Rakesh Mohan
-
ఆరేళ్లలో ఎగుమతుల లక్ష్యం 2 ట్రిలియన్ డాలర్లు!
న్యూఢిల్లీ: భారత్ 2030 నాటికి 2 ట్రిలియన్ డాలర్ల ‘‘భారీ’’ ఎగుమతుల లక్ష్యాన్ని సాధించడానికి సమిష్టి కృషి అవసరమని వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పియూష్ గోయల్ పేర్కొన్నారు. ఐఐఎఫ్‌టీ (ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్) వార్షిక స్నాతకోత్సవంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మంత్రి ప్రసంగిస్తూ భారత్ వచ్చే ఆరేళ్ల కాలంలో ఎగుమతుల లక్ష్యాన్ని సాధించగలదన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ‘‘2030 నాటికి 2 ట్రిలియన్ల డాలర్ల ఎగుమతి లక్ష్యాన్ని సాధించడానికి మనమంతా భాగస్వాములు అవుదాం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2024–25) భారత్ ఎగుమతుల విలువ 800 బిలియన్ డాలర్లను అధిగమిస్తుంది. 2 ట్రిలియన్ డాలర్ల లక్ష్యాన్ని సాధించడానికి మనం నిజంగా సమిష్టిగా ఎంతో కృషి చేయవలసి ఉంటుంది. ఇది యాదృచ్చికంగా జరగదు. నిర్దిష్ట చర్యల ద్వారానే ఇది సాధ్యమవుతుంది. అయితే ఈ భారీ లక్ష్యాన్ని సాధించగలమని నేను విశ్వసిస్తున్నాను’’ అని గోయల్ తన ప్రసంగంలో పేర్కొన్నారు.భారత్ మార్చితో ముగిసిన 2023–24 ఆర్థిక సంవత్సరంలో 778 బిలియన్ డాలర్ల వస్తు, సేవల ఎగుమతులు జరిగింది. ఆయా అంశాలపై ఇంకా గోయల్ ఏమన్నారంటే.. ఇతర దేశాలలో భారత్ ఉత్పత్తులు ఎదుర్కొంటున్న నాన్–టారిఫ్ అడ్డంకులను అధ్యయనం చేయడానికి విద్యార్థులు, అధ్యాపకులు సహకరించాలి. తద్వారా అధికారులు వాటిని పరిష్కరించడానికి వీలవుతుంది. త్వరలో దుబాయ్‌లో ఏర్పాటు చేయనున్న ఐఐఎఫ్‌టీ కొత్త క్యాంపస్ ఎగుమతుల పురోగతికి మరింత చొరవ చూపుతుంది.స్నాతకోత్సవంలో ఎవరేమన్నారంటే... చర్చల కోసం ఒక కేంద్రాన్ని కూడా ఐఐఎఫ్‌టీ త్వరలో ఏర్పాటు చేయనుంది. ఈ తరహా చొరవ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు, నైపుణ్యం వంటి అంశాలకు సంబంధించి ముఖ్యమైనది. ఈ కేంద్రం విద్యార్థులకు స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలపై చర్చల్లో అనుసరించాల్సిన నైపుణ్యాలను అందించడానికి దోహదపడుతుంది. భారత్ ఎగుమతుల పురోగతి విషయంలో కేస్ స్టడీస్‌ను సిద్ధం చేయడానికి కూడా ఈ కేంద్రం దోహదపడుతుంది. – సునీల్ భరత్వాల్, వాణిజ్య కార్యదర్శిపెరిగిన ర్యాంకింగ్ ఎన్ఐఆర్ఎఫ్ (నేషనల్ ఇనిస్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్) ర్యాంకింగ్ 2024లో మేనేజ్మెంట్ విభాగంలో ఐఐఎఫ్‌టీ పన్నెండు స్థానాలు ఎగబాకి 15వ ర్యాంక్‌కు చేరుకుంది. రిక్రూట్మెంట్ కోసం అనేక పెద్ద సంస్థలు క్యాంపస్‌ను సందర్శిస్తున్నాయి. – రాకేష్ మోహన్ జోషి, ఐఐఎఫ్టి వైస్ ఛాన్సలర్ -
ఎగుమతుల వృద్ధికి రంగాల వారీ ప్రాధాన్యత
న్యూఢిల్లీ: ఎగుమతుల రంగంలో పోటీతత్వాన్ని పెంపొందించడానికి రంగాల వారీ వ్యూహాలను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాంటేషన్ మేనేజ్మెంట్– బెంగళూరు (ఐఐపీఎంబీ)డైరెక్టర్ రాకేష్ మోహన్ జోషి పేర్కొన్నారు. ముఖ్యంగా ఎలక్ట్రానిక్స్, ఇంజినీరింగ్, ఫార్మాస్యూటికల్ ఇతర హైటెక్ పరిశ్రమల కోసం ఈ తరహా వ్యూహం అవసరమని పేర్కొన్నారు. భారత్ 2030 నాటికి 2 ట్రిలియన్ డాలర్ల వస్తు, సేవల ఎగుమతుల లక్ష్యాన్ని చేరడానికి ఈ మేరకు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇందుకు వార్షిక వృద్ధి రేటు 14.5 శాతంగా నమోదుకావాలనీ అంచనావేశారు. ఇంకా ఆయన ఏమన్నారంటే... ► పాలిష్ చేసిన వజ్రాలు, ఆభరణాలు, ప్యాసింజర్ కార్లు, టెలికమ్యూనికేషన్ పరికరాలు వంటి రంగాలు ఎగుమతుల భారీ పెరుగుదలలో దోహదపడతాయి. ► దేశాల పరంగా చైనా, యునైటెడ్ అరబ్ ఎమిరైట్స్ (యూఏఈ), హాంకాంగ్, జర్మనీ, వియత్నాం, బ్రిటన్, ఇండోనేషియా, మలేషియా, సౌదీ అరేబియా, ఫ్రాన్స్, ఇటలీ, థాయ్‌లాండ్, టర్కీ, జపాన్, దక్షిణ కొరియా, మెక్సికో, బెల్జియంలకు మన ఎగుమతులను పెంచుకోడానికి మంచి అవకాశాలు ఉన్నాయి. ► ఎగుమతిదారులు, వివిధ ప్రభుత్వ శాఖల మధ్య సమాచార, సమన్వయ అంతరాన్ని తగ్గించడం ప్రస్తుతం అవసరం. రియల్ టైమ్ సమాచారాన్ని సేకరించడం, సమీకరించడం, ప్రాసెసింగ్ చేయడం, సంబంధిత వ్యక్తులకు ఆ సమాచారాన్ని సకాలంలో అందేలా చేయడం, ఆధునిక సాంకేతికతను అవలంబించడం చాలా ముఖ్యమైన అంశాలు. ► అమెరికా, యూరోపియన్ యూనియన్ తదితర అభివృద్ధి చెందిన దేశాలలో సెమీకండక్టర్ తయారీని సులభతరం చేయడానికి చిప్స్ చట్టం వంటి రక్షణవాద విధానాల పునరుద్ధరణను భారతదేశం నిశితంగా పరిశీలించాల్సిన అవసరం ఉంది. ► పలు దేశాలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలకు ప్రాధాన్యత ఇవ్వాలి. ► వ్యవసాయం, తోటల పెంపకం, ఉద్యానవన అనుబంధ రంగాల పురోగతికి ఐఐపీఎంబీ కీలక సహకారాన్ని అందిస్తోంది. విద్య, ఎగుమతులు, సామర్థ్యం పెంపుదల, శిక్షణ, విధాన పరిశోధన, అభివృద్ధి వంటి వివిధ కోణాల్లో పురోగతికి వ్యూహాలు రూపొందిస్తుంది. -
కొత్త పీసీసీఎఫ్‌గా డోబ్రియల్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అటవీ సంరక్షణ ప్రధాన అధికారి (పీసీసీఎఫ్)గా, హెడ్ ఆఫ్ ఫారెస్ట్ ఫోర్స్ (హెచ్వోఎఫ్ఎఫ్)గా సీనియర్ ఐఎఫ్ఎస్ అధికారి రాకేశ్ మోహన్ డోబ్రియల్ నియమితులయ్యారు. ప్రస్తుత పీసీసీఎఫ్ ఆర్.శోభ సోమవారం పదవీ విరమణ చేశారు. ఈ నేపథ్యంలో ఆర్ఎం డోబ్రియల్‌కు పూర్తి అదనపు బాధ్యతలు (ఎఫ్ఏసీ) అప్పగిస్తూ రాష్ట్రప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం డోబ్రియల్ సోషల్ ఫారెస్ట్రీ పీసీసీఎఫ్ గా, హరితహారం రాష్ట్ర నోడల్ ఆఫీసర్‌గా పనిచేస్తున్నారు. హరితహారం అమల్లో గత ఆరేళ్లుగా కీలక బాధ్యతలతో పాటు ప్రస్తుత ఉన్నతా ధికారుల్లో సీనియర్‌గా ఉండడంతో ప్రభుత్వం డోబ్రియల్‌ను పీసీసీఎఫ్‌గా నియమించింది. ఈ నియామకానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వ సిబ్బంది, శిక్షణ వ్యవహారాల శాఖ లాంఛనాలు పూర్తయ్యాక ఆయన పూర్తి స్థాయి పీసీసీఎఫ్‌గా కొనసాగే అవకాశాలున్నాయి. ఉత్తరాఖండ్‌కు చెందిన డోబ్రియల్ 1987లో ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్‌లో చేరారు. శిక్షణ తర్వాత 1989లో పాల్వంచ సబ్ డీఎఫ్ఓగా మొదటి పోస్టింగ్ పొందారు. 1991 –94 వరకు భద్రాచలం డివిజినల్ ఫారెస్ట్ అధికారిగా పనిచేశారు. అదే హోదా లో 2002 వరకు వరంగల్, బెల్లంపల్లి డివిజన్లలో పనిచేశారు. కన్జర్వేటర్‌గా పదోన్నతి పొందాక అదనపు కార్య దర్శి హోదాలో సచివాలయంలో వ్యవసాయ శాఖ, ఉన్నత విద్యాశాఖల్లో డిప్యుటేషన్ పై పనిచేశారు. అనంతరం స్పెషల్ సెక్రటరీ హోదాలో ఉన్నత విద్యాశాఖ కార్యదర్శిగా వివిధ యూనివర్సిటీలకు ఇన్చార్జి వైస్ చాన్స్‌లర్‌గా పనిచేశారు (2003–14). తెలంగాణ ఏర్పడ్డాక 2015లో అదనపు పీసీసీఎఫ్ హోదాలో తిరిగి అటవీ శాఖలో చేరి, విజిలెన్స్, ఫారెస్ట్ ప్రొటెక్షన్ విధులు నిర్వహించారు. 2016 నుంచి హరితహారం నోడల్ ఆఫీసర్ పనిచేస్తున్నారు. 2020లో పీసీసీఎఫ్ ర్యాంకు పొందారు. 2025 ఏప్రిల్ వరకు ఆయన సర్వీసులో కొనసాగుతారు. పీసీసీఎఫ్‌గా నియమితులైన డోబ్రియల్‌ను అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, స్పెషల్ సీఎస్ శాంతి కుమారి, పదవీ విరమణ చేసిన పీసీసీఎఫ్ ఆర్. శోభ అభినందించారు. -
జూన్ 2లోగా రెండు వక్ఫ్ బోర్డులు
-
జూన్ 2లోగా రెండు వక్ఫ్ బోర్డులు
కేంద్ర అధికారుల బృందం వెల్లడి మార్చి మొదటివారంలో విభజన పూర్తి సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర వక్ఫ్‌బోర్డు విభజన ప్రక్రియ కొలిక్కి వస్తోంది. జూన్ 2వ తేదీ నాటికి తెలంగాణ, ఏపీ రాష్ట్రాల బోర్డులు ఏర్పాటు చేస్తామని కేంద్ర బృందం ప్రకటించింది. బుధవారం సచివాలయంలో కేంద్ర బృందం సభ్యులైన కేంద్ర మైనార్టీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యదర్శి అరవింద్ మాయారామ్, సంయుక్త కార్యదర్శి రాకేశ్ మోహన్, కార్యదర్శి పీకే శర్మ, కేంద్ర వక్ఫ్ కౌన్సిల్ ప్రతినిధి అల్లాఉద్దీన్ తదితరులు తెలంగాణ మైనార్టీ సంక్షేమ శాఖ ప్రత్యేకకార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్, ఏపీ మైనార్టీ సంక్షేమం శాఖ కమిషనర్, వక్ఫ్‌బోర్డు ప్రత్యేక అధికారి షేక్ మహ్మద్ ఇక్బాల్, తెలంగాణ మైనార్టీ సంక్షేమ శాఖ డెరైక్టర్ ఎంజే అక్బర్, ఏపీఎంఎఫ్‌సీ ఎండీ ఎస్ఏ షుకూర్‌లతో సమావేశమై వక్ఫ్‌బోర్డు విభజనపై చర్చలు జరిపారు. ఇరు రాష్ట్రాల్లో వక్ఫ్‌బోర్డు ఆస్తులు, ఆదాయ వనరులు, వ్యయాలు ఉద్యోగుల సంఖ్య తదితర వివరాలను సేకరించారు. విశాఖపట్నంలోని మదిని దర్గా భూముల పరిహారం సుమారు రూ.3 కోట్లకుపైగా హైదరాబాద్‌లో కొత్త హజ్‌హౌస్ నిర్మాణంలో, ఆంధ్ర ప్రాంత దర్గా ఆదాయ వనరులు సుమారు రూ.12 కోట్ల వరకు తెలంగాణలో వినియోగించడంపై ఏపీ అధికారులు అభ్యంతరం తెలిపారు. అనంతరం కేంద్రం బృందం ఉభయ రాష్ట్రాల అధికారులతో కలిసి తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీతో చర్చలు జరిపారు. అభ్యంతరాల పరిష్కారానికి ఆయ న హామీ ఇచ్చారు. ఇరు రాష్ట్రాల మైనార్టీ, వక్ఫ్‌బోర్డు శాఖాధికారులతో వక్ఫ్ విభజనపై చర్చలు దాదాపు పూర్తయ్యాయని ప్రకటించింది..త్వరలో కేంద్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తామని వెల్లడించింది.