Putta Narasimhareddy
-
YSR District: పెరుగుతున్న ఉద్రిక్తతలు!
సాక్షి ప్రతినిధి, కడప: ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే జిల్లాలో ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ప్రజామెప్పుతో విజయం సాధించాలనే తపన లేకపోవడమే అందుకు కారణమవుతోంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఓడిస్తాయనే అభద్రతాభావం మరోవైపు వెంటాడుతోంది. సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న వలంటీర్లపై అక్కసు వెళ్లగక్కుతున్నారు. జిల్లాలో తెలుగుతమ్ముళ్లు రెచ్చిపోతున్నారు. ప్రత్యక్ష బెదిరింపులు,భౌతికదాడులకు దిగుతున్నారు. క్రమం తప్పకుండా ఇలాంటి ఘటనలు తెరపైకి వస్తున్నాయి. కమలాపురం టీడీపీ ఇన్చార్జి పుత్తా నరసింహారెడ్డి వరుసగా నాలుగు సార్లు ఓటమి పాలయ్యారు. మరోమారు ప్రజాతీర్పు కోరేందుకు సన్నద్ధయయ్యారు. ప్రజల మన్నలు పొందాల్సిందిపోయి, బెదిరింపులకు దిగుతున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఆపితే, అధికారంలోకి వచ్చిన తర్వాత వలంటీర్ల కాళ్లు చేతులు నరుకుతామని హెచ్చరించారు. వాస్తవంలో కులం, మతం, పార్టీలు, వర్గాలతో నిమిత్తం లేకుండా అర్హులందరీకి సంక్షేమ పథకాలు అందిస్తామని బాధ్యతలు తీసుకున్న తొలిరోజే సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించారు. అక్షరాల అదే ఆచరణలో చూపెట్టారు. ఈపరిస్థితుల్లో ఎవ్వరి సంక్షేమ పథకాలు ఆగిపోయే అవకాశమే లేదు. కాకపోతే పుత్తా నరసింహారెడ్డి కాళ్లు చేతులు నరుకుతామనే బెదిరింపులకు పాల్పడడం వెనుక నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ శ్రేణుల్లో భయోత్పాతం సృష్టించేందుకేనని విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. ఈఘటన మరువక ముందే ఆదివారం టీడీపీ మాజీ నాయకుడు సాయినాథశర్మపై పెద్దచెప్పలిలో పుత్తా చైతన్యరెడ్డి అనుచరులతో కలిసి ప్రత్యక్ష దాడికి తెగబడ్డారు. రాజకీయంగా గత కొంతకాలంగా కొరకరాని కొయ్యగా సాయినాథశర్మ తయారు కావడమే అందుకు కారణంగా పరిశీలకులు వెల్లడిస్తున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే ప్రధానంగా కమలాపురంలో ఉద్రిక్తత పరిస్థితులు క్రమం తప్పకుండా తెరపైకి వస్తుండడం విశేషం. అక్కసు వెళ్లగక్కిన ప్రవీణ్ వలంటీర్లపై ప్రొద్దుటూరు టీడీపీ ఇన్చార్జి ప్రవీణ్‌కుమార్‌రెడ్డి ఇటీవల అక్కసు వెళ్లగక్కారు. అధికారంలోకి వచ్చిన తర్వాత వలంటీర్లును అంకుశం సినిమాలో విలన్ రామిరెడ్డిని కొట్టినట్లు వీధుల వెంబడి కొట్టుకుంటూ వెళ్తామని బాహాటంగా ప్రకటించారు. వాస్తవంలో వలంటీర్లు ప్రజా సేవకులుగా గుర్తింపు పొందారు. అలాంటి వారిపై అక్కసు వెళ్లగక్కడం వెనుక ప్రజాపోరాటంలో విఫలం కావడమేనని విశ్లేషకులు అంటున్నారు. మరోవైపు వలంటీర్లు నుంచి కూడా టీడీపీ ఇన్చార్జి ప్రవీణ్‌కు ప్రతిఘటన ఎదురైంది. రంగస్థలంలో సినిమాలో నియంతగా వ్యవహరించిన జగపతిబాబును కొట్టినట్లు తరిమితరిమి ఎన్నికల్లో కొడతామని హెచ్చరికలు జారీ చేయడం విశేషం. కాగా ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే జిల్లాలో ఉద్రికత్తలు క్రమేపీ అధికమవుతున్నాయి. ప్రభుత్వ వ్యవస్థలు మరింత చురుగ్గా పనిచేసి ఇలాంటి చర్యలను కట్టడి చేయాలని ప్రజాస్వామ్యవాదులు కోరుతున్నారు. -
సీఎం జగన్‌పై ప్రశంసలు కురిపించిన టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు
సాక్షి, వైఎస్సార్ కడప: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కాపులపట్ల అనుసరిస్తున్న విధానం చాలా బాగుందని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు పుత్తా నరసింహారెడ్డి ప్రశంసించారు. కమలాపురం నియోజకవర్గంలో టీడీపీ పార్టీ కాపులకు ప్రత్యేక గుర్తింపు ఇవ్వడానికి సీఎం వైఎస్ జగన్ కారణమని అన్నారు. వైఎస్సార్ జిల్లా కమలాపురంలో నూతనంగా ఏర్పాటు చేసిన టీడీపీ కాపు కార్యాలయాన్ని పుత్తా నరసింహారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ కాపులకు అధిక ప్రాధాన్యతను ఇస్తున్నారంటూ ప్రశంసల వర్షం కురిపించారు. చదవండి: (రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన సీఎం జగన్) -
పుత్తాకు చుక్కెదురు..!
జనచైతన్య యాత్రల్లో ప్రతిఘటిస్తున్న ప్రజానీకం చింతకొమ్మదిన్నె/సాక్షి, కడప : కమలాపురం టీడీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి పుత్తా నరసింహారెడ్డికి వరుసగా రెండవరోజు చుక్కెదురైంది. జనచైతన్యయాత్రల్లో ప్రజానీకం ప్రతిఘటిస్తున్నారు. శుక్రవారం సాయంత్రం చింతకొమ్మదిన్నె మండలం కమ్మవారిపల్లెకు చేరుకున్నారు. ఈ సందర్భంగా మిట్టమీదపల్లె గ్రామస్తులు మాట్లాడుతూ గతంలో తాగునీటి కొళాయిలు వేయిస్తామని మాటిచ్చారు...ఇంతవరకు ఏర్పాటు చేయలేదంటూ పుత్తా నరసింహారెడ్డి ప్రసంగానికి అడ్డు తగిలారు. డ్వాక్రా మహిళలకు పెట్టుబడి నిధి ఇస్తామని గురువారం సాయంత్రమే దండోరా వేయించారు...జనచైతన్య యాత్రలో పంపిణీ చేస్తామని ప్రకటించారు....కూలీ పనులు వదులుకుని వచ్చింది మీ ప్రసంగాలు వినేందుకేనా? అని మూకుమ్మడిగా నిలదీశారు. దీంతో కోపోద్రిక్తుడైన పుత్తా నరసింహారెడ్డి పరుష పదజాలంతో దూషించారు.. రూ. 500 పెట్టి కొళాయి వేయించుకోలేరా? నేనేమైనా మీ గుమస్తానా? .మీ ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదని అన్నారు. అక్కడే ఉన్న మిట్టమీదపల్లె టీడీపీ నేత జయచంద్రారెడ్డిని వారు అలా మాట్లాడుతుంటే నువ్వేం చేస్తున్నావంటూ గదమాయించారు. దీంతో మిట్టమీదపల్లె గ్రామస్తులు మాట్లాడుతూ ప్రభుత్వం ప్రజల కోసం ఉందా? మీ వ్యక్తిగత ఆర్బాటం కోసం ఉందా? అంటూ నిలదీశారు. గ్రామస్థులంతా ఆ కార్యక్రమం నుంచి నిష్క్రమించారు. గురువారం రోడ్డు కృష్ణాపురంలో దస్తగిరమ్మ, శుక్రవారం కమ్మవారిపల్లెలో వరుసగా ప్రజానీకం నుంచి ప్రభుత్వ వైఖరిపై ప్రతిఘటన లభించింది. -
పక్కాగృహాలేవి?!
- ఏమి అభివృద్ధి చేశారు - టీడీపీ నేత పుత్తాను నిలదీసిన మహిళ చింతకొమ్మదిన్నె/కడప : ’చేయనది చేసినట్లు...లేనిది ఉన్నట్లు’ చెప్పుకుంటూ జనచైతన్య యాత్రలు చేపడుతున్న టీడీపీ నాయకులకు ప్రజల నుంచి ప్రతిఘటన తప్పడం లేదు. కమలాపురం నియోజకవర్గంలో గురువారం టీడీపీ ఇన్చార్జి పుత్తా నరసింహారెడ్డిని ఓ మహిళ నిలదీసింది. మురుగు కాలువలు, సిమెంటు రోడ్లు లేక ముగురునీరు ఎక్కడికక్కడే పేరుకపోయింది. పక్కాగృహాలు ఇస్తామన్నారు, ఇంతవరకూ ఇవ్వలేదని తీవ్రస్వరంతో చెప్పారు. ఊహించని పరిణామానికి ఆవాక్కైన టీడీపీ నేత కోపోద్రిక్తుడై అమెపై మండిపడ్డారు. చింతకొమ్మదిన్నె మండలం రోడ్డు కృష్ణాపురం గ్రామంలో గురువారం జన చైతన్యయాత్ర కార్యక్రమాన్ని టీడీపీ కమలాపురం నియోజకవర్గ ఇన్చార్జి పుత్తా నరసింహారెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ది కార్యక్రమాల గురించి ప్రజలకు వివరిస్తుండగా అదే గ్రామానికి చెందిన దస్తగిరమ్మ అనే మహిళ మాట్లాడుతూ నాయకులందరూ అది చేశాం...ఇది చేశామంటూ వస్తూపోతున్నారే తప్పా చేసిందేమీ లేదన్నారు. పక్కా గృహం ఇస్తామని ఇంతవరకు ఇవ్వలేదని టీడీపీ నేత పుత్తాను ఆమె నిలదీసింది. సర్దిచెప్పాల్సిన ఆయన కోపోద్రిక్తుడయ్యారు. ’’నేను మీ ఇంటికి గుమస్తాను కాను...మీరు చెప్పినవన్నీ చేసేందుకు ఇక్కడికి రాలేదు...మీకు నేను ఇల్లు కట్టిస్తానని ఏమైనా చెప్పానా...నోరుందని ఊరికే మాట్లాడకు... నాకూ నోరుంది...నేనూ గట్టిగా మాట్లాడగలను...’’...అని పుత్తా అనడంతో సభలో కొంత గందరగోళం నెలకొంది. స్థానిక టీడీపీ నాయకులు దస్తగిరమ్మను సభ నుంచి బయటికి పంపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల ఇన్‌ఛార్జి గంధం మోహన్‌బాబు, ఎంపీపీ వెంకట సుబ్బారెడ్డి, సర్పంచ్ మహేంద్రారెడ్డి, ఎంపీటీసీ రాజేష్ తదితరులు పాల్గొన్నారు.