Punganur Clashes
-
చంద్రబాబు కొత్త డ్రామా.. సానుభూతి కోసం ఇంతకు దిగజారాలా?
తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు అబద్దాలు ఆడతారని అనుకుంటారు కానీ, మరీ ఇంతలా అసత్యాలు చెప్పవచ్చన్న సంగతి మాత్రం ఆయన రాసిన ఒక లేఖ చూస్తే అర్ధం అవుతుంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అడ్డగోలుగా మాట్లాడతారని చెప్పుకుంటాం.. కానీ, అందులో ఇంతలా రికార్డు సృష్టించవచ్చని ఆయన రుజువు చేస్తున్న తీరు గమనించదగిందే. ఇక నారా లోకేష్ సంగతి వేరే చెప్పనవసరం లేదు. ఆంధ్ర ప్రదేశ్‌పై పడిపోయి ఒక రకమైన శబ్ద కాలుష్యం సృష్టిస్తూ అరాచకాలకు తెగపడుతున్న వీరు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంపై చేస్తున్న విమర్శలు హద్దులు దాటిపోయాయి. వారు ప్రజలకు ఏం చేస్తామో చెప్పే ధైర్యం చేయలేక, అనవసరపు ఆరోపణలన్నిటిని కలిపి అబద్దాల వంటకంతో ప్రజలను మభ్య పెట్టాలని విపరీతంగా కృషి చేస్తున్నారు. వాటిని పేజీలకొద్ది రాసేసి ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి మీడియా సంస్థలు ప్రజలను మోసం చేయడానికి తమ డప్పు కొడుతున్నాయి. ప్రజలపై యుద్ధమే.. అంగళ్లు, పుంగనూరుల వద్ద జరిగిన గొడవలు ఏంటి?. దేశ రాష్ట్రపతి, ప్రధానమంత్రులకు చంద్రబాబు రాసిన లేఖలేమిటి?. అలాగే విశాఖపట్నం గాజువాకలో పవన్ కళ్యాణ్ చేసిన ఉపన్యాసం చూస్తే ఆయనకు కూడా ఏదో అయిందన్న భావన కలుగుతుంది. వీరు నిస్పృహతో సాగిస్తున్న ఈ యుద్దం సీఎం జగన్‌పై కాదు. ఆంధ్ర ప్రదేశ్ ప్రజలపై చేస్తున్న వికృత యుద్దం. చంద్రబాబు అయితే ముఖ్యమంత్రి జగన్‌పై చేసిన ఒక విమర్శ చూడండి. జగన్ మానసిక పరిస్థితి బాగోలేదట. అందరూ చంద్రబాబు మానసిక స్థితిని సందేహిస్తున్నారని భావించి ఆయన రచయితలు ఎవరో ఎదురు దాడి చేసినట్లుగా ఉంది. లేఖల డ్రామా.. పోలీసులకు కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తానని చెప్పిన చంద్రబాబుకు మతి స్థిమితం లేనట్లా?. లేక తన స్కీముల గురించి సవివరంగా వివరించి ప్రజల నుంచి స్పందన పొందుతున్న సీఎం జగన్‌కు మతి లేనట్లా?. చంద్రబాబు పేరుతో రాసిన ఆ లేఖను జాగ్రత్తగా పరిశీలిస్తే అనేక విషయాలు తెలుస్తాయి. అంగళ్లు కూడలి వద్ద తనపైనే హత్యాయత్నం జరిగిందని.. కానీ, తానే హత్యాయత్నం చేశానని కేసు పెట్టారని ఆయన ఆరోపించారు. చంద్రబాబుపై హత్యాయత్నం జరిగితే పోలీసులకు ఎందుకు దెబ్బలు తగిలాయి?. చంద్రబాబుకు ఇలాంటి ట్రిక్కులు కొత్తకాదు. ఢిల్లీ స్థాయిలో తన పరపతి బాగా దెబ్బతిందన్న సంగతి ఆయనకు తెలుసు. అందుకే మళ్లీ ఢిల్లీ పెద్దల సానుభూతి పొందడానికి ఈ లేఖ డ్రామా ఆడారు. అందులో పచ్చి అబద్దాలు రాసి మొత్తం నెపం వైఎస్సార్సీపీ ప్రభుత్వంపైన, ముఖ్యమంత్రి జగన్‌పైన, పోలీసులపైన నెట్టే యత్నం చేశారు. ప్రశాంతంగా ఉన్న రాష్ట్రాన్ని ఏదో రకంగా చెడగొట్టాలన్నది వారి యత్నం. డ్రోన్లపై అసత్య ప్రచారం.. చంద్రబాబు తన లేఖలో ఎక్కడా ప్రజలకు ఇబ్బంది వచ్చినట్లు చెప్పలేదు. తనపై దాడులు జరుగుతున్నాయని అసత్య ఆరోపణలు మాత్రమే ఆ లేఖలో కనిపిస్తాయి. కుప్పం స్థానిక ఎన్నికలలో టీడీపీని దారుణంగా ఓటమి పాలు చేసిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై కూడా ఆరోపణలు చేశారు. 2019 నుంచే ఆయనపై దాడులు చేశారట. దీనిని ఎవరైనా నమ్ముతారా?. ఆ ఏడాది ఆగస్టులో తన ఇంటిపై డ్రోన్ ఎగరవేశారని, వారిని తన భద్రతాధికారులు పట్టుకున్నా చర్యలు తీసుకోలేదట. నిజానికి అప్పుడు వచ్చిన వరదల గురించి మాత్రం చంద్రబాబు దాచిపెట్టేశారు. డ్రోన్లు ఎగరవేసింది కరకట్టపై ఉన్న ఎన్ని ఇళ్లు మునిగిపోయే అవకాశం ఉందో తెలుసుకోవడానికి అని అధికారులు ప్రకటించినా, చంద్రబాబు మాత్రం తన అబద్దాన్ని పదే పదే వల్లె వేస్తుంటారు. 2021 సెప్టెంబర్‌లో జోగి రమేష్ తన నివాసంపై దాడికి వచ్చారట. ఆ రోజున చంద్రబాబుకు వినతిపత్రం ఇస్తామని రమేష్ ఆ ప్రాంతానికి వెళ్లిన మాట వాస్తవం. కానీ, పోలీసులు ఆయనను వెళ్లనివ్వలేదు. ఇందులో దాడి చేసింది ఏముంది?. అనపర్తి, నందిగామ, ఎర్రగొండపాలెంలలో జరిగిన కొన్ని చిన్న ఘటనలను ఆసరాగా తీసుకుని వాటిని కూడా ఆ లేఖలో పేర్కొన్నారు. వాటిలో ఎక్కడా చంద్రబాబుపై దాడి జరగలేదు. అలా అని ఆయన కానీ, ఆయన వద్ద ఉండే భద్రత అధికారులు కానీ పోలీసులకు ఫిర్యాదే చేయలేదు. ప్రతిపక్షాలు బహిరంగ సభలు, రోడ్ షోలు నిర్వహించకుండా జీఓ తెచ్చారని ఆయన అన్నారు. మరణాల గురించి చెప్పాలి కదా.. కందుకూరులో తన రోడ్ షోలో తొక్కిసలాట జరిగి ఎనిమిది మంది, గుంటూరులో ప్రజలకు కానుకలు ఇస్తామని తీసుకు వచ్చి తొక్కిసలాటకు గురిచేసి ముగ్గురు మరణించిన విషయాన్ని దాచిపెట్టేశారు. అంగళ్లు వద్ద నిర్దిష్ట రూట్ మ్యాప్‌ను వీడి అనుమతి లేకుండా రోడ్ షోని నిర్వహించి తప్పు చేసిన విషయాన్ని మాత్రం ప్రస్తావించలేదు. అంగళ్లు వద్ద, పుంగనూరు వద్ద టీడీపీ కార్యకర్తలు చేసిన దాడిలో పోలీసులు గాయపడిన సంగతి, ఒక కానిస్టేబుల్ కన్ను పోగొట్టుకున్న వైనం కూడా ప్రధానికి, రాష్ట్రపతికి తెలియచేస్తే బాగుండేది కదా!. పోలీసు వాహనాలను దగ్ధం చేసింది టీడీపీ కార్యకర్తలు కాదా?. వివేక హత్య కేసు, అమరావతి మొదలైనవాటిని కూడా ప్రస్తావించి సీఎం జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేయడంతో ఆయన శైలిని మరోసారి బయటపెట్టుకున్నారు. పవన్‌ది మరో కథ.. సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్లు రాయిస్తూ, వారిని పోలీసులు పట్టుకుంటే ప్రజాస్వామ్యం అని గగ్గోలు పెడుతూ, మళ్లీ ఎదురు ప్రభుత్వంపైనే దాడి చేశారు. ఏపీ మాదక ద్రవ్యాలు అంటూ పలు పిచ్చి ఆరోపణలు చేస్తూ రాష్ట్రం పరువు తీయడానికి చంద్రబాబు వెనుకాడటం లేదు. ఇక పవన్ కళ్యాణ్ ప్రసంగం చూస్తే, ఒక్కదానికి కూడా అర్ధం, పర్ధం ఉండదని తేలిపోతుంది. ఆస్తులు అమ్ముతున్నారని ఒకసారి, తాకట్టు పెడుతున్నారని మరోసారి అంటారు. దేవుడు, దెయ్యం అంటూ ఏదేదో మాట్లాడుతున్నారు. ఆయనకు ప్రధాని మోదీ చాలా క్లోజ్ అట. అయినా ఆయన కాళ్లు పట్టుకుంటారట. సీఎం జగన్ పాలన లేని రాష్ట్రాన్ని చూడాలట. ఆయన కోరిక కోసం ప్రజలు ఓడిస్తారని భ్రమ పడుతున్నారు. ఏ మాత్రం పద్దతి ఉన్నా జగన్ తీసుకువచ్చిన విధానాలలో ఏది తప్పు, ఏది రైటు చెప్పగలగాలి. ఒకసారి ముఖ్యమంత్రిగా పనికిరానని, మరోసారి సీఎం పదవి తీసుకోవడానికి సిద్దమని చెబుతారు. తాజాగా విశాఖలో సీఎం పదవి ఇవ్వాలని అంటున్నారు. అందుకోసం ఆయన ఏం చేస్తారో చెప్పే ధైర్యం ఉందా?. ఏదో రకంగా సినిమాలలో మాదిరి ప్రజలను మోసం చేయడానికి పవన్ కళ్యాణ్ విలన్ పాత్ర పోషిస్తున్నారు తప్ప ఇంకొకటి కాదు. --కొమ్మినేని శ్రీనివాస రావు, ఏపీ మీడియా అకాడెమీ చైర్మన్ ఇది కూడా చదవండి: ఇద్దరిలో అసహనం, ఫ్రస్ట్రేషన్ పెరిగిపోతోంది, ఎందుకో తెలుసా? -
పుంగనూరు ఘటన : చంద్రబాబు కుట్రను బయటపెట్టిన కొమ్మినేని శ్రీనివాసరావు
-
పుంగనూరు ఘటన: 2వేల మందిని విధ్వంసం కోసం రప్పించినట్లు అనుమానం
-
సీఎం జగన్‌ను మెచ్చుకుంది చిరంజీవే కదా: సజ్జల
సాక్షి, తాడేపల్లి: ఇటీవల పుంగనూరులో టీడీపీ శ్రేణులు దాడులకు తెగబడిన విషయం తెలిసిందే. టీడీపీ అధినేత చంద్రబాబు ఆదేశాలతో టీడీపీ గూండాలు వైఎస్సార్సీపీ కార్యకర్తలు, పోలీసులపై దాడులకు తెగబడ్డారు. ఎల్లో బ్యాచ్ దాడిలో పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు. ఓ కానిస్టేబుల్ కంటి చూపు కోల్పోవాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో పుంగనూరు ఘటనపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కాగా, సజ్జల బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. పుంగనూరు ఘటనతో చంద్రబాబు పైశాచికానందం పొందారు. పుంగనూరు నుంచి రాష్ట్రమంతా అల్లర్లకు ప్లాన్ చేశారు. ఎన్నికలు దగ్గరపడుతుంటే పవన్‌ను దగ్గరపెట్టుకొని చంద్రబాబు డ్రామాలడుతున్నారు. పుంగనూరు ఘటనలో చంద్రబాబు ఆధారాలతో సహా దొరికారు. పోలీసులు నిగ్రహంగా ఉండటంతో చంద్రబాబు పాచిక పారలేదు. చంద్రబాబు ప్లాన్ అదే.. పుంగనూరులో చంద్రబాబు రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. అల్లర్లు సృష్టించి అరాచకాలకు పాల్పడింది చంద్రబాబు, ఆయన గ్యాంగే. నాయకుడంటే ఆపడానికి ప్రయత్నిస్తాడు కానీ.. చంద్రబాబు మాత్రం రెచ్చగొట్టాడు. చంద్రబాబు హయాంలో ఉన్న పోలీసులే ఇప్పుడు కూడా ఉన్నారు. పోలీసులంటే చంద్రబాబుకు చులకనభావం. 14 ఏళ్లు సీఎంగా ఉండి చంద్రబాబు ఇలా ప్రవర్తించడం సిగ్గుచేటు. రాష్ట్రం తగులబడాలనే పుంగనూరు నుంచి చంద్రబాబు ప్లాన్ చేశారు. కుట్ర కోణం లేకుండా ఈ ఘటనలు జరుగుతాయా?. ఉన్మాదులుగా వ్యవహరించిన వారు కార్యకర్తలా?. వీరంతా చంద్రబాబు హయాంలో ట్రైనింగ్ అయిన ఉన్మాది ముఠా. ఎలాగైనా అధికారంలోకి రావాలనేది చంద్రబాబు తపన. పుంగనూరు ఘటనలో ఆధారాలతో సహా దొరికిపోయారు. పోలీసులను కొట్టమని చంద్రబాబే స్వయంగా చెప్పాడు. అసలు ఇలాంటి కరడు కట్టిన వ్యక్తులను సినిమాల్లోనే చూసేవాళ్లం. కానీ, మనమధ్యనే తిరుగుతున్న చంద్రబాబును ఇప్పుడు చూస్తున్నాం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనలో శాంతిభద్రతల విషయంలో ఎక్కడా రాజీ పడం. చంద్రబాబు లాంటి గుంటనక్కల ఆటలు సాగనీయం అని వార్నింగ్ ఇచ్చారు. చిరంజీవి నేరుగా పాలిటిక్స్ మాట్లాడొచ్చు.. చిరంజీవి రాజకీయాలు మాట్లాడాలంటే నేరుగా మాట్లాడొచ్చు. సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాలు బాగున్నాయని గతంలో చిరంజీవే మెచ్చుకున్నారు. అలాంటి వ్యక్తి ఇప్పుడు మనసులో ఏమైనా పెట్టుకుని మాట్లాడి ఉండవచ్చు. గతంలో కేంద్రమంత్రిగా చేసిన అనుభవం చిరంజీవికి ఉంది. ఆయన తమ్ముడు పవన్ కల్యాణ్ బీజేపీతోనే ఉన్నాడు. మరి నేరుగా బీజేపీ పెద్దలను కలిసి రాష్ట్రానికి కావాల్సినవి అడగవచ్చు కదా. ఆ కెడ్రిట్ కూడా ఆయన్నే తీసుకోమనండి’ అని కామెంట్స్ చేశారు. ఇది కూడా చదవండి: పవన్ కల్యాణ్ వారాహి వెబ్ సిరీస్‌పై మంత్రి అమర్నాథ్ సెటైర్లు.. -
ఈనాడు పిచ్చిరాతలపై ప్రత్యక్ష సాక్షి చెప్పిన అసలు నిజాలు
-
చిరంజీవి, పవన్‌కు మంత్రి అమర్నాథ్ స్ట్రాంగ్ కౌంటర్
సాక్షి, తాడేపల్లి: టీడీపీ అధినేత చంద్రబాబు, చిరంజీవి, పవన్ కల్యాణ్‌పై మంత్రి గుడివాడ అమర్నాథ్ సీరియస్ కామెంట్స్ చేశారు. ఏపీ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా టీడీపీ అరాచకం చేసిందన్నారు. సినిమాల్లోకి రాజకీయాలను తెచ్చిందే పవన్ కల్యాణ్ అని చెప్పారు. చిరంజీవి ముందుగా వాళ్ల తమ్ముడికి జ్ఞానబోధ చేయాలని హితవు పలికారు. కాగా, మంత్రి అమర్నాథ్ మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. పుంగనూరులో టీడీపీ శ్రేణుల దాడి ఘటనకు బాధ్యుడిగా చంద్రబాబుపై రౌడీ షీట్ తెరవాలి. పోలీసులను రెచ్చగొడితే కాల్పులు జరుపుతారని తద్వారా లాభం పొందాలని టీడీపీ ప్లాన్ చేసింది. చంద్రబాబు తమ పార్టీ నాయకుల ప్రాణాలను బలిచేసి రాజకీయ లబ్ధి పొందాలని భావించినట్టు స్పష్టంగా కనిపిస్తోంది. ఇంత దారుణం జరిగినా ఎల్లో మీడియాకు మాత్రం కనిపించలేదు. టీడీపీ నేతల దాడిలో పోలీసులు గాయపడినా ఎల్లో మీడియా పట్టించుకోవడం లేదు. చిత్తూరు జిల్లాలో టీడీపీ ఓటమిపై చంద్రబాబు కక్షగట్టి మరీ ఈ దారుణానికి ఒడిగట్టారు. పాదయాత్రలో నారా లోకేశ్ రెడ్ బుక్ ఏంటో అర్థం కావడం లేదు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని, పోలీసులను దూషిస్తున్నారు. టీడీపీ దాడిలో పోలీసుల కంటికి దెబ్బ తగిలిందని చెబితే తాను ఆపరేషన్ చేయిస్తానని లోకేశ్ అంటున్నాడు. అసలైతే లోకేశ్ తల, నాలుకకు ఆపరేషన్ చేయాలి. సంయమనంతో పనిచేసిన ఎస్పీ, డీజీపీపై విమర్శలు చేస్తున్నారు. చంద్రబాబు పర్యటనలో ఎక్కడా పుంగనూరు లేదు. జెడ్ ప్లస్ కేటగిరిలో ఉన్న వ్యక్తి ముందుగా టూర్ వివరాలు చెప్పాలి. టీడీపీ కార్యకర్తల ప్రాణాలు తీయలన్నది చంద్రబాబు కుట్ర. రాజకీయ లబ్ధి కోసం ఏదైనా చేస్తామంటే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. ఇదే సమయంలో చిరంజీవి, పవన్ కల్యాణ్‌కు మంత్రి అమర్నాథ్ కౌంటరిచ్చారు. సినిమాలను పిచ్చుక అని తక్కువ చేస్తే ఎలా అని ప్రశ్నించారు. సినిమాల్లోకి రాజకీయాలను తెచ్చిందే పవన్ కల్యాణ్. ముందుగా చిరంజీవి తన తమ్ముడికి జ్ఞానబోధ చేయాలి. శుభ్రం చేయాల్సింది ముందుగా తన తమ్ముడినే. ఆ తర్వాత రాజకీయ పార్టీలకు సూచనలు చేయవచ్చు అంటూ ఘాటుగా విమర్శలు చేశారు. ఇది కూడా చదవండి: చిరంజీవి, పవన్‌కు మంత్రి అమర్నాథ్ స్ట్రాంగ్ కౌంటర్ -
నాతోపాటు చాలామంది పోలీసులకు రక్త గాయాలయ్యాయి: కానిస్టేబుల్ రణధీర్
-
పోలీసు సిబ్బందిపై పథకం ప్రకారం దాడి చేశారు: ఎస్పీ
-
పుంగనూరు దాడిలో చూపు కోల్పోయిన పోలీస్.. సీఎం జగన్ సాయం
సాక్షి, చిత్తూరు: పుంగనూరులో టీడీపీ శ్రేణులు రెచ్చిపోయిన విషయం తెలిసిందే. చంద్రబాబు ఆదేశాలతో టీడీపీ మూకలు వైఎస్సార్సీపీ కార్యకర్తలు, పోలీసులపై దాడులకు పాల్పడ్డారు. ఈ క్రమంలో దాదాపు 13 మంది పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు. ఇక, దాడి ఘటనపై చిత్తూరు జిల్లా ఎస్పీ రిషాంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తాజాగా, రిషాంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. పుంగనూరులో పథకం ప్రకారమే పోలీసులపై దాడికి దిగారు. టీడీపీ అల్లరి మూకలు విచ్చక్షణరహితంగా దాడి చేశారు. పుంగనూరులో పోలీసులపై దాడి ఘటనలో కానిస్టేబుల్ రణధీర్ ఎడమ కంటి చూపు పోయింది. ఆరోజు జరిగిన దాడి ఘటనలో మరో 13 మంది పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనలో గాయపడిన ప్రతీ కుటుంబానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అండగా ఉంటామన్నారు. రణధీర్‌కు పది లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించారని అన్నారు. మరోవైపు.. పుంగనూరు ఘటనపై డిప్యూటీ సీఎం నారాయణ స్వామి స్పందించారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ చంద్రబాబు నాయుడు విధ్వంసం సృష్టించాలని కుట్ర చేశాడు. రూట్ మ్యాప్ ప్రకారం కాదని, పుంగనూరులోకి వెళ్లి పోలీసులపై దాడి చేశారు. ఎస్పీ రిషాంత్ రెడ్డి చాలా సంయమనంతో వ్యవహరించారు. అల్లరి మూకల దాడిలో కానిస్టేబుల్ రణధీర్ కన్ను కోల్పాయడు. మదనపల్లి నుంచి చల్లా బాబు, చంద్రబాబు ఒకే కారులో ప్రయాణిస్తూ దాడికి పథకం రచించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంపై నిందలు వేయడానికే ముందస్తు ప్రణాళికతో దాడులు చేశారు. పోలీసులు కాల్పులు జరపకుండా సంయమనం పాటించారు. ఈ ఘటనలో చంద్రబాబును ఏ1గా చేర్చాలి. నారా లోకేశ్ వార్డు సభ్యుడిగా కూడా గెలవని వ్యక్తి అని పొలిటికల్ పంచ్ ఇచ్చారు. ఇది కూడా చదవండి: ఈ దారుణానికి బాధ్యులెవరు? -
పోయిన ఆ కానిస్టేబుల్ కళ్ళను తిరిగి ఇస్తావా..? చంద్రబాబుపై పేర్ని నాని కామెంట్స్
-
‘చిరంజీవి, ఎన్టీఆర్, రామ్ చరణ్ గురించి ఎవరైనా మాట్లాడారా?’
సాక్షి, తాడేపల్లి: టీడీపీ అధినేత చంద్రబాబుపై మాజీ మంత్రి పేర్ని నాని ఫైరయ్యారు. చంద్రబాబు పక్కా స్కెచ్‌తోనే పుంగనూరులో రెక్కీ చేయించారని సీరియస్ అయ్యారు. పుంగనూరు ఘటనలో చంద్రబాబు ఏ1 ముద్దాయి.. చంద్రబాబు రౌడీయిజం, బరితెగింపు పాల్పడినట్టు తెలిపారు. అధికారం లేకపోతే అదే పోలీసులపై అరాచకం చేస్తారా? అని ప్రశ్నించారు. కాగా, పెర్ని నాని మంగళవారం తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ.. అధికారం కోసం చంద్రబాబు ఎంతకైనా తెగిస్తాడు. చంద్రబాబు బరితెగించి వ్యవహరిస్తున్నాడు. 40ఏళ్ల ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు రౌడీమూకలతో యాత్రలు చేస్తున్నాడు. రాళ్లు, కర్రలు, తుపాకులు తీసుకుని వస్తున్నారు. పుంగనూరులో ముందు రోజే కర్రలు, రాళ్లు తెచ్చిపెట్టుకున్నారు. ఈ దాడిలో పదిమంది పోలీసులనైనా చంపాలనే కుట్ర చేసినట్లు రుజువైంది. అంగళ్లులో ఆయాసం.. పుంగనూరులో రౌడీవేషం ఇదీ చంద్రబాబు వైఖరి. రాష్ట్రంలో రావణకాష్టం సృష్టించాలని చంద్రబాబు ప్రయత్నించారు. పక్కా స్కెచ్ గీసి, రెక్కీ నిర్వహించి అల్లర్లు పుంగనూరులో పక్కా స్కెచ్ గీసి, రెక్కీ నిర్వహించి అల్లర్లు సృష్టించారు. ఏపీ చరిత్రలో ఏ రాజకీయ పార్టీ అయినా పోలీసులను చంపే ప్రయత్నం చేసిందా?. మీరు అధికారంలో ఉంటే ఫామ్ హౌస్ నుండి మనుమడి వరకు కాపలా కాయాలా?. అధికారం లేకపోతే అదే పోలీసులపై అరాచకం చేస్తారా?. ఆ దాడుల్లో ఒక పోలీసుకి కళ్లు పోయాయి. అతని జీవితం అంథకారమైంది. పుంగనూరు దాడి ఘటనలో పెద్దసంఖ్యలో పోలీసులకు గాయాలైతే ఎల్లోమీడియాలో చిన్న వార్త కూడా రాయలేదు. ఆఖరికి వైఎస్సార్సీపీ కార్యకర్తకు గాయాలైతే టీడీపీ కార్యకర్త అని ఈనాడులో ఫొటో వేశారు. చంద్రబాబుకు గడ్డి పెడుతూ ఒక్క వార్త కూడా ఎల్లో మీడియా ఎందుకు రాయలేదు?. అంతేకాకుండా చంద్రబాబు మీదనే దాడి జరిగిందని వార్తలు రాస్తారా? ఇది ఎంత సిగ్గుచేటు. చిత్తూరు ఎస్పీ రిషాంత్ రెడ్డిపై నారా లోకేశ్ అవాకులు చెవాకులు పేలుతున్నాడు. పోలీసులు లేనిదే అడుగు కూడా బయటకు పెట్టలేని వ్యక్తి ఎస్పీ గురించి మాట్లాడుతున్నాడు. ఎస్పీకి కంటి ఆపరేషన్ చేస్తానంటున్నాడంటే.. లోకేశ్‌కి ఎంత బలుపు?. తమ కుట్ర సాగనీయలేదని చంద్రబాబు, లోకేశ్ తెగ బాధపడిపోతున్నారు. 14 ఏళ్లు సీఎంగా ఉండి ఏం పీకావ్?.. పుంగనూరు ఘటనలో ప్రథమ ముద్దాయి చంద్రబాబేనని మేము భావిస్తున్నాం. రాయలసీమకు నీళ్లు తెస్తున్నానని, కష్టపడుతున్నాననే చంద్రబాబు 14 ఏళ్లు సీఎంగా ఉండి ఏం చేశాడు?. మీ భాషలోనే చెప్పాలంటే.. అప్పటినుండి ఏం పీకావ్? అని ప్రశ్నించారు. అధికారంలో ఉన్నప్పుడు చేయలేని వాళ్లు మళ్ళీ అధికారం ఇస్తే చేస్తారంట. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సొంత ఊరుకు ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉన్నారు. ఆయన దమ్మున్న మగాడు. ప్రజల గుండెల్లో గూడు కట్టుకున్నాడు. మరి చంద్రగిరిలో టీడీపీ గెలవక ఎన్నాళ్లయింది? అని ప్రశ్నించారు. చిరంజీవికి కౌంటర్.. ఇదే సమయంలో చిరంజీవికి పేర్ని నాని కౌంటరిచ్చారు. చిరంజీవికి వ్యక్తిగతంగా నేను అభిమానిని. హైదరాబాద్ ఫిల్మ్ నగర్ నుంచి ఏపీ సచివాలయానికి ఎంత దూరమో.. ఏపీ సచివాలయం నుంచి ఫిల్మ్ నగర్‌కి అంతే దూరం. సినిమాని సినిమాగా.. రాజకీయాన్ని రాజకీయంగా చూడాలి. చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్, మహేష్, రాం చరణ్ మీద ఏ రాజకీయ పార్టీ అయినా మాట్లాడిందా?. వారి రెమ్యునరేషన్ గురించి ఎవరైనా అడిగారా?. ఒక రాజకీయ నేత మీద అనవసరంగా పాత్ర సృష్టించి వివాదం చేసిందెవరు?. ఒకరు దాడి చేస్తే ఎదుటివారు కూడా ఎదురుదాడి చేస్తారు. సినిమాలో లాగ హీరో విలన్ని కొడుతుంటే చూస్తూ కూర్చున్నట్టు కూర్చోరు. రాజకీయాల్లో ఒకరు గోకితే ఎదుటివారి కూడా గోకుతారు. ఇలాంటివి ఎదుర్కోక తప్పదు. దాడి జరిగినప్పుడు, ఎదురు దాడి జరిగి ఉంటుంది. రాష్ట్ర విజభన సమయంలో చిరంజీవి ఏ పార్టీలో ఉన్నారు?. చిరంజీవి కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడే ఏపీకి ప్రత్యేక హోదా హామీ వచ్చింది. రాష్ట్రానికి అన్యాయం జరిగితే అప్పుడు చిరంజీవి ఎందుకు మాట్లాడలేదు? అని ప్రశ్నించారు. ఇది కూడా చదవండి: ‘ఏదైనా చేస్తామంటే చూస్తూ ఊరుకోం.. చంద్రబాబు, పవన్‌కు వార్నింగ్!’ -
గుర్తించకపోయిన పర్లేదు అవహేళన చేయకండి : ఎస్పీ రిశాంత్ రెడ్డి
-
‘కానిస్టేబుల్ కొడుకువే కదా.. పోలీసులు గాయపడితే ఎందుకు మాట్లాడలేదు పవన్’
సాక్షి, తాడేపల్లి: పుంగనూరులో టీడీపీ శ్రేణులు రెచ్చిపోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి కారుమూరి నాగేశ్వరరావు సీరియస్ అయ్యారు. బందిపోటు ముఠా మాదిరిగా చంద్రబాబు వ్యవహరించారని ఫైరయ్యారు. ఎన్నికల్లో ఏం చెప్పాల్లో తెలియక ఇలా అలజడులు సృష్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, మంత్రి కారుమూరి శనివారం మీడియాతో మాట్లాడుతూ.. పుంగనూరులో టీడీపీ మూకలు విధ్వంసం సృష్టించారు. ఇతర ప్రాంతాల నుంచి జనాన్ని రప్పించి వాహనాలను ధ్వంసం చేశారు. పోలీసు వాహనాలను తగులబెట్టారు. ఇచ్చిన రూట్ మ్యాప్ ప్రకారం చంద్రబాబు ఎందుకు వెళ్లలేదు?. బ్లాక్ క్యాట్ కమాండోలను అడ్డుపెట్టుకుని చంద్రబాబు విధ్వంసానికి పాల్పడుతున్నారు. ఎన్నికల్లో ఏం చెప్పాలో తెలియకే ఇలా అలజడులు సృష్టిస్తున్నారు. ఒక ప్రణాళిక ప్రకారం గూండాలను అక్కడికి రప్పించారు. పెద్దిరెడ్డి హీరో.. వైఎస్సార్సీపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఒక్క హీరో. కుప్పంలో చంద్రబాబునే కుప్పకూల్చి కింద కూర్చోబెట్టారు. స్థానిక సంస్థల్లో అన్ని స్థానాల్లో ఓడించారనే ఈర్ష్యతోనే పెద్దిరెడ్డిపై చంద్రబాబు కుట్ర పన్నారు. చంద్రబాబు వ్యవహారంపై విచారణ జరపాలి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మళ్లీ కావాలని ప్రజలు కోరుకుంటున్నారు. దీన్ని ఓర్వలేకనే చంద్రబాబు గొడవలు సృష్టించి లా అండ్ ఆర్డర్‌కు ఇబ్బందులు కలిగిస్తున్నారు. పవన్ ఎందుకు స్పందించలేదు? తాను కానిస్టేబుల్ కొడుకును అని చెప్పుకునే పవన్ కల్యాణ్.. నిన్న అంతమంది పోలీసులు గాయపడితే ఎందుకు మాట్లాడలేదు?. దత్త తండ్రి గురించి మాత్రమే ఎందుకు మాట్లాడుతున్నావ్?. పిల్లల్ని రెచ్చగొట్టి గొడవలు చేయినే వారి భవిష్యత్ ఏంటి?. వారి కుటుంబాల గురించి ఆలోచించరా?. ఎన్ని కేసులు పెట్టించుకుంటే అంత పెద్ద పదవులు ఇస్తామని లోకేశ్ అంటున్నారు. యువత భవిష్యత్‌ను నాశనం చేయాలనుకుంటున్నారా?. జడ్ ప్లస్ కేటగిరి రక్షణలో ఉండి జనాన్ని రెచ్చగొట్టడమేంటి?. నిన్నటి రోజు బ్లాక్ డే. ఏం సాధించారని గవర్నర్‌ను కలిసి వినతి పత్రం ఇస్తారు?. గవర్నర్‌కు అన్ని వాస్తవాలు తెలుసు. చంద్రబాబు, లోకేశ్, పవన్‌లపై విచారణ జరపాలి. ఏపీ బీజేపీ చీఫ్ పురంధశ్వేరి వాస్తవాలను మభ్యపెట్టి మాట్లాడుతున్నారు అంటూ కామెంట్స్ చేశారు. చంద్రబాబువి పాతతరం పాలిటిక్స్: ఎంపీ భరత్ పుంగనూరులో టీడీపీ శ్రేణుల దాడులను ఎంపీ మార్గాని భరత్ ఖండించారు. పోలీసులపై దాడులు చేయించడం అమానుషమన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబుకు ప్రజలు తగిన గుణాపాఠం చెబుతారని అన్నారు. రాష్ట్రంలో ఏదో రకంగా అల్లర్లు సృష్టించేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. కాగా, ఎంపీ భరత్ శనివారం రాజమండ్రిలో మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ శ్రేణులు ముందస్తు ప్లాన్ ప్రకారమే దాడులు చేసినట్టు కనిపిస్తోంది. అనుమతి ఉంటే వారిని పోలీసులు ఎక్కడా ఆపరు. యువతను, కార్యకర్తలను రెచ్చగొట్టే విధంగా చంద్రబాబు వ్యవహరించారు. రాష్ట్రంలో అల్లర్లు సృష్టించి రాజకీయ పబ్బం గడుపుకోవాలని చంద్రబాబు భావించారు. చంద్రబాబువి పాతతరం రాజకీయాలు. ఆయన చిప్ అప్డేట్ కావాలి. తనను తాను రాజ్యాంగేతర శక్తిగా చంద్రబాబు భావిస్తున్నారని చురకలు అంటించారు. చంద్రబాబు భాష బాగాలేదు సాక్షి, ఢిల్లీ: పుంగనూరు ఘటనలో బాధ్యులను శిక్షించాలని సీపీఎం ఏపీ కార్యదర్శి శ్రీనివాస రావు డిమాండ్ చేశారు. కాగా, శ్రీనివాస రావు శనివారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు భాష బాగాలేదు. పుంగనూరు దాడి ఘటనలో బాధ్యులను శిక్షించాలి. బీజేపీ తరఫున జనసేన ఏజెంట్‌గా పనిచేస్తోంది. బీజేపీ, టీడీపీ కలిస్తే రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలుగుతుంది. పోలవరంపై కేంద్రం వివక్షపూరితంగా వ్యవహరిస్తోందన్నారు. ఇది కూడా చదవండి: ‘పోలీసుల చేతకానితనం అనుకుంటే పొరపాటే..’ -
‘అమాయకులు బలికావొద్దనే సంయమనం పాటించాం’
సాక్షి, విజయవాడ: అన్నమయ్య జిల్లాలో టీడీపీ శ్రేణులు రెచ్చిపోయిన విషయం తెలిసిందే. పుంగనూరులో చంద్రబాబు ఆదేశాలతో టీడీపీ శ్రేణులు వైఎస్సార్సీపీ కార్యకర్తలు, పోలీసులపై దాడులు చేశారు. ఇక, ఎల్లో బ్యాచ్ దాడిలో పదుల సంఖ్యలో పోలీసులు తీవ్రంగా గాయపడటంతో వారిని ఆసుపత్రుల్లో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. మరోవైపు.. పోలీసులపై టీడీపీ శ్రేణుల దాడిని పోలీసు అధికారుల సంఘం తీవ్రంగా ఖండించింది. ఈ సందర్భంగా పోలీసులు అధికారుల సంఘం ప్రతినిధులు శనివారం మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ కార్యకర్తల దాడుల్లో 13 మంది పోలీసులకు తీవ్ర గాయాలయ్యాయి. పుంగనూరులో టీడీపీ కార్యకర్తల విధ్వంసాన్ని పోలీసులు అరికట్టారు. చంద్రబాబు కావాలనే టీడీపీ కార్యకర్తలను రెచ్చగొట్టారు. పుంగనూరులో అనుమతి లేకుండగా టీడీపీ కార్యకర్తలు చొరబడ్డారు. పోలీసులను తీవ్రంగా గాయపరిచారు. ఈ క్రమంలో పోలీసులు సంయమనం కోల్పోతే పుంగనూరులో పరిస్థితి మరోలా ఉండేది. ఇది పోలీసుల చేతకానితనం అనుకుంటే పొరపాటే. ఈ దాడిలో అమాయకులు, సామాన్య ప్రజలు ఇబ్బంది పడకూడదనే సంయమనం పాటించాం. పుంగనూరు ఘటనపై ప్రత్యేక బృందం ఏర్పాటు చేయమని డీజీపీని కోరాం. మాకు అధికార పక్షమైనా.. ప్రతిపక్షమైనా ఒక్కటే అని స్పష్టం చేశారు. విచారణకు డీజీపీ ఆదేశం.. ఇదిలా ఉండగా.. పుంగనూరు ఘటనపై విచారణకు డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి ఆదేశించారు. డీఐజీ అమ్మిరెడ్డి, ఎస్పీ రిషాంత్‌లకు ఆయన ఆదేశాలు జారీ చేశారు. టీడీపీ కార్యకర్తల దాడిలో పోలీసులు గాయపడ్డారని, వాహనాలను సైతం ఉద్దేశపూర్వకంగా తగులపెట్టారని డీజీపీ అన్నారు. రాళ్లు రువ్విన, నిప్పు పెట్టిన వారందరినీ గుర్తించామన్నారు. లా అండ్ ఆర్డర్‌కి విఘాతం కలిగించిన వారందరిపై కఠినచర్యలు తప్పవని హెచ్చరించారు. సీసీ కెమెరా పుటేజీని విశ్లేషిస్తున్నాం. ఇప్పటికే అనేక మంది నిందితులను గుర్తించాం. మరికొందరి కదలికలపై నిఘా పెట్టాం. చంద్రబాబు రూట్ ప్లాన్ మార్పు వ్యవహారం కూడా విచారణలో తేలుతుంది. ఈ ఘటన వెనుక ఎవరున్నారో ప్రాథమిక సమాచారం ఉంది. రెచ్చగొట్టే ప్రసంగాలపై కూడా దృష్టి పెట్టాం. శాంతిభద్రతలకు విఘాతం కల్గిస్తే సహించేదిలేదన్నారు. ఇక, పుంగనూరు పీఎస్‌లో నిన్న జరిగిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. 30 మంది టీడీపీ నేతలపై కేసు నమోదైంది. ఐపీపీ 147, 148, 332, 353, 128బీ సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. ఇది కూడా చదవండి: టీడీపీ రౌడీల దాడి: పోలీసులను పరామర్శించిన మంత్రి పెద్దిరెడ్డి -
చిత్తూరులో టీడీపీ కార్యకర్తల వీరంగం.. పోలీసులనే రక్తం కారేలా..
పుంగనూరు: చిత్తూరు రోడ్ షోలో చంద్రబాబు టీడీపీ కార్యకర్తలను రెచ్చగొట్టడంతో వారంతా రెచ్చిపోయి ప్రశాంతంగా ఉండే పుంగనూరులో ఉద్రిక్త వాతావరణాన్ని సృష్టించారు. రోడ్ షోకు బందోబస్తు నిర్వహించి రక్షణ కల్పించడానికి వచ్చిన పోలీసులపైనే విచక్షణారహితంగా దాడులకు తెగబడ్డారు. ఇష్టమొచ్చినట్టు రాళ్లు రువ్వారు, వాహనాలకు నిపు పెట్టారు, అక్కడున్న వారంతా టీడీపీ కార్యకర్తల వీరంగాన్ని బెంబేలెత్తిపోయి ఇళ్లల్లోకి వెళ్లి దాక్కున్నారు. పాపం పోలీసులు మాత్రం వీధిలో భాగంగా వారిని అడ్డుకునే ప్రయత్నం చేస్తే వారిపై రక్తమోడేలా హింసాత్మక దాడులు చేశారు. అల్లర్ల గురించి పోలీస్ అధికారుల సంఘం ప్రెసిడెంట్ ఉదయ్ మీడియాకు వివరిస్తూ.. టీడీపీ కార్యకర్తలు ఉద్దేశపూర్వకంగానే దాడులు చేశారన్నారు. పుంగనూరులో ప్రశాంతతకు విఘాతం కలిగించి విధ్వంసం సృష్టించాలనే లక్ష్యంతోనే అల్లర్లు జరిగాయి. వాస్తవానికి వారికి ఆ మార్గంలో రావడానికి అనుమతే లేదు. అయినా కూడా టీడీపీ కార్యకర్తలు ఇదే మార్గాన్ని ఎంచుకుని ఇక్కడికి చొరబడ్దారు. వారు చేసిన దాడుల్లో సామాన్యులతో పాటు పోలీసులు కూడా తీవ్రంగా గాయపడ్డారని తెలిపారు. చంద్రబాబు రోడ్ షో గురించి ప్రకటించగానే అల్లర్ల సృష్టించాలని వారు ముందే పథకం రచించారు. పథకం ప్రకారమే వారు తమ వెంట ఆయధాలను తెచ్చుకున్నారు. వారు దాడులు చేస్తున్నా ప్రతిదాడి చేయకుండా నచ్చజెప్పే ప్రయత్నం చేసి పోలీసులు సహనాన్ని పాటించారు. ముఖ్యంగా గాయపడిన పోలీసులు ఎంతో సంయమనాన్ని పాటించారన్నారు. తామే దాడి చేసి పోలీసులు తమపై దాడి చేశారంటూ ఎదురు ఆరోపణలు చేస్తుండడం శోచనీయం. పోలీసులు రెచ్చగొట్టారనేది పూర్తిగా అవాస్తవం. మేము పోలీసులం.. మాకు అధికార పక్షమైనా, ప్రతిపక్షమైనా ఒక్కటే. ఎవ్వరికైనా రక్షణ కల్పించడమే మా కర్తవ్యం. మేం చట్టప్రకారం విధులు నిర్వహిస్తున్నాం. శాంతిభద్రతలను కాపాడడమే మా లక్ష్యం. ఎవరి కార్యక్రమాలకైనా విధిగా మేం భద్రతగా కల్పిస్తాం. అది మా బాధ్యతని గుర్తు చేశారు. రక్షణ కల్పించే మాపైనే వారు దాడి చేసి గాయపరిచారు. ఎంతగా అడ్డుకునే ప్రయత్నం చేసినా వినిపించుకోకుండా విధ్వంసం సృష్టించేందుకే ప్రయత్నించారు. తోటి కార్యకర్తలను రెచ్చగొట్టి గొడవ చేసేందుకు ఉసిగొల్పారు. సంఘటన గురించి తెలియగానే డీజీపీ వెంటనే విచారణకు ఆదేశించారన్నారు. గాయపడిన పోలీసుల్లో ముగ్గురి పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. ఈ ఘటనలో నిందితులను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలే ప్రసక్తి లేదు. విధి నిర్వహణలో ఆంధ్ర పోలీసులు ఎప్పుడూ అప్రమత్తంగానే ఉంటారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ఇలాంటి ఘటనల్లో కఠినంగా వ్యవహరించాలి. రాజకీయాలకు అతీతంగా అందరూ ఈ ఘటనను ఖండిచాలి. ఈ కేసును ప్రత్యేక కోర్టు ద్వారా విచారించాలని నిందితులకు త్వరితగతిన శిక్ష పడేలా చూడాలన్నారు. చట్టం దృష్టిలో అందరూ సమానమే. ఎంతటివారైనా చట్టాన్ని గౌరవించాలి. కిందిస్థాయి వారికి పై స్థాయిలోని వారే చెప్పాలని అన్నారు చిత్తూరు జిల్లా పోలీస్ అధికారుల సంఘం ప్రెసిడెంట్ ఉదయ్. ఇది కూడా చదవండి: పుంగనూరు ఘటనపై విచారణకు డీజీపీ ఆదేశం