rajdev ranjan
-
జర్నలిస్టు హత్య వెనుక రాజకీయనేతల హస్తం!
న్యూఢిల్లీ: బిహార్‌కు చెందిన హిందుస్తాన్ పత్రిక బ్యూరో చీఫ్ రాజ్దేవ్ రంజన్ హత్య వెనుక రాజకీయ నాయకుల హస్తం ఉండొచ్చని ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(పీసీఐ) అనుమానం వ్యక్తం చేసింది. రంజన్ రాసిన విమర్శనాత్మక కథనాలను జీర్ణించుకోలేక ఆయనను హత్య చేసి ఉంటారంది. పీసీఐ నియమించిన నిజనిర్ధారణ కమిటీ అందజేసిన నివేదికను అది ఆమోదించింది. జార్ఖండ్‌లోని ఛత్రా టీవీ జర్నలిస్టు అఖిలేశ్ప్రతాప్సింగ్ హత్యపైనా నిజనిర్దారణ కమిటీ వేసింది. డబ్బుల కోసం డిమాండ్ చేసిన నక్సలైట్ గ్రూపు అఖిలేశ్‌ను హత్య చేసి ఉంటుందని కమిటీ అభిప్రాయపడింది. -
ఆ హత్య కేసు సీబీఐకి ఇస్తున్నారు
పాట్నా: ఎట్టకేలకు బిహార్‌లో దారుణ హత్యకు గురైన జర్నలిస్టు కేసు విచారణ వేగాన్ని అందుకోనుంది. ఈ కేసు విచారణ బాధ్యతలను సీబీఐకి అప్పగించాలని తాము నిర్ణయం తీసుకున్నట్లు బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ చెప్పారు. 'మేం ఇప్పటికే ఈ కేసును సీబీఐకి అప్పగించాలని నిర్ణయం తీసుకున్నాం. దర్యాప్తు సంస్థకు కావాల్సిన అన్ని రకాల సమాచారాన్ని మేం అందిస్తాం' అని జనతా దర్బార్ కార్యక్రమం అనంతరం నితీష్ చెప్పారు. ఈ కేసును సీబీఐతోనే విచారించాలని బాధిత కుటుంబం కోరిందని, ఆమేరకే తాము నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. సివాన్ లోని ఓ హిందీ డైలీకి బ్యూరో ఇంచార్జీగా పనిచేస్తున్న రాజ్ దేవ్ రంజన్ ను ఈ నెల 13న గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపిన విషయం తెలిసిందే. -
'నా కుమారుడిని ఎవరు చంపారో తెలుసు'
పాట్నా: తన కుమారుడిని ఎవరు హత్య చేశారో ప్రజలందరీకి తెలుసని ఇటీవల బిహార్‌లో దారుణ హత్యకు గురైన రాజ్దేవ్ రంజన్ తండ్రి రాధాకృష్ణ చౌదరీ అన్నారు. ఒక్క సీబీఐ దర్యాప్తు మాత్రమే తన కుటుంబానికి న్యాయం చేయగలదని చెప్పారు. ఈ హత్య వెనుకగల కారణాలు అందరికీ తెలుసన్నారు. సీనియర్ పాత్రికేయుడైన రాజ్దేవ్ రంజన్‌ను శుక్రవారం సాయంత్రం బిహార్‌లోని సివాన్ జిల్లాలో గుర్తుతెలియని దుండగులు కాల్చిచంపిన విషయం తెలిసిందే. రాజ్దేవ్ హిందీ దినపత్రిక 'హిందూస్తాన్'లో బ్యూరో చీఫ్ గా 20 ఏళ్లుగా పనిచేస్తున్నారు. సివాన్ రైల్వేస్టేషన్ వద్ద అతి సమీపం నుంచి ఆయనపై కాల్పులు జరపడంతో ఆయన శరీరంలోకి ఐదు బుల్లెట్లు దూసుకుపోయి ప్రాణాలుకోల్పోయారు. ఈ హత్యపై ప్రతిపక్షాలు భగ్గుమన్నాయి. 'బిహార్ జంగల్ రాజ్ నుంచి మహా జంగల్ రాజ్'గా మారిందని బీజేపీ మండిపడింది. ఈ నేపథ్యంలో ఆయన తండ్రి రాధాకృష్ణ స్పందించారు. 'మాకు స్థానిక పోలీసులు.. రాష్ట్ర పాలక వర్గంపై ఏ మాత్రం విశ్వాసం లేదు. ఈ కేసులో సీబీఐ దర్యాప్తు జరిపించాల్సిందే. సివాన్ ప్రాంత ప్రజలందరికీ ఈ హత్య వెనుక ఎవరున్నారో తెలుసు' అని ఆయన చెప్పారు.