సాక్షి, తాడేపల్లి: ఇటీవల పుంగనూరులో టీడీపీ శ్రేణులు దాడులకు తెగబడిన విషయం తెలిసిందే. టీడీపీ అధినేత చంద్రబాబు ఆదేశాలతో టీడీపీ గూండాలు వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, పోలీసులపై దాడులకు తెగబడ్డారు. ఎల్లో బ్యాచ్ దాడిలో పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు. ఓ కానిస్టేబుల్ కంటి చూపు కోల్పోవాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో పుంగనూరు ఘటనపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.
కాగా, సజ్జల బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. పుంగనూరు ఘటనతో చంద్రబాబు పైశాచికానందం పొందారు. పుంగనూరు నుంచి రాష్ట్రమంతా అల్లర్లకు ప్లాన్ చేశారు. ఎన్నికలు దగ్గరపడుతుంటే పవన్‌ను దగ్గరపెట్టుకొని చంద్రబాబు డ్రామాలడుతున్నారు. పుంగనూరు ఘటనలో చంద్రబాబు ఆధారాలతో సహా దొరికారు. పోలీసులు నిగ్రహంగా ఉండటంతో చంద్రబాబు పాచిక పారలేదు.
చంద్రబాబు ప్లాన్ అదే..
పుంగనూరులో చంద్రబాబు రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. అల్లర్లు సృష్టించి అరాచకాలకు పాల్పడింది చంద్రబాబు, ఆయన గ్యాంగే. నాయకుడంటే ఆపడానికి ప్రయత్నిస్తాడు కానీ.. చంద్రబాబు మాత్రం రెచ్చగొట్టాడు. చంద్రబాబు హయాంలో ఉన్న పోలీసులే ఇప్పుడు కూడా ఉన్నారు. పోలీసులంటే చంద్రబాబుకు చులకనభావం. 14 ఏళ్లు సీఎంగా ఉండి చంద్రబాబు ఇలా ప్రవర్తించడం సిగ్గుచేటు. రాష్ట్రం తగులబడాలనే పుంగనూరు నుంచి చంద్రబాబు ప్లాన్ చేశారు. కుట్ర కోణం లేకుండా ఈ ఘటనలు జరుగుతాయా?.
ఉన్మాదులుగా వ్యవహరించిన వారు కార్యకర్తలా?. వీరంతా చంద్రబాబు హయాంలో ట్రైనింగ్ అయిన ఉన్మాది ముఠా. ఎలాగైనా అధికారంలోకి రావాలనేది చంద్రబాబు తపన. పుంగనూరు ఘటనలో ఆధారాలతో సహా దొరికిపోయారు. పోలీసులను కొట్టమని చంద్రబాబే స్వయంగా చెప్పాడు. అసలు ఇలాంటి కరడు కట్టిన వ్యక్తులను సినిమాల్లోనే చూసేవాళ్లం. కానీ, మనమధ్యనే తిరుగుతున్న చంద్రబాబును ఇప్పుడు చూస్తున్నాం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో శాంతిభద్రతల విషయంలో ఎక్కడా రాజీ పడం. చంద్రబాబు లాంటి గుంటనక్కల ఆటలు సాగనీయం అని వార్నింగ్ ఇచ్చారు.
చిరంజీవి నేరుగా పాలిటిక్స్ మాట్లాడొచ్చు..
చిరంజీవి రాజకీయాలు మాట్లాడాలంటే నేరుగా మాట్లాడొచ్చు. సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాలు బాగున్నాయని గతంలో చిరంజీవే మెచ్చుకున్నారు. అలాంటి వ్యక్తి ఇప్పుడు మనసులో ఏమైనా పెట్టుకుని మాట్లాడి ఉండవచ్చు. గతంలో కేంద్రమంత్రిగా చేసిన అనుభవం చిరంజీవికి ఉంది. ఆయన తమ్ముడు పవన్ కల్యాణ్ బీజేపీతోనే ఉన్నాడు. మరి నేరుగా బీజేపీ పెద్దలను కలిసి రాష్ట్రానికి కావాల్సినవి అడగవచ్చు కదా. ఆ కెడ్రిట్ కూడా ఆయన్నే తీసుకోమనండి’ అని కామెంట్స్ చేశారు.
ఇది కూడా చదవండి: పవన్ కల్యాణ్ వారాహి వెబ్ సిరీస్‌పై మంత్రి అమర్నాథ్ సెటైర్లు..
Comments
Please login to add a commentAdd a comment