పనిచేస్తున్న కంపెనీకే పంగనామం
తణుకు క్రైం, న్యూస్‌లైన్ : ఓ కంపెనీలో అతనొక జనరల్ మేనేజర్. అక్రమ మార్గంలో డబ్బు సంపాదించాలనుకున్నాడు. బంధువులు, సిబ్బంది సాయంతో మూడు మోటార్ సైకిళ్లను దొంగిలించడంతోపాటు మరో 6 మోటార్ సైకిళ్లను పక్కదారి పట్టించాడు. చివరకు కటకటాల పాలయ్యూడు. తణుకు శివారు పైడిపర్రులో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించి రూరల్ ఏఎస్సై కె.సీతారామ్ (రాంబాబు) తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పైడిపర్రులోని విజయలక్ష్మి హోండా షోరూంలో రాజమండ్రికి చెందిన షేక్ మదీనా ఇర్షాద్ కొంతకాలంగా జనరల్ మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. అతడి బావమరిది నిడదవోలుకు చెందిన అబ్దుల్ షబ్బీర్, కంపెనీలో మెకానిక్‌లుగా పనిచేస్తున్న పల్లాని సాయికుమార్, చందులతో కలసి మోటార్ సైకిళ్లను దొంగిలించేందుకు పన్నాగం పన్నాడు. ఈ క్రమంలో గడచిన నెల రోజుల్లో ఒక హోండా యూక్టివా, మరో రెండు యూనికార్న్ మోటార్ సైకిళ్లను దొంగిలించారు.
దీంతోపాటు వాహనాల్ని కొనుగోలు చేసేవారు ఇచ్చిన మూడు డిమాండ్ డ్రాఫ్ట్‌లను మేనేజర్ ఇర్షాద్ బ్యాంకులో వేసి డ్రా చేయూల్సి ఉండగా, అలా చేయలేదు. ఆ డ్రాఫ్ట్‌లను ఉపయోగించి మరో 6 మోటార్ సైకిళ్లను వేరే వ్యక్తులకు విక్రయించినట్టుగా చూపించాడు. కంపెనీలో మోటార్ సైకిళ్ల సంఖ్య తగ్గడం నగదు నిల్వల్లో తేడా రావడం గమనించిన షోరూం యజమాని పోతుమర్తి వెంకట రమేష్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఏఎస్సై రాంబాబు నిందితులైన ఇర్షాద్, సాయికుమార్‌లను అదుపులోనికి తీసుకుని వారి నుంచి ఒక యాక్టివా మోటార్ సైకిల్‌తోపాటు రూ.25 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో కీలక వ్యక్తి అరుున షబ్బీర్‌తోపాటు చందు పరారీలో ఉన్నారు. కేసును త్వరితగతిన ఛేదించిన ఏఎస్సై రాంబాబు, హెడ్ కానిస్టేబుల్స్ బీవీ అప్పారావు, పి.సత్యనారాయణలను ఉన్నతాధికారులు అభినందించారు.