ఆ హత్య కేసు సీబీఐకి ఇస్తున్నారు | Nitish Kumar recommends CBI probe into Bihar journalist murder case | Sakshi
Sakshi News home page

ఆ హత్య కేసు సీబీఐకి ఇస్తున్నారు

Published Mon, May 16 2016 6:38 PM | Last Updated on Mon, Sep 4 2017 12:14 AM

ఆ హత్య కేసు సీబీఐకి ఇస్తున్నారు

ఆ హత్య కేసు సీబీఐకి ఇస్తున్నారు

పాట్నా: ఎట్టకేలకు బిహార్లో దారుణ హత్యకు గురైన జర్నలిస్టు కేసు విచారణ వేగాన్ని అందుకోనుంది. ఈ కేసు విచారణ బాధ్యతలను సీబీఐకి అప్పగించాలని తాము నిర్ణయం తీసుకున్నట్లు బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ చెప్పారు. 'మేం ఇప్పటికే ఈ కేసును సీబీఐకి అప్పగించాలని నిర్ణయం తీసుకున్నాం.

దర్యాప్తు సంస్థకు కావాల్సిన అన్ని రకాల సమాచారాన్ని మేం అందిస్తాం' అని జనతా దర్బార్ కార్యక్రమం అనంతరం నితీష్ చెప్పారు. ఈ కేసును సీబీఐతోనే విచారించాలని బాధిత కుటుంబం కోరిందని, ఆమేరకే తాము నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. సివాన్ లోని ఓ హిందీ డైలీకి బ్యూరో ఇంచార్జీగా పనిచేస్తున్న రాజ్ దేవ్ రంజన్ ను ఈ నెల 13న గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపిన విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement