Ramesh bidhudi
-
ఆ మూడు సీట్లలో మారిన రాజకీయ చిత్రం
సాక్షి, న్యూఢిల్లీ: నవంబర్ 25న ఉపఎన్నికలు జరగనున్న తుగ్లకాబాద్, మెహ్రోలీ, కృష్ణానగర్ నియోజకవర్గాలలో నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో ఈ నియోజ కవర్గాల నుంచి బీజేపీ నేతలు రమేష్ బిధూడీ, ప్రవేశ్ వర్మ, హర్షవర్థన్‌లు గెలుపొందడం, తిరిగి వారు ఎంపీలుగా ఎన్ని కై తమ శాసనసభ్యత్వానికి రాజీనామా చేయడం తెలిసిందే. గత అసెంబ్లీ ఎన్నిక ల నాటితో పోలిస్తే ఈ మూడు నియోజకవర్గాలలో పరిస్థితులు మారిపోయాయి. తుగ్లకాబాద్ నియోజకవర్గాన్నే తీసుకుంటే గత అసెంబ్లీ ఎన్నికలలో ఇక్కడ బీజేపీ విజయకేతనం ఎగురవేసింది. బీఎస్పీకి చెందిన సాహీరామ్ పెహల్వాన్ రెండవ స్థానంలో నిలిచారు. ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్ మూడు, నాలుగ స్థానాల తో సరిపెట్టుకున్నాయి. కానీ ఇప్పుడు సా హీరామ్ పెహల్వాన్ ఆప్‌లో చేరారు. దీంతో ఈసారి ఆప్ ఆయనను తమ అభ్యర్థిగా నిలబెట్టవచ్చని భావిస్తున్నారు. ఇక బీజేపీ రమేష్ బిధూడీ సోదరుని తనయుడు పర్వేష్‌ను బరిలోకి దింపవచ్చని అంటున్నారు. మెహ్రోలీ నియోజకవర్గంలోనూ మార్పులు వచ్చాయి. గత అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ మీద కోపంతో బీజేపీలో చేరి ప్రవేశ్ వర్మ గెలుపుకు తోడ్పడిన మాజీ మేయర్ సత్బీర్ సింగ్, తన కౌన్సిలర్ సతీమణితో కలిసి తిరిగి కాంగ్రెస్‌లో చేరిపోయారు. ఈ నియోజకవర్గం నుంచి బీజేపీ ఢిల్లీ విభాగం అధ్యక్షుడు సతీష్ ఉపాధ్యాయ ఎన్నికల బరిలోకి దిగే అవకాశముందని అంటున్నారు. ఆప్, కాంగ్రెస్ గత ఎన్నికలలో నిలబెట్టిన అభ్యర్థులనే అంటే నరేం దర్ సేజ్వాల్, డాక్టర్ యోగానందశాస్త్రికి టికెట్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ తనకు టికెట్ ఇవ్వలేనట్లయితే తన కుమార్తెకు అవకాశం ఇవ్వాలని యోగానందశాస్త్రి కోరుతున్నట్లు సమాచారం కృష్ణానగర్ నియోజకవర్గంలో హ ర్షవర్ధన్కు వ్యతిరేకంగా కాంగ్రెస్ తరఫున పోటీచేసిన వినోద్ కుమార్ మోంగా ఇప్పుడు బీజేపీలో చేరుతారని అంటున్నారు. అలాగే ఆప్ అభ్యర్థిగా పోటీచేసిన ఇషత్ ్రఅలీ అన్సారీ ఆప్‌కు రాజీనామా చేశారు. దానితో ఆప్ కొత్త అభ్యర్థిని బరిలోకి దింపవచ్చని, బీజేపీ మోంగాకు టికెట్ ఇవ్వవచ్చని అంటున్నారు. -
సీఎం రేసులో ముందున్న జగ్దీశ్ ముఖి
ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటూ ఎల్జీ ఆహ్వానిస్తే తాము సిద్ధమంటూ బీజేపీ ప్రకటించిన నేపథ్యంలో ముఖ్యమంత్రి ఎవరనే విషయమై చర్చలు మొదలయ్యాయి. ముఖ్యమంత్రి రేసులో బీజేపీ సీనియర్ నేత జగ్దీశ్ ముఖి అందరికంటే ముందున్నారు. ముఖి పేరును అంగీకరించడానికి ఎమ్మెల్యేలంతా సుముఖంగా ఉన్నారని అంటున్నారు. ఈ సీనియర్ ఎమ్మెల్యే జనక్‌పురి అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. కేంద్రమంత్రి హర్షవర్ధన్, రమేష్ బిధూడీ, నంరద్కిషోర్ గర్గ్ పేర్లు కూడా వినిసిస్తున్నాయి. వీరందరికంటే ముఖి పేరే బలంగా వినిపిస్తోంది. ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు కోసం ముఖి గత కొంత కాలంగా కృషి చేస్తున్నందువల్ల ఆయనకే సీఎం పీఠం దక్కవచ్చని చెబుతున్నారు. ముఖ్యమంత్రి పదవి ఎవరికి దక్కుతుందనేది పార్లమెంటరీ బోర్డు నిర్ణయిస్తుందని బీజేపీ వర్గాలు అంటున్నాయి. ఈ నెల 11న బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం జరుగనుంది. -
ఉప ఎన్నికలపైనే చూపు..
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీలో మళ్లీ అసెంబ్లీ ఎన్నికలు జరుగతాయా లేక ప్రభుత్వం ఏర్పాటవుతుందా అన్నది ఇంకా స్పష్టంగా తేలనప్పటికీ మూడు అసెంబ్లీ స్థానాలకు నవంబర్ 30లోగా ఎన్నికలు జరిపించవలసి ఉంది. కృష్ణానగర్ నుంచి గెలిచిన హర్షవర్ధన్, మెహ్రోలీ నుంచి గెలిచిన ప్రవేశ్ వర్మ, తుగ్లకాబాద్ నుంచి గెలిచిన రమేష్ బిధూడీ గత లోక్‌సభ ఎన్నికల్లో ఎంపీలుగా పోటీచేసి గెలిచి, అసెంబ్లీకి రాజీనామా చేయడంతో ఈ మూడు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరిపించవలసిన ఆవశ్యకత ఏర్పడింది. ప్రస్తుతం సుప్తచేతనావస్థలో ఉన్న అసెంబ్లీని త్వరగా రద్దుచేయనట్లయితే నవంబర్ 30 లోగా ఈ మూడు స్థానాలకు ఉప ఎన్నికలు జరిపించవలసి ఉంటుంది. ఈ మూడు స్థానాలకు జరిగే ఉప ఎన్నికలపైనే ఢిల్లీ రాజకీయ భవితవ్యం ఆధారపడి ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఉప ఎన్నికల ఫలితాలను బట్టే ఢిల్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయాలా లేక ఎన్నికలు జరిపించాలా అన్నది బీజేపీ నిర్ణయిస్తుందని వారు అంటున్నారు. రాజధానిలోని మూడు పార్టీల దృష్టి ఈ మూడు నియోజకవర్గాలకు జరిగే ఉప ఎన్నికలపైనే ఉందని వారు అంటున్నారు. గతంలో గెలిచిన మూడు సీట్లను తానే గెలిచి తన పట్టు చెక్కుచె దరలేదని నిరూపించుకోవాలన్న ఉద్దేశంలో బీజేపీ ఉండగా, లోక్‌సభ ఎన్నికల్లో చవిచూసిన ఘోరపరాజయంతో దెబ్బతిన్న ఆమ్ఆద్మీ పార్టీ ఈ మూడు సీట్లు గెలిచి ఢిల్లీలో మళ్లీ పట్టు సాధించాలన్న సంకల్పంతో ఉంది. అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలలో పరాజయం పాలైన కాంగ్రెస్ మళ్లీ తన బలాన్ని పుంచుకునే ప్రయత్నాలలో ఉంది. పార్టీ కార్యకర్తల్లో నూతనోత్సాహాన్ని నింపడం కోసం మూడు సీట్లలో మిగిలిన రెండు పార్టీలకు గట్టిపోటీనివ్వాలని భావిస్తోంది. శాసనసభ్యులు రాజీనామా చేసిన ఆరు నెలల్లో ఉప ఎన్నికలు జరిపించాల్సి ఉంటుందని, అందువల్ల నవంబర్ 30లోగా ఎన్నికలు జరగాలని ఢిల్లీ ఎన్నికల అధికారి విజయ్ దేవ్ చెప్పారు. అయితే అప్పటిలోగా ఢిల్లీ అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలు జరిపితే ఉప ఎన్నికల అవసరం ఉండదని ఆయన వివరించారు. కాగా, ప్రస్తుత రాష్ట్ర పరిస్థితికి ఆమ్ఆద్మీ పార్టీయే కారణమని బీజేపీ ఆరోపిస్తోంది. లోక్‌సభ ఎన్నికలు జరగ్గానే తాము సర్కార్‌ను ఏర్పాటుచేస్తామని గతంలో ఎల్జీకి ఆప్ లేఖ ఇచ్చి దాన్ని వెనక్కి తీసుకోకపోవడం వల్లే అసెంబ్లీ రద్దుకు అవాంత రాలు ఏర్పడుతున్నాయని విమర్శించింది. అయితే ఓటమి భయంతోనే బీజేపీ అసెంబ్లీ రద్దుకు వెనకడుగు వేస్తోందని ఆప్ దుయ్యబడుతోంది.