సాక్షి, న్యూఢిల్లీ: ఇటీవల అధికారంలోకి వచ్చిన ఆప్ ప్రభుత్వానికి ఒకరి వెంట మరొక రు మద్దతు ఉపసంహరించుకుంటున్నారు. తాజాగా ఆ జాబితాలోకి స్వతంత్ర శాసనసభ్యుడు రామ్‌బీర్ షౌకీన్ చేరారు. స్థానిక ముండ్కా నియోజకవర్గానికి ప్రాతి నిధ్యం వహిస్తున్న రామ్‌బీర్ షౌకీన్ సోమవారం మధ్యాహ్నం లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్‌జంగ్‌ను కలసి మద్దతు ఉపసంహరణ లేఖను అందజేశారు. దీంతో కేజ్రీవాల్ సర్కారుకు మద్దతు ఉపసంహరించుకున్న శాసనసభ్యుల సంఖ్య రెండుకు పెరి గింది. ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి బహిష్కృతుడైన వినోద్‌కుమార్ బిన్నీ ప్రభుత్వానికి ఇప్పటికే మద్దతు ఉపసంహరించుకున్న సంగతి విదితమే.బిన్నీ, షౌకీన్ లతో పాటు తమ డిమాండ్ల కోసం ఒత్తిడి తెచ్చిన మరో ఎమ్మెల్యే షోయబ్ ఇక్బాల్ మాత్రం ప్రభుత్వానికి మద్దతును కొనసాగిస్తున్నారు.