Rambir Shokeen
-
క్రైం సిండికేట్‌లో మాజీ ఎమ్మెల్యే.. అరెస్టు
తన మేనల్లుడి నాయకత్వంలో ఉన్న క్రైం సిండికేట్‌లో సభ్యుడిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నాయకుడు రాంబీర్ షోకీన్‌ను ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు మోకా చట్టం కింద అరెస్టు చేశారు. ముండ్కా నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే అయిన షోకీన్‌ను పట్టుకుంటే లక్ష రూపాయలు ఇస్తామని పోలీసులు ఇంతకుముందు ప్రకటించారు. మరో నిందితుడితో గొడవ పడబోతుండగా అతడు తమకు చిక్కినట్లు పోలీసులు తెలిపారు. ఇంతకుముందు తన మేనల్లుడు నీరజ్ బవానా నాయకత్వంలో నడుస్తున్న క్రైం సిండికేట్‌లో కూడా భాగస్వామ్యం ఉందని షోకీన్‌పై చార్జిషీటు దాఖలైంది. తరచు నేరాలకు పాల్పడతాడని ప్రకటించిన షోకీన్‌ను ఢిల్లీ శివార్లలోని కరాలా ప్రాంతంలో గల రామా విహార్ ఏరియాలో అరెస్టుచేసినట్లు స్పెషల్ సెల్ డీసీపీ ప్రమోద్ కుమార్ కుష్వాహ చెప్పారు. నీరజ్, షోకీన్లతో పాటు నీరజ్ అన్న పంకజ్ సెహ్రావత్‌పై కూడా చార్జిషీటు దాఖలైంది. వీళ్లే కాక.. సిండికేట్‌లోని ఇతర సభ్యులు సునీల్ రాఠీ, అమిత్ మాలిక్, నవీన్ దబాస్, రాహుల్ దబాస్, నవీన్ హూడా, దీపక్ దబాస్, గుర్ప్రీత్సింగ్లను ఇప్పటివరకు అరెస్టు చేశారు. 2013లో స్వతంత్రంగా పోటీ చేసిన షోకీన్.. ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికై ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరాడు. గత సంవత్సరం ఆగస్టు 26న పోలీసులు ఇతడిని తరచు నేరాలు చేస్తాడని ప్రకటించారు. -
ఆప్ సర్కారుకు గండం!
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) నేత అరవింద్ కేజ్రీవాల్ సారథ్యంలోని ఢిల్లీ ప్రభుత్వ మనుగడ ప్రశ్నార్థకంగా మారింది! స్వతంత్ర ఎమ్మెల్యే రాంబీర్ షోకీన్ .. కేజ్రీవాల్ సర్కారుకు సోమవారం మద్దతు ఉపసంహరించుకున్నారు. దీంతో 70 స్థానాలున్న అసెంబ్లీలో ఆప్ బలం కాంగ్రెస్, జేడీయూల మద్దతులో కలిపి 35కు పడిపోయింది. ఎన్నికల్లో 28 సీట్లు గెల్చుకున్న ఆప్ బలం వినోద్ కుమార్ బిన్నీ బహిష్కరణ, మరో సభ్యుడు స్పీకర్‌గా ఎన్నికవడంతో 26కు చేరింది. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల అమలులో ప్రభుత్వం విఫలమైనందుకే మద్దతు వాపసు తీసుకున్నట్లు షోకీన్ తెలిపారు. దీని గురించి లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్కు తెలిపేందుకు ఆయన కార్యాలయానికి వెళ్లగా ఆయన బిజీగా ఉండడంతో కలవలేకపోయానని, మంగళవారం అపాయింట్మెంట్ కోరానని చెప్పారు. విద్యుత్, నీటి సమస్య, కాంట్రాక్టు టీచర్ల క్రమబద్ధీకరణ వంటి వాటిపై ఎన్నో హామీలిచ్చిన అరవింద్ కేజ్రీవాల్ అధికారంలోకి వచ్చి ఇన్నాళ్లయినా సమస్యల పరిష్కారంలో విఫలమయ్యారన్నారు. -
ఆప్‌కు షౌకీన్ షాక్
సాక్షి, న్యూఢిల్లీ: ఇటీవల అధికారంలోకి వచ్చిన ఆప్ ప్రభుత్వానికి ఒకరి వెంట మరొక రు మద్దతు ఉపసంహరించుకుంటున్నారు. తాజాగా ఆ జాబితాలోకి స్వతంత్ర శాసనసభ్యుడు రామ్‌బీర్ షౌకీన్ చేరారు. స్థానిక ముండ్కా నియోజకవర్గానికి ప్రాతి నిధ్యం వహిస్తున్న రామ్‌బీర్ షౌకీన్ సోమవారం మధ్యాహ్నం లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్‌జంగ్‌ను కలసి మద్దతు ఉపసంహరణ లేఖను అందజేశారు. దీంతో కేజ్రీవాల్ సర్కారుకు మద్దతు ఉపసంహరించుకున్న శాసనసభ్యుల సంఖ్య రెండుకు పెరి గింది. ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి బహిష్కృతుడైన వినోద్‌కుమార్ బిన్నీ ప్రభుత్వానికి ఇప్పటికే మద్దతు ఉపసంహరించుకున్న సంగతి విదితమే.బిన్నీ, షౌకీన్ లతో పాటు తమ డిమాండ్ల కోసం ఒత్తిడి తెచ్చిన మరో ఎమ్మెల్యే షోయబ్ ఇక్బాల్ మాత్రం ప్రభుత్వానికి మద్దతును కొనసాగిస్తున్నారు. -
ఇక్బాల్, రామ్‌బీర్ యూటర్న్
సాక్షి, న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ తిరుగుబాటు వర్గం ఎమ్మెల్యే వినోద్‌కుమార్ బిన్నీ వర్గం నుంచి అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వానికి ఎదురైన తాజా ముప్పు టీకప్పులో తుపానులా తేలిపోయింది. ముఖ్యమంత్రి తమ డిమాండ్లకు అంగీరించారు కాబట్టి సంతృప్తి చెందామని ఎమ్మెల్యేలు షోయబ్ ఇక్బాల్, రామ్‌బీర్ షౌకీన్ ప్రకటిం చారు. తాము ఆప్ సర్కారు వెంటే ఉంటామని సోమవారం కేజ్రీవాల్‌ను కలిసిన తరువాత జేడీ(యు) ఎమ్మెల్యే షోయబ్ ఇక్బాల్, స్వతంత్ర ఎమ్మెల్యే రామ్‌బీర్ చెప్పారు. ప్రభుత్వం 48 గంటల్లో తమ డిమాండ్లకు అంగీకరించకుంటే మద్దతు ఉపసంహరించుకుంటామని ప్రకటించిన బిన్నీ వర్గం సోమవారం మాటమార్చింది. సర్కారును వ్యతిరేకిస్తున్న మరో ఇద్దరు ఎమ్మెల్యేలతో కలసి మధ్యాహ్నం ఒంటి గంటకు విలేకరుల సమావేశం నిర్వహిస్తామని ప్రకటించిన ట్టు చెప్పి బీన్నీ అలా చేయలేదు. బిన్నీతో కలిసి ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చిన షోయబ్ ఇక్బాల్, రామ్‌బీర్ షౌకీన్ ముఖ్యమంత్రిని కలిశారు. ఆ తరువాత వారు విలేకరులతో మాట్లాడుతూ ముఖ్యమంత్రితో సుహృద్భావ వాతావరణంలో సమావేశం జరిగిందని, తమ ఐదు డిమాండ్లకు ఆయన అంగీకరించడంతో సంతృప్తి చెందామని ప్రకటించారు. అదనపు నీటిని వాడితే 10 శాతం సర్‌చార్జి విధించకుండా 700 లీటర్ల నీటిని ఇంటింటికీ సరఫరా చేయాలని, మహిళా సురక్షాదళ్ను తక్షణం ఏర్పాటు చేయాలని, బిల్లుల రద్దుపై ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, విద్యుత్ సర్చార్జిని ఉపసంహరించాలని, కామన్వెల్త్ క్రీడల అవినీతి ఆరోపణలపై విచారణ చేపట్టాలని బిన్నీ వర్గం డిమాండ్ చేసింది. వీటితోపాటు లాల్డోరా, పురానీదిల్లీ వికాస్ బోర్డుకు సంబంధించిన తమ డిమాండ్లకు కూడా కేజ్రీవాల్ అంగీకరించారని షోయబ్ ఇక్బాల్ చెప్పారు. షౌకీన్, బిన్నీ, తాను కలిసి ఢిల్లీ వికాస్ మోర్చాను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన చెప్పారు. బీజేపీతో చేతులు కలిపానని సంజయ్ సింగ్ చేసిన ఆరోపణలను బిన్నీ ఖండించారు. తాను అకాలీదళ్ శాసనసభ్యుడు మంజిందర్ సింగ్ సిర్సా కూడా తమ మోర్చాలో చేరనున్నాడని తెలిపారు. ఈ విషయమై తాను ఆయనను కలిశానని ఆయన చెప్పారు.