Quarterly net profit
-
టాటా సంస్థల త్రైమాసిక ఫలితాలు
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో టాటా టెక్నాలజీస్ నికర లాభం సుమారు రెండు శాతం తగ్గి రూ.157 కోట్లకు పరిమితమైంది. గత క్యూ2లో ఇది రూ.162 కోట్లు. సమీక్షాకాలంలో ఆదాయం రూ.1,269 కోట్ల నుంచి రూ.1,296 కోట్లకు పెరిగింది. మొత్తం వ్యయాలు రూ.1,086 కోట్ల నుంచి రూ.1,095 కోట్లకు పెరిగాయి. సీక్వెన్షియల్ ప్రాతిపదికన సర్వీసుల వ్యాపార విభాగం పుంజుకుందని, 2 శాతం ఆదాయ వృద్ధి నమోదు చేసిందని సంస్థ సీఈవో వారెన్ హ్యారిస్ తెలిపారు. ఆర్డర్ బుక్ పటిష్టంగా ఉందని, ప్రథమార్ధంతో పోలిస్తే ద్వితీయార్ధం మరింత మెరుగ్గా ఉండగలదని ఆయన వివరించారు. టాటా పవర్.. ఫర్వాలేదుటాటాపవర్ సెప్టెంబర్ త్రైమాసికంలో మెరుగైన పనితీరు చూపించింది. కన్సాలిడేటెడ్ నికర లాభం క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూస్తే 8 శాతం పెరిగి రూ.1,093 కోట్లకు చేరింది. క్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ.1,017 కోట్లుగా ఉంది. ఆదాయం స్వల్ప వృద్ధితో రూ.16,029 కోట్ల నుంచి రూ.16,211 కోట్లకు చేరింది. ‘ఉత్పత్తి, సరఫరా, పంపిణీ, రెన్యువబుల్ వ్యాపారం స్థిరమైన వృద్ధిని కొనసాగించాయి. అన్ని విభాగాలు చెప్పుకోతగ్గ మేర పనితీరు చూపించాయి. దీంతో వరుసగా 20వ త్రైమాసికంలోనూ నికర లాభాన్ని నమోదు చేశాం. భారత్‌లో తయారీ లక్ష్యానికి అనుగుణంగా తమిళనాడులో మేము చెపట్టిన 4.3 గిగావాట్ సెల్ అండ్ మాడ్యూల్ ప్లాంట్ ఏర్పాటులో భాగంగా.. 2 గిగావాట్ సెల్ తయారీ సెప్టెంబర్ క్వార్టర్లో మొదలైంది. వచ్చే నెల చివరికి పూర్తి స్థాయి సామర్థ్యానికి తయారీ పెరగనుంది’ అని టాటా పవర్ సీఈవో, ఎండీ ప్రవీర్ సిన్హా తెలిపారు.ఇదీ చదవండి: గూగుల్ ఆస్తులమ్మినా తీరని జరిమానా!పూర్తి ఆర్థిక సంవత్సరానికి 20,000 కోట్ల మూలధన వ్యయాల ప్రణాళిక ప్రకటించగా.. ఏప్రిల్–సెప్టెంబర్ కాలంలో రూ.9,100 కోట్లను వెచ్చించినట్లు తెలిపారు. విద్యుత్ సరఫరా, పునరుత్పాదక విద్యుత్ తయారీ, హైడ్రో ప్రాజెక్టులపై తాము చేస్తున్న పెట్టుబడులతో దేశ ఇంధన సామర్థ్యం బలోపేతం అవుతుందన్నారు. బీఎస్ఈలో టాటా పవర్ 1 శాతం లాభపడి రూ.445 వద్ద ముగిసింది. -
ఇండిగో భారీగా దూసుకుపోయింది
దేశీయ అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో, ఓనర్ ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ లిమిటెడ్ అంచనాలను బీట్ చేసింది. డిసెంబర్ త్రైమాసిక లాభాల్లో భారీగా ఎగిసింది. ఓ వైపు ఇంధన వ్యయాలు అధికంగా ఉన్నప్పటికీ కంపెనీ బడ్జెట్ ఎయిర్‌లైన్ ఇండిగో, లాభాల్లో 56.4 శాతం పైకి ఎగిసినట్టు స్టాక్ ఎక్చేంజ్ ఫైలింగ్‌లో ప్రకటించింది. విశ్లేషకుల అంచనాల ప్రకారం ఇండిగో కేవలం రూ.651 కోట్ల లాభాలను మాత్రమే ఆర్జిస్తుందని తెలిసింది. కానీ వీరి అంచనాలను ఇండిగో బీట్ చేసింది. కంపెనీ రెవెన్యూలు ఎక్కువగా అత్యధిక ఛార్జీలు, బలమైన రూపాయి, ప్రయాణికుల వృద్ధి నుంచి వచ్చినట్టు వెల్లడించింది. ప్రయాణికుల వృద్ధి 14 శాతం పెరుగగా.. రూపాయి ఏడాది ఏడాదికి 4 శాతం బలపడింది. ఏడాదిగా ఇండిగో సగటు విమాన ఛార్జీలు కూడా 10 శాతం పెరిగాయి. ఇవన్నీ ఇండిగోకు మంచి లాభాలను తెచ్చిపెట్టాయి. మరోవైపు జెట్ ఇంధన ధరలు గతేడాదితో పోలిస్తే 12.6 శాతం పెరిగినప్పటికీ, ఆ ప్రభావం కంపెనీ లాభాలపై ఎక్కువగా పడలేదు. రెవెన్యూలు 23.9 శాతం పెరిగి, రూ.6,178 కోట్లగా రికార్డయ్యాయి. అంచనా వేసిన రూ.6,022 కోట్ల ఇవి అత్యధికం. అంచనాలకు మించి ఫలితాలను ప్రకటించడంతో, ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ షేర్లు 5.5 శాతం మేర పైకి ఎగిశాయి. గత 12 నెలలుగా ఈ కంపెనీ స్టాక్ 31 శాతంపైగా పెరిగింది. కాగ, అక్టోబర్-డిసెంబర్ క్వార్టర్ విమానయాన సంస్థలకు సాధారణంగా చాలా మంచి కాలమని, ఈ సమయంలోనే సెలవులు ఎక్కువగా ఉంటాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. -
ఎయిర్టెల్ లాభం 39% డౌన్
న్యూఢిల్లీ: దేశీయ టెలికం రంగంలో పోటీ, అనిశ్చిత పరిస్థితుల ప్రభావం భారతీ ఎయిర్టెల్ డిసెంబర్ త్రైమాసికం ఫలితాలపైనా కొనసాగింది. కన్సాలిడేటెడ్ లాభం 39 శాతం మేర తగ్గి రూ.306 కోట్లకు పరిమితమైంది. అంతకుముందు ఏడాది ఇదే కాలంలో వచ్చిన లాభం రూ.504 కోట్లు కావడం గమనార్హం. ఆదాయం రూ.20,319 కోట్లుగా నమోదైంది. అంతకుముందు ఏడాది ఇదే కాలంలో వచ్చిన రూ.23,336 కోట్ల ఆదాయంతో పోల్చి చూస్తే 13 శాతం తగ్గిపోయింది. దేశీయ ఇంటర్ కనెక్షన్ వినియోగ చార్జీలను తగ్గిస్తూ ట్రాయ్ ఇచ్చిన ఆదేశాలతో సగటున ఓ వినియోగదారుడి నుంచి వచ్చే ఆదాయం మరింత తగ్గిపోయినట్టు భారతీ ఎయిర్టెల్ ఎండీ, సీఈవో (భారత్, దక్షిణాఫ్రికా) గోపాల్ విట్టల్ తెలిపారు. అంతర్జాతీయ టెర్మినేషన్ చార్జీలను తగ్గించాలన్న ఇటీవలి నిర్ణయం ఈ ఆదాయ క్షీణతను ఇంకా తీవ్రం చేస్తుందన్నారు. దీనివల్ల విదేశీ ఆపరేటర్లకే తప్ప వినియోగదారులకు మేలు జరగదని చెప్పారాయన. అయితే, కంపెనీ కస్టమర్ల సంఖ్య పెరగడం కాస్తంత ఆశాజనక విషయం. డిసెంబర్ క్వార్టర్ నాటికి 16 దేశాల్లో మొత్తం కస్టమర్ల సంఖ్య 39.42 కోట్లకు వృద్ధి చెందింది. అంతకుముందు ఏడాది ఇదే కాలంలో కస్టమర్ల సంఖ్య కంటే 9.2 శాతం పెరుగుదల చోటు చేసుకుంది. మొత్తం ఆదాయాల్లో దేశీయ ఆదాయాలు రూ.15,294 కోట్లుగా ఉన్నాయి. వార్షిక ప్రాతిపదికన చూస్తే 11.3 శాతం క్షీణించినట్టు. ఆఫ్రికా ఆదాయాలు మాత్రం 5.3 శాతం పెరిగాయి. కన్సాలిడేటెడ్‌గా చూస్తే కంపెనీ రుణాలు రూ.91,714 కోట్లుగా ఉన్నాయి. 2016 డిసెంబర్ క్వార్టర్లో ఉన్న రూ.91,480 కోట్ల కంటే అతి స్వల్పంగా పెరిగినట్టు తెలుస్తోంది. అనుబంధ కంపెనీల నుంచి డివిడెండ్ రూపేణా వచ్చిన ఆదాయాన్ని వాటాదారులకు అందించాలని కంపెనీ డైరెక్టర్ల బోర్డు నిర్ణయించింది. ఒక్కో షేరుకు రూ.2.84 చొప్పున మధ్యంతర డివిడెండ్‌కు సిఫారసు చేసింది. మార్కెట్లు ముగిసిన తర్వాత ఈ ఫలితాలు వెల్లడయ్యాయి. కాగా, బీఎస్ఈలో భారతీ ఎయిర్టెల్ స్టాక్ 1.17 శాతం నష్టపోయి గురువారం రూ.494.50 వద్ద క్లోజయింది. -
ఆంధ్రాబ్యాంక్ లాభం రెట్టింపు
103% వృద్ధితో రూ. 144 కోట్లు వ్యవసాయ రుణాల్లో ఎన్పీఏలు తగ్గడమే కారణం ఆంధ్రాబ్యాంక్ సీఎండీ రాజేంద్రన్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రభుత్వరంగ ఆంధ్రాబ్యాంక్ సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసిక నికర లాభంలో 103 శాతం వృద్ధిని నమోదు చేసింది. గతేడాది ఇదే కాలానికి రూ. 71 కోట్లుగా ఉన్న నికరలాభం ఈ ఏడాది రూ. 144 కోట్లకు చేరింది. ఇదే సమయంలో వడ్డీ ఆదాయం 15 శాతం పెరిగి రూ. 3,592 కోట్ల నుంచి రూ. 4,146 కోట్లుగా నమోదయ్యింది. వడ్డీ లాభదాయకత పెరగడంతో పాటు, తొలి త్రైమాసికంలో వ్యవసాయ రుణాల ఎన్పీఏల కోసం కేటాయించిన రూ. 392 కోట్ల ప్రొవిజనింగ్స్లో రూ. 75 కోట్లు వెనక్కి రావడం లాభాలు పెరగడానికి కారణంగా ఆంధ్రాబ్యాంక్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డెరైక్టర్ సి.వి.ఆర్.రాజేంద్రన్ తెలిపారు. రెండు రాష్ట్రాల్లో రుణ మాఫీపై స్పష్టత రావడంతో కొత్తగా ఎటువంటి ఎన్పీఏలు ఏర్పడలేదన్నారు. తెలంగాణ రాష్ట్రం ఇప్పటికే 25 శాతం నిధులను మంజూరు చేసిందని, త్వరలోనే ఆంధ్రప్రదేశ్ కూడా నిధులు విడుదల చేయనుండటంతో వచ్చే త్రైమాసికంలో రూ. 200 కోట్ల వడ్డీ ఆదాయం వెనక్కి వచ్చే అవకాశం ఉందన్నారు. ఇంకా ఇన్ఫ్రా, విద్యుత్, ఉక్కు రంగాల్లో ఇబ్బందులు ఉన్నప్పటికీ ఇప్పుడిప్పుడే పరిస్థితులు చక్కబడుతున్నాయని, దీంతో ఈ ఏడాది లక్ష్యంగా పెట్టుకున్న రూ. 900 కోట్ల నికర లాభాన్ని చేరుకోగలమన్న ధీమాను వ్యక్తం చేశారు. వడ్డీ లాభదాయకతను పెంచుకోవడంపై ప్రధానంగా దృష్టిసారిస్తున్నామని, ఇందుకోసం వచ్చే ఆరు నెలల్లో డిపాజిట్ల సేకరణ వ్యయాన్ని 0.25% తగ్గించి, రుణాలపై వడ్డీ ఆదాయాన్ని 0.3% పెంచే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ సమీక్షా కాలంలో మొత్తం వ్యాపారం 13 శాతం వృద్ధి చెంది రూ. 2.60 లక్షల కోట్లకు చేరుకుంది. స్వల్పంగా పెరిగిన నిరర్థక ఆస్తులు సమీక్షా కాలంలో నిరర్థక ఆస్తులు స్వల్పంగా పెరిగాయి. గతేడాది రూ. 5,187 కోట్లు (5.15%)గా ఉన్న స్థూల నిరర్థక ఆస్తులు ఈ ఏడాది రూ. 6,884 కోట్ల(5.99%)కు పెరిగాయి. ఇదే సమయంలో నికర నిరర్థక ఆస్తులు రూ.3,477 కోట్లు(3.54%) నుంచి రూ. 4,315 కోట్ల (3.86%)కు చేరాయి. ఈ ఏడాది వ్యాపార అవసరాల కోసం రూ. 800 కోట్ల మూలధనం అవసరమవుతుందని, దీన్ని కేంద్రం సమకూరుస్తుందని భావిస్తున్నట్లు రాజేంద్రన్ తెలిపారు. డిసెంబర్‌లోగా టైర్-1 బాండ్స్ ద్వారా గరిష్టంగా రూ.1,000 కోట్లు సమీకరించనున్నట్లు తెలిపారు. వైజాగ్‌లో రూ.5,000 కోట్ల రుణాలు తుపాన్ వల్ల దెబ్బతిన్న వైజాగ్ చుట్టుపక్కల సుమారు రూ.5,000 కోట్ల రుణాలను ఇచ్చినట్లు ఆంధ్రాబ్యాంక్ తెలిపింది. ఇందులో సుమారు రూ.1,800 కోట్లు వ్యవసాయ రుణాలు కాగా మిగిలినవి ఎస్ఎంఈ, ఇతర వ్యాపారాలకు సంబంధించినవన్నారు. ఈ రుణాల చెల్లింపులపై ఆర్బీఐతో సంప్రదింపులు జరిపి ఒక నిర్ణయం తీసుకోనున్నట్లు రాజేంద్రన్ తెలిపారు. -
డాక్టర్ రెడ్డీస్ లాభం జూమ్
తొలి త్రైమాసికంలో రూ.550 కోట్లు * ఉత్తర అమెరికా, కొత్త ఉత్పత్తులే * ఈ భారీ వృద్ధికి కారణం... * 24 శాతం వృద్ధితో 3,517 కోట్లకు చేరిన మొత్తం ఆదాయం హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: డాక్టర్ రెడ్డీస్ జూన్‌తో ముగిసిన తొలి త్రైమాసిక నికర లాభంలో 52 శాతం వృద్ధిని నమోదు చేసింది. 2012-13 తొలి త్రైమాసికంలో రూ. 361 కోట్లుగా ఉన్న నికరలాభం ఈ ఏడాది రూ. 550 కోట్లకు చేరింది. ఉత్తర అమెరికా, రష్యాల్లో అమ్మకాలకు తోడు గతేడాది కొత్తగా ప్రవేశపెట్టిన ఔషధాలు లాభాలు పెరగడానికి ప్రధాన కారణంగా డాక్టర్ రెడ్డీస్ సీఎఫ్‌వో సౌమెన్ చక్రవర్తి తెలిపారు. బుధవారం ఆర్థిక ఫలితాలు వెల్లడించడానికి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చక్రవర్తి మాట్లాడుతూ గతేడాది తొలి త్రైమాసికం తర్వాత ఉత్తర అమెరికా మార్కెట్లో అనేక కొత్త ఉత్పత్తులు ప్రవేశపెట్టడంతో లాభాల్లో భారీ వృద్ధి నమోదయ్యిందన్నారు. మొత్తం ఆదాయంలో 57 శాతం ఉత్తర అమెరికా నుంచే సమకూరుతుండగా, ఈ మూడు నెలల కాలంలో ఆదాయం 51 శాతం పెరిగి రూ. 1,087 కోట్ల నుంచి రూ. 1,646 కోట్లకు చేరింది. ఈ సమీక్షా కాలంలో కంపెనీ మొత్తం ఆదాయం 24 శాతం పెరిగి రూ. 2,844 కోట్ల నుంచి రూ. 3,517 కోట్లకు చేరింది. ఈ ఆర్థిక సంవత్సరంలో పరిశోధన, అభివృద్ధిపై గరిష్టంగా రూ.1,500 కోట్లు ఖర్చు చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా ఈ మూడు నెలల కాలంలో ఇప్పటి వరకు రూ. 390 కోట్లు వ్యయం చేసినట్లు చక్రవర్తి తెలిపారు. ప్రస్తుతం యూఎస్ఎఫ్డీఏ వద్ద కొత్త ఔషధాలకు సంబంధించి 70 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. ఎక్కువ అంచనా వేశాం... విదేశాల్లో మార్కెటింగ్ కోసం గ్లాస్కో స్మిత్‌క్లైన్ (జీఎస్కే)తో కుదుర్చుకున్న ఒప్పందంపై భారీగా అంచనాలు పెట్టుకున్నామని, కాని వాస్తవ రూపం దీనికి భిన్నంగా ఉందని డాక్టర్ రెడ్డీస్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ అభిజిత్ ముఖర్జీ వ్యాఖ్యానించారు. ఇండియా వెలుపల అభివృద్ధి చెందిన దేశాల్లో డాక్టర్ రెడ్డీస్‌కి చెందిన కొన్ని ఔషధాలను విక్రయించడానికి జీఎస్‌కేతో ఒప్పందం కుదుర్చుకోవడం తెలిసిందే. కాని ఈ డీల్ ద్వారా అనుకున్న విధంగా ఆదాయం పెరగలేదని ముఖర్జీ తెలిపారు. దేశీయంగా 14 శాతం వృద్ధి ఈ మూడు నెలల కాలంలో దేశీయ అమ్మకాల్లో 14 శాతం వృద్ధి నమోదయ్యింది. సమీక్షాకాలంలో రూ.349 కోట్లుగా ఉన్న అమ్మకాలు ఈ ఏడాది రూ. 400 కోట్లకు చేరాయి. కొన్ని బ్రాండ్స్‌పై అధికంగా దృష్టిసారించడంతో ఈ వృద్ధి సాధ్యమయ్యిందని, ఇందులో కొన్ని ఔషధాలు ఎన్ఎల్ఈఎం పోర్ట్‌ఫోలియోలో కూడా ఉన్నాయన్నారు. ఈ త్రైమాసికంలో కొత్తగా 4 ఉత్పత్తులను విడుదల చేయగా, 9 ఉత్పత్తులకు సంబంధించి యూఎస్ఎఫ్డీఏ వద్ద ఫైలింగ్ చేసినట్లు డాక్టర్ రెడ్డీస్ తెలిపింది.