Ramgopal
-
సింగిల్ క్యారెక్టర్‌తో వస్తోన్న హలో బేబీ.. ట్రైలర్ చూశారా?
కావ్య కీర్తి ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం హలో బేబీ. ఈ చిత్రాన్ని రామ్ గోపాల్ రత్నం దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. ఎస్కేఎమ్ఎల్ మోషన్ పిక్చర్స్ పతాకంపై కాండ్రేగుల ఆదినారాయణ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్ రిలీజైంది. హీరో ఆది సాయికుమార్ చేతుల మీదుగా ట్రైలర్ విడుదల చేశారు.ఈ సందర్భంగా ఆది సాయికుమార్ మాట్లాడుతూ..'ట్రైలర్ చూస్తుంటే సోలో క్యారెక్టర్‌తో తో సినిమా తీయడం చాలా మెచ్చుకోవలసిన విషయం. ఇప్పటికే ఎన్నో అవార్డులు పొందిన ఈ చిత్రం కచ్చితంగా మంచి హిట్ అవుతుంది. హ్యాకింగ్‌పై తీస్తున్న మొదటి చిత్రంగా దీన్ని జనాలు గుర్తుంచుకుంటారు' అని కొనియాడారు.నిర్మాతఆదినారాయణ మాట్లాడుతూ..' ఈ చిత్రం చాలా అద్భుతంగా వచ్చింది. త్వరలోనే చిత్రం రిలీజ్ చేస్తాం. దేశంలోనే మొట్టమొదటి హ్యాకింగ్ చిత్రంగా నిలవనుంది. ఇప్పటికే చాలా అవార్డులు వచ్చాయి. హీరోయిన్ కావ్య కీర్తి అద్భుతంగా చేసింది. డైరెక్టర్ రామ్ గోపాల్ రత్నం చేసిన కృషి మరువలేనిది' అని అన్నారు. -
రాధికా ఆప్టే అందానికి.. రాం.. ఫిదా!
సోషల్ మీడియాలో వివాదాస్పద కామెంట్లతో ఎప్పుడూ కనిపించే దర్శకుడు రాంగోపాల్ వర్మ కన్ను... ఈసారి మరాఠీ అందాల భామ రాధికా అప్టేపై పడింది. తాజాగా సూపర్ స్టార్ రజనీకాంత్ సరసన కబాలీ సినిమాలో నటిస్తున్న రాధికా ఆప్టే అందాన్ని వర్ణిస్తూ రాం చేసిన ట్వీట్.. రాధికా అభిమానులను మరింత పెంచేట్టుగా ఉంది. రాధికాను చూడగానే తాను డైరెక్ట్ చేసిన సినిమా గోవిందా గోవిందా సినిమాలోని పాట గుర్తుకు వచ్చిందని, ఇంతటి హాటెస్ట్ అమ్మాయిని ఇటీవల ఎక్కడా చూడలేదంటూ వర్మ తనదైన శైలిలో వర్ణిస్తూ ట్వీట్ చేశాడు. ఆ మరాఠీ బ్యూటీకి కొంతకాలం క్రితం విడుదలైన రక్త చరిత్ర సినిమాలో వర్మ...అవకాశం కూడ కల్పించాడు. అయితే ఇన్నాళ్ళ తర్వాత ఆమె మళ్ళీ తెరపైకి వస్తున్న నేపథ్యంలో తన మనసులోని భావాలను ''ఆహ్హాఆఆఆ! ది హాటెస్ట్ ఐ సా మై లాస్ట్ త్రీ బర్త్స్'' అంటూ ట్విట్టర్ లో పోస్టు చేశాడు.Ahhhhhhhhh!- The hottest I saw in my last 3 births 😍 pic.twitter.com/KQ0wIWC2ZJ— Ram Gopal Varma (@RGVzoomin) May 5, 2016 -
స్థానిక సమరానికి సై
చిత్తూరు (అర్బన్), న్యూస్‌లైన్: స్థానిక ఎన్నికల సమరానికి సైరన్ మోగింది. నోటిఫికేషన్‌ను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాంగోపాల్ సోమవారం విడుదల చేశారు. ఈ నెల 20వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 21వ తేదీన నామినేషన్ల పరిశీలన, 24న నామినేషన్ల ఉపసంహరణ, ఏప్రిల్ 6,8 తేదీల్లో పోలింగ్, 11న ఓట్ల లెక్కింపు ఉంటుందని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. జెడ్పీటీసీ స్థానాలకు చిత్తూరులోని జిల్లా పరిషత్ సమావేశపు మందిరం వద్ద, ఎంపీటీసీలకు ఆయా మండలాల ఎంపీడీవో కార్యాలయాల్లో నామినేషన్లు దాఖలు చేయాలని కలెక్టర్ పేర్కొన్నారు. ఐదు నామినేషన్లు దాఖలు జెడ్పీటీసీ స్థానాలకు తొలిరోజు ఐదు నామినేషన్లు దాఖల య్యాయి. ఇందులో పాలసముద్రం మండలానికి టీడీపీ నుంచి బి.చిట్టిబాబు రెండు సెట్ల నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. విజయపురానికి ఎం.సుశీల, ఎస్.సుప్రజ కాంగ్రెస్ పార్టీ తరఫున చెరొక నామినేషన్లు దాఖలు చేశారు. అలాగే మదనపల్లెకు సీఆర్.విజయకుమార్ టీడీపీ తరఫున నామినేషన్ దాఖలు చేశారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారి రవిప్రకాష్‌రెడ్డి, సహాయ రిటర్నింగ్ అధికారులు గోపీనాథ్, నిర్మల్ నిత్యానంద్ అభ్యర్థుల నుంచి నామినేషన్లు స్వీకరించారు. ఎంపీటీసీలకు అరకొరగా నామినేషన్లు జిల్లాలోని ఎంపీటీసీ స్థానాలకు సోమవారం పెద్దగా నామినేషన్లు దాఖలు కాలేదు. జిల్లావ్యాప్తంగా 901 ఎంపీటీసీ స్థానాలు ఉండగా తొలి రోజున 14 నామినేషన్లు మాత్రమే దాఖలయ్యాయి. ఇందులో వైఎస్సార్సీపీ తరఫున మదనపల్లె, చిన్నగొట్టిగల్లు మండలాల్లో ఒకటి చొప్పున, కలకడ రెండు నామినేషన్లు దాఖలు కాగా, కాంగ్రెస్ పార్టీ తరఫున బంగారుపాళెం, తిరుపతి, వి.కోట , భారతీయ జనతాపార్టీ (బీజేపీ) తరఫున కురబలకోటలో 1, నాగలాపురంలో 2, స్వతంత్ర అభ్యర్థులుగా యాదమరి, గుర్రంకొండ, బీ.ఎన్. కండ్రిగ, టీడీపీ తరఫున పెద్దతిప్పసముద్రంలో ఎంపీటీసీ స్థానాలకు నామినేషన్లు దాఖలయ్యాయి. భారీ బందోబస్తు... చిత్తూరులోని జెడ్పీటీసీ నామినేషన్ల స్వీకరణ ప్రాంతం వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. చిత్తూరు డీఎస్పీ కమలాకరరెడ్డి ఆధ్వర్యంలో సీఐలు అల్లాబక్షు, రాజశేఖర్, షాదిక్అలీలతో పాటు ముగ్గురు ఎస్ఐలు, 35 మంది సిబ్బంది, నాలుగు సీఆర్పీఎఫ్ బృందాలను ఏర్పాటు చేశారు. నామినేషన్ వేసే సమయంలో అభ్యర్థితో పాటు ఇద్దరిని మాత్రమే లోపలకు అనుమతిస్తామని డీఎస్పీ పేర్కొన్నారు. జిల్లా పరిషత్ సీఈవో వేణుగోపాలరెడ్డి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ తదితర అంశాలను పర్యవేక్షించారు. -
పుస్తకాలు విజ్ఞాన నేస్తాలు
తిరుపతి కల్చరల్, న్యూస్‌లైన్: విజ్ఞానాన్ని పెంపొందించే మంచి నేస్తాలు పుస్తకాలు అని జిల్లా కలెక్టర్ కే.రామ్‌గోపాల్ తెలిపారు. భారతీయ విద్యాభవన్ ఆధ్వర్యంలో ఎస్వీ హైస్కూల్ క్రీడా మైదానంలో శనివారం ఏర్పాటు చేసిన 8వ పుస్తక ప్రదర్శన ను ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచంలోని అనేక సంగతులను అవలోకనం చేసుకునేందుకు పుస్తక ప్రదర్శన దోహదపడుతుందన్నారు. అధునాతన టెక్నాలజీ కారణంగా పుస్తకం మనుషులకు దూరమయ్యే పరిస్థితి నెలకొందన్నారు. బయట దేశాల్లో అం దరి చేతుల్లో పుస్తకం దర్శనమిస్తుందని, కానీ మన దేశంలో సెల్ఫోన్లు కనిపిస్తాయన్నారు. ఫలితంగా సమాజంలో సంస్కృతి, సాంప్రదాయాలు కరువవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పుస్తక పఠనం జీవితాన్ని నేర్పడమే కాక లోకజ్ఞానాన్ని, మానవీయ విలువలను పెంచుతుందన్నారు. మానసిక ప్రశాంతతకు దోహదం చేస్తుందన్నారు. ప్రతి ఒక్కరూ పుస్తక పఠనం అలవర్చుకుని విజ్ఞానవంతులై భావితరాలకు మార్గదర్శకులు కావాలని ఆయన పిలుపునిచ్చా రు. భారతీయ విద్యాభవన్ ఆధ్వర్యంలో పుస్తక ప్రదర్శన ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. అనంతరం భారతీయ విద్యాభవన్ చైర్మన్, టీటీడీ ఈవో ఎంజీ.గోపాల్ మాట్లాడు తూ మనిషి మస్తకాన్ని చైతన్యపరచే సాధనం పుస్తకమన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు పుస్తక పఠనం పట్ల ఆసక్తి పెంచి వారిలో భాష పట్ల మమకారం, సమాజం పట్ల అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. భారతీ య విద్యాభవన్ డెరైక్టర్ సత్యనారాయణరాజు మాట్లాడుతూ అందరికీ పుస్తక పఠనం పెంపొం దించాలనే లక్ష్యంతో ప్రతి ఏటా తమ సంస్థ ఆధ్వర్యంలో పుస్తక ప్రదర్శన ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ప్రస్తుతం ఏర్పాటు చేసిన 8వ పుస్తక ప్రదర్శనలో రాష్ట్రం నుంచే కాక ఇతర రాష్ట్రాలకు చెందిన సాహిత్యం, సామాజిక శాస్త్రా లు, విద్య, విజ్ఞానం, పోటీ పరీక్షలకు సంబంధించిన అనేక రకాల పుస్తకాలతో సుమారు 68 స్టాల్స్ ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు. అనంతరం పద్మావతి మహిళా వర్శిటీ రిజిస్ట్రార్ పీ.విజయలక్ష్మీ మాట్లాడుతూ పుస్తకాలు మానవీయ సంబంధాలకు అద్దం పడతాయన్నారు. దీనికి ముందు పుస్తకాలను పల్లకిలో ఉంచి మహతి కళాక్షేత్రం నుంచి పుస్తక ప్రదర్శన కేంద్రం వరకు ఊరేగింపు నిర్వహించి పుస్తకం గొప్పతనాన్ని చాటారు. లోక సంచారి అనుభవాలు ‘జ్ఞాని లోక సంచారి’ అన్న సామెతను ఒంటబట్టించుకున్న రచయిత పరవస్తు లోకేశ్వర్ ఒంటరిగా ఆసియాలోని అన్ని దేశాలకు లింక్ కలిగిన రూటులో సాహసయాత్ర చేశారు. రెండువేల సంవత్సరాల క్రితం చైనా నుంచి రోమ్కు సిల్క్ ఎగుమ తి చేసే వారు. ఆ మార్గంలో ఖజికిస్థాన్ రాజధాని థాష్కెంట్ నుంచి చైనా రాజధా ని బీజింగ్ వరకు 16 వేల కిలోమీటర్లు 55 రోజులు ఒంటరిగా యాత్ర సాగించారు. ఈ యాత్ర ద్వారా తాను గ్రహించిన విషయాలను, పొందిన అనుభూతుల ను అక్షరరూపంలో కూర్చి ‘సిల్క్ రూట్లో సాహసయాత్ర’ అనే పుస్తకా న్ని రూపొందించారు. రచయిత ఈ పుస్తకంతో పాటు తన ఇతర రచనలతో తిరుపతిలో భారతీయ విద్యాభవన్ వా రు ఏర్పాటు చేసిన పుస్తక ప్రదర్శనలో 51వ స్టాల్లో ఉన్నారు. ఆయన వద్దకు వెళ్లి పుస్తకాలు కొనుగోలు చేశామంటే, పుస్తకంతో పాటు ఆయన యాత్రా విశేషాలను తెలుసుకోవడం చక్కటి అను భూతినిస్తుంది.