rajya sabha condidates
-
బీజేపీ రాజ్యసభ అభ్యర్థుల ఖరారు..
సాక్షి, ఢిల్లీ: బీజేపీ రాజ్యసభ అభ్యర్థుల జాబితాను విడదల చేసింది. 16 మంది అభ్యర్థులతో తొలి జాబితా ప్రకటించింది. కర్ణాటక నుంచి నిర్మలా సీతారామన్‌కు మరోసారి అవకాశం ఇచ్చారు. మహారాష్ట్ర నుంచి పీయూష్ గోయల్‌కు అవకాశం కల్పించారు. చదవండి: యూపీ సీఎం యోగి సంచలన నిర్ణయం బీజేపీ అభ్యర్థులు వీరే: నిర్మల సీతారామన్, జగ్గేశ్- కర్ణాటక పీయూష్, అనిల్ సుఖ్‌దేవ్-మహారాష్ట్ర సతీష్ చంద్ర, శంభు శరణ్-బిహార్ కృష్ణలాల్-హర్యానా కవితా పటిదార్-మధ్య ప్రదేశ్ గణశ్యామ్-రాజస్థాన్ లక్ష్మికాంత్ వాజ్‌పేయి, రాధామోహన్, సురేంద్రసింగ్, బాబురామ్, దర్శణ సింగ్, సింగీత యాదవ్- ఉత్తరప్రదేశ్ కల్పన సైని- ఉత్తరాఖండ్ -
AP: రాజ్యసభ స్థానాలకు వైఎస్సార్సీపీ అభ్యర్థుల నామినేషన్లు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి నాలుగు రాజ్యసభ స్థానాలకు వైఎస్సార్సీపీ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. రాజ్యసభ వైఎస్సార్సీపీ అభ్యర్థులుగా వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి, జాతీయ బీసీ ఉద్యమ నేత ఆర్.కృష్ణయ్య, సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది నిరంజన్‌రెడ్డి, బీద మస్తాన్‌రావులను సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎంపిక చేశారు. వారు నలుగురూ బుధవారం నామినేషన్లు దాఖలు చేశారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారి అయిన రాష్ట్ర శాసన మండలి ఉప కార్యదర్శి పీవీ సుబ్బారెడ్డికి నామినేషన్ పత్రాలను అందజేశారు. చదవండి: అంబేడ్కర్ పేరుపై అగ్గి రాజేసిన 'కుట్ర'! రాష్ట్ర సమస్యలను పార్లమెంట్లో వినిపిస్తాం.. నామినేషన్ల దాఖలు చేసిన అనంతరం విజయసాయిరెడ్డి, ఆర్ కృష్ణయ్య, బీదా మస్తాన్‌రావు, నిరంజన్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర సమస్యలను పార్లమెంట్లో వినిపిస్తామన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తామన్నారు. వైఎస్సార్సీపీ బలం 9కి చేరిందని.. 9 మంది ఎంపీల్లో ఐదుగురు బీసీ వర్గాలకు చెందినవారని పేర్కొన్నారు. ఇది బీసీ వర్గాలకు ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతకు నిదర్శమన్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లో వైఎస్సార్సీపీ మద్దతు కీలకమన్నారు. దేశ, రాష్ట్ర ప్రయోజనాలు దృష్టిలో ఉంచుకుని నిర్ణయం తీసుకుంటామన్నారు. ప్రారంభమైన నామినేషన్ల ఘట్టం.. ఏపీలో ఖాళీ కానున్న ఈ నాలుగు స్థానాల్లో ఎన్నికల నిర్వహణకు మంగళవారం రిటర్నింగ్ అధికారి పీవీ సుబ్బారెడ్డి నోటిఫికేషన్‌ను జారీచేశారు. దీంతో మంగళవారం నుంచే నామినేషన్ల ఘట్టం ప్రారంభమైంది. ఈనెల 31వ తేదీ మ.3 గంటల వరకు నామినేషన్లు దాఖలు చేయవచ్చు. వీటిని జూన్ 1న ఉ.11 గంటలకు పరిశీలిస్తారు. జూన్ 3వ తేదీ మ.3 గంటల్లోగా నామినేషన్లను ఉపసంహరించుకోవచ్చు. నలుగురు అభ్యర్థుల కంటే ఎక్కువమంది పోటీలో ఉంటే జూన్ 10న ఉ.9 గంటల నుంచి మ.4 గంటల వరకూ పోలింగ్ నిర్వహిస్తారు. నాలుగు స్థానాలూ ఏకగ్రీవం! ఇక శాసనసభలో వైఎస్సార్సీపీకి 150 మంది సభ్యుల బలం ఉంది. టీడీపీకి సాంకేతికంగా కేవలం 23 మంది సభ్యుల బలం మాత్రమే ఉంది. రాజ్యసభ సభ్యునిగా ఎన్నిక కావాలంటే సగటున 44 మంది ఎమ్మెల్యేల ఓట్లు అవసరం. టీడీపీకి అంత బలంలేని నేపథ్యంలో.. రాజ్యసభ ఎన్నికల్లో ఆ పార్టీ తరఫున ఎవరూ పోటీచేసే అవకాశంలేదు. దీంతో వైఎస్సార్సీపీ అభ్యర్థులు ఏకగ్రీవం కానున్నారు. -
యోగిపై సొంత మంత్రి సంచలన వ్యాఖ్యలు
లక్నో: తాజా ఉపఎన్నికల ఫలితాల నుంచి కోలుకోకముందే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు మరో షాక్ తగిలింది. తన మంత్రివర్గంలోని సొంత మంత్రిపై ఆయన పాలనను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘బీజేపీ సంకీర్ణ ధర్మం పాటించడం లేదు. ఎల్లప్పుడూ వారికి అసెంబ్లీలో ఉన్న సంఖ్యాబలం గురించి గొప్పలు చెప్పుకోవడం మాత్రమే తెలుసు. ప్రజాసంక్షేమం కన్నా గుళ్లూ గోపురాలపైనే ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఎక్కువ. ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తయినప్పటికీ అవినీతి ఏమాత్రం తగ్గలేదు’ అంటూ బీసీ సంక్షేమ మంత్రి ఓం ప్రకాశ్ రాజ్‌భర్ బాంబు పేల్చారు. సుహెల్దేవ్ భారతీయ సమాజ్ పార్టీ అధినేత అయిన రాజ్‌భర్ బీజేపీ మిత్రపక్షం కావడంతో యోగి మంత్రివర్గంలో చేరారు. ఆయన తాజాగా చేసిన వ్యాఖ్యలు.. ఏడాది పాలన పూర్తిచేసుకుంటున్న యోగి సర్కారును ఇరకాటంలో పడేశాయి. భాగస్వామ్య పార్టీలంటే లెక్కలేదు.. రాజ్‌భర్ ఓ జాతీయ చానెల్‌తో మాట్లాడుతూ...‘అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయానికి మేమే కారణం. అయినప్పటికీ మమ్మల్ని వారు నిర్లక్ష్యం చేస్తూనే ఉన్నారు. మొన్న జరిగిన లోక్‌సభ ఉప ఎన్నికల్లో కూడా ఆ పార్టీ అభ్యర్థులకు మద్దతిచ్చాం. కానీ వారి వైఖరిలో మార్పు రాలేదని’ ఆరోపించారు. ‘మార్చి 23న జరుగనున్న రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి కూడా మమ్మల్ని ఇంతవరకూ సంప్రదించలేదు. మా ఓటు కావాలా అని మేమే వెళ్లి వారిని అడగాలేమో’ అంటూ ఆయన అసహనం వ్యక్తం చేశారు. విజయావకాశాలే ఎక్కువ.. మిత్రపక్షాలతో కలిసి బీజేపీకి ఉన్న అసెంబ్లీ సీట్లు 324. రాజ్యసభ ఎన్నికల్లో విజయం సాధించాలంటే ఒక్కో అభ్యర్థికి 37 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. ఈ గణాంకాల ప్రకారం పది సీట్లలో ఎనిమిదింటిలో సులభంగానే విజయం సాధించవచ్చు. తొమ్మిదో అభ్యర్థి కోసం ఇంకా 28 మంది ఎమ్మెల్యేలు మిగులుతారు కూడా. బీజేపీ అభ్యర్థులు వీరే.. రాజ్యసభ ఎన్నికల్లో భాగంగా ఇప్పటికే తొమ్మిది మంది అభ్యర్థిత్వాన్నిఅధికార పార్టీ ఖరారు చేసింది. కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ, అశోక్ బాజ్‌పాయ్, విజయ్‌పాల్ సింగ్ తోమర్, సకాల్ దీప్ రాజ్‌భర్, కంటా కర్దం, అనిల్ జైన్, హరనాథ్ సింగ్ యాదవ్, జీవీఎల్ నరసింహారావు, అనిల్ కుమార్ అగర్వాల్ తదితరులు బీజేపీ నుంచి రాజ్యసభకు ఎన్నిక కానున్నారు. కాగా సమాజ్‌వాదీ పార్టీ తన అభ్యర్థిగా జయా బచ్చన్‌ను ఖరారు చేసింది. -
ధ్రువీకరణ పత్రం అందుకున్న విజయసాయిరెడ్డి
హైదరాబాద్ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి విజయ సాయిరెడ్డి బుధవారం రాజ్యసభకు ఎన్నికైనట్లు ధ్రువీకరణ పత్రాన్ని తీసుకున్నారు. ఆయన వైఎస్ఆర్ సీపీ పార్టీ తరఫున రాజ్యసభకు ఎన్నికైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా విజయ సాయిరెడ్డి శాసనసభ ప్రాంగణంలో మాట్లాడుతూ రాష్ట్ర ప్రయోజనాల కోసం తన శాయశక్తుల కృషి చేస్తామన్నారు. రాష్ట్ర సమస్యల పరిష్కారం కోసం చిత్తశుద్ధితో పని చేస్తామన్నారు. ప్రత్యేక హోదాపై తమ పోరాటం కొనసాగుతోందని, ఈ అంశంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి పోరాడుతూనే ఉందన్నారు. హోదా విషయంలో అన్ని పార్టీల మద్దతుతో ముందుకు వెళతామన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తి చేసుకున్నా, ప్రజా సమస్యల పరిష్కారంలో ఆ పార్టీ విఫలం అయిందని విజయ సాయిరెడ్డి విమర్శించారు. కాగా ఆంధ్రప్రదేశ్ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి విజయ సాయిరెడ్డి, టీడీపీ నుంచి సుజనా చౌదరి, టీజీ వెంకటేశ్, బీజేపీ నుంచి సురేష్ ప్రభు, తెలంగాణ నుంచి డీ శ్రీనివాస్, కెప్టెన్ లక్ష్మీకాంతరావు ఏకగ్రీవంగా ఎన్నిక అయిన విషయం విదితమే. సురేష్ ప్రభు, టీజీ వెంకటేష్, సుజనా చౌదరి, కెప్టెన్ లక్ష్మీకాంతరావు, డీ శ్రీనివాస్ ఈ నెల 4వ తేదీనే ధ్రువీకరణ పత్రాలు అందుకున్నారు. -
రాజ్యసభ సభ్యుల ఎన్నిక ఏకగ్రీవం
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో రాజ్యసభ సభ్యుల ఎన్నిక ఏకగ్రీవమైంది. ఏపీలో నాలుగు, తెలంగాణలో రెండు స్థానాలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యాయి. ఉపసంహరణ గడువు నేటితో ముగియడంతో వారి ఎన్నిక లాంఛనమే అయింది. జూన్ 11న జరిగే ఎన్నికల్లో మొత్తం 15 రాష్ట్రాల నుంచి 57 స్థానాలకు పోటీ జరగనుంది. ఆంధ్రప్రదేశ్ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి విజయ సాయిరెడ్డి, టీడీపీ నుంచి సుజనా చౌదరి, టీజీ వెంకటేశ్, బీజేపీ నుంచి సురేష్ ప్రభు, తెలంగాణ నుంచి డీ శ్రీనివాస్, కెప్టెన్ లక్ష్మీకాంతరావు ఏకగ్రీవంగా ఎన్నిక అయ్యారు. సురేష్ ప్రభు, టీజీ వెంకటేష్, సుజనా చౌదరి, కెప్టెన్ లక్ష్మీకాంతరావు, డీ శ్రీనివాస్ మరికాసేపట్లో ధ్రువీకరణ పత్రాలు అందుకోనున్నారు. కాగా విజయ సాయిరెడ్డి ఈ నెల 6న ధ్రువీకరణ పత్రాన్ని తీసుకోనున్నారు.