Punyavati
-
నా భర్త ఆచూకీ తెలపండి !
కె.గంగవరం : తన భర్తను ఆయన తరఫు బంధువులు దాచేశారని, 25 రోజులుగా ఆయన కనిపించడం లేదని, ఆచూకీ తెలపాలని పుణ్యవతి అనే మహిళ గురువారం పోలీసులను ఆశ్రయించారు. బాధితురాలి కథనం ప్రకారం.. ఐదేళ్ల క్రితం కోలంక గ్రామానికి చెందిన లింగం రాముతో పుణ్యవతికి వివాహం జరిగింది. పుణ్యవతి తక్కువ కులానికి చెందిన మహిళ అనే ఉద్దేశంతో రాము నుంచి ఆమెను విడదీయడానికి అతని బంధువులు యత్నిస్తున్నారు. తక్కువ కులస్తురాలనే కారణంతో భర్తతోపాటు అతని బంధువులు ఐదేళ్ల నుంచి పుణ్యవతిని వేధిస్తున్నారు. దీనిపై నాలుగు నెలలు క్రితం పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేస్తే అప్పటి ఎస్సై రాము, అతని కుటుంబ సభ్యులను మందలించారు. అప్పటి నుంచి సక్రమంగా ఉంటున్నారని పుణ్యవతి ఫిర్యాదులో పేర్కొన్నారు. ఐదేళ్లలో తన భర్త తనకు ఆరుసార్లు అబార్షన్ చేయించారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మధ్య గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ సభ్యుడు బొండ వెంకన్న తన భర్తకు తనకు ఏ సంబంధం లేదని తెల్లకాగితంపై రాసి ఇవ్వాలని బెదిరించారని తెలిపారు. తాను ససేమిరా అనడంతో అప్పటి నుంచి రాము కుటుంబ సభ్యులు, బొండ వెంకన్న తన భర్తను ఎక్కడో దాచేశారని పుణ్యవతి ఆరోపించారు. నిరుపేదనైన తాను రూ.40వేలు కట్నంగా తీసుకువచ్చానని, తక్కువ కులస్తురాలినని తనను మోసం చేసేందుకు భర్తతోపాటు అతని కుటుంబ సభ్యులు యత్నిస్తున్నారని, వారిపై చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయాలని పుణ్యవతి కోరారు. ఈ మేరకు స్థానిక పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
విడిది చేసిన అతిథులు
వెంకటాపురంలో విదేశీ పక్షుల సందడి ఈ ఏడాది ఆలస్యంగా రాక వెంకటాపురం (పెనుగంచిప్రోలు), న్యూస్‌లైన్ : వెంకటాపురం గ్రామానికి ఈ ఏడాది కూడా విదేశీ అతిథుల రాక మొదలైంది. కొత్త సంవత్సరం మొదటి రోజు నుంచి గ్రామంలో గుంపులు గుంపులుగా సంచరిస్తున్న ఈ పక్షలుతో సందడి వాతావరణం నెలకొంది. ఇంతకీ ఈ అతిథులు ఎవరని అనుకుంటున్నారా... సుమారు 50 ఏళ్లుగా ఏటా క్రమం తప్పకుండా వస్తున్న సైబీరియన్ పెయింటెడ్ స్టాక్ (ఎర్రకాళ్ల కొంగలు). గతంలో నవంబర్, డిసెంబర్ నెలల్లో గ్రామానికి వచ్చే ఈ పక్షులు మారిన వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ఈ ఏడాది ఆలస్యంగా వచ్చాయి. పెయింటెడ్ స్టాక్ (ఎర్రకాళ్ల కొంగలు) పక్షులు సంతానోత్పత్తి కోసం ఏటా వెంకటాపురం గ్రామానికి వలస వస్తాయి. ముందుగా నాలుగైదు పక్షలు గ్రామానికి వచ్చి పరిస్థితులు చూసి తమకు అనుకూలంగా ఉందని భావిస్తే మిగతా వాటిని తీసుకు వస్తాయి. వందల సంఖ్యలో వచ్చే ఈ పక్షలు ఆరు నెలలపాటు ఇక్కడే ఉంటాయి. గూళ్లు కట్టుకుని, వాటిలో గుడ్లు పెట్టి, వాటిని పొదిగిన తరువాత పిల్లలకు ఆహారం తినటం, వేటాడటం, ఎగరటం నేర్పిన తరువాత స్వస్థలానికి వెళ్తాయి. గ్రామం సమీపంలోని చెరువులు, మునేరులో దొరికే చేపలను తిని జీవిస్తాయి. విదదీయలేని అనుబంధం రంగు రంగుల రెక్కలు, పెద్ద ముక్కు, పొడవాటి ఎర్రకాళ్లతో పెయింటెడ్ పక్షులు ఆకట్టుకుం టాయి. సందడిచేసే విదేశీ విహంగాలను చూసేం దుకు సందర్శకులు అధిక సంఖ్యలో వస్తుంటారు. ఈ పక్షులు తమ గ్రామానికి రావటం మొదలైనప్పటి నుంచి పాడిపంటలు బాగా వృద్ధి చెంది సుభిక్షంగా ఉంటోందని గ్రామస్తులు సంతోషంగా చెబుతున్నారు. గత ఏడాది వేసవిలో దాహార్తితో పక్షులు మృతి చెందడంతో గుడివాడకు చెందిన జంతు సంరక్షణ కమిటీ ఉపాధ్యక్షుడు రంగారావు తమ సహకారంతో నీటి తొట్టెలు, పైపులైన్ ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. విద్యుత్ వైర్లు తొలగించాలి చెట్ల మధ్య నుంరి ఏర్పాటు చేసిన 11 కేవీ విద్యుత్ వైర్లతో ఏటా పెద్ద సంఖ్యలో విదేశీ పక్షులు మృత్యువాత పడుతున్నాయి. గత ఏడాది మాజీ ఎం పీపీ గూడపాటి శ్రీనివాసరావు సహకారంతో గ్రీన్ టీమ్ నిర్వాహకులు ప్లాస్టిక్ పైపులు అమర్చారు. అయితే ఇంకా కొన్ని తీగలకు పైపులు అమర్చాల్సి ఉంది. అధికారులు స్పందించి విద్యుత్ తీగలు మార్చాలి. - పుణ్యవతి పర్యాటకంగా అభివృద్ధి చేయాలి గ్రామాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేస్తామన్న నేతలు, అధికారుల హామీలు నీటిమూటలయ్యాయి. మా గ్రామానికి ప్రత్యేక ప్యాకేజీ కేటాయించి పర్యాటకంగా అభివృద్ధి చేయాలి. కొల్లేరులో పక్షుల సంరక్షణకు తీసుకుంటున్న చర్యలు ఇక్కడా చేపట్టాలి. కేవలం కొందరు పక్షుల ప్రేమికులు మాత్రమే వీలున్నంత వరకు సహకరిస్తున్నారు. - జొన్నలగడ్డ రామారావు -
డబ్బుకోసం బెజవాడలో జంట హత్యలు
సాక్షి, విజయవాడ: బెజవాడలోని సత్యనారాయణపురంలోని తాడంకి వారి వీధిలో గ్రూప్ హౌస్‌లో నివాసం ఉంటున్న పుణ్యవతి (57), ఆమె మనుమరాలు సాయి చంద్రిక (15)లను ఓ దుండగుడు గొంతుకలు కోసి ప్రాణాలు తీశాడు. ఇంట్లో ఉన్న బీరువాను తెరిచి బంగారం కోసం గాలించాడు. బంగారం దొరక్కపోవటంతో వృద్ధురాలి మెడలో గొలుసుతో పరారయ్యాడు. పుణ్యవతి భర్త చక్కా సత్యనారాయణ.. కుమారులు శ్రీనివాసరావు, కిరణ్‌లతో కలిసి వన్‌టౌన్‌లో బంగారం, వెండిషాపు నిర్వహిస్తుంటారు. హత్యకు గురైన సాయిచంద్రిక కిరణ్ పెద్ద కుమార్తె. కిరణ్ భార్య శారద పెద్ద కుమార్తె చంద్రికను నాన్నమ్మ దగ్గర విడిచిపెట్టి చిన్న కుమార్తెను తనతో తీసుకుని పుట్టిల్లైన గుంటూరుకు వెళ్లారు. సత్యనారాయణ తన కుమారులతో కలిసి బంగారం షాపునకు వెళ్లారు. పుణ్యవతి, మనవరాలు సాయిచంద్రిక ఇంటి వద్దే ఉన్నారు. సాయంత్రం ఏడు గంటల సమయంలో సాయిచంద్రిక ఆ వీధిలో స్నేహితులతో ఆడుకుంటూ నాన్నమ్మ వద్దకు వెళ్లి ఇప్పుడే వస్తానని చెప్పి పైకి వెళ్లింది. అప్పటికే నాన్నమ్మ రక్తపు మడుగులో పడిఉంది. నాన్నమ్మ పరిస్థితి చూసి ఏడుస్తూ ఇంట్లోకి పరుగులు తీయడంతో చంద్రికను కూడా చంపేశాడు. పైకి వెళ్లిన స్నేహితురాలు ఎంతకీ రాకపోవడంతో ఆమె స్నేహితులంతా కలిసి వెళ్లి చూసి గట్టిగా కేకలు వెయ్యడంతో వీధిలోని వారు హుటాహుటిన వచ్చి చూసి కుటుంబ సభ్యులకు, పోలీసులకు సమాచారం అందించారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన లిఫ్ట్ మెకానిక్ రవిని నిందితుడిగా పోలీసులు గుర్తించి విచారిస్తున్నారు.