Ram babu
-
అతనికి మెంటల్ ఒక అంబులెన్సు పంపండి
-
ఎస్టీ ఎంప్లాయీస్ జాతీయ కార్యవర్గం
ఎస్టీ ఎంప్లాయిస్ అండ్ ఆఫీసర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ జాతీయ కార్యవర్గం ఎన్నికైంది. విజయవాడలోని ఐలాపురం హోటల్లో ఆదివారం జరిగిన సమావేశంలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా కుంభా రాంబాబు (పశ్చిమగోదావరి), ప్రధాన కార్యదర్శిగా కె.సుబ్బారావు (హైదరాబాద్), కోశాధికారిగా బి.రామస్వామి (విజయవాడ), వర్కింగ్ ప్రెసిడెంట్‌గా జె.హరిబాబు ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా డి.ఉషారాణి, ఎన్.గంగరాజు, డి.వసుమతి, బి.నాగేశ్వరరావు ఎన్నికయ్యారు. వీరితో పాటు నలుగురు కార్యదర్శులు, ఆరుగురు ఆర్గనైజింగ్ కార్యదర్శులు, నలుగురు సంయుక్త కార్యదర్శులు, మరో నలుగురు కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నారు. నూతన అధ్యక్షుడు కుంభా రాంబాబు మాట్లాడుతూ తమ సంఘం బోగస్ సర్టిఫికెట్లతో ఎస్టీల అవకాశాలను దోచుకునేవారిపై పోరాటం సాగిస్తుందన్నారు. -
చెమట చుక్కకు దక్కని రొక్కం
పొలాలనన్నీ..హలాలతో..దున్ని..ఆరుగాలం శ్రమించి కష్ట సేద్యం చేసి పంటను అమ్ముకున్నా..వారి కష్టానికి అందాల్సిన సొమ్ము అందక రైతులు దీనంగా ఎదురు చూస్తున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చి ధాన్యం అమ్మిన రెండురోజుల్లో రైతుకు సొమ్ము చెల్లిస్తామన్న ప్రభుత్వం ఇప్పుడు వారికి చుక్కలు చూపిస్తోంది. ధాన్యం అమ్మిన సొమ్ముకోసం కొనుగోలు కేంద్రాల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతూ రైతులు ఉసూరుమంటున్నారు. నాపేరు వేచలపు రాంబాబు. మాది గం ట్యాడ మండలం పెదవేమలి గ్రా మం. నేను మా మండలంలోని రావి వలస ధాన్యం కొనుగోలు కేంద్రానికి గత నెల 23వతేదీన 10 క్విం టాళ్ల ధాన్యం తీసుకుని వెళ్లాను. నాకు రూ.14, 144 డబ్బులు వస్తాయని ట్రక్‌షీట్ రాసి ఇచ్చారు. కొనుగోలు కేంద్రం వారు అడిగిన ధ్రువపత్రాలు అన్నీ అందజేశాను. ఇంతవరకు డబ్బులు పడలేదు. ఇప్పటికి ఐదు సార్లు కొనుగోలు కేంద్రానికి వెళ్లాను. ఎప్పుడు వెళ్లినా ఇదిగో పడతాయి, అదిగో పడతాయని చెబుతున్నారు నాపేరు కోరుపోలు రాము. మాది గంట్యాడ మండలం లక్కిడాం గ్రామం. నేనుగత నెల22వతేదీన రావివలస కొనుగోలు కేంద్రానికి 30 క్వింటాళ్ల ధాన్యం తీసుకుని వెళ్లాను. నాకు రూ.41,344 వస్తాయని కొనుగోలు కేంద్రం నిర్వాహకులు ట్రక్‌షీట్ ఇచ్చారు. ఇప్పటికి ఆరు సార్లు కొనుగోలు కేంద్రానికి వెళ్లాను. ఎప్పుడు అడిగినా డబ్బులు పడతాయనే చెబుతున్నారు. ఎప్పుడు అందు తాయోనని ఎదురుచూస్తున్నాను. ఇది ఈఇద్దరి రైతుల పరిస్థితే కాదు. జిల్లాలోని వందలాదిమంది రైతులు ఎదుర్కొంటున్న సమస్య. విజయనగరంవ్యవసాయం: కొనుగోలు కేంద్రాలకు ధాన్యం అమ్మిన రైతులు డబ్బుల కోసం వాటి చుట్టూ తిరగలేక అవస్థలు పడుతున్నారు. దళారులతో సంబంధం లేకుండా రైతులకు లబ్ధిచేకూర్చాలనే ఉద్దేశంతో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆర్భాటంగా ప్రకటించారు. రైతులు ధాన్యం ఇచ్చిన రెండు రోజుల్లో డబ్బులు వారిబ్యాంకు ఖాతాలో జమచేస్తామని ప్రకటించారు. అయితే రైతులు ధాన్యం ఇచ్చి నెలకు పైగా అవుతున్నా బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమకాలేదు. దీంతో కొనుగోలు కేంద్రం నిర్వాహకులు రైతులకు సమాధానం చెప్పలేకపోతున్నారు. బిల్లులు రాకపోవడంతో రెండు రోజులుగా ధాన్యం కొనుగోలును నిలిపివేశారు. అష్టకష్టాలు పడి పండించిన ధాన్యం డబ్బులు ఇవ్వడానికి ప్రభుత్వం చుక్కలు చూపిస్తోందని రైతులు ఆరోపిస్తున్నారు. రూ.కోట్లలో బిల్లుల బకాయిలు జిల్లాలో ధాన్యం కొనుగోలుకు సంబంధించి సుమారు రూ.2 కోట్లకు పైగా బిల్లులు బకాయిలు చెల్లించాల్సి ఉంది. అన్ని కొనుగోలు కేంద్రాల్లోనూ ఇదే పరిస్థితి. ఒక రావివలస కేంద్రంలోనే రూ.20 లక్షల వరకు బిల్లులు చెల్లించాల్సి ఉన్నట్లు సమాచారం. -
రాంబాబు కుటుంబానికి దిష్టి తగిలింది : వెంకటేశ్
‘‘ఈ మధ్యకాలంలో నేను ఎక్కువగా చేసిన పాత్రలే చేసినట్లు అనిపించింది. ఏదైనా విభిన్న కోణంలో ఉన్న పాత్ర వస్తే బాగుంటుందనుకుంటున్న సమయంలో ‘దృశ్యం’ చూశాం. చాలా నచ్చింది. నేను కొత్త రకం నటన కనబర్చడానికి ఆస్కారం ఉంటుందని ఈ చిత్రం చేశాను. తన కుటుంబంతో హాయిగా ఉంటాడు రాంబాబు. అతని కుటుంబానికి దిష్టి తగులుతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుంది అనేది సినిమాలో చూడాల్సిందే’’ అని వెంకటేశ్ చెప్పారు. మలయాళ చిత్రం ‘దృశ్యం’ని అదే పేరుతో వెంకటేశ్, మీనా జంటగా సురేష్‌బాబు, రాజ్‌కుమార్ సేతుపతి తెలుగులోకి పునర్నిర్మించిన విషయం తెలిసిందే. నటి శ్రీప్రియ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఈ నెల 11న విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో డి. రామానాయుడు మాట్లాడుతూ -‘‘ఈ సినిమా ఘనవిజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది. ప్రచార చిత్రాలు ఆసక్తి రేకెత్తించే విధంగా ఉన్నాయి’’ అన్నారు. సురేష్‌బాబు మాట్లాడుతూ -‘‘శంకరాభరణం, త్రీ ఇడియట్స్ లాంటి చిత్రాలు ఆర్టిస్టిక్‌గా ఉండే కమర్షియల్ ఎంటర్టైనర్స్. మలయాళ ‘దృశ్యం’ కూడా ఆ తరహా సినిమానే. మూడు ఫైట్లు, కొన్ని కామెడీ సీన్లు, ఐదు పాటల ఫార్మాట్‌కి అలవాటు పడిపోయాం. కానీ, అందుకు భిన్నంగా ఉండే సినిమా ఇది’’ అని చెప్పారు. సంసారానికి రాముడుగా ఉండే రాంబాబు అనే వ్యక్తి.. అదే సంసారాన్ని కాపాడుకోవడానికి కృష్ణుడిగా కూడా ఎలా మారతాడు? అనేది ఆసక్తికరంగా ఉంటుందని, మొగుడు, మగాడు ఎలా ఉండాలో చెప్పే చిత్రమని పరుచూరి బ్రదర్స్ చెప్పారు. ఇంకా నరేశ్, బెనర్జీ కూడా మాట్లాడారు. -
పనిచేస్తున్న కంపెనీకే పంగనామం
తణుకు క్రైం, న్యూస్‌లైన్ : ఓ కంపెనీలో అతనొక జనరల్ మేనేజర్. అక్రమ మార్గంలో డబ్బు సంపాదించాలనుకున్నాడు. బంధువులు, సిబ్బంది సాయంతో మూడు మోటార్ సైకిళ్లను దొంగిలించడంతోపాటు మరో 6 మోటార్ సైకిళ్లను పక్కదారి పట్టించాడు. చివరకు కటకటాల పాలయ్యూడు. తణుకు శివారు పైడిపర్రులో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించి రూరల్ ఏఎస్సై కె.సీతారామ్ (రాంబాబు) తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పైడిపర్రులోని విజయలక్ష్మి హోండా షోరూంలో రాజమండ్రికి చెందిన షేక్ మదీనా ఇర్షాద్ కొంతకాలంగా జనరల్ మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. అతడి బావమరిది నిడదవోలుకు చెందిన అబ్దుల్ షబ్బీర్, కంపెనీలో మెకానిక్‌లుగా పనిచేస్తున్న పల్లాని సాయికుమార్, చందులతో కలసి మోటార్ సైకిళ్లను దొంగిలించేందుకు పన్నాగం పన్నాడు. ఈ క్రమంలో గడచిన నెల రోజుల్లో ఒక హోండా యూక్టివా, మరో రెండు యూనికార్న్ మోటార్ సైకిళ్లను దొంగిలించారు. దీంతోపాటు వాహనాల్ని కొనుగోలు చేసేవారు ఇచ్చిన మూడు డిమాండ్ డ్రాఫ్ట్‌లను మేనేజర్ ఇర్షాద్ బ్యాంకులో వేసి డ్రా చేయూల్సి ఉండగా, అలా చేయలేదు. ఆ డ్రాఫ్ట్‌లను ఉపయోగించి మరో 6 మోటార్ సైకిళ్లను వేరే వ్యక్తులకు విక్రయించినట్టుగా చూపించాడు. కంపెనీలో మోటార్ సైకిళ్ల సంఖ్య తగ్గడం నగదు నిల్వల్లో తేడా రావడం గమనించిన షోరూం యజమాని పోతుమర్తి వెంకట రమేష్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఏఎస్సై రాంబాబు నిందితులైన ఇర్షాద్, సాయికుమార్‌లను అదుపులోనికి తీసుకుని వారి నుంచి ఒక యాక్టివా మోటార్ సైకిల్‌తోపాటు రూ.25 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో కీలక వ్యక్తి అరుున షబ్బీర్‌తోపాటు చందు పరారీలో ఉన్నారు. కేసును త్వరితగతిన ఛేదించిన ఏఎస్సై రాంబాబు, హెడ్ కానిస్టేబుల్స్ బీవీ అప్పారావు, పి.సత్యనారాయణలను ఉన్నతాధికారులు అభినందించారు. -
కార్యకర్తలకు అండగా ఉంటాం
సాక్షి, నెల్లూరు: ‘సంపూర్ణ మెజార్టీతో అధికారంలోకి వస్తామనుకున్నాం. దురదృష్టవశాత్తు రాలేకపోయాం. అయినా వెరవం. కార్యకర్తలకు అండగా నిలబడతాం. వారికి ఏ చిన్న సమస్య వచ్చినా పార్టీ అండ ఉంటుంది. వచ్చే ఎన్నికల్లో పూర్తి మెజార్టీ సాధించేలా కృషి చేద్దాం’ అని వైఎస్సార్సీపీ ముఖ్యనేతలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, డీసీ గోవిందరెడ్డి, అంబటి రాంబాబు అన్నారు. స్థానిక పార్టీ కార్యాలయంలో గురువారం వైఎస్సార్సీపీ సమీక్ష సమావేశం జరి గింది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకూ కోవూరు, నెల్లూరుసిటీ, రూరల్, సర్వేపల్లి, సూళ్లూరుపేట, గూడూరు, కావలి నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలు, కార్యకర్తలతో సమీక్షించారు. పార్టీ గెలుపోటములపై అందరి అభిప్రాయాలను తీసుకున్నారు. పార్టీ అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై సలహాలు, సూచనలను తెలుసుకున్నారు. పరిశీలకులుగా వచ్చిన రామచంద్రారెడ్డి, గోవిందరెడ్డి, అంబటి రాంబాబు కార్యకర్తలనుద్దేశించి మాట్లాడుతూ పార్టీ అధికారంలోకి రాలేదన్న బాధ అందరికీ ఉందన్నారు. ఆ బాధను మరిచి పార్టీని ముందుకు నడిపించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. వైఎస్సార్సీపీ స్వల్ప ఓట్లతేడా అధికారానికి దూరమైందన్నారు. భవిష్యత్‌లో పార్టీని గ్రామస్థాయిలో మరింత పటిష్టం చేసి ముందుకు సాగుదామన్నారు. ఎవరూ భయపడాల్సిన పనిలేదన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు మేరిగ మురళీధర్, నెల్లూరు సిటీ ఎమ్మెల్యేలు అనిల్‌కుమార్‌యాదవ్, రూర ల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి, గూడూరు ఎమ్మెల్యే పాశం సునీల్‌కుమార్, సూళ్లూరుపేట ఎమ్మెల్యే సంజీవయ్య, కోవూరు మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి, సర్వేపల్లి నుంచి పార్టీ నేత బిరదవోలు శ్రీకాంత్‌రెడ్డి, పార్టీ సీఈసీ సభ్యుడు ఎల్లసిరి గోపాల్‌రెడ్డి, నేదురుమల్లి పద్మనాభరెడ్డి, జిల్లా పరిషత్ చైర్మన్ అభ్యర్థి బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి, నెల్లూరు మేయర్ అభ్యర్థి అబ్దుల్ అజీజ్, ఆనం వెంకటరమణారెడ్డి, పాండురంగారెడ్డి, వహీద్‌బాషా పాల్గొన్నారు. కార్యకర్తలను కాపాడుకుంటాం: పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రాబోయే ఐదేళ్లలో వైఎస్సార్సీపీ కార్యకర్తలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా కాపాడుకుంటామని పార్టీ ముఖ్యనేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విలేకరులతో చెప్పారు. పార్టీ అభ్యర్థుల గెలుపోటములకు కారణాలను తెలుసుకునేందుకే సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. అనంతరం పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి నియోజకవర్గాల వారీగా సమీక్షలు నిర్వహిస్తారన్నారు. పార్టీ పటిష్టతకు చర్యలు : డీసీ గోవిందరెడ్డి పార్టీ ఓటమికి కారణాలు తెలుసుకుని వాటిని సరిదిద్ది పార్టీ పటిష్టతకు చర్యలు చేపట్టనున్నట్టు పరిశీలకుడు డీసీ గోవిందరెడ్డి విలేకరులతో చెప్పారు. పార్టీ అధిష్టానం నిర్ణయం మేరకే సమీక్ష నిర్వహిస్తున్నామన్నారు. నేతలు, కార్యకర్తల అభిప్రాయాల నివేదికల ఆధారంగా పార్టీ అధినేత సైతం సమీక్షించి రాబోయే కాలంలో తీసుకోవాల్సిన చర్యలపై నిర్ణయం తీసుకుంటారన్నారు. వైఎస్సార్సీపీ స్వల్ప ఓట్లతోనే ఓటమి చెందిందన్నారు. దీనిని సరిదిద్దుకుని నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషిస్తామన్నారు. కార్యకర్తలు భయపడాల్సిన పనిలేదని గోవిందరెడ్డి చెప్పారు. కార్యక ర్తలకు పార్టీ అండగా ఉంటుంది : అంబటి రాంబాబు ‘పార్టీ అధికారంలోకి వస్తుందని అందరం ఆశించాం. దురదృష్టవశాత్తు ఓటమి చెందాం. అయినా తిరిగి లేచి పార్టీ కోసం పోరాటం చేయాల్సిన సమయం వచ్చింది’ అని అంబటి రాంబాబు విలేకరుల సమావేశంలో చెప్పారు. వైఎస్సార్సీపీ 67 మంది శాసన సభ్యులను గెలవడం సామాన్య విషయం కాదన్నారు. పార్టీ నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషిస్తుందన్నారు. కార్యకర్తలకు అండగా ఉంటామన్నారు. చిన్న సమస్య వచ్చినా పోరాటం సాగిస్తామన్నారు. కాంగ్రెస్ అంతరించిందన్నారు. అక్రమ కేసులు, బెదిరింపులకు వైఎస్సార్సీపీ శ్రేణులు బెదరవన్నారు. -
ముగ్గురిని బలిగొన్న క్షణికావేశం
భార్యా, భర్తల మధ్య తలెత్తిన చిన్న పాటి వివాదం ముగ్గురి ప్రాణాలు బలిగొంది. మాటామాటా అనుకోవడంతో క్షణికావేశానికి లోనైన ఆ ఇల్లాలు తన ఇద్దరి పిల్లలతో సహా తానూ బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. తన చిన్నారి కుమారుడికి, భర్తకు తీరని శోకం మిగిల్చిన ఈ సంఘటన గురువారం వనపర్తి మండల పరిధిలోని ఖాశీంనగర్‌లో చోటు చేసుకుంది. - న్యూస్‌లైన్, ఖాశీంనగర్(వనపర్తిరూరల్) క్షణికావేశంలో ఇద్దరు కూతుళ్లతో సహా బావిలో దూకి ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడటంతో ఖాశీంనగర్ గ్రామం దుఖసాగరంలో మునిగిపోరుుంది. గ్రామస్తులు తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన జక్కుల రాములు, బాలకిష్టమ్మ దంపతులకు ఇద్దరు కూతుళ్లు, కుమారుడు. వ్యవసాయ కుటుంబమైనప్పటికీ పిల్లలను చదివిస్తూ ఉన్నంతలో బాగా బతికేవారు. కాగా నెల రోజుల క్రితం భార్యా భర్తల మధ్య విభేదాలు తలెత్తారుు. ఈ క్రమంలో బుధవారం కూతుళ్లు రాజేశ్వరి, మహేశ్వరిలకు జ్వరం వచ్చింది. వీరిని తీసుకొని వనపర్తికి వెళ్లి ఆస్పత్రికి చూపించమని భార్యకు చెప్పి భర్త పొలానికి వెళ్లాడు. సాయంత్రం రాములు ఇంటికి రాగా భార్య కనిపించలేదు. ఏడు గంటలు దాటినా ఇంటికి రాక పోవటంతో వనపర్తిలో, బంధువుల ఇళ్లలో వెదికాడు. బాలకిష్టమ్మ తల్లి తండ్రులకూ ఫోన్ చేసినా అక్కడికీ రాలేదని చెప్పటంతో ఆందోళన చెంది గ్రామంలో విచారించగా దవాజిపల్లికి వెళ్లే దారి గుండా ఇద్దరు ఆడపిల్లలతో వెళ్లినట్లు తెలుసుకొని ఆ దారి వెంట వెదికారు. గ్రామానికి సమీపంలోని కాల్ల చిన్నయ్య బావి వద్ద చిన్నపాప దుస్తులు, బాలకిష్టమ్మ చెప్పులు ఉండటంతో బావిలో వెదికి బాలకిష్టమ్మ (35), రాజేశ్వరి(10), మహేశ్వరి(8) మృత దేహాలను బయటకు తీశారు. చిన్న పాటి గొడవకు ఇంత పని చేసుకుంటుందని అనుకోలేదని భర్త జక్కుల రాములు రోదించిన తీరు కలచివేసింది. కాగా మృతురాలు బాలకిష్టమ్మ తల్లి బక్కమ్మ తన కూతురిని అల్లుడు రాములు మానసికంగా, శారీరకంగా వేధించటం వల్లనే ఆత్మహత్య చేసుకుందని పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకొని విచారన చేపట్టినట్లు రూరల్ ఎస్ఐ రాంబాబు తెలిపారు. అమ్మ ఎప్పుడు లేస్తుంది ఐదేళ్ల తరుణ్ తల్లి, అక్కల మృతదేహాలను చూసి ఎప్పుడు లేస్తారు అంటూ ఆలోచిస్తూ పక్కనె దిగాలుగా కూర్చోవటం, తన తల్లిని, అక్కలను మింగేసిన బావిని చూస్తూ అమ్మ చచ్చిపోయిందా అంటూ బంధువులను, గ్రామస్తులను ప్రశ్నించటం అక్కడి వారి హృదయాలను కలచి వేసింది. -
ప్రాణం తీసిన నిద్రమత్తు
ఫిరంగిపురం, న్యూస్‌లైన్ :నిద్ర మత్తు లారీ క్లీనర్ ప్రాణాలు తీసింది. డ్రైవర్‌కు నిద్ర ముంచుకురావడంతో లారీని తాను నడుపుతానంటూ స్టీరింగ్ చేతబట్టిన క్లీనర్ కొద్ది సేపటికే కనురెప్ప వాలడంతో ప్రమాదం చోటుచేసుకొని ప్రాణాలు కోల్పోయాడు. మంగళవారం తెల్లవారుజామున ఫిరంగిపురం మండలం మేరికపూడి గ్రామంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి... తూర్పు గోదావరి జిల్లా బిక్కవోలు మండలం బలభద్రపురానికి చెందిన లారీ డ్రైవర్ ఇస్రాయిలు, అతని మేనల్లుడు క్లీనర్ పందిరి రాంబాబు(20) కాకినాడ నుంచి యూరియా లోడు లారీతో నరసరావుపేట బయలుదేరారు. పేరేచర్ల వద్దకు వచ్చేసరికి డ్రైవర్ నిద్ర వస్తోందని, రోడ్డు పక్కన లారీ నిలిపి నిద్రపోదామని చెప్పాడు. అయితే లారీని నేను నడుపుతాను నీవు నిద్రపో అంటూ క్లీనర్ డ్రైవింగ్ చేపట్టాడు. మేరికపూడి గ్రామ సమీపానికి వచ్చే సరికి నిద్రమత్తులో ప్రకాశం జిల్లా అర్ధవీడు మండలం బసివిరెడ్డిపల్లి నుంచి మిర్చిలోడుతో వస్తున్న టాటా మ్యాజిక్ వాహనాన్ని ఢీకొట్టించాడు. ఈ ప్రమాదంలో లారీ నడుపుతున్న రాంబాబు అక్కడికక్కడే మృతి చెందాడు. టాటా మ్యాజిక్‌లో ఉన్న డ్రైవర్ యనమాల రమేష్ , అతని స్నేహితుడు నల్లబోతు ఆంజనేయులుకు తీవ్రగాయాలవడంతో 108 సిబ్బంది నరసరావుపేట ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. లారీ డ్రైవర్ ఇస్రాయిలు, మిర్చి రైతు బ్రహ్మానందరెడ్డి స్వల్పగాయాలతో బయటపడ్డారు. పోలీసులు సంఘటన స్థలాన్ని సందర్శించి కేసు నమోదు చేశారు. -
కోదండరామస్వామి ఆలయంలో చోరీ
బుచ్చిరెడ్డిపాళెం, న్యూస్‌లైన్ : గుర్తు తెలియని వ్యక్తులు కోదండరామస్వామి ఆలయంలో చొరబడి నాలుగు గ్రాముల బంగారు బొట్టు బిళ్లలను చోరీ చేసిన సంఘటన శనివారం రాత్రి చోటు చేసుకుంది. ఆలయ ప్రహరీ పైనుంచి దుండగులు ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశించారు. చతుర్భుజ అమ్మవారి ఆలయం లోపలికి వెళ్లేం దుకు ఆలయం వెనక ఉన్న పశువులను కట్టేసిన గడ్డపారను తీసుకువచ్చి తాళం పగలగొట్టారు. లోపల ద్వారం రాకపోయేసరికి నరసింహస్వామి ఆలయంలోకి వెళ్లారు. అక్కడ లోపల గడియ తొలగించేందుకు విఫలయత్నం చేశారు. గర్భగుడిలోకి వెళ్లి నరసింహస్వామి విగ్రహాన్ని అపహరించేందుకు దించినా తీసుకెళ్లేందుకు విఫలయత్నం చేశారు. దీంతో శ్రీదేవి, భూదేవి, వరదరాజస్వామి ఉత్సవ విగ్రహాలకు నుదుటిపై ఉన్న బంగారు బొట్టు బిళ్లలను చోరీ చేశారు. సమాచారం అందుకున్న నెల్లూరు డీఎస్పీ రాంబాబు, సీఐ సాంబశివరావు, ఎస్సై శ్రీనివాసరావు, పీఎస్సై నరేష్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు.డాగ్‌స్క్వాడ్, క్లూస్ టీం పరిశీలించి ఆధారాలు సేకరించారు. అన్నీ అనుమానాలే.. నరసింహస్వామి ఆలయంలో జరిగిన చోరీపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆలయ పూజారి చెప్పిన మాటలకు పొంతన లేదు. ధనుర్మాసం కావడంతో నరసింహ స్వామి ఆలయంలోని వెండి ఆభరణాలు మూటకట్టి పెట్టామని ఆలయ పూజారి చెబుతున్నారు. అయితే దొంగలే చోరీ చేసేందుకు వెండి ఆభరణాలు మూట కట్టినట్లు తెలుస్తోంది. వెండి ఆభరణాల మూటను తీసుకుని ప్రహరీని దూకడం కష్టమే. వెనక ఇంట్లో చెప్పు గుర్తు తెలియని ఓ వ్యక్తి ఆలయం వెనుక వైపున ఉన్న గుడిసెలోకి వెళ్లేందుకు ప్రయత్నించినట్లు ఆ గుడిసెలో ఉన్న కల్లూరు కొండయ్య చెబుతున్నాడు. తాను ఇంటి బయట నిద్రిస్తుండగా తన భార్య అరిచిందన్నారు. ఇంటి తలుపులు నెట్టేందుకు ప్రయత్నించాడని, తాను దోమ తెర తప్పించి బయటకు వచ్చేలోగా పరారయ్యాడన్నారు. అయితే ఆ సమయంలో తన కాలి చెప్పు ఒకటి ఇక్కడే ఉండిపోయిందన్నారు. డాగ్‌స్క్వాడ్ పరిశీలన డాగ్‌స్క్వాడ్ ఆలయం చుట్టుపక్కలంతా వెళ్లింది. తొలుత ఆలయం పక్కన ప్రహరీ నుంచి దూకేందుకు అవకాశమున్న ప్రాంతం వద్ద ఆగింది. అనంతరం వెనక వైపునున్న గుడిసె వద్దకు వెళ్లింది. అక్కడి నుంచి ఆలయం పక్కనున్న కోనేరు వద్దకు వెళ్లింది. ఆంజనేయస్వామి ఆలయ పూజారి పరాంకుశం ఇంటితో పాటు పలు ఇళ్లలోకి వెళ్లింది. మళ్లీ గుడిసె వద్దకు చేరుకుని గుర్తు తెలియని వ్యక్తి ఆ మార్గంలో ఎలా వచ్చాడో సూచించింది. అయితే చెప్పు వాసన పసిగట్టిన డాగ్‌స్క్వాడ్ చెప్పును వదిలేసిన దుండగుడు అక్కడే తిరిగినట్లు సూచించింది. పరారైనట్లు దాఖలాలు లేవు. ఏది ఏమైనా దర్యాప్తులో వాస్తవాలు తేలాల్సి ఉంది.