Rafel war airforce
-
వాయుసేన అమ్ములపొదిలోకి రాఫెల్ యుద్ద విమానాలు
సాక్షి, న్యూఢిల్లీ: త్వరలోనే భారత వాయు సేన మరింత పటిష్టం కానుంది. నాలుగు రాఫెల్ యుద్ద విమానాలు వాయుసేన అమ్ములపొదిలో చేరనున్నాయి. ఇప్పటికే ఈ యుద్దవియానాలు భారత్ చేరుకోవలసి ఉండగా కరోనా కారణంగా ఆలస్యం అయ్యింది. ఇవి జూలై నెల చివరి నాటికి భారత్ చేతికి దక్కనున్నాయి. అయితే దీనికి సంబంధించిన తేదీని ఇంకా ఖరారు చేయలేదు. ఫ్రాన్స్ ఈ యుద్ద విమానాలను భారత్‌కు అందించనుంది. మొదట మే నెలలో ఈ యుద్ద విమానాలు మన దేశానికి చేరుకోవలసి ఉండగా కరోనా కారణంగా చేరుకోలేకపోయాయి. (ఎంజాయ్ చేసేందుకు ఇక్కడకు రావొద్దు: సీఎం) ఈ విమానాల కొనుగోలులో కీలకపాత్ర పోషించిన ఎయిర్‌ఫోర్స్ చీఫ్ ఆర్కేఎస్ బదౌరియా గౌరవార్థం ఈ యుద్దవిమానాలకు టైల్ నెంబర్ ఆర్బీ సిరీస్‌ను ఇవ్వనున్నారు. ఈ నాలుగు యుద్దవిమానాల్లో మూడు రెండు సీట్ల ట్రైనర్ ఎయిర్‌క్రాఫ్ట్‌లు కాగా, ఒకటి సింగిల సీటర్ ఎయిర్‌క్రాఫ్ట్. ఇవి అంబాలా ఎయిర్ బేస్ దగ్గర జూలై నెలలో భారత వాయుసైన్యంలో చేరనున్నాయి. మొదటి ఎయిర్‌క్రాఫ్ట్‌ని 17 గోల్డెన్ యారోస్ స్వ్కాడెన్‌కి చెందిన ఫైలెట్ నడుపునున్నాడు. భారత్‌కు చెందిన 7గురు ఫైలెట్లు ఇప్పటికే ఫ్రెంచ్ ఎయిర్‌బేస్‌లో దీనికి సంబంధించిన ట్రైనింగ్‌ను పూర్తి చేసుకోగా, రెండో బ్యాచ్ లాక్డౌన్ చర్యలు ఫ్రాన్స్, భారత్‌లో పూర్తి కాగానే ట్రైనింగ్‌కు హాజరవుతారు. ఈ యుద్ద విమానాలు భారత్ చేతికి వస్తే సరిహద్దులో పాకిస్తాన్, చైనాతో ఉండే ఉద్రిక్తతలు కొంచెం తగ్గే అవకాశాలు ఉన్నాయి. (అడ్వకేట్ల డ్రస్కోడ్ మారింది, ఇకపై వారు...) -
ఆస్ట్రా మైక్రో–రఫేల్ తయారీ కేంద్రం షురూ!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఇకపై భారత రక్షణ సమాచార ఉత్పత్తులు హైదరాబాద్ కేంద్రంగా తయారు కాబోతున్నాయి. హైదరాబాద్‌కు చెందిన ఆస్ట్రా మైక్రోవేవ్ ప్రొడక్టŠస్ (ఏఎంపీఎల్), ఇజ్రాయల్‌కు చెందిన రఫేల్ అడ్వాన్డ్స్ డిఫెన్స్ సిస్టమ్ (ఆర్‌ఏడీఎస్‌ఎల్) కలిసి ఆస్ట్రా రఫేల్ కమ్యూనికేషన్ సిస్టమ్ (ఏఆర్సీ) సెంటర్‌ను ఏర్పాటు చేశాయి. ఈ ఏఆర్సీ డిఫెన్స్ కమ్యూనికేషన్లో కార్యకలాపాలను నిర్వహిస్తుంది. ముఖ్యంగా ఇండియన్ ఆర్మీ బలగాలకు ట్యాక్టికల్ కమ్యూనికేషన్ సిస్టమ్స్‌ను (బీఎన్‌ఈటీ) అభివృద్ధి చేస్తుంది. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరువలోని హార్డ్‌వేర్ టెక్నాలజీ పార్క్‌లో 20 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటయిన ఏఆర్సీ స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ సెంటర్‌ను మంగళవారం కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి.కిషన్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆస్ట్రా మైక్రోవేవ్ ప్రొడక్ట్స్ ఎండీ ఎస్.గుర్నాత్ రెడ్డి, ఇండియాలోని ఇజ్రాయల్ రాయబారి రాన్ మల్కా, రఫేల్ అడ్వాన్స్ సిస్టమ్ ప్రెసిడెంట్ అండ్ సీఈఓ మేజర్ జనరల్ యోవ్ హర్–ఈవెన్, తెలంగాణ ఐటీ సెక్రటరీ జయేష్ రంజన్ పాల్గొన్నారు. ఏం తయారు చేస్తారంటే? ఈ ఏఆర్సీ కేంద్రంలో అత్యాధునిక మిలటరీ గ్రేడ్ ఎస్డీఆర్ (సాఫ్ట్వేర్ డిఫైన్డ్ రేడియో) తయారీ చేస్తారు. ఎస్డీఆర్ ఉత్పత్తుల తయారీ తొలి ప్రైవేట్ కంపెనీ ఈ ఏఆర్సీ. తొలి దశలో ప్రత్యేక సాఫ్ట్వేర్ ఆధారిత రేడియోల తయారీతో ప్రారంభమై.. తర్వాత రక్షణ సమాచార మార్పిడి కోసం వివిధ రకాల ఉత్పత్తులను అభివృద్ధి చేస్తామని రఫేల్ అడ్వాన్స్ సిస్టమ్స్ ప్రెసిడెంట్ అండ్ సీఈఓ మేజర్ జనరల్ యోవ్ హర్–ఈవెన్ తెలిపారు. ఎలక్ట్రానిక్ వార్ఫేర్, సిగ్నల్ ఇంటెలిజెంట్ వ్యవస్థలో కూడా ఉత్పత్తులను అభివృద్ధి చేస్తామన్నారు. తొలి దశలో రూ.35 కోట్ల పెట్టుబడి.. ఏఆర్సీ సెంటర్లో ఆస్ట్రాకు 51 శాతం, రఫేల్‌కు 49 శాతం వాటాలున్నాయి. తొలి దశలో రెండు జేవీ కంపెనీలు రూ.35 కోట్ల పెట్టుబడి పెట్టాయని, మున్ముందు పెట్టుబడుల స్థాయిని పెంచుతామని ఆస్ట్రా మైక్రోవేవ్ ఎండీ గుర్నాత్ రెడ్డి చెప్పారు. తొలి దశలో ఈ యూనిట్లో దేశీయ అవసరాలకే ఉత్పత్తుల్ని తయారు చేస్తామని, ఆ తర్వాతే ఎగుమతులుంటాయని చెప్పారాయన. ప్రస్తుతం ఈ యూనిట్లో 32 మంది సాంకేతిక నిపుణులు పనిచేస్తున్నారని.. రెండేళ్లలో ఈ సంఖ్యను 185కి పెంచుతామని చెప్పారు. ప్రస్తుతం రఫేల్ నుంచి 30 మిలియన్ డాలర్ల ఆర్డర్ ఉందని, వచ్చే 24 నెలల్లోగా డెలివరీ చేస్తామని చెప్పారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. దేశీయ రక్షణ, రైల్వే రంగాల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ) పెరుగుతున్నాయని, కేంద్రం ఎఫ్‌డీఐలను అందిస్తున్న ప్రోత్సాహకాలే కారణమని చెప్పారు. గతంలో కల్యాణి గ్రూప్‌తో రఫేల్.. ఇప్పటికే రఫేల్ అడ్వాన్స్డ్ సిస్టమ్స్ కల్యాణి గ్రూప్‌తో జాయింట్ వెంచర్‌గా హైదరాబాద్‌లో కల్యాణి రఫేల్ అడ్వాన్డ్స్ సిస్టమ్స్‌ను (కేఆర్ఏఎస్) ఏర్పాటు చేసింది. దీనికి భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (బీడీఎల్) నుంచి 100 మిలియన్ డాలర్ల కాంట్రాక్ట్ లభించింది. వెయ్యి యూనిట్ల బరాక్–8 ఎంఆర్ శామ్ క్షిపణి కిట్స్‌ను సరఫరా చేయాల్సి ఉంది. -
‘ఆయనో ఫిరంగి.. నేనో ఏకే 47’
సిమ్లా : రాఫెల్ రగడ ఇప్పట్లో ఓ కొలిక్కి వచ్చేలా లేదు. ప్రతిపక్షాలు ఈ విషయాన్ని అంత తేలిగ్గాం వదలడం లేదు. ఈ క్రమంలో పంజాబ్ నాయకుడు, మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధు మరోసారి రఫెల్ వివాదాన్ని తెరమీదకు తీసుకొచ్చారు. హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సిద్ధు ఈ సందర్భంగా మాట్లాడుతూ.. 2014 ఎన్నికల నాటికి గంగా పుత్రుడుగా ఉన్న నరేంద్ర మోదీ 2019 నాటికి రాఫెల్ ఏజెంట్‌గా మారిపోయారని ఆరోపించారు. అంతేకాక రాఫెల్ డీల్ విషయంలో ‘నరేంద్ర మోదీ బ్రోకరేజ్ తీసుకున్నారా లేదా అనే అంశాన్ని వదిలేస్తాను. అయితే ఈ విషయం గురించి దేశంలో ఎక్కడైనా సరే నాతో బహిరంగ చర్చకు మోదీ సిద్ధమా’ అని సిద్ధు ప్రశ్నించారు. అంతేకాక రాహుల్ గాంధీ ఓ ఫిరంగి అని తాను ఏకే 47 గన్ను లాంటి వాడినని పేర్కొన్నారు సిద్ధు. నరేంద్ర మోదీ చెప్పే ‘తినను.. తిననివ్వను’(అవినీతి గురించి) వ్యాఖ్యలపై ఎక్కడైనా ఎప్పుడైనా తాను చర్చకు సిద్ధమే అంటూ చాలెంజ్ చేశారు సిద్ధు. ఒక వేళ ఈ సవాలులో తాను ఓడిపోతే.. ఇక రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని స్పష్టం చేశారు సిద్ధు. -
ఆ సమయంలో రాఫెల్ యుద్ధ విమానాలుంటే..
న్యూఢిల్లీ: భారత వైమానిక దళం వద్ద రాఫెల్ యుద్ధ విమానాలు ఉండి ఉంటే, అవి పాకిస్తాన్‌కు చెందిన యుద్ధ విమానాల్లో సగం కూల్చివేసి ఉండేవని భారత మాజీ ఐఏఎఫ్ చీఫ్, ఎయిర్ మార్షల్ ఏవై టిప్నిస్ అభిప్రాయపడ్డారు. ఏవై టిప్నిస్ మంగళవారం ఆజ్‌తక్ ఛానల్ నిర్వహించిన భద్రతా సదస్సులో పాల్గొని ఈ వ్యాఖ్యలు చేశారు. భారత్‌లోని శ్రీనగర్, అవంతిపురా ఎయిర్ బేస్‌లపై దాడిచేయడమే పాకిస్తాన్‌కు చెందిన 24 యుద్ధ విమానాల లక్ష్యమన్నారు. మొన్న టెర్రరిస్టు స్థావరాలపై దాడి జరిగినపుడు ఇండియా దగ్గర రాఫెల్ యుద్ధవిమానాలుంటే, కనీసం 12 పాకిస్తాన్ యుద్ధవిమానాలు నేలకూలేవని వ్యాఖ్యానించారు. ఉగ్రవాదాన్ని ఎదుర్కొనేటపుడు ఇండియా నిశ్శబ్దంగా కూర్చోకూడదని, ప్రభుత్వం మారినప్పుడల్లా దాడుల ప్రణాళిక మారకూడదని హితబోధ చేశారు. దాడులు సరైన దిశలో జరగాలని సూచించారు. అలాగే పాకిస్తాన్‌తో దౌత్య, సాంస్కృతిక, క్రీడా సంబంధాలను తెంచుకుని వారిపై అంతర్జాతీయంగా ఒత్తిడి పెంచాలని కోరారు. ఇదే సదస్సులో పాల్గొన్న మాజీ ఆర్మీ జనరల్ బిక్రం సింగ్ మాట్లాడుతూ.. ఇండియా, పాకిస్తాన్ ప్రధాన స్థావరంపై దెబ్బకొట్టాలని, అప్పుడే పాకిస్తాన్ మాటపై నిలబడుతుందని వ్యాక్యానించారు. పాకిస్తాన్లో టెర్రరిజం అనేది ఉద్యోగం లాంటిదని, అక్కడి ప్రభుత్వం సరైన విధంగా చర్యలు తీసుకుంటేనే టెర్రరిజం అంతమవుతుందని అన్నారు. -
మళ్లీ ‘రఫేల్’ ప్రకంపనలు
న్యూఢిల్లీ: ఎన్నికల వేళ వివాదాస్పద రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందంపై మరో రచ్చ మొదలైంది. ఫ్రెంచ్ ప్రభుత్వంతో ప్రధాని కార్యాలయం(పీఎంవో) సమాంతర చర్చలు జరిపిందని వెలువడిన మీడియా కథనం సంచలనం రేపింది. ఇదే అదనుగా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రధాని మోదీపై ఆరోపణల్ని తీవ్రతరం చేశారు. కాపలాదారే దొంగని స్పష్టమవుతోందని, మోదీ దోషి అని నిరూపించడం చాలా తేలికని పేర్కొన్నారు. రూ.59 వేల కోట్ల విలువైన రఫేల్ యుద్ధవిమానాల కొనుగోలు కోసం ఓ వైపు రక్షణ మంత్రిత్వ శాఖ బృందం ఫ్రాన్స్ అధికారులతో చర్చలు జరుపుతోంటే, ప్రధాని కార్యాలయంలోని కొందరు అధికారులు సమాంతర చర్చలకు దిగారని ఆంగ్ల దినపత్రిక ‘ది హిందూ’ శుక్రవారం వెలుగులోకి తెచ్చింది. పీఎంవో అధికారుల జోక్యాన్ని తప్పుపడుతూ రక్షణ శాఖ అభ్యంతరం వ్యక్తం చేసినట్లు 2015 నాటి నోట్‌ను ఉటంకించింది. దీంతో రఫేల్ ఒప్పందంపై బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య మళ్లీ మాటల యుద్ధం మొదలైంది. కాగా, ‘ది హిందూ’ కథనాన్ని తోసిపుచ్చిన రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్...విదేశీ కంపెనీల ప్రయోజనాల కోసం కాంగ్రెస్ ముగిసిన అధ్యాయాన్నే లేవనెత్తుతోందన్నారు. ఈ ఒప్పందంపై జేపీసీతో విచారణ జరిపించాలని కాంగ్రెస్ తన డిమాండ్‌ను పునరుద్ఘాటించింది. రాహుల్‌కు కొత్త ఆయుధం.. రఫేల్ ఒప్పందంపై ‘ది హిందూ’ వెలుగులోకి తెచ్చిన విషయాల్ని ఆయుధంగా మలచుకుని మోదీపై రాహుల్ విమర్శల పదును పెంచారు. ‘ఎలాంటి విచారణనైనా జరిపించండి. చట్టాన్ని అమలు చేయండి. రాబర్ట్ వాద్రా, పి.చిదంబరం..ఇలా అందరిపైనా చట్టాన్ని అమలు చేయండి. మాకు ఎలాంటి అభ్యంతరాలు లేవు. అలాగే, రఫేల్ వ్యవహారంపైనా మా ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వండి’ అని మీడియా సమావేశంలో రాహుల్ డిమాండ్ చేశారు. వైమానిక దళం నుంచి రూ.30 వేల కోట్లు దొంగిలించిన ప్రధాని, నిబంధనల్ని పక్కదారి పట్టించి, ఆ సొమ్మును తన స్నేహితుడు అనిల్ అంబానీకి ధారాదత్తం చేశారని ఆరోపించారు. ‘రఫేల్ కుంభకోణంలో ప్రధాని నేరుగా జోక్యం చేసుకున్నారని ఏడాదికి ముందు నుంచే చెబుతున్నాం. ఫ్రెంచ్ ప్రభుత్వంతో ప్రధానే స్వయంగా చర్చలు జరిపారని ఈరోజు వెలుగులోకి వచ్చింది. కాపలాదారే దొంగని నిరూపించడానికి ఇంతకన్నా ఏం కావాలి?’ అని అన్నారు. ‘పీఎంవో జోక్యంతో రక్షణ శాఖ బృందం జరిపే చర్చలు బలహీనపడ్డాయి. పీఎంవో అధికారులు ఫ్రెంచ్ ప్రభుత్వంతో చర్చల నుంచి దూరంగా ఉంటే బాగుంటుంది’ అని రక్షణ శాఖ అభ్యంతరం వ్యక్తం చేసినట్లు ఆ కథనంలోని విషయాల్ని రాహుల్ చదివి వినిపించారు. వాకబు చేయడం జోక్యం కాదు: నిర్మలా కాంగ్రెస్ ఆరోపణల్ని ఖండిస్తూ రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో బదులిచ్చారు. ‘ముగిసిన కథనే మళ్లీ లేవనెత్తుతున్నారు. ఫ్రెంచ్ ప్రభుత్వంతో జరుగుతున్న చర్చల్లో పురోగతిపై పీఎంవో వివరాలు తెలుసుకోవాలనుకోవడం జోక్యం చేసుకోవడం కాదు’ అని ఆమె అన్నారు. కొనుగోలు ధరలపై పీఎంవో అధికారులు ఫ్రాన్స్ ప్రభుత్వంతో చర్చలు జరపడంపై నాటి రక్షణ శాఖ కార్యదర్శి అభ్యంతరం వ్యక్తం చేశారనే కథనంపై స్పందిస్తూ..అప్పటి రక్షణ మంత్రి పరీకర్ సవ్యంగానే ఉందని సదరు అధికారికి సూచించారని తెలిపారు. యూపీయే హయాంలో జాతీయ సలహా మండలి(ఎన్ఏసీ) చైర్మన్ హోదాలో సోనియా గాంధీ పీఎంవో కార్యాలయానికి ఆదేశాలు జారీచేశారని, అది జోక్యం చేసుకోవడం కాదా? అని ప్రశ్నించారు. రాహుల్ కర్మాగారం నుంచి మరో అసత్యం: బీజేపీ ఒప్పందాన్ని రద్దుచేయాలని విదేశీ శక్తుల నుంచి ఆదేశాల మేరకు రాహుల్ కొత్త అసత్యాలు అల్లుతున్నారని బీజేపీ వ్యాఖ్యానించింది. తన అసత్యాల కర్మాగారం నుంచి రాహుల్ మరో అబద్ధాన్ని వెలికితీశారని ఎద్దేవా చేసింది. ఇటీవల యూరప్‌లో పర్యటించిన రాహుల్ ఏ విమాన సంస్థ అధికారులతో సమావేశమయ్యారో వెల్లడించాలని కేంద్ర మంత్రి జవడేకర్ అన్నారు. రఫేల్ ఒప్పందాన్ని రద్దుచేయడానికి రాహుల్, కాంగ్రెస్ పనిచేస్తున్నాయని, స్వప్రయోజనాలతో కూడిన విదేశీశక్తులకు వారు లొంగిపోయారని ఆరోపించారు. 2011లోనే రఫేల్ ఒప్పందాన్ని ఖాయం చేసుకున్న యూపీయే ప్రభుత్వం కమిషన్ల రాకపోవడంతో ముందుకు సాగనివ్వలేదని పరిహసించారు. రఫేల్ ఒప్పందంలో ఎలాంటి కుంభకోణం లేదని సుప్రీంకోర్టే స్పష్టం చేసిందని, అయినా ఈ సంగతిని రాహుల్ అంగీకరించడంలేదని అన్నారు. అబద్ధాన్ని మళ్లీమళ్లీ చెబితే, నిజమైపోదని హితవు పలికారు. పార్లమెంట్లో ‘రఫేల్’ ప్రకంపనలు.. రఫేల్ ఒప్పందం చర్చలలో ప్రధాని కార్యాలయ అధికారులు జోక్యం చేసుకున్నారని వచ్చిన కథనం లోక్‌సభ, రాజ్యసభలో ప్రకంపనలు సృష్టించింది. మధ్యాహ్నం లోక్‌సభ ప్రారంభం కాగానే, ఇదే అంశంతో విపక్షాలు ప్రభుత్వంపై మండిపడ్డాయి. కాంగ్రెస్, తృణమూల్, ఇతర విపక్షాలు ప్రధాని మోదీ రాజీనామా చేయాలని, నినాదాలు చేస్తూ వెల్‌లోకి దూసుకొచ్చారు. రఫేల్ ఒప్పందంపై సంయుక్త పార్లమెంట్ కమిటీతో దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశాయి. సభ్యులంతా తమ సీట్లలో కూర్చుంటే ఒకరి తరువాత ఒకరిని మాట్లాడనిస్తానని స్పీకర్ సుమిత్రా మహాజన్ హామీ ఇచ్చారు. తృణమూల్ ఎంపీ సౌగతా రాయ్ మాట్లాడుతూ..రక్షణ మంత్రిత్వ శాఖ అధికారులు చర్చలు జరుపుతోంటే, పీఎంవో బృందం ఎందుకు జోక్యం చేసుకుందని ప్రశ్నించారు. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ పారిస్‌లో చర్చలు జరిపారని, దీంతో మెరుగైన బేరసారాలు చేసేందుకు ప్రభుత్వ శక్తి తగ్గిపోయిందని అన్నారు. ప్రభుత్వ తీరు జాతీయ ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఉందని కాంగ్రెస్ పక్ష నేత మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. రఫేల్ ఒప్పందం కోసం పీఎంవో, రక్షణ శాఖలు ఒకరితో ఒకరు పోటీపడుతున్నారని, ఇదే విషయం పత్రికలో కూడా వచ్చిందని అన్నారు. అసలు నిజమేంటో జేపీసీతోనే బయటకు వస్తుందని పేర్కొన్నారు. రఫేల్ ఒప్పందంపై జరిగిన చర్చలో ప్రభుత్వం ఇది వరకే అన్నింటికి సమాధానాలు ఇచ్చిందని కేంద్ర మంత్రి నరేంద్రసింగ్ తోమర్ చెప్పారు. మరోవైపు, రాజ్యసభలోనూ దాదాపు ఇదే పరిస్థితి నెలకొనడంతో సభ రోజంతటికీ వాయిదా పడింది. పీఎంవోకు సంబంధం లేదు: మాజీ అధికారులు రఫేల్ ఒప్పందంపై పీఎంవో సమాంతర చర్చలు జరిపిందన్న ఆరోపణల్ని ఆనాడు భారత రక్షణ బృందానికి నేతృత్వం వహించిన ఎయిర్ మార్షల్ ఎస్బీపీ సిన్హా తోసిపుచ్చారు. రక్షణ శాఖ మాజీ కార్యదర్శి మోహన్ కుమార్ హిందూ కథనాన్ని ఖండించారు. ఒప్పందం కోసం చర్చలు పారదర్శకంగా జరిగాయని తెలిపారు. నోట్లో చెప్పింది ప్రభుత్వ హామీ గురించే కానీ, ధరల గురించి కాదని అన్నారు. ఎవరి ఆదేశాల మేరకు ఈ నోట్ రాశారో తెలియదని పేర్కొన్నారు. రఫేల్ డీల్ కోసం ఎలాంటి సమాంతర చర్చలు జరగలేదని, ఒప్పందంలోని ప్రతి పదాన్ని ఇరు దేశాల తరఫున చర్చల్లో పాల్గొన్న బృందాలే ఖరారుచేశాయని, ఇతర సంస్థలు, వ్యక్తులకు ఇందులో పాత్ర లేదని సిన్హా తెలిపారు. ఇలాంటి నోట్‌ను భారత మీడియాలో తొలిసారి చూశానని, చర్చల్లో పాల్గొన్న బృందంలోని సభ్యులెవరికీ దీని గురించి తెలియదని చెప్పారు. ఫైల్ నోట్లోఏముంది? ఫ్రాన్స్ ప్రభుత్వంతో రక్షణ శాఖ బృందం చర్చలు జరుపుతుంటే, మరోవైపు, పీఎంవో అధికారులు సమాంతర చర్చలు జరిపారు. దీంతో మెరుగైన ఒప్పందం కుదర్చుకోవడానికి తాము చేస్తున్న ప్రయత్నాలు బలహీనమయ్యాయని 2015, నవంబర్ 24న రక్షణ శాఖ మంత్రి మనోహర్ పరీకర్ దృష్టికి తీసుకొచ్చింది. ‘ఫ్రెంచ్ అధికారులతో చర్చల నుంచి పీఎంవో బృందం దూరంగా ఉంటే మంచిదని భావిస్తున్నాం. మేము జరిపే చర్చల నుంచి వచ్చే ఫలితాలపై విశ్వాసం లేకుంటే, సమయం వచ్చినప్పుడు పీఎంవో నేతృత్వంలోనే చర్చల కోసం కొత్త విధివిధానాల్ని రూపొందించి అమలుచేయొచ్చు’ అని ఫైల్నోట్లో పేర్కొంది. అప్పటి వైమానిక దళ డిప్యూటీ చీఫ్ నేతృత్వంలో ఏడుగురితో కూడిన బృందం భారత్ తరఫున ఫ్రాన్స్‌తో చర్చలు జరిపింది. ఫ్రెంచ్ బృందానికి నేతృత్వం వహించిన జనరల్ స్టీఫెన్ రెబ్ 2015, అక్టోబర్ 23న రక్షణ శాఖకు పంపిన లేఖ ద్వారా పీఎంవో సమాంతర చర్చలు వెలుగుచూశాయి. -
సెప్టెంబర్‌లో భారత్‌కి రఫేల్ జెట్
-
‘సుప్రీం తీర్పు కాంగ్రెస్ పార్టీకి చెంపపెట్టు’
ఢిల్లీ: రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు అంశంపై కాంగ్రెస్ పార్టీ ఇప్పటికైనా క్షమాపణ చెప్పాలని బీజేపీ తెలంగాణ అధ్యక్షులు కె. లక్ష్మణ్ డిమాండ్ చేశారు. సుప్రీం కోర్టు తీర్పు కాంగ్రెస్ పార్టీకి చెంపపెట్టులాంటిదన్నారు. ఢిల్లీలో కె.లక్ష్మణ్ విలేకరులతో మాట్లాడుతూ..రాఫెల్ విషయంలో కేంద్ర ప్రభుత్వంపై అనవసరంగా బురద జల్లారని విమర్శించారు. దేశ రక్షణ విషయాలలో రాజకీయాలు తగవన్నారు. సుప్రీంకోర్టు తీర్పుతోనైన కాంగ్రెస్ పార్టీకి కనువిప్పు కలగాలని కోరుకున్నట్లు తెలిపారు. అవినీతి, కుంభకోణాలకు పాల్పడిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదేనన్నారు. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం, నాలుగున్నర ఏళ్లలో అవినీతి మచ్చపడకుండా పారదర్శకంగా పాలన కొనసాగిస్తుందని చెప్పారు. అధికారం కోసం తప్పుడు ఆరోపణలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీ తమ తప్పును ఒప్పుకొని ముక్కు నేలకు రాసి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణా అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అధికార దుర్వినియోగానికి పాల్పడిందని ఆరోపించారు. పెద్ద ఎత్తున ప్రజల ఓట్లు గల్లంతయ్యాయని, ఈ విషయంలో ఈసీ జోక్యం చేసుకుని చర్యలు తీసుకోవాలని కోరారు. చంద్రబాబు పర్యటనతో తెలంగాణ వ్యతిరేకులకు, తెలంగాణ వాదులకు మధ్య పొరుగా ప్రజలు భావించి ప్రజలంతా టీఆర్ఎస్ పక్షాన నిలిచారని అన్నారు. కేసీఆర్ కుటుంబపాలన, అవినీతిని ఎవరూ పట్టించుకోలేదని వ్యాఖ్యానించారు. లోక్‌సభ ఎన్నికలకు సన్నద్ధం అవుతున్నామని తెలిపారు. డిసెంబర్ చివరి వారంలో బీజేపీ అధ్యక్షులు అమిత్ షా, జనవరిలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తెలంగాణాలో పర్యటిస్తారని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ లబ్ధిదారులందరినీ నేరుగా వెళ్లి కలుస్తామని అన్నారు. -
రాహుల్ సవాల్‌కు ఇరానీ కౌంటర్!
సాక్షి, న్యూఢిల్లీ : రాఫెల్ కుంభకోణంపై ప్రధాని నరేంద్ర మోదీకి కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ విసిరిన సవాల్‌పై కేంద్ర జౌళీ శాఖ మంత్రి స్మృతి ఇరానీ స్పందించారు. రాఫెల్‌తో పాటు దేశానికి సంబంధించిన అంశాలపై చర్చకు తాము సిద్ధమని, కానీ రాహుల్ చర్చకు వచ్చేముందు చేతిలో ఎలాంటి పేపర్లు (స్క్రిప్ట్) లేకుండా చర్చించగల సత్తా ఆయనకు ఉందా అని ఆమె ప్రశ్నించారు. ఛత్తీస్‌గఢ్ ఎన్నికల ప్రచారంలో ఇటీవల రాహుల్ మాట్లాడుతూ.. రాఫెల్‌పై తనతో చర్చకు ప్రధాని మోదీ సిద్ధమేనా? అని సవాలు విసిరిన విషయం తెలిసిందే. దీనిపై ఇరానీ సోమవారం ఓ సమావేశంలో మాట్లాడుతూ.. గత 15 ఏళ్లుగా అమేథిలో రాహుల్ ఎంపీగా విజయం సాధిస్తూ వస్తున్నారని.. తన సొంత నియోజకవర్గంలోని కొన్ని గ్రామపంచాయతీల పేర్లు కూడా రాహుల్ చెప్పలేరని ఆమె ఎద్దేవా చేశారు. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ నుంచి రాహుల్ వరకు అమేథిని పాలించింది వారి కుటుంబమేనని.. అక్కడ అభివృద్ది ఏమేరకు జరిగిందో ప్రజలందరికీ తెలుసని మండిపడ్డారు. కాగా గత లోక్‌సభ ఎన్నికల్లో రాహుల్ పోటీ చేసిన ఇరానీ స్వల్ప తేడాతో ఓటమి చెందిన విషయం తెలిసిందే. యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో అమేథి లోక్‌సభ పరిధిలోని నాలుగు నియోజకవర్గాల్లో మూడింటిని బీజేపీ గెలుపొందగా, ఒక స్థానంలో ఎస్పీ విజయం సాధించింది. -
రాఫెల్ వైపే మొగ్గు
ఉడీ ఉగ్రవాద దాడి అనంతరం భారత్, పాకిస్తాన్ల మధ్య వాగ్యుద్ధం తీవ్ర స్థాయికి చేరి, అది యుద్ధ వాతావరణం దిశగా పోతున్నదని అందరూ అనుకుంటున్న సమయంలో రాఫెల్ యుద్ధ విమానాల ఒప్పందంపై భారత్-ఫ్రాన్స్ దేశాలు సంతకాలు చేశాయి. వాస్తవానికి ఇప్పుడు కుదిరిన ఒప్పందం లాంఛనమే. ప్రధాని నరేంద్ర మోదీ 17 నెలలక్రితం ఫ్రాన్స్ వెళ్లినప్పుడు ఇందుకు సంబంధించి సూత్ర ప్రాయమైన అంగీకారం కుదిరింది. ఇంకా వెనక్కు వెళ్తే 2012లో అప్పటి యూపీఏ ప్రభుత్వం రాఫెల్ యుద్ధ విమానాల కోసం వాటిని ఉత్పత్తి చేసే డసాల్ట్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. మొత్తంగా రూ. 1.34 లక్షల కోట్ల వ్యయంతో 126 యుద్ధ విమానాలు కొనడం దాని సారాంశం. 2015కల్లా 18 విమానాలను సమ కూరుస్తామని ఆ సందర్భంగా డసాల్ట్ సంస్థ పూచీపడింది. కానీ అందుకు సంబం ధించిన తదుపరి చర్చల్లో ప్రతిష్టంభన ఏర్పడింది. నేరుగా 18 విమానాలు అంద జేసి, మిగిలిన 108 విమానాలకు సంబంధించి సాంకేతిక పరిజ్ఞానాన్ని బదిలీచేసి బెంగళూరులోని హిందూస్థాన్ ఏరోనాటిక్స్(హెచ్ఏఎల్)లో వాటిని ఉత్పత్తిచేసేలా లెసైన్స్ ఇస్తామన్న సంస్థ మళ్లీ వెనక్కు తగ్గింది. నిరుడు ఏప్రిల్‌లో మోదీ ఫ్రాన్స్ పర్యటించినప్పుడు కదలిక వచ్చింది. పాత ఒప్పందం స్థానంలో కొత్త ఒప్పందం కుదుర్చుకోవాలని ఇరు దేశాలూ నిర్ణయించుకున్నాయి. గతంలో యూపీఏ ప్రభుత్వం నేరుగా డసాల్ట్‌తో ఒప్పందం కుదుర్చుకోగా... అందుకు భిన్నంగా మోదీ ఫ్రాన్స్ ప్రభుత్వంతో దీన్ని ముడిపెట్టారు. 36 విమానాలు అందజేయడం ఆ ఒప్పందం సారాంశం. వాటి విలువ రూ. 64,000 కోట్లుగా లెక్కేశారు. అయినా తుది ఒప్పందానికి ఇన్నాళ్ల సమయం పట్టింది. ఈ 17 నెలల బేరసారాల్లో ఇది ప్రస్తుతం రూ. 59,000 కోట్లకు చేరిందని రక్షణ మంత్రి మనోహర్ పరీకర్ ప్రకటిం చారు. ఇప్పుడు కూడా తొలి విమానం మరో రెండేళ్లకుగానీ అందదు. రక్షణ ఒప్పం దాలు ఎంత సంక్లిష్టమైనవో, అవి సాకారం కావడానికి ఎంత సుదీర్ఘ సమయం అవసరమవుతుందో దీన్నిబట్టి అర్ధం చేసుకోవచ్చు. అందువల్లే ఈ విషయంలో చాలా ముందుచూపు అవసరమవుతుంది. మరో పాతికేళ్లకు ఎలాంటి పరిస్థితులుం టాయో, వాటిని దీటుగా ఎదుర్కొనేందుకు మనం తీసుకోవలసిన చర్యలేమిటన్న అంశాల్లో స్పష్టమైన అవగాహన ఉండాలి. అందుకు అనుగుణంగా అడుగులేయాలి. ఎన్నో ఏళ్లుగా మన వైమానిక దళం యుద్ధ విమానాల కొరతను ఎదుర్కొం టున్నది. ఒకప్పుడు పాకిస్తాన్‌ను గడగడలాడించిన మిగ్-21, మిగ్-27 యుద్ధ విమానాలకు వయసు మీదపడింది. అవి తెల్ల ఏనుగుల్లా మారాయి. ఖర్చు బారెడు.. ప్రయోజనం మూరెడు అన్న చందంగా తయారైంది. పేరుకు వంద విమా నాలున్నాయన్న పేరే గానీ... వాటిలో ఏ సమయంలోనైనా దాదాపు 60కి మించి అందుబాటులో ఉండవు. మిగిలినవి ఎప్పుడూ మరమ్మతుల్లోనే ఉంటాయి. గతంలో మనతో పోలిస్తే ఎంతో వెనకబడి ఉన్న పాక్ కొన్నేళ్లుగా రక్షణ కొనుగోళ్లలో చురుగ్గా ఉంది. పాక్ సంగతి వదిలిపెట్టినా మొత్తంగా ప్రపంచవ్యాప్తంగానే ఈ కొనుగోళ్లు గణనీయంగా పెరిగాయి. ప్రతి దేశమూ రక్షణ అవసరాలపై చేస్తున్న వ్యయాన్ని బాగా పెంచింది. ఈ నేపథ్యంలో వైమానిక దళం వినతులపై ప్రభుత్వం దృష్టిసారించింది. 2000 సంవత్సరంలో యుద్ధ విమానాల కొనుగోలుకు నిర్ణయిం చాక ప్రపంచవ్యాప్తంగా ఉన్న పలు సంస్థలు వాటిని అమ్ముతామంటూ పోటీప డటం మొదలెట్టాయి. పోటీదారు ఉత్పత్తి చేసే యుద్ధ విమానాలతో పోలిస్తే తమ ఉత్పత్తులు అన్నివిధాలా మెరుగైనవని ఒప్పించే ప్రయత్నం చేశాయి. జాబితా నుంచి తమ దేశానికి చెందిన సంస్థను ప్రాథమిక దశలోనే తొలగించారని తెలుసు కున్నాక అమెరికా తీవ్ర నిరాశకు గురైంది. భారత్‌ను ఒప్పించడంలో విఫలమయ్యా రన్న అభిప్రాయం అమెరికా ప్రభుత్వానికి కలగడంతో భారత్‌లో తమ రాయ బారిగా ఉన్న తిమోతి రోమెర్ను పదవినుంచి తప్పించారన్న కథనాలు వచ్చాయి. చివరకు ఫ్రాన్స్ సంస్థ డసాల్ట్ను ఎంపిక చేశారని తెలిశాక బ్రిటన్, జర్మనీ, స్పెయిన్, ఇటలీ దేశాలకు చెందిన కన్సార్టియానికి కూడా తీవ్ర అసంతృప్తి కలిగింది. తాము ఉత్పత్తి చేసే యుద్ధ విమానాలతో పోలిస్తే రాఫెల్ ఏమంత మెరుగైంది కాదన్న ప్రచారాన్ని ప్రారంభించాయి. అయితే ఇప్పుడు కుదిరిన ఒప్పందాన్ని మెచ్చుకుంటున్నవారున్నట్టే విమర్శి స్తున్నవారూ లేకపోలేదు. తక్షణం వినియోగంలోకొచ్చే విధంగా 36 యుద్ధ విమా నాలు మన అమ్ములపొదిలో చేరబోతున్నాయని నిరుడు మోదీ ప్రకటించారు. ఇప్పుడు పరీకర్ చెబుతున్న ప్రకారం తొలి విమానం రావడానికే మరో రెండేళ్లు పడుతుంది. వాస్తవానికి 36 యుద్ధ విమానాలూ మన వైమానిక దళ అవసరాలకు ఏమాత్రం సరిపోవు. కనీసం వంద విమానాల అవసరం ఉన్నదని అంటున్నారు. ఈ స్థితిలో గత 17నెలలుగా ఫ్రాన్స్ ఎటూ తేల్చకుండా నాన్చింది. సాంకేతిక పరిజ్ఞానాన్ని బదిలీ చేసేందుకు వెనకాడింది. అందువల్లే ఒక దశలో పరీకర్ విసుగు చెంది ప్రత్యామ్నాయ ప్రతిపాదనల వైపు మొగ్గుచూపారు. లాక్‌హీడ్ మార్టిన్, బోయింగ్ తదితర సంస్థల ప్రతినిధులతో చర్చలు జరిపారు. ఆ మూడు సంస్థలూ సాంకేతిక పరిజ్ఞానం బదిలీకి అంగీకరించాయి కూడా. వీటిలో ఏదో ఒక సంస్థను ఖరారు చేయడానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని పరీకర్ అన్నారు. అయితే అనూహ్యంగా మళ్లీ రాఫెల్ రంగంలోకొచ్చింది. ఇందులో ఎన్నో అనుకూ లాంశాలు లేకపోలేదు. మన అవసరాలకు తగిన విధంగా విమానం డిజైన్‌లో మార్పులు చేసేందుకూ... ముఖ్యంగా లేహ్వంటి గడ్డకట్టే చలి ప్రాంతాల్లో కూడా అవి సమర్ధవంతంగా పనిచేసేందుకూ డసాల్ట్ చర్యలు తీసుకుంటున్నది. అలాగే పలు ఇతర సదుపాయాల కల్పనకు కూడా అంగీకరించింది. అయితే కీలకమైన సాంకేతిక పరిజ్ఞానం బదిలీ అలాగే ఉండిపోయింది. మన హెచ్ఏఎల్లోనే వాటిని ఉత్పత్తి చేసేలా ఒప్పించి ఉంటే ఎన్డీఏ సర్కారు నినాదం ‘మేక్ ఇన్ ఇండియా’ స్ఫూర్తి నెరవేరేది. రక్షణ అవసరాలు తరుముకొస్తున్న సంగతి వాస్తవమే అయినా ఈ విషయంలో మరింత పట్టుబట్టవలసింది.