సాక్షి, తాడేపల్లి: టీడీపీ అధినేత చంద్రబాబు, చిరంజీవి, పవన్ కల్యాణ్‌పై మంత్రి గుడివాడ అమర్నాథ్ సీరియస్ కామెంట్స్ చేశారు. ఏపీ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా టీడీపీ అరాచకం చేసిందన్నారు. సినిమాల్లోకి రాజకీయాలను తెచ్చిందే పవన్ కల్యాణ్ అని చెప్పారు. చిరంజీవి ముందుగా వాళ్ల తమ్ముడికి జ్ఞానబోధ చేయాలని హితవు పలికారు.
కాగా, మంత్రి అమర్నాథ్ మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. పుంగనూరులో టీడీపీ శ్రేణుల దాడి ఘటనకు బాధ్యుడిగా చంద్రబాబుపై రౌడీ షీట్ తెరవాలి. పోలీసులను రెచ్చగొడితే కాల్పులు జరుపుతారని తద్వారా లాభం పొందాలని టీడీపీ ప్లాన్ చేసింది. చంద్రబాబు తమ పార్టీ నాయకుల ప్రాణాలను బలిచేసి రాజకీయ లబ్ధి పొందాలని భావించినట్టు స్పష్టంగా కనిపిస్తోంది. ఇంత దారుణం జరిగినా ఎల్లో మీడియాకు మాత్రం కనిపించలేదు. టీడీపీ నేతల దాడిలో పోలీసులు గాయపడినా ఎల్లో మీడియా పట్టించుకోవడం లేదు.
చిత్తూరు జిల్లాలో టీడీపీ ఓటమిపై చంద్రబాబు కక్షగట్టి మరీ ఈ దారుణానికి ఒడిగట్టారు. పాదయాత్రలో నారా లోకేశ్ రెడ్ బుక్ ఏంటో అర్థం కావడం లేదు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని, పోలీసులను దూషిస్తున్నారు. టీడీపీ దాడిలో పోలీసుల కంటికి దెబ్బ తగిలిందని చెబితే తాను ఆపరేషన్ చేయిస్తానని లోకేశ్ అంటున్నాడు. అసలైతే లోకేశ్ తల, నాలుకకు ఆపరేషన్ చేయాలి. సంయమనంతో పనిచేసిన ఎస్పీ, డీజీపీపై విమర్శలు చేస్తున్నారు. చంద్రబాబు పర్యటనలో ఎక్కడా పుంగనూరు లేదు. జెడ్ ప్లస్ కేటగిరిలో ఉన్న వ్యక్తి ముందుగా టూర్ వివరాలు చెప్పాలి. టీడీపీ కార్యకర్తల ప్రాణాలు తీయలన్నది చంద్రబాబు కుట్ర. రాజకీయ లబ్ధి కోసం ఏదైనా చేస్తామంటే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు.
ఇదే సమయంలో చిరంజీవి, పవన్ కల్యాణ్‌కు మంత్రి అమర్నాథ్ కౌంటరిచ్చారు. సినిమాలను పిచ్చుక అని తక్కువ చేస్తే ఎలా అని ప్రశ్నించారు. సినిమాల్లోకి రాజకీయాలను తెచ్చిందే పవన్ కల్యాణ్. ముందుగా చిరంజీవి తన తమ్ముడికి జ్ఞానబోధ చేయాలి. శుభ్రం చేయాల్సింది ముందుగా తన తమ్ముడినే. ఆ తర్వాత రాజకీయ పార్టీలకు సూచనలు చేయవచ్చు అంటూ ఘాటుగా విమర్శలు చేశారు.
ఇది కూడా చదవండి: చిరంజీవి, పవన్‌కు మంత్రి అమర్నాథ్ స్ట్రాంగ్ కౌంటర్
Comments
Please login to add a commentAdd a comment