బొత్స వల్లే కర్ఫ్యూ
విజయనగరం మున్సిపాల్టీ, న్యూస్‌లైన్: విజయనగరం పట్టణంలో కర్ఫ్యూ రావడానికి బొత్స అండ్ కంపెనీయే కారణమని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు పూసపాటి అశోక్‌గజపతిరాజు ఆరోపించారు. శుక్రవారం ధర్మపురి గ్రామంలో పల్లెపల్లెకు తెలుగుదేశం కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. పాదయూత్ర అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ సమైక్యాంధ్ర ఉద్యమంలో అమాయకులపై కేసులు నమోదు చేసి అరెస్ట్‌లు చేస్తున్నారన్నారు. విజయనగరంలో టోపీలు పెట్టి వేషాలు మార్చే నాయకులను నమ్మవద్దని కోలగట్లనుద్దేశించి వ్యాఖ్యానించారు.
అవినీతే ధ్యేయంగా కాంగ్రెస్ పార్టీ పని చేస్తోందన్నారు. ధర్మపురి గ్రామాన్ని మున్సిపాలిటీలో విలీనం చేయకుండా పంచాయతీగానే ఉంచాలని గ్రామస్తులు కోరుతున్నారని, దీనికోసం పార్టీ తరఫున పోరాడతామని చెప్పారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఐ.వి.పి.రాజు, జిల్లా నాయకుడు ఎస్.ఎన్.ఎంరాజు, కనకల మురళీమోహన్, విజ్జపుప్రసాద్, ప్రసాదుల రామకృష్ణ, సైలాడ త్రినాథ్, ఎస్.ఎం.కె.బాషా, తుంపల్లి రమణ, ముద్డాడ చంద్రశేఖర్, మైలపల్లిపైడిరాజు, గుండెల ప్రకాష్‌రావు, ధర్మపురి నాయకులు గెదేల ఆదిబాబు, పతివాడ అప్పలనాయుడు పాల్గొన్నారు.