pyditalli
-
పైడితల్లి అమ్మవారి ఆలయం సిరిమానోత్సవం
-
విజయనగర ఉత్సవాలు ప్రారంభం
సాక్షి, విజయనగరం: విజయనగరం పైడితల్లి అమ్మవారి ఉత్సవాలు శనివారం పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్ రావు ప్రారంభించారు. ఆలయం నుంచి ర్యాలీగా ప్రారంభమైన ఉత్సవాలు నేటి నుంచి మూడు రోజుల పాటు జరగనున్నాయి. జిల్లాలోని ఆనంద గజపతి ఆడిటోరియం ఆవరణలో ఉన్న తెలుగు తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి, అనంతరం జ్యోతి ప్రజ్వలనతో ఉత్సవ కార్యక్రమాలను మంత్రులు ప్రారంభించారు. ఈ ర్యాలీలో పాల్గొన్న వివిధ కళారూపాల ప్రదర్శనలు చూపరులను ఆకట్టుకుంటున్నాయి. ఉత్సవ ర్యాలీలో ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి, ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, ఎమ్మెల్యేలు కోలగట్ల వీరభద్రస్వామి, సంబంగి చిన అప్పలనాయుడు, అప్పల నరసయ్య, రాజన్న దొర, జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్‌రావు మాట్లాడుతూ.. విజయనగరం ఉత్సవం నిర్వహించుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఉత్సవాల నిర్వహణకు పర్యాటక శాఖ నుంచి రూ.50 లక్షలు ఇస్తూ జీవో విడుదల చేయటంపై హర్షం వ్యక్తం చేశారు. విద్యల నగరంగా విజయనగరం వర్ధిల్లుతోందన్నారు. సంస్కృతి సంప్రదాయాలు భావితరాలకు అందేలా ప్రభుత్వం కార్యాచరణ చేస్తుందని పేర్కొన్నారు. పర్యాటక శాఖ ఆధ్వర్యంలో సాంస్కృతిక అకాడమీ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి భావిస్తున్నారని తెలిపారు. అభివృద్ధి కోసం నిరంతరాయంగా కృషి చేస్తున్నామని తెలిపారు. ఒక్క అక్టోబర్ నెలలోనే వాలంటీర్ల నియామకం, ఆటో డ్రైవర్లకు చేయూత, కంటి వెలుగు, రైతు భరోసా కార్యక్రమాలు ప్రారంభించామని గుర్తు చేశారు. దీపావళికల్లా ఇసుక కొరత తీర్చడానికి ప్రయత్నిస్తున్నామన్నారు. -
పైడితల్లికి ఉయ్యాల సేవ
విజయనగరం మున్సిపాలిటీ: కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి పైడితల్లి అమ్మవారి జాతరలో భాగంగా మంగళవారం అమ్మవారికి ఉయ్యాల కంబాల ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. స్థానిక మూడు లాంతర్లు వద్దనున్న చదురుగుడిలో కొలువైన పైడితల్లి అమ్మవారికి విశేష పూజలు జరిగాయి. అమ్మవారి కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఉయ్యాల చుట్టూ మూడు మార్లు ప్రదక్షిణలు చేసిన అనంతరం అమ్మవారి ఉత్సవ విగ్రహంతో పూజారి తాళ్లపూడి భాస్కరరావు సమక్షంలో ఉయ్యాలలో అమ్మవారిని ఉంచి ఉత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారి ఘటాలకు విశేష పూజలు చేశారు. ఉయ్యాల కంబాల అనంతరం సిరిమానుతో పాటు తెచ్చిన రాటకు మూడు సార్లు గొడ్డలి ఆనించి ఉయ్యాలను తీసివేశారు. దీంతో అమ్మవారి జాతర పూర్తయిందని భక్తులకు పూజారి వివరించారు. అనంతరం అమ్మవారిని చదురుగుడి నుంచి వనంగుడికి మేళతాళాలతో తీసుకువెళ్లారు. అమ్మవారు మరో ఆరు నెలల పాటు వనంగుడిలో కొలువై ఉంటారని పూజారి పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని ఆలయ ఏసీ భానురాజా తదితరులు పర్యవేక్షించారు. -
జై పైడిమాంబ.. జై జై పైడిమాంబ
పైడితల్లికి నీరాజనం హుకుంపేటలో పొంగిపొర్లిన భక్తిభావం సిరిమానుకు ప్రత్యేక పూజలు విజయనగరం టౌన్ : కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి పైడితల్లి అమ్మవారికి హుకుంపేట వాసులు మంగళవారం దారిపొడువునా నీరాజనాలు పలికారు. సిరిమానుకు పుసుపు నీళ్లతో చల్లదనం చేశారు. సిరిమానును తాకి పైడమ్మను తాకామని ఆనందపరవశులయ్యారు. పూజారి ఇంటివద్ద నుంచి వీధుల్లోకి అడుగుపెట్టగానే చిన్నారులు సైతం ఆయన కాళ్లకు నమస్కరించి అమ్మవారిపై భక్తిభావం చాటుకున్నారు. వీధులన్నీ భక్తులతో నిండిపోయాయి. జై పైడిమాంబ.. జై జై పైడిమాంబ నినాదాలతో పైడితల్లి దీక్షాదారులు సిరిమానును కించిత్ కూడా కనిపించకుండా మోసుకుంటూ వీధుల్లోంచి తీసుకువచ్చారు. మహిళలు పసుపు నీటిని బిందెలతో వేస్తూ తమ భక్తిభావాన్ని చాటుకున్నారు. మధ్యాహ్నం 12–55 గంటలకు హుకుంపేటలో సిరిమాను, అంజలిర«థం, తెల్లఎనుగు బయలుదేరింది. భక్తుల జయజయ ధ్వానాల మధ్య బయలుదేరిన సిరిమాను రెండు గంటలకు చదురుగుడికి చేరుకుంది. అనంతరం సిరిమాను పూజారి తాళ్లపూడి భాస్కరరావు వీధుల్లో వస్తూ అందరినీ ఆశీర్వదించారు. సిరిమానుతో పాటు అంజలిరథం, పాలధారను చదురుగుడి వద్దకు తీసుకువచ్చారు. వందలాది మంది భక్తులు ముందుగా సిరిమానుకు మొక్కులు చెల్లించుకున్నారు. హుకుంపేటలో సుమారు 400 మందికి పైగా సేవకులు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సేవలందించరు. హుకుంపేట, నల్లావీధి, బుక్కావీధి, లంకాపట్నం , పాలిస్టర్ హౌస్, కన్యకాపరమేశ్వరీ అమ్మవారి కోవెల, గంటస్తంభం మీదుగా సిరిమాను మూడులాంతర్ల వద్దనున్న చదురుగుడికి చేరుకుంది. అనంతరం అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించారు. -
పైడితల్లి జాతర మహోత్సవ చాటింపు
17న తొలేళ్ల ఉత్సవం 18న సిరిమానోత్సవం విజయనగరం టౌన్ : ఉత్తరాంధ్రుల ఇలవేల్పు , కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి పైడితల్లి అమ్మవారి జాతర మహోత్సవ చాటింపు కార్యక్రమాన్ని ఆదివారం సాయంత్రం స్థానిక మూడులాంతర్లు వద్ద ఉన్న చదురుగుడి ఆవరణలో నిర్వహించారు. చాటింపు నిర్వాహకులు రామవరపు పైడిరాజు బందం డప్పు, వాయిద్యాలు, బాజాభజంత్రీలతో అమ్మవారికి చల్లదనం చేశారు. ఆలయ కార్యనిర్వహణాధికారి పీవీఏవీఎస్.భానురాజా, ఆలయ సిరిమాను పూజారి తాళ్లపూడి భాస్కరరావు, కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారికి గర్భగుడిలో మూడుసార్లు మనవి చెప్పారు. అనంతరం ఆలయం బయటకు వచ్చి భక్తులందరికీ వినపడేలా డప్పులతో మూడు మార్లు జాతర మహోత్సవ తేదీలను చాటింపు వేశారు. అమ్మవారి పండగకు భక్తులందరూ హాజరుకావాలని, ఈ నెల 17న తొలేళ్లు ఉత్సవం, 18న సిరిమానోత్సవం జరుగుతుందని చాటింపులో తెలిపారు. అమ్మవారి ఆశీస్సులు ప్రతి ఒక్కరూ పొందాలని కోరారు. కార్యక్రమంలో ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. ఫొటోరైటప్ 09విజెడ్‌జి 176 : ఉత్సవ చాటింపు వేస్తున్న దశ్యం