Ramreddy pratap kumar reddy
-
జైలుకైనా వెళ్తా గానీ..
అవసరమైతే తాను జైలుకైనా వెళ్తాను గానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడేది లేదని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి ఎమ్మెల్యే రాంరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. గురువారం ఆయన హైదరాబాద్లోని లోటస్పాండ్లో గల పార్టీ ప్రధాన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. తాను టీడీపీలో చేరుతున్నట్లుగా ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథనాలు కట్టు కథలేనని ఆయన అన్నారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆశీస్సులతోనే తాను ఎమ్మెల్యేగా గెలిచానని చెప్పారు. టీడీపీ నేతలు తనకు పలు రకాలుగా ఆశలు చూపించారని, చివరకు కేసులు పెడతామంటూ బెదిరించారని తెలిపారు. అయితే తాను కేసులకు భయపడేది లేదని, జగన్ వెంటే నడుస్తానని అన్నారు. వైఎస్ జగన్ రాష్ట్రప్రజల కోసం జలదీక్ష చేస్తుంటే.. చంద్రబాబు మాత్రం ధనదీక్ష చేస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు అవినీతి వ్యవహారాన్ని ప్రజలు గమనిస్తున్నారని ప్రతాప్ కుమార్ రెడ్డి అన్నారు. -
'హామీ మేరకే రైతులు పంటలు వేశారు'
నెల్లూరు: నెల్లూరు జిల్లా రైతులను ఆంధ్రప్రదేశ్ భారీ నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తప్పుదోవ పట్టిస్తున్నారని కావలి వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే రాంరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి విమర్శించారు. సోమవారం ఆయన నెల్లూరులో విలేకరులతో మాట్లాడారు. ఎకరా కూడా ఎండనివ్వమని చెబుతున్న మంత్రి ఉమాకు కావలిలో ఎండిన పంటలు కనబడలేదా? అంటూ సూటిగా ప్రశ్నించారు. ఐఏడీఏలో ఇచ్చిన హామీ మేరకే రైతులు పంటలు వేశారని ఆయన అన్నారు. నీరు ఇవ్వకపోవడంతో రైతులు అన్ని విధాలా నష్టపోయారని రామిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. పట్టిసీమతో రైతులను మోసం చేసేందుకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు యత్నిస్తున్నారని ఎమ్మెల్యే ఆర్ ప్రతాప్ కుమార్ రెడ్డి విమర్శించారు. -
చంద్రబాబును నిలదీసిన ఎమ్మెల్యే
నెల్లూరు: నెల్లూరు జిల్లాలోని కావలి కాలువ విషయమై ఆ జిల్లా కావలి ఎమ్మెల్యే రాంరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును నిలదీశారు. బిట్రగుంటలో రైల్వే ఆస్తులను వినియోగించుకోవాలని ఆయన కోరారు. అంతేకాకుండా రామయ్యపట్నం పోర్టు పనులు కూడా చేపట్టాలని రాంరెడ్డి ఈ సందర్బంగా చంద్రబాబును డిమాండ్ చేశారు. కావలి మున్సిపాలిటీలో ఫిరాయింపుదారులను ప్రోత్సహించేదిలేదని ఎమ్మెల్యే రాంరెడ్డి ప్రతాప్ కుమార్రెడ్డి సీఎం చంద్రబాబుకు స్పష్టం చేశారు.