putta sudhakar
-
నేడు హంద్రీ–నీవాకు నీటి విడుదల
సాక్షి ప్రతినిధి కర్నూలు: టీడీపీ ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ నిర్లక్ష్యానికి, కూటమి సర్కారు నిర్వాకాలకు రాయలసీమలో దాదాపు 6.02 లక్షల ఎకరాలు బీడుగా మారే ప్రమాదం నెలకొన్న నేపథ్యంలో ‘సాక్షి’ ప్రచురించిన కథనంపై అధికార యంత్రాంగం ఎట్టకేలకు స్పందించింది. టీడీపీ ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్‌కు చెందిన సంస్థ కర్నూలు – గుంటూరు జాతీయ రహదారి నిర్మాణ పనులు చేపట్టిన విషయం తెలిసిందే. గార్గేయపురం – బ్రాహ్మణకొట్కూరు మధ్య కాలువపై వంతెన నిర్మాణం కోసం పుట్టా సంస్థ కెనాల్‌ను పూడ్చివేయడంతో హంద్రీ–నీవా నీళ్లు దిగువకు విడుదల కాని దుస్థితి నెలకొంది. కాలువను పూడ్చేటప్పుడు నీళ్లు వెళ్లేందుకు వీలుగా పైపులు వేయకుండా అప్రోచ్ రోడ్డు నిరి్మంచారు. దీంతో రాయలసీమ మొత్తానికి జీవనాడి అయిన హంద్రీ–నీవాకు నీళ్లు రాకపోవడంతో 6.02 లక్షల ఎకరాలకు సాగునీరు, 30 లక్షల మందికి తాగునీరు అందని పరిస్థితి ఏర్పడింది. రాత్రి కూడా పనులు.. నేడు నీటి విడుదల ‘పుట్టా పాపం.. సీమకు శాపం’ శీర్షికతో బుధవారం ‘సాక్షి’ ప్రచురించిన కథనంతో జలవనరులశాఖ అధికారులు ఉదయమే హంద్రీ–నీవా కెనాల్ వద్దకు చేరుకుని ప్రత్యామ్నాయాలు అన్వేíÙంచారు. ప్రస్తుతం కాలువ పూడ్చిన ప్రాంతం పక్కనే చిన్న సైజు సిమెంట్ పైపులు వేసి దానిపై రోడ్డు వేయాలని నిర్ణయించారు. రాత్రి పూట కూడా యుద్ధప్రాతిపదికన పనులు కొనసాగించి గురువారం ఉదయానికి పూర్తి చేసేలా చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలో నేటి ఉదయం 11 గంటలకు మల్యాల వద్ద మోటార్లు ఆన్ చేసి కాలువకు నీటిని విడుదల చేయనున్నారు. స్వల్ప ప్రవాహం ‘అనంత’కు చేరేదెలా? హంద్రీ–నీవా కాలువ సామర్థ్యం 3,850 క్యూసెక్కులు కాగా లైనింగ్ లేనందున 2,300–2,500 క్యూసెక్కులు మాత్రమే ప్రవహిస్తాయి. అయితే ఇప్పుడు పుట్టా సుధాకర్ సంస్థ తాత్కాలికంగా అమరుస్తున్న పైపుల ద్వారా 500 క్యూసెక్కులకు మించి ప్రవహించవని అధికారులు చర్చించుకుంటున్నారు. కాలువను పూడ్చి అప్రోచ్ రోడ్డు నిరి్మంచే సమయంలోనే పెద్ద పైపులు వేసి ఉంటే ఈ సమస్య తలెత్తేది కాదు. 15 రోజులుగా నీళ్లు వదలకుండా తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరించి ఇప్పుడు తాపీగా చిన్న సైజు పైపులు వేస్తున్నారు. పెద్ద పైపులు వేసి ఉంటే 1000–1500 క్యూసెక్కులు ప్రవహించే వీలుండేదని నీటి పారుదలశాఖ అధికారులు చర్చించుకుంటున్నారు. దీంతో నీళ్లు విడుదల చేసినా స్వల్ప ప్రవాహం కర్నూలులోని క్రిష్ణగిరి, పత్తికొండ రిజర్వాయర్లను దాటి అనంతపురం జిల్లాకు చేరే అవకాశం కనిపించడం లేదు. కాస్త ఆలస్యంగానైనా ఈ ఏడాది కృష్ణమ్మ కరుణించింది. ఎగువ నుంచి పోటెత్తిన వరద ఉధృతితో శ్రీశైలం నిండుకుండలా మారింది. శ్రీశైలంలో 834 అడుగులకే నీటిని ఎత్తిపోసే అవకాశం ఉన్నా కూటమి ప్రభుత్వం నీళ్లు విడుదల చేయకుండా కళ్లప్పగించి చూసింది. రిజర్వాయర్‌లో నీటి మట్టం పూర్తి స్థాయికి చేరడంతో 10 గేట్ల ద్వారా నాగార్జునసాగర్‌కు వదులుతున్నా హంద్రీ–నీవాకు నీటిని విడుదల చేసే మల్యాల పంప్‌లను ఇప్పటిదాకా ఆన్ చేయలేదు. నాడు రిజర్వాయర్లు కళకళ.. వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలో ఉండగా హంద్రీ–నీవా ద్వారా 2020లో 47.34 టీఎంసీలు, 2021లో 45.65 టీఎంసీలు విడుదల చేశారు. నీటిని ఒడిసిపట్టి రైతుల సంక్షేమాన్ని కాంక్షించారు. నాడు ‘సీమ’లో చెరువులన్నీ నిండి రిజర్వాయర్లు పూర్తి స్థాయి నీటి మట్టంతో కళకళలాడాయి. ఇప్పుడు చిన్నసైజు పైపులతో 500 క్యూసెక్కులు మాత్రమే ప్రవహిస్తే సీజన్ మొత్తంలో కనీసం 5 టీఎంసీలు కూడా నీటిని డ్రా చేయలేని దుస్థితి కనిపిస్తోంది. నీళ్లున్నా ఎందుకీ నిర్వాకం? చంద్రబాబు పాలనలో ప్రతిసారి రాయలసీమకు అన్యాయం జరుగుతూనే ఉంది. కుప్పం బ్రాంచ్ కెనాల్ పూర్తయ్యే వరకూ డిస్ట్రిబ్యూటరీల పనులు చేయవద్దని 2015 ఫిబ్రవరిలో టీడీపీ ప్రభుత్వం జీవో 22 జారీ చేసింది. దీంతో కళ్లెదుట నీళ్లు పారుతున్నా రైతులు నిస్సహాయంగా చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. తాజాగా శ్రీశైలంలో నీళ్లు ఎక్కువై పది గేట్ల ద్వారా దిగువకు విడుదల చేస్తున్నా దుర్భిక్ష ‘సీమ’కు అందని దుస్థితి ఉత్పన్నమైంది. రోడ్డు నిర్మాణ ప్రాంతంలో కాలువ సామర్థ్యం మేరకు పైపులైన్లు వేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించి ఉంటే పుట్టా సుధాకర్ సంస్థ ఆ మేరకు చర్యలు తీసుకోవాల్సి వచ్చేది. పెద్ద పైపులైన్లు వేస్తే 2 వేల క్యూసెక్కులకు తగ్గకుండా ప్రవాహం దిగువకు వెళ్లేది. అన్నదాతల ఇక్కట్లపై వైఎస్సార్ సీపీ తక్షణమే స్పందించి నిలదీయడంతో ఇక తప్పించుకునే అవకాశం లేక కంటి తుడుపు చర్యలు చేపట్టారు. దీంతో హంద్రీ–నీవా నీటి కోసం రైతు సంఘాలు ఉద్యమించేందుకు సిద్ధమవుతున్నాయి. -
‘పుట్టా’ పాపం..‘సీమ’కు శాపం
మైదుకూరు టీడీపీ ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్‌కు చెందిన రోడ్డు నిర్మాణ సంస్థ ఈ ఫోటోలో కనిపిస్తున్న హంద్రీ–నీవా కెనాల్‌ను పూడ్చివేసి దీనిపై తాత్కాలిక రహదారిని నిర్మించింది. కర్నూలు–గుంటూరు జాతీయ రహదారి పనుల్లో భాగంగా గార్గేయపురం – బ్రాహ్మణకొట్కూరు మధ్య కాలువపై వంతెన నిర్మాణం కోసం కెనాల్‌ను పూడ్చివేయడంతో హంద్రీ–నీవా నీళ్లు దిగువకు విడుదల కాని దుస్థితి నెలకొంది. రాయలసీమ మొత్తానికి జీవనాడి అయిన హంద్రీ–నీవాకు నీళ్లు రాకపోవడంతో 6.02 లక్షల ఎకరాలకు సాగునీరు, 30 లక్షల తాగునీరు అందని పరిస్థితి ఏర్పడింది. టీడీపీ ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్కుచెందిన పీఎస్కే ఇన్ఫ్రా ఈ రహదారి నిర్మాణ పనులను చేస్తోంది. కాలువలో కనీసం పైపులు అమర్చి రోడ్డు నిర్మించినా నీళ్లు పారేవి. ఆ మాత్రం జాగ్రత్తలు కూడా తీసుకోకుండా పుట్టా సంస్థతో పాటు జలవనరులశాఖ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించగా నీటి విడుదల నిలిచిపోవటానికి కారణాలు వెల్లడించకుండా రాష్ట్ర ప్రభుత్వం గోప్యంగా వ్యవహరిస్తోంది. సాక్షి ప్రతినిధి కర్నూలు: జలవనరులశాఖ నిర్లక్ష్యం, పుట్టా సంస్థ పీఎస్కే ఇన్ఫ్రా లెక్కలేనితనం వెరసి ప్రభుత్వ వైఫల్యం.. రాయలసీమకు పెనుశాపంగా పరిణమించింది. కళ్లెదుట కృష్ణమ్మ ఉధృతంగా ప్రవహిస్తున్నా, శ్రీశైలం రిజర్వాయర్ నిండటంతో నీళ్లు దిగువకు విడుదలవుతున్నా హంద్రీ–నీవాకు నీళ్లు మళ్లించుకోలేని దౌర్భాగ్య పరిస్థితి తలెత్తింది. రోడ్డు నిర్మాణ పనులు చేపట్టిన సంస్థ అధికార పార్టీ ఎమ్మెల్యే పుట్టాది కావడంతో ఇటు అధికారులు, అటు ప్రభుత్వం చూసీ చూడనట్లుగా ఉన్నారు. తాత్కాలిక రోడ్డు వేసే సమయంలోనే కాలువలో నీళ్లు దిగువకు వెళ్లేలా ఎందుకు జాగ్రత్తలు తీసుకోలేదు? 15 రోజులుగా కృష్ణాకు వరద నీరు వస్తున్నా హంద్రీ–నీవాకు ఎందుకు ఇవ్వలేకపోతున్నాం? అని సమీక్షించి అప్రమత్తం కావాల్సిన రాష్ట్ర ప్రభుత్వం కళ్లు మూసుకుని కూర్చుంది. సర్కారు నిర్వాకాలతో ఈ ఏడాది ‘సీమ’లో వ్యవసాయం సంక్షోభంలో కూరుకుపోయే ప్రమాదం నెలకొంది.గత ఐదేళ్లూ ముందుగానే..గతేడాది రాయలసీమలో వర్షాభావంతో రైతులు ఇబ్బంది పడ్డారు. ఈ ఏడాది కూడా ఆశించిన స్థాయిలో వర్షాలు కురవలేదు. అయితే అదృష్టవశాత్తూ మహారాష్ట్ర, కర్ణాటకలో భారీ వర్షాలకు కృష్ణా, తుంగభద్ర పోటెత్తాయి. శ్రీశైలానికి భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. జలాశయం పూర్తిగా నిండటంతో ఆరు గేట్ల ద్వారా నాగార్జున సాగర్‌కు నీటిని విడుదల చేస్తున్నారు. పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ ద్వారా 23 వేల క్యూసెక్కులు విడుదల చేశారు. దీంతో హంద్రీ–నీవా నీటితో చెరువులు, రిజర్వాయర్లు నింపితే భూగర్భ జలాలు పెరిగి పంటలు సాగు చేసుకోవచ్చని సీమ రైతులు ఆశ పడ్డారు. గత ఐదేళ్లూ పోతిరెడ్డిపాడు కంటే ముందుగానే హంద్రీ–నీవాకు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం నీటిని విడుదల చేసింది. శ్రీశైలంలో నీటిమట్టం 834 అడుగులకు చేరితే హంద్రీ–నీవాకు నీళ్లు విడుదల చేయవచ్చు. ముచ్చుమర్రి ద్వారా 800 అడుగులకే నీరు లిఫ్ట్ చేయవచ్చు. అయితే రిజర్వాయర్‌లో పూర్తి స్థాయి నీటి మట్టం ఉన్నా ప్రభుత్వం నీటిని విడుదల చేయకుండా, కారణాలు చెప్పకుండా దాగుడు మూతలాడుతోంది. 15 రోజులుగా నీళ్లు విడుదల కాకపోవడంపై రైతన్నలు తీవ్రంగా మథన పడుతున్నారు.పైపులు వేసి ఉంటే..కర్నూలు–విజయవాడ నేషనల్ హైవే పనుల్లో భాగంగా ఎన్‌హెచ్–340 సి రోడ్డు పనుల్లో ఒకటో ప్యాకేజీని పుట్టా సుధాకర్ యాదవ్‌కు చెందిన పీఎస్కే ఇన్ఫ్రా దక్కించుకుంది. ఈ ప్యాకేజీలో 30.6 కి.మీ. నాలుగు లేన్ల రహదారిని రూ.827.39 కోట్లతో నిర్మించనున్నారు. ఇందులో గార్గేయపురం, బ్రాహ్మణ కొట్కూరు మధ్య హంద్రీ–నీవా కాలువపై వంతెన నిర్మించాలి. దీంతో కాలువపై ఉన్న కల్వర్టు తొలగించి వంతెన నిర్మిస్తున్నారు. రాకపోకల కోసం హంద్రీ–నీవా కెనాల్‌ను పూడ్చేసి తాత్కాలిక రోడ్డు వేశారు. పైపులు వేసి రోడ్డు నిర్మిస్తే కాలువలో నీటి ప్రవాహానికి వీలుండేది. 15 రోజుల క్రితమే హంద్రీ–నీవా నీళ్లు విడుదలయ్యేవి. పీఎస్కే ఇన్ఫ్రా నిర్లక్ష్యంగా వ్యవహరించి పైపులు వేయకుండా కాలువను పూర్తిగా పూడ్చేసింది. నిమ్మకు నీరెత్తినట్లుగా ఉన్న ఇరిగేషన్ అధికారులు ఇప్పుడు ఉలిక్కిపడుతున్నారు. హంద్రీ–నీవాపై ఆధారపడ్డ 6.02 లక్షల ఎకరాల ఆయకట్టు‘హంద్రీ–నీవా సుజల స్రవంతి’పై ఆధారపడి ఉమ్మడి కర్నూలు, అనంతపురం, వైఎస్సార్ కడప, చిత్తూరు జిల్లాల్లో 6.02 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. ఈ జిల్లాలలో 30 లక్షలమందికి తాగునీరు అందుతోంది. క్రిష్ణగిరి, పత్తికొండ, జీడిపల్లి, గొల్లపల్లి, మారాల, చెర్లోపల్లి, శ్రీనివాసపురం, అడవిపల్లి, చెర్లోపల్లి రిజర్వాయర్ల కింద వందల చెరువులకు ఏటా నీళ్లు ఇస్తున్నారు. 76 చెరువులకు గత ప్రభుత్వం నీరందించింది. గత ప్రభుత్వంలో వైఎస్ జగన్ కుప్పానికి కూడా హంద్రీ–నీవా నీటిని విడుదల చేశారు. ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం కృష్ణాలో నీళ్లున్నా విడుదల చేయకుండా అన్నదాతలతో పరిహాసమాడుతోంది. హంద్రీ–నీవా ద్వారా 40 టీఎంసీలను 120 రోజుల పాటు ఎత్తిపోసేలా పథకాన్ని డిజైన్ చేశారు. అయితే అన్ని రోజులు కృష్ణాలో ప్రవాహం ఉండటం లేదు. దీంతో కెనాల్‌ను విస్తరించాలని గత ప్రభుత్వం సంకల్పించింది. ఈ నేపథ్యంలో 15 రోజుల ముందే నీటిని విడుదల చేయాల్సిన ప్రభుత్వం ఇప్పటికీ దృష్టి సారించకపోవడంతో ‘సీమ’కు తీవ్ర నష్టం జరుగుతోంది.రోడ్డు తొలగించి నీటిని విడుదల చేస్తాంజాతీయ రహదారి పనుల్లో భాగంగా హంద్రీ–నీవా కాలువపై వంతెన నిర్మాణం జరుగుతోంది. నీటిని విడుదల చేసే లోపు వంతెన నిర్మాణాన్ని పూర్తి చేస్తామని హామీ ఇచ్చి తాత్కాలిక రోడ్డు వేశారు. అయితే సకాలంలో పనులు పూర్తి చేయలేకపోయారు. గడువు దాటితే ఏజెన్సీతో పని లేకుండా రోడ్డు తొలగించి, పూడిక తీసేసి నీటిని విడుదల చేస్తాం. – రామగోపాల్, ఎస్ఈ, హంద్రీ–నీవా సుజల స్రవంతిప్రత్యామ్నాయం ఆలోచిస్తున్నాంపీఎస్కే ఇన్ఫ్రా హంద్రీ కాలువపై వంతెనను నిర్మిస్తోంది. కాలువను నిర్మాణ సంస్థే పూడ్చింది. నీటి విడుదల కోసం జలవనరులశాఖ అధికారులు తాత్కాలిక రోడ్డును తొలగించే యోచనలో ఉన్నారు. ఇబ్బంది లేకుండా ప్రత్యామ్నాయ మార్గాలు ఆలోచిస్తున్నాం. – జి.గోవర్ధన్, పీడీ, నేషనల్ హైవేస్ అథారిటీ, కర్నూలు -
పూడిక పేరుతో దోపిడీ
సాక్షి, అమరావతి: మూడు మీటర్ల లోతు, 85.5 మీటర్ల వెడల్పుతో తవ్విన కాలువలో 2.5 మీటర్ల ఎత్తున పూడిక పేరుకుపోయిందంటే నమ్ముతారా? ఇది వినడానికే హాస్యాస్పదంగా ఉంది కదా? కానీ.. ఇది వాస్తవమని పోలవరం కాంట్రాక్టర్ చెప్పారు. పూడిక తీయడానికి రూ.1.49 కోట్లను ఖర్చు చేశామని చూపారు. కాంట్రాక్టర్ అడిగిందే తడవుగా అధికారులు బిల్లులు చెల్లించేశారు. ఈ అక్రమాలకు పోలవరం ఎడమ కాలువ ఐదో ప్యాకేజీ వేదికైంది. అప్పటి ఆర్థిక శాఖ మాజీ మంత్రి యనమల రామకృష్ణుడి వియ్యంకుడికి.. లేని పూడికను ఉన్నట్లు చూపి, దాన్ని తీశారనే సాకు చూపి ప్రజాధనాన్ని దోచిపెట్టడంపై అధికారవర్గాలే విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. పోలవరం ఎడమ కాలువలో నవంబర్ 30, 2016 నాటికి రూ.110.11 కోట్ల విలువైన పనులు మాత్రమే మిగిలాయి. కానీ ఆ పనుల అంచనా వ్యయాన్ని రూ.142.88 కోట్లకు పెంచేసి అప్పటి ఆర్థిక శాఖ మంత్రి యనమల వియ్యంకుడైన పుట్టా సుధాకర్ యాదవ్‌కు నామినేషన్ పద్ధతిలో టీడీపీ సర్కార్ అప్పగించింది. ఈ పనులు చేయడానికి రంగంలోకి దిగిన సుధాకర్ నవంబర్ 30, 2016 నాటికి తవ్విన కాలువలో పూడిక పేరుకుపోయిందని.. అందులో పూడిక తీయడానికి వీలుగా వర్షపు నీటిని తోడామని, పూడిక తీశామని.. వాటికి రూ.1.49 కోట్లు ఖర్చయిందని, ఆ బిల్లులు చెల్లించాలని అప్పటి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. వాటిని స్టేట్ లెవల్ స్టాండింగ్ కమిటీ (ఎస్ఎల్ఎస్సీ)కి సర్కార్ పంపింది. మూడు మీటర్ల లోతున్న కాలువలో 2.5 మీటర్ల ఎత్తున పూడిక పేరుకుపోయిందని చూపడంపై విస్మయం వ్యక్తం చేసిన ఎస్ఎల్ఎస్సీ బిల్లులు చెల్లించడానికి తిరస్కరించింది. కానీ ఉన్నత స్థాయి ఒత్తిళ్లకు తలొగ్గిన అధికారులు పుట్టా సుధాకర్ సంస్థకు రూ.1.49 కోట్లను చెల్లించేశారు. అంతటితో ఆగని టీడీపీ ప్రభుత్వం పనుల అంచనా వ్యయాన్ని భారీ ఎత్తున పెంచాలంటూ అధికారులపై ఒత్తిడి తెచ్చింది. ఈ ఒత్తిళ్లకు తలొగ్గిన అధికారులు అంచనా వ్యయాన్ని రూ.669.40 కోట్లకు పెంచేస్తూ జనవరి 10న సర్కార్‌కు ప్రతిపాదనలు పంపారు. అంటే.. పుట్టా సుధాకర్ యాదవ్‌కు ఖజానా నుంచి రూ.559.29 కోట్లను దోచిపెట్టడానికి టీడీపీ ప్రభుత్వం సిద్ధమైనట్లు వెల్లడవుతోంది. -
పుట్టా సుధాకర్‌ను బూతులు తిడుతూ...
సాక్షి, చాపాడు : టీటీపీ ఛైర్మన్, వైఎస్సార్ జిల్లా మైదుకూరు స్థానం నుంచి టీడీపీ తరఫున బరిలో నిలబడ్డ పుట్టా సుధాకర్‌కు ఎన్నికల ప్రచారంలో చేదు అనుభవం ఎదురైంది. చాపాడు మండలంలోని సీతారామపురం గ్రామంలో ప్రచారానికి వెళ్లిన ఆయనకు సొంత పార్టీ కార్యకర్తలే దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు. ఏం చేశావని ఓటు అడగటానికి వచ్చావంటూ పుట్టా సుధాకర్‌ను పచ్చి బూతులు తిడుతూ నిలదీశారు. ఏ ఒక్క సాయం చేకుండా అయిదేళ్లు దోచుకుని, ఇప్పుడు ఓట్లు కోసం వస్తారా అంటూ రాయడానికి వీలులేని భాషలో నోటికి పని చేశారు. తక్షణమే అక్కడ నుంచి వెళ్లిపోవాలంటూ వాగ్వివాదానికి దిగారు. దీంతో బిక్కచచ్చిపోయిన పుట్టా సుధాకర్....చేసేదేమీ లేకా అక్కడ నుంచి మౌనంగా వెనుదిరిగారు. ఇందుకు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. -
‘పచ్చ’ అల్టిమేటం!
టీడీపీ అధికారంలో ఉన్నంత వరకూ గ్రామంలో అడుగు పెట్టొద్దని హుకుం అంత్యక్రియలకు వచ్చినందుకు విచక్షణారహితంగా దాడి టీటీడీ మెంబర్ పుట్టా సుధాకర్ స్వగ్రామంలో అనధికార ఎమర్జెన్సీ వత్తాసు పలుకుతోన్న బి.మఠం పోలీసులు జిల్లా ఎస్పీని ఆశ్రయించిన బాధితులు టీడీపీ నేతలు బరి తెగిస్తున్నారు. అధికారం అండతో పేదల హక్కులను కాలరాస్తున్నారు. పార్టీ కండువా కప్పుకోలేదన్న కారణంతో తాము అధికారంలో ఉన్నంత వరకు ఊర్లోకి అడుగుపెట్టొద్దంటూ హకుం జారీ చేస్తున్నారు. చివరికి అంత్యక్రియలకు, కర్మకాండలకు సైతం హాజరు కావొద్దంటూ ఓ మహిళపై దాడికి పాల్పడటం చూస్తుంటే అనధికార ఎమర్జెన్సీని తలపిస్తోంది. కడప:మైదుకూరు నియోజకవర్గంలో కొంత కాలంగా అనధికార ఎమర్జెన్సీ అమలులో ఉంది. తమ మాట వినని వారిపై టీడీపీ నేతల అరాచకాలు ఎక్కువయ్యాయి. టీడీపీ తీర్థం పుచ్చుకోని ఫెస్టిసైడ్స్ వ్యాపారులపై వ్యవసాయాధికారులు తనిఖీలంటూ వేధింపులకు పాల్పడడం.. పార్టీ మారని రేషన్ డీలర్లపై విజిలెన్సు కేసులు పెట్టడం ఇక్కడ నిత్యకృత్యంగా మారింది. ఉపాధి హామీ పథకం పీల్డ్ అసిస్టెంట్లు టీడీపీ తీర్థం పుచ్చుకోకపోతే తప్పుడు కేసులు బనాయించడం.. ఉన్నతాధికారుల వేధింపులు.. ఆపై ఉపాధి నుంచి తప్పించడం సర్వసాధారణమైంది. తాజాగా ఇలాంటి ఘటనే టీటీడీ మెంబర్ పుట్టా సుధాకర్ సొంత పంచాయతీలోనూ చోటు చేసుకుంది. బి.మఠం మండలం పలుగురాళ్లపల్లె పంచాయతీ ఫీల్డ్ అసిస్టెంటుగా జాలా శివ పని చేస్తున్నారు. శివ స్వగ్రామం ఆ పంచాయితీ పరిధిలోని జౌకుపల్లె. శివ కుటుంబ సభ్యులు టీడీపీ కండువా వేసుకోలేదని వేధింపులు, అనధికారికంగా గ్రామ బహిష్కరణకు పాల్పడ్డారు. ఎమ్మెల్యే ఎన్నికల వరకూ టీడీపీ నేత పుట్టాసుధాకర్, వైఎస్సార్సీపీ నేత జెడ్పీటీసీ సభ్యుడు రాంగోవిందురెడ్డి ఉప్పు-నిప్పుగా ఉన్నారు. ఇటీవల కాలంలో జెడ్పీటీసీ సభ్యుడు రాంగోవిందురెడ్డి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఇద్దరు నేతలు ఓకే పంచాయతీ వాసులు కావడం, అధికార పార్టీ కావడంతో మరో పార్టీకి చెందిన వారు గ్రామంలో ఉండరాదని, వీరి అనుచరులు దర్పం ప్రదర్శించారు. వైఎస్సార్సీపీ సానుభూతి పరులు గ్రామం విడిచి వెళ్లాలంటూ హుకుం జారీ చేశారు. దీంతో ప్రత్యక్ష పోరాటం చేయలేని నిస్సహాయ స్థితిలో వారు అనుకూలమైన ప్రాంతాల్లో తలదాచుకుంటున్నారు. ఈక్రమంలో ఈనెల 14న ఆ గ్రామానికి చెందిన జాలా ప్రకాశం (54) చనిపోయారు. కుటుంబ పెద్ద వృతి చెందడంతో జాలా కుమారి (కోడలు), బందెన్న, రాజశేఖర్ తదితరులు గ్రామానికి వెళ్లి అంత్యక్రియల్లో పాల్గొన్నారు. దీంతో గ్రామంలోకి రావద్దని ఆదేశించినా అంత్యక్రియలకు వస్తారా అంటూ టీడీపీ నేతలు విక్షణ మరిచి ప్రత్యక్ష దాడికి తెగబడ్డారు. మహిళలనీ కూడ చూడకుండా దాడి చేయడంతోపాటు నిర్బంధించారు. వీరు చేసిన నేరం పచ్చ కండువా భుజాన వేసుకోక పోవడమేనని తెలుస్తోంది. ఈ ఘటనపై బి.మఠం పోలీసులకు ఫిర్యాదు చేస్తే కనీస చొరవ చూపలేదని బాధితులు వాపోతున్నారు. కర్మక్రియలకు సైతం హాజరు కారాదట! కర్మక్రియలకు సైతం జాలా బండెన్న కుటుంబం గ్రామంలోకి రాకుడదని దాడులకు పాల్పడ్డ పుట్టా సుధాకర్ వర్గీయులు ఆంక్షలు విధించారు. ‘అంత్యక్రియలుకు హాజరైన నాపై దాడి చేశారు.. పోలీసులకు ఫిర్యాదు చేస్తే కనీస స్పందన లే దు.. గురువారం (28న) కర్మక్రియలు ఉన్నాయి. మా చిన్నమ్మ లక్ష్ముమ్మ పుస్తెలు, గాజులు తీయాల్సి ఉంది. ఈ కార్యక్రమానికి సైతం రాకుడదని ఆదేశించారు. గ్రామంలోకి వెళితే మాపై దాడి జరిగే అవకాశం ఉంది’ అని జాలా కుమారి జిల్లా ఎస్పీ నవీన్‌గులాటీకి ఫిర్యాదు చేసింది. ఎలాంటి తప్పు చేయకపోయినా తమ కుటుంబంపై దాడులు చేస్తున్నారని, బి.మఠం పోలీసులు సైతం నిందుతులకే వత్తాసుగా నిలుస్తున్నారని ఆమె వాపోయారు. ఈనెల 14న దాడి జరిగితే 23వ తేది వర కు కేసు నమోదు చేయలేదని, ఈనెల 22న ఏఎస్పీని కలిశాక కేసు నమోదు చేశారని కన్నీటి పర్యంతమయ్యారు. ఈ ఘటనలో నిందితులపై చర్య తీసుకోవాలని ఎస్పీ.. మైదుకూరు రూరల్ సీఐ నాగభూషణంను ఆదేశించారు. గురువారం కర్మక్రియలకు హాజరు కావాలంటే వారికి పోలీసుల రక్షణ తప్పనిసరి. ఈ విషయమై వివరణ కోరేందుకు ఫోన్లో సిఐ నాగభూషణంను సంప్రదించగా ఫోన్ లిఫ్ట్ చేయలేదు.