Rahul Jain
-
సింగర్ రాహుల్ జైన్‌పై అత్యాచారం కేసు
ప్రముఖ బాలీవుడ్ సింగర్, కంపోజర్ రాహుల్ జైన్‌పై ఆత్యాచారం కేసు నమోదైంది. తనపై రాహుల్ అత్యాచారానికి పాల్పడినట్లు 30 ఏళ్ల కాస్ట్యూమ్ స్టైలిస్ట్ ముంబై పోలీసులను ఆశ్రయించింది. దీంతో బాధిత మహిళ ఆరోపణలతో పోలీసులు రాహుల్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. వివరాలు.. రాహుల్ తన పనితనాన్ని ప్రశంసిస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో తనకి మెసేజ్ చేశాడని, తనని తన పర్సనల్ స్టైలిస్ట్‌గా నియమించుకుంటానని కూడా చెప్పి తనని కలవమన్నాడని ఆమె పోలీసులకు తెలిపింది. చదవండి: ఆసక్తి పెంచుతున్న విజయ్ ఆంటోని ‘హత్య’ ట్రైలర్, చూశారా? దీంతో రాహుల్ పిలవడంతో అతడి ఫ్లాట్‌కి వెళ్లానని, అప్పుడే రాహుల్ తనపై అత్యాచారానికి పాల్పడినట్లు బాధిత మహిళ పేర్కొంది. అయితే తాను ప్రతిఘటించినప్పటికి బలవంతంగా అత్యాచారం చేశాడని... తన ఇన్స్టాగ్రామ్ మెసేజ్, ఫోన్‌కాల్‌కు సంబంధించిన సాక్ష్యాలను అతడు తొలగించాడని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు సెక్షన్ 376, 323, 506 కింద రాహుల్ జైన్‌పై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. చదవండి: బిగ్‌బాస్ బ్యూటీకి లైంగిక వేధింపులు.. ఆవేదనతో పోస్ట్ ఇదిలా ఉంటే సింగర్ రాహుల్ బాధిత మహిళ ఆరోపణలను ఖండించాడు. ఆమె ఎవరో కూడా తనకు తెలియదని, తనని ఇంతకుముందేన్నడు చూడలేదన్నాడు. అయితే గతంతో కూడా ఓ మహిళ తనని అత్యాచారం చేశానని తప్పుడు ఆరోపణలు చేసిందని ఈ సందర్భంగా వ్యాఖ్యానించాడు. కాగా సింగర్ రాహుల్ జైన్ తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడని, తాను గర్భం దాల్చడంతో బలవంతంగా అబార్షన్ చేయించాడంటూ గతంలో మరో మహిళ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. -
మార్కులొకవైపు.. మార్గాలొకవైపు..
సాక్షి, సిటీబ్యూరో: ఏమి చదివి పక్షులు పైకెగురగలిగెను.. ఏ చదువు వల్ల చేపపిల్ల ఈదగలిగెను.. అంటూ ప్రశ్నించారెప్పుడో ఓ సినీకవి. మిగిలిన జీవులన్నింటికన్నా ఎన్నో విషయాల్లో తాను గొప్ప అని చెప్పుకొనే మనిషి మాత్రం చదువు లేక బతకలేనంటూ పారిపోతున్నాడు. దీనికి కారణం ఏమిటి? లైఫ్ స్కిల్స్ లేకపోవడం. అంటే బతకడం ఎలాగో తెలియకపోవడం. చదువో, మరొకటో ఉంటేనే బతుకు బండి సాగుతుంది అనుకోవడం. అందుకే... మనిషికి జీవించడం ఎలాగో నేర్పాల్సిన సమయం వచ్చింది అంటున్నారు నగరానికి చెందిన లైఫ్ కోచ్ రాహుల్ జైన్. ఇంకా ఆయనేం చెబుతున్నారంటే.. నీట్లో తను అనుకున్న ర్యాంక్ రాలేదనే కారణంతో 18 ఏళ్ల అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది. మరో చోట యూపీఎస్సీకి ప్రిపేరవుతున్న 28 ఏళ్ల వ్యక్తి 4 నిమిషాల ఆలస్యం కారణంగా పరీక్షకు అనుమతించకపోవడంతో ఆత్మహత్య చేసుకున్నాడు. బోర్డ్ ఎగ్జామ్స్ కావచ్చు, ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కావచ్చు, జాబ్ ఇంటర్వ్యూల్లో ఫెయిలవడం కావచ్చు.. ఫలితాల తర్వాత ఈ తరహా సంఘటనలు సాధారణంగా మారాయి. దీనికి ఎవరినీ తప్పుపట్టడం నా ఉద్దేశం కాదు కానీ.. ప్రతి విద్యార్థికి, తల్లితండ్రులకు.. అత్యంత అవసరమైన లైఫ్ స్కిల్స్ విషయంలో మాత్రం ఎడ్యుకేట్ చేయడం లేదని చెప్పొచ్చు. పుస్తకాలు మాత్రమే కాదు చుట్టూ ఉన్న జీవితాల్ని చదవమని పిల్లలను ప్రోత్సహించాలి. నేడే కాదు రేపూ ఉంది జీవితం.. స్కూల్లో నేనో సగటు విద్యార్ధిని. 60శాతం మార్కులు తెచ్చుకున్న ప్రతిసారీ తల్లిదండ్రులకు మరింత కష్టపడి చదివి 75 శాతం తెచ్చుకుంటా అని ప్రామిస్ చేసేవాణ్ని. కాని నా టెన్త్ క్లాస్ బోర్డ్ పరీక్షల్లోనూ 64 శాతం మాత్రమే వచ్చాయి. ఆ తర్వాత 12వ తరగతి బోర్డ్ ఎగ్జామ్స్‌లో అనూహ్యంగా పుంజుకుని రాష్ట్ర స్థాయి ర్యాంక్ తెచ్చుకున్నా. మానవ వనరుల మంత్రిత్వ శాఖ నుంచి అవార్డు కూడా అందుకున్నాను. డిగ్రీలో కాలేజ్ టాపర్స్‌లో ఒకడినయ్యాను. స్కూల్ టైమ్‌లో చదువులో ఫర్వాలేదు అనిపించుకున్న అదే విద్యార్థి ఆ తర్వాత రికార్డులు బద్ధలు కొట్టడం అంటే దానర్థం.. ఎవరూ ఎప్పుడూ ఒకే రకంగా ఉండిపోరని. మార్కులొకవైపు.. మార్గాలొకవైపు.. ఇప్పుడు పదేళ్ల తర్వాత.. నేనో ఎంటర్‌ప్రెన్యూర్‌గా ఉన్నాను. మోటివేషనల్ స్పీకర్‌గా ఉన్నాను. నాటి నా ర్యాంక్స్/ మార్క్స్/ జీపీఏల గురించి ఇప్పుడు ఎవరికీ అవసరం లేదు. నేనే అప్పుడప్పుడు సరదాగా తీసి చూసుకోవడానికి తప్ప. మరోవైపు నాతో పాటు చదువుకున్న స్నేహితుల్లో అతి కష్టం మీద పరీక్షలు గట్టెక్కినవారు ఇప్పుడు వ్యక్తిగతంగానూ, వృత్తి పరంగానూ అద్భుతమైన రీతిలో విజయాలు సాధిస్తున్నారు. అంటే అర్థం మనం చదివే చదువు, మార్కులు మాత్రమే మన జీవితాన్ని నిర్ణయించేవి కావని. ఒక కాగితం ముక్క, లేదా కొన్ని మార్కులు, లేదా కొన్ని ర్యాంకులు మాత్రమే మీ జీవితాన్ని నిర్ణయించేవి అని అనుకోవద్దు. జీవితం అనేది ఒక దీర్ఘకాలిక ప్రయాణం. అందులో మరెన్నో ఇమిడి ఉన్నాయి. -
గూగుల్‌ను ఆకట్టుకొన్న యంగ్ టీమ్!
భారత్ నుంచి ఉద్యోగాల కోసం అమెరికాకు వచ్చే యువత సంఖ్య గణనీయంగా తగ్గిపోనుంది... భవిష్యత్తులో వాళ్లంతా స్వదేశంలోనే సొంతంగా వ్యాపారాలు చేసుకోవడం మొదలు పెడతారు... అని అంటాడు రాహుల్ జైన్. ‘అప్యూరిఫై’ అనే అప్లికేషన్ ద్వారా గూగుల్ ఐఎన్‌సీ నుంచి పెట్టుబడులను ఆకర్షించిన యువభారతీయ బృందంలో ఒకరు రాహుల్‌జైన్(27). జై శ్రీనివాసన్, మనీశ్‌లతో కలసి రాహుల్‌జైన్ అప్యూరిఫై అప్లికేషన్‌ను రూపొందించాడు. ఇప్పుడు ఈ బృందం అంతర్జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతులను సంపాదించుకొంది. యూనివర్సిటీ ఆఫ్ మిషిగాన్‌లో చదువు పూర్తి కాగానే రాహుల్ జైన్ జింగా అనే గేమింగ్ డెవలప్మెంట్ కంపెనీలో ఉద్యోగాన్ని సంపాదించాడు. చదివిన చదువు, చేస్తున్న పని అతడిలోని సృజనాత్మకతను మేల్కొల్పాయి. ఉద్యోగాన్ని వదిలి సొంతంగా కొత్త అప్లికేషన్‌ను రూపొందించాలనే ఆలోచనను కలిగించాయి. ఇలాంటి మేధోమథనం నుంచే ‘అప్యూరిఫై’ అనే అప్లికేషన్ పుట్టింది. తన స్నేహితులు ఇద్దరితో కలిసి ఆ అప్లికేషన్‌కు ప్రాణం పోసే పనిలో పడ్డాడు రాహుల్. ఇతడి అప్లికేషన్ గురించి సమాచారమందుకొన్న గూగుల్ పెట్టుబడి దారుగా రంగంలోకి దిగింది. ఆ అప్లికేషన్‌ను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసే బాధ్యతను తీసుకున్న గూగుల్ దాన్ని టేకోవర్ కూడా చేసింది. గూగుల్ మానసపుత్రిక అయిన ఆండ్రాయిడ్ అపరేటింగ్ సిస్టమ్‌లో ఆ అప్లికేషన్‌ను అందుబాటులో ఉంచడానికి ఒకింత భారీ మెత్తాన్ని చెల్లించి జైన్‌తో ఒప్పందం చే సుకొంది. దీంతో ఈ యువకుడి దశ తిరిగింది. పేరు మార్మోగింది. తన అప్లికేషన్‌ను గూగుల్‌కు అమ్మడం ద్వారావచ్చిన డబ్బును మరిన్ని స్టార్టప్‌ల మీద పెట్టుబడిగా పెడుతున్నాడు రాహుల్ జైన్. వివిధ అవసరాల కోసం మనిషికి సదుపాయంగా ఉండే అప్లికేషన్‌ను అభివృద్ధి పరచడానికి సరికొత్త అప్లికేషన్ల రూపకల్పనకు పూనుకొన్నాడు. ప్రముఖ వ్యవస్థాపకుడిగా మారాడు. ‘భారత్‌లో వ్యాపారవేత్తల్లోఎక్కువమంది ఇన్నిరోజులూ సేవారంగానికి సంబంధించిన విభాగాలపైనే దృష్టిపెట్టారు. ఔట్సోర్సింగ్ రూపంలో కార్మికవృత్తికే పరిమితమయ్యారు. అయితే ఇప్పుడు ఈ సంప్రదాయంలో మార్పు వస్తోంది. భారతీయులు తమ తెలివితేటలను విభిన్న రంగాల్లో వ్యాపారాభివృద్ధిని సాధించడానికి పెట్టుబడిగా పెడుతున్నారు...’ అనేది జైన్ విశ్లేషణ. ఈ విశ్లేషణ ఇతరుల విషయంలో ఏమో కానీ... జైన్ విషయంలో అయితే మాత్రం వంద శాతం నిజమనిపిస్తుంది. జైన్ కంఫర్ట్‌జోన్ నుంచి బయటకు వచ్చి జై శ్రీనివాసన్, మనీశ్లను కలుపుకొని అప్లికేషన్ రూపకల్పన ఆలోచన చేశాడు. ఆ సాహసమే విజయానికి దారి చూపింది. అప్లికేషన్ ఐడియా గురించి చెప్పగా గూగుల్ వెంచర్స్ వాళ్లు 1.75 మిలియన్ డాలర్ల పెట్టుబడిని పెట్టడానికి ముందుకొచ్చారు. అనంతరం మరో 4.5 మిలియన్ డాలర్ల మొత్తాన్ని చెల్లించి ఆ అప్లికేషన్‌ను పూర్తిగా కొనేశారు. దీంతో జైన్ బృందం దశ తిరిగింది. రాజీ పడిపోయి ఉద్యోగాలు చేసుకొంటూ, కంఫర్ట్ జోన్లో ఉన్నామని ఆనందిస్తూనే, మరోవైపుగా ఆందోళన పడటం కంటే... ఆత్మవిశ్వాసం ఉంటే సాహసం చేయడమే మంచిదనేది జైన్ సిద్ధాంతం. తను ఇప్పుడు అనుసరించిన ఈ బాటనే రానున్న రోజుల్లో మరింతమంది భారతీయ యువతీ యువకులు అనురిస్తారని జైన్ భావిస్తున్నాడు. ఈ మాటల ద్వారా అనేక మందిలో స్ఫూర్తిని నింపడానికి ప్రయత్నిస్తున్నాడు. రాహుల్‌జైన్ కాన్పూర్‌కు చెందిన యువకుడు. తండ్రి ప్రభుత్వ పనులను చేసిపెట్టే కాంట్రాక్టర్. ఉద్యోగాన్ని వదిలి ఈ విధంగా అప్లికేషన్లను అభివృద్ధి చేయడంపై దృష్టి సారించడానికి మొదట ఇంట్లో మద్దతు లభించలేదని... అయినప్పటికీ తను రిస్క్ చేశానని జైన్ చెబుతాడు. మరి ఇప్పుడు ఆ రిస్క్‌కు తగినట్టుగా విజయాన్ని సాధించడం ఎంతో ఆనందాన్నిస్తుందని అంటాడు.