Ramu Goud
-
టన్నెల్ పనుల్లో కూలీల మృతి బాధాకరం
సాక్షి, హైదరాబాద్: నాగర్‌కర్నూల్ జిల్లాలో జరుగుతున్న టన్నెల్ పనుల్లో ఐదుగురు కూలీలు మృతి చెందడం బాధాకరమని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. కాంట్రాక్టు సంస్థ సరైన భద్రతా చర్యలు పాటించకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని విమర్శించారు. ఈ ఘటనపై విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. శనివారం లోటస్‌పాండ్‌లోని పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్‌కు చెందిన నాయకుడు రాము గౌడ్ షర్మిల సమక్షంలో తన అనుచరులతో కలసి వైఎస్సార్టీపీలో చేరారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ నుంచి వైఎస్సార్ తెలంగాణ పార్టీలోకి చేరికలు కొనసాగుతున్నాయన్నారు. -
16 మందితో ఆప్ మూడో జాబితా
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల మూడో విడత జాబితాను ఆమ్ఆద్మీ పార్టీ(ఆప్) విడుదల చేసింది. ఇప్పటివరకు మొత్తం 47 మంది అభ్యర్థులను ప్రకటించినట్లు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బుర్ర రాముగౌడ్ తెలిపారు. గురువారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో రాముగౌడ్ మాట్లాడుతూ.. ఢిల్లీ తరహా పాలన తెలంగాణలో తీసుకురావడానికి ఆప్ కృషి చేస్తుందని తెలిపారు. సామాజిక సేవలో పాల్గొన్న వ్యక్తులకు, క్రిమినల్ నేపథ్యం లేనివారికే టికెట్ల కేటాయింపులో పార్టీ ప్రాధాన్యం ఇచ్చిందన్నారు. ఈ సందర్భంగా నిజాం మనవడు రౌనత్ఖాన్ను పార్టీలోకి ఆహ్వానించారు. ఢిల్లీలో అరవింద్ కేజ్రివాల్ పాలన నచ్చి పార్టీలో చేరినట్లు రౌనత్‌ఖాన్ తెలిపారు. అనంతరం రౌనత్‌ఖాన్ చేతుల మీదుగా పార్టీ అభ్యర్థులకు బీ–ఫామ్‌లను అందించారు. -
పాలమూరులో వడదెబ్బతో ముగ్గురి మృతి
మహబూబ్‌నగర్ జిల్లాలో వడదెబ్బతో ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. పెద్దమందడి మండలం గట్లఖానాపురం గ్రామంలో కావలి సవరయ్య (72), ధన్వాడ మండలం పస్పుల గ్రామానికి చెందిన రాములుగౌడ్ (70), ఆత్మకూరు మండలం అమరచింతకు చెందిన తెలుగు వెంకటేష్ (47) మృతి చెందారు.