‘స్థానిక’ పోరులో ఎవరు..? | Full Fight In ZPTC And MPTC Election Telangana | Sakshi
Sakshi News home page

‘స్థానిక’ పోరులో ఎవరు..?

Published Wed, May 8 2019 8:39 AM | Last Updated on Wed, May 8 2019 10:07 AM

Full Fight In ZPTC And MPTC Election Telangana - Sakshi

సాక్షిప్రతినిధి, నల్లగొండ : నల్లగొండ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి నోటిఫికేషన్‌ వెలువడింది. ఈ నెల 31వ తేదీన పోలింగ్‌ నిర్వహించనున్నారు. గత డిసెంబర్‌లో జరిగిన శాసనసభ ముందస్తు ఎన్నికల్లో స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి మునుగోడు శాసనసభ్యుడిగా విజయం సాధించారు. ఆయన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడంతో ఈ స్థానం ఖాళీ అయ్యింది. అధికార టీఆర్‌ఎస్‌లో పలువురు నాయకులు ఈ స్థానానికి ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్‌ ఎప్పుడు వస్తుందా అని ఆశగా ఎదురుచూస్తున్నారు.

దీంతో ఎమ్మెల్సీ పదవి పోటీ ఎక్కువగానే ఉంటుందన్న అభిప్రాయం పార్టీ వ ర్గాల్లో వ్యక్తమవుతోంది. నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డిని ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా పో టీకి పెట్టనున్నట్లు ఇప్పటికే ఆ పార్టీ అధినేత, సీ ఎం కేసీఆర్‌ ప్రకటించారు. ఇక పార్టీలో ఉన్న కొం దరు సీనియర్లు, ఒకరిద్దరు మాజీ ఎమ్మెల్యేలు సై తం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాన్ని ఆశిస్తున్నారు. కాగా, 2015లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి రాజగోపాల్‌రెడ్డి చే తిలో ఓడిపోయిన టీఆర్‌ఎస్‌ అభ్యర్థి డాక్టర్‌ తేరా చిన్నపురెడ్డికే తిరిగి అభ్యర్థిత్వం ఖరారు అవుతునంద్న అభిప్రాయం టీఆర్‌ఎస్‌ వర్గాలు వ్యక్తం చేశాయి.

ప్రస్తుత సభ్యులే ఓటర్లు..
జిల్లాలో స్థానిక సంస్థలకు మూడు విడతల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. కాగా, ఇప్పటికే తొలి విడత పోలింగ్‌ కూడా పూర్తయ్యింది. ఈ నెల 14వ తేదీతో మూడు విడతల ఎన్నికలు పూర్తి కానున్నాయి. కాగా, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కొత్తగా ఎన్నికయ్యే ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులు కాకుండా ప్రస్తుత సభ్యులే ఓటర్లుగా ఉంటారని అధికార వర్గాలు చెబుతున్నాయి. అంతే కాకుం డా, జూలై మొదటి వారంలో పదవీకాలం ముగి యనున్న మున్సిపల్‌ కౌన్సిలర్లు కూడా స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. గత ఎన్నికల నాటి ఓటర్లతో పోలిస్తే తాజా ఓటర్ల సంఖ్య తగ్గింది. డిసెంబర్‌ 2015లో జరిగిన నల్లగొండ స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికల్లో 1110 మంది ఓటర్లు ఉండగా ఇప్పుడు వారి సంఖ్య 44 తగ్గి 1,066కు చేరింది.

వీరిలో పలువురు ఎంపీటీసీ సభ్యులు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్‌లుగా పోటీ చేయడం కోసం ఎంపీటీసీ పదవులకు రాజీనామా చేశారు. స్థానిక ఎమ్మెల్సీ స్థానానికి నమోదైన ఓటర్లలో 2015 లెక్కల ప్రకారం నల్లగొండ రెవిన్యూ డివిజన్‌ పరిధిలో మున్సిపల్‌ కౌన్సిలర్లు 41 మంది, ఎంపీటీసీ సభ్యులు 160 మంది, జెడ్పీటీసీ సభ్యులు 12మంది కలిపి మొత్తం 213 మంది ఉన్నారు.

అ దే మాదిరిగా, మిర్యాలగూడ రెవెన్యూ డివిజన్‌ పరిధిలో మున్సిపల్‌ కౌ న్సిలర్లు 37, హుజూర్‌నగర్‌ నగర పంచాయతీలో సభ్యులు 21, ఈ రెండు రెవెన్యూ డివిజన్ల పరిధి లో ఎంపీటీసీ సభ్యులు 167, జెడ్పీటీసీ సభ్యులు 11 మంది, మొత్తంగా 238 మంది ఉన్నారు. దేవరకొండ డివిజన్‌ పరిధి లో నగర పంచాయతీ సభ్యులు 21, ఎంపీటీసీ సభ్యులు 110, జెడ్పీటీసీ సభ్యులు 8 మంది సహా మొత్తం 139 మంది ఉన్నారు. భువనగిరి డివిజన్‌లో మున్సిపల్‌ కౌన్సిలర్లు 31, ఎంపీటీసీ సభ్యులు 194, జెడ్పీటీసీ సభ్యులు 14 మంది కలిపి మొత్తం 239 మంది. సూర్యాపేటలో కౌన్సిలర్లు 35, కోదాడలో కౌన్సిలర్లు 32 మంది కాగా, మొత్తం ఎంపీటీసీ సభ్యులు 202, జెడ్పీటీసీ సభ్యులు 14 మంది కలిపి మొత్తం 283 మంది ఉన్నారు. ఈ మొత్తం ఓటర్ల నుంచి 44 మంది తగ్గారు.

పార్టీలు మారిన సభ్యులు..
2014లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులుగా, మున్సిపల్‌ కౌన్సిలర్లుగా అత్యధికులు కాంగ్రెస్‌ నుంచే గెలిచారు. ఆ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పెద్దగా గెలుచుకోలేకపోయిం ది. ఆ తర్వాత వీరిలో అత్యధికులు కాంగ్రెస్‌ను వీడి అధికారంలో ఉన్న టీఆర్‌ఎస్‌ పార్టీ పంచన చేరారు. అయినా, 2015లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ విజయం సాధించింది. అప్పటికి స్థానిక సభ్యులు ఎక్కువ మంది కాంగ్రెస్‌లోనే ఉండడంతో కాంగ్రెస్‌ అభ్యర్థి గెలుపు సునా యా సం అయ్యింది. కానీ, ఇప్పుడా ఆ సభ్యుల్లో అత్యధికులు టీఆర్‌ఎస్‌లో ఉండడంతో ఈసారి ఎన్నికల్లో గెలుపు అవకాశం తమకే ఉంటుందన్నది టీఆ ర్‌ఎస్‌ వర్గాల వాదనగా ఉంది. కాగా, అసలు ఈ స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పోటీ చేస్తుం దా..? అయితే, ఎవరికి అవకాశం దక్కుతుందన్న అంశంపై భిన్నాభిప్రాయం వ్యక్తం అవుతోంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement