Public Provident Fund
-
చందా దారుడు చనిపోతే పీఎఫ్ ఎలా క్లెయిమ్ చేసుకోవాలో తెలుసా..
-
చిన్న మొత్తాల పొదుపు పథకాల నిబంధనల్లో మార్పులు
న్యూఢిల్లీ: చిన్న మొత్తాల పొదుపు పథకాలలో కొన్నింటికి సంబంధించినిబంధనల్లో కేంద్ర ప్రభుత్వం కీలక సవరణలు తెచి్చంది. సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (ఎస్సీఎస్ఎస్), పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్), టైమ్ డిపాజిట్ల పథకాల నిబంధనల్లో మార్పులు చేసింది. నూతన నోటిఫికేషన్ ప్రకారం.. పదవీ విరమణ ప్రయోజనాలు (నిధులు) చేతికి అందిన రోజు నుంచి మూడు నెలల వరకు ఎస్సీఎస్ఎస్ ఖాతా ప్రారంభించడానికి అవకాశం లభించింది. ఇప్పటి వరకు ఇది ఒక నెలగానే అమల్లో ఉంది. 55 ఏళ్ల నుంచి 60 ఏళ్లు దాటని వారికే ఇది వర్తిస్తుంది. ఎస్సీఎస్ఎస్ డిపాజిట్ ఐదేళ్ల కాల వ్యవధి ముగిసిన అనంతరం రెన్యువల్ చేసుకునే వారికి అప్పుడు అమల్లో ఉన్న వడ్డీ రేటును అమలు చేస్తారు. ప్రభుత్వ ఉద్యోగి (కేంద్ర, రాష్ట్ర) అయి, 50 ఏళ్లు నిండిన అనంతరం మరణించినట్టయితే, అప్పుడు వచ్చే ప్రయోజనాలను జీవిత భాగస్వామి ఎస్సీఎస్ఎస్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. పెట్టుబడి పెట్టి ఏడాదిలోపు వెనక్కి తీసుకుంటే డిపాజిట్లో ఒక శాతాన్ని మినహాయిస్తారు. ఎస్సీఎస్ఎస్ డిపాజిట్‌ను ఐదేళ్లు ముగిసిన తర్వాత మరో మూడేళ్ల కాలానికి రెన్యువల్ చేసుకోవచ్చు. ఇక నుంచి అలా ప్రతి మూడేళ్లకోసారి రెన్యువల్ చేసుకుంటూ వెళ్లొచ్చు. అలాగే, పీపీఎఫ్ ఖాతాను ముందస్తుగా మూసివేయడానికి సంబంధించిన నిబంధనల్లో మార్పులు తెచ్చింది. ఐదేళ్ల టైమ్ డిపాజిట్‌ను నాలుగేళ్లు ముగిసిన తర్వాత వెనక్కి తీసుకుంటే, పోస్టాఫీసు సేవింగ్స్ ఖాతాకు అమలయ్యే వడ్డీ రేటునే చెల్లిస్తారు. ప్రస్తుతం నాలుగేళ్ల తర్వాత ఉపసంహరించుకుంటే మూడేళ్ల కాలానికి అమలయ్యే రేటును ఇస్తున్నారు. -
ఆర్థిక భద్రతా అవసరమే..
చిన్న వయసు.. ఉరకలెత్తే ఉత్సాహం, మంచి ఆరోగ్యం.. ఇవన్నీ భవిష్యత్తును గుర్తు చేయవు. ఏరోజుకారోజు హాయిగా గడిచిపోతుంటుంది. సరిగ్గా ఆ సమయంలోనే కొన్ని మంచి అలవాట్లకు చోటు కల్పిస్తే.. జీవితాంతం ఆర్థిక భద్రతకు ఢోకా లేకుండా చూసుకోవచ్చు. రేపటి రోజు కోసం మీ ప్రణాళికలో కొంత చోటు కల్పిస్తే చాలు. అందులో ఉండే మ్యాజిక్ ఆ తర్వాత తెలిసొస్తుంది. అందుకే అంటారు వయసులో ఉన్నప్పుడే నాలుగు రాళ్లు వెనుకేసుకోమని..! రిటైర్మెంట్ కోసం రూ.కోటి కావాలంటే.. నెలకు రూ.2,000 ఇన్వెస్ట్ చేస్తే చాలు. 25 సంవత్సరాల వయసులో మొదలు పెట్టి, ఏటా 12 శాతం రాబడులు వచ్చేట్టు చూసుకున్నా.. ఈ మొత్తం సమకూరుతుంది. కానీ, 15 ఏళ్లు ఆలస్యం చేసి 45లో మొదలు పెట్టారనుకోండి అప్పుడు రూ.కోటి కోసం నెలకు రూ.21,000 ఇన్వెస్ట్ చేయాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. సిప్ ఆరంభం.. తివారి (30) సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) రూపంలో ఐదేళ్ల క్రితమే అంటే 25 ఏళ్ల వయసు నుంచే మ్యూచువల్ ఫండ్స్‌లో ప్రతీ నెలా రూ.2,000 చొప్పున మూడేళ్లపాటు ఇన్వెస్ట్ చేశాడు. ఆ తర్వాత వెసులుబాటు లేకపోవడంతో సిప్ ఆపేశాడు. కానీ, అప్పటి వరకు చేసిన పెట్టుబడిని అలాగే ఉంచేశాడు. ఒకరోజు ఏజెంట్ కాల్ చేసి.. రూ.72,000 పెట్టుబడి రూ.1.8 లక్షలు అయినట్టు చెప్పడంతో ఆశ్చర్యపోవడం తివారీ వంతు అయింది. ఎవరో ఫ్రెండ్ చెబితే సిప్ మొదలు పెట్టిన తివారీ.. అంత నిధిని చూసేసరికి పెట్టుబడి ప్రయోజనాన్ని అర్థం చేసుకున్నాడు. పెట్టుబడి చిన్నదైనా క్రమం తప్పకుండా కొనసాగించడం వల్ల వచ్చే ప్రతిఫలం ఇలా ఉంటుంది. రాబడి రుచి తెలిసిన తర్వాత ఎవరైనా పెట్టుబడి పెట్టకుండా ఉంటారా? అందుకే తివారీ మళ్లీ సిప్ మొదలు పెట్టడమే కాదు.. ఈ విడత రూ.2,000 చొప్పున రెండు పథకాల్లో ప్రతి నెలా ఇన్వెస్ట్ చేయాలని నిర్ణయం తీసుకున్నాడు. ఆర్జించే ప్రతి ఒక్కరూ తమ ఆదాయ స్థాయికి అనుగుణంగా వెంటనే సిప్ ఆరంభించాలి. సిప్ అన్నది ఒక్కసారి ఇన్స్ట్రక్షన్ ఇస్తే ఆటోమేటిక్‌గా ప్రతీ నెలా నిర్ణీత తేదీన, నిర్ణీత మొత్తం పెట్టుబడిగా వెళ్లిపోతుంది. క్రమశిక్షణతో పెట్టుబడికి సిప్ వీలు కల్పిస్తుంది. సిప్ అనగానే ఏ పథకంలో ఇన్వెస్ట్ చేయాలి? అన్న సందేహం వస్తుంది. నిపుణుల సూచనల ప్రకారం లార్జ్‌క్యాప్ విభాగానికి 50–60%, మిడ్ స్మాల్‌క్యాప్ విభాగానికి 20–30%, డెట్ విభాగానికి 10–20% కేటాయింపులు చేసుకోవచ్చు. దీన్నే అస్సెట్ అలోకేషన్ అని చెబుతారు. అలాగే, మీ పోర్ట్‌ఫోలియోలో ఎన్ని పథకాలు ఉండాలన్నది నిర్ణ యించుకోవాలి. సిప్ పెట్టుబడులు సైతం మార్కెట్ ప్రతికూలతల్లో నష్టాలను చూపిస్తాయి. అయినా నిరాశ చెందకుండా ఓపికతో పెట్టుబడులను దీర్ఘకాలం పాటు కొన సాగించాలి. పీపీఎఫ్ ఖాతా డెట్ సాధనాల్లో ప్రజా భవిష్యనిధి (పీపీఎఫ్) మెరుగైన ఎంపిక. మూడు రకాల ప్రయోజనాలు దీన్నుంచి అందుకోవచ్చు. మొదట ఏటా రూ.1.5 లక్షల వరకు ఇందులో ఇన్వెస్ట్ చేయడం ద్వారా సెక్షన్ 80సీ కింద పన్ను లేకుండా చూసుకోవచ్చు. ఇందులో పెట్టుబడులపై వచ్చే వడ్డీ రాబడిపైనా పన్ను ఉండదు. గడువు ముగిసిన తర్వాత వెనక్కి తీసుకునే మొత్తంపైనా పన్ను లేదు. ప్రస్తుతం ఇందులో చేసే పెట్టుబడులపై 7.1 శాతం వడ్డీ రేటు అమలవుతోంది. ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.1.5 లక్షల వరకే ఇందులో ఇన్వెస్ట్ చేసుకోవడానికి అనుమతి ఉంటుంది. ప్రతీ నెలా 12,500 చొప్పున పెట్టుబడి పెడితే 15 ఏళ్లలో 22,50,000 ఇన్వెస్ట్ చేసినట్టు అవుతుంది. రాబడి ప్రస్తుత 7.1 శాతం ప్రకారం రూ.16,94,599 వస్తుంది. భవిష్యత్తులో ఈ రేట్లు ఇంకా తగ్గే అవకాశం ఉంది. 15 ఏళ్ల కాల వ్యవధి తర్వాత ఐదేళ్ల చొప్పున గడువు పొడిగించుకోవచ్చు. ఆ తర్వాత కూడా ఖాతాను క్లోజ్ చేయాల్సిన అవసరం లేదు. ఏటా కొంత చొప్పున ఉపసంహరించుకోవచ్చు. బ్యాలన్స్‌పై వడ్డీ జమ అవుతూనే ఉంటుంది. ఏడేళ్ల తర్వాత నుంచి ఇందులో పాక్షిక ఉపసంహరణకు అనుమతి ఉంటుంది. రుణ సదుపాయానికి కూడా వీలుంది. పీపీఎఫ్ సొమ్మును కోర్టులు కూడా జప్తు చేయడానికి ఉండదు. టర్మ్ ఇన్సూరెన్స్ తమపై ఆధారపడిన వారు ఉంటే (తల్లిదండ్రులు లేదా భార్యా, పిల్లలు) తప్పకుండా టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. దురదృష్టవశాత్తూ, ఏదేనీ కారణంతో మరణం సంభవిస్తే పాలసీలో ఎంపిక చేసుకున్న మేరకు పరిహారాన్ని బీమా సంస్థ కుటుంబ సభ్యులకు అందిస్తుంది. టర్మ్ కవరేజీ అన్నది తక్కువ ప్రీమియానికే ఎక్కువ కవరేజీ ఇచ్చే అచ్చమైన బీమా సాధనం. ఇందులో పెట్టుబడి కలసి ఉండదు. కట్టిన ప్రీమియం జీవించి ఉంటే వెనక్కి రాదు. మరణించిన సందర్భాల్లోనే ఈ పాలసీ నుంచి పరిహారం అందుకోగలరు. కనుక తీసుకుంటే టర్మ్ ఇన్సూరెన్స్నే తీసుకోవాలి. టర్మ్ ప్లాన్ అన్నది 30 ఏళ్లలోపు తీసుకోవడమే మంచిది. తమపై ఆధారపడిన వారు ఎవరూ లేకపోతే, ఇంకా వివాహం చేసుకోకపోతే.. ముందుగానే తీసుకోవడాన్ని పరిశీలించొచ్చు. ఎందుకంటే ఆలస్యం చేయడం వల్ల ప్రీమియం పెరిగిపోతుంది. ఈలోపు ఏవైనా ఆరోగ్య సమస్యలు బయటపడితే ప్రీమియం భారం మరింత పెరుగుతుంది. మంచి చెల్లింపుల చరిత్ర కలిగిన కంపెనీల మధ్య టర్మ్ ప్రీమియం వ్యత్యాసాన్ని పరిశీలించి.. ఆకర్షణీయమైన ప్లాన్‌ను ఎంపిక చేసుకోవాలి. హెల్త్ ఇన్సూరెన్స్ అనుకోకుండా ఆస్పత్రిలో చేరాల్సి వస్తే.. భారీ బిల్లుతో ఆర్థికంగా కుదేలవుతున్న వారు ఎందరో ఉన్నారు. కరోనా సంక్షోభ సమయంలో ఇదే కనిపించింది. అందుకే ప్రతి ఒక్కరికి హెల్త్ కవరేజీ తప్పకుండా ఉండాల్సిందే. అందుకే హెల్త్ ప్లాన్‌ను ఆరోగ్యంపై పెట్టుబడిగా చెబుతారు. హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటే వైద్య బిల్లుల భారాన్ని తప్పించుకోవచ్చు. పొదుపు, పెట్టుబడులు క్షేమంగా ఉంటాయి. హెల్త్ ప్లాన్ లేకపోతే పెట్టుబడులు కరిగిపోతాయి. లేదంటే అప్పుల పాలు కావాల్సిన పరిస్థితి కూడా ఎదురుకావచ్చు. వైద్య చికిత్సల వ్యయాలు ఎంతో ఖరీదుగా మారాయన్నది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఏటేటా చార్జీలు పెరుగుతూనే పోతున్నాయి. అందుకని హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడమే కాకుండా.. కుటుంబ సభ్యులు అందరికీ కవరేజీ తగినంత ఉండేలా చూసుకోవాలి. అరకొర కవరేజీతో తీసుకుంటే అవసరాలు తీరకపోవచ్చు. ఒక అంచనా ప్రకారం మధ్యతరగతి ప్రజల్లో 90 శాతానికి పైగా హెల్త్ కవరేజీ లేదు. ఉన్నా తగినంత కవరేజీ లేదు. ముఖ్యంగా చిన్న వయసులో వ్యాధుల రిస్క్ అంతగా ఉండదు. 40 ఏళ్లు దాటిన తర్వాత నుంచి ఈ రిస్క్ పెరుగుతుంది. యుక్త వయసులో మంచి ఆరోగ్యాన్ని చూసి హెల్త్ ఇన్సూరెన్స్‌ను ఎక్కువ మంది నిర్లక్ష్యం చేస్తుంటారు. అయితే, ఒక్కసారి ఆరోగ్య సమస్యలు వెలుగు చూసిన తర్వాత బీమా తీసుకోవాలంటే ప్రీమియం భారం ఎక్కువగా ఉంటుందని గుర్తుంచుకోవాలి. కనుక బీమా ఏదైనా కానీయండి ముందుగానే తీసుకోవాలి. ప్రీమియం తప్పకుండా చెల్లిస్తూ వెళ్లాలి. వైద్య బీమా తీసుకునే వారు 10 ఏళ్ల తర్వాత వైద్య ఖర్చులను పరిగణనలోకి తీసుకోవాలి. లేదంటే ప్రతీ పదేళ్లకు కవరేజీని సమీక్షించుకుని పెంచుకోవాలి. రుణాలకు దూరం విచక్షణ లేకుండా, ఆలోచన లేకుండా రుణాలు తీసుకోవడం నష్టానికి దారితీస్తుంది. మీ చెల్లింపుల సామర్థ్యాన్ని మించి రుణాలను ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకోవద్దు. అప్పటికే రుణాలు తీసుకుని ఉంటే వాటిని తీర్చడానికే మొదట ప్రాధాన్యం ఇవ్వాలి. రుణాల మీద రుణాలు తీసుకుని చెల్లింపులు కష్టమైతే.. క్రెడిట్ స్కోరు దెబ్బతింటుంది. దీంతో భవిష్యత్తులో ముఖ్యమైన రుణాలకు సమస్యలు ఏర్పడొచ్చు. జీవితంలో లాభదాయకమైన రుణం ఏదైనా ఉందంటే అది గృహ రుణమే. పన్ను ప్రయోజాలను పరిగణనలోకి తీసుకుంటే గృహ రుణం ఒక్కదానిని పరిశీలించొచ్చు. అలాగే, అవసరానికి పిల్లల ఉన్నత విద్య కోసం రుణ బాట కూడా పట్టొచ్చు. వ్యక్తిగత రుణాలు, కన్జ్యూమర్ రుణాలన్నవి విలువను తగ్గించేవి. వీటికి దూరంగా ఉండాలి. రుణ చెల్లింపులు నెలవారీ నికర ఆదాయంలో 50 శాతాన్ని మించకూడదన్నది ప్రాథమిక సూత్రం. ద్రవ్యోల్బణానికి చోటు సగటు ద్రవ్యోల్బణం 7 శాతం ఉంటుందని అనుకుంటే నేటి రూ.లక్ష విలువ కాస్తా.. 30 ఏళ్ల తర్వాత రూ.13,000 అవుతుంది. అంటే నేడు రూ.లక్షకు లభించే ఏదేనీ సేవ కోసం 30 ఏళ్ల తర్వాత ఏడున్నర రెట్లు అధికంగా చెల్లించాల్సి వస్తుందని అర్థం చేసుకోవాలి. అందుకనే భవిష్యత్తుకు ప్లాన్ చేసుకునే సమయంలో ద్రవ్యోల్బణానికీ ప్రాధాన్యం ఇవ్వాలి. భవిష్యత్తులో పిల్లల విద్య, వివాహం, రిటైర్మెంట్ అవసరాలకు ఎంత కావాలన్నది నిర్ణయించుకునే ముందు ద్రవ్యోల్బణ రేటును అంచనాల్లోకి తీసుకోవాలి. ద్రవ్యోల్బణాన్ని తట్టుకుని పొదుపు విలువ పెంచుకోవాలంటే.. పెట్టుబడులపై దీర్ఘకాలంలో సగటు రాబడి రేటు 14 శాతం అయినా వచ్చే విధంగా ప్లాన్ చేసుకోవాలని నిపుణుల సూచన. ఈపీఎఫ్ నిధికి ప్రాముఖ్యత ఉద్యోగం మారినప్పుడు, ముఖ్యమైన అవసరాలకు ఉద్యోగుల భవిష్యనిధి (ఈపీఎఫ్) నుంచి ఉపసంహరించుకోవడం చాలా మంది చేసే పని. గతంలో అంటే సంస్థను మారినప్పుడల్లా, పాత ఖాతాను బదలాయించుకోవడం తలనొప్పిగా భావించి దాన్ని మూసేసేవారు. సంస్థను మారిప్పుడల్లా కొత్త ఖాతాను తెరిచేవారు. కానీ, ఇప్పుడు యూనివర్సల్ ఖాతా నంబర్ విధానం అమల్లోకి వచ్చింది కనుక ఈ ఇబ్బందులు తొలగిపోయాయి. సంస్థను మారినా పాత ఖాతాను బ్యాలన్స్ సహా బదలాయించుకోవడానికే ప్రాధాన్యం ఇవ్వాలి. ఇలా అవసరమైనప్పుడల్లా ఈపీఎఫ్ నిధిని ఖాళీ చేస్తుండడం వల్ల పెద్ద నిధిని సమకూర్చుకునే అవకాశాన్ని కోల్పోతారు. ఇంటి నిర్మాణానికి, తీవ్ర ఆరోగ్య సమస్యలు ఎదురైనప్పుడు.. మరే ఇతర మార్గం లేనప్పుడు ఈపీఎఫ్ నిధిని పరిశీలించొచ్చు. అంతేకానీ, ఇతరత్రా అవసరాలకు భవిష్య నిధిని కదపకపోవడమే సూచనీయం. దీనివల్ల ఉద్యోగ విరమణ సమయంలో కాంపౌండింగ్ మహిమతో మంచి నిధిని అందుకోవచ్చు. కాంపౌండింగ్ పెట్టుబడులను ఎట్టి పరిస్థితుల్లో వాయిదా వేయవద్దు, ఆలస్యం చేయవద్దు. వాయిదా వేయడం వల్ల కాంపౌండింగ్ మ్యాజిక్‌ను కోల్పోవాల్సి వస్తుంది. కాంపౌండింగ్ పెట్టుబడిని మరింతగా వృద్ధి చేస్తుంది. ఉదాహరణకు ప్రతి నెలా రూ.5,000 చొప్పున 15 ఏళ్లపాటు ఇన్వెస్ట్ చేశారని అనుకుందాం. అప్పుడు పెట్టుబడి 9 లక్షలు అవుతుంది. 10 శాతం రాబడి ప్రకారం అంచనా వేస్తే 15 ఏళ్లకు రూ.20 లక్షలు అవుతుంది. దీన్ని మరింత కాలం కొనసాగిస్తూ వెళితే అప్పుడు రాబడికి రాబడి కలుస్తూ పెద్ద మొత్తం సమకూరుతుంది. పొదుపు/పెట్టుబడి పొదుపునే పెట్టుబడిగా భావించే వారు కూడా ఉన్నారు. బ్యాంకు ఖాతాలో ఉంచినా, ఫిక్స్డ్ డిపాజిట్ చేసినా దాన్ని పెట్టుబడిగా పరిగణించడం మెరుగైన ఆర్థిక జీవనానికి మార్గం కానే కాదు. ఎందుకంటే సేవింగ్స్ ఖాతాలో బ్యాలన్స్‌పై వచ్చే వడ్డీ రాబడి 3 శాతమే. ఇది ద్రవ్యోల్బణం రేటులో సగం. కరెన్సీ విలువను హరించే మేరకు రాబడి కూడా ఇవ్వనిది పెట్టుబడి సాధనం ఎలా అవుతుంది.? అలాగే ఫిక్స్డ్ డిపాజిట్లపైనా వడ్డీ రేటు 6.5 శాతం మించి లేదు. ఇది కూడా ద్రవ్యోల్బణం రేటుకు సమానమే. పైగా ఎఫ్డీపై వచ్చే వడ్డీ ఆదాయం ఆదాయపన్ను పరిధిలోకి వస్తుంది. డెట్ ఫండ్స్‌లో రిస్క్ తీసుకుంటే రాబడి రేటు 8 శాతం అందుకోవచ్చు. ద్రవ్యోల్బణం రేటు కంటే ఎక్కువ రాబడి ఇవ్వని ఏదీ కూడా పెట్టుబడి సాధనం కాబోదు. అందుకనే సంపాదనలో ఆదా చేసిన మొత్తాన్ని మంచి రాబడినిచ్చే సాధనంలో పెట్టినప్పుడే పెట్టుబడి అవుతుంది. అన్ని సాధనాల్లోకి ఈక్విటీలు దీర్ఘకాలంలో మెరుగైనవి. 20–30 ఏళ్ల కాలంలో వీటిల్లో రాబడి 12–18 శాతం మధ్య ఉంటుందని ఆశించొచ్చు. -
చిన్న పొదుపులపై వడ్డీరేట్లు యథాతథం
న్యూఢిల్లీ: పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్), నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ (ఎన్ఎస్సీ) సహా చిన్న పొదుపు పథకాలపై 2022–23 మొదటి త్రైమాసికంలో (ఏప్రిల్–జూన్) వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. దీనితో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నాల్గవ త్రైమాసికంలో ఉన్న వడ్డీరేట్లు వచ్చే 3 నెలల్లో కొనసాగనున్నాయి. చిన్న పొదుపు పథకాలపై వడ్డీరేట్లు త్రైమాసికం ప్రాతిపదికన నోటిఫై చేసే సంగతి తెలిసిందే. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తాను ఇచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు– రెపోను (ప్రస్తుతం 4 శాతం) వరుసగా పది ద్వైమాసిక సమావేశాల్లో ఒకేరీతిన కొనసాగిస్తూ, నిర్ణయం తీసుకుంది. దీనితో బ్యాంకులపై అదనపు వడ్డీ చెల్లింపు భారం అవకాశం లేదు. దీనివల్ల బ్యాంకుల్లో డిపాజిట్లు, రుణాలపై రేట్లు దాదాపు యథాతథంగానే కొనసాగే వీలుంది. ఈ పరిణామం చిన్న పొదుపులపై కూడా రేట్లను ఎక్కడివక్కడే ఉంచడానికి కారణమవుతోంది. కొన్ని పథకాల రేట్లు ఇలా... ► పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్‌పై రేటు 7.1 శాతంగా ఉంది. ► నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్‌పై వడ్డీ 6.8%. ► ఏడాది డిపాజిట్ స్కీమ్ 5.5% వడ్డీ ఆఫర్ చేస్తోంది ► బాలికా పథకం– సుకన్య సమృద్ధి యోజనపై అత్యధికంగా 7.6% వడ్డీ ఉంది. ► ఐదేళ్ల సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్‌పై వడ్డీరేటు 7.4%. వీటిపై త్రైమాసిక పరంగా వడ్డీ అందుతుంది. ► సేవింగ్స్ డిపాజిట్లపై వడ్డీరేటు వార్షికంగా 4%గా కొనసాగుతుంది. ► ఏడాది నుంచి ఐదేళ్ల టర్మ్ డిపాజిట్లపై వడ్డీ 5.5 శాతం 6.7% శ్రేణిలో ఉంది. వీటిపైనే వడ్డీ త్రైమాసికంగా అందుతుంది. ► ఐదేళ్ల రికరింగ్ డిపాజిట్‌పై వడ్డీ 5.8%. -
ఈపీఎఫ్ అలెర్ట్: ఈ-నామినేషన్ దాఖలు చేశారా? చేస్తే మీకే లక్షల్లో ప్రయోజనం!
ఖాతాదారులకు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ) బంపరాఫర్ ఇచ్చింది. ఈ నామినీ ప్రక్రియ నమోదు చేసిన వారికి లక్షల్లో ప్రయోజనాల్ని అందిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఇటీవల ఖాతాదారులు ఈ- నామినీని పూర్తి చేయాలని సూచించింది. నామినీ పూర్తి చేసిన ఉద్యోగుల భవిష్య నిధి (ఈపీఎఫ్ ) సభ్యులకు అనేక ప్రయోజనాల్ని అందిస్తుంది. పీఎఫ్ ఖాతాదారులు ఇ-నామినేషన్‌ను దాఖలు చేయడం ద్వారా అవాంతరాలు లేని, వేగవంతమైన ఆన్లైన్ సేవలు, ఉచితంగా రూ.7లక్షల వరకు బీమాను పొందవచ్చు. Benefits of filing e-Nomination. ई-नामांकन दर्ज करने के लाभ।#EPF #SocialSecurity #eNomination #AmritMahotsav @AmritMahotsav pic.twitter.com/xJ8AZbkZjD — EPFO (@socialepfo) March 22, 2022 "ఈ-నామినేషన్ దాఖలు చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు మీకు తెలుసా ?" సభ్యుడు మరణించిన తర్వాత ఆన్లైన్ లో క్లయిమ్ చేసుకోవచ్చు. పేపర్‌లెస్, వేగవంతమైన క్లెయిమ్ సెటిల్మెంట్. పీఎఫ్, పెన్షన్ ఆన్లైన్ చెల్లింపు. అర్హులైన నామినీలకు రూ.7 లక్షల వరకు బీమా. -
చిన్న పొదుపు పథకాల ఆదాయంపై పన్ను ఎంతో తెలుసా?
తక్కువ రిస్క్ తో ఎక్కువ పెట్టుబడి వచ్చే సామాన్య ప్రజానీకం పెట్టుబడులు పెట్టాలని చూస్తుంటారు? అలాంటి వారి కోసం బ్యాంక్ ఫిక్సిడ్ డిపాజిట్ (ఎఫ్డీ), పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్), సుకన్య సమృద్ధి యోజన(ఎస్ఎస్వై) చాలా ఉత్తమమైన పొదుపు పథకాలు. అయితే, ఈ పెట్టుబడుల నుంచి వచ్చే ఆదాయంపై మీరు చెల్లించే ఆదాయపు పన్ను గురుంచి తెలుసుకోవడం చాలా కీలకం. సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపుకు అర్హత సాధించిన అన్ని పెట్టుబడి పొదుపు పథకాలు ఆదాయపు పన్ను ఈఈఈ హోదాను పొందలేవు. ఈఈఈ అంటే ఏమిటి? ఈ అంటే మినహాయింపు, మినహాయింపు, మినహాయింపు. ఇక్కడ, మొదటి మినహాయింపు అంటే మీ పెట్టుబడి పెట్టె నగదుపై మినహాయింపుకు లభిస్తుంది. కాబట్టి, పెట్టుబడి పెట్టిన మొత్తానికి సమానమైన జీతంలో కొంత భాగంపై మీరు పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. అదేవిధంగా, రెండో మినహాయింపు అంటే మధ్యలో వైదొలిగినప్పుడు లభించే ఆదాయంపై మీరు ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదని అర్ధం. మూడవ మినహాయింపు అంటే మీరు పెట్టుబడి పెట్టిన ఆదాయంపై లభించే వడ్డీ, అసలు మొత్తంపై పన్ను మినహాయింపు పొందడం. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ వంటి దీర్ఘకాలిక పెట్టుబడులపై సాదరణంగానే ఈఈఈ స్టేటస్ లభిస్తుంది. ఇప్పుడు విభిన్న సుకన్య సమృద్ధి యోజన, పీపీఎఫ్, ఎఫ్డీ పెట్టుబడుల నుంచే వచ్చే ఆదాయంపై పన్ను ఎంత విధిస్తారో తెలుస్తుంది. బ్యాంక్ ఫిక్సిడ్ డిపాజిట్ (ఎఫ్డీ) బ్యాంకు ఫిక్సిడ్ డిపాజిట్ నుంచి వచ్చిన వడ్డీ ఆదాయం పూర్తిగా పన్ను పరిధిలోకి వస్తుంది. ఎఫ్డీలో చేసిన పెట్టుబడిపై వచ్చే వడ్డీపై బ్యాంకు 10శాతం టీడీఎస్ వసూలు చేస్తుంది. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్(పీపీఎఫ్) ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80సీ కింద ఆదాయపు పన్ను మినహాయింపుకు పీపీఎఫ్ అర్హత కలిగి ఉంది. మెచ్యూరిటీ తర్వాత వచ్చే వడ్డీపై ఎలాంటి ఛార్జీలు ఉండవు. సుకన్య సమృద్ధి యోజన(ఎస్ఎస్వై) పీపీఎఫ్ మాదిరిగానే,సుకన్య సమృద్ధి యోజన ఆడపిల్లల కోసం ప్రత్యేకంగ ప్రభుత్వం తీసుకొచ్చిన పెట్టుబడి పథకం. ఈ పథకం ఈఈఈ హోదాను పొందుతుంది. ఎస్ఎస్వైలో పెట్టుబడి పెట్టిన నగదుపై లభించే వడ్డీపై సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపు లభిస్తుంది. వడ్డీ రేట్లు ఫిక్సిడ్ డిపాజిట్లు అనేది స్థిరమైన వడ్డీ రేట్లకు గ్యారెంటీ ఇచ్చే సురక్షితమైన పెట్టుబడి ఎంపిక. అయితే, దీనిపై పెట్టె పెట్టుబడిపై వడ్డీ రేట్లు అనేవి బ్యాంకులను బట్టి మారుతంటాయి. భారతదేశంలోని టాప్ బ్యాంకులు సాధారణంగా నిర్ధిష్ట డిపాజిట్‌పై 5.6 - 6.7% వడ్డీ రేట్లను అందిస్తున్నాయి. పీపీఎఫ్ ఎస్ఎస్వై వంటి చిన్న పొదుపు పథకాలపై కేంద్రం వడ్డీ రేట్లను ఈ ఏడాది రెండవ త్రైమాసికంలో యదాతధంగా ఉంచింది. అంటే సెప్టెంబర్ 30, 2021 వరకు పాత వడ్డీ రేట్లు ఉంటాయి. సుకన్య సమృద్ధి యోజన ఖాతా - 7.6% పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్- 7.1% చదవండి: కొత్త డ్రైవింగ్ లైసెన్స్ తీసుకునే వారికి శుభవార్త! -
సుకన్య సమృద్ధి, పీపీఎఫ్ పొదుపు పథకాల కొత్త వడ్డీ రేట్లు ఇవే!
చిన్న పొదుపు పథకాలలో పెట్టుబడులు పెడుతున్న సామాన్య ప్రజలకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. కరోనా వైరస్ మహమ్మారి ఇంకా కొనసాగుతున్న కారణంగా 2021-22 రెండవ త్రైమాసికంలో సుకన్య సమృద్ధి యోజన, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, ఎన్ఎస్పీ, కేవీపీ వంటి చిన్న పొదుపు పథకాలపై కేంద్రం వడ్డీ రేట్లను మార్చకుండా యథాతథంగా ఉంచింది. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంతో సెప్టెంబర్ 30 వరకు పొదుపు పథకాలపై పాత వడ్డీ రేట్లు ఉంటాయి. ఆర్థిక మంత్రిత్వ శాఖ ఇప్పటి వరకు వరుసగా ఐదు త్రైమాసికాలు(సెప్టెంబర్ 30, 2021వరకు) వివిధ చిన్న పొదుపు పథకాలపై వడ్డీ రేట్లను మార్చకుండా అదేవిధంగా ఉంచింది. ఆర్థిక మంత్రిత్వ శాఖ దీనికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. అందులో ఇలా ఉంది.. "ఈ ఆర్థిక సంవత్సరం జూలై 1, 2021 నుంచి ప్రారంభమై సెప్టెంబర్ 30, 2021తో ముగిసే రెండవ త్రైమాసికంలో వివిధ చిన్న పొదుపు పథకాలపై వడ్డీ రేట్లు అనేవి మొదటి త్రైమాసికంలో(ఏప్రిల్ 1, 2021 నుంచి జూన్ 30, 2021) ఉన్న వడ్డీ రేట్లు మాదిరిగానే ఉండనున్నాయి" అని పేర్కొంది. ఈ నిర్ణయం వల్ల ఈ ఏడాది రెండవ త్రైమాసికంలో పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్(పీపీఎఫ్)పై 7.1 శాతం వడ్డీ రేటు, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్(ఎన్ఎస్పీ)పై 6.8% వార్షిక వడ్డీ రేటు లభిస్తాయి. అలాగే నెలవారీ ఇన్కమ్ అకౌంట్‌పై 6.6 శాతం, సేవింగ్స్ ఖాతాపై 4 శాతం ఇలా చిన్న మొత్తాల పొదుపు పథకాలపై గత త్రైమాసికంలో ఉన్న వార్షిక వడ్డీ రేట్లే ఉంటాయి. చిన్న పొదుపు పథకాల వడ్డీ రేట్లు పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ వడ్డీ రేటు - 7.1 శాతం నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ వడ్డీరేటు - 6.8 శాతం సుకన్య సమృద్ధి యోజన వడ్డీరేటు - 7.6 శాతం కిసాన్ వికాస్ పత్రా వడ్డీరేటు - 6.9 శాతం సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్‌పై వడ్డీ రేటు - 7.4 శాతం చదవండి: గ్లోబల్ సైబర్ సెక్యూరిటీలో చైనాను దాటేసిన భారత్ -
కష్టమైనా.. ఇన్వెస్ట్ చేయాల్సిందే..!
రిటైర్మెంట్.. ఏదో ఒకరోజు ఆహ్వానించాల్సిందే. ఉద్యోగాల్లో ఉన్న వారికి కాస్త ముందు, స్వయం ఉపాధుల్లోని వారికి కొంత ఆలస్యంగా అయినా.. వృద్ధాప్యంలో పని జీవితం నుంచి విశ్రాంతి అవసరమే. అప్పటి వరకు సంపాదనతో నడిచిన జీవితం.. ఆ తర్వాత కూర్చుని కొనసాగించాలంటే అందుకు ముందు నుంచే ప్రణాళికా బద్ధంగా వ్యవహరించాల్సిందే. రిటైర్మెంట్ కోసం పొదుపును పెద్దగా పట్టించుకోని ధోరణి యుక్త వయసులోని వారిలో ఎక్కువగా కనిపిస్తుంది. రిటైర్మెంట్ కోసం చాలా సమయం ఉందన్నది వారి ఆలోచనా తీరు. ఈ ధోరణితో రిటైర్మెంట్ ప్రణాళికను వాయిదా వేస్తే.. వివాహంతో గృహస్థాశ్రమంలోకి ప్రవేశించిన తర్వాత పిల్లలు, వారి ఉన్నత విద్య, వారి వివాహాలు, సొంతిల్లు, కారు తదితర లక్ష్యాలు ముఖ్యమైనవిగా మారతాయి. దీంతో తమ విశ్రాంత (వృద్ధాప్య) జీవనానికి సంబంధించిన ప్రణాళిక పక్కకు వెళ్లిపోతుంది. కారణం ఏదైనా కానీయండి.. వయసుతో సంబంధం లేకుండా సంపాదించే గ్రూపులో ఉన్న ప్రతీ ఒక్కరూ తమ పదవీ విరమణ జీవితానికి పొదుపును తక్షణం ప్రారంభించడమే మంచి పరిష్కారం. ఇది ఎంత ముందుగా ప్రారంభిస్తే అంత సులభంగా కావాల్సినంత సమకూర్చుకోవడం సాధ్యపడుతుంది. ఇందుకు ఏం చేయాలో చూద్దాం.. ఉద్యోగులు అయితే ‘ఉద్యోగుల భవిష్య నిధి’ (ఈపీఎఫ్) సదుపాయం ఉంటుంది. వేతనంలో ప్రతీ నెలా నిర్ణీత శాతం మేర ఈపీఎఫ్ ఖాతాకు వెళుతుంటుంది. ఉద్యోగి వాటాకు సమానంగా పనిచేయించుకునే సంస్థ కూడా తన వంతు వాటాను సమకూర్చడం ఇందులోని విశేషం. ఉద్యోగి ప్రమేయం లేకుండా క్రమం తప్పకుండా ప్రతీ నెలా భవిష్యనిధి ఖాతాకు జమ కావడం వల్ల దీన్ని మంచి సాధనంగా నిపుణులు చెబుతారు. దీనికి విరుద్ధంగా చాలా మంది ఈపీఎఫ్ విషయంలో తప్పుగా వ్యవహరిస్తుండడాన్ని చూడొచ్చు. తమ అవసరాలకు ఈపీఎఫ్ నిధిపై ఆధారపడుతుంటారు. ఇల్లు కొనుగోలు, ఉద్యోగం మారినప్పుడు ఈపీఎఫ్ నిధిని వెనక్కి తీసుకునేందుకు దరఖాస్తు చేసుకోవడాన్ని చూడొచ్చు. ఇలా చేయడం అన్ని సందర్భాల్లోనూ సరైనది కాదు. ఈపీఎఫ్ నిధిని కదపకుండా.. రిటైర్మెంట్ తర్వాత ఉపసంహరించుకోవడం వల్ల మంచి నిధిని చేతికందుకోవచ్చు. ప్రతీ ఉద్యోగికీ సాధ్యమయ్యే రిటైర్మెంట్ పొదుపు సాధనంగా దీన్ని చూడాలి. మరి రిటైర్మెంట్ జీవితానికి ఈపీఎఫ్ ఒక్కటి సరిపోతుందా..? లేదు. మరింత అదనంగా పొదుపు, మదుపు చేసుకుంటూ వెళ్లాలి. ఎంత మొత్తం అన్నది మీరు తీసుకునే రిస్క్, ఇన్వెస్ట్ చేయగలిగే మొత్తంపై ఆధారపడి ఉంటుంది. రిస్క్ తీసుకోని రక్షణాత్మక ధోరణి ఇన్వెస్టర్ అయితే డెట్ సాధనాలను పెట్టుబడులకు ఎంచుకోవాలి. ఓ మోస్తరు రిస్క్ అయినా ఫర్వాలేదనుకునే వారికి ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ అనుకూలం. ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్.. ప్రయోజనాలు ఈపీఎఫ్ ఉద్యోగుల భవిష్యనిధిలో జమ అయ్యే మొత్తాలకు సెక్షన్ 80సీ కింద పన్ను పడదు. ఉద్యోగి వాటాతోపాటు, సంస్థ జమ చేసే వాటా కూడా పన్ను మినహాయింపు పరిధిలోకి వస్తుంది. అంతే కాదు రిటైర్మెంట్ సమయంలో ఈపీఎఫ్ నుంచి తీసుకునే మొత్తంపైనా పన్ను మినహాయింపు ఉంటుంది. ఇందులో పెట్టుబడులు, రాబడులు, ఉపసంహరణల మొత్తం కూడా పన్ను లేనిదే. అందుకే ఉద్యోగాలలో ఉన్న వారు అనవసరాలకు ఈపీఎఫ్ నిధిని ఖాళీ చేయకుండా, రిటైర్మెంట్ కోసం కొనసాగించుకోవడం మంచి ఆలోచన అవుతుంది. ఒక సంస్థ నుంచి వేరే సంస్థకు మారినా, ఈపీఎఫ్ నిధిని బదిలీ చేసుకుని, కొనసాగించుకోవాలి. వాలంటరీ ప్రావిడెంట్ ఫండ్ ఈపీఎఫ్‌కు అనుసంధానంగా పనిచేసే వీపీఎఫ్‌ను వినియోగించుకునే వారు చాలా తక్కు వ మందే. ఈపీఎఫ్ వాటా మూల వేతనంలో 12 శాతానికే పరి మితం. కానీ, వీపీఎఫ్ విషయానికొస్తే మూలవేతనం, డీఏ రెండింటికి సమాన స్థాయిలో ప్రతీ నెలా పొదుపు చేసుకునేందుకు అనుమతి ఉంది. ఈపీఎఫ్ వడ్డీ రేటే వీపీఎఫ్‌కూ అమలవుతుంది కనుక.. మెరుగైన ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. ఇందు లో జమ చేసే మొత్తానికీ పన్ను మినహాయింపు పొందొచ్చు. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ వేతన జీవులు కాని వారికి పీపీఎఫ్ ఒకానొక సాధనం అవుతుంది. రాబడులు ఈపీఎఫ్‌తో పోలిస్తే ప్రస్తుతానికి ఒక శాతానికి పైగా తక్కువగా ఉన్నాయి. ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.1.5 లక్షల వరకు పీపీఎఫ్‌లో ఇన్వెస్ట్ చేసుకునేందుకు అనుమతి ఉంటుంది. ఇందులో రాబడులు, ఉపసంహరణలకూ పన్ను మినహాయింపు ఉంది కనుక ఇది కూడా డెట్‌లో ఒక మెరుగైన ఆప్షన్ అని చెప్పుకోవాలి. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ ఆర్జన ఆరంభమైన నాటి నుంచి రిటైర్మెంట్కు చాలా సమయం ఉంటుంది. కనుక ముందే రిటైర్మెంట్ కోసం ఇన్వెస్ట్మెంట్ ఆరంభించినట్టయితే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ రూపంలో ఘనంగా సమకూర్చుకోవచ్చు. మధ్యస్థ రిస్క్ ఉన్నా ఫర్వాలేదనుకుంటే.. ఈక్విటీ ఫండ్స్‌ను ఎంచుకుని ప్రతీ నెలా నిర్ణీత మొత్తాన్ని సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) రూపంలో ఇన్వెస్ట్ చేస్తూ వెళ్లాలి. ద్రవ్యోల్బణాన్ని అధిగమించి సంపదను సృష్టించుకునే మార్గం ఈక్విటీలు. కాకపోతే ఇన్వెస్ట్ చేస్తున్న ఫండ్స్ పనితీరును ఏడాదికోసారి తప్పకుండా సమీక్షించుకోవాలి. ఈఎల్ఎస్ఎస్ ఈక్విటీల్లోనే ఇవి ఒక విభాగం. ఇందులో ఒక ఆర్థిక సంవత్సరంలో గరిష్టంగా రూ.1.5 లక్షల పెట్టుబడులపై సెక్షన్ 80సీ కింద పన్ను రాయితీ పొందొచ్చు. రాబడులను వెనక్కి తీసుకున్న సమయంలో మాత్రం దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను 10 శాతం (రూ.లక్ష మించిన మొత్తాలపై) చెల్లించాల్సి ఉంటుంది. అయినా, రిటైర్మెంట్ కోసం ఈ పథకాలను ఎంచుకుని ఇన్వెస్ట్ చేస్తూ వెళ్లడం మంచి మార్గమే అవుతుంది. అంతేకాదు, రిటైర్మెంట్ తర్వాత ఈక్విటీ పథకాల నుంచి ఏకమొత్తంలో ఉపసంహరించుకోవాల్సిన అవసరం కూడా లేదు. ప్రతీ నెలా తమ అవసరాలకు కావల్సిన మొత్తాన్ని రిడెండప్షన్ చేసుకుంటూ వెళ్లొచ్చు. అప్పుడు మిగిలి ఉన్న పెట్టుబడులకు రాబడులు జమవుతూ ఉంటాయి. ఎన్పీఎస్ ఇది పూర్తిగా రిటైర్మెంట్ సేవింగ్స్ కోసం ఉద్దేశించిన సాధనం. ప్రభుత్వరంగ ఉద్యోగులకు ఇప్పుడు తప్పనిసరి అమల్లో ఉన్న పెన్షన్ సాధనం ఇదే. ప్రైవేటు రంగ సంస్థలు తమ అభీష్టం మేరకు ఈపీఎఫ్‌కు బదులు ఎన్పీఎస్ను కూడా ఎంచుకోవచ్చు. స్వచ్ఛందంగా ఎవరైనా ఎన్‌పీఎస్‌లో భాగం కావచ్చు. ఇందులో డెట్, ఈక్విటీల కలయికగా పెట్టుబడుల ఆప్షన్ ఎంచుకునేందుకు వీలుంది. ఎంత మేర ఎందులో ఇన్వెస్ట్ చేయాలన్నది నిర్ణయించుకోలేకపోతే.. వయసు ఆధారంగా ఈక్విటీ, డెట్ శాతాలను నిర్ణయించే ఆటో చాయిస్ ఆప్షన్‌ను ఎంపిక చేసుకోవచ్చు. అయితే, ఈపీఎఫ్, పీపీఎఫ్ సాధనాల్లో మెచ్యూరిటీ తర్వాత మొత్తాన్ని వెనక్కి తీసుకునేందుకు వీలుంటుంది. కానీ, ఎన్‌పీఎస్‌లో అలా కాదు.. 60 ఏళ్లనాటికి సమకూర్చుకున్న నిధిలో 60 శాతాన్నే వెనక్కి తీసుకునేందుకు వీలుంటుంది. ఈ మొత్తంపై పూర్తి పన్ను మినహాయింపు లభిస్తుంది. మిగిలిన 40 శాతంతో పెన్షన్ ఇచ్చే యాన్యుటీ ప్లాన్‌ను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఇలా యాన్యుటీ ప్లాన్ నుంచి ప్రతీ నెలా అందుకునే మొత్తం ఆదాయపన్ను పరిధిలోకి వస్తుంది. ఇలా మెచ్యూరిటీ తర్వాత కచ్చితంగా యాన్యుటీలో 40 శాతాన్ని ఇన్వెస్ట్ చేయాలన్న నిబంధన కొందరికి నచ్చకపోవచ్చు. అటువంటి వారు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ లేదా ఈక్విటీ, డెట్ కలయికతో కూడిన హైబ్రిడ్ ఫండ్స్‌ను ఎంచుకోవచ్చు. రక్షణాత్మక ధోరణి కలిగిన విభాగంలోకి మీరు వస్తే.. ఈపీఎఫ్ ఖాతాకు ప్రతీ నెలా మీ వంతు అదనంగా జమ చేయడం ఒక మంచి మార్గం. దీన్నే వాలంటరీ ప్రావిడెంట్ ఫంఢ్ (వీపీఎఫ్) అంటారు. ఈపీఎఫ్ నిల్వలపై అమలయ్యే వడ్డీ రేటే వీపీఎఫ్‌కూ వర్తిస్తుంది. డెట్ సాధనాల్లో ఈపీఎఫ్ అత్యధిక రిటర్నులు అందిస్తున్న ఒక సాధనమని గుర్తుంచుకోవాలి. ఒకవేళ ప్రభుత్వ, ప్రైవేటు రంగంలో పనిచేయని వారు ప్రజా భవిష్య నిధి (పీపీఎఫ్)ని ఎంచుకోవచ్చు. కాకపోతే ఇందులో రాబడులు కాస్త తక్కువగా ఉంటాయి. ఈపీఎఫ్‌తోపాటు వీపీఎఫ్ లేదా పీపీఎఫ్ రూపంలో రిటైర్మెంట్కు కావాల్సిన మేర నిధికి ప్రణాళిక వేసుకోవడం మంచి ఆలోచనే అవుతుంది. అయితే, డెట్ సాధనాల్లో వచ్చే రాబడిలో అధిక శాతం ద్రవ్యోల్బణ ప్రభావానికే కరిగిపోతుంది. కనుక అధిక రాబడుల కోసం కొంత మొత్తాన్ని అయినా ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేసుకోవాలి. మోస్తరు నుంచి అధిక రిస్క్ తీసుకునే వారికి ఈక్విటీలు అనుకూలమైన పొదుపు సాధనమని చెప్పుకోవాలి. ఈపీఎఫ్, వీపీఎఫ్, పీపీఎఫ్, ఈక్విటీ ఫండ్స్ కలయికతో పెట్టుబడుల ప్రణాళిక రూపొందించుకున్నామెరుగ్గానే ఉంటుంది. 20–30ల్లోనే ఉండి ఆదాయం మొదలు పెట్టిన వారు ఈక్విటీలకు అధిక కేటాయింపులు చేసుకోవడం ద్వారా భారీ నిధిని సమకూర్చుకునే అవకాశం సొంతం చేసుకోవచ్చు. రిటైర్మెంట్కు కనీసం 20–30 ఏళ్లు అయినా ఉంటే, ఈక్విటీల కలయికగా పెట్టుబడులను ప్లాన్ చేసుకోవాలి. పెంచుతూ పోవడం పరిష్కారం ఆదాయం పెరుగుతూ వెళుతున్నట్టే.. రిటైర్మెంట్ కోసం చేసే పొదుపు మొత్తాన్ని కూడా అంతే మేర పెంచుకుంటూ వెళ్లాలి. వీలైనంత ముందుగా పెట్టుబడులను ప్రారంభించాలి. చెప్పడం సులభం.. ఆచరణే కష్టం. కానీ, ఆరంభించేంత వరకే కష్టం. ఒక్కసారి మొదలు పెడితే, దానికి తగినట్టు ఖర్చులను సర్దుబాటు చేసుకోవచ్చు. రిటైర్మెంట్ కోసం కొంత మొత్తం కావాలన్న అవసరాన్ని ఒక్కొక్కరు ఒక్కో సమయంలో గుర్తిస్తుంటారు. కొందరు అయితే అప్పటి సంగతి అప్పుడే చూసుకోవచ్చనుకుంటారు. కానీ, ముందుగా ప్రారంభించినట్టయితే.. దానికి కాంపౌండింగ్ (వృద్ధి) శక్తి తోడవుతుంది. దాంతో దీర్ఘకాలానికి గణనీయమైన మొత్తాన్ని ఏర్పాటు చేసుకోగలుగుతారు. ఒకవేళ మీరు మధ్య వయసు కూడా దాటి, రిటైర్మెంట్ పొదుపును ఇంకా ప్రారంభించలేదని ఆలోచిస్తున్నారా..? ఆందోళన చెందకుండా వెంటనే ఆచరణలో పెట్టడం ఉత్తమం. ఏ మాత్రం ఆలస్యం చేయవద్దు. ఎందుకంటే 45–50లకు చేరిన తర్వాత రిటైర్మెంట్ కోసం పొదుపు మొదలు పెట్టడం వల్ల అవసరమైనంత నిధి సమకూరదు. చిన్న వయసులో అయితే సంపాదనలో కొంత భాగాన్ని పక్కన పెట్టినా సరిపోతుంది. కానీ, ఆలస్యం చేసిన కొద్దీ సంపాదనలో భారీ మొత్తాన్ని రిటైర్మెంట్కు కేటాయించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. రిటైర్మెంట్ అవసరాలకు ఎంత మేర కావాలి, అందుకు ఏం చేయాలన్న విషయమై సందేహాలు ఉంటే ఆర్థిక సలహాదారులను సంప్రదించి వారిచ్చే సూచనలను అనుసరించాలి. -
అటు రాబడి... ఇటు భద్రత
వడ్డీ రేట్లు అంతకంతకూ తగ్గిపోతున్నాయి. ఈ పరిస్థితుల్లో రాబడుల కోసం నూరు శాతం రిస్క్ తీసుకోవడం సూచనీయం కాదు. రాబడులు తక్కువే ఉన్నా ప్రతి ఒక్కరి పెట్టుబడుల పోర్ట్‌ఫోలియోలో డెట్ సాధనాలకూ(స్థిరాదాయ పథకాలు) తప్పకుండా చోటు ఉండాలి. ఈక్విటీలు దీర్ఘకాలంలో అధిక రాబడులను ఇచ్చిన చరిత్ర ఉన్నప్పటికీ.. గడిచిన మూడేళ్ల కాలంలో చూసుకుంటే అధిక శాతం ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో రాబడులు ప్రతికూలంగా ఉన్నాయి. కనుక డెట్ సాధనాలను ఎంత మాత్రం విస్మరించలేము. మరి డెట్ విభాగంలో పెట్టుబడులకు ఏది ఉత్తమమైన ఎంపిక? అన్న సందిగ్ధత ఉంటే.. ఈ గణాంకాలను పరిశీలిస్తే ఆ విషయమై స్పష్టత వస్తుంది. బ్యాంకు ఫిక్స్డ్ డిపాజిట్లు ఐదేళ్ల ఫిక్స్డ్ డిపాజిట్‌పై ఎస్బీఐ 5.70 శాతం వార్షిక వడ్డీని ఆఫర్ చేస్తోంది. సీనియర్ సిటిజన్లకు (వృద్ధులకు) 6.50 శాతంగా ఉంది. 20 శాతం పన్ను శ్లాబులో ఉన్న వృద్ధులకు నికరంగా మిగిలే రాబడి 5.15 శాతం కాగా, ఇతరులకు ఇది 4.51 శాతంగా ఉంది. అదే 30 శాతం శ్లాబు పరిధిలో ఉన్న వృద్ధులకు నికర రాబడి 4.47 శాతం అయితే, ఇతరులకు 3.92 శాతం రాబడి లభిస్తుంది. పన్ను రేటు సెస్సులతో కలిపి గణించడం జరిగింది. పన్ను ప్రయోజనాలు: సెక్షన్ 80సీ ప్రయోజనం లేదు. అందుకునే రాబడి కూడా పన్ను పరిధిలోకి వస్తుంది. అనుకూలం: ఎప్పుడు కోరుకుంటే అప్పుడు డిపాజిట్‌ను రద్దు చేసుకుని వెనక్కి తీసేసుకోవచ్చు. ప్రతికూలం: అధిక పన్ను పరిధిలో ఉన్న వారికి పన్ను చెల్లించగా మిగిలేది చాలా తక్కువే. ఎవరికి అనుకూలం?: కోరుకున్నప్పుడు వెంటనే డబ్బులు తీసుకునే వీలుండాలని అనుకునేవారికి. పన్ను ఆదా ఫిక్స్డ్ డిపాజిట్ బ్యాంకులు పన్ను ఆదా ప్రయోజనంతో కూడిన ఐదేళ్ల ఫిక్స్డ్ డిపాజిట్లను ఆఫర్ చేస్తున్నాయి. ఎస్బీఐలో పన్ను ఆదా ఎఫ్డీని పరిగణనలోకి తీసుకుంటే వృద్ధులకు 6.50 శాతం, ఇతరులకు 5.70 శాతం వడ్డీ రేటు అమల్లో ఉంది. సెక్షన్ 80సీ ప్రయోజనాన్ని వినియోగించుకుంటే 20 శాతం పన్ను పరిధిలోని వృద్ధులకు నికర రాబడి 6.50 శాతంగాను, ఇతరులకు 5.70 శాతంగాను ఉంటుంది. పన్ను ప్రయోజనం: ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.1.50 లక్షల వరకు పెట్టుబడిపై సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపును క్లెయిమ్ చేసుకోవచ్చు. రాబడిపై పన్ను పడుతుంది. అనుకూలం: సెక్షన్ 80సీ కింద పన్ను ఆదా ప్రయోజనం. ప్రతికూలం: ఐదేళ్ల లాకిన్‌తో వస్తుంది. కనుక ఆ తర్వాతే ఇన్వెస్ట్మెంట్ మొత్తాన్ని వెనక్కి తీసుకునే వీలుంటుంది. ఎవరికి అనుకూలం?: పన్ను ఆదా కోసం బ్యాంకుల్లోనే ఇన్వెస్ట్ చేసుకుంటాననే వారికి. నోట్: చిన్న బ్యాంకులు అధిక రాబడులను ఆఫర్ చేస్తున్నాయి. రిస్క్ తీసుకునే వారు వాటిని పరిశీలించొచ్చు. సుకన్య సమృద్ధి యోజన ప్రస్తుతం వడ్డీ రేటు 7.60 శాతం. పెట్టుబడులపై సెక్షన్ 80సీ పన్ను ప్రయోజనాన్ని వినియోగించుకుంటే 20 శాతం, 30 శాతం పన్ను పరిధిలోని వారికి నికర రాబడి 7.60 శాతంగానే ఉంటుంది. పన్ను ప్రయోజనాలు: ఈ పథకంలో పెట్టుబడులకు సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపు ఉంది. రాబడిపై పన్ను పడుతుంది. అనుకూలం: అధిక వడ్డీ రేటు, ఎటువంటి రిస్క్ లేకపోవడం. పరిమితులు: గరిష్టంగా ఇద్దరు కుమార్తెల పేరిట తల్లిదండ్రులు మాత్రమే ఈ ఖాతాను తెరిచేందుకు ఉంటుంది. ఒక ఏడాదిలో గరిష్టంగా రూ.1.5 లక్షల వరకే ఇన్వెస్ట్ చేసుకునే పరిమితి ఉంటుంది. కుమార్తె విద్యా, వివాహ అవసరాలకు ఉపయోగపడుతుంది. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ ప్రస్తుత రేటు 7.10 శాతం. పన్ను ప్రయోజనాలు: పెట్టుబడులకు సెక్షన్ 80సీ ప్రయోజనాలు వర్తిస్తాయి. రాబడిపైనా పన్ను ఉండదు. అనుకూలతలు: పన్ను లేని అధిక రాబడి రేటు. రిస్క్ ఉండదు. పరిమితులు: 15 ఏళ్ల పథకం. ఒక ఆర్థిక సంవత్సరంలో గరిష్టంగా రూ.1.5 లక్షల వరకే ఇన్వెస్ట్ చేసుకోగలరు. రాబడులు: సెక్షన్ 80సీ పన్ను ఆదాను కలిపి చూసుకుంటే 20% పన్ను పరిధిలోని వారికి నికర రాబడి రేటు 8.96 శాతం, 30% పన్ను పరిధిలోని వారికి ఇది 10.32 శాతం. ఎవరికి?: పన్ను పరిధిలోని వ్యక్తుల దీర్ఘకాల అవసరాలకు. సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ ప్రస్తుతం అమల్లో ఉన్న వడ్డీ రేటు 7.40%. 20% పన్ను పరిధిలోని వారికి 5.86%, 30% పన్ను పరిధిలోని వారికి నికర రాబడి రేటు 5.09 శాతంగాను ఉంటుంది. సెక్షన్ 80సీ ప్రయోజనాన్ని వినియోగిం చుకుంటే 20 % పన్ను శ్లాబులోని వారికి నికర రాబడి రేటు 7.40%గానే ఉంటుంది. పన్ను ప్రయోజనం: సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్‌లో చేసే పెట్టుబడులను సెక్షన్ 80సీ కింద చూపించి పన్ను ఆదా పొందొచ్చు. వడ్డీ ఆదాయం మాత్రం పన్ను పరిధిలోకి వస్తుంది. అనుకూలం: అధిక వడ్డీ రేటుతోపాటు రిస్క్ అస్సలు ఉండదు. పరిమితులు: 60 ఏళ్లు పైబడిన వారికే పరిమితం. గరిష్ట పెట్టుబడి రూ.15 లక్షల వరకే. ఐదేళ్ల లాకిన్ అమలవుతుంది. నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్స్ ఇందులో ఆఫర్ చేస్తున్న ప్రస్తుత వడ్డీ రేటు 6.80%. పన్ను ప్రయోజనాలు: సెక్షన్ 80సీ పన్ను ఆదాకు అర్హత ఉంది. వడ్డీ రాబడిపై పన్ను ఉంటుంది. అనుకూలం: ఎటువంటి రిస్క్ లేకపోవడం. ప్రతికూలం: ఐదేళ్ల లాకిన్ అమలవుతుంది. రాబడులు: 20% పన్ను పరిధిలో ఉన్న వారికి పన్ను పోను నికర రాబడి 5.39 శాతం. 30% పన్ను పరిధిలోని వారికి నికర రాబడి 4.68 %. ఎవరికి?: రిస్క్ వద్దనుకునే వారు పరిశీలించదగినది. డెట్ మ్యూచువల్ ఫండ్స్ ఇందులో రిస్క్ లేని రెండు విభాగాలు లిక్విడ్ ఫండ్స్, ఓవర్‌నైట్ ఫండ్స్‌ను తీసుకుంటే.. లిక్విడ్ ఫండ్స్‌లో రాబడులు వార్షికంగా 5.58% వరకు ఉంటాయి. ఓవర్‌నైట్ ఫండ్స్‌లో 4.70% వరకు ఉండొచ్చు. పన్ను ప్రయోజనాలు: ఇందులో పెట్టుబడులకు, రాబడులు ఎటువంటి పన్ను ప్రయోజనాల్లేవు. అనుకూలతలు: ఎటువంటి లాకిన్ ఉండదు. అవసరమైనప్పుడు వేగంగా ఉపసంహరించుకోవచ్చు. ప్రతికూలతలు: భవిష్యత్తులో వడ్డీ రేట్లు తగ్గే అవకాశం ఉన్న నేపథ్యంలో రాబడులు ఇంకా తగ్గొచ్చు. ఎవరికి?: అధిక లిక్విడిటీ కోరుకునే వారికి. వాలంటరీ ప్రావిడెంట్ ఫండ్ ప్రైవేటు రంగంలోని ఉద్యోగులకు ఈపీఎఫ్‌కు అనుబంధంగా ఇన్వెస్ట్ చేసుకునే వీలున్న సాధనం. ఇందులో 2018–19లో అమల్లో ఉన్న రేటు 8.65 శాతం. పన్ను ప్రయోజనాలు: ఇందులో పెట్టుబడులకు సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపులు ఉన్నాయి. రాబడిపైనా పన్ను ఉండదు. వీటిని పరిగణనలోకి తీసుకుంటే 20 శాతం శ్లాబులోని వారికి నికర రాబడి రేటు 10.92 శాతంగాను, 30 శాతం పన్ను పరిధిలోని వారికి 12.57 శాతంగాను ఉంటుంది. అనుకూలతలు: మార్కెట్ కంటే అధిక రాబడులు ఇందులో ఉంటున్నాయి. పరిమితులు: ఈపీఎఫ్ పరిధిలో ఉన్న వారికే ఇది పరిమితం. అలాగే, ఉపసంహరణలకు పరిమితులు ఉన్నాయి. ఎవరికి?: రిస్క్ రహితంగా దీర్ఘకాలంలో సంపదను సృష్టించుకోవాలని అనుకునే వారికి. ఐదేళ్ల కంపెనీ డిపాజిట్ కంపెనీలు తమ అవసరాల కోసం వివిధ మార్గాల్లో నిధులను సమీకరిస్తుంటాయి. ఫైనాన్షియల్ ఇనిస్టిట్యూషన్స్, ఎన్బీఎఫ్సీలు డిపాజిట్ల రూపంలో నిధులు సేకరిస్తుంటాయి. వీటిల్లో హెచ్డీఎఫ్సీ ఆఫర్ చేస్తున్న డిపాజిట్‌పై వడ్డీ రేటు పెద్దలకు 7.55 శాతం, ఇతరులకు 7.30 శాతంగా ఉంది. 20 శాతం పన్ను పరిధిలో ఉన్న వృద్ధులకు నికరంగా వచ్చే రాబడి 5.98 శాతం.. ఇతరులకు 5.78%. 30% పన్ను పరిధిలోని వృద్ధులకు నికరంగా అందే రాబడి 5.19%, ఇతరులకు 5.02 శాతంగా ఉంటుంది. పన్ను ప్రయోజనాలు: పన్ను ప్రయోజనాలు కంపెనీల డిపాజిట్లపై ఉండవు. అనుకూలతలు: బ్యాంకు ఎఫ్‌డీల కంటే అధిక వడ్డీ రేటు లభిస్తుంది. ప్రతికూలతలు: అధిక రిస్క్ ఉంటుంది. ముందస్తుగా డబ్బులను వెనక్కి తీసుకోవాలంటే నియంత్రణలు ఉంటాయి. ఎవరికి?: అధిక రిస్క్ ఉన్నా ఫర్వాలేదనుకునే వారికి. ఏఏఏ రేటింగ్ కలిగిన సంస్థల డిపాజిట్లనే పరిశీలించడం మంచిది. -
ఒక్క దెబ్బకు రెండు పిట్టలు
ఈక్విటీ ఆధారిత పొదుపు పథకాలతో రెండు విధాలా మేలు పన్ను ప్రయోజనాలు దీర్ఘకాలికంగా అధిక రాబడులు సేఫ్ గేమ్ తగదు... ఇన్వెస్ట్ చేయడమంటే.. ఏదో ఒక సాధనంలో పెట్టుబడి పెట్టేయడం కాదు. సరైన సాధనాన్ని ఎంచుకోవాలి. రిస్కును తగ్గించుకునేందుకు చాలా మంది యువత కూడా తక్కువ రిస్కుండే ఫిక్సిడ్ డిపాజిట్లు, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్లు వంటి వాటిలో అత్యధికంగా ఇన్వెస్ట్ చేస్తుంటారు. దీనివల్ల అధిక రాబడులు దక్కించుకునే అవకాశాలను కోల్పోతారు. రిటైర్మెంట్ వంటి దీర్ఘకాలిక లక్ష్యాల కోసం ఈక్విటీ మార్కెట్స్ వంటి సాధనాలే సరైనవి. ఉదాహరణకు వార్షిక ప్రాతిపదికన పీపీఎఫ్ పదిహేనేళ్ల కాలానికి 8.3 శాతం రాబడులే అందించగా.. బీఎస్ఈ సెన్సెక్స్ అదే వ్యవధిలో 14.7 శాతం రాబడినిచ్చింది. పన్ను ప్రయోజనాలూ ముఖ్యమే.. మనం పెట్టే పెట్టుబడులు మన సంపద పెరుగుదలకు ఉపయోగపడటంతో పాటు పన్ను ప్రయోజనాలు కూడా అందించేలా చూసుకోవాలి. ఏడాదికి రూ.1.5 లక్షలు సరిగ్గా ఇన్వెస్ట్ చేయడం ద్వారా గణనీయంగా పన్ను మినహాయింపులు పొందవచ్చన్నది చాలా మందికి తెలీదు (గరిష్ట ట్యాక్స్ రేటు 34.61 శాతంగాను, సెక్షన్ 80సీ కింద లభించే పన్ను మినహాయింపులను పరిగణనలోకి తీసుకుంటే). ట్యాక్స్ పేయర్లు పన్ను పోటును తగ్గించుకునేందుకు ప్రభుత్వం.. పీపీఎఫ్, జాతీయ పింఛను పథకం (ఎన్పీఎస్) పోస్టాఫీస్ డిపాజిట్, అయిదేళ్ల బ్యాంకు డిపాజిట్, జీవిత బీమా, ఈక్విటీ ఆధారిత సేవింగ్స్ స్కీము (ఈఎల్ఎస్ఎస్) మొదలైన సాధనాలెన్నో అందుబాటులో ఉంచింది. వీటిలో ఏదో ఒకటి ఎంచుకోవడం కాకుండా రిస్కులు, రివార్డులు బేరీజు వేసుకుని చూసుకోవాలి. ఇక్కడే ఈఎల్ఎస్ఎస్ ఉపయోగపడుతుంది. ఈఎల్ఎస్ఎస్ .. మిగతావాటితో పోటీ... ముందుగా.. గరిష్టంగా రూ. 1.5 లక్షలు ఇన్వెస్ట్ చేసేందుకు పన్ను ఆదా ప్రయోజనాలు కల్పించే సాధనాల మధ్య కొన్ని వ్యత్యాసాలు పరిశీలిద్దాం (అదనంగా రూ. 50,000 దాకా మినహాయింపుని అందించే ఎన్పీఎస్ కలపకుండా). ఉదాహరణకు మీరు ప్రతీ సంవత్సరం రూ. 1.5 లక్షలు చొప్పున రెండు దశాబ్దాలు ఇన్వెస్ట్ చేశారనుకుందాం. అంటే అప్పటికి మీరు ఇన్వెస్ట్ చేసిన మొత్తం రూ. 30 లక్షలకు చేరుతుంది. వేల్యూరీసెర్చ్ సంస్థ అంచనాల ప్రకారం గడిచిన ఇరవై ఏళ్లుగా పీపీఎఫ్‌లో ఇంత మొత్తం ఇన్వెస్ట్ చేసి ఉంటే 2015 నాటి గణాంకాల ప్రకారం 9.59 శాతం రాబడి తో రూ. 82.14 లక్షలు అయ్యేది. ఇది చాలా పెద్ద మొత్తమే! కానీ వడ్డీ రేట్లు తగ్గుతున్న నేపథ్యంలో ఇదే స్థాయి రాబడులు కొనసాగకపోవచ్చు. అదే.. ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్ వార్షిక సగటు రాబడులను పరిగణనలోకి తీసుకుంటే... మీరు ఇన్వెస్ట్ చేసిన రూ. 30 లక్షలు.. ఏకంగా 2.74 కోట్లయ్యేది. ఇది పీపీఎఫ్‌కి మూడు రెట్లు అధికం. అంటే 19.81 శాతం రాబడి అన్నమాట. గడిచిన ఇరవై ఏళ్ల వ్యవధిలో స్టాక్ మార్కెట్ రెండు సంక్షోభాలు ఎదుర్కొన్న తర్వాత కూడా ఈ స్థాయి రాబడులు అందుకోగలగడం గమనార్హం. కనుక ఈఎల్ఎస్ఎస్లో ఇన్వెస్ట్ చేసి ఉంటే కోటీశ్వరులు కావడంతో పాటు పన్నులు కూడా ఆదా చేసుకుని ఉండేవారని చెప్పవచ్చు. లాకిన్ వ్యవధి ప్రయోజనాలు.. పెట్టే పెట్టుబడులపై రాబడులతో పాటు లాకిన్ వ్యవధి చూసుకోవడమూ ముఖ్య మే. బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లు, పోస్టాఫీస్ టైమ్ డిపాజిట్లు మొదలైన వాటికి లాకిన్ వ్యవధి అయిదేళ్లుగా ఉండగా, ఎన్ఎస్సీకి 6 ఏళ్లు, పీపీఎఫ్‌కు 15 ఏళ్లు (ఆరేళ్ల తర్వాత పాక్షిక విత్‌డ్రాయల్ సదుపాయం ఉంది)గా ఉంది. అదే ఈఎల్ఎస్ఎస్కయితే యూనిట్ల కేటాయింపు తేదీ నుంచి మూడేళ్ల వ్యవధి మాత్రమే. అయితే, ఈ వ్యవధి ముగియగానే రిస్కు పెరిగిపోతుందేమోనని డబ్బు అవసరం లేకపోయినా.. చాలా మంది ఇన్వెస్టర్లు తమ యూనిట్స్‌ను అమ్మేస్తుంటారు. మళ్లీ ఆ డబ్బును తీసుకెళ్లి ఎక్కడో ఒక దగ్గర ఇన్వెస్ట్ చేయాల్సిందే కదా! కాబట్టి లాకిన్ వ్యవధి అయిపోయినా డబ్బు నిజంగానే అవసరం అయ్యేంత వరకూ.. ఈఎల్ఎస్ఎస్ నిధులను అందులోనే ఇన్వెస్ట్ చేయడం కొనసాగించడం వల్ల మరిన్ని ప్రయోజనాలు పొందవచ్చు. ఎప్పుడు.. ఎంత మొత్తంతో మొదలుపెట్టాలి.. చాలా మంది జనవరి–మార్చి మధ్య పన్ను లెక్కలేసుకోవడం మొదలుపెడతారు. పన్ను పోటును తప్పించే ఇన్వెస్ట్మెంట్ సాధనాల కోసం హడావుడి పడుతుంటారు. ఇలా ఏడాది చివర్న ఎకాయెకిన రూ. 1.5 లక్షలు పెట్టుబడి పెట్టేందుకు పరుగులు తీయకుండా .. ప్రతి నెలా కొంత కొంతగా.. అంటే రూ. 12,500 చొప్పున ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తూ వెడితే, చివరికి రూ. 1.5 లక్షల టార్గెట్ సులువుగా చేరుకోవచ్చు. దీనివల్ల 3 ప్రయోజనాలు ఉన్నాయి. ఆఖరి 2–3 నెలల్లో ఆర్థిక ఒత్తిడులు తగ్గించుకోగలగడం మొదటిది. ఆర్థిక క్రమశిక్షణ అలవర్చుకోగలగడం రెండోది. ఇక మూడోదేమిటంటే.. ప్రతి నెలా ఇన్వెస్ట్ చేయడం వల్ల ఫండ్ యూనిట్స్‌ను వేర్వేరు రేట్లలో కొనుక్కోవచ్చు. మార్కెట్ తగ్గినప్పుడు ఎక్కువ యూనిట్లు దక్కించుకోవచ్చు. తద్వారా లాభాలను మరింతగా పొందే అవకాశం దక్కించుకోవచ్చు. క్లుప్తంగా రెండు పిట్టలను ఒకే దెబ్బతో తెచ్చిపెట్టగలిగే సాధనం ఈఎల్ఎస్ఎస్. ఇటు పన్నుపరంగాను, అటు పెట్టుబడిపరంగాను ప్రయోజనాలు కల్పిస్తుంది. పైపెచ్చు ఒకటి కొంటే మూడు ఫ్రీ డిస్కౌంటు ఆఫర్‌లాగా కూడా పనిచేస్తుంది. పన్ను పరిధిలోకి వచ్చే రూ. 1.5 లక్షల మొత్తానికి మినహాయింపు పొందవచ్చు. ఇక ఈ పెట్టుబడిపై డివిడెండు రూపంలో వచ్చే ఆదాయానికి, పూర్తి మొత్తంపై వచ్చే రాబడికి కూడా మినహా యింపు ఉంటుంది. ఇలా సిస్టమాటిక్ పద్ధతిలో పన్ను మినహాయింపు పొం దేందుకు చేసే ఇన్వెస్ట్‌మెంట్‌తో భవిష్యత్‌లో సంపదను కూడా పెంచుకోవచ్చు. రిటైర్మెంట్ తర్వాత అవసరాలకు తగినన్ని ఆర్థిక వనరులు లేకపోవడమనేది పదవీ విరమణకు దగ్గర్లో ఉన్న వారికి ఆందోళనకరమే. ఇలాంటి సమస్య రాకూడదంటే... యుక్తవయసు నుంచే సరైన ఇన్వెస్ట్మెంట్ సాధనాలను ఎంచుకోవటమొక్కటే తగిన మార్గం. సదరు సాధనం పన్ను ప్రయోజనాలతో పాటు అటు అధిక రాబడులు సైతం ఇవ్వగలగాలి. ఈక్విటీ ఆధారిత సేవింగ్స్ స్కీము (ఈఎల్ఎస్ఎస్) ఈ కోవకి చెందినదే. ఈ అంశాలను మరింతగా రిశీలిస్తే... -
పి.పి.ఎఫ్ చిలకరించండి... మొలకలేస్తుంది
ఉమన్ ఫైనాన్స్ మహిళలు అతి తక్కువ మొత్తంతో తక్కువ రిస్క్‌తో కూడిన సాంప్రదాయిక దీర్ఘకాలిక పెట్టుబడి మార్గాలలో పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పి.పి.ఎఫ్.) ఒకటి. దీని గురించి తెలుసుకుందాం. పి.పి.ఎఫ్ స్కీమును మన దేశ ఆర్థిక మంత్రిత్వ శాఖ వారు 1968లో పన్ను మినహాయింపు పథకంగా ప్రవేశపెట్టారు. ప్రజల్లో పొదుపును ప్రోత్సహించి వాటి ద్వారా రిటైర్మెంట్ సమయానికి తగిన మొత్తాన్ని ఏర్పరచడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం. పి.పి.ఎఫ్. ఖాతాను ప్రారంభించాలంటే ... భారతదేశంలో నివాసం ఉంటూ కనీసం 18 సం॥వయస్సు కలవారై ఉండాలి. ఎన్.ఆర్.ఐ.లు, హెచ్.యు.ఎఫ్.లు ఈ ఖాతాను ప్రారంభించడానికి వీలు కాదు. అలాగే దీనిని జాయింట్ అకౌంట్‌గా తెరవలేము. ఒకవేళ ఎవరైనా ఖాతాను ప్రారంభించిన తర్వాత వారు ఎన్.ఆర్.ఐ. అయితే వారి ఖాతా 15 సంవత్సరాల వరకు మాత్రమే ఉంటుంది. ఆ తర్వాత క్లోజ్ చేయడం జరుగుతుంది. పొడిగించడానికి వీలుపడదు. పి.పి.ఎఫ్. ఖాతాను పోస్ట్ ఆఫీసు వారు, బ్యాంకులు తమ నిర్ణీత శాఖలలో అందజేస్తున్నాయి.ఖాతాను ప్రారంభించడానికి 100 రూపాయలు కట్టవలసి ఉంటుంది. కనీస మొత్తంగా 500 రూపాయలు జమ చేయాలి.ఖాతా తెరిచాక సంవత్సరానికి రు.500 మొదలుకొని రూ.1,50,000 వరకు ఒక్కసారైనా జమ చేయాలి. ఒకవేళ జమ చేయకపోతే ఖాతా ‘ఇన్ యాక్టివ్’లోకి మారుతుంది. మళ్లీ యాక్టివ్ చేయాలంటే జమ చేయవలసిన కనీస మొత్తంతో పాటు 50 రూపాయల జరిమానాను చెల్లించవలసి ఉంటుంది.ఖాతా ఇన్‌యాక్టివ్‌లో ఉన్నప్పుడు వడ్డీ వర్తించదు. {పస్తుతం పి.పి.ఎఫ్. ఖాతాలో ఉన్న మొత్తానికి ఏడాదికి సుమారు 8.7 శాతం చొప్పున చక్రవడ్డీని అందజేస్తున్నారు. వడ్డీరేటును ప్రతి సంవత్సరం ప్రభుత్వమే నిర్ణయిస్తుంది.వడ్డీని ప్రతి సంవత్సరం మార్చి 31వ తేదీన ఖాతాకు జమ చేస్తారు. పి.పి.ఎఫ్. ఖాతాకు మీరు జమ చేసేటప్పుడు ఏ నెలైనా కానీ 1వ తేదీ నుండి 5వ తేదీ లోపు జమ చేయండి. ఒకవేళ 5 తర్వాత జమ చేసినట్లయితే ఆ నెలకు ఆ జమ చేసిన మొత్తానికి వడ్డీ రాదు. తర్వాతి నెల నుండి మాత్రమే వడ్డీని లెక్క కడతారు.ఈ ఖాతాను మైనరు పేరు మీద కూడా తల్లిదండ్రులు లేదా గార్డియన్ ప్రారంభించవచ్చు.ఒకసారి ఖాతాను ప్రారంభించిన తర్వాత, వెంటనే క్లోజ్ చేయడానికి వీలుండదు. 15 సంవత్సరాల తర్వాత మాత్రమే క్లోజ్ చెయ్యడానికి వీలవుతుంది. కనుక ప్రతి సంవత్సరం తప్పని సరిగా కనీస మొత్తాన్ని జమ చేయడం మంచిది.15 సంవత్సరాల తర్వాత కూడా ఖాతాని పొడిగించదలచుకుంటే మరో 5 సంవత్సరాలు పొడిగించుకునే వెసులుబాటు ఉంది.ఖాతా ప్రారంభించిన 7వ సంవత్సరం నుండి కొంత మేర డిపాజిట్ మొత్తాన్ని విత్‌డ్రా చేసుకునే సౌలభ్యం ఉంది. ఇందులో సమకూరే మొత్తానికి నామినీని కూడా నమోదు చేసుకోవచ్చు.ఖాతాని ప్రారంభించిన 3 సంవత్సరాల నుండి 6 సంవత్సరాల వరకు లోన్ తీసుకునే సదుపాయం ఉంది. ఖాతాలో జమ చేసే మొత్తాన్ని డబ్బు, చెక్, డి.డి., ఆన్లైన్ ట్రాన్స్ఫర్ రూపంలో జమ చేయవచ్చు. ఖాతా ప్రయోజనాలు ప్రతి సంవత్సరం పి.పి.ఎఫ్. ఖాతాలో మీరు జమ చేసే మొత్తానికి సెక్షన్ 80 సి కింద రూ.1,50,000 వరకు పన్ను మినహాయింపు పొందవచ్చు. ఒకవేళ మీరు మైనర్ ఖాతాలో కూడా జమ చేసి ఉంటే మైనరు ఖాతా, మీ ఖాతా కలిసి రూ.1,50,000 మించకూడదు.వడ్డీకి కూడా పన్ను భారం పడదు.మెచ్యూరిటీ సమయానికి ఈ ఖాతా ద్వారా లభించే మొత్తానికి కూడా పన్ను వర్తించదు.అలాగే ఈ ఖాతాలోని మొత్తానికి కోర్టు ఎటాచ్మెంట్ వర్తించదు. అంటే మీరు ఒకవేళ రుణభారంతో ఇబ్బంది పడుతున్నప్పుడు ఆ రుణమాఫీకి మీ పి.పి.ఎఫ్. ఖాతాలోని మొత్తాన్ని మాఫీకి వాడేందుకు వీలుండదు.ఏ వ్యక్తై చిన్న మొత్తంలో ప్రతి నెల క్రమం తప్పకుండా ఈ పథకంలో పెట్టే పెట్టుబడి దీర్ఘకాలం కొనసాగించినట్లయితే వారికున్న.. పిల్లల ఉన్నత విద్య, పెళ్లి, ఇల్లు కట్టుకోవడం, రిటైర్మెంట్.. వంటి భారీ లక్ష్యాలను చేరుకోవడం సులభతరం అవుతుంది. పొదుపు మదుపు పథకాలు కొన్నిట్లోనయినా ఈ పథకంలో ఉన్నట్లు ‘లాక్-ఇన్’ లేనట్లయితే నిధిని సమకూర్చుకోవడం కష్టతరం అవుతుంది. కాబట్టి చిన్న, మధ్య తరగతి కుటుంబాలకు ఈ పి.పి.ఎఫ్ ఒక చక్కటి పథకంగా ఉపయోగపడుతుంది. -
ఆదాయపు పన్ను మినహాయింపునకు ఆఖరి అవకాశాలు!
మార్చి వచ్చేస్తోంది. వచ్చేనెల 31తో ఈ ఆర్థిక సంవత్సరం ముగుస్తుంది. నిజానికి ఆదాయపు పన్ను కాస్త తగ్గించుకోవాలన్నా... దానికి తగ్గట్టు ఆదా చెయ్యాలన్నా ఆర్థిక సంవత్సరం ఆరంభం నుంచే చెయ్యాలి. నెలజీతంపై ఆధారపడిన ఉద్యోగులైనా, నికర ఆదాయంపై ఆధారపడే వృత్తి నిపుణులైనా అప్పటికప్పుడు డబ్బులు తేవాలంటే కష్టం కనక ఏడాది ఆరంభం నుంచే ప్లానింగ్ చేయాలి. ఏ నిపుణుడు చేసే సూచనైనా ఇదే. ‘సాక్షి’ ప్రాఫిట్ పేజీని రెగ్యులర్‌గా చూసేవారికి సెక్షన్ 80సీ కింద ఈ ఏడాది రూ.1.5 లక్షల వరకు మినహాయింపు చూపించవచ్చన్న విషయంతో పాటు ఏ సెక్షన్ కింద ఎంత పన్ను మినహాయింపు లభిస్తుందనేది కూడా సవివరంగా తెలుసు. అయితే కొందరు మాత్రం ‘తరవాత చూద్దాంలే’ అనే వైఖరితో ఏడాది చివరిదాకా ఎలాంటి ప్లానింగూ చెయ్యరు. మరి అలాంటి వాళ్ల సంగతేంటి? వాళ్లకు ఆఖరి క్షణంలో పన్ను భారం తగ్గించుకునే మార్గాలేమైనా ఉన్నాయా? ఉంటే ఆ మార్గాలేంటి? ఇదే ఈ వారం ప్రాఫిట్ ప్రధాన కథనం... ఒకేసారి మొత్తం ఇన్వెస్ట్ చేయొచ్చు ⇒ వడ్డీ కూడా 8.5 నుంచి 9.2 శాతం వరకూ గిట్టుబాటు ⇒ ఈఎల్ఎస్ఎస్ మినహా అన్నిటికీ రిస్క్ తక్కువే ⇒ మార్కెట్లు బాగున్నపుడు ఈఎల్ఎస్ఎస్పై అధిక రాబడి పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ కేంద్ర ప్రభుత్వ మద్దతున్న ఈ పథకాన్ని 1968లో ప్రవేశపెట్టారు. ఏ వయసు వారైనా దగ్గర్లోని బ్యాంకులో గానీ, పోస్టాఫీసులో గానీ ఖాతా తెరవవచ్చు. అయితే ఒక వ్యక్తికి ఒక ఖాతా మాత్రమే ఉండాలి. గరిష్టంగా ఒక ఏడాదిలో రూ.1.5 లక్షలకు మించి డిపాజిట్ చెయ్యకూడదు. ఇలా చేసిన మొత్తంపై పన్ను మినహాయింపూ ఉండదు. వడ్డీ కూడా రాదు. ఏటా మార్చి 31నాటికి ఉండే మొత్తంపై వడ్డీ లెక్కించి చెల్లిస్తారు. 15 ఏళ్ల వ్యవధి తరవాత కూడా కొనసాగించాలనుకుంటే ఐదేళ్ల చొప్పున పెంచుకోవచ్చు. దీనిపై రుణాలు తీసుకోవచ్చు. ఆరేళ్ల తరవాత కొంత మొత్తాన్ని విత్‌డ్రా కూడా చేసుకోవచ్చు. అయితే ప్రతి ఏటా డిపాజిట్ చేయటం తప్పనిసరి. ఏ ఏడాదైనా కనీస మొత్తం డిపాజిట్ చెయ్యని పక్షంలో ఖాతాను డీ-యాక్టివేట్ చేస్తారు. మళ్లీ యాక్టివేట్ చేయాలనుకుంటే ఏడాదికి రూ.50 చొప్పున పెనాల్టీ చెల్లించాలి. మామూలు పీఎఫ్ లేనివారికి రిటైర్మెంట్ సమయంలో పెద్ద మొత్తంలో నిధిని అందుకోవటానికి ఇది బాగా పనికొస్తుంది. నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ కేంద్ర ప్రభుత్వ మద్దతున్న ఈ సేవింగ్స్ సర్టిఫికెట్లను దగ్గర్లోని ఏ పోస్టాఫీసులోనైనా కొనుగోలు చేయొచ్చు. ఐదేళ్లు, పదేళ్ల వ్యవధికి లభిస్తాయి. మనం కొనేటపుడే ఆ సర్టిఫికెట్ తాలూకు మెచ్యూరిటీ విలువ దానిపై ఉంటుంది. ఉదాహరణకు సర్టిఫికెట్ విలువ రూ.1000 ఉందనుకుంటే దానికన్నా తక్కువ మొత్తానికే (వ్యవధిని బట్టి) దాన్ని విక్రయిస్తారు. మెచ్యూరిటీ గడువు తీరాక రూ.1000 చెల్లిస్తారన్న మాట. దీనిపై కూడా రుణాలు లభిస్తాయి. స్వాతంత్య్రం వచ్చాక దేశ నిర్మాణానికి నిధులు అవసరం గనక 1950లలో కేంద్ర ప్రభుత్వం వీటిని పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. నిజానికి ఐదేళ్లు గానీ, పదేళ్లుగానీ వరసగా ఈ సర్టిఫికెట్లు కొనుగోలు చేస్తూ వెళ్లినవారు ఆ వ్యవధి తరవాత... ఆ వచ్చే సొమ్మునే మళ్లీ రీ-ఇన్వెస్ట్ చేస్తూ ఆదాయపు పన్ను మినహాయింపుల్ని పూర్తిగా వినియోగించుకునే అవకాశం ఉంటుంది. ఉదాహరణకు రూ.లక్ష చొప్పున వరసగా ఐదేళ్లు ఇన్వెస్ట్ చేసినవారు... ఆరో ఏడాది నుంచి వచ్చే మెచ్యూరిటీ సొమ్మునే తిరిగి సర్టిఫికెట్లపై పెట్టుబడిగా పెట్టొచ్చన్న మాట. అలా చేస్తే కొత్తగా పన్ను ఆదా కోసం వేరే డబ్బులు ఇన్వెస్ట్ చేయాల్సిన పని ఉండదు. పెపైచ్చు మెచ్యూర్ అయినప్పుడల్లా చేతికీ కొంత సొమ్ము వస్తుంది. సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్ కేంద్రం 2004లో ఆరంభించిన ఈ పథకాన్ని దగ్గర్లోని పోస్టాఫీసులో గానీ, జాతీయ బ్యాంకుల్లో గానీ ఆరంభించవచ్చు. 60 ఏళ్లు దాటిన వారెవరైనా ఈ పథకానికి అర్హులే. స్వచ్ఛందంగా పదవీ విరమణ చేసినవారు 55 ఏళ్లకే దీన్ని ఆరంభించవచ్చు. రక్షణ రంగ ఉద్యోగులు మాత్రం వయసుతో నిమిత్తం లేకుండా ఆరంభించే అవకాశం ఉంది. దీనికి ఐదేళ్ల లాకిన్ పీరియడ్ ఉన్నా... స్వల్ప పెనాల్టీతో ఏడాది తరవాత క్లోజ్ చేసే అవకాశం ఉంది. గతేడాది ఏప్రిల్ 1 నుంచి దీనిపై వడ్డీ రేటును సవరించారు. బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లు ఏ షెడ్యూల్డ్ బ్యాంకులోనైనా... ఎక్కడైనా ఐదేళ్ల కాలానికి ఫిక్స్డ్ డిపాజిట్లు చేస్తే పన్ను రాయితీ వర్తిస్తుంది. ప్రస్తుతం వివిధ బ్యాంకులు 8.5 శాతం నుంచి 9 శాతం దాకా వడ్డీని ఆఫర్ చేస్తున్నాయి. బ్యాంకును బట్టి ఈ వడ్డీ మారుతుంది. ఈ వడ్డీ మూడు నెలలకోసారి కాంపౌండింగ్ అవుతుంది. ఈ లెక్కన ఉదాహరణకు రూ.లక్ష గనక డిపాజిట్ చేస్తే 8.5% వడ్డీ రేటుతో ఐదేళ్ల తరవాత రూ.1.52 లక్షలవుతుంది. అదే 8.75 వడ్డీ శాతం దగ్గరైతే మరో రూ.1.54 లక్షలవుతుంది. 9 శాతమైతే మరో 2వేలు అదనంగా వస్తుంది. అయితే ఐదేళ్ల కాలానికి 8.4 వడ్డీ శాతంతో పోస్టాఫీసు ఆఫర్ చేస్తున్న టైమ్ డిపాజిట్ పథకం కూడా ఈ కోవలోకే వస్తుంది. వీటిని గడువు తీరకముందే ప్రీక్లోజర్ చేసుకునే అవకాశం ఉంటుంది కానీ అలా చేస్తే పన్ను ప్రయోజనాలను, కొంత వడ్డీని కోల్పోవాల్సి వస్తుంది. ఈక్విటీ లింక్డ్ సేవింగ్ స్కీమ్స్ మ్యూచ్‌వల్ ఫండ్లు ఆఫర్ చేసే ఈ పథకాలన్నీ ఓపెన్ ఎండెడ్వే. అంటే ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు ఈ పథకంలో చేరొచ్చన్న మాట. వీటిలో మనం పెట్టే పెట్టుబడుల్ని స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తారు గనక మనకు వచ్చే రాబడులు కూడా మార్కెట్లు బావుంటేనే బాగుంటాయి. ఇవి కూడా డైవర్సిఫైడ్ ఫండ్ల లాంటివే. అంటే ఏదో ఒక రంగానికో, ఒక ఇండెక్స్కో పరిమితం కాకుండా ఫండ్ మేనేజర్ సూచించిన స్టాక్స్‌లో పెట్టుబడి పెడతారన్న మాట. ఈ పథకంలో ఎంత పెట్టుబడి పెట్టినా గరిష్టంగా రూ.లక్ష వరకే పన్ను మినహాయింపు లభిస్తుంది. పెపైచ్చు వీటిపై రుణాలు రావు. మూడేళ్లకు ముందు ఎగ్జిట్ కావటం కూడా కుదరదు. ఈఎల్ఎస్ఎస్లో పెట్టుబడి పెట్టేవారు ఎలాంటి ఫండ్లను ఎంచుకోవాలనే విషయమై నిపుణులు కొన్ని సూచనలు చేస్తుంటారు. అవి... ⇒ ఏజెంట్ దేన్లో చెబితే దాన్లో ఇన్వెస్ట్ చేయకుండా ట్రాక్ రికార్డు బాగున్న ఫండ్లను చూసుకోవాలి. వాటి మూడేళ్ల ట్రాక్ రికార్డును చూసి... టాప్-3 ఫండ్లలో నచ్చినదాన్ని ఎంచుకుంటే మంచిది. అయితే గతంలో ఉన్న పనితీరు భవిష్యత్తులోనూ ఉంటుందనే గ్యారంటీ ఏమీ లేదండోయ్!! అయినా సరే ఇదే ఉత్తమ మార్గం. ⇒ మూడేళ్ల కన్నా తక్కువ ట్రాక్ రికార్డు ఉన్న ఫండ్ల జోలికి వెళ్లకపోవటమే బెటర్. ⇒ రూ.300 కోట్ల కన్నా తక్కువ ఆస్తులున్న ఫండ్లను కూడా వదిలిపెట్టడమే మంచిది. ఆయా ఫండ్ల ఫ్యాక్ట్ షీట్ చూస్తే దాని ఆస్తులెంత ఉన్నాయనేది తెలుస్తుంది. -
పన్ను లాభం.. మరింత పడదాం
పన్ను మినహాయింపుల్లో సెక్షన్ 80సీ చాలా కీలకమైంది. అనేక పొదుపు పథకాలు, వ్యయాలన్నీ ఈ సెక్షన్ పరిధిలోనే ఉండటంతో అనేక మంది అవకాశం ఉండి కూడా దీన్ని పూర్తిగా వినియోగించుకోలేక పోతున్నారు. పీఎఫ్, పీపీఎఫ్, బీమా, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్స్, ఫిక్స్డ్ డిపాజిట్లు, ట్యాక్స్ సేవింగ్ ఫండ్స్, ట్యూషన్ ఫీజులు, ఇంటి రుణానికి చెల్లించే అసలు వంటి అనేక అంశాలన్నీ సెక్షన్ 80సీ కిందకే వస్తాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ఒకటి వినియోగించుకుంటే మరికొన్నింటిపై లభించే ప్రయోజనాలను వదులుకోవాల్సి వస్తోంది. ఇంజనీరింగ్, మెడికల్ చదువుల ట్యూషన్ ఫీజులే లక్షల్లో చేరుకున్న తరుణంలో 80సీ కింద వచ్చే ఇతర ప్రయోజనాలను వాడుకోలేకపోతున్నారు. ఇటువంటి తరుణంలో సెక్షన్ 80సీ పరిమితిని లక్ష నుంచి రూ.1.5 లక్షలకు ప్రభుత్వం పెంచింది. దీంతో ఈ ఏడాది నుంచి మరింత పొదుపు చేయడం ద్వారా పన్ను భారం తగ్గించుకోవచ్చు. ఈ అదనపు ప్రయోజనాలను పొందడానికి ఇక కేవలం ఆరు నెలల సమయం మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో పెరిగిన సెక్షన్ 80సీ ప్రయోజనాలను గరిష్టంగా ఏ విధంగా వినియోగించుకోవచ్చో ఒకసారి పరిశీలిద్దాం.. గృహ రుణం... కొత్తగా ఇంటి రుణం తీసుకునే వారికి, ఇప్పటికే తీసుకున్న వారికి సెక్షన్ 80సీ పరిమితి పెంపు అనేది పెద్ద ఊరటనే చెప్పొచ్చు. చెల్లించే ఈఎంఐలో వడ్డీకి కాకుండా అసలుకు చెల్లించే మొత్తాన్ని 80సీ కింద చూపి పన్ను భారాన్ని తగ్గించుకోవచ్చు. కిందటి ఏడాది వరకు ఈ మొత్తం లక్షగా ఉంటే ఈ ఏడాది నుంచి అదనంగా మరో రూ.50,000 చూపించుకోవచ్చు. నిర్మాణ వ్యయంతో ఇంటి ధరలు బాగా పెరిగిన నేపథ్యంలో ఈ నిర్ణయం గృహరుణదారులకు కలిసొచ్చే అంశం. అంతే కాదు చెల్లించే వడ్డీపై సెక్షన్ 24 కింద లభించే పన్ను మినహాయింపు పరిమితిని రూ.1.5 లక్షల నుంచి రూ.2 లక్షలకు పెంచడం జరిగింది. మొత్తం మీద చూస్తే ఈ ఆర్థిక సంవత్సరం నుంచి గృహ రుణం తీసుకున్న వారు అదనంగా లక్ష రూపాయలు ఆదాయం నుంచి తగ్గించి చూపించుకోవడం ద్వారా ఆ మేరకు పన్ను భారాన్ని తగ్గించుకోవచ్చు. ట్యాక్స్ సేవింగ్ ఫండ్స్ స్టాక్ మార్కెట్లు పరుగులు పెడుతున్న సమయంలో సెక్షన్ 80సీ పరిమితి పెంచడం ట్యాక్స్ సేవింగ్ మ్యూచువల్ ఫండ్స్‌కి డిమాండ్ కలిసొచ్చింది. ఈ ఏడాది నుంచి ఈక్విటీ లింక్డ్ సేవింగ్ స్కీం (ఈఎల్ఎస్ఎస్-ట్యాక్స్ సేవింగ్ ఫండ్స్)ల్లో ఇన్వెస్ట్ చేసిన లక్షన్నర వరకు పన్ను ప్రయోజనాలు లభిస్తాయి. దీంతో ఈ పథకాల్లో ఇన్వెస్ట్ చేసేవారి సంఖ్య బాగా పెరుగుతున్నట్లు గణాంకాలు తెలియచేస్తున్నాయి. స్టాక్ మార్కెట్లో ఉండే సహజసిద్ధమైన రిస్క్‌కు సిద్ధపడి, బ్యాంకు డిపాజిట్ల కంటే అధిక రాబడిని కావాలనుకునే వారు వీటికేసి చూడొచ్చు. వీటిల్లోని ప్రధాన ఆకర్షణ ఏమిటంటే పన్ను ఆదాచేసే పథకాలన్నింటిలోకి తక్కువ లాకిన్ పీరియడ్‌ను కలిగివుండటమే కాకుం డా, వచ్చే రాబడిపై ఎటువంటి పన్ను భారం ఉండకపోవడం. ఇన్వెస్ట్ చేసిన మూడు సంవత్సరాల తర్వాత ఎప్పుడైనా వైదొలగవచ్చు. ఇప్పటికే మార్కెట్ గరిష్టస్థాయిలో ఉన్నందున ఈ ఏడాదికి ఇన్వెస్ట్ చేయాలనుకున్న మొత్తాన్ని ఒకేసారిగా కాకుండా వచ్చే 6 నెలల్లో కొంత మొత్తంలో ఇన్వెస్ట్ చేసే విధంగా ప్లాన్ చేసుకోవడం ద్వారా రిస్క్‌ను కొంత మేర తగ్గించుకోవచ్చు. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ ఎటువంటి రిస్క్ లేకుండా స్థిరమైన ఆదాయం కావాలనుకునే వారికి పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ చాలా అనువైనది. ఇది 15 ఏళ్ల దీర్ఘకాలిక ఇన్వెస్ట్మెంట్ సాధనం. ప్రస్తుతం ఈ పథకంపై 8.7 శాతం వడ్డీ లభిస్తోంది. కిందటి ఏడాది వరకు ఈ పథకంలో గరిష్టంగా లక్ష రూపాయల వరకు మాత్రమే ఇన్వెస్ట్ చేయగలిగేవారు. ఇప్పుడు సెక్షన్ 80సీ పరిమితి పెంచడంతో ఆ మేరకు పీపీఎఫ్ పరిమితిని పెంచుతూ ఈ మధ్యనే కేంద్రం గెజిట్‌ను కూడా విడుదల చేసింది. ఫిక్స్డ్ డిపాజిట్లు ఐదేళ్ల కాలపరిమితి దాటిన ఫిక్స్డ్ డిపాజిట్లపై పన్ను రాయితీలు లభిస్తాయి. వీటిల్లో కూడా గరిష్టంగా లక్షన్నర వరకు ఇన్వెస్ట్ చేయవచ్చు. ఎటువంటి రిస్క్ లేకుండా స్థిరమైన ఆదాయం కావాలనుకునే వారికి ఇవి అనువైనవి. ద్రవ్యోల్బణం దిగొస్తుండటంతో ఇప్పటికే పలు బ్యాంకులు దీర్ఘకాలిక డిపాజిట్లపై వడ్డీరేట్లను సుమారుగా ఒక శాతం తగ్గించేశాయి. రానున్న కాలంలో ఈ వడ్డీరేట్లు మరింత తగ్గే అవకాశం ఉండటంతో పన్ను మినహాయింపు కావాలనుకునే వారు సాధ్యమైనంత తొందరగా అధిక వడ్డీని ఆఫర్ చేస్తున్న బ్యాంకుల్లో డిపాజిట్ చేసుకోవడం ఉత్తమం. ఎన్పీఎస్ కొత్త పెన్షన్ పథకం (ఎన్పీఎస్)లో ఇన్వెస్ట్ చేసిన మొత్తంపై కూడా సెక్షన్ 80సీ మినహాయింపులు లభిస్తాయి. ఇతర పెన్షన్ పథకాలతో పోలిస్తే వీటిలో నిర్వహణా వ్యయం కూడా తక్కువే. పెన్షన్ కోసం ఇన్వెస్ట్ చేసేవారు వీటికేసి చూడొచ్చు. ఇవి కాకుండా సీనియర్ సిటిజన్ స్కీం, స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ చార్జీలను కూడా సెక్షన్ 80సీ కింద చూపించుకొని పన్ను మినహాయింపులు పొందవచ్చు. -
బడ్జెట్... విశేషాలు
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కస్టమ్స్ సుంకాల లక్ష్యాన్ని రూ.2,01,819 కోట్లుగా కేంద్రం నిర్ణయించింది. గతేడాది కస్టమ్స్ వసూళ్లు రూ.1,75,056 కోట్ల కంటే ఇది రూ.26,763 కోట్లు అధికం. ఎగుమతుల వృద్ధికి మిషన్ ... ఎగుమతుల అభివృద్ధి మిషన్‌ను ఏర్పాటు చేస్తామని ఆర్థిక మంత్రి వెల్లడించారు. కస్టమ్స్ అనుమతులను 24 గంటలూ ఇస్తుండే సౌకర్యాన్ని దేశంలోని మరో 13 విమానాశ్రయాలకు విస్తరిస్తామని తెలిపారు. ఈ-బిజ్ ప్లాట్‌ఫాంతో ప్రభుత్వ విభాగాల అనుసంధానం వ్యాపారవర్గాలు, ఇన్వెస్టర్లకు ప్రభుత్వ విభాగాలను మరింత అందుబాటులోకి తెచ్చే దిశగా కేంద్రం కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా డిసెంబర్ ఆఖరు నాటికల్లా కేంద్ర ప్రభుత్వంలోని అన్ని విభాగాలు, శాఖలు తమ సర్వీసులను ‘ఈ-బిజ్ ప్లాట్‌ఫాం’నకు అనుసంధానం చేయాలని ఆదేశించింది. ‘మినహాయింపు’ లేని పీఎఫ్ ట్రస్టులు పన్ను పరిధిలోకి? ఆదాయ పన్ను మినహాయింపు లేకుండా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ప్రైవేట్ ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్) ట్రస్టులు ఏప్రిల్ 1 నుంచి ట్యాక్స్ పరిధిలోకి వచ్చే అవకాశముంది. ఈ ట్రస్టులు మినహాయింపు సర్టిఫికెట్ పొందేందుకు గడువును తాజా బడ్జెట్లో పొడిగించకపోవడమే ఇందుకు కారణం. బొగ్గు సమస్యల పరిష్కారానికి చర్యలు విద్యుత్ ప్లాంట్లకు కావాల్సిన స్థాయిలో బొగ్గు ఉత్పత్తిని పెంచేందుకు, నాణ్యతను మెరుగుపర్చేందుకు తగు చర్యలు తీసుకుంటున్నామని కేంద్రం తెలిపింది. విద్యుత్ కంపెనీలు, బొగ్గు సంస్థల మధ్య వివాదాల పరిష్కారిస్తామని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చెప్పారు.ఇనుప ఖనిజం సహా మైనింగ్ రంగంలో నెలకొన్న ప్రతిష్టంభనను తొలగించేందుకు చర్యలు తీసుకుంటున్నామని జైట్లీ వివరించారు. సెజ్‌లకు పునరుజ్జీవం... ప్రత్యేక ఆర్థిక మండళ్ల (సెజ్‌లు) పునరుద్ధరణకు కట్టుబడి ఉన్నామని కేంద్రం స్పష్టంచేసింది. పారిశ్రామిక ఉత్పత్తి, ఆర్థిక ప్రగతి, ఎగుమతుల వృద్ధి, ఉపాధి అవకాశాల కల్పనకు కీలక సాధనాలుగా సెజ్‌లను తీర్చిదిద్దేందుకు గట్టి చర్యలు చేపడతామని బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి జైట్లీ తెలిపారు.