rangareddy district collector
-
కోర్టు ఆదేశాలంటే లెక్కలేదా?
సాక్షి, హైదరాబాద్: కోర్టు ఆదేశాలను ధిక్కరించిన రంగారెడ్డి జిల్లా కలెక్టర్, ఆర్డీఓ, గండిపేట మండల తహసీల్దార్‌పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. గండిపేట మండలం నార్సింగిలోని సర్వే నంబర్ 340/4/1లో ఉన్న రెండెకరాల వివాదాస్పద భూమిపై స్టేటస్ కో ఆదేశాలున్నా.. అధికారులు ఆ భూమిపై ఓ సంస్థకు పట్టాదారు పాస్‌బుక్ జారీచేయటంపై మండిపడింది. ఈ భూమిపై చాలాకాలంగా వివాదం నడుస్తున్నది. సదరు భూమిపై 2014లోనే హైకోర్టు స్టేటస్ కో ఆదేశాలిచ్చింది. కానీ, 2023 అక్టోబర్‌లో ధరణి పోర్టల్‌లో ఆ భూమి ఇండ్రస్టియల్ ఆయిల్ ప్యూరిఫికేషన్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు చెందినదిగా గుర్తిస్తూ అధికారులు పట్టాదార్ పాస్‌బుక్ జారీచేశారు. ఈ చర్యపై పిటిషనర్ సంస్థ ఏషియన్ ట్యూబ్స్ ప్రైవేట్ లిమిటెడ్ మళ్లీ కోర్టుకు వెళ్లింది.1998లో చట్టపరంగా సదరు రెండెకరాల భూమిని కొనుగోలు చేశామని ఆ కంపెనీ వాదిస్తున్నది. ఈ అంశంపై తాజాగా విచారణ చేపట్టిన జస్టిస్ సీవీ భాస్కర్‌రెడ్డి.. అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తంచేశారు. కనీసం పిటిషనర్‌కు నోటీసులైనా ఇవ్వకుండా ఇండ్రస్టియల్ ఆయిల్ ప్యూరిఫికేషన్ ప్రైవేట్ లిమిటెడ్ పేరిట పాస్‌బుక్ ఎలా జారీ చేశారని ప్రశ్నించారు. స్టేటస్కో ఆదేశాలను పాటించకపోవడం చిన్నం పాండురంగం కేసులో సుప్రీంకోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించడమేనని స్పష్టంచేశారు. ‘కోర్టు ఉత్తర్వులంటే లెక్కలేదా? గతంలో స్టేటస్ కో ఆదేశాలిచి్చనా మీ ఇష్టం వచి్చన వారిని ధరణి పోర్టల్‌లో చేర్చి పాస్‌బుక్ జారీ చేస్తారా? ఈ విషయంలో కలెక్టర్‌తోపాటు ఆర్డీవో, తహసీల్దార్ అక్రమాలకు పాల్పడినట్లు స్పష్టంగా తెలుస్తోంది.ఇది ఇలాగే కొనసాగితే న్యాయవ్యవస్థపై కూడా ప్రజలకు నమ్మకం పోతుంది. రెవెన్యూ అధికారుల సహకారం లేకుండా ఈ పనులు జరగవు. ఇండ్రస్టియల్ ఆయిల్ ప్యూరిఫికేషన్ పేరున రెండెకరాల భూమిని ధరణి పోర్టల్‌లో చేర్చి పాస్‌బుక్ జారీ చేయడం చట్టవిరుద్ధం. 2014లో ఈ కోర్టు ఇచి్చన ఆదేశాల మేరకు రెవెన్యూ రికార్డులన్నీ నాలుగు వారాల్లో పిటిషనర్ పేరిట మార్చాలి. ఈ అక్రమాల్లో పాలు పంచుకున్న అధికారులపై విచారణ జరిపి క్షమశిక్షణా చర్యలు తీసుకోవాలని రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శిని ఆదేశిస్తున్నాం. భూమిని పొందేందుకు ఇండ్రస్టియల్ ఆయిల్ ప్యూరిఫికేషన్ సంస్థ మోసపూరిత చర్యలకు పాల్పడింది. చట్టాన్ని ఉల్లంఘించినందుకు ఆ సంస్థకు రూ.5 లక్షలు జరిమానా విధిస్తున్నాం. ఆ సొమ్మును నాలుగు వారాల్లో హైకోర్టు లీగల్ సరీ్వసెస్ కమిటీలో జమ చేసి.. రిసీట్‌ను కోర్టు రిజిస్ట్రీకి సమరి్పంచాలి’ అని ఆదేశించారు. -
కలెక్టరేట్లకు సౌర సొబగులు
జిల్లా కలెక్టరేట్ కార్యాలయాల్లో సోలార్ పార్కింగ్ షెడ్ల ఏర్పాటు దిశగా తెలంగాణ రెడ్కో (రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్) అడుగులు వేస్తోంది. ఇప్పటికే రెండు జిల్లాల్లోని కలెక్టర్ కార్యాలయాల్లో ప్రయోగాత్మకంగా సోలార్ పార్కింగ్ షెడ్లను ఏర్పాటు చేయగా తాజాగా ఇతర జిల్లాల్లోనూ వాటి ఏర్పాటుకు చర్యలు చేపట్టింది. ప్రస్తుతం సూర్యా పేట, ఖమ్మం జిల్లా కలెక్టరేట్ల క్యాంపస్‌లలో సోలార్ పార్కింగ్ షెడ్ల నిర్మాణం పూర్తయింది. 20న సూర్యాపేట ప్లాంటును సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు.– సాక్షి, హైదరాబాద్ ఖమ్మంలో 200 కేవీ సామర్థ్యంతో.. ఖమ్మం జిల్లా సమీకృత కలెక్టరేట్ కార్యాలయాల సముదాయంలో 200 కేవీ (కిలోవాట్ల) గ్రిడ్ అనుసంధానిత సోలార్ విద్యుత్ ప్లాంటును తెలంగాణ రెడ్కో ఏర్పాటు చేసింది. పార్కింగ్ స్థలాన్ని సద్వినియోగం చేసుకొనేలా పార్కింగ్ ప్రాంత పైభాగంలో సోలార్ ప్యానల్స్‌ను అమర్చింది. ప్రస్తుతం కలెక్టరేట్ కాంప్లెక్స్‌లో హైటెన్షన్ సర్వీస్‌లో నెలకు 14 వేల యూనిట్లకుపైగా విద్యుత్‌ను వినియోగిస్తున్నారు. లోటెన్షన్ సర్వీస్‌లో మరో 14 వేల యూనిట్లకుపైగా విద్యుత్ ఖర్చవుతోంది. తాజాగా 200 కేవీ సోలార్ విద్యుత్ ప్లాంట్ ఏర్పాటుతో 24 వేల యూనిట్ల వరకు సోలార్ విద్యుత్ ఉత్పత్తి జరగనుంది.దీనివల్ల రెండు సర్వీసుల్లో కలిపి నెలకు 4–5 వేల యూనిట్ల వరకు మాత్రమే గ్రిడ్ నుంచి వినియోగించుకున్నా సరిపోనుంది. అంతమేర మాత్రమే విద్యుత్ బిల్లు చెల్లించాల్సి రానుంది. ప్రస్తుతం నెలకు రూ. 1.80 లక్షల వరకు విద్యుత్ బిల్లులను కలెక్టరేట్ కార్యాలయాలు చెల్లిస్తుండగా సోలార్ ప్లాంట్ ఏర్పాటుతో 80% వరకు విద్యుత్ బిల్లు తగ్గనుంది. సోలార్ విద్యుత్ వినియోగం వల్ల ఏటా రూ. 20 లక్షల వరకు చార్జీల భారం తగ్గనుంది. ఈ లెక్కన 200 కిలోవాట్ల సోలార్ విద్యుత్ ప్రాజెక్టు నిర్మాణానికి అయిన ఖర్చు ఆరున్నరేళ్లలో తీరనుంది. మరో రెండు జిల్లాల్లో... రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ కాంప్లెక్స్‌లో 100 కేవీ సామర్థ్యంతో సోలార్ ప్లాంట్, కామారెడ్డి కలెక్టరేట్ కాంప్లెక్స్‌లో 100 కేవీ సామర్థ్యంగల ప్లాంట్ పనులు పురోగతిలో ఉన్నాయి. మరోవైపు ఇతర కలెక్టరేట్లు, ప్రభుత్వ కార్యాలయాలు సైతం సోలార్ విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు చొరవ చూపా లని తెలంగాణ రెడ్కో చైర్మన్ వై.సతీశ్‌రెడ్డి సూచించారు. ఈ ప్రాజెక్టు ఏర్పాటుతో సంప్రదాయ విద్యుత్ ఉత్పత్తి వల్ల జరిగే కాలుష్యాన్ని తగ్గించడంతోపాటు విద్యుత్ బిల్లుల భారాన్ని తగ్గించుకోవచ్చని వివరించారు. ప్లాంట్ ఏర్పాటుకు అయ్యే ఖర్చు కూడా గరిష్టంగా ఆరున్నర ఏళ్ల లో తిరిగి వస్తుందన్నారు. ఈ ప్లాంట్ల నిర్వహణ బాధ్య తను 20 ఏళ్లపాటు తెలంగాణ రెడ్కో పర్యవేక్షించనుంది. సూర్యాపేటలో 100 కేవీ సామర్థ్యంతో.. సూర్యాపేట జిల్లా సమీకృత కలెక్టరేట్ కార్యాలయాల సముదాయంలో 100 కిలోవాట్ల సోలార్ రూఫ్ టాప్ విద్యుత్ ప్లాంటును ఏర్పాటు చేశారు. దీని ద్వారా ఏటా 1.44లక్షల యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. దీని ద్వారా ఏటా రూ.11.23లక్షల మేర ఆదా కానున్నట్లు రెడ్కో అధికారులు చెబుతున్నారు. ఈ ప్రాజెక్టు నిర్మించడానికి అయిన వ్యయం ఐదున్నర ఏళ్లలో తీరనున్నట్లు వివరిస్తున్నారు. -
సంక్షేమం సమర్థతకు సమ ప్రాధాన్యం
‘తొలి ప్రాధాన్యత.. మలి ప్రాధాన్యత అంటూ లేదు. ప్రభుత్వ పథకాలన్నీ ప్రాధాన్యాలే. కాకపోతే ఫ్లాగ్షిప్ కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టి సారిస్తా’ అని కలెక్టర్ లోకేశ్‌కుమార్ స్పష్టం చేశారు. విద్యా ప్రమాణాలను మెరుగుపరిచేందుకు ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తామని తెలిపారు. సర్కారు భూములను కబ్జా చేసే వారిపై ఉక్కుపాదం మోపుతామని ఆయన హెచ్చరించారు. రంగారెడ్డి విశిష్టత కలిగిన పెద్ద జిల్లా అని, ఇతర జిల్లాలతో దీనిని పోల్చలేమని, ఇక్కడ సగం సమస్యలు రెవెన్యూ అంశాలకు సంబంధించినవే ఉంటాయన్నారు. దీంతో కొంత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరముందన్నారు. జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన లోకేశ్‌కుమార్ బుధవారం ‘సాక్షి’ ప్రతినిధితో ప్రత్యేకంగా మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. –సాక్షి, రంగారెడ్డి: జిల్లా ప్రతినిధి ఇక్కడ ప్రధాన సమస్య రెవెన్యూ వివాదాలు. నగరీకరణతో ప్రభుత్వ భూములను కాపాడటం కత్తిమీద సాములాంటిది. మొన్నటి వరకు పనిచేసిన ఖమ్మం జిల్లాలో వంద కేసుల్లో కేవలం పదింటిపైనే న్యాయపరమైన చిక్కులుండేవి. 90శాతం జిల్లా స్థాయిలోనే పరిష్కారం అయ్యేవి. ఇదే రంగారెడ్డి జిల్లా విషయానికి వస్తే వంద శాతం కోర్టుకెక్కుతున్నాయి. విలువైన భూములు కబ్జా కాకుండా రెవెన్యూ యంత్రాంగం పకడ్బందీగా వ్యవహరించాల్సిన అవసరముంది. అక్రమార్కులు న్యాయస్థానం మెట్లెక్కకుండా అప్రమత్తంగా వ్యవహరిస్తే సగం కేసులకు కళ్లెం వేయవచ్చు. ప్రజల దరికి సంక్షేమ ఫలాలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలను సమర్థంగా అమలు చేయడం కలెక్టర్‌గా నా బాధ్యత. విధులను సక్రమంగా నిర్వర్తిస్తూనే.. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా (ఫ్లాగ్షిప్) భావించే కార్యక్రమాలకు పెద్దపీట వేస్తాం. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, కంటి వెలుగు, రైతు బంధు, రైతు బీమా తదితర కార్యక్రమాలు నిర్ణీత గడువులోగా లబ్ధిదారులకు అందేలా చర్యలు తీసుకుంటా. ఉత్తీర్ణతా శాతం పెంపుపై ప్రత్యేక డ్రైవ్ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా పనితీరు మెరుగుపరుచుకోవాల్సిందే.. ప్రతి ఉద్యోగికీ అంకితభావం, జవాబుదారీతనం ముఖ్యం. వృత్తిలో రాణించాలంటే ఎప్పటికప్పుడు నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవాల్సిందే. బాగా పనిచేసే వారిని ప్రోత్సహిస్తాం.. వెనుకబడ్డవారిని మెరుగు పరుచుకోవాలని సూచిస్తాం. అయినా, పనితీరు సంతృప్తికరంగా లేకపోతే చర్యలకు వెనుకాడం. విధుల నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సహించేది లేదు. ఉద్యోగుల పనితీరును స్వయంగా తెలుసుకునేందుకు ఆకస్మిక తనిఖీలు చేస్తాం. పమాణాలను మెరుగుపరిచేందుకు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తా. ఈ నెలాఖరు నుంచే పదో తరగతిలో ఉత్తీర్ణతా శాతం పెంచే అంశంపై ఉపాధ్యాయులకు లక్ష్యాలను నిర్దేశిస్తా. నిరంతరం సమీక్షిస్తా. కేవలం చదువేగాకుండా.. విద్యార్థులకు మధ్యాహ్న భోజనం, స్కూలు దుస్తులు, పుస్తకాల పంపిణీలో అవకతవకలు చోటుచేసుకుండా చర్యలు తీసుకుంటా. ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే ప్రసవాలు చేసుకునేలా ప్రోత్సహిస్తూ కార్పొరేట్ తరహాలో మౌలిక సదుపాయాలు కల్పిస్తా. ప్రసూతి కేంద్రాలను పెంచడమేగాకుండా.. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యులు అందుబాటులో ఉండేలా చొరవ చూపుతా. -
ధిక్కార కేసులో రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌కు జైలు శిక్ష
ఏజీ అభ్యర్థన తో తీర్పు అమలు వాయిదా సాక్షి, హైదరాబాద్ : కోర్టు ధిక్కార కేసులో రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఎం రఘునందనరావుకు హైకోర్టు బుధవారం నాలుగు వారాల జైలు శిక్ష, రూ. 2వేల జరిమానా విధించింది. దీనిపై అప్పీల్ దాఖలు చేసుకునేందుకు వీలుగా తీర్పు అమలును నిలుపుదల చేయాలన్న అడ్వకేట్ జనరల్ అభ్యర్థనపై ధర్మాసనం సానుకూలంగా స్పందించింది. తీర్పు అమలును నాలుగువారాల పాటు నిలుపుదల చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ సీవీ నాగార్జున రెడ్డి, చల్లా కోదండరాంలతో కూడిన ధర్మాసనం బుధవారం తీర్పు ఇచ్చింది. రంగారెడ్డి జిల్లా కుత్బుల్లాపూర్ మండలం సూరారం గ్రామ పరిధిలోని సర్వే నెంబర్ 107లో బలహీనవర్గాల కోసం నిర్మించిన గహ సముదాయాల్లో అనధికారికంగా నివస్తున్న 2300 మందిని ఖాళీ చేయించాలంటూ 2007, జూలైలో రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఖాళీ చేయించే ప్రక్రియలో అధికారులకు తీవ్ర ప్రతిఘటన ఎదురుకావడంతో వారు అక్రమంగా నివాసం ఉంటున్నవారిని ఖాళీ చేయించలేకపోయారు. ఈ నేపథ్యంలో అధికారులు తమ నిస్సహాయతను వ్యక్తం చేస్తూ ఇళ్ల ఖాళీకి జారీ చేసిన తీర్పును పునః సమీక్షించాలంటూ అనుబంధ పిటిషన్ దాఖలు చేశారు. అయితే కోర్టు ఈ పునః సమీక్ష పిటిషన్‌ను కొట్టేస్తూ అక్రమంగా నివాసం ఉంటున్నవారిని ఖాళీ చేయాల్సిందేనంటూ తేల్చి చెప్పింది. అయితే కోర్టు తీర్పు అమలు చేయడంలేదంటూ రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌పై కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలైంది. ఇందులో కౌంటర్ దాఖలు చేసిన కలెక్టర్ కోర్టు ఉత్తర్వుల అమలుకు గడువు కావాలని పలుమార్లు అభ్యర్థించారు. అయితే గడువు ఇచ్చినప్పటికీ నిర్ణీత సమయం లోపు అక్రమంగా నివాసం ఉంటున్న వారిని ఖాళీ చేయించలేకపోయారు. ఇది కోర్టు ఉత్తర్వులను ధిక్కరించడమేనని భావించిన ధర్మాసనం కలెక్టర్‌కు నాలుగువారాల జైలు, రూ. 2వేల జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించింది. ఈ సమయంలో అక్కడే ఉన్న అడ్వకేట్ జనరల్ కె రామకష్ణారెడ్డి ఈ తీర్పుపై తమ అప్పీల్‌ను దాఖలుచేస్తామని, అందువల్ల తీర్పు అమలును వాయిదా వేయాలని కోరారు. అందుకు ధర్మాసనం అంగీకరిస్తూ తీర్పు అమలును నాలుగువారాల పాటు వాయిదా వేసింది.