ravi kant
-
కటిక చలిలో అమిత్‌షా కోసం..
న్యూఢిల్లీ: ఇప్పుడు ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయం కిటకిటలాడుతోంది. ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో పార్టీ చీఫ్‌ను ప్రసన్నం చేసుకొని ఎలాగైనా సీటు దక్కించుకోవాలనే ఆరాటంతో ఆశావాహులంతా గుంపులుగా చేరి ఉంటున్నారు. రాత్రి అవగానే చలిని భరించలేక తిరిగి తమ ఇళ్లకు వెళ్లి వస్తున్నారు. కానీ, వారెవ్వరూ కూడా మీడియాను ఆకర్షించలేకపోయారు. ఒక్క వ్యక్తి మాత్రం మీడియాకు ఆసక్తిని రేపారు. గత మూడు రోజులుగా కటిక చలిలోనూ అక్కడి నుంచి వెళ్లకుండా భీష్మించుకొని కూర్చున్నాడు. అతడే 46 ఏళ్ల రవికాంత్. అయితే, అతనేదో పార్టీ సీటుకోసమో, ఎమ్మెల్యే సీటుకోసమో అంటే కాదు.. బాలికల సమస్యను తీర్చాలనే తన డిమాండ్ నెరవేరడం కోసం. దాదాపు 2015 ఆగస్టు 12 నుంచే ఈ సమస్యపై పోరాటం ప్రారంభించిన ఆయన గతంలో ప్రధానమంత్రి కార్యాలయానికి లేఖ రాసినప్పటికీ ఫలితం లేకపోవడం ఇక ఏకంగా ఢిల్లీలోని అశోకా రోడ్డులోగల బీజేపీ హెడ్ క్వార్టర్స్ వద్దకు వచ్చారు. బాలికలపై లైంగికదాడులను చేసేవారిని కఠినంగా శిక్షించేలా చట్టాలు తీసుకురావాలనే డిమాండ్‌ను నేరుగా బీజేపీ చీఫ్ అమిత్ షాకు వినిపించాలని పట్టువీడకుండా అక్కడే ఎదురుచూస్తున్నాడు. బేటీ బచావో.. బేటీ పడావో అభియాన్ అనే పేరుతో రాసిన ఓ పలకలాంటిదాన్ని తన మెడకు తగిలించుకొని నిల్చున్నాడు. 'నేను పార్టీ చీఫ్‌ను కలవాలని మూడు రోజుల కిందటే కోరాను. కానీ, వారు నాకు ఇంత వరకు ఆ అవకాశం ఇవ్వలేదు. ఆయనను కలిసి నా బాధను చెప్పేవరకు నేను వెళ్లను' అంటూ అతడు తెలిపాడు. ఇతడికి ఓ కూతురు ఉంది. -
‘కిస్ ది కేన్వాస్’ లఘుచిత్ర ప్రదర్శన
కళాఖండాల సృజన జరిగే తీరును కెమెరాలో బంధించిన మసురం రవికాంత్, ఆ దృశ్యాలను ‘కిస్ ది కేన్వాస్’ లఘుచిత్రంగా మలచారు. అయాకి స్టూడియో సమర్పిస్తున్న ఈ లఘుచిత్రం కళాకృతి ఆర్ట్ గ్యాలరీలో ఏర్పాటైన ‘ఆర్ట్ ఎట్ తెలంగాణ’ శిబిరంలో గురువారం రాత్రి 7.00 గంటలకు ప్రదర్శించనున్నారు. ఈ లఘుచిత్రం నిడివి 2 నిమిషాల 35 సెకన్లు మాత్రమే. చూడచక్కని రంగులు, చేయితిరిగిన చిత్రకారుల హస్త నైపుణ్యం, వారి సృజనాత్మకత.. ఇవన్నీ కలగలిస్తేనే ఒక కళాఖండం తయారవుతుంది. కళాఖండం రూపుదిద్దుకునే ప్రక్రియలో రంగులలో ముంచిన తడితడి కుంచెలు కేన్వాస్ను సుతారంగా ముద్దాడుతాయి. ‘ప్రతి కళాకారుడూ తన కుంచెను తన ఆత్మలో ముంచి, తన స్వభావాన్నే తన చిత్రాల్లో చిత్రిస్తాడు’ అనే హెన్రీవార్డ్ బీచర్ మాటలే ప్రేరణగా ‘కిస్ ది కేన్వాస్’ లఘుచిత్రాన్ని రూపొందించిన మసురం రవికాంత్ స్వయంగా చిత్రకారుడు కావడం విశేషం. -సాక్షి, సిటీప్లస్ -
మోడల్ స్కూళ్లు
=అక్షరాస్యత పెంపు ధ్యేయం =ప్రత్యేక పాఠశాలల రాష్ట్ర మోనటరింగ్ అధికారి రవికాంత్ వెల్లడి మునగపాక, న్యూస్‌లైన్ : మహిళల్లో అక్షరాస్యత శాతం పెంపొందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కోట్లాది రూపాయలతో పలు మోడల్ స్కూళ్లను ఏర్పాటు చేస్తుందని ప్రత్యేక పాఠశాలల రాష్ట్ర మోనటరింగ్ అధికారి కె. రవికాంత్ అన్నారు. మండలంలోని పాటిపల్లి మోడల్ స్కూల్‌ను ఆయన సోమవారం అకస్మికంగా తనిఖీ చేశారు. రాష్ట్రంలోని మోడల్ స్కూళ్ల పరిశీలనలో భాగంగా ఆయన ఇక్కడి స్కూల్‌ను సందర్శించి రికార్డులు పరిశీలించారు. హాస్టల్ నిర్మాణం పూర్తయితే మోడల్ స్కూల్‌కు సంబందించిన ఉపాధ్యాయులలో ఒకరిని వార్డెన్‌గా నియమిస్తామన్నారు. హాస్టల్ మోనటరింగ్ను వార్డెన్ చూసుకునేలా చర్యలు తీసుకుంటామన్నారు. ] మోడల్ స్కూళ్లలో చేరేందుకు ఉత్సాహం : రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన మోడల్ స్కూళ్లలో చదువుకునేందుకు విద్యార్థులు ఉత్సాహం చూపుతున్నారని రవికాంత్ అన్నారు. మోడల్ స్కూల్ తనిఖీలో భాగంగా తనను కలిసిన విలేకరులతో రవికాంత్ మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా 356 పాఠశాలలు ఉన్నాయని తెలిపారు. ప్రస్తుతం మరో 324 పాఠశాలలు నిర్మాణ దశలో ఉన్నాయన్నారు. నిష్ణాతులైన ఉపాధ్యాయుల నియామకం వల్ల విద్యార్థులు ఆసక్తి చూపుతున్నారని అన్నారు. పలు పాఠశాలల్లో హాస్టల్ నిర్మాణాలు పూర్తి కావచ్చాయన్నారు. ఇవి పూర్తయితే బాలికలకు ఎంతగానో సదుపాయం ఉంటుందన్నారు. ఇంతవరకు గ్రామీణప్రాంతాల్లో జూనియర్ కళాశాలలు లేకపోవడంతో మహిళలు చదువులకు దూరంగా ఉండేవారని చెప్పారు. ఈ మోడల్ స్కూళ్ల ఏర్పాటు వలన ఇటువంటి సమస్య ఉండదని తెలిపారు. మహిళల ఉన్నత విద్యాభ్యాసానికి మోడల్ స్కూళ్లు ఎంతగానో దోహదపడుతున్నాయన్నారు. రవాణా సమస్య గురించి మాట్లాడుతూ, బస్సు ఏర్పాటుకు సంబంధిత ఆర్టీసీ డిపోనుంచి అనుమతి తెచ్చుకోవాల్సి ఉంటుందన్నారు. పిల్లల్లో ఒకరిగా.. : తనిఖీల సందర్భంగా రవికాంత్ ఉపాధ్యాయుల పనితీరును, విద్యార్థుల హాజరుశాతాన్ని గమనించారు. విద్యాబోధన తీరును గమనించేందుకు పాఠశాల గదుల్లో విద్యార్థుల మధ్య కూర్చుని పాఠాలు విన్నారు. బాలుర, బాలికల టాయ్లెట్లను, ప్రయోగశాలలను పరిశీలించారు. నిర్మాణ దశలో ఉన్న హాస్టల్‌ను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు.