సాక్షి, తాడేపల్లి: టీడీపీ అధినేత చంద్రబాబుపై మాజీ మంత్రి పేర్ని నాని ఫైరయ్యారు. చంద్రబాబు పక్కా స్కెచ్‌తోనే పుంగనూరులో రెక్కీ చేయించారని సీరియస్ అయ్యారు. పుంగనూరు ఘటనలో చంద్రబాబు ఏ1 ముద్దాయి.. చంద్రబాబు రౌడీయిజం, బరితెగింపు పాల్పడినట్టు తెలిపారు. అధికారం లేకపోతే అదే పోలీసులపై అరాచకం చేస్తారా? అని ప్రశ్నించారు.
కాగా, పెర్ని నాని మంగళవారం తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ.. అధికారం కోసం చంద్రబాబు ఎంతకైనా తెగిస్తాడు. చంద్రబాబు బరితెగించి వ్యవహరిస్తున్నాడు. 40ఏళ్ల ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు రౌడీమూకలతో యాత్రలు చేస్తున్నాడు. రాళ్లు, కర్రలు, తుపాకులు తీసుకుని వస్తున్నారు. పుంగనూరులో ముందు రోజే కర్రలు, రాళ్లు తెచ్చిపెట్టుకున్నారు. ఈ దాడిలో పదిమంది పోలీసులనైనా చంపాలనే కుట్ర చేసినట్లు రుజువైంది. అంగళ్లులో ఆయాసం.. పుంగనూరులో రౌడీవేషం ఇదీ చంద్రబాబు వైఖరి. రాష్ట్రంలో రావణకాష్టం సృష్టించాలని చంద్రబాబు ప్రయత్నించారు.
పక్కా స్కెచ్ గీసి, రెక్కీ నిర్వహించి అల్లర్లు
పుంగనూరులో పక్కా స్కెచ్ గీసి, రెక్కీ నిర్వహించి అల్లర్లు సృష్టించారు. ఏపీ చరిత్రలో ఏ రాజకీయ పార్టీ అయినా పోలీసులను చంపే ప్రయత్నం చేసిందా?. మీరు అధికారంలో ఉంటే ఫామ్ హౌస్ నుండి మనుమడి వరకు కాపలా కాయాలా?. అధికారం లేకపోతే అదే పోలీసులపై అరాచకం చేస్తారా?. ఆ దాడుల్లో ఒక పోలీసుకి కళ్లు పోయాయి. అతని జీవితం అంథకారమైంది. పుంగనూరు దాడి ఘటనలో పెద్దసంఖ్యలో పోలీసులకు గాయాలైతే ఎల్లోమీడియాలో చిన్న వార్త కూడా రాయలేదు. ఆఖరికి వైఎస్సార్‌సీపీ కార్యకర్తకు గాయాలైతే టీడీపీ కార్యకర్త అని ఈనాడులో ఫొటో వేశారు.
చంద్రబాబుకు గడ్డి పెడుతూ ఒక్క వార్త కూడా ఎల్లో మీడియా ఎందుకు రాయలేదు?. అంతేకాకుండా చంద్రబాబు మీదనే దాడి జరిగిందని వార్తలు రాస్తారా? ఇది ఎంత సిగ్గుచేటు. చిత్తూరు ఎస్పీ రిషాంత్ రెడ్డిపై నారా లోకేశ్ అవాకులు చెవాకులు పేలుతున్నాడు. పోలీసులు లేనిదే అడుగు కూడా బయటకు పెట్టలేని వ్యక్తి ఎస్పీ గురించి మాట్లాడుతున్నాడు. ఎస్పీకి కంటి ఆపరేషన్ చేస్తానంటున్నాడంటే.. లోకేశ్‌కి ఎంత బలుపు?. తమ కుట్ర సాగనీయలేదని చంద్రబాబు, లోకేశ్ తెగ బాధపడిపోతున్నారు.
14 ఏళ్లు సీఎంగా ఉండి ఏం పీకావ్?..
పుంగనూరు ఘటనలో ప్రథమ ముద్దాయి చంద్రబాబేనని మేము భావిస్తున్నాం. రాయలసీమకు నీళ్లు తెస్తున్నానని, కష్టపడుతున్నాననే చంద్రబాబు 14 ఏళ్లు సీఎంగా ఉండి ఏం చేశాడు?. మీ భాషలోనే చెప్పాలంటే.. అప్పటినుండి ఏం పీకావ్? అని ప్రశ్నించారు. అధికారంలో ఉన్నప్పుడు చేయలేని వాళ్లు మళ్ళీ అధికారం ఇస్తే చేస్తారంట. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సొంత ఊరుకు ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉన్నారు. ఆయన దమ్మున్న మగాడు. ప్రజల గుండెల్లో గూడు కట్టుకున్నాడు. మరి చంద్రగిరిలో టీడీపీ గెలవక ఎన్నాళ్లయింది? అని ప్రశ్నించారు.
చిరంజీవికి కౌంటర్..
ఇదే సమయంలో చిరంజీవికి పేర్ని నాని కౌంటరిచ్చారు. చిరంజీవికి వ్యక్తిగతంగా నేను అభిమానిని. హైదరాబాద్ ఫిల్మ్ నగర్ నుంచి ఏపీ సచివాలయానికి ఎంత దూరమో.. ఏపీ సచివాలయం నుంచి ఫిల్మ్ నగర్‌కి అంతే దూరం. సినిమాని సినిమాగా.. రాజకీయాన్ని రాజకీయంగా చూడాలి. చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్, మహేష్, రాం చరణ్ మీద ఏ రాజకీయ పార్టీ అయినా మాట్లాడిందా?. వారి రెమ్యునరేషన్ గురించి ఎవరైనా అడిగారా?.
ఒక రాజకీయ నేత మీద అనవసరంగా పాత్ర సృష్టించి వివాదం చేసిందెవరు?. ఒకరు దాడి చేస్తే ఎదుటివారు కూడా ఎదురుదాడి చేస్తారు. సినిమాలో లాగ హీరో విలన్ని కొడుతుంటే చూస్తూ కూర్చున్నట్టు కూర్చోరు. రాజకీయాల్లో ఒకరు గోకితే ఎదుటివారి కూడా గోకుతారు. ఇలాంటివి ఎదుర్కోక తప్పదు. దాడి జరిగినప్పుడు, ఎదురు దాడి జరిగి ఉంటుంది. రాష్ట్ర విజభన సమయంలో చిరంజీవి ఏ పార్టీలో ఉన్నారు?. చిరంజీవి కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడే ఏపీకి ప్రత్యేక హోదా హామీ వచ్చింది. రాష్ట్రానికి అన్యాయం జరిగితే అప్పుడు చిరంజీవి ఎందుకు మాట్లాడలేదు? అని ప్రశ్నించారు.
ఇది కూడా చదవండి: ‘ఏదైనా చేస్తామంటే చూస్తూ ఊరుకోం.. చంద్రబాబు, పవన్‌కు వార్నింగ్!’
Comments
Please login to add a commentAdd a comment