Raja gopal reddy
-
అర్ధ రూపాయికి కూడా అమ్ముడుపోని వారికి రూ.100 కోట్లా?
సాక్షి, చౌటుప్పల్: యాదాద్రి భువనగిరి జిల్లాలోని చౌటుప్పల్ పట్టణంలో గురువారం నిర్వహించిన గౌడ ఆత్మీయ సమావేశంలో మునుగోడు బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్, మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ సహా పలువురు బీజేపీ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, టీఆర్ఎస్ పార్టీపై తీవ్ర విమర్శలు గుప్పించారు రాజగోపాల్ రెడ్డి. కేసీఆర్‌కు మతి భ్రమించి పిచ్చిగా ప్రవర్తిస్తున్నాడని, ఎన్నికలు వస్తే డబ్బు రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. మొయినాబాద్ ఫామ్‌హౌజ్ బేరసారాలు టీఆఎస్ చేసిన డ్రామాగా పేర్కొన్నారు. నెత్తి మీద రూపాయి పెడితే అర్థ రూపాయికి కూడా అమ్ముడుపోని వారికి రూ.100 కోట్లా పెడతారా? వాళ్ళను మేము కాదుకదా ఎవరు ఏ పార్టీలోకి రానివ్వరు అని ధ్వజమెత్తారు. ‘ 8 ఏళ్లలో తెలంగాణ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల బతుకులు బాగుపడలేదు. ఎన్నికలు వస్తే డబ్బు రాజకీయం చేస్తున్నారు. దుర్మార్గమైన పాలన నడుస్తుంది. ప్రశ్నించే గొంతు లేకుండా 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తీసుకొని ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశాడు కేసీఆర్. ఇటువంటి ముఖ్యమంత్రికి సరైన జవాబు చెప్పాలి. ఎక్కడ కూడా ప్రజాస్వామ్యం లేదు. టీఆర్ఎస్ పార్టీలో రాజకీయాలు చేసే వారివి బానిస బతుకులు. అవమానాలు భరించలేక బూర నర్సయ్య గౌడ్ బయటకు వచ్చారు. ఎంతోమంది ఉద్యమకారులు ఇప్పుడు ఆ పార్టీలో లేరు. దురహంకార పాలనకు చరమగీతం పాడాలి. ఒక ఎమ్మెల్యేని ఓడ కొట్టడానికి ఆలీబాబా 40 దొంగల ముఠా దిగింది. పోలీస్ జీపులో, ఎస్కార్ట్ జీపులల్లోనే డబ్బులు తీసుకెళుతున్నారు. నీ డబ్బు, నీ అధికారం కంటే ప్రజాశక్తి గొప్పదని హుజూరాబాద్ ప్రజలు నిరూపించారు.’ అని టీఆర్ఎస్ పార్టీపై నిప్పులు చెరిగారు రాజగోపాల్ రెడ్డి. తెలంగాణ వచ్చింది బడుగు బలహీన వర్గాల కోసమని, ప్రస్తుతం పేదవాడు ప్రభుత్వ ఆసుపత్రికి పోయే పరిస్థితి లేదని ఆందోళన వ్యక్తం చేశారు రాజగోపాల్ రెడ్డి. ఇదీ చదవండి: ఫాంహౌస్ డీల్‌పై వెలుగులోకి షాకింగ్ విషయాలు.. రోహిత్‌రెడ్డి ఫిర్యాదులో ఏముంది? -
రాజగోపాల్‌రెడ్డి ఆస్తుల విలువ.. రూ.274 కోట్లు
సాక్షి, నల్గొండ: మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తన ఆస్తులు, అప్పులతో పాటు పోలీస్ కేసుల వివరాలతో కూడిన ఎన్నికల అఫిడవిట్‌ను ఎన్నికల రిటర్నింగ్ అధికారికి అందజేశారు. సోమవారం ఆయన చండూరులో నామినేషన్ వేశారు. అఫిడవిట్లో పేర్కొన్న ప్రకారంగా ప్రస్తుతం రాజగోపాల్‌రెడ్డి పేరుపైన ఉన్న ఆస్తుల విలువ రూ.152 కోట్ల 69లక్షల 94వేలు కాగా, ఆయన భార్య లక్ష్మి పేరున రూ.48,55,25,250 కోట్ల విలువ చేసే స్థిరాస్తులు ఉన్నాయి. నల్లగొండ జిల్లా బ్రాహ్మణ వెల్లంల, సూర్యాపేట జిల్లా తుంగతుర్తిలో వ్యవసాయ భూములు, రంగారెడ్డి జిల్లా కోకాపేట, ఇతర ప్రాంతాల్లో వ్యవసాయేతర భూములు, హైదరాబాద్‌లో ప్లాట్లు ఉన్నట్లు పేర్కొన్నారు. రాజగోపాల్‌రెడ్డి పేరుపై ఉన్న చరాస్తుల విలువ రూ.69,97,70,142, ఆయన భార్య పేరుపైన రూ.3,89,63,167 విలువైన చరాస్తులు ఉన్నట్లు పేర్కొన్నారు. ఇప్పుడున్న స్థిర, చరాస్తుల విలువ సుమారు రూ.274 కోట్లు. బ్యాంకులో అప్పు రూ.61,84,80,220 ఉన్నట్లు చూపారు. కాగా, 2014లో మునుగోడు నుంచే పోటీ చేసినప్పుడు రాజగోపాల్‌రెడ్డితో పాటు ఆయన కుటుంబ సభ్యుల పేరుతో ఉన్న స్తిరాస్తుల విలువ రూ.47కోట్లు కాగా, చరాస్తుల విలువ రూ.265 కోట్లు ఉంది. అదేవిధంగా 2018 ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు ఆయనతో పాటు కుటుంబ సభ్యుల పేరుపై ఉన్న స్థిర, చరాస్తుల విలువ సుమారు రూ.198 కోట్లుగా ఆఫిడవిట్లో పేర్కొన్నారు. స్రవంతి ఆస్తుల విలువ రూ.40 కోట్లు మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి తరఫున డీసీసీ అధ్యక్షుడు శంకర్‌నాయక్ నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ సందర్బంగా రిటర్నింగ్ అధికారికి ఎన్నికల అఫిడవిట్ దాఖలు చేశారు. అఫిడవిట్లో పేర్కొన్న ప్రకారం స్రవంతి పేరుపైన రూ.25,71,52,390 కోట్ల విలువైన ఆస్తులు ఉండగా.. ఆమె భర్త పేరుపై రూ.15,13,25,804 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్లు లెక్కలు చూపించారు. బ్యాంకులో స్రవంతి పేరున రూ.6 లక్షలు, భర్త పేరున రూ.55 లక్షల అప్పులు చూపించారు. -
రాజగోపాల్ రెడ్డి వ్యవహారంపై రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
-
నలుగురు ప్రధానులకు రక్షకుడిగా ‘మిస్టర్ ఆంధ్ర’ రాజగోపాల్
సాక్షి, అమరావతి: ప్రతి యువకుడికి తండ్రే తన మొదటి హీరో. తూర్పు గోదావరి జిల్లా కాకినాడకు చెందిన వాసంశెట్టి రాజగోపాల్ కూడా తన తండ్రి స్ఫూర్తితో పోలీస్ శాఖలో చేరారు. నలుగురు ప్రధానులకు అంగరక్షక బృందంలో పనిచేసిన రికార్డు సొంతం చేసుకున్న వ్యక్తిగా రాష్ట్రం నుంచి రాజగోపాల్ ఒకే ఒక్కడు కావడం విశేషం. రాజగోపాల్ తండ్రి సత్తిరాజు ఆంగ్లేయుల కాలం(1930 ప్రాంతం)లో ఎస్సైగా పనిచేస్తే.. రాజగోపాల్ 1984లో పోలీస్ శాఖలో సబ్ ఇన్స్పెక్టర్గా చేరారు. రెండేళ్లకే ఎస్పీజీలో అవకాశం రాజగోపాల్‌కు వృత్తిలో చేరిన రెండేళ్లకే స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (ఎస్పీజీ)లో పనిచేసే అవకాశం దక్కింది. ప్రధానులకు అంగరక్షకులుగా ఉండే ఎస్పీజీలో 1986లో చేరారు. ఏడాదిపాటు కఠిన శిక్షణ అనంతరం 1987లో అప్పటి ప్రధాని రాజీవ్‌గాంధీ వద్ద ఎస్పీజీలో ఉండే 10 మంది రక్షకుల్లో ఒకరిగా చేరారు. వరుసగా ప్రధానులుగా పనిచేసిన విశ్వనాథ ప్రతాప్‌సింగ్, చంద్రశేఖర్, పీవీ నరసింహరావు వద్ద రక్షకుడిగా ఉంటూ వారితో శభాష్ అనిపించుకున్నారు. 1992లో తిరిగి రాష్ట్ర పోలీస్ విభాగానికి వచ్చిన ఆయన ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల్లో పనిచేశారు. ఇటీవల రాజమండ్రిలో ఏఎస్పీగా పదవీ విరమణ చేశారు. సేవల్లోనూ మేటి పోలీస్‌గా ఎక్కడ విధులు నిర్వహించినా ఆయన సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనేవారు. భీమవరం రూరల్ ఎస్సైగా పనిచేసిన కాలంలో కాళీపట్నం గ్రామానికి చెందిన జయరాజు అనేవ్యక్తిని పాము కరవగా.. అత్యవసరంగా జయరాజుకు రక్తం కావాలని వైద్యులు చెప్పడంతో రాజగోపాల్ రక్తదానం చేసి ప్రాణాన్ని కాపాడారు. తణుకులో రోడ్డు ప్రమాదానికి గురైన ఆటో డ్రైవర్‌కు అధిక రక్తస్రావంతో ప్రాణాపాయంలో ఉంటే రాజగోపాల్ రక్తదానం చేసి కాపాడారు. నిడదవోలు, తణుకు సీఐగా పనిచేసిన సమయంలోనూ విద్యార్థులకు సైకిళ్ల పంపిణీ, వృద్ధాశ్రమాలకు ఆర్థిక సాయం అందించి ఆదర్శంగా నిలిచారు. రాజగోపాల్‌కు 70కి పైగా రివార్డులు, అవార్డులు దక్కాయి. మిస్టర్ ఆంధ్రా రాజగోపాల్ విశాఖ ఆంధ్రా యూనివర్సిటీలో న్యాయశాస్త్రం చదివారు. ఫిజికల్ ఫిట్‌నెస్‌కు తొలినుంచీ ప్రాధాన్యత ఇచ్చే రాజగోపాల్ శరీర సౌష్టవ (బాడీ బిల్డింగ్)లో 1979 నుంచి 1982 వరకు మూడేళ్లపాటు వరుసగా మిస్టర్ ఆంధ్రాగా కొనసాగడం విశేషం. సంతృప్తిగా ఉంది.. పోలీస్ శాఖలో బాధ్యతలు నిర్వర్తించినందుకు సంతృప్తిగా ఉంది. నలుగురు ప్రధానులకు రక్షకుడిగా పనిచేసే అవకాశం దక్కడం ఆనందంగా ఉంది. మా నాన్న సత్తిరాజు స్ఫూర్తితో పోలీస్ అయిన నేను విధి నిర్వహణలో సంతృప్తికరంగా పనిచేశాను. ప్రస్తుతం రాజమండ్రిలో వ్యవసాయం, తోటల పెంపకం వంటి వ్యాపకాలను పెట్టుకున్నాను. ఇకపై సామాజిక సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకుంటాను. – వి.రాజగోపాల్, రిటైర్డ్ ఏఎస్పీ -
బడ్జెట్ సమావేశాలు నవ్వులాటగా మారాయి: భట్టి
సాక్షి, హైదరాబాద్: గవర్నర్ తమిళిసై ప్రసంగంలో పసలేదు, స్పష్టత లేదని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క విమర్శించారు. తెలంగాణ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించిన సంగతి తెలిసిందే. దీనిపై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క గన్‌పార్క్ వద్ద సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. అరేళ్లుగా చెప్పిందే చెప్తున్నారని, ఏం చేయాలనుకుంటున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. 57 ఏళ్లు దాడినవారి పెన్షన్లు ఇస్తామని చెప్పారని, కొత్త రేషన్ కార్డు ఇవ్వలేదన్నారు. క్రాంగ్రెస్ హయాంలో బియ్యంతో పాటు 9 రకాల సరుకలు ఇచ్చేశాళ్లం అన్నారు. నిరుద్యోగ భృతికి విధి విధానాలు రూపొందించలేదని, లక్షా 39 వేల ఉద్యోగాలు ఎక్కడ ఇచ్చారని ప్రశ్నించారు. మిషన్ భగీరథ నీరు ఎవరికి ఇస్తున్నారని, మునుగోడు నియోజకవర్గంలో చాలా ప్రాంతాల్లో నీరు రావట్లేదన్నారు. సీఎం కేసీఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి భగీరథ నీటిపై విసిరిన సవాల్‌ను స్వీకరించిన, కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్, నాగార్జున సాగర్ నుంచి రావాల్సిన నీరు రావట్లేదన్నారు. తెలంగాణలో లా అండ్ ఆర్డర్ సక్రమంగా లేదని అడ్వకేట్ దంపతుల హత్య పట్టపగలే జరిగిందని ఆయన ధ్వజమెత్తారు. బడ్జెట్ సమావేశాలు నవ్వులాటగా మారాయని, బడ్జెట్‌పై చర్చ కేవలం ఆరు రోజులే నిర్వహించటం దారుణమన్నారు. కేంద్ర చట్టాలను వ్యతిరేకిస్తున్నట్లు గవర్నర్ ప్రసంగంలో ఎందుకు పెట్టలేదని భట్టి ప్రశ్నించారు. అలాగే ములుగు ఎమ్మెల్యే సీతక్క మాట్లాడుతూ.. గవర్నర్ ప్రసంగం మొత్తం అబద్ధాలేనని మండిపడ్డారు. కరోనాకు సరైన ట్రీట్మెంట్ చేయట్లేదని గతంలో గవర్నరే చెప్పారు, మళ్లీ ఆ గవర్నర్‌తోనే కరోనాకు మంచి ట్రీట్మెంట్ చేసినట్లు చెప్పుకున్నారన్నారని విమర్శించారు. 60 ఏళ్లలో చేయని అప్పులు టీఆర్ఎస్ చేసిందని, కేసీఆర్‌ను పొగడటానికే గవర్నర్ ప్రసంగం సాగిందని మండిపడ్డారు. అసెంబ్లీని తప్పుదోవ పట్టిస్తున్నారని, తెలంగాణ ఉద్యమం సమయంలోనే 18 రోజులు అసెంబ్లీ నడిపారన్నారు. బైంసా ఘటనలో బాధిత బాలికకు న్యాయం చేయాలని, హైదరాబాద్‌లో హత్యలు జరుగుతున్నాయని ధ్వజమెత్తారు. అనంతరం గవర్నర్ సభను పొడిగించాలని కోరుతున్నామని ఆమె పేర్కొన్నారు. మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. రూ. 50 వేల కోట్లు అప్పు తెచ్చి మిషన్ భగీరథ తెచ్చారు కానీ ఆ పథకం 50 శాతం కూడా విజయం సాధించలేకపోయిందన్నారు. ప్రపంచంలో ఎక్కువ ఫ్లోరైడ్‌తో బాధపడిన ప్రాంతం మునుగోడని, అక్కడ ఇంకా భగీరథ నీరు అందటం లేదని ఆరోపించారు. సీమాంధ్ర నాయకులకే మళ్లీ కాంట్రాక్టులు ఇస్తున్నారని, దుబ్బాకలో, జీహెచ్ఎంసీలో ఓడిపోయినా ప్రభుత్వ తీరు మారలేదన్నారు. తెలంగాణలో ప్రభుత్వ ఆసుపత్రి తీరు బాగలేదని, సీఎం కేసీఆర్ కుటుంబం ప్రభుత్వ హాస్పిటళ్లకు వెళ్ళాలన్నారు. ఇక కేసీఆర్ మాటలను తెలంగాణ ప్రజలు నమ్మట్లేదని ఆయన పేర్కొన్నారు. -
‘స్థానిక’ పోరులో ఎవరు..?
సాక్షిప్రతినిధి, నల్లగొండ : నల్లగొండ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి నోటిఫికేషన్ వెలువడింది. ఈ నెల 31వ తేదీన పోలింగ్ నిర్వహించనున్నారు. గత డిసెంబర్లో జరిగిన శాసనసభ ముందస్తు ఎన్నికల్లో స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి మునుగోడు శాసనసభ్యుడిగా విజయం సాధించారు. ఆయన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడంతో ఈ స్థానం ఖాళీ అయ్యింది. అధికార టీఆర్ఎస్లో పలువురు నాయకులు ఈ స్థానానికి ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందా అని ఆశగా ఎదురుచూస్తున్నారు. దీంతో ఎమ్మెల్సీ పదవి పోటీ ఎక్కువగానే ఉంటుందన్న అభిప్రాయం పార్టీ వ ర్గాల్లో వ్యక్తమవుతోంది. నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డిని ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా పో టీకి పెట్టనున్నట్లు ఇప్పటికే ఆ పార్టీ అధినేత, సీ ఎం కేసీఆర్ ప్రకటించారు. ఇక పార్టీలో ఉన్న కొం దరు సీనియర్లు, ఒకరిద్దరు మాజీ ఎమ్మెల్యేలు సై తం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాన్ని ఆశిస్తున్నారు. కాగా, 2015లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి రాజగోపాల్‌రెడ్డి చే తిలో ఓడిపోయిన టీఆర్ఎస్ అభ్యర్థి డాక్టర్ తేరా చిన్నపురెడ్డికే తిరిగి అభ్యర్థిత్వం ఖరారు అవుతునంద్న అభిప్రాయం టీఆర్ఎస్ వర్గాలు వ్యక్తం చేశాయి. ప్రస్తుత సభ్యులే ఓటర్లు.. జిల్లాలో స్థానిక సంస్థలకు మూడు విడతల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. కాగా, ఇప్పటికే తొలి విడత పోలింగ్ కూడా పూర్తయ్యింది. ఈ నెల 14వ తేదీతో మూడు విడతల ఎన్నికలు పూర్తి కానున్నాయి. కాగా, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కొత్తగా ఎన్నికయ్యే ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులు కాకుండా ప్రస్తుత సభ్యులే ఓటర్లుగా ఉంటారని అధికార వర్గాలు చెబుతున్నాయి. అంతే కాకుం డా, జూలై మొదటి వారంలో పదవీకాలం ముగి యనున్న మున్సిపల్ కౌన్సిలర్లు కూడా స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. గత ఎన్నికల నాటి ఓటర్లతో పోలిస్తే తాజా ఓటర్ల సంఖ్య తగ్గింది. డిసెంబర్ 2015లో జరిగిన నల్లగొండ స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికల్లో 1110 మంది ఓటర్లు ఉండగా ఇప్పుడు వారి సంఖ్య 44 తగ్గి 1,066కు చేరింది. వీరిలో పలువురు ఎంపీటీసీ సభ్యులు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్‌లుగా పోటీ చేయడం కోసం ఎంపీటీసీ పదవులకు రాజీనామా చేశారు. స్థానిక ఎమ్మెల్సీ స్థానానికి నమోదైన ఓటర్లలో 2015 లెక్కల ప్రకారం నల్లగొండ రెవిన్యూ డివిజన్ పరిధిలో మున్సిపల్ కౌన్సిలర్లు 41 మంది, ఎంపీటీసీ సభ్యులు 160 మంది, జెడ్పీటీసీ సభ్యులు 12మంది కలిపి మొత్తం 213 మంది ఉన్నారు. అ దే మాదిరిగా, మిర్యాలగూడ రెవెన్యూ డివిజన్ పరిధిలో మున్సిపల్ కౌ న్సిలర్లు 37, హుజూర్నగర్ నగర పంచాయతీలో సభ్యులు 21, ఈ రెండు రెవెన్యూ డివిజన్ల పరిధి లో ఎంపీటీసీ సభ్యులు 167, జెడ్పీటీసీ సభ్యులు 11 మంది, మొత్తంగా 238 మంది ఉన్నారు. దేవరకొండ డివిజన్ పరిధి లో నగర పంచాయతీ సభ్యులు 21, ఎంపీటీసీ సభ్యులు 110, జెడ్పీటీసీ సభ్యులు 8 మంది సహా మొత్తం 139 మంది ఉన్నారు. భువనగిరి డివిజన్లో మున్సిపల్ కౌన్సిలర్లు 31, ఎంపీటీసీ సభ్యులు 194, జెడ్పీటీసీ సభ్యులు 14 మంది కలిపి మొత్తం 239 మంది. సూర్యాపేటలో కౌన్సిలర్లు 35, కోదాడలో కౌన్సిలర్లు 32 మంది కాగా, మొత్తం ఎంపీటీసీ సభ్యులు 202, జెడ్పీటీసీ సభ్యులు 14 మంది కలిపి మొత్తం 283 మంది ఉన్నారు. ఈ మొత్తం ఓటర్ల నుంచి 44 మంది తగ్గారు. పార్టీలు మారిన సభ్యులు.. 2014లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులుగా, మున్సిపల్ కౌన్సిలర్లుగా అత్యధికులు కాంగ్రెస్ నుంచే గెలిచారు. ఆ ఎన్నికల్లో టీఆర్ఎస్ పెద్దగా గెలుచుకోలేకపోయిం ది. ఆ తర్వాత వీరిలో అత్యధికులు కాంగ్రెస్‌ను వీడి అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ పంచన చేరారు. అయినా, 2015లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. అప్పటికి స్థానిక సభ్యులు ఎక్కువ మంది కాంగ్రెస్‌లోనే ఉండడంతో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు సునా యా సం అయ్యింది. కానీ, ఇప్పుడా ఆ సభ్యుల్లో అత్యధికులు టీఆర్ఎస్లో ఉండడంతో ఈసారి ఎన్నికల్లో గెలుపు అవకాశం తమకే ఉంటుందన్నది టీఆ ర్ఎస్ వర్గాల వాదనగా ఉంది. కాగా, అసలు ఈ స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పోటీ చేస్తుం దా..? అయితే, ఎవరికి అవకాశం దక్కుతుందన్న అంశంపై భిన్నాభిప్రాయం వ్యక్తం అవుతోంది. -
రాహుల్, మోదీల మధ్యే పోరు
సాక్షి, న్యూఢిల్లీ: రానున్న లోక్‌సభ ఎన్నికల్లో ప్రధాని నరేంద్రమోదీకి, కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీకి మధ్యే పోరు జరగనుందని టీకాంగ్రెస్ నేతలు పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీనే దేశంలో సుస్థిరమైన పాలన అందించగలదన్నారు. లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఏఐసీసీ పబ్లిసిటీ కమిటీ అన్ని రాష్ట్రాల కమిటీలతో మంగళవారం ఢిల్లీలో ప్రత్యేక సమావేశం నిర్వహించింది. ఏఐసీసీ పబ్లిసిటీ కమిటీ చైర్మన్ ఆనంద్ శర్మ అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ కూడా పాల్గొన్నారు. దీనికి రాష్ట్రం నుంచి పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పబ్లిసిటీ కమిటీ చైర్మన్ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, క్యాంపెయిన్ కమిటీ చైర్పర్సన్ విజయశాంతి హాజరయ్యారు. పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడంలో పబ్లిసిటీ కమిటీలు ఏ విధం గా ప్రజల్లోకెళ్లాలి అన్న విషయాలపై సమావేశంలో చర్చించినట్టు తెలిసింది. రాహుల్.. దేశ భవిష్యత్తు: రాజగోపాల్‌రెడ్డి సమావేశం అనంతరం రాజగోపాల్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. లౌకికంగా కాంగ్రెస్ దేశాన్ని ఏ విధంగా కాపాడిందన్న విషయాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంపై చర్చించామని చెప్పారు. కాంగ్రెస్ పార్టీనే దేశానికి మెరుగైన పాలన అందించగలుగుతుందని, రాహుల్ గాంధీ దేశ భవిష్యత్తు అని.. రాష్ట్ర అభివృద్ధి కూడా కాంగ్రెస్ ద్వారానే సాధ్యమవుతుందన్నారు. త్వరలో నిర్ణయిస్తాం: విజయశాంతి క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి రాబోయే రోజుల్లో పబ్లిసిటీ, క్యాంపెయిన్ కమిటీల పాత్ర ఎలా ఉండాలన్న దానిపై ఈ భేటీలో చర్చించినట్లు విజయశాంతి చెప్పారు. ఎన్నికల ప్రచారాన్ని ఎప్పట్నుంచి ప్రారం భించాలన్న దానిని త్వరలోనే నిర్ణయిస్తామన్నారు. అసెంబ్లీ ఎన్నికలకు లోక్‌సభ ఎన్నికలకు తేడా ఉం టుందని.. ఈ ఎన్నికలు ప్రధాని మోదీకి, రాహుల్ గాంధీకి మధ్య జరిగే యుద్ధమన్నారు. -
గాంధీభవన్‌లో నేతల బాహాబాహీ
-
డబ్బుల చేరవేతలో రమేష్‌దే కీలకపాత్ర
ఒంగోలు: తెలంగాణ మెడికల్ ఎంసెట్-2 పేపర్ లీకేజీ వ్యవహారంలో రాజగోపాల్ రెడ్డితో పాటు కనిగిరికి చెందిన రమేష్ కూడా కీలక పాత్ర వహించినట్లు సీఐడీ విచారణలో వెల్లడైంది. ఆర్మీలో పని చేసి పదవీ విరమణ చేసిన రమేష్ అనంతరం కోచింగ్ సెంటర్ల వద్ద దళారీగా వ్యవహరించేవాడు. విద్యార్థుల నుంచి డబ్బులు వసూళ్లు, చేరవేతలో అతడు కీలక పాత్ర వహించినట్లు తెలుస్తోంది. చాలాకాలంగా ఇలాంటి వ్యవహారాలే నడిపినట్లు తెలుస్తోంది. ప్రకాశం జిల్లా కందుకూరు నియోజకవర్గం వలేటివారిపాలెంకు చెందిన రమేష్ ఇరవై ఏళ్ల క్రితమే స్వస్థలాన్ని వదిలి హైదరాబాద్ ఉప్పల్‌లో ఉంటున్నాడు. ఇతడికి ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె. ఒకరు డాక్టర్ కాగా, మరొకరు నేవీ ఉద్యోగి. కాగా ఈ కేసుకు సంబంధించి సీఐడీ అధికారులు తొలుత కనిగిరికి చెందిన ఖాశింను అదుపులోకి తీసుకుని విచారణ జరిపి, అనంతరం వదిలిపెట్టిన విషయం తెలిసిందే. ఇతడు రమేష్ భార్య సోదరి కుమారుడు. రమేష్‌కు చెందిన ఫోన్‌కాల్ లిస్ట్‌లో ఎక్కువసార్లు ఖాశిం నెంబర్ ఉండటంతో సీఐడీ అధికారులు అతని కదలికలపై నిఘా పెట్టారు. మరోవైపు రమేష్ తరచూ కనిగిరిలో బస చేసే కందుకూరు గ్రానైట్ వ్యాపారికి చెందిన కనిగిరి గెస్ట్ హౌస్‌ను కూడా సీఐడీ అధికారులు తనిఖీలు చేశారు. ఈ కేసులో అదుపులోకి తీసుకున్న రాజగోపాల్ రెడ్డి,రమేష్, తిరుమల్, విష్ణులను సీఐడీ అధికారులు రహస్య ప్రాంతంలో విచారణ జరుపుతున్నారు. మరోవైపు ఎంసెట్-2 పరీక్షపై ప్రభుత్వం నేడు కీలక నిర్ణయం తీసుకోనుంది. -
‘మే16 వరకు రాజగోపాల్‌రెడ్డిని అరెస్ట్ చేయొద్దు’
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ జిల్లా పులివెందుల కాంగ్రెస్ అభ్యర్థి రాజగోపాల్‌రెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద నమోదైన కేసులో రాజగోపాల్‌రెడ్డిని మే 16వ తేదీ వరకు అరెస్ట్ చేయవద్దని హైకోర్టు మంగళవారం పోలీసులను ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ నూతి రామ్మోహనరావు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. ఎన్నికల సమయంలో రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా పోలీసులు తనపై ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద కేసు నమోదు చేశారంటూ రాజగోపాల్‌రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు.