సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ జిల్లా పులివెందుల కాంగ్రెస్ అభ్యర్థి రాజగోపాల్‌రెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద నమోదైన కేసులో రాజగోపాల్‌రెడ్డిని మే 16వ తేదీ వరకు అరెస్ట్ చేయవద్దని హైకోర్టు మంగళవారం పోలీసులను ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ నూతి రామ్మోహనరావు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. ఎన్నికల సమయంలో రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా పోలీసులు తనపై ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద కేసు నమోదు చేశారంటూ రాజగోపాల్‌రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు.