PwC survey
-
కంపెనీలకు ఆర్థిక మోసాల తాకిడి
న్యూఢిల్లీ: కంపెనీలకు ఆర్థిక మోసాల తాకిడి పెరిగిపోయింది. గడిచిన 24 నెలల్లో తాము ఆర్థిక మోసాల బారిన పడినట్టు 59 శాతం భారత కంపెనీలు వెల్లడించాయి. పీడబ్ల్యూసీ నిర్వహించిన ‘గ్లోబల్ ఎకనమిక్ క్రైమ్ సర్వే 2024’ రూపంలో ఈ వివరాలు తెలిశాయి. ప్రపంచవ్యాప్తంగా 2,446 సంస్థల సీఈవోలు, ఎండీలు, బోర్డు సభ్యుల అభిప్రాయాలను ఈ సర్వే తెలుసుకుంది. భారత్ నుంచి 91 కంపెనీలు సర్వేలో పాల్గొన్నాయి. ‘‘సర్వేలో పాలు పంచుకున్న భారత కంపెనీల్లో 59 శాతం గత రెండేళ్లలో ఆర్థిక మోసాల బారిన పడినట్టు చెప్పాయి. అంతర్జాతీయ సగటు 41 శాతంతో పోలి్చతే 18 శాతం ఎక్కువ. 2022 ఎడిషన్ సర్వే ప్రకారం చూసినా భారత్‌లో 7 శాతం పెరుగుదల కనిపిస్తోంది’’అని ఈ సర్వే తెలిపింది. ప్రధానంగా కంపెనీల్లో ప్రొక్యూర్మెంట్ (కొనుగోళ్లు) విభాగంలో ఈ మోసాలు ఎక్కువగా చోటు చేసుకుంటున్నట్టు పీడబ్ల్యూసీ సర్వే తెలిపింది. తమకు ఇదొక ప్రధాన సమస్యగా 50 శాతం భారత కంపెనీలు తెలిపాయి. అంతర్జాతీయ సగటుతో పోల్చి చూస్తే 21 శాతం ఎక్కువ. ఇక 47 శాతం కంపెనీలకు కస్టమర్ల మోసాలు ఆందోళనకరంగా పరిణమించాయి. సైబర్ నేరాలు తమకు ప్రధాన సమస్య అని అంతర్జాతీయంగా 44 శాతం కంపెనీలు వెల్లడించాయి. ఎప్పటి నుంచో ఉన్నవే.. ‘‘చారిత్రకంగా చూస్తే ప్రొక్యూర్మెంట్ మోసాలు అన్నవి ఎప్పటి నుంచో ఉన్నవే. ఆర్థిక ప్రయోజనం పొందేందుకు కొనుగోళ్లలో (ప్రొక్యూర్మెంట్) అవకతవకలకు పాల్పడడం. ఈ ఏడాది మా సర్వేలో పాల్గొన్న భారత కంపెనీల ప్రతినిధుల్లో సగం మంది ఇదే అంశంపై ఆందోళన వ్యక్తం చేశారు’’అని పీడబ్ల్యూసీ ఇండియా ఫోరెన్సిక్ సరీ్వసెస్ పార్ట్నర్ పునీత్ గర్ఖేల్ తెలిపారు. ప్రొక్యూర్మెంట్ మోసాలను నివారించేందుకు భారత కంపెనీలు డేటా అనలైటిక్స్‌ను వినియోగిస్తున్నట్టు ఈ సర్వే తెలిపింది. 33 శాతం ఆర్థిక నేరాలు అవినీతి, లంచాలకు సంబంధించినవేనని, గత రెండేళ్లలో టాప్–3 ప్రధాన ఆర్థిక నేరాల్లో ఇవి కూడా ఉన్నట్టు 26 శాతం భారత కంపెనీలు వెల్లడించాయి. -
తయారీలో డిజిటల్ టెక్నాలజీ
న్యూఢిల్లీ: డిజిటల్ టెక్నాలజీలను అందిపుచ్చుకోవడం (డిజిటల్ ట్రాన్స్ఫార్మేషన్) తయారీ రంగ కంపెనీలకు ముఖ్యమైన అజెండాగా ఉన్నట్టు పీడబ్ల్యూసీ ఇండియా సర్వే వెల్లడించింది. 54 శాతం కంపెనీలు ఇప్పటికే ఈ దిశగా ముందడుగు వేసినట్టు తెలిసింది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), అనలైటిక్స్‌ను తమ వ్యాపార కార్యకలాపాల్లో అమలు చేశాయి. తద్వారా అవి సమర్థతను పెంచుకోవడం, వ్యయాలు తగ్గించుకోవడంపై దృష్టి పెడుతున్నాయి. భారత తయారీ రంగంలో ప్రస్తుతం ఉన్న డిజిటల్ తీరుతెన్నులను అర్థం చేసుకునేందుకు, భవిష్యత్తు కార్యాచరణను రూపొందించే అవకాశాలను పరిశీలించేందుకు ఈ సర్వే నిర్వహించినట్టు పీడబ్ల్యూసీ ఇండియా తెలిపింది. దేశీయ మార్కెట్లో పనిచేసే సంస్థలు, బహుళజాతి సంస్థల (ఎంఎన్‌సీలు) చీఫ్ ఎక్స్‌పీరియెన్స్ ఆఫీసర్ (సీఎక్స్‌వో)లను సర్వేలో భాగంగా ప్రశ్నించి తయారీ రంగంలో డిజిటల్ టెక్నాలజీ ముఖచిత్రాన్ని తెలుసుకునే ప్రయత్నం సర్వేలో భాగంగా జరిగింది. ‘‘భారత తయారీ కంపెనీలు అన్ని ప్లాంట్లకు ఒకే ప్రామాణిక డిజిటల్ పరిష్కారానికి ప్రాధాన్యం ఇస్తున్నాయి. కానీ, అంతర్జాతీయ కంపెనీలు వివిధ తయారీ కేంద్రాలకు భిన్నమైన డిజిటల్ పరిష్కారాల వైపు మొగ్గు చూపిస్తున్నాయి. భారత్‌లో తయారీ కంపెనీలు అనలైటిక్స్, ఏఐను కంపెనీలు అమలు చేస్తున్నాయి. వీటి అమలు రేటు 54 శాతంగా ఉంది’’అని ఈ సర్వే నివేదిక తెలిపింది. తమ వ్యాపారాల్లో డిజిటల్ టెక్నాలజీలను అమలు చేసే ప్రణాళికేదీ లేదని సర్వేలో పాల్గొన్న 38 శాతం కంపెనీల ఎగ్జిక్యూటివ్‌లు వెల్లడించారు. ఆరు రంగాల్లోని డిజిటల్ ఛాంపియన్లు పారదర్శకత, సుస్థిరత భవిష్యత్తు వృద్ధికి తమను సన్నద్ధంగా ఉంచుతాయని భావిస్తున్నాయి. గొప్ప ఆవిష్కరణలు, వేగంగా మార్కెట్లోకి తీసుకురావడం పోటీలో తమను నిలిపి ఉంచుతాయని కంపెనీలు అభిప్రాయపడుతున్నాయి. సవాళ్లను అధిగమించేందుకు.. నిర్వహణ సవాళ్లను అధిగమించేందుకు భవిష్యత్ టెక్నాలజీలకు అనుగుణంగా కొంత వరకు సామర్థ్యాన్ని కంపెనీలు సిద్ధం చేసుకోగా, కొన్ని ఇంకా అమలు చేయాల్సి ఉందని పీడబ్ల్యూసీ ఇండియా డిజిటల్ ఆపరేషన్స్ లీడర్ అంకుర్ బసు తెలిపారు. ‘‘సంస్థలు తయారీ ప్రక్రియల్లో సమర్థతను పెంచడంపై దృష్టి పెడుతున్నాయి. ఖరీదైన యంత్రాల నిర్వహణను వ్యయాలను తగ్గించుకుంటున్నాయి. తయారీని ఆటోమేషన్ చేస్తున్నాయి. వర్క్స్టేషన్లను ఐవోటీతో అనుసంధానిస్తున్నాయి’’అని పీడబ్ల్యూసీ ఇండియా పార్ట్నర్ సుదీప్తఘోష్ తెలిపారు. -
సగానికి పైగా అవే కొంపముంచుతున్నాయి: సంచలన సర్వే
న్యూఢిల్లీ: దేశీయంగా చోటు చేసుకుంటున్న మోసాల్లో 57 శాతం పైగా ఉదంతాలు ‘ప్లాట్‌ఫామ్’ ఆధారితమైనవే ఉంటున్నాయని కన్సల్టెన్సీ సంస్థ పీడబ్ల్యూసీ ఇండియా ఒక నివేదికలో తెలిపింది. కోవిడ్ మహమ్మారి రాక తర్వాత ఈ తరహా నేరాలు భారీగా పెరిగాయని తెలిపింది. రిమోట్ పని విధానం, ఈ–కామర్స్, డెలివరీ యాప్‌లు, కాంటాక్ట్‌రహిత చెల్లింపులు మొదలైనవన్నీ కూడా ఇటువంటి మోసాల పెరుగుదలకు దారి తీశాయని ‘ఆర్థిక నేరాలు, మోసాల సర్వే 2022’ నివేదికలో పీడబ్ల్యూసీ వివరించింది. (గోద్రెజ్‌కు రూ.2,000 కోట్ల ఆర్డర్లు) సోషల్ మీడియా, ఈ-కామర్స్, ఎంటర్ప్రైజ్, ఫిన్‌టెక్ వేదికలను ప్లాట్‌ఫామ్‌లుగా పరిగణిస్తున్నారు. ప్లాట్‌ఫామ్ మోసాల వల్ల 26 శాతం దేశీ సంస్థలు 1 మిలియన్ డాలర్ల పైగా (దాదాపు రూ. 8.2 కోట్లు) నష్టపోయినట్లు పేర్కొంది. 111 సంస్థలపై సర్వే ఆధారంగా పీడబ్ల్యూసీ ఈ నివేదిక రూపొందించింది. ఇందులో టెక్నాలజీ, ఆర్థిక సేవలు, బ్యాంకింగ్, క్యాపిటల్ మార్కెట్లు, రిటైల్, విద్య, హెల్త్‌కేర్ తదితర రంగాల కంపెనీలు ఉన్నాయి. ప్లాట్‌ఫామ్‌ల వినియోగం వేగవంతం.. గడిచిన కొన్నాళ్లుగా భారతీయ వినియోగదారులు, సంస్థల్లో కొత్త ప్లాట్‌ఫామ్‌ల వినియోగం చాలా వేగంగా పెరిగిందని పీడబ్ల్యూసీ ఇండియా పార్ట్నర్ పునీత్ గర్ఖెల్ తెలిపారు. ‘సగటున ఒక భారతీయ కంపెనీ అయిదు వేర్వేరు ప్లాట్‌ఫామ్‌లపై తన వ్యాపార కార్యకలాపాలు సాగిస్తున్నాయి. ఈ–కామర్స్, కాంటాక్ట్‌రహిత చెల్లింపులు, హోమ్ డెలివరీ విధానాలు, రిమోట్ పని విధానం మొదలైనవి వివిధ రకాల ప్లాట్‌ఫాం ఆధారిత ఆవిష్కరణలకు దారి తీసినప్పటికీ నేరగాళ్లకు కూడా కొత్త మార్గాలు లభించినట్లయింది‘ అని పేర్కొన్నారు. కంపెనీలు ఎప్పటికప్పుడు కొత్తగా ముంచుకొచ్చే ముప్పుల విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలని.. మోసాలను ముందస్తుగా గుర్తించి, నివారించడంపై ఇన్వెస్ట్ చేయడం ద్వారా సురక్షితంగా ఉండాలని నివేదిక సూచించింది. (అయ్యయ్యో! ఐకానిక్ స్టార్, ప్రిన్స్ మహేష్, డార్లింగ్ ప్రభాస్? ఎందుకిలా?) ఇందులోని మరిన్ని అంశాలు.. ♦ ప్రతి 10 ప్లాట్‌ఫామ్ మోసాల్లో నాలుగు .. అంతర్గత కుట్రదారుల వల్లే చోటుచేసుకున్నాయి. ♦ లోపలి వారు, బైటివారు కుమ్మక్కై చేసిన మోసాలు 26 శాతం ఉన్నాయి. కంపెనీలు అంతర్గతంగా పటిష్టమైన చర్యలు అమలు చేస్తే మూడింట రెండొంతుల ప్లాట్‌ఫామ్ మోసాలను నివారించవచ్చని దీని ద్వారా తెలుస్తోందని నివేదిక తెలిపింది. ♦ కస్టమర్లు మోసపోయిన కేసుల్లో 92 శాతం మోసాలు చెల్లింపులపరమైనవిగా ఉన్నాయి. ప్రధానంగా క్రెడిట్ కార్డులు, డిజిటల్ వాలెట్ల ద్వారా ఇలాంటివి చోటు చేసుకున్నాయి. (ఇదీ చదవండి: ఎస్బీఐ అకౌంట్ బ్రాంచ్ మార్చుకోవాలా? ఇదిగో ఇలా సింపుల్‌గా) -
కరోనా తరువాత ఖర్చు తగ్గించేశారు
-
కరోనా తరువాత కామన్ మ్యాన్ కష్టాలు
-
డిజిటల్‌కు మారడమే ప్రధాన సవాలు!
న్యూఢిల్లీ: రిస్కుల నిర్వహణకు సంబంధించి .. డిజిటల్‌కు ఎంత వేగవంతంగా మారగలమన్నదే ప్రధాన సవాలుగా ఉంటుందని దేశీయంగా అత్యధిక శాతం మంది బిజినెస్ ఎగ్జిక్యూటివ్‌లు భావిస్తున్నారు. వ్యాపార పరిస్థితులు శరవేగంగా మారిపోతున్న నేపథ్యంలో రిస్కులను అంచనా చేసేందుకు, పర్యవేక్షించేందుకు బైటి నిపుణుల అభిప్రాయాలు కూడా ఎప్పటికప్పుడు తీసుకోవాల్సిన అవసరం ఉంటుందని ప్రతి పది మంది ఎగ్జిక్యూటివ్‌లలో ఆరుగురు అభిప్రాయపడుతున్నారు. అంతర్జాతీయ కన్సల్టెన్సీ సంస్థ పీడబ్ల్యూసీ నిర్వహించిన సర్వేలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. ఎంత వేగవంతంగా డిజిటల్, ఇతరత్రా విధానాలకు మారతామనేదే రిస్కు మేనేజ్మెంట్కు ప్రధాన సవాలుగా ఉంటుందని ప్రతి పది మందిలో ఎనిమిది మంది ఎగ్జిక్యూటివ్‌లు అభిప్రాయపడినట్లు సర్వే నివేదిక పేర్కొంది. రిస్కుల నిర్వహణకు సంబంధించి టెక్నాలజీ, డిజిటల్ సామర్థ్యాలపై మరింతగా ఇన్వెస్ట్ చేస్తున్నట్లు 88 శాతం మంది బిజినెస్ లీడర్లు తెలిపారు. పీడబ్ల్యూసీ సర్వేలో భారత్ నుంచి 109 మంది పాల్గొన్నారు. వీరిలో అత్యధికంగా 72 శాతం మంది పేరొందిన బిజినెస్ ఎగ్జిక్యూటివ్‌లు ఉండగా, మిగతా వారు రిస్క్ మేనేజ్మెంట్ (13 శాతం), ఆడిట్ (10 శాతం) ప్రొఫెషనల్స్ ఉన్నారు. సంస్థల స్థాయిని చూస్తే 81 శాతం ఎగ్జిక్యూటివ్‌లు 1 బిలియన్ డాలర్ల పైగా ఆదాయాలు ఉన్న కంపెనీలకు చెందిన వారు ఉండగా, 42 శాతం మంది 10 బిలియన్ డాలర్ల పైగా టర్నోవరు ఉన్న సంస్థల్లో పని చేస్తున్నారు. ‘ఎప్పటికప్పుడు మారిపోయే వ్యాపార పరిస్థితుల్లో రిస్కుల నిర్వహణ సామర్థ్యాలనేవి వ్యూహాత్మక ప్లానింగ్‌లోనూ, నిర్ణయాలు తీసుకునే ప్రక్రియలోనూ భాగంగా ఉంటే బోర్డు సభ్యులు, వ్యాపారవేత్తలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఎలాంటి రిస్కులు తలెత్తే అవకాశం ఉందనేది తెలిస్తే బిజినెస్ లీడర్లు తమ వ్యూహాల అమలుకు ఆత్మవిశ్వాసంతో నిర్ణయాలు తీసుకోవచ్చు‘ అని పీడబ్ల్యూసీ ఇండియా పార్ట్నర్ శివరామ కృష్ణన్ చెప్పారు. -
నిర్వహణ సామర్థ్యాలు మెరుగుపర్చుకోవాలి
న్యూఢిల్లీ: సంక్షోభాన్నుంచి గట్టెక్కేందుకు నిర్వహణ సామర్థ్యాలను మరింతగా మెరుగుపర్చుకోవాల్సిన అవసరాన్ని కోవిడ్–19 మహమ్మారి ప్రత్యేకంగా తెలియజెప్పిందని 90 శాతం మంది దేశీ వ్యాపార దిగ్గజాలు అభిప్రాయపడ్డారు. దీన్నుంచి నేర్చుకున్న పాఠాలను, భవిష్యత్తులో కచ్చితంగా అమలు చేస్తామని పేర్కొన్నారు. ఈ విషయంలో అంతర్జాతీయ సంస్థల్లో లీడర్ల కన్నా మన వారు చాలా ధీమాగా ఉన్నారు. కన్సల్టెన్సీ సంస్థ పీడబ్ల్యూసీ ఇండియా నిర్వహించిన ఒక సర్వేలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం కరోనా కారణంగా తమ వ్యాపారాలపై ప్రతికూల ప్రభావం పడిందని సుమారు 59 శాతం దేశీ సంస్థలు తెలిపాయి. కరోనా వైరస్ నేపథ్యంలో టెక్నాలజీపై గణనీయంగా ఇన్వెస్ట్ చేసినట్లు 80 శాతం కంపెనీలు తెలిపాయి. అంతర్జాతీయ సంక్షోభ సర్వే 2021లో ప్రపంచవ్యాప్తంగా వ్యాపార వర్గాలు వ్యక్తపర్చిన అభిప్రాయాలనే దేశీయంగా కూడా దిగ్గజాలు కాస్త అటూ, ఇటూగా వ్యక్తపర్చినట్లు పీడబ్ల్యూసీ పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా 2,800 పైచిలుకు బిజినెస్ లీడర్లు తమ కంపెనీ డేటాను, కరోనా ప్రభావాలపై వ్యక్తిగత అభిప్రాయాలను, భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికలను ఈ సర్వేలో తెలియజేశారు. సంక్షోభ సమయంలో గుర్తించిన సమస్యలను పరిష్కరించుకోవడం, భారీ అవాంతరాలపై తక్షణం స్పందించేందుకు వ్యూహాన్ని రూపొందించుకోవడం, చర్యల అమలు తర్వాత ప్రక్రియలను సమీక్షించుకోవడం తదితర 5 అంశాలకు ప్రాధాన్యమిస్తున్నట్లు వారు తెలిపారు. -
ప్రథమార్ధంలో డీల్స్ జోరు
న్యూఢిల్లీ: కోవిడ్–19 సెకండ్ వేవ్ ప్రభావాలు భారత్‌లో ఎలా ఉన్నప్పటికీ కార్పొరేట్ రంగంలో డీల్స్ జోరు కొనసాగుతోంది. ఈ ఏడాది ప్రథమార్ధంలో దాదాపు 41 బిలియన్ డాలర్ల విలువ చేసే ఒప్పందాలు కుదరడం ఇందుకు నిదర్శనం. కన్సల్టెన్సీ సంస్థ పీడబ్ల్యూసీ ఇండియా నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం జనవరి 1 నుంచి జూన్ 15 మధ్య కాలంలో దేశీ సంస్థలు 710 లావాదేవీలకు సంబంధించి 40.7 బిలియన్ డాలర్ల విలువ చేసే ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. విలువపరంగా గతేడాది ద్వితీయార్ధంతో పోలిస్తే ఇది రెండు శాతం అధికం. జనవరి–జూన్ మధ్య కాలంలో ప్రైవేట్ ఈక్విటీ (పీఈ) లావాదేవీలు ఆల్‌టైమ్ గరిష్టమైన 26.3 బిలియన్ డాలర్లకు చేరాయి. గత ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధంతో పోలిస్తే ఇది 25 శాతం ఎక్కువ. బిలియన్ డాలర్ల స్థాయి కొనుగోళ్లు, స్టార్టప్‌లు పలు విడతలుగా నిధులు సమీకరించడం తదితర అంశాలు .. డీల్స్ జోరుకు దోహదపడ్డాయి. అనిశ్చితి నెలకొన్న ప్రస్తుత తరుణంలో డిజిటల్ .. టెక్నాలజీ విభాగంలోనూ, పర్యావరణ..సామాజిక..గవర్నెన్స్ (ఈఎస్జీ) విభాగంలోనూ పెట్టుబడులు గణనీయంగా వస్తున్నాయని పీడబ్ల్యూసీ ఇండియా పార్ట్నర్ దినేష్ ఆరోరా తెలిపారు. ఇతర విశేషాలు.. ► ప్రథమార్ధంలో 6.2 బిలియన్ డాలర్ల విలువ చేసే విలీన, కొనుగోళ్ల (ఎంఅండ్ఏ) ఒప్పందాలు కుదిరాయి. ► అదానీ గ్రీన్ ఎనర్జీ సుమారు 3.5 బిలియన్ డాలర్లకు ఎస్బీ ఎనర్జీ ఇండియాను, ఐటీ దిగ్గజం విప్రో దాదాపు 1.45 బిలియన్ డాలర్లు పెట్టి బ్రిటన్‌కు చెందిన క్యాప్కోను కొనుగోలు చేశాయి. ► ఇవి కాకుండా విదేశాలకు చెందిన సంస్థల కొనుగోళ్లకు సంబంధించి 26 డీల్స్ కుదిరాయి. వీటి విలువ 385 మిలియన్ డాలర్లు. ► టెక్నాలజీ రంగంలో పీఈ పెట్టుబడులు అత్యధికంగా వచ్చాయి. ► 2021లో 16 స్టార్టప్‌లు..యూనికార్న్ (1 బిలియన్ డాలర్ల విలువ చేసే సంస్థలు) క్లబ్లో చేరాయి. -
గ్లోబల్ ఎకానమీ రికవరీకి తిరుగులేదు
న్యూఢిల్లీ: కరోనా ప్రేరిత సవాళ్ల నుంచి ప్రపంచ ఆర్థిక వ్యవస్థ 2021లో వృద్ధి బాటకు మళ్లుతుందన్న విశ్వాసాన్ని ప్రపంచవ్యాప్తంగా అనేక కంపెనీల చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు (సీఈఓ) వ్యక్తం చేశారు. సంస్థల ఆదాయాలు పెరుగుతాయన్న ధీమానూ వెలిబుచ్చారు. ఇందుకు సంబంధించి వారి ఆశావాద దృక్పథం ‘‘రికార్డు స్థాయిల్లో’’ ఉంది. ప్రముఖ కన్సల్టెన్సీ పీడబ్ల్యూసీ 24వ వార్షిక గ్లోబల్ సీఈఓ సర్వే ఈ విషయాన్ని తెలిపింది. సర్వేకు సంబంధించి కొన్ని ముఖ్యాంశాలు చూస్తే... భారత్‌సహా 100దేశాలకు చెందిన 5,050 మంది సీఈఓలు జనవరి, ఫిబ్రవరిల్లో జరిగిన ఈ సర్వేలో తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. వీరిలో 36 శాతం మంది తమ కంపెనీల ఆదాయాలు వచ్చే 12 నెలల్లో పెరుగుతాయన్న ధీమాను వ్యక్తం చేశారు. 2020లో ఇలాంటి అభిప్రాయం వ్యక్తం చేసిన సీఈఓలు 27 శాతమే . 2021లో గ్లోబల్ ఎకానమీ రికవరీ ఖాయమని 76% మంది సీఈఓలు అభిప్రాయపడ్డారు. 2012 తర్వాత ఈ స్థాయిలో రికవరీపై విశ్వాసం వ్యక్తం చేయడం గమనార్హం. 2019లో ఈ పరిమాణం 42 శాతం. 2020లో 22 శాతం. గ్లోబల్ ఎకానమీ వృద్ధిపై అత్యధిక సంఖ్యలో విశ్వాసం వ్యక్తం చేసిన వారిలో నార్త్ అమెరికా, పశ్చిమ యూరోప్‌లకు చెందినవారు ఉన్నారు. అయితే కరోనా తరహా మరో మహమ్మారి విజృంభిస్తే మాత్రం పరిస్థితిగా కఠినంగా ఉంటుందని ప్రపంచవ్యాప్తంగా సీఈఓలు ఆందోళన వ్యక్తం చేశారు. అంతర్జాతీయంగా పలు కంపెనీలు డిజిటల్ సొల్యూషన్స్‌పై దృష్టి సారిస్తున్నాయి. ఇందుకు సంబంధించి అంతర్జాతీయంగా భాగస్వామ్యాలను విస్తరించుకోడానికి వ్యూహ రచన చేస్తున్నాయి. ఇదే సమయంలో సైబర్ పరమైన ఇబ్బందులను ఎదుర్కొనడానికి తగిన చర్యలు తీసుకుంటున్నాయి. సీఈఓల్లో 30 శాతం మంది వాతావరణ మార్పు పట్ల ఆందోళన వ్యక్త చేశారు. 2020లో ఇది 24 శాతంగా ఉంది. అయితే వాతావరణ మార్పిడి వల్ల తక్షణం వృద్ధికి వచ్చిన విఘాతం ఏదీ లేదని 27 శాతం మంది సీఈఓలు అభిప్రాయపడ్డారు. సీఈఓల ముందు రెండు సవాళ్లు... చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు (సీఈఓ) ప్రధానంగా ప్రస్తుతం రెండు సవాళ్లను ఎదుర్కొంటున్నారు. ఆయా సంస్థల కార్యకలాపాల్లో పాలుపంచుకునే వర్గాల్లో విస్తృత ప్రాతిపదిక విశ్వాసాన్ని ఎలా పెంపొందించాలన్న అంశం ఇందులో ఒకటి. మహమ్మారి కరోనా ప్రేరిత సవాళ్ల నేపథ్యంలో వేగంగా మారిపోతున్న అంతర్జాతీయ పరిణామాలను తమ వ్యాపార కార్యకలాపాలకు అనుసంధానించుకుని తద్వారా పటిష్ట స్థాయిలో ఆటుపోట్లను తట్టుకోవడం ఎలా అన్న అంశం రెండవది. - సంజీవ్ కృష్ణన్, పీడబ్ల్యూసీ ఇండియా చైర్మన్ 2022 వరకూ ‘‘కరోనా ముందస్తు’’కు రాలేం: మూడీస్ 2021లో వృద్ధి రికవరీ బాటన పడినప్పటికీ, ‘‘కరోనా ముందస్తు క్రియాశీలత’’ స్థాయికి 2022 వరకూ చేరుకోవడం కష్టమేనని అంతర్జాతీయ రేటింగ్ దిగ్గజ సంస్థ-మూడీస్ తన తాజా నివేదికలో గురువారం పేర్కొంది. 2022 వరకూ పలు దేశాల ఎకానమీలు కరోనా ముందస్తు కాలానికి చేరుకోలేవని విశ్లేషించింది. ‘‘2020 మార్చి 11వ తేదీన కోవిడ్-19ను మహమ్మారిగా ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ప్రకటించింది. అటు తర్వాత గ్లోబల్ ఎకానమీ తీవ్ర ప్రతికూలతలో పడిపోయింది. బాండ్ డిఫాల్ట్స్ పెరిగాయి. రుణ వ్యవస్థ నేల చూపుచూసింది. అయితే రుణ వ్యవస్థ తిరిగి ఇప్పుడు కోలుకుంటోంది. అయితే ఇది ప్రస్తుతానికి స్వల్పకాలిక ధోరణి మాత్రమే. పలు రంగాలకు ఇంకా ఇబ్బందులు తొలగిపోలేదు. కరోనా ముందటి కార్యకలాపాలకు అవి ఇంకా చేరుకోలేదు. దీనికి ఇంకా సమయం పడుతుంది’’ అని మూడీస్ తన గ్లోబల్ రిపోర్ట్‌లో పేర్కొంది. ఆర్థిక క్రియాశీలతకు ప్రభుత్వాలు, సెంట్రల్ బ్యాంకుల విధానపరమైన చర్యలు తమ మద్దతును కొనసాగిస్తాయన్న విశ్లేషణ చేసింది. వ్యాక్సినేషన్ కార్యకలాపాలు విస్తృతం అవుతున్న నేపథ్యంలో మహమ్మరి ప్రభావం కూడా ఈ ఏడాది క్రమంగా తగ్గుతుందన్న విశ్వాసాన్ని మూడీస్ వ్యక్తం చేసింది. దీనితో ప్రపంచవ్యాప్తంగా కఠిన లాక్డౌన్ పరిస్థితులను ఆయా ప్రభుత్వాలు క్రమంగా పూర్తి స్థాయిలో తొలగిస్తాన్న అభిప్రాయాన్ని వెలిబుచ్చింది. అయితే వృద్ధి తీరుపై కరోనా సవాళ్ల ప్రభావం మరికొంతకాలం కొనసాగుతుందని విశ్లేషించింది. ‘‘దీనికితోడు కొత్త మ్యుటేషన్ల సవాళ్లు పెరుగుతూనే ఉంటాయి. సాధారణ పరిస్థితులు నెలకొనే సమయంలో ఇదొక సవాలుగానే ఉంటుంది. వైరస్‌ను పూర్తిగా నిర్మూలిద్దామనే యోచనకు బదులు, దానితో కలిసి జీవించడం ఎలా అన్న అంశంపైనే దృష్టి పెట్టాలి. తక్కువ స్థాయిలో కేసులు ఉన్నప్పటికీ, ఈ ధోరణి తప్పదు’’ అని మూడీస్ స్పష్టం చేసింది. ఆర్థిక, ఫైనాన్షియల్ వ్యవస్థలకు వైరస్ వల్ల ఊహించిన పరిణామాలు, ప్రతికూలతలు ఎదురయితే తప్ప, ప్రస్తుత పరిస్థితుల్లో విస్తృత ప్రాతిపదికన క్రెడిట్ రేటింగ్స్ సమీక్షలు జరుగుతాయని భావించనక్కర్లేదని కూడా మూడీస్ పేర్కొనడం గమనార్హం. చదవండి: ‘వరల్డ్ వైడ్ వెబ్’ కోటకు బీటలు సింగిల్ ఛార్జింగ్ తో 240 కి.మీ ప్రయాణం -
ఆ మూడు తరవాతే ఇండియా!
దావోస్: అంతర్జాతీయ వృద్ధి పట్ల సీఈవోల్లో విశ్వాసం కనిష్ట స్థాయికి చేరింది. అయినా కానీ, అంతర్జాతీయంగా అమెరికా, చైనా, జర్మనీ తర్వాత భారత్ వారికి నాలుగో ప్రాధాన్య దేశంగా ఉన్నట్టు పీడబ్ల్యూసీ సంస్థ సీఈవోలపై నిర్వహించిన సర్వే స్పష్టం చేసింది. భారత్‌లో తమ వ్యాపార వృద్ధికి అనుకూల పరిస్థితులున్నట్టు అంతర్జాతీయంగా నిర్వహించిన ఈ సర్వేలో 9 శాతం మంది సీఈవోలు చెప్పారు. స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్) వార్షిక సదస్సులో భాగంగా ఈ నివేదికను పీడబ్ల్యూసీ విడుదల చేసింది. తమ ఆదాయ వృద్ధి అవకాశాల పట్ల భారత సీఈవోలు ఎంతో ఆశావహంగా ఉన్నారని సర్వేలో వెల్లడైంది. చైనాలో 45 శాతం మంది సీఈవోలు ఈ రకమైన విశ్వాసంతో ముందుండగా, ఆ తర్వాత భారత సీఈవోల్లోనే అత్యధిక విశ్వాసం వ్యక్తమైంది. 40 శాతం భారత సీఈవోలు వృద్ధి అవకాశాల పట్ల నమ్మకంగా ఉన్నారు. ఆ తర్వాత అమెరికాలో 36 శాతం, కెనడాలో 27 శాతం, బ్రిటన్‌లో 26 శాతం, జర్మనీలో 20 శాతం సీఈవోల్లో ఇదే విశ్వాసం వ్యక్తమైంది. అంతర్జాతీయంగా చూస్తే... తమ కంపెనీ అవకాశాల పట్ల సానుకూలత వ్యక్తం చేసిన వారు కొద్ది మందే. 27 శాతం సీఈవోలు మాత్రమే ఈ ఏడాది ఆదాయ వృద్ధి అవకాశాలపై నమ్మకంతో ఉన్నారు. 2009 తర్వాత అంతర్జాతీయంగా సీఈవోల్లో విశ్వాసం ఇంత కనిష్ట స్థాయికి చేరడం మళ్లీ ఇదే. గతేడాది ఇది 35 శాతంగా ఉంది. నిరాశావాదం తారస్థాయిలో.. అంతర్జాతీయ వృద్ధి పట్ల సీఈవోల్లో నిరాశావాదం రికార్డు స్థాయికి చేరిందని పీడబ్ల్యూసీ సర్వే పేర్కొంది. అంతర్జాతీయ జీడీపీ వృద్ధి రేటు తగ్గుతుందని సగానికి పైగా సీఈవోలు చెప్పడం ఇదే మొదటి సారి కావడం గమనార్హం. వ్యాల్యుబుల్ 500 ఇనీషియేటివ్‌లో డాక్టర్ రెడ్డీస్, మహీంద్రా వైకల్యం ఉన్న వారికి ఉపాధి కల్పించే విషయంలో గూగుల్, యాక్సెంచర్, బోయింగ్, కోకకోలా తదితర కంపెనీలతోపాటు భారత్ నుంచి డాక్టర్ రెడ్డీస్, మహీంద్రా, సరోవర్ హోటల్స్ అండ్ రిసార్ట్స్ ముందుకొచ్చాయి. 24 దేశాల నుంచి మొత్తం 241 కంపెనీలు ‘వాల్యుబుల్ 500 ఇనీషియేటివ్’ కార్యక్రమంలో చేరాయని, ప్రపంచవ్యాప్తంగా ఈ కంపెలు 9.9 మిలియన్ల మందికి ఉపాధి కల్పిస్తున్నాయని, వీటి ఆదాయం 3.8 ట్రిలియన్ డాలర్ల కంటే ఎక్కువగా ఉందని డబ్ల్యూఈఎఫ్ పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా 130 కోట్ల మంది ప్రజలు ఎంతో కొంత వైకల్యాన్ని ఎదుర్కొంటున్నట్లు గుర్తు చేసింది. పారదర్శక వాణిజ్యాన్నే భారత్ కోరుకుంటోంది: గోయల్ పారదర్శకమైన, సమతుల్యమైన వాణిజ్య భాగస్వామ్యాల కోసం భారత్ కృషి చేస్తోందని కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ డబ్ల్యూఈఎఫ్ వార్షిక సదస్సులో స్పష్టం చేశారు. హిందూ మహాసముద్ర తీర ప్రాంత దేశాల్లో వృద్ధికి ఉన్న అపార అవకాశాలను అందిపుచ్చుకునేందుకు సహకారం మరింత విస్తృతం కావాలని పిలుపునిచ్చారు. ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం (ఆర్సీఈపీ) ప్రస్తుత రూపంలో ఉన్నది భారత్‌కు ఆమోదనీయం కాదన్నారు. ఈ ప్రాంతంలో చైనా, ఇతర దేశాలతో భారత్ వాణిజ్య లోటును కలిగి ఉందని, ఈ అంశాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉందని చెప్పారాయన. -
వ్యాపార వృద్ధిపై సీఈవోల ధీమా
ముంబై: ఆర్థిక వృద్ధిపై అనిశ్చితి, వేగంగా మారిపోతున్న టెక్నాలజీ తదితర సవాళ్లతో కంపెనీలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నప్పటికీ.. సంస్థల సీఈవోలు మాత్రం వ్యాపార వృద్ధి అవకాశాలపై ధీమాగానే ఉన్నారు. దేశీయంగా 71 శాతం మంది సీఈవోలు రాబోయే పన్నెండు నెలల్లో తమ సంస్థల వృద్ధిపై విశ్వాసం వ్యక్తం చేశారు. అంతర్జాతీయ స్థాయిలో ఇది 38 శాతంగాను, చైనాలో 35 శాతం, బ్రెజిల్లో 57 శాతంగాను ఉంది. కన్సల్టెన్సీ సంస్థ పీడబ్ల్యూసీ నిర్వహించిన 20వ సీఈవో సర్వేలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా 79 దేశాల్లో 1,379 మంది.. భారత్‌లో 106 మంది సీఈవోలు ఈ సర్వేలో పాల్గొన్నారు. పెరుగుతున్న ఆదాయ స్థాయిలు, పట్టణీకరణ తదితర పటిష్టమైన వృద్ధి మూలాలు.. భారత సీఈవోల్లో ఆశావహ ధోరణికి కారణమని సర్వే నివేదిక పేర్కొంది. రాబోయే రోజుల్లో అమలు చేయబోయే సంస్కరణలు, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) పెరుగుదల తదితర అంశాలు కూడా ఇందుకు దోహదపడుతున్నాయని వివరించింది. సుశిక్షితులైన సిబ్బంది, ఆర్థిక వృద్ధిపై అనిశ్చితి, టెక్నాలజీ మార్పుల్లో వేగం, ప్రాథమిక మౌలిక సదుపాయాలు తగు స్థాయిలో లేకపోవడం, అధిక నియంత్రణ మొదలైనవి కంపెనీలకు ప్రధాన సవాళ్లుగా ఉంటున్నాయని పీడబ్ల్యూసీ ఇండియా చైర్మన్ శ్యామల్ ముఖర్జీ తెలిపారు. సర్వే ప్రకారం భారత సీఈవోలు .. అమెరికా, చైనా, బ్రిటన్ వంటి పెద్ద విదేశీ మార్కెట్లలో అవకాశాలు దక్కించుకోవడంపై దృష్టి పెడుతున్నారు.