుంచి లక్షకు పెంపు ఐదేళ్ల క్రితం వరకు రెండు రూపాయల రెవెన్యూ స్టాంప్‌తో బార్ లెసైన్స్ రెన్యూవల్‌కు దరఖాస్తు చేసుకొనేవారు. తరువాత దీనిని ఆబ్కారీ శాఖ రూ.10 వేలకు పెంచింది. ఈసారి ఆ మొత్తాన్ని లక్ష రూపాయలకు పెంచాలని ప్రతిపాదించింది. 804 బార్ల రెన్యూవల్ దరఖాస్తు ఫారాల విక్రయం ద్వారానే రూ.8 కోట్లకుపైగా వసూలు చేయాలని నిర్ణయించింది. లెసైన్సు ఫీజు, సిట్టింగ్ కెపాసిటీ ఆధారంగా ఫీజుల పెంపు జీహెచ్ఎంసీతోపాటు ఇతర మునిసిపాలిటీలు, నగర పంచాయితీల్లో కూడా 10 శాతం వరకు లేదా రూ.5 లక్షల మేర లెసైన్సు ఫీజు పెంచాలని ఎక్సైజ్ శాఖ ప్రభుత్వానికి ప్రతిపాదించింది. బార్ల వైశాల్యం, సిట్టింగ్ కెపాసిటీ ఆధారంగా 500 చదరపు మీటర్లు దాటితే ప్రతి 200 మీటర్లకు 10 శాతం చొప్పున రుసుము వసూలు చేయాలని కూడా భావిస్తోంది. ఈ ప్రతిపాదనలు అమలు చేస్తే బార్ల నిర్వహణ సాధ్యం కాదని యజమానులు పేర్కొంటున్నారు. కాగా సోమవారం ఎక్సైజ్ కమిషనర్ చంద్రవదన్, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి అజయ్ మిశ్రాలను కలసి పరిస్థితిని వివరించి నిరసన వ్యక్తం చేయాలని నిర్ణయించారు. అమెరికా పర్యటనలో ఉన్న ఎక్సైజ్ శాఖ మంత్రి టి. పద్మారావు తిరిగి రాగానే ఫీజుల పెంపుపై విజ్ఞప్తి చేయాలని నిర్ణయించారు. -
‘హెల్త్’ ప్రిన్సిపల్ సెక్రటరీగా పూనం
* ఎక్సైజ్ కమిషనర్‌గా మీనా * ఉత్తర్వులు జారీ చేసిన సీఎస్ సాక్షి, హైదరాబాద్: వైద్యారోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యంపై ప్రభుత్వం బదిలీ వేటు వేసింది. యువజన, క్రీడలు, పర్యాటక, సాంస్కృతిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఆయనను నియమించింది. ఆయన స్థానంలో పూనం మాలకొండయ్యను వైద్యారోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా నియమించారు. ప్రభుత్వం పలువురు ఉన్నతాధికారుల శాఖలను మార్చింది. ఎక్సైజ్ శాఖ కమిషనర్ నరేశ్‌ను ఇటీవల ప్రభుత్వం బదిలీ చేసిన విషయం విదితమే. సాధారణ పరిపాలన విభాగం(రాజకీయ) కార్యదర్శిగా పనిచేస్తోన్న ముకేశ్ కుమార్ మీనాను ఎక్సైజ్, ప్రొహిబిషన్ శాఖ కమిషనర్‌గా, ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ ఎండీగా నియమించారు. మార్కెటింగ్ శాఖ కమిషనర్ బి.కిశోర్‌ను సాధారణ పరిపాలన విభాగం (సర్వీసెస్) కార్యదర్శిగా బదిలీ చేశారు. సహకార శాఖ స్పెషల్ కమిషనర్ శేషగిరిబాబుకు మార్కెటింగ్ శాఖ అదనపు బాధ్యతలు అప్పగించారు. సాధారణ పరిపాలన విభాగం (ప్రొటోకాల్) సంయుక్త కార్యదర్శిగా ఉన్న సత్యనారాయణను ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ స్పెషల్ కమిషనర్‌గా, నేషనల్ హెల్త్ మిషన్ (ఎన్హెచ్ఎం) ఈడీ, ఎయిడ్స్ నియంత్రణ మండలి పీడీగా నియమించారు. ఢిల్లీలోని ఏపీ భవన్లో ఓఎస్డీగా ఉన్న లెప్టినెంట్ కల్నల్ ఎం.అశోక్‌బాబును ప్రొటోకాల్ విభాగం డెరైక్టర్‌గా నియమిస్తూ గురువారం సీఎస్ కృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. ఆరోగ్యశాఖకు స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ఉన్న ఎల్వీ సుబ్రహ్మణ్యంను అప్రధాన శాఖ టూరిజం, యూత్ అడ్వాన్స్‌మెంట్‌శాఖకు బదిలీ చేయడం చర్చనీయాంశమైంది. -
శభాష్.. బాగా తాపిస్తున్నారు!
కర్నూలు: శెభాష్ బాగా తాపిస్తున్నారు.. మద్యం అమ్మకాల ద్వారా ప్రభుత్వానికి ఆదాయం రాబట్టడంలో కర్నూలు జిల్లా అధికారులు ముందు వరుసలో ఉన్నారు. రాబడిని పెంచేందుకు మరింతగా కృషి చేయాలని ఆ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారులను ఆదేశించారు. ఎక్సైజ్ కమిషనర్ ఎస్ఎస్.రావత్, డెరైక్టర్ సూర్యప్రకాష్‌తో కలిసి హైదరాబాద్ నుంచి శనివారం సాయంత్రం రాష్ట్రంలోని అన్ని జిల్లాల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కర్నూలు కలెక్టరేట్లో ఇన్చార్జ్ డిప్యూటీ కమిషనర్ హేమంత్ నాగరాజు, కర్నూలు, నంద్యాల ఈఎస్‌లు సుర్జీత్‌సింగ్, హనుమంతరావు, ఐఎంఎల్ డిపో ఇన్‌చార్జ్‌లు మనోహర్, నాగభూషణం, కర్నూలు ఏఈఎస్ హెప్సిబా రాణి, సీఐ పద్మావతి తదితరులు పాల్గొన్నారు. పొరుగు రాష్ట్రాల నుంచి అక్రమ మద్యం రవాణా కాకుండా చెక్‌పోస్టుల వద్ద నిఘా తీవ్రం చేయాలని ఆదేశించారు. కర్నూలు జిల్లాలో తొమ్మిది చెక్‌పోస్టులు, మూడు మొబైల్ టీముల ద్వారా కర్ణాటక రాష్ట్రం నుంచి మద్యం రవాణా కాకుండా చర్యలు చేపట్టినట్లు హేమంత్‌నాగరాజు వివరించారు. అలాగే నకిలీ మద్యంపై కూడా నిఘా పెంచినట్లు చెప్పారు. ఆదాయపరంగా కర్నూలు రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉందని ఈ సందర్భంగా మంత్రి జిల్లా అధికారులకు కితాబునిచ్చారు. జిల్లాలో హోలోగ్రామ్ ప్రాజెక్టును నెలాఖరులోగా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. లెసైన్స్ ఫీజు కింద జిల్లాలో ప్రభుత్వానికి రూ.74 కోట్లు ఆదాయం వచ్చిందని మంత్రి దృష్టికి అధికారులు తీసుకువచ్చారు. అలాగే బెల్టు షాపులకు సంబంధించి జిల్లాలో 354 కేసులు నమోదు చేసి 368 మందిని అరెస్టు చేసినట్లు తెలిపారు. 1265 లీటర్ల మద్యం, 152 లీటర్ల బీరు స్వాధీనం చేసుకుని ఏడు వాహనాలను సీజ్ చేసినట్లు పేర్కొన్నారు. కరా్ణాటక సరిహద్దులోని ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా ఉంచి అక్రమ రవాణాపై 120 కేసులు నమోదు చేసి 120 మందిని అరెస్టు చే శామని, అలాగే 192 లీటర్ల కర్ణాటక మద్యం సీజ్ చేసి ఇందుకు సంబంధించి 34 వాహనాలను స్వాధీనం చేసుకున్నట్టు నివేదించారు. ఎక్సైజ్ నేరాలకు సంబంధించి 534 కేసులు పెండింగ్‌లో ఉన్నట్లు మంత్రి దృష్టికి తీసుకురాగా డిసెంబర్ 6న మెగా లోక్ అదాలత్‌లో ఉంచి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. -
ఎక్సైజ్ పదోన్నతుల ఫైలుకు కదలిక!
‘సాక్షి’ కథనానికి స్పందన సాక్షి, హైదరాబాద్: ఎక్సైజ్ సబ్ఇన్స్పెక్టర్ల(ఎస్ఐ) పదోన్నతుల ఫైలుకు ఎట్టకేలకు కదలిక వచ్చింది. ‘కావాలనే పదోన్నతుల్లో జాప్యం’ శీర్షికతో గురువారం ‘సాక్షి’లో ప్రచురితమైన వార్తకు ఎక్సైజ్ కమిషనర్ స్పందించారు. పదోన్నతుల ఫైలుపై ఆరా తీశారు. ఎస్ఐ నుంచి సీఐల పదోన్నతుల ప్రతిపాదనలను పంపాలని కమిషనర్ కార్యాలయం ఎల్ సెక్షన్ అధికారులు అక్టోబర్ 24న వివిధ జిల్లాల డి ప్యూటీ కమిషనర్లను కోరారు. అయితే, ఒక్క విశాఖ పట్టణం నుంచి మాత్రమే ప్రతిపాదన వచ్చింది. దీంతో ఈ ప్రక్రియ అటకెక్కిందని ఎల్ సెక్షన్ అధికారులు కమిషనర్‌కు తెలిపారు. మిగిలిన జిల్లాల వారు పదోన్నతులపై స్పందించలేదని పేర్కొన్నారు. దీంతో మిగిలిన జిల్లాల నుంచి కూడా పదోన్నతులపై ప్రతిపాదనలు తెప్పించి ప్రక్రియ పూర్తి చేయాలని కమిషనర్ తాజాగా ఆదేశించినట్టు తెలిసింది.