Rajiv gruhakalpa
-
గృహకల్పలో బినామీలపై విచారణ
సాక్షి, రంగారెడ్డి జిల్లా: జిల్లాలో రాజీవ్ గృహకల్ప, జేఎన్ఎన్యూఆర్ఎం కాలనీల్లో ఇళ్లు పొందిన లబ్ధిదారుల్లో పెద్ద సంఖ్యలో అనర్హులున్నట్లు జిల్లా యంత్రాంగం ప్రాథమికంగా నిర్ధారించింది. క్షేత్రస్థాయిలో ఆకస్మిక తనిఖీలు చేపట్టి అనర్హులను గుర్తించి వారికిచ్చిన గృహాలను వెనక్కు తీసుకోవాలని నిర్ణయించింది. శనివారం కలెక్టరేట్లో జేఎన్ఎన్యూఆర్ఎం, రాజీవ్ గృహ కల్ప పథకాల్లో నిర్మించిన ఇళ్ల పరిస్థితిపై ఎంపీలు, ఎమ్మెల్యేలతో మంత్రి మహేందర్‌రెడ్డి ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు మాట్లాడుతూ ఈ పథకాల్లో ఇళ్లు పొందిన లబ్ధిదారులు చాలావరకు అద్దెకు ఇచ్చుకున్నారని, అలాంటివారిపై చర్యలు తీసుకొని ఇళ్లు లేని నిరుపేదలకు మంజూరు చేయాలన్నారు. దీనికి మంత్రి మహేందర్‌రెడ్డి స్పందిస్తూ ఈ అంశంపై విచారణ జరిపించి అనర్హులను తొలగించి అర్హులకు ఇళ్లు కేటాయించేలా చర్యలు తీసుకోవాలన్నారు. 2005 సంవత్సరంలో 54వేల మంది దరఖాస్తు చేసుకుంటే.. ఇందులో 44వేల మందిని అర్హులుగా గుర్తించినప్పటికీ.. ఇందులో 21366 మందికి ఇంకా ఇళ్లు కేటాయించగా.. 16399 మందికి ఇంకా ఇళ్లు ఇవ్వాల్సి ఉందన్నారు. జేఎన్ఎన్యూఆర్ఎం కాలనీల్లో తాగునీటి కొరత తీవ్రంగా ఉందని, పలుకాలనీల్లో మౌలిక వసతులు లేకపోవడంతో లబ్ధిదారులు నివాసం ఉండటంలేదని పలువురు ఎమ్మెల్యేలు ప్రస్తావించారు. దీంతో మంత్రి స్పందిస్తూ రాజీవ్ గృహకల్ప, జేఎన్ఎన్యూఆర్ఎం కాలనీల్లో మౌలిక వసతులు కల్పించేందుకు జాయింట్ కలెక్టర్ స్థాయిలో ఒక కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ కాలనీలకు రూ.102.14కోట్లు రావాల్సి ఉండగా.. జీహెచ్ఎంసీ నుంచి నిధులు విడుదల కాలేదని మంత్రి పేర్కొన్నారు. కృష్ణా మూడోదశ పనులు త్వరలో పూర్తి చేసి నీటి కొరత సమస్య తీరుస్తామన్నారు. సమావేశంలో ఎంపీలు కె.విశ్వేశ్వర్‌రెడ్డి, సీహెచ్.మల్లారెడ్డి, బి.నర్సయ్యగౌడ్, ఎమ్మెల్యేలు టి.రామ్మెహన్‌రెడ్డి, సుధీర్‌రెడ్డి, కిషన్‌రెడ్డి, క్రిష్ణారెడ్డి, ప్రకాష్‌గౌడ్, వివేకానంద, కాలె యాదయ్య, ప్రభాకర్, కలెక్టర్ ఎన్.శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. -
సమస్యల గూడెం
తాడేపల్లిగూడెం, న్యూస్‌లైన్ : జిల్లాలో వ్యాపార కేంద్రంగా ప్రసిద్ధ చెందిన తాడేపల్లిగూడెం సమస్యల నిలయంగా మారింది. పట్టణంలో ట్రాఫిక్ సమస్య నిత్యకృత్యమైంది. పూర్తికాని భూగర్భ డ్రెయినేజీ పనులు.. శివారు ప్రాంతాల్లో తాగునీటి సమస్య వేధిస్తున్నాయి. రెండో వేసవి జలాశయం, రెండో వంతెనకు అప్రోచ్ రోడ్ల నిర్మాణం కలగా మారింది. నవాబుపాలెంలో వంతెన నిర్మాణం మూడేళ్లుగా సాగుతోంది. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో నిధులు జల్లు కురిపించారు. 2004 నుంచి 2009 వరకు తాడేపల్లిగూడెం నియోజకవర్గం అభివృద్ధిలో పరుగులు తీయగా వైఎస్ మరణానంతరం పనులు నత్తనడకన సాగుతున్నాయి. మళ్లీ వైఎస్ లాంటి నాయకుడు వస్తేనే నియోజకవర్గం అభివృద్ధి పథంలో ముందుంటుందని ఇక్కడి ప్రజలు భావిస్తున్నారు. పాలిటెక్నిక్ భవన నిర్మాణమెప్పుడో.. గ్రామీణ ప్రాంతాల ప్రజలకు పాలిటెక్నిక్ విద్యను చేరువ చేసే కార్యక్రమంలో భాగంగా తాడేపల్లిగూడెం మండలం జగన్నాథపురం సమీపంలో కొంత భూమిని ప్రభుత్వ పాలిటెక్నిక్ భవన నిర్మాణం కోసం కేటాయించారు. ఇక్కడి మాజీ ప్రజాప్రతినిధి ప్రతిపాదించిన స్థలంలో భవన నిర్మాణానికి ఇష్టంలేని మరో ప్రజాప్రతినిధి మరో ప్రాంతంలో నిర్మాణం కోసం ప్రతిపాదనలు పంపారు. కాలం గడుస్తున్నా భవన నిర్మాణం ఊసులేదు. ప్రస్తుతం పెంటపాడు డీఆర్ గోయంకా కళాశాలలోని ఓ శిథిల భవనంలో ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల కొనసాగుతోంది. జూనియర్ కళాశాలకు భవనం లేదు విద్యాపరంగా ఎంతో విస్తరించిన తాడేపల్లిగూడెంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలకు సొంత భవనం లేదు. పదేళ్ల కాలంగా ఇదిగో జూనియర్ కళాశాలకు పక్కా భవనం అంటూ ఊరింపే కాని, ఉద్దరింపులేదు. కళాశాల నిర్మాణం కోసం పలుచోట్ల వేసిన శిలాఫలకాలు అలానే ఉండిపోయాయి. ఫలితంగా జెడ్పీ హైస్కూల్లోనే విద్యార్థులు ఇంటర్మీడియెట్ చదువులు కొనసాగిస్తున్నారు. దాహం కేకలు తాడేపల్లిగూడెంలో రెండో వేసవి జలాశయం ఎపిసోడ్ ఎంతకు కొలిక్కిరాకపోవడంతో శివారు ప్రాంతాలలో దాహం కేకలు వినిపిస్తున్నాయి. పెంటపాడు మండలం జట్లపాలెంలో ఇది నిత్యనూతనమై పోయింది. గతేడాది మార్చిలో రూ.30 లక్షలతో చెరువు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అయితే పనులు ముందుకుసాగడంలేదు. జట్లపాలెం చెరువు నిండా గుర్రపుడెక్కతో నిండిపోయింది. గూడు కల్పిస్తే ఒట్టు తాడేపల్లిగూడెంలో ఇళ్లులేని పేదలు పదివేలకు పైగా ఉన్నారు. 2009 సార్వత్రిక ఎన్నికల ముందు వీరి కోసం మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి రాజీవ్ గృహకల్ప వద్ద 52 ఎకరాల భూమిని కేటాయించారు. భూమి పూడికకు నిధులు విడుదల చేశారు. అయితే మహానేత మరణానంతరం ఈ విషయాన్ని పట్టించుకున్న నాథుడే లేరు. ఇదే ప్రాంతం సమీపంలో 2009లో 20 వార్డులలో అర్హులైన 480 మంది పేదలకు ఇళ్లు కట్టించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. వీటిలో 2013 నాటికి 240 ఇళ్లు కట్టి ఇవ్వగలిగారు. వాటిని ఆర్భాటంగా అప్పటి సీఎం కిరణ్ ప్రారంభోత్సవం చేశారు. అయితే ఇక్కడ మౌలిక వసతుల సమస్య ఉంది. 2007లో 280 మంది పేదలకు వైఎస్ హయాంలో కట్టించి ఇచ్చిన రాజీవ్ గృహకల్పలో సౌకర్యాల సంగతిని నేతలు విస్మరించారు. అబ్బో...అక్విడెక్టు నందమూరు పాత అక్విడెక్టు సమస్య ఏళ్ల తరబడి అలానే ఉంది. ప్రతిఏటా ఎర్రకాలువ వేలాది ఎకరాలను మింగేస్తున్నా సమస్య పరిష్కారానికి చిత్తశుద్ధితో కృషి చేసిన దాఖలాలు లేవు. మహానేత వైఎస్ రా జశేఖరరెడ్డి హయాంలో స మస్య పరిష్కారానికి న్యా యపరమైన అభ్యంతరాలు తొలిగాయి. ఆ యన మరణానంతరం వీటిని పట్టించు కున్నది లేదు. -
ఉన్నది రాస్తే ఉలిక్కిపడ్డ 'తమ్ముళ్లు'
‘గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు తడుముకున్న’ చందంగా తయారైంది తెలుగుదేశం పార్టీలో కొందరు నేతల పరిస్థితి. తెలుగు తమ్ముళ్ల ప్రోద్బలంతో జరుగుతున్న భూ కబ్జాలపై వాస్తవాలు వెలుగులోకి తెచ్చిన ‘సాక్షి’ లక్ష్యంగా కొందరిని ఉసిగొల్పి శుక్రవారం ఆందోళనకు దిగారు. కాకినాడ రాజీవ్‌గృహకల్ప-దుమ్ములుపేట మధ్య కోట్లాది రూపాయల విలువైన 8 ఎకరాల రెవెన్యూ భూమి కబ్జాచేసే ప్రయత్నాన్ని ‘తెలుగు తమ్ముళ్ల భూ బాగోతం’ శీర్షికన గురువారం ‘సాక్షి’లో ప్రచురితమైన కథనం ఆ పార్టీ నాయకులకు గిట్టలేదు. వాస్తవాలు రుచించక ఆ పార్టీకి చెందిన మాజీ ప్రజాప్రతినిధి, అతని ముఖ్య అనుచరుల ప్రోద్బలంతో కొందరితో ‘సాక్షి’ కాకినాడ కార్యాలయంపై దాడికి ప్రయత్నించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ముందస్తుగా కార్యాలయం వద్ద మోహరించడంతో వచ్చిన మహిళలు కొద్దిసేపు ఆందోళన చేసి వెళ్లిపోయారు. వివాద నేపథ్యాన్ని పరి శీలిస్తే.. కాకినాడ దుమ్ములుపేట ప్రాంతంలో సుమారు 8 ఎకరాల రెవెన్యూ స్థలంపై తెలుగు తమ్ముళ్లు కన్నేశారు. దాదాపు 15 ఏళ్ల క్రితం మాజీ మంత్రి దివంగత మల్లాడి స్వామి ఇక్కడి నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇప్పించేందుకు ఆ ప్రాంతాన్ని లేఅవుట్ చేయించారు. అది కార్యరూపం దాల్చలేదు. అనంతరం ప్రభుత్వాలు, ప్రజాప్రతినిధులు మారిపోయారు. సదుద్దేశంతో ఇళ్ల స్థలాల కోసం మల్లాడి చేసిన ప్రతిపాదనలను సాకుగా, కొంతమంది స్థానికుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని రెండు దశాబ్దాలు గడిచిపోయాక తెలుగు తమ్ముళ్లు ఆ భూమిని కాజేసే ప్రయత్నంలో ఉన్నారు. దీనిలో భాగంగా ఆ భూమిని చదును చేయడం మొదలుపెట్టారు. వాస్తవానికి రికార్డుల్లో ఆ భూమి రెవెన్యూ శాఖదిగానే ఉంది. ఎవరికీ పట్టాలు ఇవ్వలేదని, తమ భూమి కబ్జాకు గురవుతోందని కాకినాడ అర్బన్ రెవెన్యూ అధికారులు కాకినాడ పోర్టు పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. ఫలితంగా పోలీసులు ఆ పనులను నిలుపుదల చేయిం చారు. ఇవే విషయాలను ‘సాక్షి’ ప్రచురించింది. వాస్తవ పరిస్థితిని వెలుగులోకి తేవడంతో ఆ భూమిపై కన్నేసిన తెలుగు తమ్ముళ్లు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఆ భూమి విలువ రూ.20 కోట్లపైగా ఉండడంతో ప్లాట్లుగా విడదీసి సొమ్ము చేసుకోవాలని ప్రయత్నించడం, ఇందుకు అడ్డుపడ్డ ‘సాక్షి’పై అక్కసు వెళ్లగక్కడంపై సర్వత్రా సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ తరహా భూ కబ్జాలు ఇటీవల ఒకొక్కటిగా వెలుగులోకి వస్తుం డడంతో ఎన్నికల సమయంలో పార్టీ పరువు మసకబారిపోతుండడం స్థానిక మాజీ ప్రజాప్రతినిధిని ఆందోళనలో పడేసింది. వాస్తవాలు వెలుగులోకి తెచ్చిన ‘సాక్షి’ లక్ష్యంగా దాడికి ప్రయత్నించడంపై కాకినాడ ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. అడ్డుకున్న పోలీసులు వాస్తవం ఇలా ఉండగా, ఒక విద్యా సంస్థకు చెందిన తెలుగుయువత నాయకుడి ప్రోద్బలంతో దుమ్ములపేటకు చెందిన వారమంటూ కొందరు ‘సాక్షి’ కార్యాలయం సమీపాన వినుకొండవారి వీధిలో ఆందోళనకు దిగారు. టీడీపీ హయాంలో తమకు పట్టాలు ఇచ్చారని, పల్లపు ప్రాంతం కావడంతో ఇళ్లు నిర్మించుకోలేకపోయామని చెప్పుకొచ్చారు. తమ స్థలాలను తామే చదును చేసుకుంటున్నామని ఆందోళన చేశారు. పోలీసులు వెంటనే ఖాళీ చేయాల్సిందిగా హెచ్చరించడంతో వారు వెళ్లిపోయారు. కాగా, ఈ ఆందోళన చేస్తున్న ప్రాంతానికి సమీపాన తమకు రూ.500 ఇచ్చారని కొందరు, తమకు రూ.300 మాత్రమే ఇచ్చారని మరికొందరు మహిళలు గొడవపడడం కనిపించింది. డీఎస్పీ విజయభాస్కరరెడ్డి ఆదేశాల మేరకు వన్ టౌన్ సీఐ అద్దంకి శ్రీనివాస్, ఎస్సై రవికుమార్, సీఆర్పీఎఫ్ సిబ్బంది బందోబస్తు నిర్వహించారు. -
రుణం చె ల్లించకుంటే ఫ్లాట్ల స్వాధీనం
ఆలంపల్లి, న్యూస్‌లైన్: రాజీవ్ గృహకల్ప కింద మంజూరైన ఇళ్లకు సంబంధించి బ్యాంకు రుణాలు చెల్లించకుంటే ఫ్లాట్లను స్వాధీనం చేసుకుంటామని తాండూరు, వికారాబాద్ రాజీవ్ గృహకల్ప సముదాయాల లైజన్ అధికారి మల్లయ్య పేర్కొన్నారు. శుక్రవారం వికారాబాద్ ఆంధ్రాబ్యాంక్‌లో నిర్వహించిన బ్యాంకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం 2007లో రాజీవ్ గృహకల్ప సముదాయాన్ని నిర్మించి, పేద ప్రజలకు 1458 ఫ్లాట్లను కేటాయించిందని అన్నారు. వీటిని లబ్ధిదారులు సొంతం చేసుకునేందుకు వీలుగా వికారాబాద్‌లోని ఐదు బ్యాంకుల నుంచి రుణాలు మంజూరు చేసిందన్నారు. దక్కన్ గ్రామీణ బ్యాంకు 190 ఫ్లాట్లకు, జిల్లా కోఆపరేటివ్ సెంట్రల్‌బ్యాంక్ 387, ఆంధ్రా బ్యాంకు 389, కెనరా బ్యాంకు 216, ఎస్బీహెచ్ 276 ఫ్లాట్ల లబ్ధిదారులకు రుణాలు ఇచ్చాయని వివరించారు. అయితే లబ్ధిదారులు అప్పటినుంచి బ్యాంకు రుణాలు చెల్లించడం లేదని పేర్కొన్నారు. అన్ని బ్యాంకులకు సంబంధించి దాదాపు రూ.15కోట్ల వరకు రుణాలు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. ఈ నేపథ్యంలో రుణ బకాయిలు కట్టకుంటే ఇళ్లు రద్దు చేస్తామని పలుమార్లు లబ్ధిదారులకు నోటీసులు జారీ చేసినా స్పందన లేకపోయిందన్నారు. ఈ పరిస్థితుల్లో 185 జీఓ ప్రకారం రుణాలు చెల్లించని వారితో పాటు స్థానికంగా నివాసం ఉండని, వేరొకరికి అద్దెకు ఇచ్చిన వారి ఫ్లాట్లను స్వాధీనం చేసుకుంటామని స్పష్టం చేశారు. ఇందుకోసం హౌసింగ్ జిల్లా పీడీ, సబ్ కలెక్టర్, మున్సిపల్ కమిషనర్, సంబంధిత బ్యాంకు మేనేజర్‌తో కమిటీ వేశామన్నారు. క్షేత్రస్థాయిలో ఈ కమిటీ పరిశీలించి రుణాలు చెల్లించని వారితో పాటు స్థానికంగా ఉండని, ఇళ్లకు తాళాలు వేసిన వారిని గుర్తించి నోటీసులు జారీ చేస్తుందని వివరించారు. నోటీసులు ఇచ్చిన 15 రోజుల్లో రుణాలను చెల్లించకపోతే గృహాలను స్వాధీనం చేసుకుంటారని తెలిపారు. రాజీవ్ గృహకల్పలో లబ్ధిదారుల నుంచి ఇతరులు ఫ్లాట్లు కొంటే చెల్లదని, పూర్తిహక్కు గృహనిర్మాణ శాఖదేనని స్పష్టం చేశారు. సమావేశంలో ఆంధ్రా బ్యాంకు రీజినల్ మేనేజర్ కృష్ణారావు, కెనరా బ్యాంకు మేనేజర్ సుబ్బారావు, దక్కన్ గ్రామీణ బ్యాంకు మేనేజర్లు రాజారావు, రవీందర్, నరోత్తంరెడ్డి, జిల్లా కో ఆపరేటివ్ బ్యాంకు మేనేజర్ ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వన్‌టైమ్ సెటిల్మెంట్... రాజీవ్‌గృహకల్పలో గృహాలకు సంబంధించి రుణాలను పొంది వాయిదాలు చెల్లించని వారికి వన్‌టైమ్ సెటిల్మెంట్కు అవకాశం ఇస్తున్నట్టు బ్యాంకు అధికారులు తెలిపారు. ఇచ్చిన రుణంలో 60శాతం చెల్లిస్తే సరిపోతుందని అన్నారు. ఆరు సంవత్సరాలకు సంబంధించి 84 వాయిదాలు నిర్ణయించామని, ఇప్పటివరకు 34 నెలలు గడిచాయని అన్నారు. వాయిదాలు చెల్లించని వారు రూ.34 వేలు చెల్లిస్తే వడ్డీ ఉండదని, ఈ అవకాశాన్ని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. -
రాజీవ్ గృహకల్ప లబ్ధిదారులకు ఊరట
-
రాజీవ్ గృహకల్ప లబ్ధిదారులకు ఊరట
ఢిల్లీ: సుప్రీం కోర్టు తీర్పుతో రాజీవ్ గృహకల్ప లబ్ధిదారులకు ఊరట లభించింది. రాజీవ్ గృహకల్ప సభ్యత్వం ఉన్న వారికి 4 వారాల్లోపు రిజిస్ట్రేషన్ ఫీజు కట్టించుకొని వారి ఇల్లు వారికి ఇవ్వాలని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. గతంలో సొసైటీలో సభ్యులుగా చేరి, డబ్బులు చెల్లించినా ఇల్లు మంజూరు కాని సభ్యులు న్యాయం కోరుతూ సుప్రీం కోర్టును ఆశ్రయించారు.