ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటూ ఎల్జీ ఆహ్వానిస్తే తాము సిద్ధమంటూ బీజేపీ ప్రకటించిన నేపథ్యంలో ముఖ్యమంత్రి ఎవరనే విషయమై చర్చలు మొదలయ్యాయి.
ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటూ ఎల్జీ ఆహ్వానిస్తే తాము సిద్ధమంటూ బీజేపీ ప్రకటించిన నేపథ్యంలో ముఖ్యమంత్రి ఎవరనే విషయమై చర్చలు మొదలయ్యాయి. ముఖ్యమంత్రి రేసులో బీజేపీ సీనియర్ నేత జగ్‌దీశ్ ముఖి అందరికంటే ముందున్నారు. ముఖి పేరును అంగీకరించడానికి ఎమ్మెల్యేలంతా సుముఖంగా ఉన్నారని అంటున్నారు. ఈ సీనియర్ ఎమ్మెల్యే జనక్‌పురి అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. కేంద్రమంత్రి హర్షవర్ధన్, రమేష్ బిధూడీ, నంరద్‌కిషోర్ గర్గ్ పేర్లు కూడా వినిసిస్తున్నాయి. వీరందరికంటే ముఖి పేరే బలంగా వినిపిస్తోంది. ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు కోసం ముఖి గత కొంత కాలంగా కృషి చేస్తున్నందువల్ల ఆయనకే సీఎం పీఠం దక్కవచ్చని చెబుతున్నారు. ముఖ్యమంత్రి పదవి ఎవరికి దక్కుతుందనేది పార్లమెంటరీ బోర్డు నిర్ణయిస్తుందని బీజేపీ వర్గాలు అంటున్నాయి. ఈ నెల 11న బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం జరుగనుంది.