ప్రజల కంటే దివీస్ ఎక్కువా
సాక్షి ప్రతినిధి, కాకినాడ :
ప్రజల ఆస్తులు పరిరక్షించాల్సిన చంద్రబాబు సర్కార్ దివీస్ రసాయన పరిశ్రమకు కొమ్ముకాస్తూ బడుగు, బలహీన వర్గాలపై పోలీసులతో దషీ్టకాలకు పాల్పడుతోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు, తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా ధ్వజమెత్తారు. దివీస్ కర్మాగారంతో ఎదురయ్యే సమస్యలను జిల్లా కలెక్టర్కు చెప్పుకునేందుకు కాకినాడ వస్తున్న దివీస్ బాధిత గ్రామాల ప్రజలపై పోలీసులు లాఠీలు ఝుళిపించి దొరికిన వారిని దొరికినట్టుగా దాడి చేయడం విచారకరమని శనివారం రాత్రి విలేకర్ల వద్ద ఆవేదన వ్యక్తం చేశారు.ఉప్పాడ కొత్తపల్లి మండలం శ్రీరామపురంలో పోలీసులు దౌర్జన్యంగా జీపుల్లోకి తోసేయడంతో సత్యవతి అనే మహిళ తీవ్ర గాయాలతో కాకినాడ జీజీహెచ్లో చికిత్సపొందుతోందన్నారు. కాలుష్యకారక దివీస్ కర్మాగారం తొండంగి మండలంలోని తీర గ్రామాల్లోనే ఏర్పాటుచేయాల్సిన అవసరం ఏదీ లేదన్నారు. ప్రభుత్వం ఇక ముందు కూడా ఇదేరకంగా వ్యవహరిస్తూపోతే పార్టీ తరఫున ప్రత్యక్ష ఆందోళనకు తామ పార్టీ ముందుంటుందని హెచ్చరించారు.