ramamurthy
-
నేలలపై శ్రద్ధ పెట్టాలి!
2024 అంతర్జాతీయ భూముల దినోత్సవం (డిసెంబర్ 5) సందర్భంగా ‘మట్టి గణాంకాల సేకరణ, పర్యవేక్షణ, నిర్వహణ’పై దృష్టిని కేంద్రీకరించాలని ఐక్యరాజ్యసమితికి చెందిన ఆహార వ్యవసాయ సంస్థ (ఎఫ్.ఎ.ఓ.) ప్రపంచ దేశాల ప్రభుత్వాలకు పిలుపునిచ్చింది.‘మన కాళ్ల కింద ఉన్న నేల ఒక జీవవ్యవస్థ. అనేక జాతుల మనోహరమైన మొక్కలు, జంతుజాలానికి నిలయం. మనకు పోషకాహారంతో పాటు స్వచ్ఛమైన నీరు, జీవవైవిధ్యాన్ని అందిస్తున్న నేలలపై శ్రద్ధ పెట్టి పరిరక్షించుకోవటానికి తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు దృష్టి కేంద్రీకరించాల’ని ప్రముఖ నేలల నిపుణుడు డాక్టర్ వి. రామ్మూర్తి సూచించారు. బెంగళూరులోని నేషనల్ బ్యూరో ఆఫ్ సాయిల్ సర్వే అండ్ లాండ్ యూజ్ ప్లానింగ్ (ఐసిఎఆర్ అనుబంధం)ప్రాంతీయ కార్యాలయం అధిపతిగా ప్రధాన శాస్త్రవేత్త (వ్యవసాయం)గా ఆయన వ్యవహరిస్తున్నారు.దక్షిణాది రాష్ట్రాల్లో నేలల బాగోగులపై అధ్యయనం చేసి, విధాన నిర్ణేతలకు తగు సూచనలు ఇచ్చే కేంద్ర ప్రభుత్వ సంస్థ ఇది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రంలోని అనేక మండలాల్లో నేలల స్థితిగతులపై తమ సంస్థ జరిపిన అధ్యయనంలో వెల్లడైన విషయాలను ఆయన ‘సాక్షి సాగుబడి’కి వెల్లడించారు. 2 రాష్ట్రాల్లో నేలలపై అధ్యయనంతెలంగాణలోని గజ్వేల్, ఇంద్రవెల్లి, మహబూబ్‌నగర్ రూరల్ మండలాల్లో.. ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్సార్ జిల్లా రాయచోటి, తొండూరు మండలాల్లో, అనంతపురం జిల్లా కదిరి, ఓబుల దేవర చెరువు(ఓడిసి) మండలాల్లోని నేలల స్థితిగతులపై నేషనల్ బ్యూరో ఆఫ్ సాయిల్ సర్వే అండ్ లాండ్ యూజ్ ప్లానింగ్ తరఫున అధ్యయనం చేశామని డా. రామ్మూర్తి తెలిపారు. భూమి స్థితిగతులను తెలుసుకోవడానికి అది ఏ రకం భూమి? మట్టి ఎంత లోతుంది? వంటి వివరాలతో పాటు భూసారాన్ని అంచనా వేయటానికి సేంద్రియ కర్బనం ఆయా నేలల్లో ఎంత శాతం ఉందో మట్టి పరీక్షల ద్వారా నిర్థారణ చేస్తారు. సేంద్రియ కర్బనాన్ని మూడు స్థాయిల్లో (తక్కువ – 0.50% లోపు, మధ్యస్థం – 0.50–0.75% మధ్య, అధికం – 0.75% కన్నా ఎక్కువ) లెక్కిస్తారు. సేంద్రియ కర్బనం తెలంగాణ నేలలతో పోల్చితే రాయలసీమ నేలల్లో తక్కువగా ఉందని డా. రామ్మూర్తి అన్నారు. ఈ తేడాలకు కారణం ప్రకృతి వైపరీత్యాలు, వర్షపాతం, సాగు పద్ధతి కారణాలని తెలిపారు. మహబూబ్‌నగర్ రూరల్ మండలంలోని పరీక్షలు నిర్వహించిన సాగు భూముల్లో 100% నేలల్లో సేంద్రియ కర్బన శాతం అధికంగా (అంటే.. 0.75% కన్నా ఎక్కువగా) ఉండటం విశేషం. అనంతపురం జిల్లా ఇనగలూరు పంచాయతీలోని 46.29% సాగు భూముల్లో సేంద్రియ కర్బనం తక్కువగా, 35.26% భూముల్లో మధ్యస్థంగా, 18.45% భూముల్లో అధికంగా ఉందని వెల్లడైందన్నారు (పూర్తి వివరాలు పట్టికలో). వరి, పత్తి, మిర్చికి రసాయనాల వాడకం ఎక్కువవరి, పత్తి, మిర్చి పంటలకు రసాయనిక ఎరువులు మరీ ఎక్కువగా వేస్తున్నారు. ఎంత అవసరమో గమనించకుండా పక్క రైతును చూసి వేస్తున్నారు. పురుగుమందుల పిచికారీ కూడా అంతే. పశువుల ఎరువు, పచ్చిరొట్ట ఎరువులను చాలా మంది రైతులు వాడటం లేదు. అదే పంటను ప్రతి ఏటా సాగు చేస్తున్నారు. అందుకే సేంద్రియ కర్బనం అడుగంటుతోందని డా. రామ్మూర్తి తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు, రైతులు ఇప్పటికైనా జాగ్రత్తపడి సేంద్రియ కర్బనాన్ని అన్ని సాగు భూముల్లోనూ 0.7 శాతానికి పెంచుకోకపోతే భూములు సాగు యోగ్యం కాకుండా పోతాయని హెచ్చరిస్తున్నారాయన.΄పొటెన్షియల్ క్రాప్ జోన్లు ఆయా భూముల స్వభావం, భూసార పరిస్థితులు, ఆప్రాంత వాతావరణం, వర్షపాతం, అక్కడి ప్రజల ఆసక్తి, మార్కెట్ స్థితిగతులపై 20 ఏళ్ల క్రితం నాటి నుంచి సమాచారం సేకరించి విశ్లేషించామని డా. రామ్మూర్తి చెప్పారు. ఈ సమాచారంతో శాస్త్రీయంగా ΄పొటెన్షియల్ క్రాప్ జోన్స్ నివేదికలు ఇస్తున్నామన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో పత్తి, వరి, జొన్న, వేరుశనగ పంటలకు ఏయే జిల్లాలో ఎన్ని హెక్టార్ల భూమిలో ‘చాలా బాగా, ఒక మాదిరిగా, కొంతమేరకు’ ఆయా పంటల సాగుకు అనువుగా ఉన్నాయో చెప్పామన్నారు.అన్ని మండలాల్లో మట్టిని అధ్యయనం చేయాలిభూమిపై మన జీవితం ఆరోగ్యకరమైన నేలలపై ఆధారపడి ఉంటుంది. మన పాదాల కింద ఉన్న నేల ఒక జీవవ్యవస్థ. అనేక మనోహరమైన మొక్కలు, చెట్లు, జంతువులకు నిలయం. మట్టి మనకు పోషకాహారాన్ని, స్వచ్ఛమైన నీటిని, జీవవైవిధ్యాన్ని అందిస్తుంది. ప్రతి జిల్లాలో అన్ని మండలాల్లోని ΄పొలాల్లో మట్టి పరీక్షలు చేసి, అధ్యయనం చేయాలి. మన మట్టిలో వుండే పోషకాలు ఏమిటి? మట్టిలోని జీవరాశి ఏమేమి ఉన్నాయి? ఏమేమి లేవు? కాలక్రమంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటున్నాయి? సాగు భూములు బాగుండాలంటే వాటిని ఎలా నిర్వహించుకోవాలి? అనే విషయాలపై పాలకులు శ్రద్ధ చూపాలి.ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు ్రపోత్సాహమిస్తే మట్టి ఎలా ఉందో పరీక్షించి ఎక్కువగా ఎరువులు వేయకుండా నివారించటంతో పాటు పంటల మార్పిడి,‡మట్టిని పంటలతో కప్పి ఉంచటం వంటి భూసంరక్షణ పద్ధతులపై రైతులకు చైతన్యం కలిగిస్తే చాలా ఉపయోగకరంగా ఉంటుంది. సుసంపన్న సాంస్కృతిక జీవనానికి, ఆరోగ్యకరమైన జీవనానికి కూడా మట్టి మూలాధారం. మట్టి ద్వారానే 95% ఆహారం మనకు వస్తోంది. ఇందులో 18 సూక్ష్మ,స్థూల పోషకాంశాలు ఉంటాయి. వీటిలో 15 పోషకాంశాలను నేల నుంచి మిగతా మూడిటిని వాతావరణం నుంచి మనం ΄పొందుతున్నాం. ఈ స్పృహతో సాగు నేలల ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాలి. – డాక్టర్ వి. రామ్మూర్తి (94803 15146), అధిపతి, ప్రధాన శాస్త్రవేత్త (వ్యవసాయం),్ర పాంతీయ కార్యాలయం, ఐసిఎఆర్– నేషనల్ బ్యూరో ఆఫ్ సాయిల్ సర్వే అండ్ లాండ్ యూజ్ ప్లానింగ్, బెంగళూరుఅవును..! మీరు చదివింది, ఈ ఫొటోలో చూస్తోంది.. నిజమే! మన పుచ్చ తోటల్లో పాదులు నేలపై పరచుకొని ఉంటాయి. పుచ్చ కాయలు నేలపైనే పెరుగుతాయి కదా. సౌతాఫ్రికాలో ఒక కంపెనీ పాలీహౌస్‌లలో పుచ్చ పాదులు నిలువుగా ఎగబాగుకుతున్నాయి. పుచ్చ కాయలు వాటికి వేలాడుతున్నాయి. ట్రెల్లిస్ పద్ధతిలో పెరిగే టొమాటోల మాదిరిగా ఈ పుచ్చకాయలు వేలాడుతున్నాయి కదూ.. కాండీ బాల్ సీడ్లెస్ పుచ్చకాయలు కిలో నుంచి కిలోన్నర వరకు బరువు పెరుగుతాయి. అదేమాదిరిగా కిలో బరువు పెరిగే స్మైల్ మెలన్స్ (ఇదో రకం కర్బూజ) పండ్లను కూడా నిలువు తోటల్లో పెంచుతున్నారు. టొమాటోలు వంటి కాయలు బరువు తక్కువగా ఉంటాయి కాబట్టి తీగజాతి మొక్కలు మొయ్యగలుగుతాయి.అయితే, ఇలాంటి నిలువు తోటలో పుచ్చకాయలు, కర్బూజ కాయల బరువు మొక్కలకు భారం కాకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ప్లాస్టిక్ నెట్ కవర్లతో కాయలను ప్లాస్టిక్ వైర్లకు కట్టేస్తున్నారు. ‘నిలువు తోటలో పెరిగిన పుచ్చకాయలను మేం త్వరలోనే అమ్మకానికి పెట్టబోతున్నాం. సౌతాఫ్రికా మార్కెట్లో మేమే ఫస్ట్’ అంటున్నారు ఆ కంపెనీ ప్రతినిధి ఫ్రాంకోయిస్ ఫౌరీ. పాలీహౌస్‌లు, నెట్‌హౌస్‌లలో, మేడపై ఇంటిపంటల్లో ట్రెల్లిస్ పుచ్చ, కర్బూజ సాగు సాధ్యమే అని గ్రహించాలి!12 నుంచి విశాఖ ఆర్గానిక్ మేళాగో ఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సంఘం, ఏపీ రైతు సాధికార సంస్థ, ప్రకృతి వ్యవసాయదారుల సేవాల సంఘం సంయుక్తంగా డిసెంబర్ 12 నుంచి 15వ తేదీ వరకు విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో 5వ విశాఖ ఆర్గానిక్ మేళా నిర్వహించనున్నాయి. రైతులు, ప్రకృతి/ సేంద్రియ వ్యవసాయదారులు, ఆహారోత్పత్తుల ఉత్పత్తిదారుల, వినియోగదారులు పెద్ద ఎత్తున పాల్గొనాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు. 12న ఉ. 10 గంటలకుప్రారంభోత్సవంతో పాటు సేంద్రియ/ప్రకృతి వ్యవసాయదారుల సమ్మేళనం ఉంటుంది. 13న ఉ. 10 గం.కు ఆరోగ్య అవగాహన సదస్సు, 14న ఆహారప్రాసెసింగ్పై సదస్సు, 15 సేంద్రియ ఇంటిపంటలు/ మిద్దె తోటల సదస్సు, ముగింపు సమావేశం జరుగుతాయి. అందరూ ఆహ్వానితులే. ఇతర వివరాలకు.. 78934 56163, 91001 86522. -
చంద్రబాబు తమ్ముడు కన్నుమూత
-
గిడుగు రామమూర్తి జయంతి సందర్భంగా వైఎస్ జగన్ ట్వీట్
-
Savitribai Phule: మహిళా విద్యకు తొలి వెలుతురు
‘సావిత్రిబాయి ఫూలే ప్రతిరోజూ సంచిలో అదనంగా చీర పెట్టుకుని స్కూల్‌కు వెళ్లేవారు. దారిలో ఎవరో ఒకరు ఆమె మీద పేడ విసిరితే కడుక్కుని కట్టుకోవడానికి’ అని రాస్తుంది రీతా రామస్వామి గుప్తా. నిమ్న వర్గాల ఆడపిల్లల విద్యకు జీవితాన్ని అంకితం చేసిన సావిత్రిబాయి ఫూలేమీద ఎన్నో పుస్తకాలు వచ్చాయి. కాని రచయిత్రి రీతా రామస్వామి మరిన్ని జీవిత చిత్రాలను సేకరించి తెచ్చిన పుస్తకం ‘సావిత్రిబాయి పూలే’ తాజాగా విడుదలైంది. రీతా రామస్వామి గురించి, పుస్తకంలో ఉన్న విశేషాల గురించి... ‘ఇవాళ బాలికల విద్య అనగానే ప్రపంచానికి మలాలా పేరు గుర్తుకొస్తుంది. కాని బాలికల విద్య కోసం జీవితాన్ని అర్పించిన తొలి మహిళ సావిత్రిబాయి పూలే. మన దేశంలో ఆమె తొలి మహిళా ఉపాధ్యాయిని. ఆడపిల్లల చదువును ప్రచారం చేయడానికి ఆమె ఎదుర్కొన్న వ్యతిరేకత అంతా ఇంతా కాదు’ అంటుంది రీతా రామస్వామి గుప్తా. గతంలో నటుడు సంజీవ్ కుమార్‌పై రాసిన బయోగ్రఫీతో పాఠకులకు తెలిసిన రీతా రామస్వామి ఆ తర్వాత ‘రంగ్ దే బసంతి’ దర్శకుడు ఓం ప్రకాష్ మెహ్రాతో కలిసి అతని జీవిత సంగ్రహం రాసింది. ‘ఇలా ఇంకొన్ని పుస్తకాలు రాయాలనుకుంటుండగా నా 18 ఏళ్ల కుమార్తె– అమ్మా... ఎందుకు నువ్వు ఎప్పుడూ మగవాళ్ల గురించే రాస్తావు. నువ్వు రాయదగ్గ స్త్రీలు లేరా? అని ప్రశ్నించింది. ఆ ప్రశ్న నన్ను ఆలోచింపచేసింది. దానికి జవాబే నా కొత్త పుస్తకం– సావిత్రిబాయి పూలే.. హర్ లైఫ్.. హర్ రిలేషన్షిప్స్.. హర్ లెగసీ’ అంది రీతా రామస్వామి. హార్పర్ కాలిన్స్ ఇండియా ప్రచురణ సంస్థ నుంచి ఈ పుస్తకం తాజాగా విడుదలైంది. బలహీనులకు అందని విద్య ‘బ్రిటిష్ వారు 1813లో క్రైస్తవ మిషనరీల ద్వారా మన దేశంలో పాశ్చాత్య విద్యకు అంకురార్పణ చేశారు. అయితే వారి ఉద్దేశాలు వేరే. తమ వ్యవహారాల కోసం ఇంగ్లిష్ తెలిసిన కొంతమంది ఉద్యోగులు అవసరం కనుక పై వర్గాల వారికి చదువు నేర్పిస్తే వారి నుంచి కింది వర్గాల వారికి చదువు అందుతుంది అని భావించారు. కాని పై వర్గాలకు మొదలైన చదువు కింది వర్గాల వరకూ చేరలేదు. కింది వర్గాల వారికి పాఠశాలల్లో అనుమతి లేని పరిస్థితి. అంటరానితనం విస్తృతంగా ఉండేది. ఇక చదువుకు ఆడపిల్లలు నిషిద్ధం చేయబడ్డారు. ప్రభుత్వ టీచర్లకు ఇంగ్లిష్ వచ్చి ఉండాలన్న నియమం కూడా బ్రిటిష్ ప్రభుత్వం పెట్టింది. వీటన్నింటినీ దాటి సావిత్రిబాయి పూలే టీచర్ అయ్యింది. జ్యోతిబా పూలేతో కలిసి 1848లో బ్రిటిష్‌వారితో సంబంధం లేని, మిషనరీలతో సంబంధం లేని బాలికల తొలి పాఠశాలను మొదలెట్టింది. దిగువ వర్గాల బాలికల విద్య కోసం పోరాడింది’ అంటుంది రీతా రామస్వామి. ఆ ఇద్దరు ‘సావిత్రిబాయి పూలే హర్ లైఫ్, హర్ రిలేషన్షిప్స్, హర్ లెగసీ’... పుస్తకంలో రీతా రామస్వామి కేవలం సావిత్రిబాయి పూలే గురించే రాయలేదు. ఆమెను ఆదర్శంగా తీసుకుని బాలికల విద్య కోసం తోడైన తొలి ముస్లిం ఉపాధ్యాయిని ఫాతిమా షేక్ గురించీ... సావిత్రి, ఫాతిమా కలిసి మహరాష్ట్రలో బాలికల విద్య కోసం స్కూళ్లు స్థాపించి నిర్వహించడానికి పడిన ఆరాటం గురించి కూడా రాసింది. ‘ఫాతిమ షేక్ తొలి క్వాలిఫైడ్ ముస్లిం ఉమెన్ టీచర్ మన దేశంలో. ఆమె సావిత్రిబాయి పూలేకి బాసటగా నిలిచింది. ఒక దశలో సావిత్రిబాయి సుదీర్ఘకాలం జబ్బు పడితే స్కూళ్ల నిర్వహణభారం మోసింది. ఆ వివరాలన్నీ నా పుస్తకంలో ఉన్నాయి’ అని తెలిపింది రీతా రామస్వామి. ఎన్నెన్నో అవమానాలు ‘దిగువ వర్గాల వారిలో ఆడపిల్లలకు చదువెందుకు అనే భావన విపరీతంగా ఉండేది. వాళ్లకు చిన్న వయసులో పెళ్లిళ్లు చేసేవారు. కాని వారి ఇళ్లకు వెళ్లి బడికి పంపమని కోరేది సావిత్రి. వారు శాపనార్థాలు పెట్టేవారు. దారిన పోతూ ఉంటే రాళ్లు విసిరేవారు. దానికి తోడు పేద వర్గాల వారిని చదివిస్తున్నందుకు అగ్రవర్ణాలు కక్ష కట్టి సావిత్రిబాయి మీద పేడనీళ్లు చల్లేవారు. అందుకని ఆమె స్కూలుకు వెళుతున్నప్పుడు తన సంచిలో చీర అదనంగా పెట్టుకునేది. ఎవరైనా పేడ నీళ్లు చల్లినా వెరవకుండా స్కూలుకు వెళ్లి చీర మార్చుకుని పాఠాలు చెప్పేది. ఆమె స్ఫూర్తి నేటికీ కొనసాగడం వల్ల మన దేశంలో బాలికల విద్య గణనీయంగా పెరిగింది. చదువులో ఉద్యోగాల్లో అమ్మాయిలు గొప్పగా రాణిస్తున్నారు. వారంతా తప్పక తెలుసుకోవాల్సిన మహనీయురాలు సావిత్రిబాయి పూలే’ అంది రీతా రామస్వామి. -
భార్య హత్య కేసులో దోషిగా మాజీ ఎమ్మెల్యే
భువనేశ్వర్: భార్య హత్య కేసులో మాజీ ఎమ్మెల్యేని దోషిగా స్థానిక కోర్టు నిర్ధారించింది. వివరాల్లోకి వెళ్తే.. 27 ఏళ్ల క్రితం గుణుపురం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే రామమూర్తి గొమాంగో భార్య అనుమానస్పద మృతి కేసు విచారణలో హత్యగా తేలింది. ఈ కేసు విచారణ జరిపిన స్థానిక కోర్టు మాజీ ఎమ్మెల్యేనే ఈ కేసులో దోషిగా ప్రకటించింది. 11 మంది సాక్షుల వాంగ్మూలాలు, 15 పత్రాల ఆధారంగా కోర్టు అతడిని దోషిగా నిర్ధారించింది. శిక్ష వివరాలను మంగళవారం ప్రకటిస్తామని సంబంధిత వర్గాలు తెలిపాయి. అతని భార్య సగం కాలిన మృతదేహాన్ని 1995 సంవత్సరంలో స్థానిక ఖారవేళ నగర్లో ఎమ్మెల్యే నివాసం నుండి స్వాధీనం చేసుకున్నారు. అప్పటికి ఆమె గర్భవతి అని గుర్తించారు. తొలుత అసహజ మరణంగా కేసు నమోదు చేసిన పోలీసులు ఆ తర్వాత హత్య కేసుగా ధ్రువీకరించారు. గొమాంగో రాజకీయ ప్రస్థానం 1995లో గుణుపురం నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి జనతాదళ్ టికెట్‌పై రామమూర్తి గొమాంగో ఎన్నికయ్యారు. అనంతరం 2000 సంవత్సరంలో బీజేపీలో చేరారు. 2000లో గుణుపూర్ నుంచి బీజేపీ టికెట్‌పై పోటీ చేసి 30 వేలకు పైగా ఓట్ల ఆధిక్యంతో మరలా ఎన్నికయ్యారు. 2004 అసెంబ్లీ ఎన్నికల్లో అతను తన సమీప కాంగ్రెస్ ప్రత్యర్థి హేమా గొమాంగోపై 20,000 ఓట్ల తేడాతో ఓడిపోయాడు. 2009లో బిజూ జనతా దళ్, భారతీయ జనతా పార్టీ కూటమి విడిపోవడంతో బీజేపీ నుంచి దూరమయ్యారు. అయితే 2014 సంవత్సరం సార్వత్రిక ఎన్నికల్లో గుణుపురం అసెంబ్లీ స్థానానికి పోటీ చేసేందుకు బీజేడీ టిక్కెట్ నిరాకరించడంతో ఆయన తిరిగి మరలా బీజేపీలో చేరారు. -
16 ఓట్లతో గెలుపు తారుమారు.. కన్నీటి పర్యంతమైన సౌమ్యారెడ్డి
30 వేలు, 40 వేల ఓట్లతో ఓడిపోవడం వేరు. రాష్ట్రమంతటా ఎదురుగాలి వీచినప్పుడు అందరితో పాటు ఓటమి పాలైతే పెద్ద బాధ ఉండదు. కానీ అప్పటికే సిట్టింగ్ ఎమ్మెల్యే, రాష్ట్రమంతా హస్తం పవనాలు వీచాయి. ఈ సమయంలో కాంగ్రెస్ అభ్యర్థి 160 ఓట్లతో గెలిచి హమ్మయ్య అనుకున్నారు. కానీ బీజేపీ డిమాండ్‌తో పదే పదే రీకౌంటింగ్ జరిపి చివరకు 16 ఓట్లతో ప్రత్యర్తిని గెలుపు వరించింది. బెంగళూరు జయనగర నియోజకవర్గంలో అతి స్వల్ప ఓట్లు అభ్యర్థుల రాతను తారుమారు చేశాయి. బెంగళూరు: ఐటీ సిటీలో జయనగర నియోజకవర్గంలో నాటకీయ పరిణామాల మధ్య విజేత మారిపోయారు. తొలుత ఎమ్మెల్యే, కాంగ్రెస్ అభ్యర్థి సౌమ్యారెడ్డి స్వల్ప మెజారిటీతో గెలిచినట్లు ప్రకటించడంతో సంబరాలు మిన్నంటాయి. అంతలోనే బీజేపీ నాయకులు పట్టుబట్టి రీకౌంటింగ్ చేయించారు. ఇందులో బీజేపీ అభ్యర్థి సీకే.రామమూర్తి 16 ఓట్లతో గెలిచినట్లు అధికారులు తెలిపారు. దీంతో క్షణాల్లో పరిస్థితి మారిపోయింది. శనివారం ఉదయం నుంచి అర్ధరాత్రి దాటేవరకూ ఏకధాటిగా హైడ్రామా టెన్షన్ పుట్టించింది. పోటాపోటీగా రౌండ్లు జయనగర ఎస్‌ఎస్‌ఎంఆర్‌వీ కాలేజీ కౌంటింగ్ కేంద్రంలో లెక్కింపు ఆరంభమైంది. ప్రతి రౌండ్లో కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు పోటాపోటీగా తలపడ్డారు. మధ్యాహ్నం ఓట్ల లెక్కింపు పూర్తయిన వెంటనే సౌమ్యారెడ్డి 160 ఓట్ల మెజారిటీతో గెలుపొందారని ప్రకటించగానే ఆమెతో పాటు కార్యకర్తల సంతోషానికి హద్దుల్లేవు. కానీ ఓట్ల తేడా చాలా తక్కువగా ఉండటంతో రీకౌంటింగ్ చేయాలని బీజేపీ అభ్యర్థి రామూర్తి డిమాండ్ చేయడంతో మళ్లీ రీకౌంటింగ్ ప్రారంభించారు. చదవండి: ఎమ్మెల్యేలతో సిద్దరామయ్య రహస్య భేటీ? గెలుపు ప్రకటన జిల్లా ఎన్నికల అధికారి తుషార్ గిరినాథ్ రీకౌంటింగ్ చేసిన విధానం గురించి నేతలకు వివరించి, సీకే రామమూర్తి 16 ఓట్లతో గెలిచినట్లు ప్రకటించారు. బీజేపీకి 57,797 ఓట్లు, కాంగ్రెస్‌కు 57,781 ఓట్లు వచ్చాయని తెలిపారు. కార్యకర్తల ధర్నా దీంతో కాంగ్రెస్ నేతలు గత్యంతరం లేక ఇంటి ముఖం పట్టారు. గెలుపు దక్కి మళ్లీ ఓటమి పాలు కావడంతో సౌమ్యారెడ్డి విలపించారు. 16 ఓట్ల మెజారిటీతో సీకే రామూర్తి గెలుపు సర్టిఫికెట్ అందుకున్నారు. ఈ సమయంలో కాంగ్రెస్ కార్యకర్తలు బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కౌంటింగ్‌లో గోల్మాల్ జరిగిందంటూ అర్దగంటకు పైగా ధర్నాకు దిగారు. కాగా, ఫలితాలపై కోర్టును ఆశ్రయించాలని సౌమ్యారెడ్డి నిర్ణయించారు. పదేపదే ఓట్ల లెక్కింపు మొదటిసారి నిర్వహించిన రీకౌంటింగ్‌ను ఇద్దరు అభ్యర్థులు ఒప్పుకోలేదు. దీంతో వరుసగా మూడుసార్లు రీకౌంటింగ్ చేశారు. ఈ సమయంలో ఓట్ల లెక్కింపు సమయంలో గోల్మాల్ జరిగిందని కాంగ్రెస్ కార్యకర్తలు గొడవకు దిగడంతో కేపీసీసీ అధ్యక్షుడు డీకే.శివకుమార్ కౌంటింగ్ కేంద్రానికి వచ్చి పరిశీలించారు. కౌంటింగ్ కేంద్రం వద్ద సౌమ్యారెడ్డి తండ్రి రామలింగారెడ్డి, ఎంపీ డీకే.సురేశ్, కేపీసీసీ చీఫ్ డీకే.శివకుమార్, ఇక బీజేపీ నేతలు ఆర్.అశోక్, ఎంపీ తేజస్విసూర్య మకాం పెట్టడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. -
సెన్సెక్స్ డెరివేటివ్స్‌పై బీఎస్ఈ దృష్టి
కోల్‌కతా: స్టాక్ ఎక్సే్ఛంజీ దిగ్గజం బీఎస్ఈ తిరిగి సెన్సెక్స్–30 డెరివేటివ్స్‌ను ప్రారంభించే యోచనలో ఉంది. సభ్యుల నుంచి ఇందుకు అవసరమైన సూచనలు, వివరాలను సేకరిస్తున్నట్లు బీఎస్ఈ ఎండీ, సీఈవో సుందరరామన్ రామమూర్తి వెల్లడించారు. ప్రధాన ఇండెక్స్ సెన్సెక్స్‌లో భాగమైన 30 షేర్లలో ఆప్షన్స్, ఫ్యూచర్స్(డెరివేటివ్స్)ను 2000లో బీఎస్ఈ ప్రవేశపెట్టింది. అయితే ప్రత్యర్థి ఎక్సే్ఛంజీ ఎన్ఎస్ఈలో భాగమైన నిఫ్టీ–50 డెరివేటివ్స్తో పోలిస్తే ఇన్వెస్టర్ల నుంచి తగిన ఆసక్తిని సాధించలేకపోయింది. దీంతో మరోసారి సెన్సెక్స్–30 డెరివేటివ్స్ ప్రొడక్టులను ప్రవేశపెట్టే ప్రణాళికల్లో ఉన్నట్లు రామమూర్తి తెలియజేశారు. దీనిలో భాగంగా మార్కెట్ పార్టిసిపెంట్ల ద్వారా అభిప్రాయాలు, సూచనలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. అసో చామ్ ఇక్కడ నిర్వహించిన ఒక సదస్సు సందర్భంగా రామమూర్తి సెన్సెక్స్ దిగ్గజాలలో ఎఫ్‌అండ్‌వో కాంట్రాక్టులను ప్రవేశపెట్టడంపై వివరాలు వెల్లడించారు. వెరసి ఎఫ్‌అండ్‌వో విభాగం ఇన్వెస్టర్లను ఆకట్టుకోవడంలో మెరుగుపరచవలసిన అంశాలపై దృష్టి పెట్టనున్నట్లు తెలియజేశారు. బీఎస్ఈలో అత్య ధికంగా ట్రేడయ్యే 30 బ్లూచిప్ కంపెనీలు సెన్సెక్స్‌లో భాగమయ్యే సంగతి తెలిసిందే. వీటిలో డెరివేటివ్స్‌ను పునఃప్రారంభించే సన్నాహాల్లో ఉన్న ట్లు రామమూర్తి పేర్కొన్నారు. నిఫ్టీ–50తో పోలిస్తే సెన్సెక్స్–30 డెరివేటివ్స్ కొంత విభిన్నంగా ఉండనున్నట్లు సూ చించారు. ఒకే విధమైన రెండు విభిన్న ప్రొడక్టులు అందుబాటులో ఉన్నపుడు వివిధ ట్రేడింగ్ వ్యూ హాలు, ఇంటర్‌ప్లే ద్వారా మార్కెట్లు మరింత వృద్ధి చెందేందుకు వీలుంటుందని అభిప్రాయపడ్డారు. -
తల్లిదండ్రులే ఆమె పిల్లలు
కడుపున పుట్టిన వాళ్లు తరిమేసిన తల్లిదండ్రులు ఎక్కడికి పోవాలి? పిల్లల్ని పెంచి పెద్ద చేసి పసి పిల్లల వయసుకు చేరుకున్న ఆ వృద్ధులను ఎవరు ఆదుకోవాలి? ‘నేను మీ తల్లిని’ అంది రాజేశ్వరి. నీలగిరులకు ఎవరైనా ఆహ్లాదం కోసం వెళతారు. కాని పిల్లలు విడిచిన తల్లిదండ్రులు మాత్రం రాజేశ్వరిని వెతుక్కుంటూ వెళతారు. ఆమె నడుపుతున్న హోమ్ వారికి శాశ్వత ఇల్లుగా మారింది. ఊరూరా ఎంతమంది రాజేశ్వరుల అవసరం ఉందో కదా ఇప్పుడు. ఈ కథ 20 ఏళ్ల క్రితం మొదలైంది. ఆ రోజు రామమూర్తి తన ఇంటికి ఒక వృద్ధురాలిని తీసుకుని వచ్చాడు. భార్య రాజేశ్వరితో ‘ఇవాళ నుంచి ఈమె మనతోనే ఉంటుంది’ అన్నాడు. రాజేశ్వరి ‘ఎవరు.. ఏమిటి’ అని భర్తని ఒక్క మాట కూడా అడగలేదు. ‘అలాగే’ అంది. అయితే ఆ వృద్ధురాలు లెప్రెసీ పేషెంట్. ఆమెకు ఆ వ్యాధి ఉందనో, మరే కారణం చేతనో అయినవారు ఆమెను వదిలేశారు. రామమూర్తి, రాజేశ్వరిలకు ఇద్దరు ఆడపిల్లలు. చదువుకుంటున్నారు. ‘లెప్రసీ అంటువ్యాధి ఏమీ కాదు కదా.. అదేం పర్వాలేదులే’ అన్నాడు రామమూర్తి. దానికి కారణం– అతడు హెల్త్ డిపార్ట్మెంట్లో పని చేస్తూ ఉండటమే. లెప్రసీ పేషంట్స్‌తో ఎలా వ్యవహరించాలో అతనికి తెలుసు. అలా నీలగిరి జిల్లాలో కూనూరుకు పక్కనే ఉండే తెనాలి అనే చిన్న ఊళ్లో ఒక పెద్ద కార్యక్రమానికి తెర లేచింది. తలుపు తట్టండి... తెరవబడును మరో రెండు రోజులకే రామమూర్తి తలుపు తట్టబడింది. రాజేశ్వరి తెరిచి చూస్తే ఎదురుగా మరో వృద్ధురాలు. ‘మా ఇంట్లో నుంచి గెంటేశారు. మీ ఇంట్లో చోటు ఇవ్వండమ్మా’... రాజేశ్వరి గడప నుంచి పక్కకు జరిగి ఆమెను లోపలికి రానిచ్చింది. మరో వారంలో ఇంకో వృద్ధురాలు వచ్చింది. అప్పటికి రాజేశ్వరి భర్తతో మాట్లాడింది. ‘మన ఇంట్లో చోటు చాలదు. మన టీ గార్డెన్లో పెడదాం’ అంది. నీలగిరి జిల్లా టీ తోటలకు ప్రసిద్ధి. రాజేశ్వరికి కూడా చిన్న టీ తోట ఉంది. అందులోనే ఒక గదిలో ఆ ముగ్గురు స్త్రీలను ఉంచారు. చిన్న ఊరు తెనాలి. ఈ విషయం ఆ నోట ఈ నోట చుట్టుపక్కల ప్రాంతాలకంతా పాకిపోయింది. రామమూర్తికి ఎవరో ఒకరు ఫోన్ చేసేవారు. రాజేశ్వరి వారిని అక్కున చేర్చుకునేది. ఇవాళ్టికి దాదాపు ఇరవై ఏళ్లు గడిచిపోయాయి. రామమూర్తి రిటైర్ అయ్యాడు. వాళ్ల పెద్దమ్మాయి మెడిసిన్ చేసి డాక్టర్‌గా ఉద్యోగం చేస్తోంది. చిన్నమ్మాయి ఇంకా చదువుకుంటూ ఉంది. అయినప్పటికీ రాజేశ్వరి తన సొంత పిల్లలకు కాకుండా ఇంకో అరవై మందికి తన హోమ్‌లో తల్లిగా ఉంటూ సేవ చేస్తోంది. నగలు కుదువ పెట్టి హోమ్‌కు ఉన్న డిమాండ్ దృష్ట్యా రిజిస్టర్ చేసి నడపడం తప్పని సరి అని శ్రేయోభిలాషులు చెప్తే ‘ఎంఎన్ ట్రస్ట్’ పేరుతో రిజిస్టర్ చేసి అర ఎకరాలో రెండు షెడ్స్ వేసి అన్ని విధాలా అనుకూలమైన షెల్టర్ హోమ్‌ను నిర్మించారు రామమూర్తి, రాజేశ్వరి. ‘ఇది అనాథ గృహం కాదు. పిల్లల చేత గెంటివేయబడగ దిక్కులేనివారైన తల్లిదండ్రులకు ఆత్మీయ గృహం’ అంటుంది రాజేశ్వరి. ఇది నడపడం ఎలాగా? ‘మన టీ తోట మీద వచ్చే ఆదాయం దీనికే పెడదాం’ అంది రాజేశ్వరి. ఉద్యోగంలో ఉండగా, ఇప్పుడు పెన్షన్ నుంచి రామమూర్తి సగం ఆదాయం ఈ హోమ్‌కే. డాక్టర్‌గా ఉద్యోగం చేస్తున్న కూతురు ఒక ముప్పై వేల వరకూ పంపుతుంది. మొత్తం మీద నెలకు 70 లేదా ఎనభై వేలు సొంత ఖర్చుల మీదే ఈ భార్యాభర్తలు హోమ్‌ను నడుపుతున్నారు. ‘తమిళనాడు ప్రభుత్వం మా హోమ్‌ను గుర్తించింది కాని వాళ్ల నుంచి ఏమీ ఫండ్స్ రావు. ఈ హోమ్స్ కూడా లోన్ తీసుకుని, నా నగలు కుదువ పెట్టి కట్టాం’ అంటుంది రాజేశ్వరి. ఇప్పుడు హోమ్‌లో 60 మంది ఉన్నారు. అతి తక్కువ వయసు అంటే 47. ఎక్కువ వయసు అంటే 90. ‘ఒక్కొక్కరిది ఒక్కో ధోరణి. కొందరు చెప్పిన వెంటనే మాట వింటారు. మరికొందరు మొండిగా ఉంటారు. ఆత్మీయులకు దూరంగా ఉండటం వల్ల వారికి స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది. అన్నింటినీ ఓపిగ్గా భరిస్తూ వస్తాను’ అంటుంది రాజేశ్వరి. సొంత తల్లిలా హోమ్‌లో ఉన్న సభ్యులకు మూడు పూట్లా టీ ఉంటుంది. సాయంత్రం పలహారం ఉంటుంది. ఉదయం టిఫిన్, మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనం సరేసరి. నీలగిరి చల్లటి ప్రాంతం కాబట్టి ఎప్పుడూ వేణ్ణీళ్ల ఏర్పాటు ఉంటుంది. వెచ్చటి దుస్తులను ఇస్తుంది రాజేశ్వరి. రెండు పూటలా యోగా చేయిస్తారు. ఉల్లాసం కోసం పాటలు వినిపిస్తూనే ఉంటాయి. ‘వంట పని దాదాపుగా నేనే చూస్తాను’ అంటుంది రాజేశ్వరి. హోమ్ కోసం ఒక వ్యాన్, ఐదుగురు సిబ్బంది పని చేస్తారు. ‘రెగ్యులర్‌గా హాస్పిటల్‌కు తీసుకెళతాం. అందరికీ ఆధార్ కార్డ్‌లు ఇప్పించాం. ఎవరైనా పోతే అంత్యక్రియలు కూడా నిర్వహిస్తాం’ అంటుందామె. ఇంత పని ఎందుకోసం చేస్తున్నారు ఈ భార్యాభర్తలు. బహుశా ఇది చూపదగ్గ మానవత్వం అనుకోవడం వల్ల కావచ్చు. భావితరాలకు పాఠం వీరి హోమ్‌కు రెగ్యులర్‌గా కొంతమంది వచ్చి విరాళాలు ఇస్తారు. కొందరు స్కూల్ పిల్లలు పుట్టినరోజులు జరుపుకోవడానికి వస్తారు. ‘మీ తల్లిదండ్రులను ఇలా విడిచిపెట్టొద్దు’ అని చెబుతుంది రాజేశ్వరి వారికి. పిల్లల్ని పెద్ద చేయడం కోసం తల్లిదండ్రులు ఎన్నో కష్టాలు పడతారు. వారిని నిరాకరించి పిల్లలు మరిన్ని కష్టాల్లో నెడతారు. నీలగిరిలో రాజేశ్వరి ఉంది. మీ ఊళ్లో ఎవరున్నారు? -
అప్పట్లో ఒకరుండేవారు..
వీరఘట్టం: గుండె మీద ఒకటిన్నర టన్ను బరువును మోపితే చిరునవ్వుతో మోసేవారు. ఉక్కు సంకెళ్లతో ఒంటిని బంధిస్తే ఊపిరితిత్తుల నిండా గాలి బిగించి రెండు క్షణాల్లో తెంపేసేవారు. ఏనుగు ఛాతీ మీదకు ఎక్కితే ఐదు నిమిషాల పాటు ఆ బరువును మోయగలిగేవారు. ఆయన పేరు కోడి రామ్మూర్తి నాయుడు. సిక్కోలు తొలితరం నిజమైన కథానాయకుడు. వెండితెరపై వెలిగిపోయిన బాహుబలికి బాబు లాంటి వారు. వందేళ్ల కిందట ఆయన చేసిన విన్యాసాలను ఈ తరం దాదాపు మర్చి పోయింది. సిక్కోలు కీర్తి బావుటాను దేశవిదేశాల్లో సగర్వంగా ఆయన ఎగరేసిన గాథలను పిల్లలకు చెప్పే కథల్లో కలపడం మర్చిపోయింది. విజయనగరాధీశులు గర్వంగా చెప్పుకునే పంచరత్నాల్లో ఒకరైన సిక్కోలు ముద్దుబిడ్డ కోడి రామ్మూర్తి 138వ జయంతి రేపు. ఈ సందర్భంగా ఆ మహానుభావుడి స్మరణలో.. బహుముఖ ప్రజ్ఞాశాలి రామ్మూర్తి నాయుడు వ్యాయామ విద్యను బోధిస్తూనే వాయు స్తంభన, జల స్తంభన విద్యను ప్రదర్శించేవారు. ఇలా వ్యాయామ, దేహ దారుఢ్యం, యోగ విద్యలను అలవోకగా చేసేవారు. ఇన్ని విద్యలు తెలిసిన రామ్మూర్తి అలానే ఉంటే ఆయన చరిత్ర ఇన్ని మలుపులు తిరిగి ఉండేది కాదు. ఆయన తర్వాత కాలంలో విజయనగరంంలో ఒక సర్కస్ కంపెనీ స్థాపించారు. ఇది ఆయన పేరును అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లింది. (చదవండి: విధ్వంసం: నత్తలొస్తున్నాయ్ జాగ్రత్త!) 20 ఏళ్ల వయస్సులోనే.. రామ్మూర్తి తన 20 ఏళ్ల వయసులోనే గుండెల మీద ఒకటిన్నర టన్ను బరువును మోసి చూపించేవారు. సర్కస్‌లో విన్యాసాలు మరింత కఠినమైనవి. ఆయనను ఉక్కు గొలు సులతో బంధించేవారు. ఊపిరితిత్తుల నిండా గాలి పూరించి, ఆ గొలుసులను తెంచేవారు. రెండు కార్లకు గొలుసులు కట్టి, వాటిని తన భుజాలకు తగిలించుకునేవారు. కార్లను వేగంగా నడిపించేవారు. అయినప్పటికీ అవి కదిలేవి కావు. ఏనుగును ఛాతీ మీద ఎక్కించి దాదాపు ఐదు నిమిషాలు నిలిపేవారు. అందుకే ఆయన సర్కస్‌కు విశేషమైన ఆదరణ ఉండేది. ఆసియాలోని జపాన్, చైనా, బర్మా దేశాల్లో కూడా రామ్మూర్తి నాయుడు ప్రదర్శనలు ఇచ్చి భారతదేశ కీర్తిని చాటిచెప్పారు. బర్మాలో ఆయనపై హత్యాయత్నం జరగడంతో విదేశీ ప్రదర్శనలను నిలిపివేసి స్వదేశంలోనే స్థిరపడ్డారు. (చదవండి: మార్టూరులో కలకలం..) బ్రహ్మచారి.. కండల వీరుడు కోడి రామ్మూర్తినాయుడు నిత్య బ్రహ్మచారి. స్వచ్ఛమైన శాకాహారి అయిన ఈయన ఆంజనేయస్వామి భక్తుడు. చిన్నతనంలో వీరఘట్టం సమీపంలోని రాజచెరువు వద్ద వ్యాయామం చేస్తున్న సమయంలో ఓ సాధువు ఆయనను చూసి, రామ్మూర్తిని పిలిచి మంత్రోపదేశం చేశాడట. అప్పటి నుంచి రామ్మూర్తికి దైవచింతన కలిగిందట. కోడి రామ్మూర్తినాయుడు బల ప్రదర్శన ఊహాచిత్రం అనేక అవార్డులు.. ►అప్పట పూనాలో లోకమాన్య తిలక్ కోరిక మేరకు ప్రదర్శనలిచ్చారు. దీంతో తిలక్ రామ్మూర్తికి మల్లమార్తాండ, మల్లరాజ తిలక్ బిరుదులిచ్చారు. విదేశాల్లోనూ ప్రదర్శనలు ఇవ్వాలని ప్రోత్సహించారు. ►హైదరాబాద్‌లో ఆంధ్రభాషా నిలయం పెద్దలు ఘనసత్కారం చేసి జగదేకవీర బిరుదునిచ్చారు. ►అప్పటి వైస్రాయి లార్డ్ మింటో రామ్మూర్తి ప్రదర్శనలు చూ డాలని వచ్చి తనే కారును నడుపుతూ ఆ కారును రామ్మూర్తి ఆపేయడం చూసి ముగ్ధుడైపోయాడు. ►అలహాబాదులో అఖిల భారత కాంగ్రెస్ సభ జరిగింది. రామ్మూర్తి సర్కస్ అక్కడ ప్రదర్శనలిచ్చింది. జాతీయ నాయకులెందరో చూసి అభినందించారు. పండిత మదనమోహన మాలవ్యా ఎంతగానో మెచ్చుకున్నారు. ►లండన్‌లో రాజదంపతులు జార్జిరాజు, రాణి మేరి రామ్మూర్తి ప్రదర్శనలకు అభిమానులైపోయారు. వారే తమ రాజభవనానికి ఆహ్వానించి ‘ఇండియన్ హెర్క్యులస్’ బిరుదునిచ్చారు. ► స్పెయిన్‌లోని బుల్ ఫైట్‌లో రామ్మూర్తి పంతులు పాల్గొన్న తీరును వేలాది మంది ప్రేక్షకులు మెచ్చుకున్నారు. ►జపాన్, చైనా, బర్మాలలో రామ్మూర్తి ప్రదర్శనలు ఎంతో వైభవంగా సాగాయి. ఇలా బయటపడింది.. ఓ పుస్తక కథనం ప్రకారం కోడి రామ్మూర్తిలో ప్రతి భాపాటవాలు బయటపడడానికి ఓ సంఘటన దోహదపడింది. అప్పట్లో ఆయన విజయనగరంలో ఉండేటప్పుడు.. అదే నగరానికి చెందిన పేర్ల రామ్మూర్తి శెట్టి ఇంటి ముందట కాలువలో ఓ ఎద్దు పడిపోయింది. ఆ జమిందారు 20 మంది బలవంతులను రప్పించి ఎద్దును బయటకు లాగడానికి ప్రయత్నించినా సాధ్యం కాలేదు. సరిగ్గా అదే సమయానికి అటుగా వస్తున్న రామ్మూర్తిని చూసి జమిందారు హాస్యంగా ‘అదిగో మన శాండోగారు వస్తున్నారు. మీరంతా తప్పుకోండి. తను ఒక్కరే ఆ ఎద్దును బయటపడేయగలడు’ అని అన్నారు. దీంతో రామ్మూర్తి ఆ ఎద్దు పరిస్థితిని గమనించి దాని వద్దకు వెళ్లి మెడను, వెనుక కాళ్లను, తోకను గట్టిగా పట్టుకుని ఒకే ఉదుటన బయ ట పడేశారు. దీంతో రామ్మూర్తిలోని అసలు బలం అందరికీ ఆ ఘటనతోనే తెలియవచ్చింది. అల్లరి పిల్లాడి నుంచి చిచ్చర పిడుగులా.. ఇండియన్ హెర్క్యులస్. కళియుగ భీముడు. మ ల్ల మార్తాండ.. ఒకటి కాదు రెండు కాదు పదుల సంఖ్యలో బిరుదులు గడించి ప్రపంచ దేశాల్లో భారతదేశ కీర్తి ప్రతిష్టలను చాటిచెప్పిన బా హుబలి కోడి రామ్మూర్తి నాయుడు. వీరఘట్టం ఈయన స్వస్థలం అని చెప్పుకోవడం జిల్లా వా సులకు ఎప్పటికీ గర్వకారణం. వీరఘట్టంలోని తెలగవీధికి చెందిన కోడి వెంకన్ననాయుడు, అప్పలకొండ దంపతులకు 1883 నవంబర్ 3న రామ్మూర్తి నాయుడు జని్మంచారు. చిన్నతనంలోనే తల్లిని కోల్పోయిన రామ్మూర్తి నాయుడు తండ్రి సంరక్షణలో గారాబంగా పెరిగారు. బా ల్యంలో బడికి వెళ్లకుండా వీరఘట్టానికి సమీపంలో ఉన్న రాజ చెరువు వద్దకు రోజూ వెళ్లి వ్యాయామం చేస్తుండేవారు. దీంతో తండ్రి వెంకన్న బాల్యంలోనే కొడుకుని చదువు కోసం వీరఘట్టం నుంచి విజయనగరంలో ఉన్న అతని త మ్ముడు నారాయణస్వామి(రామ్మూర్తి పిన తండ్రి) ఇంటికి పంపించారు. అక్కడ కూడా రామ్మూర్తికి చదువు అబ్బలేదు. విద్య కంటే వ్యాయామంపైనే ఎక్కు వ ఆసక్తి చూపుతూ పలు మల్లయుద్ధం పోటీల్లో పాల్గొని విజేతగా నిలిచాడు. ఇక రామ్మూర్తికి చదువు వంటపట్టదని గ్రహించిన పిన తండ్రి అతడిని మద్రాసు పంపించి వ్యా యామ కళాశాలలో చేరి్పంచారు. తర్వాత అక్కడే పీడీగా పనిచేశారు. ఆఖరులో.. ఒకసారి బర్మాలో హత్యాయత్నం జరిగాక ఆయన ప్రదర్శనలకు అడ్డు పడింది. ఎంత డబ్బు గడించారో అంత కంటే గొప్పగా దా నాలు కూడా చేశారాయన. ఆఖరి రోజుల్లో ఆయన కాలిపై రాచపుండు వచ్చి కాలే తీసేయాల్సి వచ్చింది. శస్త్ర చికిత్స జరిగినప్పుడు ఎలాటి మత్తుమందును (క్లోరోఫామ్) తీసుకోలేదని ఓ పుస్తకంలో పేర్కొని ఉంది. ప్రాణాయామం చేసి నిబ్బరంగా ఉండిపోయారట. చివరిరోజులు బలంఘర్, పాటా్నలో కలహండి (ఒడిశా) పరగణా ప్రభువు పోషణలో ఉంటూ 1942 జనవరి 16న కన్ను మూశారు. వెండితెరపై.. కోడి రామ్మూర్తినాయుడి జీవిత చరిత్ర ఆధారంగా బయోపిక్ తీసేందుకు గత ఏడాది కొంత మంది సినిమావాళ్లు వీరఘట్టం గ్రామానికి వచ్చి ఇక్కడ పరి స్థితులపై ఆరా తీశారు. వారం రోజులు వీరఘట్టంలో ఉండి వారి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. సినీ హీరో దగ్గుబాటి రాణా కోడి రామ్మూర్తిగా నటించనున్నారని అప్పట్లో వార్తలు కూడా వచ్చాయి. తర్వాత ఈ విషయంపై సినిమా ప్రస్తావన రాలేదు. ఆయన మా చిన్న తాతయ్య.. రామ్మూర్తినాయుడు మా చిన్న తాతయ్య. నా చిన్నతనంలో ఆయన విన్యాసాలు, సాహసాల గురించి విన్నా ను. నేను ఆయన్ని ఏనాడూ చూడలేదు. మానాన్న గారు చెప్పేవారు. మీ చిన్న తాత దేశవిదేశాల్లో ప్రదర్శనలిస్తూ ఎంతో కీర్తి సంపాదిస్తున్నాడని. అలాంటి వ్యక్తిని మనవడిని అయినందుకు గర్వంగా ఉంది. – కోడి వెంకటరావునాయుడు, రామ్మూర్తి నాయుడి మనవడు, వీరఘట్టం పాఠ్యాంశాల్లో చేర్చాలి ఒకప్పుడు 1985–1995 మధ్య కాలంలో కోడి రామ్మూర్తినాయుడు జీవిత చరిత్రపై తెలుగులో ఒక పా ఠ్యాంశం ఉండేది. కాలక్రమేణా సిలబస్ మారడంతో ఆ పాఠ్యాంశాన్ని తొలగించారు. ఇలాంటి మహానుభావుల జీవిత చరిత్రలు విద్యార్థులకు ఆదర్శంగా నిలుస్తాయి. ప్రభుత్వం ఆయన ఘనతను గుర్తించి సముచిత స్థానం కలి్పంచాలి. – ఎస్.వి.ఎల్.ఎన్ శర్మయాజీ, యజ్ఞకర్త, వీరఘట్టం ఆయన ఖ్యాతిని ప్రభుత్వం గుర్తించాలి అంతర్జాతీయ స్థాయిలో భారతదేశ కీర్తి ప్రతిష్టలను చాటి చెప్పిన మహానుభా వుని చరిత్రను భారత ప్ర భుత్వం గుర్తించాలి. వీరఘట్టంకు చెందిన ప్రసిద్ధ మల్లయోదుడు రామ్మూర్తి నాయుడు జీవిత చరిత్ర నేడు ఎందరికో ఆదర్శం. – డాక్టర్ బి.కూర్మనాథ్, రిటైర్డ్ మెడికల్ ఆఫీసర్, వీరఘట్టం -
కలియుగ భీముడు
‘సాధు పథవర్తి సన్మిత్ర చక్రవర్తి రమ్యతర కీర్తి శ్రీ కోడి రామమూర్తి’ చింతామణి, వరవిక్రయం, మధుసేవ వంటి ప్రఖ్యాత నాటకాలు రాసిన కాళ్లకూరి నారాయణరావు అన్న మాటలివి. రామమూర్తిగారికి కాళ్లకూరి ఆప్తమిత్రులు. నిజమే, రామమూర్తి గారి కీర్తి రమ్యతరమే కాదు, విశ్వ విఖ్యాతం కూడా. కొకు గారి నవలల్లో ఒక చోట సుందరం అనే పాత్ర కోడి రామమూర్తిగారి సర్కస్ ప్రదర్శన గురించీ అందులో ఒళ్లు గగుర్పొడిచేటట్టు ఉండే ఆయన ప్రదర్శనల గురించీ తన్మయంగా వర్ణించి చెబుతుంది. ‘కండగలవాడే మనిషోయ్’ అన్న గురజాడవారి భావనకి నిలువెత్తు రూపం కోడి రామమూర్తి నాయుడు. పరతంత్ర భారతంలో బాగా వెనుకబడిన ప్రాంతంలో ఒక చిన్న గ్రామంలో పుట్టిన వ్యక్తి జాతీయ, అంతర్జాతీయ స్థాయి కీర్తి శిఖరాలకు చేరడం గమనించదగిన ప్రయాణం. కండగలిగిన మనిషి అన్న మాటకు, బలం అనే విశేషణానికి పర్యాయపదాలుగా మారిపోయారాయన. ఈ బలాఢ్యుడిని చూసి బకింగ్‌హ్యామ్ ప్యాలెస్ కూడా సంబరపడింది.గురజాడ వారు తిరగాడిన ఉత్తరాంధ్రలోనే కోడి రామమూర్తి (ఏప్రిల్ 1882–ఫిబ్రవరి 2,1942) పుట్టారు. శ్రీకాకుళం జిల్లా వీరఘట్టం ఆయన స్వస్థలం. ఊరి పేరే కాదు, ఆయన ఇంటి పేరుకు కూడా ఒక ఘనత ఉంది. కోడి వంశం మల్లయోధులకు ప్రసిద్ధి. తండ్రి వెంకన్ననాయుడు. చిన్నతనంలోనే తల్లిని కోల్పోయారు రామమూర్తి. బాల్యంలోనే కొడుకుని వెంకన్న వీరఘట్టం నుంచి విజయనగరం పంపించేశారు. కారణం చదువు. రామమూర్తికి చదువు అబ్బలేదు. పైగా తోటి పిల్లలతో తగాదాలు ఎక్కువ. తండ్రికి చదివించాలని ఉండేది. చదువు బాధ పడలేకో, లేకపోతే తండ్రి కోప్పడడం వల్లనో మరి, ఒకసారి ఆయన వీరఘట్టం నుంచి సమీపంలోని అడవులలోకి పారిపోయారు. మళ్లీ వారానికి తిరిగి వచ్చారు. చంకలో ఓ పులిపిల్ల. పైగా ఆ పిల్లని పట్టుకుని వెళ్లి ఊరందరికీ చూపించాడు. వీధులన్నీ తిప్పాడు. ఇవన్నీ చూసే వెంకన్న విజయనగరంలో ఉన్న తన తమ్ముడు నారాయణస్వామి నాయుడు దగ్గరకి చదువు నిమిత్తం కొడుకును పంపించేశారు. నారాయణస్వామి పోలీసు శాఖలో పనిచేసేవారు. విజయనగరంలో ఉండగానే రామమూర్తికి వ్యాయామం మీద ఆసక్తి ఏర్పడింది. మల్లవిద్యలో తొలి పాఠాలు అక్కడే నేర్చుకున్నారు. అప్పుడే భారత స్వాతంత్య్ర సమర వీచికలు విజయనగరం చేరుతున్నాయి. బి. చంద్రయ్యనాయుడు అనే ఒక స్వాతంత్య్ర సమరయోధుడు గిరిజనులను సమీకరించి పోరాటానికి సిద్ధం చేస్తున్న సమయం. రామమూర్తి కూడా ఆ దశలో స్వాతంత్య్ర పోరాటం వైపు మొగ్గు చూపారు. కానీ ఆయన దృష్టి దేహ దార్ఢ్యం వైపే ఉండిపోయింది. పోలీసు శాఖలో ఉండడం, ఆ బాలుడి అభిరుచిని గమనించగలగడం నారాయణస్వామి చేసిన మేలు. స్థానికంగా పహిల్వాన్ అన్న బిరుదును సాధించిన తరువాత రామమూర్తిని పినతండ్రి మద్రాసు పంపించారు. అక్కడ సైదాపేటలోని ఒక వ్యాయామ కళాశాలలో సంవత్సరం పాటు ఆయన తర్ఫీదు పొందారు. వ్యాయామోపాధ్యాయుని సర్టిఫికెట్తో విజయనగరం చేరుకున్నారు. తరువాత విజయనగరం కళాశాలలో వ్యాయామోపాధ్యానిగా చేరారు. అక్కడే ఆయన ‘ప్రొఫెసర్ రామమూర్తినాయుడు’ అయ్యారు. పైగా అది ఆయన చదవిన విద్యా సంస్థే. ఎంతో చరిత్ర కలిగినది. రామమూర్తిగారు వ్యాయామ విద్య బోధిస్తూనే వాయు స్తంభన, జల స్తంభన విద్యను ప్రదర్శించేవారు. ఇలా వ్యాయామం, దేహ దార్ఢ్యం, యోగ విద్యలకు రామమూర్తి పరిమితమై ఉంటే ఆయన చరిత్ర ఇన్ని మలుపులు తీసుకుని ఉండేది కాదు. ఆయన తరువాతి కాలాలలో విజయనగరంలో ఒక సర్కస్ కంపెనీ స్థాపించారు. ఇదే ఆయన పేరును అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లింది. విజయనగరంలోనే పొట్టిపంతులు అనే మిత్రుని సహకారంతో సర్కస్ కంపెనీకి రామమూర్తి రూపకల్పన చేశారు. దీనికి తుని సంస్థానాధీశుని సహకారం పూర్తిగా ఉంది. 1911లో మొదటిసారి ఈ సర్కస్ కంపెనీ తన ప్రదర్శనలను ప్రారంభించింది. తెలుగు ప్రాంతాలలో, నిజాం రాష్ట్రంలో కొన్ని ప్రదర్శనలు ఇచ్చిన తరువాత రామమూర్తి 1912లో మద్రాసులో సర్కస్‌ను ప్రదర్శించారు. చైనా, జపాన్ సర్కస్ కళాకారులు, జంతువులతో పూర్తిస్థాయి సర్కస్ నడిచేది. కానీ రామమూర్తి పాత్ర దేహ దార్ఢ్యం ప్రాతిపదికగా ఉండేది. ఆయన విన్యాసాలు ప్రధానంగా బలప్రదర్శనకు సంబంధించినవే. ఊపిరి బిగపట్టి వీక్షకులు చూసేటట్టు ఉండేవి. రామమూర్తి తన 20 ఏళ్ల వయసులోనే గుండెల మీద ఒకటిన్నర టన్ను బరువును మోసి చూపించేవారు. సర్కస్‌లో విన్యాసాలు మరింత కఠినమైనవి. ఆయనను ఉక్కు గొలుసులతో బంధించేవారు. ఊపిరితిత్తుల నిండా గాలి పూరించి, ఆ గొలుసులను తెంచేవారు. రెండు కార్లకు గొలుసులు కట్టి, వాటిని తన భుజాలకు తగిలించుకునేవారు. కార్లను వేగంగా నడిపించేవారు. అయినప్పటికీ అవి కదిలేవి కావు. ఏనుగును ఛాతి మీద ఎక్కించి దాదాపు ఐదు నిమిషాలు నిలిపేవారు. అందుకే ఆయన సర్కస్‌కు విశేషమైన ఆదరణ ఉండేది. నాటి కాలంలో పూనా నగరం విద్యకీ, కళలకీ కేంద్రంగా ఉండేది. లోకమాన్య బాలగంగాధర తిలక్ ఆహ్వానం మేరకు రామమూర్తి అక్కడకు వెళ్లి సర్కస్ ప్రదర్శన నిర్వహించారు. రామమూర్తి ప్రతిభను చూసి విస్తుపోయిన తిలక్ ఆయనకు ‘మల్ల మార్తాండ’ అనే బిరుదును ఇచ్చి సత్కరించారు. ‘మల్ల రాజతిలక’ అన్న బిరుదు కూడా బాలగంగాధర తిలక్ ఇచ్చినదే. విదేశాలలో ప్రదర్శనలు ఏర్పాటు చేయవలసిందని రామమూర్తిగారికి సలహా ఇచ్చినది కూడా తిలక్ మహరాజే. నిజాం రాజ్య రాజధాని హైదరాబాద్‌లో ఉన్న ఆంధ్ర భాషా నిలయం నిర్వాహకులు కూడా ఆయన ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఘనంగా సత్కరించి ‘జగదేకవీర’ బిరుదుతో సత్కరించారు. వైస్రాయ్ లార్డ్ మింటో కారణంగానే రామమూర్తి ఖ్యాతి దేశవ్యాప్తమైందని చెబుతారు. అంటే 1919–1920 ప్రాంతమన్నమాట. కారును ముందుకు వెళ్లకుండా గొలుసులతో పట్టి ఆపుతూ రామమూర్తినాయుడు చేసే ప్రదర్శనను మింటో చూశాడు. వైస్రాయ్ స్వయంగా కితాబిస్తే ఇంకేముంది? తరువాత అలహాబాద్‌లో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశాలలో కూడా రామమూర్తి ప్రదర్శన ఇచ్చారు. అక్కడ పండిట్ మదన్మోహన మాలవ్యా ప్రశంసలు అందుకున్నారు. తిలక్ వలెనే మాలవ్యా కూడా విదేశాలకు వెళ్లమని సలహా ఇచ్చారు. మాలవ్యాకీ, రామమూర్తి నాయుడుగారికీ ఎందుకో గొప్ప సాన్నిహిత్యం ఏర్పడింది. తరువాతి కాలాలలో కాశీలో మాలవ్యా దగ్గర రామమూర్తిగారు సంవత్సరం పాటు అతిథిగా ఉన్నారు. కొన్ని వందల మంది సభ్యులు ఉన్న తన సర్కస్ బృందంతో రామమూర్తి యూరప్ ఖండానికి వెళ్లారు. ఇంగ్లండ్ రాణి, అప్పటి రాజు ఐదో జార్జ్ చక్రవర్తి బకింగ్‌హ్యామ్ ప్యాలెస్ ప్రాంగణంలోనే ఈ భారతీయుడి చేత ప్రదర్శన ఏర్పాటు చేయించారు. ప్యాలెస్‌లో విందు చేసి, సత్కరించి ‘ఇండియన్ హెర్క్యులిస్’ అన్న బిరుదు ఇచ్చారు. అప్పటికే ఆయనకు కలియుగ భీమ అన్న బిరుదు ఉంది. గ్రీకు వీరుడు హెర్క్యులిస్ను, ప్రష్యన్ వీరుడు శాండోను కూడా ఆంగ్లేయులు ఆయనలో చూసుకున్నారు. ఆ బిరుదులు కూడా ఇచ్చారు. ఫ్రాన్స్, స్పెయిన్, జర్మనీలలో కూడా ఆయన సర్కస్ ప్రదర్శనలు ఇచ్చారు. స్పెయిన్‌లో జరిగే బుల్‌ఫైట్‌లో కూడా రామమూర్తి గారికి చిన్న అనుభవం మిగిలింది. ఎద్దుతో పోరాడాలని ఆయనను కోరారు. అందులో ఆయనకు అనుభవం లేకున్నా, ఒప్పుకున్నారు. కొమ్ములు పట్టుకుని ఎద్దును నేలకు ఒంచారు. తరువాత ఆసియాలో జపాన్, చైనా, బర్మా దేశాలలో కూడా ఆయన సర్కస్ ప్రదర్శించారు. బర్మాలో ఆయన మీద హత్యాయత్నం జరగడంతో వెంటనే భారతదేశానికి వచ్చేశారు. బహుశా ఈర్ష్య వల్ల ఆయనను చంపాలని అక్కడి వాళ్లు అనుకుని ఉండవచ్చు. సర్కస్ ద్వారా ఆ రోజుల్లోనే లక్షల రూపాయలు గడించారాయన. అందులో చాలా వరకు విరాళాలు ఇచ్చారు. ముఖ్యంగా భారత స్వాతంత్య్రోద్యమానికి తన వంతు ఆర్థిక సాయం చేశారు. ఒంటి నిండా శక్తి. దేశ విదేశాలలో కీర్తి. అయినా రామమూర్తినాయుడు అనే ఆ మల్లయోధుడు జీవిత చరమాంకంలో అనారోగ్యమనే సమస్యతో పోరాడాడు. బహుశా అందులో మాత్రం ఆయన అపజయం పాలయ్యారేమో! ఎందుకంటే ఆయన తుది ఘడియల గురించి పెద్దగా బయట ప్రపంచానికి తెలియలేదు. ఒరిస్సాలోని కొందరు సంస్థానాధీశుల దగ్గర ఆయన అంతిమ జీవితం గడిచింది. ఇంకా విషాదం– ఒక కాలి మీద పుండు లేచింది. అందుకు శస్త్ర చికిత్స అవసరమైంది. అప్పుడు కూడా ఆయన యోగాభ్యాసాన్ని నమ్ముకున్నారు. మత్తు మందు తీసుకోవడానికి ఒప్పుకోలేదు. అందులో ఆయన విజయం సాధించారనే చెబుతారు. కొందరు రాసినదానిని బట్టి ఆయన కాలు తొలగించవలసి వచ్చింది. జనవరి 16, 1942లో ఆయన ఒరిస్సాలోని కలహండి సంస్థానాధీశుని పోషణలో ఉన్నప్పుడు దాదాపు అనామకంగా కన్నుమూశారు. ఆ కండల వీరుడి మిగిలిన కలల మాటేమో గానీ, భారతదేశంలోనే విశిష్టమైన వ్యాయామ విద్యాసంస్థను స్థాపించాలని కోరుకున్నారు. ఆ స్వప్నం సఫలం కాకుండానే తుది శ్వాస విడిచారు. ఆ కల నెరవేరి ఉంటే, రామమూర్తిగారి పేరు నిలిచి ఉండేది. దేశానికి క్రీడా నైపుణ్యం కలిగేది. గురజాడ అప్పారావు, ద్వారం వేంకటస్వామినాయుడు, శ్రీమజ్జాడ ఆదిభట్ల నారాయణదాసు, సర్ విజ్జీ, గిడుగు రామమూర్తి పంతులు వంటివారు ఉత్తరాంధ్రకు వన్నె తెచ్చారు. ఎన్నో విశిష్టతలతో చరిత్రకెక్కిన రామమూర్తినాయుడు గారు ఉత్తరాంధ్రతో పాటు భారతదేశానికే గర్వకారణం. కలియుగ భీమ, ఇండియన్ హెర్క్యులిస్, శాండో, మల్ల మార్తాండ, జయవీర హనుమాన్, వీరకంఠీరవ వంటి బిరుదులు సాధించుకున్న రామమూర్తిగారు పూర్తి శాకాహారి. ∙డా. గోపరాజు నారాయణరావు -
ఊరెళితే.. ఉన్నదంతా ఊడ్చేశారు!
కదిరి : కదిరి పట్టణంలో పట్టపగలే ఓ ఇంట్లో దొంగలుపడ్డారు. పది తులాలు బంగారు, మరో పది తులాలు వెండి ఆభరణాలతోపాటు రూ.25వేల నగదు ఎత్తుకెళ్లారు. కుటుంబ సభ్యులంతా ఊరెళ్లిన సమయంలో ఈ ఘటన జరిగింది. వివరాలిలా ఉన్నాయి. మౌనిక థియేటర్ నిర్వాహకుడు రామమూర్తి నారాయణరావు వీధిలో నివాసముంటున్నారు. ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడి హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కుమార్తెకు సపర్యలు చేయడానికి రామమూర్తి భార్య వెళ్లింది. మూడు రోజుల క్రితం ఆయన కూడా హైదరాబాద్ వెళ్లాడు. ఇంటికి తాళం వేసి ఉండటం గమనించిన దొంగలు మంగళవారం పట్టపగలే వెనుక తలుపుగుండా గుండా లోనికి ప్రవేశించారు. మూడు బీరువాలు తెరిచి ఒక బంగారు నెక్లెస్, 5 డాలర్ చైన్లు, 5 ఉంగరాలు, 8 జతల కమ్మలు, 10 తులాల వెండి ప్రమిదలు, చెంబు, తట్టతో పాటు రూ.25 వేల నగదు అపహరించుకుపోయారు. పట్టణ ఎస్ఐ గోపాలుడు కేసు నమోదు చేసుకుని, క్లూస్ టీంను పిలిపించి వేలిముద్రలను పరిశీలించారు. ఎవరైనా ఇంటికి తాళం వేసి ఇతర ప్రాంతానికి వెళ్లేటప్పుడు పోలీసులకు సమాచారం ఇస్తే ఆ ఇళ్లపై ప్రత్యేక నిఘా ఉంచుతామని డీఎస్పీ ఎన్.వి.రామాంజనేయులు తెలిపారు. -
ఎంపీని కలిసిన రామ్మూర్తి కుటుంబ సభ్యులు