Rabe Season
-
ఎలా కొనేది ?
మెదక్ జోన్: రైతుల నుంచి ధాన్యం సేకరిస్తున్న కొనుగోలు కేంద్రాలకు ప్రభుత్వం కమీషన్ విడుడల చేయడంలో మీనమేషాలు లెక్కిస్తోంది. దీంతో కేంద్రాల నిర్వహణ ప్రశ్నార్థకంగా మారుతోంది. ధాన్యం సేకరణ (కొనుగోలు)కు ఐకేపీ సంఘాలు ససేమీరా అంటున్నాయి. సాధారణంగా ధాన్యం సేకరణ ముగిసి రైతులకు చెల్లింపులు పూర్తి కాగానే కేంద్రాల నిర్వాహకులకు ప్రభుత్వం కమీషన్ మంజూరు చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే గతేడాది రబీ, ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లకు సంబంధించి కమీషన్ విడుదల చేయలేదు. ఇందుకు సంబంధించి కొనుగోలుదారులకు, రైతులకు చెల్లించే హమాలీ రూ.2.5 కోట్లు జిల్లాకు రావాల్సి ఉంది. ప్రస్తుతం మూడో సీజన్ కొనుగోలు కేంద్రాలు ప్రారంభమయ్యాయి. కమీషన్ రానిదే ఊరికే ఎందుకు చేయాలని నిర్వాహకులు ప్రశ్నిస్తున్నారు. రెండు సీజన్లుగా అందని కమీషన్... రైతుల నుంచి ధాన్యాన్ని కొనుగోలు చేసి పౌరసరఫరాల సంస్థకు అందించినందుకుగాను పీఏసీఎస్, ఐకేపీ కొనుగోలు కేంద్రాలకు ప్రభుత్వం క్వింటాలుకు రూ.2.50 చెల్లిస్తుంది. ఈ కమీషన్ నుంచే కేంద్రాలకు సంబంధించిన ధాన్యం సేకరణ ఖర్చులను వెచ్చిస్తారు. మిగిలిన డబ్బులను మహిళా సంఘాల సభ్యులు పంచుకుంటారు. సహకార సంఘాల్లో అయితే సంఘాల నిల్వలకు జమచేసుకుంటారు. గత రెండు సీజన్లకు సంబంధించి ప్రభుత్వం కమీషన్ చెల్లించలేదు. గత ఖరీఫ్‌లో జిల్లాలో పీఏసీఎస్ ద్వారా 130 కేంద్రాలు, ఐకేపీ ద్వారా 40 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం 170 కొనుగోలు కేంద్రాల ద్వారా 1.70 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. ఇందుకు సంబంధించి రైతులకు సుమారు రూ.300 కోట్లకు పైగా చెల్లించారు. ప్రభుత్వం నుంచి కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు రెండు సీజన్లకు సంబంధించి కమీషన్ రానందున సంఘాల సభ్యులు ఆందోళన చెందుతున్నారు. కొనుగోలు కేంద్రాలకు రూ.1.50 కోట్లు రావాల్సి ఉండగా, హమాలీ చార్జీ కింద రూ.కోటి రైతులకు రావాల్సి ఉంది. మొత్తంగా రూ.2.50 కోట్లు ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది. అధికారుల చొరవతో.. ఈఏడాది రబీసీజన్‌కు సంబంధించి ఎప్పటిలాగే ఐకేసీ, పీఏసీఎస్ సంఘాల ద్వారా ధాన్యం కొనుగోలు చేయాల్సి ఉండగా ఐకేసీ సంఘాల సభ్యులు తమకు రావాల్సిన కమీషన్ ఇచ్చేంతవరకు కొనుగోలు చేయలేమని ఖరాకండీగా తేల్చి చెప్పారు. ఇప్పటికే అనేక గ్రామాల్లో ధాన్యం దిగుబడులు వచ్చాయి. త్వరలో రావాల్సిన కమీషన్ ఇప్పిస్తాని.. కొనుగోలు తప్పకుండా చేయాల్సిందేనని జాయింట్ కలెక్టర్ నగేష్, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి సీతరామరావు వారిని ఒప్పించడంతో అతికష్టంమీద అంగీకరించారు. విడుదల కానీ హమాలీ చార్జీలు.. గత సంవత్సరం ఖరీఫ్, రబీ సీజన్‌కు సంబంధించి హమాలీ డబ్బులు రైతులకు రూ.కోటి రావాల్సి ఉంది. రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని బస్తాల్లో నింపి తూకం వేసి లారీల్లో లోడ్చేసినందుకు గాను హమాలీలకు రైతులు క్వింటాలు రూ.23 చొప్పున చెల్లిస్తున్నారు. ఇందుకు సంబంధించి చార్జీల్లో క్వింటాలుకు రూ.5 చొప్పున ప్రభుత్వం హమాలి కింద రైతులకు చెల్లించాలి. రెండు సీజన్లుగా సివిల్సప్లై సంస్థ హమాలీ చార్జీలను విడుదల చేయడం లేదు. దీంతో రైతుల నుంచి కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు పూర్తి చార్జీలను వసూలు చేస్తున్నారు. ప్రభుత్వం హమాలీ కోసం క్వింటాలుకు ఇచ్చే రూ.5 మినహాయించి మిగతా డబ్బులు మాత్రమే రైతుల నుంచి తీసుకోవాలి. కానీ ప్రభుత్వం సకాలంలో డబ్బులు విడుదల చేయకపోవడంతో చేసేదిలేక రైతుల నుంచే ముక్కుపిండి వసూలు చేస్తున్నారు. తాము ఇవ్వమని రైతులు నిరాకరిస్తే ధాన్యం తూకం వేయమని నిర్వాహకులు పేర్కొనడంతో గత్యంతరం లేక చెల్లిస్తున్నారు. మరికొన్ని చోట్ల అదనంగా క్వింటాలుకు రూ.25 వరకు వసూలు చేస్తున్నారు. ఫలితంగా రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సంఘాలకు కమీషన్‌తో పాటు హమాలీ చార్జీలను సకాలంలో విడుదల చేయాలని కొనుగోలు కేంద్రాల సంఘాలు, రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. -
నిరీక్షణే..!
సాక్షిప్రతినిధి, ఖమ్మం: పంట పెట్టుబడికి సాయం చేస్తామన్న సర్కారు సమయానికి ఆదుకోలేకపోయింది. పెట్టుబడి పైసలతో సాగు చేద్దామనుకున్న రైతులకు నిరాశనే మిగిల్చింది. రబీ సాగు సీజన్ పూర్తయినా పెట్టుబడి అందకపోవడంతో రైతులు కాసుల కోసం నిరీక్షించాల్సి వస్తోంది. రైతుబంధు సాయం ఎంతో కొంత ఆసరాగా ఉంటుందని అనేక మంది రైతులు భావించినా.. ఇంకా ఖాతాల్లో జమ కాకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. దీనిపై ఏ అధికారిని అడిగినా సరైన రీతిలో సమాధానం లభించకపోవడంతో డబ్బులు ఇంకెప్పుడొస్తాయా అని వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. వేలకు వేలు పెట్టుబడి పెట్టి యాసంగి సేద్యం చేసిన రైతులు మాత్రం సాగు నీరందక, ప్రకృతి సహకరించకపోవడం వంటి కారణాలతో నష్టాల ఊబిలోకి కూరుకుపోయారు. భూమినే నమ్ముకుని.. వ్యవసాయం చేస్తూ నష్టపోతున్న రైతులను ఆదుకుని.. వారికి పంట పెట్టుబడి సాయం అందించాలనే ఉద్దేశంతో 2018–19 ఆర్థిక సంవత్సరం నుంచి తెలంగాణ ప్రభుత్వం రైతుబంధు పథకాన్ని ప్రవేశపెట్టింది. పథకం కింద ఖరీఫ్ సీజన్‌కు రూ.4వేలు, రబీలో రూ.4వేల చొప్పున రైతులకు అందిస్తున్నారు. అయితే ఖరీఫ్‌లో మొదటిసారిగా ఈ పథకం కింద రైతులు డబ్బులు అందుకున్నారు. ఇక రెండో విడత రబీకి సంబంధించి మరికొంత మంది రైతులకు బ్యాంకుల్లో నగదు జమ కావాల్సి ఉంది. ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి 2,65,355 మంది రైతులకు రూ.259కోట్లు ఇవ్వాల్సి ఉండగా.. ఆ మొత్తాన్ని అందజేశారు. రబీలో నేరుగా బ్యాంకు ఖాతాల్లోనే.. ఖరీఫ్ సీజన్లో రైతుబంధు పథకం ప్రారంభం కాగా.. అప్పుడు రైతులకు చెక్కులను అందజేశారు. ఆ తర్వాత వాటిని రైతులు బ్యాంకులకు వెళ్లి మార్చుకున్నారు. అయితే రబీ సీజన్ గత ఏడాది అక్టోబర్‌లో ప్రారంభమైంది. ఆ తర్వాత రైతులకు రైతుబంధు పథకం కింద పంట పెట్టుబడి చెక్కులు అందజేసేందుకు ప్రభుత్వం పూనుకుంది. అయితే రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు ఉండటంతో ఎన్నికల సంఘం చెక్కుల రూపంలో కాకుండా.. నేరుగా బ్యాంకుల్లోనే నగదు జమ చేయాలని ఆదేశించింది. అప్పటి నుంచి అధికారులు రైతులకు బ్యాంకుల్లో నగదు నేరుగా జమ చేస్తున్నారు. అయితే రబీ సీజన్ పూర్తయినప్పటికీ ఇంకా కొందరికి బ్యాంకుల్లో నగదు జమ కాకపోవడం ఆందోళన కలిగిస్తోంది. అందరికీ వచ్చినా తమకు ఎందుకు నగదు రాలేదనే ఆలోచనతో వ్యవసాయ, రెవెన్యూ అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. 28,465 మందికి అందని రైతుబంధు.. రబీ సీజన్లో ఇంకా 28,465 మందికి రైతుబంధు నగదు అందాల్సి ఉంది. రైతుబంధుకు సంబంధించి రబీ సీజన్లో 2,51,759 మంది రైతులకు రూ.252కోట్లు అందాల్సి ఉంది. వీరందరికీ నగదు అందజేయాలని ప్రభుత్వం లెక్కలు సిద్ధం చేసింది. ఇప్పటివరకు 2,23,294 మంది రైతులకు రూ.226కోట్లను పంపిణీ చేశారు. రబీ సీజన్ ప్రారంభమైనప్పటి నుంచి దశలవారీగా రైతుల ఖాతాల్లో నగదు జమ అవుతూ వస్తోంది. ఇంకా 28,465 మంది రైతులకు రూ.26కోట్లు అందాల్సి ఉంది. ఈ నగదు కోసం రైతులు ఎదురుచూస్తున్నారు. రబీ సీజన్లో అప్పు తెచ్చుకుని పంటలు సాగు చేసుకున్నామని, పంట అమ్ముకునే సమయం వచ్చినా ఇంకా తమ ఖాతాల్లో రైతుబంధు నగదు జమ కాలేదని పలువురు రైతులు వాపోతున్నారు. అయితే వ్యవసాయాధికారులు మాత్రం నగదు దశలవారీగా రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నామని, ఇంకా రైతులకు ఇవ్వకపోవడానికి కారణమంటూ ఏమీ లేదని, ప్రభుత్వం విడుదల చేసిన నిధులకు అనుగుణంగా రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నామని పేర్కొంటున్నారు. రైతుబంధు రాలేదు.. ముదిగొండ మండలం మాదాపురం గ్రామానికి చెందిన కేతిరెడ్డి ఈశ్వరమ్మకు 3.28 ఎకరాల భూమి ఉంది. ఈమెకు ఖరీఫ్, రబీలో కూడా రైతుబంధుకు సంబంధించిన డబ్బులు రాలేదు. దీంతో భూమి ఉన్నప్పటికీ తనకు రైతుబంధు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తోంది. అధికారులను అడిగితే.. వస్తుందని చెబుతున్నారని, రెండో విడతలో వస్తుందని అన్నారని ఆమె పేర్కొంటోంది. అయితే ఇప్పటివరకు రాలేదని చెబుతోంది. -
ఆహారధాన్యాల ఉత్పత్తి 28 కోట్ల టన్నులు
సాక్షి, హైదరాబాద్: దేశంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి గణనీయంగా పెరిగింది. 2018–19 ఖరీఫ్, రబీ సీజన్ల ఉత్పత్తి రెండో ముందస్తు అంచనాల నివేదికను కేంద్ర వ్యవసాయశాఖ తాజాగా విడుదల చేసింది. దాని ప్రకారం 2017–18 ఆర్థిక సంవత్సరంలో ఆహారధాన్యాల ఉత్పత్తి 27.74 కోట్ల టన్నులు కాగా, 2018–19 ఆర్థిక సంవత్సరంలో ఏకంగా 28.13 కోట్ల టన్నులకు పెరిగింది. అంటే అంతకుముందు ఏడాది కంటే 3.88 కోట్ల టన్నులు అధికంగా ఉత్పత్తి కావడం గమనార్హం. అందులో కీలకమైన వరి 2017–18 ఖరీఫ్, రబీ సీజన్లలో 11.10 కోట్ల టన్నులు కాగా, 2018–19లో ఏకంగా 11.56 కోట్ల టన్నులకు చేరింది. ఏకంగా 45.9 లక్షల టన్నులు పెరగడం గమనార్హం. ఇక కీలకమైన పత్తి దిగుబడి మాత్రం పడిపోయింది. 2017–18లో 3.39 కోట్ల బేళ్ల పత్తి ఉత్పత్తి కాగా, 2018–19లో 3 కోట్ల బేళ్లకు పడిపోయింది. ఏకంగా 39 లక్షల బేళ్ల ఉత్పత్తి తగ్గినట్లు నివేదిక తెలిపింది. ఇక పప్పు ధాన్యాల ఉత్పత్తి మాత్రం స్వల్పంగా పెరిగింది. 2017–18 ఆర్థిక సంవత్సరంలో 2.39 కోట్ల టన్నులు ఉత్పత్తి కాగా, 2018–19 ఆర్థిక సంవత్సరంలో మాత్రం 2.40 కోట్ల టన్నులు ఉత్పత్తి అవుతుందని అంచనా వేసింది. నూనె గింజల ఉత్పత్తి 2017–18 ఆర్థిక సంవత్సరంలో 2.98 కోట్ల టన్నులు కాగా, 2018–19లో 3.15 కోట్ల టన్నులకు పెరుగుతుందని అంచనా వేసింది. రాష్ట్రంలో దిగుబడి ఢమాల్.. తెలంగాణలో పత్తి, పప్పుధాన్యాల ఉత్పత్తి గణనీయంగా పడిపోయింది. 2018–19 ఆర్థిక సంవత్సరంలో పత్తి 48.71 లక్షల బేళ్లు ఉత్పత్తి అయిందని తెలిపింది. 2017–18లో 51.95 లక్షల బేళ్లు ఉత్పత్తి కాగా ఈసారి 3.24 లక్షల బేళ్లు తగ్గింది. గతం కంటే ఈసారి సాగు తగ్గడం, 10 జిల్లాల్లో గులాబీ పురుగు కారణంగా దిగుబడి పడిపోయింది. ఇదిలా ఉండగా పప్పుధాన్యాల ఉత్పత్తి కూడా గణనీయంగా తగ్గింది. 2017–18 సంవత్సరంలో 5.15 లక్షల టన్నులు ఉత్పత్తి కాగా, ఈ ఏడాది 3.85 లక్షల టన్నుల మేర ఉత్పత్తి అయింది. ఖరీఫ్‌లో పప్పు ధాన్యాల ఉత్పత్తి 2.58 లక్షల మెట్రిక్ టన్నులు రాగా రబీలో 3.85 లక్షల టన్నులు ఉత్పత్తి కానున్నట్లు తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి పంపిన నివేదికలో పేర్కొంది. ఇక 2018–19 ఖరీఫ్‌లో వరి ఉత్పత్తి 20 ఏళ్ల రికార్డును బ్రేక్ చేసింది. వరి ధాన్యం ఉత్పత్తి ఖరీఫ్‌లో ఏకంగా 61 లక్షల మెట్రిక్ టన్నులు వచ్చినట్లు అంచనా వేశారు. ఇరవై ఏళ్లలో ఇంతటి స్థాయి ఉత్పత్తి ఎన్నడూ రాలేదని అధికారులు కేంద్రానికి నివేదించారు. ఇక ఈ రబీలో 34.25 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి వస్తుందని అంచనా వేశారు. -
దా‘రుణం’..!
నల్లగొండ అగ్రికల్చర్ : లక్ష్యం కొండంత..ఇచ్చింది గోరంత.. ఇదీ రబీ పంట రుణాల తీరు. శాసనసభ ఎన్నికల ముందు అధికార, ప్రతిపక్ష పార్టీల హామీల పుణ్యమా అని అన్నదాతలకు పంటరుణాలు ఇచ్చేందుకు బ్యాంకర్లు ఆసక్తి చూపలేదు. అసలు బ్యాంకుల చెంతకు అన్నదాతలను చేరనివ్వని పరిస్థితి. పంటరుణం కోసం బ్యాంకుల వద్దకు వెళ్తే ఖరీఫ్‌లో తీసుకున్న రుణం వడ్డీతో సహా చెల్లించి కొత్త రుణం అడగాలని అధికారులు తిరకాసు పెట్టారు. దీంతో ఇదేమి గోల అనుకుని రైతులు వాటివైపు కన్నెత్తిచూడలేదు. జిల్లాలో గత ఖరీఫ్‌లో పంట రుణలక్ష్యం రూ.1,253.93 కోట్లు కాగా, బ్యాంకులు రైతులకు పంట రుణం ఇచ్చింది కేవలం రూ.698.22 కోట్లు. అంటే 55.68 శాతం మాత్రమే రైతులు పంటరుణాలను అందుకున్నారు. అదే విధంగా ఈ రబీలో రుణలక్ష్యం రూ.835.95 కోట్లుగా నిర్దేశించగా, రైతులకు సీజన్ ముగిసినప్పటికీ ఇచ్చింది కేవలం రూ.138.32 కోట్లు. అంటే 16.55 శాతం మాత్రమే పంటరుణాలను ఇచ్చారంటే బ్యాంకులకు రైతులపై ఏమాత్రం చిత్తుశుద్ధి ఉందో అర్థం చేసుకోవచ్చు. ఎన్నికల హామీ ఎఫెక్టేనా? శాసనసభ ఎన్నికల ముందు అధికార టీఆర్ఎస్ పార్టీ లక్ష వరకు రైతుల రుణాలను మాఫీ చేస్తామని, మరోవైపు ప్రతిపక్ష కూటమి రూ.2లక్షల వరకు మాఫీ చేస్తామని ఇచ్చిన హామీల ఎఫెక్ట్ రబీ పంట రుణాలపై స్పష్టంగా కనిపించింది. రుణమాఫీని ఎప్పటినుంచి పరిగణనలోకి తీసుకుంటారో స్పష్టం చేయకపోవడంతో బ్యాంకులు రబీ రుణాలను ఇవ్వాలంటే ఆలోచనలో పడ్డాయి. ఇచ్చినవాటిని ఎప్పుడు ప్రభుత్వం చెల్లిస్తుందోనని, మళ్లీ రుణాలిచ్చి ఎందుకు ఇబ్బందులు పడాలన్న ముందుజాగ్రత్తగా బ్యాంకర్లు రబీ రుణాలను ఇవ్వకుండా బ్రేక్ వేసినట్లు సమాచారం. ఎవరైనా రైతులు బ్యాంకులకు రుణం కోసం వెళ్తే ఖరీఫ్ రుణాలను చెల్లించాలని ఒత్తిడి తేవడంతో వారు అటువైపు వెళ్లలేదు. పెట్టుబడుల కోసం తిప్పలు రైతులు రబీ పెట్టుబడుల కోసం నానా తిప్పలు పడాల్సి వచ్చింది. బ్యాంకుల వారు దరిచేరనియకపోవడంతో విధిలేని పరిస్థితుల్లో వడ్డీ వ్యాపారులను ఆశ్రయించారు. అధిక వడ్డీలకు అప్పులు తెచ్చుకోవాల్సి వచ్చింది. అప్పులు పుట్టని రైతులైతే బంగారు ఆభరణాలను కుదవపెట్టి నగదు తెచ్చుకుని రబీ పంటలను సాగు చేసుకున్నారు. ఇంతటి దారుణమైన పరిస్థితులు ఎన్నడూ రాలేదని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రబీ పంటల సాగు ఇలా రబీ సీజన్లో సాధారణ సాగు విస్తీర్ణం 76,531 హెక్లార్లు కాగా, ఇప్పటివరకు 47,674 హెక్టార్లలో రైతులు వివిధ పంటలు సాగు చేశారు. వరి 45,603 హెక్టార్లు, జొన్న 10, మొక్కజొన్న 19, పెసర 60, మినుము 35, ఉలువలు 53, శనగలు 141, వేరుశనగ 1753 హెక్టార్లు సాగు చేశారు. -
రబీకి సమాయత్తం
సాక్షి, రంగారెడ్డి జిల్లా: రబీ సాగుకు వ్యవసాయ శాఖ విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. సబ్సిడీ విత్తనాలు, ఎరువు లను రైతులకు అందుబాటులోకి తెచ్చేందుకు సమాయత్తమవుతోంది. ఈ సీజన్లో 29వేల హెక్టార్లలో వివిధ పంటలు సాగవుతాయని అంచనా వేసింది. సాధారణంగా రబీలో ఎక్కువగా శనగ, వేరుశనగ, వరి, మొక్కజొన్న పంటలు సాగవుతాయి. సుమారు 11 వేల క్వింటాళ్ల విత్తనాలు అవసరమవుతాయని లెక్కతేల్చారు. ఇప్పటివరకు శనగ, వేరుశనగ విత్తనాలు కొంతమేర మండల స్థాయిలో అందుబాటులో ఉంచారు. మిగతా పంటలతో పోల్చితే ఈ రెండు పంటలు సీజన్ ఆరంభంలోనే సాగుచేస్తారు. ఆ తర్వాతే వరి తదితర పంటలు సాగవుతాయి. విత్తన సబ్సిడీ ఖరారు.. ఆయా విత్తనాలపై సబ్సిడీ ఖరారైంది. శనగ విత్తనాలను 50 శాతం సబ్సిడీపై రైతులు కొనుగోలు చేయవచ్చు. క్వింటా శనగ విత్తనాల ధర రూ.6,500. ఇందులో సబ్సిడీపోను (రూ.3,250) మిగిలిన మొత్తాన్ని రైతు వాటాగా చెల్లించాల్సి ఉంటుంది. వేరుశనగ క్వింటా ధర రూ.6,400గా నిర్ణయించారు. రైతులకు 35 శాతం రాయితీపై వీటిని విక్రయిస్తారు. ఇక వరి ధాన్యం రకాన్ని బట్టి ధరలో స్వల్ప మార్పులు ఉన్నాయి. ధరతో సంబంధం లేకుండా క్వింటాపై రూ.500 రాయితీ పొందవచ్చు. విత్తనాలు అవసరం ఉన్న రైతులు స్థానిక వ్యవసాయ విస్తరణాధికారులను ఆధార్ కార్డు, పట్టాదారు పాస్‌పుస్తకం తీసుకుని కలవాలి. రైతులకు కావాల్సిన విత్తన రకం, పరిమాణాన్ని అతను ఆన్లైన్లో నమోదు చేస్తారు. విత్తనాలు అందుబాటులో ఉన్న పీఏసీఎస్, డీసీఎంస్, ఆగ్రోస్ కేంద్రాలు, అగ్రి సేవా కేంద్రాల్లో రైతులు పొందవచ్చు. సబ్సిడీపై విత్తనాలు కావాలంటే తప్పనిసరిగా ఆధార్ కార్డు, పట్టాదారు కా>ర్డు ఉండాల్సిందేనని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఆధార్ ఉంటేనే సబ్సిడీపై ఎరువులు రబీ ప్రారంభంలో అవసరమయ్యే మేరకు ఎరువులు కూడా సిద్ధంగా ఉన్నాయి. ఈ సీజన్లో వివిధ రకాల 24,580 మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరమని అంచనా. ఇందులో ఇప్పటి వరకు 17 వేల మెట్రిక్ టన్నులకు పైగా అన్ని పీఏసీఎస్, డీసీఎంఎస్, మన గ్రోమోర్ కేంద్రాలు, లైసెన్స్డ్ ప్రైవేటు డీలర్ల వద్ద అందుబాటులో ఉంచినట్లు అధికారులు తెలిపారు. వీటిని ఈ–పాస్ విధానంలోనే విక్రయిస్తారు. పట్టాదారు పాస్ పుస్తకం, ఆధార్ కార్డు తీసుకెళ్తేనే సబ్సిడీపై ఎరువులు విక్రయిస్తారు. ప్రతి డీలర్ తమ వద్ద అందుబాటులో ఉన్న ఎరువుల ధరలు తప్పనిసరిగా రైతులకు స్పష్టంగా కనిపించేలా ప్రదర్శించాల్సి ఉంటుంది. విస్తృత చర్యలు రబీలో రైతులు పంటలు సాగు చేసేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటికే ఆయా రకాల విత్తనాలు, ఎరువులను క్షేత్రస్థాయిలోకి పంపించాం. ఎటువంటి కొరతా లేదు. ఎక్కడైనా తక్కువ పడితే అప్పటికప్పుడు రైతులకు సమకూర్చేలా చర్యలు తీసుకుంటాం. రోజువారీగా జరుగుతున్న విక్రయాలపై సమీక్షిస్తున్నాం. ఏమైనా ఇబ్బందులు ఉంటే స్థానిక ఏఈఓ లేదా మండల వ్యవసాయ అధికారి దృష్టికి తీసుకెళ్లాలి. – గీతారెడ్డి, జిల్లా వ్యవసాయ శాఖాధికారిణి -
వరి కోతలు షురూ..
సాక్షి, మెదక్‌జోన్ : జిల్లా వ్యాప్తంగా వరి కోతలు ప్రారంభమయ్యాయి. ఈ ఏడాది సరైన వర్షాలు లేక భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. ఫలితంగా పంటలు సగం మేర ఎండిపోయాయి. గతేడాదితో పోల్చుకుంటే దిగుబడి భారీగా తగ్గే అవకాశం ఉంది. చేతికందిన కొద్దిపాటి ధాన్యం విక్రయించేందుకు కొనుగోలు కేంద్రాలను ఎప్పుడు ఏర్పాటు చేస్తారోనని రైతులు ఎదురుచూస్తున్నారు. ఖరీఫ్ సీజన్లో జిల్లా వ్యాప్తంగా సాధారణ వరిపంట సాగు 38,068 హెక్టార్లుకాగా వర్షాబావ పరిస్థితుల కారణంగా 36,165 హెక్టార్ల మేర పంటలను సాగు చేశారు. సకాలంలో వర్షాలు కురవకపోవడంతో 40శాతం పంటలు ఎండిపోయియి. మిగిలిన 60 శాతం పంట ద్వారా కేవలం 95వేల క్వింటాళ్లు మాత్రమే దిగుబడి వచ్చేఅవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. గత ఏడాది ఖరీఫ్ సీజన్లో సాధారణ వరి సాగు 36,165 హెక్టార్లుకాగా 42,150 హెక్టార్లలో సాగు చేశారు. పంటలు సంవృద్ధిగా పండాయి. దీంతో 1.60 లక్షల మెట్రిక్‌టన్నుల దిగుబడి వచ్చింది. ఈలెక్కన గతేడాదితో పోల్చితే 65వేల మెట్రిక్‌టన్నుల దిగుబడి తక్కువగా వచ్చే పరిస్థితి నెలకొంది. వేలాది రైపాయల అప్పులు చేసిపంటలను సాగుచేస్తె నీటితడులు అందక పంటలు ఎండిపోయి అప్పులుగా మిగిలాయి. అడపాదడప పండిన పంటలను సకాలంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తేనే రైతుకు కాస్త ఊరట లభిస్తోంది. లేనిచో దళారులను ఆశ్రయించి మరింత నష్టపోయే పరిస్థితి ఉంది. మక్కలు దళారులపాలు... జిల్లాలో ఇప్పటికే 80శాతం మక్క పంట రైతులకు చేతికందింది. కానీ ప్రభుత్వం ఇప్పటి వరకు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయక పోవటంతో మధ్యదళారులను ఆశ్రయించి తీవ్రంగా నష్టపోయారు. ప్రభుత్వం క్వింటాల్ రూ. 1700 ప్రకటించగా దళారులు రూ.1,400 చొప్పున కొనుగోలు చేస్తున్నారు. మక్కల విక్రయాలు ప్రారంభమై 20 రోజులు కావస్తోంది. కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతులకు ఆదుకోవల్సిన అధికారులు పట్టించుకున్న పాపాన పోవడం లేదు. వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటులోనూ జాప్యం జరిగితే వరి రైతులు కూడా నష్టపోయే అవకాశం ఉంది. కొనుగోలు కేంద్రాలను అధికారులు వెంటనే ప్రారంభించి రైతులను ఆదుకోవాలని వారు కోరతున్నారు. 20 వ తేదీన ప్రారంభిస్తాం.. అఈ విషయంపై డీసీఓ వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు కేంద్రాలను 20వ తేదీ నంచి ప్రారంభిస్తామన్నారు. జిల్లా వ్యాప్తంగా 190 సెంటర్లను ఏర్పాటు చేసి ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని తెలిపారు. గతేడాది 170 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి 1.60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామన్నారు. రూ. 453 కోట్లను పంపిణీ చేశాం. చేయటం జరిగింది. ఈయేడు ఖరీఫ్‌లో మరో 20 అధనంగా కొనుగోళ్లు కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు సన్నాహకాలు చేస్తున్నామన్నారు. గతేడాదితో పోల్చితే దిగుబడి భారీగా తగ్గే పరిస్థితి జిల్లాలో ఉందన్నారు. అలాగే ఈనెల 10 నుంచి మక్క కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తామన్నారు. మక్కలు తక్కువగా ఉన్నందున 6 కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు. మెదక్, రామాయంపేట, చేగుంట, నర్సాపూర్, శివ్వంపేట, వెల్దుర్తి మండలాల్లో ఏర్పాటు చేస్తామాన్నరు. అవసరాన్ని బట్టి మరో రెండు కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. -
ఖాతాల తిప్పలు!
మహబూబ్‌నగర్ రూరల్: రైతులకు పెట్టుబడి సాయం కోసం ఆర్థిక సాయం అందించే రైతుబంధు పథకానికి ఖాతాల చిక్కొచ్చి పడింది. ప్రభుత్వం గత ఖరీఫ్‌లో పెట్టుబడి సాయాన్ని చెక్కుల రూపంలో అందజేసిన విషయం విదితమే. ఈ మేరకు రానున్న రబీలో కూడా అందజేయాలని భావించగా... కేంద్ర ఎన్నికల సంఘం ఖాతాల్లో జమ చేసేందుకు మాత్రమే అంగీకరించింది. దీంతో పథకానికి సంబంధించి ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. అయితే రైతుల బ్యాంకు ఖాతాలను గుర్తించే విషయంలో అధికారుల పని ముందుకు సాగ డం లేదు. ఈ నిబంధనను అధిగమించేందుకు మనుగడలో ఉన్న ఖాతాల వివరాలు సేకరించేందుకు వ్యవసాయ శాఖ ఉద్యోగులు బుధవారం నుంచి మరోసారి రైతు ల ఇళ్ల తలుపు తట్టనున్నారు. కొనసాగుతున్నాయా? రైతుబంధు చెల్లింపుల్లో ఖాతాల విషయం అధికారులను ఇబ్బంది పెడుతోంది. ఎన్నికల వేళ రైతుబంధు పథకంపై సందిగ్ధం నెలకొనగా.. చివరకు ఎన్నికల సంఘం గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడం తెలిసిందే. పథకం కొనసాగింపునకు అడ్డు చెప్పనప్పటికీరైతులకు చెక్కుల రూపంలో కాకుండా ఆన్లైన్ చెల్లింపులు చేయాలని ఎన్నికల సంఘం షరతు విధించింది. రైతుబంధు పథకాన్ని రెండో విడత ప్రారంభించేందుకు ఇప్పటికే చెక్కులు సిద్ధం చేసుకున్న వ్యవసాయ శాఖ అధికారులు ఎన్నికల సం ఘం ఆదేశంతో బ్యాంకు ఖాతాలపై దృష్టి సారించా రు. కాగా బ్యాంక్ ఖాతాల్లో నాన్ ఆపరేటింగ్ సమ స్య ప్రస్తుతం అధికారులకు అడ్డంకిగా మారింది. 3,40,674 మంది పట్టాదారులు జిల్లాలో రైతుబంధు పథకం కింద ప్రభుత్వం 3,40,674 మంది పట్టాదారులు ఉండగా రూ.305 కోట్లు చెల్లించనుంది. దీనికోసం జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు 2.92 లక్షల చెక్కులు తయారు చేసి పంపిణీకి సిద్ధంగా పెట్టుకున్నారు. ఇదే సమ యంలో ఎన్నికల కమిషన్ నుంచి ఆదేశాలు రావ డంతో చెక్కులకు బదులు ఆన్లైన్లో చెల్లించేందుకు బ్యాంకు ఖాతాల పరిశీలన చేపట్టారు. ముం దుగా ప్రకటించిన లబ్ధిదారులు, నగదులో మార్పు లేకున్నా బ్యాంక్ ఖాతాలే సమస్యగా మారింది. ఏడాది క్రితం రైతు సమగ్ర సర్వే, రైతుబంధు పథకం అమలుల్లో భాగంగా అధికారులు రైతుల బ్యాం కు ఖాతాలు సేకరించారు. ఆ సమయంలోనే రైతు పేరు, భూమి విస్తీర్ణం, బ్యాంక్ ఖాతా, ఐఎఫ్ఎస్సీ కోడ్ తదితర వివరాలను నమోదు చేశారు. కానీ బ్యాంక్ ఖాతాలు తీసి ఏడాది గడిచినందున ఆ ఖాతాలు కొనసాగుతున్నాయా, లేదా అనేది గుర్తించడం సమస్యగా మారింది. చాలామంది రైతులు ఖాతా నుంచి లావాదేవీలు నిర్వహించకపోవడం తో, బ్యాంకు నిబంధనల ప్రకారం అవి నాన్ ఆపరేటింగ్ కిందకు వెళ్లనున్నాయి. ఫలితంగా ఆన్లైన్లో డబ్బులు వేయడం, తీసుకోవడం కుదరదు. అలాంటి సమయంలో సదరు రైతు మరో ఖాతాను తీయాల్సి ఉంటుంది. ఇలా ఒక్కో రైతు ఖాతాను పరిశీలించాల్సి రావడంతో చెల్లింపుల్లో జాప్యం చో టు చేసుకునే అవకాశం కనిపిస్తుంది. కాగా ఖరీఫ్ సీజన్‌కు గాను ప్రభుత్వం రూ.355.21 కోట్ల పెట్టుబడి సాయం విడుదల చేసింది. అందులో రూ.305 కోట్ల విలువైన చెక్కులను అధికారులకు రైతులకు పంపిణీ చేశారు. రైతుల ఇళ్ల వద్దకు అధికారులు రైతుబంధు పథకం అమలులో వ్యవసాయశాఖ అధికారులు కొత్త విధానాన్ని అవలంభించనున్నారు. ప్రస్తుతం రబీ సీజన్లో రైతుల బ్యాంక్ ఖాతాల వివరాలు సేకరించేందుకు అధికారులు రైతుల ఇళ్లకు వెళ్లనున్నారు. చెక్కుల రూపంలో వ్యవసాయానికి పెట్టుబడి సాయం చేయొద్దని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేస్తూ నేరుగా రైతుల బ్యాంక్ ఖాతాల్లోనే పెట్టుబడి సాయాన్ని జమ చేయాలని మార్గదర్శకాలు జారీ చేసింది. దీంతో ప్రభుత్వం రైతుబంధు అమలుకు ప్రత్యామ్నాయ చర్యల్లో నిమగ్నమైంది. నేరుగా రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయడంలో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని గుర్తించిన ప్రభుత్వం సమస్యల పరిష్కారంపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా అధికారుల వద్ద రైతుల బ్యాంక్ ఖాతా వివరాలు మరోసారి పరిశీలించాల ని ఆదేశించింది. ఈ క్రమంలో వ్యవసాయ శాఖ అధికారులు రైతుల ఇళ్ల వద్దకు వెళ్లి మరోసారి బ్యాంకు ఖాతాల నంబర్లు, బ్రాంచ్, ఐఎఫ్ఎస్ కోడ్ తదితర వివరాలు సేకరించనున్నారు. ఈ కార్యక్రమానికి బుధవారం నుంచి శ్రీకారం చుట్టనున్నారు. వాడకంలో ఉన్న బ్యాంకు ఖాతా నంబర్లనే ఇవ్వాలని రైతులను అధికారులు ఈ సందర్భంగా కోరనున్నారు. ఖరీఫ్ సీజన్లో లబ్ధి పొందిన రైతులకే రైతుబం«ధు పథకం వర్తించనుండగా.. వారి నుంచే అధికారులు బ్యాంక్ ఖాతాలు సేకరిస్తారు. ఈనెల 10 నుంచి 25వ తేదీ వరకు ఏఈఓలు రైతు ల బ్యాంకు ఖాతా వివరాలను సేకరించనున్నారని జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. ఇది లా ఉండగా రబీ సీజన్ కోసం రైతుబంధు పథకం జిల్లాలోని 26 మండలాలకు చెందిన రైతులకు పంపిణీ చేసేందుకు వచ్చిన 2.92 లక్షల చెక్కులను జిల్లా ట్రెజరీ కార్యాలయంలోని స్ట్రాంగ్ రూంలో భద్ర పరచాలని కలెక్టర్ రొనాల్డ్ రోస్ వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించినట్లు తెలిసింది. -
రైస్మిల్లర్లపై ఒత్తిడి
► సెప్టెంబర్ 15లోగా కస్టం మిల్లింగ్ పూర్తి చేయాలి ► ఇప్పటి వరకు 60,872 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని అప్పగించిన మిల్లర్లు ఇందూరు(నిజామాబాద్ అర్బన్): రబీ సీజన్లో జిల్లా వ్యాప్తంగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి 3 లక్షల 55వేల మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని సేకరించింది జిల్లా యంత్రాంగం. అయితే ఈ మొత్తం ధాన్యాన్ని కస్టం మిల్లింగ్ (సీఎంఆర్) చేసివ్వడానికి 65 రైస్ మిల్లర్లకు బాధ్యతలు అప్పగించారు. ప్రతిఏడాది ధాన్యాన్ని తీసుకున్న రైస్‌మిల్లర్లు జిల్లా యంత్రాంగం విధించిన గడువు తేదీలోగా ఇవ్వకపోవడం సర్వసాధారణంగా మారింది. ధాన్యాన్ని ఎగ్గొట్టి పక్కదారి పట్టించిన దాఖలాలు ఉండడంతో ఆ రైస్‌మిల్లర్లకు జరిమానాలు, కేసులు నమోదు చేసిన సందర్భాలున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం అలా జరగకుండా ఉండేందుకు జిల్లా ఉన్నతాధికారులు చర్యలు తీసుకుంటున్నారు. మొత్తం 65 రైస్‌మిల్లర్లకు కలిపి ధాన్యాన్ని కస్టం మిల్లింగ్ చేసి 2 లక్షల 41,400 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని సెప్టెంబర్ 15వ తేదీలోగా ఎఫ్‌సీఐకి ఇవ్వాల్సి ఉంది. నేటి వరకు కేవలం 60,872 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని (25శాతం) మాత్రమే రైస్‌మిల్లర్లు ఇచ్చారు. ఇంకా లక్షా 80వేల మెట్రిక్ టన్నుల బియ్యం రావాల్సి ఉంది. అయితే సీఎంఆర్ చేసివ్వడానికి విధించిన గడువుకు ఇంకా 14 వారాలు మాత్రమే మిగిలి ఉంది. ఈ క్రమంలో సీఎంఆర్‌ను వేగవంతం చేయడానికి అధికారులు రైస్మిల్లర్లపై ఒత్తిడిని తీవ్రతరం చేశారు. వారానికి ఇంత మొత్తం ధాన్యం సీఎంఆర్ చేసి ఇవ్వాలని రైస్ మిల్లర్ల వారీగా లక్ష్యాలను విధించారు. ప్రతివారం రైస్‌మిల్లర్లు ఇస్తున్న ధాన్యంపై సివిల్ సప్లయి అధికారులే కాకుండా జాయింట్ కలెక్టర్ రవీందర్ రెడ్డి కూడా సమీక్షించనున్నారు. వారానికి ఇచ్చిన లక్ష్యాన్ని పూర్తిచేయని రైస్ మిల్లర్లపై ఒత్తిడిని మరింత తీవ్రతరం చేయడం, లేదంటే చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సీఎంఆర్ ఇవ్వడంలో వెనుకబడి ఉన్న రైస్మిల్లర్లపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నారు. రైతులకు రూ. 536 కోట్లు చెల్లింపులు జిల్లా వ్యాప్తంగా ఐకేపీ, పీఏసీఎస్, మెప్మా ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి 3 లక్షల 55వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించారు. అయితే ఈ మొత్తం ధాన్యం విలువ రూ. 536 కోట్లు కాగా నేటి వరకు రూ. 530 కోట్లు రైతులకు చెల్లింపులు జరిగాయి. ఇంకా రూ. 6 కోట్ల వరకు రైతులకు డబ్బులు చెల్లించాల్సి ఉండగా వీటిని కూడా రెండు మూడు రోజుల్లో చెల్లించడానికి చర్యలు చేపట్టారు. -
కూరగాయాలే!
అమాంతం పెరిగిన ధరలు ►5 రోజుల్లోనే రెండు రెట్లు.. ►నషాళానికి అంటిన పచ్చిమిర్చి రేటు ►చేదెక్కిన కాకరకాయ ►దిగిరానంటున్న టమాటా ►దిగుబడి తగ్గడమే ప్రధాన కారణం కూరగాయల ధరలు ఆకాశంలో నక్షత్రాల సరసన చేరాయి. టమాటా ధర వింటేనే మాడు పగులుతోంది. పచ్చిమిర్చి ధర వినగానే ఘాటెక్కుతోంది. గోకర, బీరకాయ, బీన్స్ ఇలా ఏ కూరగాయల ధరలు చూసినా సామాన్యులకు అందేస్థితిలో లేవు. కేవలం 15 రోజుల్లోనే వీటి ధరలు రెండింతలు పెరగడంతో చాలా కుటుంబాల్లో పచ్చడి మెతుకులే గతవుతున్నాయి. చేవెళ్ల / కడ్తాల్ :ప్రస్తుతం పంటలు వేసే సీజన్ కావటంతో కూరగాయల దిగుబడులు తక్కువయ్యాయి. దీంతో మార్కెట్లో ధరలు మండిపోతున్నాయి. సామాన్య ప్రజలకు అవి చుక్కలు చూపిస్తున్నాయి. హైదరాబాద్‌కు సమీపంలో ఉన్న జిల్లాలోని పరిసర ప్రాంతాలతో పాటు చేవెళ్లలో ఎక్కువ మంది రైతులు కూరగాయలు పండిస్తుంటారు. జిల్లాలో వేల హెక్టార్లలో కూరగాయల సాగు చేస్తుంటారు. అయితే రబీ సీజన్లో వేసిన పంటల దిగుబడులు తగ్గుముఖం పట్టాయి. ఖరీఫ్ సీజన్ ప్రారంభం కావటంతో ప్రస్తుతం రైతులు పంటలు వేసే పనిలో పడ్డారు. దీంతో దిగుబడులు లేక ఉన్న కూరగాయలకు ధరలు అమాంతం పెరిగిపోయాయి. ప్రస్తుతం ఏ కూరగాయలు కొనాలన్నా కిలో 40 రూపాయలకు పైమాటే. ఎక్కువగా మిర్చి ధర ఘాటెక్కిస్తుంది. కూరగాయలన్నింటిలో అధికంగా కిలో రూ.100రూపాయలు వరకు పలుకుతుంది. ఈ ధరలతో కొనకముందే మిర్చి ఘాటేక్కిస్తుందని అంటున్నారు. పదిహేను రోజుల కిత్రం ధరలతో చూస్తే ఇప్పుడు ధరలు రెట్టింపుగా కనిపిస్తున్నాయి.