Puddings
-
అమ్మా! ఇంకొకటి!!!
దసరా అయిపోయింది... కాని సరదా అయిపోలేదు...పండుగ వంటకాలు తిన్న పిల్లలకుకొత్తగా ఏదైనా తినాలన్న సరదా ఇంకా అలాగే ఉంది... సోమవారం నుంచి స్కూళ్లు...దీపావళి దాకా మళ్లీ పిండివంటలు ఉండవు... ఈ మధ్యలో క్విక్‌గా చేసుకునే, కిక్ ఉన్న స్నాక్స్ పిల్లల కోసం... ఆలు చీలా కావలసినవి: బంగాళ దుంపలు – 3; కార్న్ ఫ్లోర్ – 2 టేబుల్ స్పూన్లు; సెనగ పిండి – 2 టేబుల్ స్పూన్లు; మిరియాల పొడి – అర టీ స్పూను; జీలకర్ర – అర టీ స్పూను; పచ్చి మిర్చి తరుగు – ఒక టీ స్పూను; ఉల్లికాడల తరుగు – 2 టేబుల్ స్పూన్లు; ఉప్పు – తగినంత; నూనె – డీప్ ఫ్రైకి సరిపడా తయారీ:ముందుగా బంగాళ దుంపలను శుభ్రంగా కడిగి తొక్క తీసి, తురుముకుని తగినన్ని నీళ్లలో పది నిమిషాలు నానబెట్టాక, నీళ్లను గట్టిగా పిండి తీసేయాలి. (తడి లేకుండా చూసుకోవాలి) ∙ఒక పాత్రలో కార్న్ ఫ్లోర్, సెనగ పిండి, బంగాళ దుంప తురుము, మిరియాల పొడి, జీలకర్ర, పచ్చి మిర్చి తరుగు, ఉల్లికాడల తరుగు, ఉప్పు వేసి బాగా కలపాలి పిండి మరీ పల్చగా అనిపిస్తే మరి కాస్త పిండి జత చేయాలి ∙స్టౌ మీద పెనం ఉంచి వేడయ్యాక, కొద్దిగా నూనె వేయాలి. పిండి మిశ్రమం కొద్దిగా తీసుకుని పెనం మీద పల్చగా పరవాలి ∙మంట మీడియంలో ఉంచి, చీలాను రెండు వైపులా నూనె వేసి కాల్చి తీసేయాలి.ఇవి గ్రీన్ చట్నీతో రుచిగా ఉంటాయి. ముంబై ఐస్ హల్వా కావలసినవి: పాలు – ఒకటిన్నర కప్పులు;పంచదార – ఒక కప్పు;నెయ్యి – పావు కప్పు; కార్న్ ఫ్లోర్ – పావు కప్పు; మిఠాయి రంగు – చిటికెడు (నారింజ రంగు);ఏలకుల పొడి – పావు టీ స్పూను; బాదం పప్పుల తరుగు – ఒక టేబుల్ స్పూను; పిస్తా తరుగు – ఒక టేబుల్ స్పూను తయారీ :ఒక పాత్రలో పాలు, పంచదార, కార్న్ ఫ్లోర్, నెయ్యి వేసి బాగా కలిపి స్టౌ మీద సన్నటి మంట మీద ఉంచి, ఆపకుండా కలుపుతుండాలి ∙ ఐదు నిమిషాల తరవాత మిశ్రమం బాగా చిక్కబడ్డాక, మిఠాయి రంగు (నారింజ రంగు) జత చేయాలి ∙ ఒక టీ స్పూను నెయ్యి జత చేసి మరోమారు బాగా కలపాలి ∙ ఏలకుల పొడి జత చేసి మరోమారు కలిపి, మిశ్రమం బాగా ఉడికించాలి ∙ అవసరమనుకుంటే మరికాస్త నెయ్యి జత చేయాలి. ఉడికిన మిశ్రమాన్ని బటర్ షీట్ మీదకు తీసుకోవాలి ∙ పైన మరో బటర్ షీట్ ఉంచి, చపాతీ కర్రతో పల్చగా వచ్చేలా నెమ్మదిగా ఒత్తి, పైన వేసి బటర్ షీట్‌ను చేతితో జాగ్రత్తగా తీసేయాలి ∙ పిస్తా, బాదం తరుగును హల్వా మీద పల్చగా చల్లి, సుమారు రెండు గంటలపాటు గట్టిపడేవరకు ఆరనివ్వాలి లేదంటే పావుగంట సేపు ఫ్రిజలో ఉంచి తీయాలి ∙ చాకు సహాయంతో బటర్ షీట్‌తో కలిపి కట్ చేయాలి. దీనిని ఫ్రిజ్‌లో ఉంచితే సుమారు పది రోజుల పాటు నిల్వ ఉంటుంది. పోహా పకోరా కావలసినవి: పల్చటి అటుకులు – ఒక కప్పు; ఉల్లి తరుగు – ఒక టేబుల్ స్పూను;ఉడికించిన బంగాళ దుంప – 1;అల్లం పేస్ట్ – అర టీ స్పూను;పచ్చి మిర్చి తరుగు – ఒక టీ స్పూను;కొత్తిమీర తరుగు – ఒక టీ స్పూను;కరివేపాకు – రెండు రెమ్మలు; మిరప కారం – పావు టీ స్పూను;వాము – పావు టీ స్పూను; ఆమ్చూర్ పొడి – అర టీ స్పూను; ఉప్పు – తగినంత; వేయించి పొడి చేసిన పల్లీలు – 2 టేబుల్ స్పూన్లు; సెనగపిండి – 3 టేబుల్ స్పూన్లు; నూనె – డీప్ ఫ్రైకి సరిపడా తయారీ:ముందుగా అటుకులను తగినంత నీటిలో రెండు నిమిషాలు ఉంచి, శుభ్రంగా కడిగి ఒక పాత్రలోకి తీసుకోవాలి. (నీరు ఎక్కువగా ఉంటే తీసేయాలి) ∙ఉల్లి తరుగు, ఉడికించిన బంగాళ దుంప, అల్లం పేస్ట్, పచ్చి మిర్చి తరుగు, కొత్తిమీర తరుగు, కరివేపాకు వేసి కలపాలి ∙మిరప కారం, వాము, ఆమ్ చూర్, ఉప్పు జత చేసి మరోమారు కలపాలి ∙ పొడి చేసిన పల్లీలు, సెనగ పిండి జత చేసి పకోడీల పిండిలా కలపాలి ∙ స్టౌ మీద బాణలిలో నూనె పోసి కాగనివ్వాలి ∙కలిపి ఉంచుకున్న పిండిని కొద్దిగా చేతిలోకి తీసుకుని చిన్న సైజు బాల్‌లాగ గుండ్రంగా చేయాలి ∙ కాగిన నూనెలో వేసి బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించి పేపర్ టవల్ మీదకు తీసుకోవాలి ∙ టొమాటో సాస్‌తో తింటే రుచిగా ఉంటాయి. బ్రెడ్ మసాలా దోసె కావలసినవి:బ్రెడ్ స్లైసులు – 8; బొంబాయి రవ్వ – అర కప్పు;బియ్యప్పిండి – 2 టేబుల్ స్పూన్లు; పెరుగు – పావు కప్పు;నీళ్లు – తగినన్ని; ఉప్పు – తగినంత; నూనె – దోసెలు కాల్చడానికి తగినంత; స్టఫింగ్ కోసం – ఆలూ భాజీ / పొటాటో మసాలా/ బంగాళ దుంపల కూర తయారీ:బ్రెడ్‌స్లైసులు తీసుకుని వాటి అంచులను కట్ చేసి తీసేయాలి. బ్రెడ్‌ను చేతితో మెత్తగా పొడిలా చేయాలి ∙పెద్ద ముక్కలు ఉండకుండా జాగ్రత్తపడాలి ∙బొంబాయి రవ్వ, బియ్యప్పిండి, పెరుగు, నీళ్లు, ఉప్పు జత చేసి బాగా కలిపి అరగంట సేపు నానబెట్టాలి ∙అర గంట తరవాత వీటిని మిక్సీలో వేసి మెత్తగా దోసెల పిండిలా రుబ్బుకోవాలి ∙స్టౌ మీద పెనం ఉంచి వేడయ్యాక కొద్దిగా నూనె వేయాలి ∙పిండిని గరిటెతో తీసుకుని పెనం మీద వేసి పల్చగా దోసెలా సమానంగా పరిచాక, పైన ఆలూ భాజీ/పొటాటో మసాలా/బంగాళ దుంప కూరను కొద్దిగా ఉంచి, దోసె కాలాక రోల్ చేసి ప్లేట్లోకి తీసుకోవాలి ∙కొబ్బరి చట్నీ,సాంబారుతో వేడివేడిగా అందించాలి. సాబుదానా ఇడ్లీ కావలసినవి:సాబుదానా (సగ్గు బియ్యం) – అర కప్పు; ఇడ్లీ రవ్వ – ఒక కప్పు; పెరుగు – 2 కప్పులు; నీళ్లు – తగినన్ని; ఉప్పు – రుచికి తగినంత; బేకింగ్ సోడా – చిటికెడు ; జీడిపప్పు పలుకులు – ఒక టేబుల్ స్పూను; నూనె – కొద్దిగా తయారీ:ముందుగా సగ్గు బియ్యాన్ని తగినన్ని నీళ్లలో శుభ్రంగా కడగాలి ∙ఒక పాత్రలో సగ్గు బియ్యం, ఇడ్లీ రవ్వ వేసి, పెరుగు జత చేసి బాగా కలపాలి ∙కొంచెం నీళ్లు కూడా జత చేసి బాగా కలిపి ముందు రోజు రాత్రంతా నానబెట్టాలి ∙(సగ్గుబియ్యం విరిగిపోకుండా జాగ్రత్త గా కలపాలి) ∙పిండి మరీ గట్టిగా అనిపిస్తే కొద్దిగా నీరు జత చేసుకోవచ్చు∙ఉప్పు జత చేసి మరోమారు కలపాలి. ఇడ్లీలు వేసే ముందు చిటికెడు బేకింగ్ సోడా జత చేయాలి ∙ఇడ్లీ రేకులకు నూనె పూయాలి ∙రేకుల మీద ముందుగా జీడిపప్పు పలుకులు వేసి, ఆ పైన సాబుదానా ఇడ్లీ పిండి ఒక గరిటెడు వేయాలి ∙ఇలా ఇడ్లీలన్నీ వేసి కుకర్‌లో ఉంచి విజిల్ లేకుండా మూత పెట్టి, స్టౌ మీద ఉంచి పది నిమిషాల తరవాత దింపేయాలి ∙కొద్దిగా వేడి తగ్గిన తరవాత ఇడ్లీలను ప్లేటులోకి తీసుకోవాలి ∙కొబ్బరి చట్నీ, పల్లీ పొడి, సాంబారులను నంచుకుని తింటే రుచిగా ఉంటుంది. -
కాస్త నిలవండీ!!!
సంక్రాంతి... తెలుగువాళ్లకి పెద్ద పండగ... కాస్త పెద్దగానే జరుపుకుంటాం. అందుకే ఈ పండగకి నోట్లో వేసుకోగానే కరిగిపోయే పిండివంటలు చేస్తామా! అరిశలు, పనసతొనలు, గులాబీ గుత్తులు, కొబ్బరి బూరెలు, రిబ్బన్ పకోడా, సకినాలు, మురుకులు లాంటి దక్షిణాది పిండివంటలను ఓపిగ్గా తయారు చేసి, డబ్బాల్లో దాచుదాం. పండక్కే కాదు, పండగ వెళ్లిపోయిన తర్వాత కూడా అందరినీ కాస్త నిలవండీ అంటూ ప్రేమగా తినిíపిద్దాం. బాదం పూరీ కావలసినవి: మైదాపిండి – కప్పు, బియ్యప్పిండి – అర కప్పు, బాదం పప్పులు – 20, పాలు – అర కప్పు, నెయ్యి – 3 టీ స్పూన్లు, నూనె – డీప్ ఫ్రైకి సరిపడా, పంచదార – కప్పు, ఏలకుల పొడి – అర టీ స్పూను, లవంగాలు – తగినన్ని, మిఠాయి రంగు – చిటికెడు తయారి: ∙బాదం పప్పులను గంటసేపు నీళ్లలో నానబెట్టి, పొట్టు తీసి, మిక్సీలో వేసి మెత్తగా చేయాలి ∙ఒక పాత్రలో మైదాపిండి, బియ్యప్పిండి, బాదం పప్పుల ముద్ద వేసి బాగా కలపాలి ∙మిఠాయి రంగును టీ స్పూను నీళ్లలో కలిపి, జత చేయాలి ∙తగినన్ని పాలు జత చేసి చపాతీ పిండిలా కలిపి సుమారు అరగంటసేపు పక్కన ఉంచాలి ∙చిన్నచిన్న ఉండలుగా చేసి, పల్చని చపాతీలా ఒత్తి, పైన నెయ్యి పూయాలి ∙మధ్యకు మడతపెట్టి, మరోమారు నెయ్యి పూసి త్రికోణాకారంలో మడత పెట్టి, లవంగాన్ని మధ్యలో గుచ్చాలి ∙బాణలిలో నూనె కాగాక తయారుచేసి ఉంచుకున్న బాదం పూరీలను ఒక్కొక్కటిగా వేసి వేయించి, తీసి పక్కన ఉంచుకోవాలి ∙పంచదారకు తగినంత నీరు జత చేసి బాణలిలో వేసి, స్టౌ మీద ఉంచి పంచదార కరిగి తీగ పాకం రాగానే దించేయాలి ∙ఏలకుల పొడి జత చేసి బాగా కలపాలి ∙తయారుచేసి ఉంచుకున్న బాదం పూరీలను ఇందులో వేసి ఐదు నిమిషాల తరవాత తీసేయాలి. కాయి హోళిగే కావలసినవి: పూర్ణం కోసం: ఎండు కొబ్బరి తురుము – 2 కప్పులు, బెల్లం పొడి – ఒకటిన్నర కప్పులు, ఏలకుల పొడి – టీ స్పూను; పోలి తయారీ కోసం: మైదా పిండి – 2 కప్పులు, నువ్వుల నూనె – 3 టేబుల్ స్పూన్లు, పసుపు – అర టీ స్పూను తయారి: ∙ఒక పాత్రలో జల్లించిన మైదా పిండి, పసుపు వేసి బాగా కలపాలి ∙స్టౌ మీద బాణలిలో బెల్లం పొడి, ఏలకుల పొడి, అరకప్పు నీళ్లు పోసి తీగపాకం వచ్చేవరకు కలపాలి ∙కొబ్బరి తురుము జత చేసి బాగా ఉడికి దగ్గర పడేవరకు కలిపి, దింపి చల్లారనివ్వాలి ∙ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసి పక్కన ఉంచాలి ∙కలిపి ఉంచుకున్న మైదాపిండిని కూడా చిన్న చిన్న ఉండలుగా చేసి, ఒక్కో ఉండను చేతితో పల్చగా ఒత్తి, కొబ్బరి పూర్ణం అందులో ఉంచి, చపాతీకర్రతో పల్చగా ఒత్తుతూ కొద్దిగా పొడి పిండి అద్దుతుండాలి. (పూర్ణం బయటకు రాకుండా జాగ్రత్తగా ఒత్తాలి) ∙స్టౌ మీద పెనం వేడయ్యాక, ఒత్తి ఉంచుకున్న కాయి హోళిగలను పెనం మీద వేసి కొద్దికొద్దిగా నూనె వేస్తూ బంగారు రంగులోకి వచ్చే వరకు కాల్చి తీసేయాలి ∙నెయ్యి జత చేసి వడ్డిస్తే రుచిగా ఉంటాయి ∙ఇవి మూడు నాలుగు రోజులు నిల్వ ఉంటాయి. పనస తొనలు కావలసినవి: మైదాపిండి – అర కేజీ, పంచదార – అర కేజీ, ఉప్పు– తగినంత, ఏలకుల పొడి – చిటికెడు, నూనె – డీప్ ఫ్రైకి సరిపడా తయారి: ∙ఒక పాత్రలో మైదా పిండి, ఉప్పు, తగినన్ని నీళ్లు పోసి చపాతీ పిండిలా కలపాలి ∙కొద్దిగా నూనె వేసి కలిపి, అరగంట తరవాత చిన్న చిన్న ఉండలు చేసి, చపాతీలా ఒత్తాలి ∙చాకుతో మధ్యలోకి నాలుగైదు గీతలు పెట్టి కట్ చేయాలి. (అంచులలో కట్ చేయకూడదు) ∙పనసతొన మాదిరిగా మడవాలి ∙పెద్ద పాత్రలో పంచదార, నీళ్లు, ఏలకుల పొడి వేసి స్టౌ మీద ఉంచి తీగ పాకం వచ్చాక దింపేసి, తయారుచేసి ఉంచుకున్న పనస తొనల మీద పంచదార పాకం అద్దుకునేలా కలపాలి ∙చల్లారాక డబ్బాలో నిల్వ చేసుకోవాలి. మంగళూరు బన్స్ కావలసినవి: అరటిపండ్లు – 2 (మీడియం సైజువి), పంచదార – మూడు టేబుల్ స్పూన్లు, జీలకర్ర పొడి – అర టీ స్పూను, ఉప్పు – చిటికెడు, బేకింగ్ సోడా – రెండు చిటికెలు, పెరుగు – 2 టేబుల్ స్పూన్లు, గోధుమ పిండి – ఒకటì న్నర కప్పులు, నెయ్యి – టీ స్పూను, నూనె – డీప్ ఫ్రైకి సరిపడా తయారి: ∙ఒక పాత్రలో అరటిపండు తొక్క తీసి మెత్తగా అయ్యేవరకు మెదపాలి ∙పంచదార జత చేసి మరోమారు మెత్తగా అయ్యేవరకు కలపాలి ∙గోధుమపిండి, పెరుగు, ఉప్పు, నెయ్యి, బేకింగ్ సోడా, జీలకర్ర పొడి జత చేసి చపాతీ పిండిలా కలపాలి ∙పిండి చేతికి అంటుతున్నట్లుగా ఉంటే కొద్దిగా నూనె జత చేసి, రాత్రంతా ఫ్రిజ్‌లో ఉంచాలి ∙మరుసటి రోజు ఫ్రిజ్‌లో నుంచి బయటకు తీసి, మూడు గంటలు ఉంచాలి ∙పిండిని చిన్న చిన్న ఉండలుగా చే సి, ఒక్కో ఉండను పూరీలా ఒత్తాలి ∙బాణలిలో నూనె కాగిన తరవాత ఒక్కో మంగళూరు బన్స్‌ని వేసి వేయించాలి ∙బాగా పొంగిన తరవాత పేపర్ నాప్కిన్స్ మీదకు తీసుకోవాలి ∙ ఇవి వారం రోజుల వరకు నిలవ ఉంటాయి. మురుకులు కావలసినవి: బియ్యప్పిండి – 4 కప్పులు, పుట్నాల (వేయించిన సెనగపప్పు) పిండి – కప్పు, నువ్వులు – టీ స్పూను, ఎర్ర కారం – టీ స్పూను, ఇంగువ – అర టీ స్పూను, కరిగించిన వెన్న – 3 టేబుల్ స్పూన్లు, ఉప్పు – టీ స్పూను, నూనె – డీప్ ఫ్రైకి సరిపడా తయారి: ∙రెండు కప్పుల నీళ్లలో ఉప్పు వేసి స్టౌ మీద ఉంచి నీళ్లు మరిగించాలి ∙మంట బాగా తగ్గించి, వేడి నీళ్లలో కొద్దికొద్దిగా బియ్యప్పిండి వేస్తూ ఉండ కట్టకుండా కలపాలి పిండి బాగా చల్లారాక పుట్నాల పిండి, నువ్వులు, ఎర్ర కారం, ఇంగువ, కరిగించిన నెయ్యి జత చేసి జంతికల పిండిలా కలపాలి ∙బాణలిలో నూనె పోసి కాచాలి ∙మురుక్కులు చేసే మౌల్డ్‌లో నక్షత్రంలా ఉండే ప్లేట్ ఉంచి, కలిపి ఉంచుకున్న పిండిని మౌల్డ్‌లో ఉంచి జంతికల మాదిరిగా నూనె పూసిన అరటి ఆకు మీద చుట్టాలి సుమారు ఆరేడు ఒత్తిన తరవాత, కాగిన నూనెలో వేసి బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించి తీసేయాలి . ఇవి చాలా కాలం నిలవ ఉంటాయి. మోహన్ లడ్డు కావలసినవి: పంచదార పొడి – కప్పు, బొంబాయి రవ్వ – కప్పు, ఉప్పు – అర టీ స్పూను, నీళ్లు – కప్పు, నెయ్యి – కప్పు, ఏలకుల పొడి – టీ స్పూను, జీడిపప్పులు – 10 తయారి: ∙ఒక పాత్రలో బొంబాయి రవ్వ, ఉప్పు వేసి స్పూనుతో కలపాలి ∙కొద్దికొద్దిగా నీళ్లు జత చేస్తూ చపాతీపిండిలా కలిపి, తడి వస్త్రం కప్పి అర గంట సేపటి తరవాత చిన్న చిన్న ఉండలుగా చేసి, ఒక్కో ఉండను చపాతీ మాదిరిగా కొంచెం మందంగా ఒత్తాలి ∙బాణలిలో నూనె కాగాక ఒక్కో పూరీని వేసి దోరగా వేయించి తీసేయాలి ∙పూరీలన్నీ వేయించిన తరవాత వాటిని చిన్న చిన్న ముక్కలుగా విరిచి మిక్సీలో వేసి పొడి చేయాలి ∙పంచదార పొడి, ఏలకుల పొడి జత చేయాలి ∙బాణలిలో నెయ్యి వేసి కరిగించి, జీడిపప్పులు వేసి దోరగా వేయించి, కలిపి ఉంచుకున్న మిశ్రమానికి జత చేసి కలపాలి ∙కొద్దికొద్దిగా నెయ్యి జత చేస్తూ లడ్డూ మాదిరిగా చేస్తే మోహన్ లడ్డూ సిద్ధమైనట్లే. గులాబీ గుత్తులు కావలసినవి: మైదా పిండి – కప్పు, బియ్యప్పిండి – రెండు కప్పులకు కొద్దిగా తక్కువ, పంచదార – ముప్పావు కప్పు, నీళ్లు లేదా కొబ్బరి పాలు – తగినన్ని, ఏలకుల పొడి – టీ స్పూను, ఉప్పు – కొద్దిగా, నూనె – డీప్ ఫ్రైకి సరిపడా తయారి: ∙పదార్థాలన్నిటినీ ఒక పాత్రలో వేసి తగినన్ని నీళ్లు జత చేసి దోసెల పిండి మాదిరిగా కలిపి 20 నిమిషాల పాటు పక్కన ఉంచాలి ∙ బాణలిలో నూనె కాగాక గులాబీ గుత్తుల మౌల్డ్‌ను నూనెలో ఉంచి వేడి చేయాలి ∙గులాబీ గుత్తిని పిండిలో ముంచి తీసి, నూనెలో మునిగేలా ఉంచి, జాగ్రత్తగా చెంచాతో గుత్తి నుండి విడివడేలా చేయాలి ∙ఈ విధంగా అన్నీ తయారుచేసుకుని డబ్బాలో నిల్వ చేసుకోవాలి. కొబ్బరి బూరెలు కావలసినవి: బెల్లం పొడి – పావుకేజీ, తడిగా ఉన్న బియ్యప్పిండి – అరకేజీ (బియ్యాన్ని ముందు రోజు రాత్రి నానబెట్టి, మరుసటి రోజు నీరు ఒంపేసి, పొడి వస్త్రం మీద ఆరబోసి, బియ్యం కొద్దిగా తడిగా ఉండగానే మిక్సీలో వేసి మెత్తగా పొడి చేయాలి. జల్లించి మెత్తగా ఉన్న పిండిని తడిగా ఉండగానే వాడుకోవాలి); కొబ్బరి తురుము – అర కప్పు, నువ్వులు – పావు కప్పు, నూనె – డీప్ ఫ్రై చేయడానికి తగినంత తయారి: ∙బెల్లం పొడికి గ్లాసుడు నీరు జత చేసి బాగా కలిపి స్టౌ మీద ఉంచి, ఉండ పాకం వచ్చేవరకు కలిపి దించేయాలి ∙రెండు టేబుల్ స్పూన్ల నూనె, కొబ్బరి తురుము జత చేసి బాగా కలపాలి ∙నువ్వులు జత చేసి మరోమారు కలపాలి ∙బియ్యప్పిండి కొద్దికొద్దిగా వేస్తూ ఉండ కట్టకుండా కలుపుతుంటే బూరెల చలిమిడి తయారవుతుంది ∙చిన్న చిన్న ఉండలు చేసి పక్కన ఉంచాలి ∙బాణలిలో నూనె కాచాలి ∙అరటి ఆకు మీద లేదా ప్లాస్టిక్ కాగితం మీద కొద్దిగా నూనె పూసి, ఒక్కో ఉండను మందంగా ఒత్తి కాగిన నూనెలో వేయాలి ∙గోధుమరంగులోకి మారి బూరెల మాదిరిగా పొంగిన తరవాత చట్రంతో పేపర్ నాప్కిన్ మీదకు తీసుకోవాలి ∙చల్లారాక డబ్బాలో నిల్వ చేయాలి. ఇవి వారం రోజుల వరకు నిలవ ఉంటాయి. రిబ్బన్ పకోడా కావలసినవి: బాయిల్డ్ రైస్ – 2 కప్పులు, ఎండు మిర్చి – 10, వెల్లుల్లి ముద్ద – టీ స్పూను, ఉప్పు – తగినంత, సెనగ పిండి లేదా పుట్నాల పిండి – అర కేజీ, ఇంగువ – పావు టీ స్పూను, వేడి నూనె – 3 టేబుల్ స్పూన్లు, నూనె – డీప్ ఫ్రైకి సరిపడా తయారి: ∙బియ్యాన్ని రెండు గంటల సేపు నానబెట్టి, నీళ్లు పూర్తిగా ఒంపేసి, తడి ఆరాక, గ్రైండర్లో వేసి మెత్తగా చేసి, ఒక పాత్రలోకి తీసుకోవాలి ∙ సెనగ పిండి లేదా పుట్నాల పిండి, ఇంగువ, వెల్లుల్లి ముద్ద, 3 టేబుల్ స్పూన్ల వేడి నూనె జత చేసి జంతికల పిండిలా కలుపుకోవాలి ∙జంతికల గొట్టంలో రిబ్బన్లు తయారుచేసే ప్లేట్ ఉంచి, గొట్టంలో పట్టినంత రిబ్బన్ల పిండి ఉంచాలి ∙బాణలిలో నూనె కాగాక, మౌల్డ్ ఒత్తుతూ నూనెలోకి రిబ్బన్లు వేయాలి. సకినాలు కావలసినవి: కొత్త బియ్యం – కప్పు, వాము – టేబుల్ స్పూను, నువ్వులు – పావు కప్పు, ఉప్పు – తగినంత, నూనె – డీప్ ఫ్రైకి సరిపడా తయారి: ∙ముందు రోజు రాత్రి బియ్యాన్ని నానబెట్టాలి ∙మరుసటి రోజు ఉదయం నీరు ఒంపేసి, బియ్యం మిక్సీలో వేసి పొడి చేసి, జల్లెడ పట్టాలి ∙వాము, నువ్వులు, ఉప్పు, తగినన్ని నీళ్లు జత చేసి పిండి చేతికి అంటకుండా జంతికల పిండిలా కలుపుకోవాలి ∙కొద్దికొద్దిగా పిండి చేతిలోకి తీసుకుని, శుభ్రమైన వస్త్రం మీద గుండ్రంగా నాలుగు రౌండ్లు వచ్చేవరకు కొద్దికొద్దిగా పిండి వదులుతూ తిప్పాలి ∙సుమారు పావు గంట సేపు వీటిని ఆరనివ్వాలి ∙బాణలిలో నూనె కాగాక తయారుచేసి ఉంచుకున్న సకినాలను గరిటెతో తీసి, నూనెలో వేసి బంగారురంగులోకి వచ్చేవరకు వేయించి తీయాలి. అరిసెలు కావలసినవి: పాత బియ్యం – 2 కేజీలు, అచ్చు బెల్లం – 2 కేజీల 800 గ్రా, నువ్వులు – 100 గ్రా., నూనె లేదా నెయ్యి – డీప్ ఫ్రైకి సరిపడా తయారి: ∙బియ్యాన్ని రెండు రోజులు నానిన తరవాత రోజూ నీళ్లు మార్చాలి. లేదంటే బియ్యం వాసన వస్తాయి) బియ్యంలో నీళ్లు ఒంపేసి, నీడలో, పొడి వస్త్రం మీద సుమారు పది నిమిషాలు ఆరబోయాలి ∙నీళ్లన్నీ పోయి, బియ్యం కొద్దిగా తడిగా ఉండగానే మిక్సీలో వేసి బియ్యం మెత్తగా చేసి, జల్లించాలి. (పిండిమరలో పట్టించగలిగితే బాగుంటుంది. రోకళ్లతో దంచినా కూడా బాగుంటుంది) ∙»ñ ల్లంలో తగినన్ని నీళ్లు జత చేసి స్టౌ మీద ఉంచి, ఉండ పాకం వచ్చేవరకు బాగా కలుపుతుండాలి ∙చిన్న పాత్రలో కొద్దిగా నీళ్లు పోసి, అందులో బెల్లం పాకం వేసి ఉండలాగ అయ్యిందో లేదో పరిశీలించుకోవాలి ∙పాకం తయారయిందనిపించగానే స్టౌ మీద నుంచి దింపేసి, 2 టీ స్పూన్ల నెయ్యి, నువ్వులు వేసి కలపాలి ∙ బియ్యప్పిండి కొద్దికొద్దిగా వేస్తూ దగ్గరపడేవరకు కలుపుతుండాలి ∙స్టౌ మీద బాణలిలో నూనె కాచాలి ∙బియ్యప్పిండి మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి ∙ప్లాస్టిక్ కవర్‌కి నూనె పూసి, దాని మీద ఒక్కో ఉండను చేతితో కొద్దిగా పల్చగా ఒత్తి, కాగిన నూనెలో వేసి గోధుమరంగులోకి వచ్చేవరకు వేయించి తీసేయాలి ∙అరిసెల చట్రం మీద ఉంచి, గట్టిగా ఒత్తి నూనె తీసేయాలి ∙ఈ విధంగా అరిసెలన్నీ తయారుచేసుకుని, చల్లారిన తరవాత డబ్బాలో నిల్వ చేసుకోవాలి ∙అరిసెలు ఎన్ని రోజులైనా నిలవ ఉంటాయి. బూందీ లడ్డు కావలసినవి: సెనగ పిండి – 100 గ్రా., నీళ్లు – 110. మి.లీ., నూనె – అర టేబుల్ స్పూను పాకం కోసం: పంచదార – 150 గ్రా., నీళ్లు – 100 మి.లీ., ఏలకుల పొడి – అర టీ స్పూను, పచ్చ కర్పూరం – కొద్దిగా, కుంకుమ పువ్వు లేదా పసుపు – చిటికెడు, పంచదార – పావు టీ స్పూను, జీడి పప్పులు – 10, కిస్మిస్ – 10, నూనె – డీప్ ఫ్రైకి సరిపడా, నెయ్యి – 2 టేబుల్ స్పూన్లు తయారి: ∙ముందుగా సెనగపిండిని జల్లించాలి ∙పెద్ద పాత్రలో సెనగ పిండి, నీళ్లు వేసి గరిటె జారుగా వచ్చేలా పిండి కలుపుకోవాలి ∙అర టేబుల్ స్పూను నూనె జత చేసి మరోమారు కలిపి, మూత పెట్టి అరగంట సేపు పక్కన ఉంచాలి ∙ఏలకుల పొడి, పచ్చ కర్పూరం, కుంకుమ పువ్వు లేదా పసుపు, పావు టీ స్పూను పంచదారలను కలిపి పొడి చేసి పక్కన ఉంచాలి ∙బాణలిలో నూనె వేసి కాగాక... కలిపి ఉంచుకున్న సెనగపిండిని బూందీ చట్రంలో వేసి నూనెలోకి పడేలా నెమ్మదిగా దూయాలి. ఈ విధంగా మొత్తం బూందీ తయారుచేసుకోవాలి ∙జీడిపప్పులు, కిస్మిస్లను కరిగిన నెయ్యిలో దోరగా వేయించి తీసేయాలి ∙ఒక పాత్రలో నీళ్లు, పంచదార వేసి, స్టౌ మీద ఉంచి, సన్నటి సెగ మీద తీగ పాకం వచ్చేవరకు కలిపి దింపేయాలి ∙ జీడిపప్పు, కిస్మిస్, ఏలకుల పొడి మిశ్రమం, బూందీలను పాకంలో వేసి బాగా కలపాలి ∙వేడిగా ఉండగానే బూందీ మిశ్రమం కొద్దికొద్దిగా చేతిలోకి తీసుకుంటూ లడ్డూలు తయారు చేయాలి ∙గంట సేపటి తరవాత డబ్బాలో నిల్వ చేసుకోవాలి. -
సంక్రాంతి వంటలు
-
శుచిభరితం...కడు రుచిభరితం
ఆకాశంలో నల్లటి మేఘాలు... నేల మీద తెల్లటి ముత్యపు చినుకులు... ఇదీ శ్రావణమాసం! వాన చినుకులు చిటపటమంటుంటే... నోటికి కూడా కరకరలు కావాలనిపిస్తుంది... పవిత్ర శ్రావణం కొందరికి ఉపవాస మాసం... కొందరికి పిండివంటల మాసం. అందుకే ఆ కొందరు, ఈ కొందరు ఆరగించడానికి వీలైన శుచిభరిత, రుచిభరిత వంటకాలను మీకు అందిస్తున్నాం. శ్రావణ మాసంలో శాకాహారం భారతీయుల క్యాలెండర్ ప్రకారం శ్రావణం వానలు దండిగా, కుంభవృష్టిలా కురుస్తూ, వరదలు వచ్చే మాసం. ఈ వానలు సాధారణంగా జూలై నెల మధ్య భాగంలోప్రారంభమై, ఆగస్టు మాసం వరకు కొనసాగుతాయి. ఎక్కువ మంది ఈ మాసంలో మాంసాహారం తీసుకోరు. ఇది మతపరంగా కంటె కూడా సంప్రదాయంగా వస్తున్న అలవాటు. శ్రావణంలో కేవలం శాకాహారం మాత్రమే తినడానికి ఆధ్యాత్మికతతో పాటు, శాస్త్రీయ కారణాలు కూడా చెబుతారు. వాటిలో ముఖ్యమైనవిగా కనపడేవి చూద్దాం... హిందువులకు శ్రావణం పవిత్ర మాసం. ఈ మాసమంతా చిన్నచితకా పండుగలు ఉంటాయి. రక్షాబంధన్, జంధ్యాల పౌర్ణమి, శ్రావణ మంగళవారాలు, శ్రావణ శుక్రవారాలు, వరలక్ష్మీవ్రతం. ఆధ్యాత్మికంగా... శివునికి ప్రీతికరమైన మాసం. శివుని ఆరాధించడానికి పవిత్రమైన మాసం. ఈ మాసంలో ప్రత్యేకంగా శ్రావణ శివరాత్రిని నిర్వర్తిస్తారు. శ్రావణం అంటే వర్షాకాలం అని అర్థం. మామూలుగా శివరాత్రి అనేది ఫిబ్రవరి లేదా మార్చి మాసంలో వస్తుంది. ఈ శివరాత్రి మాత్రం వర్షకాలంలో వస్తుంది. ప్రతి సోమవారాన్ని శివుని ప్రీతిగా అర్చిస్తారు. ఈ సోమవారాలను శ్రావణ సోమవారాలుగా పూజిస్తారు. ఈ మాసంలో వచ్చే అన్ని సోమవారాలు ఉపవాసం ఉంటారు. అందువల్ల ఈ మాసంలో మాంసాహారం తీసుకోరు. శాస్త్రీయంగా... ఈ మాసంలో వర్షపాతం అధికంగా ఉండటం వల్ల నదులు పొంగిపొర్లుతూ, వరదలు వస్తాయి. పరిసరాలు అపరిశుభ్రంగా మారిపోతాయి. అంటువ్యాధులను వ్యాప్తి చేసే బ్యాక్టీరియా విపరీతంగా వ్యాపిస్తాయి. మాంసం మీద ఈ బ్యాక్టీరియా చేరే అవకాశం ఉంటుంది. అందువల్ల ఈ మాసంలో మాంసం తినకుండా ఉండటం ఆరోగ్యకరమని భావిస్తారు. మరొక కారణం... అనేక జంతువులు ఈ మాసంలోనే సంతానోత్పత్తి చేస్తాయి. ఈ మాసంలో చేపలను పట్టడం నిషేధం. ఎందుకంటే చేపలన్నీ గుడ్లను తమ కడుపులో పొదువుకుని ఉంటాయి. పిల్లలకు జన్మనిచ్చే స్థితిలో ఉన్న చేపలను పట్టుకుని చంపడాన్ని పాపంగా భావిస్తారు. ఆ కారణంగా మాంసాహారం, చేపలను తినడాన్ని పాపంగా భావించి, కేవలం శాకాహారం మాత్రమే స్వీకరిస్తారు. సింఘారే కీ పూరీ కావలసినవి సింఘారా (వాటర్ చెస్ట్నట్) పిండి - 2 కప్పులు ఆలుగడ్డలు - 2 (ఉడికించి తొక్క తీసి మెదపాలి) పుదీనా ఆకులు - అర కప్పు (సన్నగా తరగాలి) వాము - అర టేబుల్ స్పూను పచ్చి మిర్చి - 2 (సన్నగా తరగాలి) ఉప్పు - తగినంత నీళ్లు - పిండి కలపడానికి తగినన్ని నూనె - డీప్ ఫ్రైకి సరిపడా తయారీ: ఒక పాత్రలో అన్ని పదార్థాలను (నీళ్లు, నూనె మినహాయించి) వేసి బాగా కలపాలి. తగినన్ని నీళ్లు జత చేసి చపాతీపిండిలా కలపాలి. బాణలిలో నూనె పోసి కాచాలి. పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసి, పూరీలాగ ఒత్తాలి. ఒక్కో పూరీని నూనెలో వేసి బంగారు వర్ణంలోకి వచ్చే వరకు రెండువైపులా కాల్చి తీసేయాలి. కుట్టు కీ పూరీ కావలసినవి కుట్టు పిండి - 2 కప్పులు ఆలుగడ్డలు - 2 ఉప్పు - తగినంత నల్ల మిరియాల పొడి - అర టీ స్పూను నెయ్యి లేదా నూనె - అర కప్పు తయారీ: ముందుగా ఆలుగడ్డలను శుభ్రంగా కడిగి నాలుగు ముక్కలుగా కట్ చేసి కుకర్‌లో ఉంచి ఉడికించాలి. తొక్క తీసి మెత్తగా మెదపాలి. ఒక పాత్రలో కుట్టు పిండి, ఉప్పు, నల్ల మిరియాల పొడి, బంగాళదుంప ముద్ద వేసి గట్టిగా కలపాలి. అవసరమనుకుంటే కొద్దిగా నీళ్లు జత చేసి బాగా కలిపి సుమారు అరగంటసేపు నాననివ్వాలి. బాణలిలో నెయ్యి కాని, నూనె కాని వేసి కాచాలి. పిండిని చిన్న చిన్న ఉండలుగా తీసుకుని పూరీలా ఒత్తి కాగిన నూనెలో వేసి రెండు వైపులా బంగారు రంగు వచ్చేవరకు వేయించి పేపర్ టవల్ మీదకు తీసుకోవాలి. సాబుదానా థాలీపీఠ్ కావలసినవి సగ్గుబియ్యం - కప్పు కొత్తిమీర తరుగు - 2 టేబుల్ స్పూన్లు ఉప్పు - తగినంత, పచ్చి మిర్చి - 2 (సన్నగా తరగాలి) పల్లీలు - పావు కప్పు (వేయించి పైన పొట్టు తీసి, కచ్చాపచ్చాగా పొడి చేయాలి) నిమ్మరసం - టీ స్పూను, సింఘారా పిండి - పావు కప్పు నూనె - వేయించడానికి తగినంత తయారీ: సగ్గుబియ్యాన్ని శుభ్రంగా కడిగి అరకప్పు నీళ్లలో సుమారు ఎనిమిది గంటలు నానబెట్టాలి. మిగిలిన పదార్థాలకు నానిన సగ్గుబియ్యం జత చేసి ఒక పాత్రలో వేసి బాగా కలపాలి. పిండిని చిన్న ఉండలా తీసుకుని, ఒక ప్లాస్టిక్ షీట్ మీద ఉంచి, ైెపైన మరొక ప్లాస్టిక్ షీట్ ఉంచి, చేతితో గుండ్రంగా వచ్చేలా ఒత్తాలి. పెనం వేడి చేసి, తయారు చేసి ఉంచుకున్న థాలీపీఠ్ను దాని మీద వేయాలి. రె ండువైపులా నూనె వేసి గోధుమరంగులోకి వచ్చేవరకు కాల్చి వేడివేడిగా అందించాలి. కొత్తిమీర చట్నీ లేదా ఆలుగడ్డల కూరతో తింటే రుచిగా ఉంటాయి. రాజ్గిరా థాలీపీఠ్ కావలసినవి రాజ్గిరా పిండి - 3 కప్పులు ఆలుగడ్డలు - 4 (ఉడికించి, తొక్క తీసి, మెత్తగా మెదపాలి) పచ్చి మిర్చి - 2 (సన్నగా తరగాలి) జీలకర్ర - టేబుల్ స్పూను మెంతులు - 2 టేబుల్ స్పూన్లు కొత్తిమీర తరుగు - 2 టేబుల్ స్పూన్లు ఉప్పు - తగినంత నెయ్యి - 2 టేబుల్ స్పూన్లు తయారీ మిక్సీలో కొత్తిమీర తరుగు, జీలకర్ర, పచ్చి మిర్చి, మెంతులు వేసి మెత్తగా ముద్ద చేయాలి. ఒక పాత్రలో రాజ్గిరా పిండి, మెదిపిన ఆలుగడ్డలు, తయారుచేసి ఉంచుకున్న కొత్తిమీర ముద్ద, ఉప్పు వేసి బాగా కలపాలి. కొద్దిగా నీళ్లు జత చేసి పిండిని గడ్డిగా కలిపి, మీడియం సైజు ఉండలు తయారుచేయాలి. మధ్యమధ్యలో రాజ్గిరా పిండి అద్దుతూ చపాతీ ఒత్తాలి. స్టౌ మీద పెనం ఉంచి, వేడయ్యాక తయారుచేసి ఉంచుకున్న చపాతీలు వేసి, రెండు వైపులా నెయ్యి వేసి బంగారు వర్ణంలోకి వచ్చేలా దోరగా కాల్చాలి. సేకరణ: డా. పురాణపండ వైజయంతి, సాక్షి, చెన్నై (ఇందులో ఉపయోగించిన సింఘారా పిండి, కుట్టు పిండి, రాజ్గిరా పిండి.... సూపర్మార్కెట్లో రెడీగా దొరుకుతాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మంచిది. వీటితో చేసిన పదార్థాలు ఉపవాసం ఉన్నవారు సైతం తినవచ్చు) -
ఎగిసిన ధరలు
సరకులన్నీ ప్రియం భారంగా మారిన పిండివంటలు సంక్రాంతినాడూ సామాన్యులు ఉసూరు యలమంచిలికి చెందిన శ్రీను దంపతులు సంక్రాంతి పండుగకు అవసరమైన సరకుల జాబితాను రాసుకుని మార్కెట్‌కు వెళ్లారు. పిండివంటల తయారీకి అవసరమైన సరకులు నూనె, బెల్లం, నువ్వులు సహా ఇతర వస్తువులు కొనుగోలు చేశారు. అటు నుంచి అటే నోములకు కావాల్సిన సరకులను ఖరీదు చేశారు. మార్గమధ్యలో పిండిమరకు వెళ్లి పిండిపట్టించుకుని ఇంటికి చేరారు. ఆయా చోట్ల వారు ఖర్చుచేసిన డబ్బు లెక్కచూసుకుంటే గుండె గుభేలుమంది. ఎందుకంటే రూ.2వేలకు పైగా ఖర్చయింది. గతేడాది రూ.1,400 దాటలేదు. అప్పటికీ, ఇప్పటికీ వస్తువుల కొనుగోలులో తేడా లేకపోయినప్పటికీ ఖర్చుమాత్రం పెరిగింది. యలమంచిలి: సంక్రాంతి అంటే సంబరం.. రోజూ కన్నా కాస్త భిన్నంగా గడుపుతాం.. పండుగకి పిండివంటలతో పాటు ప్రత్యేక వంటకాలు ప్రతి ఇంటిలోనూ ఉంటాయి. ఇవన్నీ ఇళ్లల్లో సంతరించుకోవాలంటే ధరలన్నీ అందుబాటులో ఉండాలి. కాని అవి సామాన్యులకు అందనంత ఎత్తుకు ఎగబాకాయి. వాటిని అందుకోలేక పండుగను పక్కనపెట్టలేక సామాన్యులు సతమతమవుతున్నారు. ధరల పెరుగుదల ప్రభావం సామాన్యులపై పడటంతో ‘సమ్‌క్రాంతి’ కనిపించడం లేదు. ఈ ఏడాది హుద్‌హుద్ ప్రభావంతో విశాఖజిల్లా అతలాకుతలమైంది. పేద, దిగువమధ్య తరగతి వర్గాలవారు తీవ్రంగా నష్టపోయారు. దీంతో గతంలో మాదిరి ఈ పండుగను జరుపుకునే అవకాశం లేకుండా పోయింది. సంక్రాంతి వస్తున్నదంటే వారం రోజుల ముందు నుంచే ఇళ్లల్లో సందడి మొదలవుతుంది. అల్లుళ్లు, కుమార్తెలు, మనుమళ్లలో ఒకటే సరదా.. మరోవైపు బంధువులు, మిత్రులు, ఆత్మీయుల రాకపోకలతో ఇళ్లన్నీ కళకళలాడుతుంటాయి. పిండివంటల తయారీ, నోములకు సిద్ధమవటం వంటి పనులతో మహిళలు బిజీగా ఉంటారు. మరోవైపు పాఠశాలలకు సెలవులుతో పిల్లల ఆటలు, పతంగుల ఎగిరివేతతో అంతటా సందడి నెలకొంటుంది. సందడిగా జరుపుకునే సంక్రాంతికి ధరాఘాతం పట్టుకుంది. మార్కెట్లో పండుగకు కావాల్సిన వివిధ రకాల వస్తువుల ధరలు విపరీతంగా పెరిగాయి. ఫలితంగా ఒక్కోకుటుంబపై అదనంగా రూ.500 నుంచి రూ.1,000 వరకు భారం పడుతోంది. గతేడాదితో పోలిస్తే ఈసారి వస్తువుల ధరలు ఆకాశాన్నంటాయి. గతేడాది నువ్వుల ధర కిలో రూ.120 నుంచి రూ.150 ఉంటే, ఈ ఏడాది రూ.200 నుంచి రూ.250 వరకు ఎగబాకింది. బెల్లం ధర కూడా రూ.10 అదనంగా పెరిగింది. పామాయిల్ ధర రూ.9 పెరగ్గా, నోము వస్తువుల ధరలు ఆకాశాన్నంటాయి. దీంతో ఈ పండుగను అన్ని వర్గాల ప్రజలు పొదుపుగా జరుపుకునే పరిస్థితి నెలకొంది. గత ఏడాదితో పోలిస్తే ఈ సంవత్సరం జిల్లావాసులపై పండుగభారం భారీగానే పడుతోంది. -
శుభములనీయవే సుబ్బీ గొబ్బెమ్మ
శ్రీ సూర్యనారాయణా మేలుకో... హరిసూర్యనారాయణా మేలుకో పొడుస్తు బాలుడు పొన్నపూవు ఛాయ... పొన్న పూవుమీద పొగడంపు ఛాయ ఉదయిస్తు బాలుడు ఉల్లిపూవు ఛాయ... ఉల్లిపూవు మీద ఉగ్రంపు పొడి ఛాయ ప్రత్యక్ష దైవంగా కొలిచే సూర్యుడు దక్షిణాయనం నించి ఉత్తరాయణంలోకి మారుతూ మకరరాశిలోకి ప్రవేశిస్తూ తీక్షణమైన తన కొత్త వెలుగులని ప్రపంచానికి ప్రసరించే పండుగ సంక్రాంతి పండుగ. ప్రతీ పండుగకీ ఓ దేవతకో దేవుడికో ప్రత్యేకత ఉన్నట్లే సంక్రాంతి పూర్తిగా అన్నింటికీ సాక్షీభూతమైన సూర్యనారాయణమూర్తిని కొలిచే పండుగ. ఆరోగ్య ప్రదాత సూర్యదేవుడు. మన భారతీయులు ప్రకృతి ఆరాధకులు. ఈ ప్రకృతి ఆరాధన సంక్రాంతి పండుగ రోజుల్లో కూడా మనకి కనిపిస్తుంది. భోగికి ముందర తొమ్మిది రోజుల ముందునించి లోగిళ్ళు చక్కగా శుభ్రంచేసి అందమైన ముగ్గులు పెట్టి వాటిపైన లక్ష్మీదేవిగా భావించే ఆవుపేడతో చేసిన గొబ్బిళ్ళు పెట్టి వాటిపై పూలతో అలంకరించి కన్నెపిల్లలు, చిన్నపిల్లలు పెద్దల సహకారంతో చప్పట్లు కొడుతూ ఆడడం ఓ అద్భుతమైన సన్నివేశం. గొబ్బియల్లో సఖియా వినవె చిన్నికృష్ణుని చరితము వినవె కృష్ణుని చరితము వినరే... ఔనట అక్కల్లారా చంద్రగిరి భామల్లారా భామలగిరి గొబ్బిళ్ళ గొబ్బీయల్లో.... సుబ్బీ గొబ్బెమ్మ శుభములీయవే సుబ్బీ గొబ్బెమ్మ మొగలిపువంటి మొగుడినీయవే... లాంటి పాటలు, ఆటలతో పదిమందితో స్నేహ సంబంధాలు కలుపుకుంటూ ఊర్లో ఒక్కొక్కరి ఇంటిముందు తొమ్మిదిరోజులు అందరు కలుసుకుని ఆడుకుని, గుల్లశనగపప్పు, అటుకులు, బెల్లం వంటివి నైవేద్యాలు పెట్టి ప్రసాదాలు పంచుకుంటూ ఆనందంగా గడుపుతారు. ఈ రోజుల్లో ఈ ఆధునిక పరికరాల మధ్య మనకి ‘ఏవిటది సిల్లీగా’ అనిపించవచ్చు కానీ, ఆధునీకరణ లేని రోజుల్లో ఆడపిల్లలని బయటికి వెళ్ళనిచ్చేవారు కాదు. మహిళలకి మరొక వ్యాపకం లేక ఇంటికే అంకితమయ్యేవారు. ఇలా పండగల్లో, పబ్బాల్లో నోములని, వ్రతాలని గొబ్బిళ్ళని పసుపుకుంకుమలని ఇచ్చిపుచ్చుకుంటూ రోజూవారి దినచర్య నుంచి బయటపడి ఆనందం పొందేవారు. అలాంటి వేడుకే భోగి పళ్ళు పోయడం. ఇంట్లో అయిదేళ్ళు పదేళ్ళ లోపు పిల్లలకి భోగిపళ్ళు పోసేవారు. చెరుకుముక్కలు, రేగిపళ్ళు, చిల్లరడబ్బులు, పూలు మొదలైనవి ఓ పళ్ళెంలో కలిపి పిల్లల తలలపైన మూడుసార్లు తిప్పుతూ పాటలు పాడుతూ భోగిపళ్ళు పోసేవారు. ముత్తైవలు ఒకరికొకరు పసుపు కుంకుమలిచ్చుకుంటూ తమ సాన్నిహిత్యాన్ని ఇరుగుపొరుగులతో సాటి మహిళలతో చాటుకొనేవారు. ఒక విధంగా ఇవి అలనాటి కిట్టీ పార్టీలని చెప్పొచ్చు. ఇక ఈ సంక్రాంతి పండుగ రైతన్నకి ఇచ్చే ఆనందం అంతాఇంతా కాదు. దేశానికి వెన్నెముక రైతు. రైతు పండిస్తేనే మనందరికి మెతుకు గొంతులో దిగేది. సంవత్సరమంతా పడ్డ కష్టం ఇంటికి పంట రూపంలో వస్తుంది. రోజూ అన్నం తినే ముందు దేవుడి తరువాత రైతన్నకి ఓ మాటు దణ్ణం పెట్టుకుంటే మనకెంతో మేలు. దేశానికి ఎంతోమేలు. సంక్రాంతి రోజుల్లో మనకి కనిపించే వారిలో హరిదాసులు ఒకరు. హరె హరెలొరంగ హరె.... హరెలోరంగ హరె... హరె.... అంటూ పాడుకుంటూ కృష్ణార్పణం అని దీవిస్తూ వెళతారు. వీరినే జియ్యరులు అని కూడా పిలుస్తారు. వీరు మామూలు రోజుల్లో కనిపించరు. సంక్రాంతి రోజుల్లోనే దర్శనమీయడం విశేషం. అలాగే ఈ రోజుల్లో మనల్ని పలుకరించే నేస్తం డూడూ బసవన్న. డూడూడూడూ బసవన్న... దొడ్డా దోరండి బసవన్నా... అంటూ పాడుకుంటూ బసవన్నని ఇంటింటా ఆడిస్తూ వారిచ్చే పాతబట్టలు, బియ్యం, పిండివంటలని తీసుకుని వెళ్ళే బసవన్నలు రాకపోతే అసలు సంక్రాంతికి అందమే రాదు. అలాగే పిట్టల దొర, బుడబుక్కలవాడు, జంగమదేవరలు వారి పాత్రలని వారు ఈ పండుగ దినాల్లో పోషిస్తూ మనకి శుభాశీస్సులు ఇవ్వడం సంక్రాంతిలో ఓ భాగమే. ఎటు చూసినా వెల్లివిరిసే ఈ పండగలని యధాశక్తి జరుపుకుంటూ మన పెద్దలబాటని అనుసరిద్దాం. కొత్త ఆనందాలని నింపుకుంటూ కొత్త ఆశలతో క్రాంతి పథంలో పయనిద్దాం. ఎన్నో సంక్రాంతులని జరుపుకుందాం. కృష్ణార్పణం. ఫొటో: షేక్ రియాజ్ -
అనుబంధాల సిరులు
చిట్టిబోయిన రామకృష్ణరాజు, ‘సాక్షి’, ఏలూరు సంక్రాంతి పండుగ అనగానే తెలుగు ప్రజల హృదయాలు పులకించి పోతాయి. ఉద్యోగాలు, వ్యాపారాల పేరుతో స్వగ్రామానికి దూరంగా ఇతర రాష్ట్రాల్లో, ఇతర దేశాల్లో స్థిరపడిన వారు కూడా తమ స్వగ్రామానికి వెళ్ళడానికి ఈ పండుగనే ఎంచుకుంటారు. సుదూరంలో ఉన్న వారసులంతా ఇంటికి రావడంతో ప్రపంచాన్నే జయించినంతగా కుటుంబ పెద్ద సంబరపడిపోవడం చూస్తుంటాం. కొత్తగా పెళ్ళైన కూతురు అల్లుడితో సహా పండగకు ఇంటికి వచ్చిందంటే ఆ తల్లిదండ్రుల ఆనందం, హడావిడి చెప్పనలవికాదు. కొత్త అల్లుడికి కోరినవన్నీ తెచ్చిపెట్టే బాధ్యతను మామగారు భుజాలపై వేసుకుంటే తన పాకశాస్త్ర ప్రావీణ్యాన్ని సంధిస్తూ అత్తగారు కొత్తకొత్త వంటకాలతో అల్లుడిపై ఆప్యాయతను చూపిస్తుంటారు. ఇక తెలుగుదనం ఉట్టిపడేలా లంగా ఓణీలు. పరికిణీలు, పంచె కట్టులు చూడాలంటే సంక్రాంతి పండుగను మించిన పండుగ మరోటి లేదనే చెప్పవచ్చు. సంక్రాంతి ముందురోజు భోగి, మరుసటి రోజు కనుము, ఆ మరుసటి రోజు ముక్కనుముగా నిత్యం పిండివంటలు, నూతన వస్త్రాలతో అన్ని గృహాలూ కళకళలాడుతుంటాయి. ఇప్పుడంటే కోడిపందాలు ఒక దురాచారంగా పరిగణిస్తున్నప్పటికీ వాటిని కూడా సంప్రదాయంగా పాటించే కుటుంబాలు ఇప్పటికీ ఉన్నాయి. అలాగే మహిళలకు ముగ్గుల పోటీలు, యువకులకు క్రికెట్, షటిల్ వంటి పోటీలు నిర్వహించడానికి స్థానిక సంస్థలూ ముందుకొస్తాయి. అరిసెలు, సున్నుండలు సంక్రాంతి పండుగకు తెలుగు ప్రజలు చేసుకునే ప్రత్యేక పిండివంటల్లో అరిసెలు, సున్నుండల స్థానాన్ని మరే పిండి వంటకమూ పూరించలేదేమో! పండుగ రోజున చేసుకునే బూరెలు గారెలు, పులిహోర వంటకాలు ప్రతి పండుగలో కనిపించినా ఈ అరిసెలు, సున్నుండలు మాత్రం సంక్రాంతి పండుగనాడే ఎక్కువగా పలకరిస్తుంటాయి. అలాగే ఈ పండుగ సందర్భంగా చేసుకునే మరికొన్ని పిండివంటల్లో పాకుండలు, కజ్జికాయలకూ ప్రత్యేక స్థానముంది. ఎన్ని అధునాతన మిఠాయిలు అందుబాటులోకి వచ్చినా వీటి ప్రాముఖ్యం వీటిదే. దాసులు... బసవన్నలు సంక్రాంతి పండుగకు కొత్త కళను తీసుకురావడంలో హరిదాసులు, డూడూబసవన్నల పాత్ర మరువరానిది. ధనుర్మాసం ఆరంభం నుండి ప్రతినిత్యం వేకువ జామునే హరిలోరంగ హరి అంటూ హరినామ స్మరణ చేస్తూ ప్రజలను మేల్కొలిపే హరిదాసుల సందడి ఇటీవలి కాలంలో కాస్త తగ్గినప్పటికీ కొంతమంది హరిదాసులు మాత్రం తమ వంశాచారంగా వస్తున్న వృత్తిని ఇప్పటికీ కొనసాగించడం విశేషం. హరిదాసులుగా వస్తున్న కొంతమంది వ్యక్తుల్లో ప్రభుత్వోద్యోగులు, ఉపాధ్యాయులు కూడా ఉన్నారంటే ఈ వృత్తికి వారు ఇస్తున్న విలువను అర్థం చేసుకోవచ్చు. ఇటీవలి కాలంలో సంప్రదాయ పండుగలు కళతప్పుతున్నాయనే భావన సమాజంలో ఏర్పడడంతో వాటిని పునఃప్రతిష్టించే బాధ్యతను విద్యాసంస్థలు తీసుకుంటున్నాయి. విద్యాసంస్థలు తమ పాఠశాలలు, కళాశాలల ప్రాంగణాల్లో పండుగలను నిర్వహిస్తూ సంప్రదాయాల పట్ల భావి భారత పౌరుల్లో అవగాహన పెంచుతూ పండుగల ప్రత్యేకతలను, వాటి ఔన్నత్యాన్ని చాటిచెబుతున్నాయి. సంప్రదాయంగా చేసుకునే పండుగ వెనుక ఉన్న పర్యావరణ, ఆరోగ్య రహస్యాలను కూడా తమ విద్యార్థులకు వివరిస్తుండడంతో విద్యార్థులు తమ తల్లిదండ్రులకు, చుట్టుపక్కల వారికి చెప్పే స్థాయిలో అవగాహన కలిగి ఉంటున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరులోని విజయ నగేష్ కాలేజ్ ఆఫ్ ఎలిమెంటరీ టీచర్ ఎడ్యుకేషన్ సంస్థ విద్యార్థులు ఇటీవల నిర్వహించిన సంక్రాంతి సంబరాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ కంప్యూటర్ యుగంలో వేగవంతమైన జీవనాల నేపధ్యంలో కూడా సంప్రదాయాలను కొనసాగించడంలో వివిధ వర్గాలు చేస్తున్న కృషి సమాజంలో ఎప్పటికప్పుడు పునరుత్తేజాన్ని నింపుతోందన్న ఆలోచన వెయ్యి ఏనుగుల బలాన్నిస్తోంది. -
పట్నం వచ్చిన పల్లెక్రాంతి
అరిటి బోదెలు, కొబ్బరి మట్టలతో అందంగా అలంకరించిన ఎడ్ల బండ్లు.. కలాపి చల్లిన లోగిళ్లు.. అందులో నవధాన్యాలతో తీర్చిదిద్దిన రంగవల్లులు.. పిండి వంటలు, పతంగులు, పట్టు పరికిణీల్లో యువతులు, పంచె కట్టులో యువకులు.. అచ్చంగా పల్లె పండుగ సంక్రాంతి పట్నానికి తరలి వచ్చింది. నగర శివారుల్లోని చిలుకూరు సమీపంలోని నిర్వాణ ప్రాంగణం పల్లెక్రాంతితో వెలిగిపోయింది. నాలుగు రోజులు ముందుగానే సంక్రాంతి పండుగను ఘనంగా జరుపుకుంది. -శిరీష చల్లపల్లి పల్లెలో సంక్రాంతి అనగానే.. తెల్లవారకముందే గంగిరెద్దల మువ్వల సవ్వడి వినిపిస్తుంది. హరిదాసుల గానం పల్లె గాలిలో విహరిస్తుంది. పట్నవాసంలో పండుగంటే హాలిడే అని తప్ప మరో అనుభూతి ఉండదు. ఈ సంప్రదాయానికి చెక్ పెడుతూ పల్లెలో జరిగే పండుగ శోభను తీసుకొచ్చే ప్రయత్నం చేశారు నిర్వాణ నిర్వాహకురాలు లీల. సిటీవాసులకు సంక్రాంతి ఆనందం పంచడానికి ఏకంగా పల్లెనే పట్నానికి తీసుకొచ్చారు. ముందే వచ్చిన పండుగ... సొంతూళ్లకు వెళ్లలేని సిటీజనులెందరో నిర్వాణ ప్రాంగణంలో ఆదివారం జరిగిన సంక్రాంతి సెలబ్రేషన్స్‌లో పాల్గొన్నారు. మగువలంతా ముగ్గులు వేసి గొబ్బెమ్మలు అందులో కొలువుదీర్చారు. పెద్ద మనుషులు వైకుంఠపాళి ఆటతో కాలక్షేపం చేశారు. చిన్నారులు, యువకులు పతంగులు ఎగిరేస్తూ జాలీగా గడిపారు. మహిళలు గచ్చుకాయలు, అష్టాచెమ్మా, వామన గుంటలు ఇలా కనుమరుగవుతున్న పల్లె ఆటల్లో తేలాడారు. మీసం మెలేసిన మగమహారాజులు కోడి పందేల్లో అదృష్టం పరీక్షించుకున్నారు. చిన్న పిల్లల నుంచి, పెద్దవాళ్ల వరకు అందరూ కల్చరల్ ఈవెంట్లలో పాలుపంచుకున్నారు. జానపద వేడుక... ఈ ఆటపాటలకు తోడు గంగిరెద్దులు ఆడించేవారు, హరిదాసులు, బుడబుక్కల వాళ్లు, బుర్రకథ చెప్పేవాళ్లు, పిట్టల దొరలు ఇలా జానపద కళారూపాలు పండుగ వాతావరణానికి మరింత శోభను తెచ్చిపెట్టాయి. ఔత్సాహిక కళాకారులు ఏక్తారా, సితారా, తంబుర, వీణ వంటి సంప్రదాయ వాయిద్యాలతో తమలో ఉన్న ప్రతిభను చాటుకున్నారు. ధాన్యరాశులు, కలశాలు, అరివేణి కుండలు ఇలా ట్రెడిషనల్ ఫెస్టివల్ అంటే ఎలా ఉండాలో చూపారు. వింతైన వంటకంబులు... వివాహ భోజనంబును తలదన్నే రీతిలో వంటకాలు వండి వడ్డించారు. దంపుడు బియ్యంతో అన్నం, పొంగలి, పులిహోర, దద్దోజనం, ముద్దపప్పు, ఆవకాయ, గుత్తి వంకాయ కూర లాంటివే కాకుండా పూర్ణాలు, అరిసెలు వంటి తీపి పదార్థాలు, మురుకులు, సకినాలు వంటి పిండి వంటకాలు భోజనప్రియులను కట్టిపడేశాయి. మొత్తానికి పల్లె సందడిని మోసుకొచ్చిన ఈ ప్రాంగణంలో సంక్రాంతితో పాటు భోగి, కనుమలు కూడా కన్నులపండువగా జరిగాయి. సరదాగా సాగింది ఉగాది, సంక్రాంతి తెలుగు పండుగలు. మరచిపోతున్న సంస్కృతిని మళ్లీ పరిచయం చేయడం బాగుంది. ముగ్గుల పోటీలు, పతంగుల ఆటలు భలే సరదాగా అనిపించాయి. నగర వాతావరణానికి పల్లె సంస్కృతిని పరిచయం చేయడం బాగుంది. - లక్ష్మీ పార్వతి నా వంతు ప్రయత్నం ఈ రోజుల్లో మనిషికంటే ధనానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ పరిస్థితిని మార్చడానికే నా వంతు ప్రయత్నమే నిర్వాణ వేదిక. ఏటా ఇలాంటి భారీ వేడుకను నిర్వహిస్తూ వస్తున్నాం. ఈ సారి సంక్రాంతికి ప్లాన్ చేశాం. సంప్రదాయానికి పెద్దపీట వేసే ఎలాంటి కార్యక్రమాలైనా ఈ ప్రాంగణంలో నిర్వహించవచ్చు. అదీ ఉచితంగానే. - లీల, నిర్వాణ ప్రాంగణం నిర్వాహకురాలు ఫొటోలు: ఎస్.ఎస్.ఠాకూర్ -
నో పామోలిన్
సాక్షి, కడప/ బద్వేలు : దసరా, బక్రీద్, దీపావళి .. ఈ పండుగలన్నీ అక్టోబర్ నెలలోనే వస్తున్నాయి. కనీసం పండుగ వేళన్నా పిండి వంటలు చేసుకుందామనుకుంటే వంట నూనె, కందిపప్పును చౌక దుకాణాల ద్వారా సరఫరా చేయడం లేదు. జిల్లాలో ఏడు నెలలుగా పామోలిన్ సరఫరా కావడం లేదు. దీని గురించి ఎవరూ పట్టించుకోవడం లేదు. కందిపప్పుది కూడా అదే పరిస్థితి. రెండు నెలలుగా కందిపప్పు అందడం లేదు. జిల్లాలో 7,56,833 మంది పేదలకు తెల్ల రేషన్‌కార్డులు ఉన్నాయి. వీరికి ప్రతినెలా బియ్యం, కిరోసిన్, పంచదార, పామోలిన్, కందిపప్పును ప్రభుత్వం సరఫరా చేస్తోంది. కొన్ని నెలలుగా కేవలం బియ్యం, కిరోసిన్, పంచదార మాత్రమే అందిస్తున్నారు. పామోలిన్, కందిపప్పును పట్టించుకోవడం లేదు. ప్రతి నెల 7.8లక్షల కిలోల పామోలిన్‌ను సరఫరా చేయాలి. ప్రస్తుతం మార్కెట్లో ిలో రూ.65 వరకు ఉంది. చౌక దుకాణాల్లో రూ.40కే అందించేవారు. ఇందుకోసం రాష్ట్రప్రభుత్వం రూ.13, కేంద్ర ప్రభుత్వం రూ.10 వంతున భరిస్తున్నాయి. ఇలా రూ.23 పోనూ రూ.40కే పేదలకు అందించేవారు. ప్రస్తుతం కాకినాడ పోర్టులో పామోలిన్ నిల్వలు పుష్కలంగా ఉన్నా కేంద్ర ప్రభుత్వం రాయితీని అందించకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. రాయితీ విషయాన్ని సకాలంలో కేంద్రం దృష్టికి తీసుకెళ్లక పోవడంతోనే ఇలా జరిగిందని ఉన్నతాధికారులు చెబుతున్నారు. అలాగే ప్రతి నెలా జిల్లాలోని పేదలకు కందిపప్పు అందించాల్సి ఉంది. రేషన్ దుకాణంలో రూ.50లకు కిలో కందిపప్పు అందిస్తుండగా బహిరంగ మార్కెట్లోరూ.80 వెచ్చించాల్సి వస్తోంది. కందిపప్పు సరఫరాను ఒక కంట్రాక్టర్‌కు అప్పగించారు. కందిపప్పును సరఫరా చేయడంలో ఆ కంట్రాక్టర్ చేతులెత్తేశాడు. చక్కెర సరఫరాలోనూ అదే పరిస్థితి. ఒక్కో కార్డుదారునికి అరకిలో చొప్పున పంపిణీ చేస్తుండగా ముందుగా వచ్చిన వారికే డీలర్లు అందిస్తున్నారు. ఆలస్యంగా వస్తే లేదని చెబుతున్నారు. మూడు నెలలుగా అన్న ఎన్టీఆర్ పేరుతో అమ్మహస్తం పథకాన్ని అమలు చేస్తామని బీరాలు పలుకుతూ వస్తున్న తెలుగుదేశం నేతలు ఇప్పటికీ ప్రజల్లోకి తీసుకురాకపోవడంతో సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. తాజాగా ప్రభుత్వం పామోలిన్‌కు మంగళం పాడినట్లుగా పౌర సరఫరాల శాఖ అధికారులు పేర్కొంటుండడం చూస్తే భవిష్యత్తులో పంపిణీ చేయడం ప్రశ్నార్థకంగా మారింది. ఏడు నెలలుగా పంపిణీకి నోచుకోని పామోలిన్ : రాష్ట్రపతి పాలనలో మూడు నెలలు.. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు కలుపుకుని దాదాపు ఏడు నెలలుగా పామోలిన్ పంపిణీకి నోచుకోలేదు. అంతకుముందు ప్రభుత్వాలు మారినా పామోలిన్ మాత్రం సక్రమంగా పంపిణీ జరిగేది. ప్రస్తుతం వరుస పండుగలు వచ్చినా పామోలిన్ సరఫరా కావడం లేదు. ప్రతి వంటలోనూ పామోలిన్ వాడకం తప్పనిసరి. ఇలాంటి పరిస్థితుల్లో పామోలిన్‌ను సర ఫరా చేయకపోవడంతో పేదలు పెదవివిరుస్తున్నారు. చౌక వస్తువుల్లోనూ కోత : జిల్లాలో 1735 చౌకదుకాణాలు ఉన్నాయి. అమ్మహస్తం పథకంలో పంపిణీ చేసే చాలా వస్తువులకు కోత పెట్టారు. ప్రస్తుతం జిల్లాలోని 19 గోడౌన్లకు బియ్యం, చక్కెర, గోధుమలు మాత్రమే పంపిణీ చేశారు. కందిబేడలు, ఉప్పు, చింతపండు, కారం పొడి తదితర వస్తువులకు మంగళం పాడారు. పండుగల నేపధ్యంలో అయినా ఈ సరకులను పంపిణీ చేసి ఉంటే బాగుండేదని పలువురు అభిప్రాయపడుతున్నారు. -
ఇదేం పండగ బాబోయ్..!
విడ్డూరం పండుగ అంటే ఏదో కొత్త బట్టలు వేసుకుని, పిండి వంటలు చేసుకుని, దేవుడికి పూజలు చేయడం అని మనమనుకుంటాం. కానీ విదేశాల్లో జరుపుకునే కొన్ని పండుగల గురించి వింటే ఇవేం పండుగల్రా బాబూ అనిపిస్తుంది. వాటిలో ఇవి కొన్ని... కూపర్స హిల్ చీజ్ రోలింగ్ అండ్ వేక్ - ఇదో విచిత్రమైన పండుగ. ఇంగ్లండ్‌లోని కూపర్స కొండ మీద జరగడం వల్ల దానికా పేరు వచ్చింది. పోటీదారులంతా కొండమీద నిలబడి ఉంటారు. బెల్ కొట్టగానే అందరూ కింద పడి దొర్లడం మొదలు పెడతారు. వేగంగా దొర్లుకుంటూ ఎవరైతే మొదట కొండ కిందకు వెళ్తారో వారే విజేత! మంకీ బఫే ఫెస్టివల్ - థాయ్‌ల్యాండ్‌లో ఇది ముఖ్యమైన పండుగ. అక్కడి లోప్బురీ ప్రాంతంలో కోతుల సంఖ్య చాలా అధికంగా ఉంటుంది. అందుకే ఏటా ఓ రోజు అక్కడ కోతుల పండుగ జరుపుతారు. ఆ రోజున దాదాపు రెండువేల కిలోల పండ్లు, కూరగాయలు, ఇతరత్రా ఆహార పదార్థాలు కోతులకు పెడతారు. ఈ వేడుకలో పాల్గొనడానికి విదేశాల నుంచి సైతం సందర్శకులు వస్తుంటారు! హడకా మత్సూరీ - ఇది జపాన్ వాళ్లకెంతో ఇష్టమైన పండుగ. ఏటా వేసవిలో ఘనంగా జరుగుతుంది. పురుషులంతా గోచీలాంటి ఆచ్ఛాదనను మాత్రమే ధరించి ఈ పండుగలో పాల్గొంటారు. దేవుడి సన్నిధిలో ఉంచిన రెండు పవిత్రమైన వెదురు ముక్కలను మత గురువు విసురుతాడు. అవి ఎవరికి చిక్కుతాయో వారు ఆ సంవత్సరమంతా సంతోషంగా ఉంటారని విశ్వాసం! ఫెస్టా డెల్ కార్నుటో - రోమ్‌లోని రోకా కాన్టెరానో అనే పట్టణంలో ఏటా ఈ పండుగ జరుగుతుంది. ప్రేమలో మోసపోయినవారు మాత్రమే ఇందులో పాల్గొనాలి. వీళ్లందరికీ ఒక కొమ్ముల జతను ఇస్తారు. వాటిని ధరించి అందరూ వీధుల్లో ఊరేగింపులా తిరుగుతారు. తద్వారా తాము ఒంటరిగా ఉన్నామని, జంటను కోరుకుంటున్నామని తెలియజేస్తారు. చాలామందికి ఈ వేడుకలోనే జోడీ దొరుకుతుందట! -
ఊరంతా సంక్రాంతి
కైకలూరు మండలంలోని గోనెపాడులో సంక్రాంతి సండిని పరిశీలించేందుకు ‘న్యూస్‌లైన్’ ఆదివారం సందర్శిం చిది. గ్రామం సంక్రాంతి కళ సంతరించుకుంది. బంధువులతో ప్రతి ఇంటా సందడి నెలకొంది. ఏ ఇంట చూసినా ఘుమఘుమలాడే పిండివంటలు తయారవుతూ కనిపించాయి. సరదాల కోడిపందాలు జరుగుతున్నాయి. పతంగులతో చిన్నారుల పరుగులు, పట్టుపరికిణీలతో పల్లెపడుచుల హొయలు, రంగు రంగుల రంగవల్లులు కనువిందుచేశాయి. సూర్యోదయానికి ముందుగానే యువతులు, మహిళలు వాకిళ్లను ఊడ్చి కళ్లాపి చల్లి ముగ్గులు వేస్తూ కనిపించారు. ముగ్గులకు రంగులు అద్ది, గొబ్బెమ్మలతో అలంకరించారు. హరిదాసు కీర్తనలు ఆలపిస్తూ ఇంటింటినీ సందర్శించాడు. గంగిరెద్దులోళ్లు డోలూ సన్నాయి వాయిద్యాలతో డూడూబసవన్నలను ఆడించారు. గ్రామంలోని చెరువులో పది మంది యువకులు కోడిపుంజులకు స్నానాలు చేయించారు. బద్దకంపోయి చలాకీగా పందేల్లో పాల్గొనాలంటే ఈ స్నానాలు తప్పవని వారు చెప్పారు. ‘సూరమ్మ.. పిన్నీ మీ అల్లుడు పండక్కి వస్తున్నాడా...’ అంటూ ఒకరు, కోడలా... మనవడు ఉదయమే బస్సు దిగాడంటగా ఏడీ ఇంక బయటకు రాలేదు..’ అంటూ మరొకరు.... ‘ఒరేయ్ అబ్బాయ్ కోడి పందేనికి వెళ్దామా’ అంటూ మరొకరు పలుకరించుకుంటూ కనిపిం చారు. ఉదయం ఆరు గంటల నుంచే అరుగులపైకి చేరిన గ్రామస్తులు లోకాభిరామాయణాన్ని చర్చించుకున్నారు. యువతులు పట్టు పరికిణీల్లో తమ వీధుల్లో ఇళ్ల ముందువేసిన ముగ్గులను పరిశీలించి వాటికి మార్కులు వేశారు. అనంతరం ఒప్పులగుప్పు, తొక్కుడుబిళ్ల వంటి ఆటలాడారు. చిన్న పిల్లలు రంగురంగుల పతంగులను ఎగురవేస్తూ వీధుల్లో అటూ ఇటూ పరుగులు తీశారు. ఇంటి పనులు పూర్తిచేసుకుని ఏడు గంటల నుంచి మహిళలు బృందాలుగా పిండివంటల తయారీకి సిద్ధమయ్యారు. రోటిపై కుందుచేర్చి రోకళ్లతో కొందరు బియ్యాన్ని పిండి కొట్టగా, మరి కొందరు ఆ పిండిని జల్లించారు. పిండి కొట్టడం పూర్తయ్యాక అరిసెలు, మిఠాయి, చెక్కలు, తదితర వంటలు వండే పనిలో నిమగ్నమయ్యారు. బంధువుల రాకతో సంతోషం ఏడాదిలో పెద్ద పండగ ఇది. బంధువులందరూ ఒక్కచోటకు చేరితే ఆ సంతోషమే వేరు. ఈ కలయికలే ప్రేమలు పెంచుతాయి. మా మనవడు మద్రాసులో ఇంజినీరింగ్ చదువుతున్నాడు. వాడి రాకకోసం ఎదురుచూస్తున్నాం. కాలం మారే కొద్ది సంప్రదాయలు కనుమరుగవుతున్నాయి. వాటిని కాపాడటం మన బాధ్యత. - బొల్లా లక్ష్మీనృసింహమూర్తి, గోనెపాడు చుట్టాలతో ఊరంతా కళకళ సంక్రాంతి పండగ వచ్చిదంటే ఊరంతా చుట్టాలతో కళకళలాడుతుంది. కొత్త దంపతులు, పొరుగూరిలో ఉద్యోగాలు చేస్తున్నవారు కచ్చితంగా ఊరొస్తారు. ఈ సంతోషం ఎప్పుడూ ఇలానే ఉండాలి. మా అబ్బాయి విశాఖపట్నంలో ఉంటున్నాడు. పండక్కి ఊరొస్తున్నాడు. వాడికి అరెసెలంటే ఎంతో ఇష్టం. వాడికి ఇష్టమైన పిండి వంటలు చేసిపెడతా. - నంగెడ్డ సూరమ్మ, గోనెపాడు సరదాల సంక్రాంతి సంక్రాంతి పండుగ వస్తుందంటే ఎంతో సంతోషంగా ఉంటుంది. ఇంటినిండా చుట్టాలు, చిన్నపిల్లలతో ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది. బొమ్మల కొలువులు ఏర్పాటు చేసి చిన్నారులకు భోగిపళ్లు పోసి పండుగను సరదాగా జరుపుకుంటాం. కుటుంబ సభ్యులతో కలిసి ఆలయాలకు వెళ్లి ప్రత్యేక పూజలు చేస్తాం. - వత్తుమిల్లి అశ్వని, జుఝవరం, పామర్రు మండలం కొట్టిన పిండితోనే అరిసెలు మేము స్వయంగా రోకళ్లతోకొట్టిన పిండివంటలు చేస్తాం. మిల్లు పట్టించుకోం. మా చుట్టు పక్కల వాళ్లం అందరం కలసి రోటిలో పిండి కొట్టుకుని అరిసెలు, ఇతర వంటకాలు చేసుకుంటాం. ఏళ్ల తరబడి ఇలాగే వండుకుంటున్నాం. సంక్రాంతి, దీపావళి పండుగలకు ఒకరి పనులకు మరొకరం సాయపడుతూ సందడిగా పనులు చేసేస్తాం. - మద్ది సామ్రాజ్యం, మర్రిపాలెం, నాగాయలంక మండలం సంక్రాంతంటే ఆనందం సంక్రాంతి అంటే మాకు ఎక్కడలేని ఆనందం. గృహాలకు శుభం చేకూరుస్తుందని ధనుర్మాసంలో పోటీపడి వాకిళ్లలో పేడకళ్లాపు చల్లి ముగ్గులు వేస్తాం. కాలం మారినా సంక్రాంతిని వదిలేది లేదు. పిండివంటలు వండుతాం, భోగిపళ్లు పోస్తాం. చెరకు గడలు, తేగలను సంక్రాంతి పండుగలో భాగస్వామ్యం చేస్తాం. ఈ కాలంలో అవి మహారుచిగా ఉంటాయి. - కొట్ర రమాదేవి, రేమాలవారిపాలెం,నాగాయలంక మండలం -
అంతటా సమ్క్రాంతే...!
కోటవురట్ల: సంక్రాంతి వస్తే....హరిదాసుల గజ్జెల సవ్వడి, గంగిరెద్దుల ఊరేగింపుతో డమరకనాదం, పిండి వంటల హడావిడి...జంగమయ్యలు, కొమ్మదాసరులు...పగటి వేషాలు...ఇదీ పెద్ద పండగ విశేషాలు... పూర్వం రోజుల్లో సంక్రాంతి పండుగ నెలరోజులు ఉందనగా హరిదాసులు ఇంటింటికి తిరిగేవారు. వినసొంపైన కీర్తనలు చెవిన పడగానే ఎంతో హాయిగా ఏదో తెలియని మధురానిభూతి కలిగేది. హరిదాసు రాని రోజు ఉండేదికాదు. హరిదాసు కీర్తనలు, గజ్జెల సప్పుడు అల్లంత దూరం నుంచి వినపడగానే ఇంట్లో మహిళలు బియ్యం, పప్పు దినుసులను పల్లెంలో సిద్ధం చేసేవారు. ఇపుడా సందడి ఏది? హరిదాసులు కనుమరుగవుతున్నారు. ఆ వృత్తి నుండి బయట పడి ఉద్యోగాలు, వ్యాపారాలు చేసుకుంటున్నారు. ఇక గంగిరెద్దులను అందంగా అలంకరించి వాటికి కొన్ని అంశాలపై శిక్షణ ఇచ్చి విన్యాసాలు చేయించేవారు. నాలుగు రోడ్డుల కూడలిలో గంగిరెద్దులతో విన్యాసాలు చేయిస్తూ ఆకట్టుకునేవారు. అయ్యగారికి దండం పెట్టు..అమ్మగారికీ దండం పెట్టు...! అంటూ గంగిరెద్దులతో విన్యాసాలు చేయించేవారు. గుమిగూడిన జనంతో ఆ ప్రాంతం కరతాళ ద్వనులతో మార్మోగేది. ఆ తర్వాత ఇంటింటికి తిరిగి గుమ్మం ముందర సన్నాయి రాగంతో కుటుంబ సభ్యులను పొగడ్తలతో ముంచెత్తేవారు. అష్టైశ్వర్యాలు, పాడి సంపదతో వర్ధిల్లాలని దీవించేవారు. ఇదంతా ఒకనాటి మాట. ఆధునిక పోకడలతో పల్లెల్లోనూ సంక్రాంతి కళ తప్పింది. గ్రామీణ కళలకు ఆదరణ లేక సంప్రదాయ కళాకారులు కనుమరుగవుతున్నారు. ఇక పట్టణాల్లో కృత్రిమ సంబరాలతో సరిపుచ్చుకుంటున్నారు. పల్లె వాతావరణం నిండుతనాన్ని కోల్పోయింది. ఏదో వెలితితో సంక్రాంతి పండగ గడచిపోతోంది.