Public elementary school
-
10,00,000 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీ
- దేశంలో ప్రభుత్వ విద్యావ్యవస్థ దుస్థితి విద్యావ్యవస్థపై పాలకుల నిర్లక్ష్యం వీడడం లేదు. అసలే అరకొర వసతులతో సతమతమవుతున్న ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. దేశ వ్యాప్తంగా ప్రభుత్వ బడుల్లో సుమారు పది లక్షల ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయని స్వయంగా కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ లోక్‌సభకు ఇటీవల వెల్లడించింది. సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో 18 శాతం ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అదే ప్రభుత్వ సెకండరీ స్కూళ్లలో 15 శాతం పోస్టులు ఖాళీగా ఉన్నాయి. స్వయంగా కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ లోక్‌సభకు సమర్పించిన అధికారిక గణాంకాలివి. దేశవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో సుమారు 10 లక్షల ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు మానవ వనరుల శాఖ తెలిపింది. మరో మాటలో చెప్పాలంటే ప్రతి ఆరు ఉపాధ్యాయ పోస్టుల్లో ఒకటి ఖాళీగా ఉంది. దేశంలో పలు రాష్ట్రాల్లో అన్ని ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయగా, కొన్ని రాష్ట్రాల్లో సగానికి పైగా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అక్షరాస్యత రేటు తక్కువగా ఉన్న రాష్ట్రాల్లో ఉపాధ్యాయ ఖాళీలు అధికంగా ఉన్నాయి. 2015–16 ఎడ్యుకేషన్ డేటా ప్రకారం దేశంలో 260 మిలియన్ల పాఠశాల విద్యార్థుల్లో 55 శాతం మంది ప్రభుత్వ పాఠశాలల్లోనే విద్యనభ్యసిస్తున్నారు. జార్ఖండ్‌లో అత్యధికం... దేశవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో సుమారు 60 లక్షల ఉపాధ్యాయ పోస్టులు ఉన్నాయి. వీటిల్లో ప్రాథమిక పాఠశాలల్లో 9 లక్షలకు పైగా, సెకండరీ స్కూళ్లలో లక్షకు పైగా ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అత్యధికంగా జార్ఖండ్ రాష్ట్రంలోని సెకండరీ స్కూళ్లలో 70 శాతం పోస్టులు(ప్రాథమిక పాఠశాలల్లో 38%) ఖాళీగా ఉన్నాయి. ఉత్తరప్రదేశ్‌లోని సెకండరీ స్కూళ్లలో సగానికి పైగా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అదే గుజరాత్, బిహార్ రాష్ట్రాల్లో మూడొంతుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. నియామకాలపై పాలకులకు చిత్తశుద్ధి కొరవడడం, రెగ్యులర్‌గా ఖాళీలు భర్తీ చేయకపోవడం, ఆయా సబ్జెక్టులకు సంబంధించి నిపుణులైన ఉపాధ్యాయుల కొరత, విద్యార్థులు తక్కువగా ఉన్న చిన్న పాఠశాలలు వంటివి ప్రస్తుత పరిస్థితికి పలు కారణాలు. తెలుగు రాష్ట్రాల్లో... కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ పార్లమెంటుకు సమర్పించిన వివరాల ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో ప్రాథమిక పాఠశాలల్లో మొత్తం 1,47,139 పోస్టులు ఉండగా, 19,468 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. సెకండరీ స్కూళ్లలో మొత్తం 61,793 ఉపాధ్యాయ పోస్టులు ఉండగా, 5,056 పోస్టులు భర్తీ చేయాల్సి ఉంది. రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్ (ఆర్‌ఎమ్‌ఎస్‌ఏ) కింద ఆమోదం తెలిపిన 860 స్పెషల్ ఎడ్యుకేటర్స్ పోస్టులకు సంబంధించి ఏ ఒక్కటీ భర్తీ కాలేదు. తెలంగాణలో... తెలంగాణలోని ప్రాథమిక పాఠశాలల్లో మొత్తం 97,507 ఉపాధ్యాయ పోస్టులు ఉండగా, 13,049 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇక సెకండరీ స్కూళ్లలో 43,746 పోస్టులు ఉండగా, 3,144 పోస్టులు భర్తీ చేయాల్సి ఉంది. ఏకైక రాష్ట్రం సిక్కిం.. గోవా, ఒడిశా, సిక్కిం రాష్ట్రాల్లో ప్రాథమిక పాఠశాలల్లో ఖాళీలన్నవే లేవు. అసోం, హిమాచల్ ప్రదేశ్, మహారాష్ట్రల్లోని సెకండరీ స్కూళ్లలో వరుసగా 3.9%, 3.9%, 2% చొప్పున ఖాళీలున్నాయి. దేశంలో ప్రాథమిక, సెకండరీ స్కూళ్లలో అన్ని పోస్టులు భర్తీ చేసిన ఏకైక రాష్ట్రం సిక్కిం మాత్రమే! -
పాఠశాలలో చోరీకి యత్నం
వర్ధన్నపేట టౌన్ : మండలంలోని ఇల్లంద గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో మంగళ వారం మధ్యాహ్నం గుర్తుతెలి యని వ్యక్తులు చోరీ యత్నానికి పాల్పడ్డారు. ఆ గదిలో మధ్యాహ్న భోజనానికి కావల్సిన బియ్యం, కిరాణ సామగ్రి, టీవీ ఇతర వస్తువులు ఉంచే వారని గ్రామస్తులు చెబుతున్నారు. మధ్యాహ్న భోజనం వేళల్లో ఆ గది ఇనుప డోరుకు వెల్డింగ్ చేసిన ఇనుప బెడాన్ని తొలగించారు. అందులో ఏమైనా వస్తులు పోయాయా అన్నది నిర్ధారణ కాలేదు. మంగళవారం బక్రీద్ కావడంతో పాఠశాల సెలవు. బుధవారం ఉపాధ్యాయులు వస్తేనే ఏమై నా చోరీకి గురయ్యాయో ఏమేమి వస్తువులు పోయాయో తెలుస్తోంది. ఈ విషయం వర్ధన్నపేట పోలీసులకు గ్రామస్తులు సమాచారం అందించగా ఎస్సై ఉపేందర్ సంఘటన స్థలాన్ని సందర్శించి పరిశీలించారు. -
క్లాస్ రూంలో ఉపాధ్యాయుడి ఆత్మహత్య
బోగస్ మెడికల్ బిల్లు కేసు భయం.. అనారోగ్య సమస్యలతో ప్రభుత్వ ఉపాధ్యాయుడు పాఠశాల తరగతి గదిలోనే ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన కడెం మండలం దస్తూరాబాద్ పంచాయతీ పరిధి రాంపూర్ గ్రామంలో గురువారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కడెం : దస్తురాబాద్ గ్రామానికి చెందిన మారవేని రాజన్న(51) పంచాయతీ పరిధిలోని రాంపూర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. రోజూలాగే గురువారం ఉదయం ఇంటి నుంచి పాఠశాలకు వెళ్లాడు. హెచ్ఎం ప్రభాకర్ సెలవులో ఉండడంతో రాజన్నే ఆ బాధ్యతలు నిర్వర్తించాడు. ప్రస్తుతం త్రైమాసిక పరీక్షల దృష్ట్యా ఉదయం గణితం సబ్జెక్టు పరీక్ష నిర్వహించారు. రాజన్న విద్యార్థులతో పరీక్ష రాయించాడు. కాసేపటికి తనకు తల నొప్పిగా ఉందని, పక్క గదిలోకెళ్లి నిద్రిస్తానని, తనను డిస్ట్రబ్ చేయవద్దని, పరీక్ష సాఫీగా రాయండని విద్యార్థులకు చెప్పి, పాఠశాల ప్రాంగణంలోని అదనపు తరగతి గదికి వెళ్లాడు. మధ్యాహ్న భోజన సమయం అవుతున్నా రాజన్న బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన విద్యార్థులు గదిలోకి వెళ్లి చూడగా తాడుతో ఉరేసుకొని ఉన్న రాజన్న మృతదేహం కనిపించింది. ఎస్సై టీవీ.రావు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. రాజన్న షర్టు జేబులో సూసైడ్ నోట్ లభ్యమైంది. బోగస్ మెడికల్ బిల్లు కేసు భయం, అనారోగ్య కారణాలతో తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని, తనను కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, విద్యార్థులు క్షమించాలని అందులో పేర్కొన్నాడు. అతడికి భార్య లక్ష్మి, కుమార్తెలు స్వాతి, శ్వేత ఉన్నారు. చిన్నకూతురు శ్వేతకు ఇటీవలే నిశ్చితార్థం జరిగింది. కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. కాగా, 2013లో రాజన్నపై బోగస్ మెడికల్ రీయింబర్స్మెంట్ కేసు నమోదైందని, కేసు భయంతోపాటు అనారోగ్యంతో ఆత్మహత్య చేసుకున్నాడని అతడి భార్య లక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు. కాగా, రాజన్న మృతి విషయం తెలిసి సహచర ఉపాధ్యాయులు, స్థానికులు పెద్ద ఎత్తున పాఠశాలకు తరలివచ్చారు. మృతుడి కుటుంబాన్ని ఎమ్మెల్యే రేఖానాయక్, ఎంఈవో భూమన్న, ఉపాధ్యాయ సంఘాల నాయకులు పరామర్శించారు. రాజన్న మృతికి వేర్వేరుగా సంతాపం ప్రకటించారు. -
ఏ కష్టం కడతేర్చిందో..?!
ఎల్.ఎన్.పేట: రాత్రి వరకు ఇరుగుపొరుగు వారితో సరదాగానే గడిపిన ఆ కుటుంబం తెల్లవారేసరికి ఈ లోకంలోనే లేకుండా పోయింది. నిద్రలోనే నాలుగు నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ఈ సంఘటన ఇటు ఎల్.ఎన్.పేటను.. అటు వసప గ్రామాన్ని విషాదంలో ముంచేసిం ది. పోలీసులు, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. కొత్తూరు మండలం వసప గ్రామానికి చెందిన పిచ్చుక తవిటయ్య, లక్ష్మిల ఏకైక కుమారుడు భద్రయ్య(35). ఆయనకు భార్య నాగమణి(30), కుమారులు హరిప్రసాద్(8), చంద్రమౌళి(6) ఉన్నారు. బతుకు తెరువు కోసం భ ద్రయ్య సుమారు ఏడాదిన్నర క్రితం అత్తవారి ఊరుకు సమీపంలో ఉన్న ఎల్.ఎన్.పేటకు వలస వచ్చి షాపు అద్దెకు తీసుకొని ట్రాక్టర్లు, ద్విచక్రవాహనాలు, ఆటో ల రిపేర్లు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. షాపు ఎదురుగానే ఇల్లు అద్దెకు తీసుకొని భార్యాపిల్లలతో కాపురం పెట్టాడు. పిల్లలి ద్దరు స్థానిక ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చదువుతున్నారు. చుట్టుపక్కలవారితో సరదాగా ఉండే ఈ కుటుంబీకులు శుక్రవారం రాత్రి కూడా అలాగే గడిపా రు. శనివారం శని త్రయోదశి కావడంతో శనీశ్వరాలయానికి వెళతామని ఇరుగుపొరుగు వారికి చెప్పారు. అనంతరం భోజనాలు చేసి నిద్రపోయారు. గుడికి వెళ్లారనుకున్నాం.. శనివారం ఉదయం పది గంటల వరకు ఆ ఇంటి తలుపులు తెరుచుకోలేదు. రాత్రి చెప్పినట్లు ఆలయానికి వెళ్లి ఉంటారని భావించిన చుట్టుపక్కలవారు మొద ట పెద్దగా పట్టించుకోలేదు. సమయం గడుస్తోంది.. పది గంటలైంది.. అయినా భద్రయ్య ఇంటి వాతావరణంలో ఎలాం టి మార్పులేదు. దాంతో చిన్న అనుమానం మొదలైంది. కొందరు తలుపు, కిటికీల సందుల్లోంచి లోపలికి చూశారు. నలుగురూ మంచాలపై కనిపిం చారు. ఇంకా పడుకొని ఉన్నారనుకుని వెళ్లిపోయారు. అయితే 11 గంటలవుతున్నా ఆ ఇంటి సభ్యులు బయటకు రాకపోవడంతో స్థానికుల్లో అనుమానాలు బలపడ్డాయి. వెంటనే సరుబుజ్జిలి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దాంతో ఎస్సై ఎం.శ్రీనివాస్ సిబ్బందితో అక్కడికి చేరుకొని ఇంటి తలుపులు తెరిపిం చారు. లోపలికి వెళ్లి పరిశీలిస్తే.. నలుగురూ విగతజీవులుగా కనిపించారు. విషయం క్షణాల్లో ఊరంతా పాకింది. మొత్తం విషా దం అలుముకుంది. బంధువులు, స్థాని కులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. కుటుంబ సభ్యు లు, బంధువుల రోదనలతో ఆ ప్రాంతం దద్దరిల్లింది. ఆ కుటుంబానికి ఎటువంటి కష్టాలు, ఆర్థిక సమస్యలు లేవని బంధువులు, స్థానికు లు చెప్పారు. పిల్లలిద్దరూ బాగానే చదువుతారని సంఘటన స్థలానికి వచ్చిన పాఠశాల ఉపాధ్యాయుడొకరు చెప్పారు. సమాచారం తెలుసుకొని హిరమండలం మండలం చిన్న కొల్లివలసకు చెందిన నాగమణి కన్నవారు కూడా అక్కడికి చేరుకున్నారు. ఇంటిని, మెకానిక్ షెడ్‌ను శ్రీకాకుళం స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ టి. మోహనరావు పరిశీలించారు. స్థానికు లు, మృతుల తల్లిదండ్రులు, బంధు వులను విచారించారు. మృతదేహా లను పోస్టుమార్టానికి పంపించి కేసు న మోదు చేసినట్లు ఎస్సై శ్రీనివాస్ చె ప్పా రు. పోస్టుమార్టం నివేదిక అందేవరకు వారి మరణానికి కారణాలు చెప్పలేమని, ఇంట్లో ఎలాంటి ఆనవాళ్లు, అనుమానాస్పద పరిస్థితులు కనిపించలేదన్నారు. తల్లడిల్లిన తల్లిదండ్రులు వసప(కొత్తూరు): భద్రయ్య కుటుంబ మరణంతో స్వగ్రామం కొత్తూరు మం డలం వసపలోనూ విషాదం అలుముకుంది. కుటుంబ పోషణకు భద్రయ్య ఎల్.ఎన్.పేటకు తరలివెళ్లినా అతని తల్లిదండ్రులు వసపలోనే ఉంటున్నారు. కూలి పనులు చేసుకొని జీవిస్తున్న వీరి ద్దరూ కొడుకు, కోడలు, ఇద్దరు మనవలు మృతి చెందిన విషయం తెలుసుకొని ఒక్కసారిగా కుంగిపోయారు. చెట్టంత కొడుకు మృతి చెందడంతో ఏ విధంగా బతకాలని ఆవేదనగా ప్రశ్నించడం స్థాని కులను కంట తడిపెట్టించింది. వారితోపాటు ఇతర బంధువులు హూటాహుటిన ఎల్.ఎన్.పేటకు వెళ్లారు. ఏం జరిగి ఉంటుంది? భద్రయ్యకు ఆర్థికపరమైన సమస్యలే వీ లేవని తల్లిదండ్రులతో పాటు అత్తమామాలు చెబుతున్నారు. భార్యాభర్తలిద్దరిదీ ఉన్నంతలో సరిపెట్టుకునే తత్వమేనని అన్నారు. పురుగుల మందులాంటి విషపూరిత పదార్థాలు సేవించారనడానికి.. ఇంట్లో అటువంటి ఆనవాళ్లు లభించలేదని పోలీసులు చెప్పారు. నిద్రలోనే మరణించినట్లు ఉందన్నారు. రాత్రి తీసుకున్న ఆహార పదార్థాల్లో బల్లి వంటివి పడి విషపూరితమయ్యాయా?.. లేక చెరువు గట్టున ఇల్లు ఉన్నందున విషపురుగులు ఏమైనా కుట్టాయా?? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విషపూరిత ఆహారం తిన్నా.. పురుగూపుట్రా కుట్టినా.. వాంతులు కావడం, అస్వస్థతకు గురవడం జరుగుతుంది. అదే జరిగితే బయటకు వచ్చి ఇరుగుపొరుగువారి సహాయం తీసుకుంటారు. పైగా వాంతులు చేసుకున్న ఆనవాళ్లు కూడా లేవు. ఎవరితోనూ తగాదాలు, సమస్యలు లేదు. దంపతులిద్దరూ ఎంతో సరదాగా ఉండేవారని స్థానికులు చెబుతున్నారు.ఇవేవీ కానప్పుడు.. వీరి మరణానికి కారణమేమిటన్నది మిస్టరీగా మారింది.