Real Estate Venture
-
వెంచర్‌ను దున్నిన కేసులో టీడీపీ నేతల అరెస్టు
చక్రాయపేట: వైఎస్సార్ జిల్లా పులివెందుల నియోజకవర్గం, చక్రాయపేట మండలంలోని సురభి గ్రామం నాగలగుట్టపల్లెలో ఒక రియల్ ఎస్టేట్ వెంచర్‌ను దౌర్జన్యంగా దున్నేసిన కేసులో ఎనిమిది మంది టీడీపీ నాయకులను పోలీసులు అరెస్ట్‌చేశారు. టీడీపీ పులివెందుల నియోజకవర్గ ఇన్చార్జి బీటెక్ రవితోపాటు వందలాది మంది ఆయన అనుచరులు ఇటీవల నాగలగుట్టపల్లెలో రియల్ ఎస్టేట్ వెంచర్‌ను ట్రాక్టర్‌తో దున్నేసి వీరంగం సృష్టించిన విషయం తెలిసిందే. బీటెక్ రవి, స్థానిక టీడీపీ మండల అధ్యక్షుడు మహేశ్వరరెడ్డితోపాటు సుమారు 200 మందిపై బాధిత వ్యాపారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసులో మంగళవారం శంకర్‌రెడ్డి, యోగీశ్వరరెడ్డి, కుమార్‌రెడ్డి, వెంకటవిజయభాస్కర్‌రెడ్డి, రామాంజులరెడ్డి, రెడ్డెయ్య, శ్రావణ్‌కుమార్‌రెడ్డి, రాజేష్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు చక్రాయపేట ఎస్ఐ మల్లికార్జునరెడ్డి తెలిపారు. వెంచర్‌ను దున్నేసినవారిలో ఇప్పటి వరకు 32మందిని గుర్తించి వారిపై కేసు నమోదు చేశామని చెప్పారు. వారిలో ఎనిమిది మందిని అరెస్టు చేయగా, మిగిలినవారి కోసం గాలిస్తున్నామన్నారు. ఈ ఘటనలో పాల్గొన్నవారిని ఇంకా గుర్తించాల్సి ఉందని తెలిపారు. కాగా, ఈ కేసులో ప్రధాన నిందితులైన బీటెక్ రవితోపాటు మహేశ్వరరెడ్డి, మరికొందరు అజ్ఞాతంలోకి వెళ్లినట్లు సమాచారం. -
టీడీపీ నేతల వీరంగం
చక్రాయపేట: వైఎస్సార్ జిల్లా పులివెందుల నియోజకవర్గం చక్రాయపేట మండలం సురభి గ్రామం నాగలగుట్టపల్లె సినిమా హాల్ సమీపంలో కొందరు వ్యాపారులు వేసిన రియల్ ఎస్టేట్ వెంచర్‌ను టీడీపీకి చెందిన మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి, ఆయన అనుచరులు ఆదివారం ట్రాక్టర్లతో దున్నేశారు. బీటెక్ రవి, సుమారు 200 మంది నాయకులు, కార్యకర్తలు కలిసి వెంచర్ వద్దకు వచ్చి మారణాయుధాలు పట్టుకుని కేకలు వేస్తూ స్థానికులను భయభ్రాంతులకు గురిచేశారు. బాధితులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... సురభి గ్రామం నాగలగుట్టపల్లె సినిమా హాల్ సమీపంలో గోవిందు రామయ్య అనే వ్యక్తికి చెందిన 1.05 ఎకరాల భూమిని రమణ, సుబ్బయ్య అనే వ్యాపారులు కొనుగోలు చేసి రెండు రోజుల కిందట వెంచర్ వేశారు. దీంతో స్థానిక టీడీపీ నేతలు తాళ్లపల్లె మహేశ్వరరెడ్డి, రామాంజులరెడ్డిలు బీటెక్ రవిని పిలిపించుకుని వెంచర్‌ను ట్రాక్టర్‌తో దున్నేశారు. ఈ సందర్భంగా సుమారు రెండు వందల మంది టీడీపీ కార్యకర్తలు మారణాయుధాలతో బీభత్సం సృష్టించారు. ఈ విషయం తెలుసుకున్న రామయ్య, రమణ, సుబ్బయ్య వెంచర్ వద్దకు వచ్చేసరికి అందరూ వెళ్లిపోయారు. దీంతో వారు చక్రాయపేట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆర్కే వ్యాలీ, వేంపల్లె, పులివెందుల రూరల్, అర్బన్ సీఐలు గోవిందరెడ్డి, వెంకటేశ్వర్లు, బాలమద్దిలేటి, రాజు, చక్రాయపేట ఎస్ఐ మల్లికార్జునరెడ్డి వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేస్తాం: సీఐ గోవిందరెడ్డి నాగలగుట్టపల్లె వద్ద వెంచర్‌ను దున్నివేసిన ఘటనపై బీటెక్ రవి, మహేశ్వరరెడ్డితోపాటు మరికొందరిపై తమకు ఫిర్యాదు అందిందని ఆర్కే వ్యాలీ సీఐ గోవిందరెడ్డి తెలిపారు. ఈ మేరకు ఘటనలో ఎవరెవరు పాల్గొన్నారో విచారించి కేసు నమోదు చేసి తగు చర్యలు తీసుకుంటామని చెప్పారు. -
హైదరాబాద్ మెట్రో రియల్ వెంచర్.. సదుపాయాలు ఇలా..
సాక్షి, హైదరాబాద్: సర్వ హంగులతో త్వరలో మెట్రో రియల్ ఎస్టేట్ వెంచర్ ఏర్పాటు కానుంది. మెట్రో ప్రాజెక్టు ప్రజా రవాణా సాధనమే కాదు.. నగర పునర్నిర్మాణ ప్రాజెక్టు అని గతంలో ప్రకటించిన నేపథ్యంలో.. తాజాగా హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ రియల్ రంగంలోకి అడుగు పెడుతుండడం విశేషం. మెట్రో నిర్మాణ సమయంలో ఆసియాలో అతిపెద్దదైన ప్రీకాస్ట్ యార్డు (మెట్రో వయాడక్ట్‌లు తయారు చేసిన ప్రాంతం)ను నెలకొల్పిన విషయం విదితమే. ప్రాజెక్టు నిర్మాణం పూర్తికావడంతో సుమారు 42 ఎకరాల స్థలంలో సుమారు లక్ష చదరపు అడుగుల విస్తీర్ణంలో రియల్ వెంచర్‌గా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇప్పటికే ఉప్పల్ రింగ్‌రోడ్డు ప్రాంతంలో ప్రస్తుతం మెట్రో డిపోను సుమారు 104 ఎకరాల్లో ఏర్పాటు చేశారు. ఇందులో భూములు కోల్పోయిన రైతులకు హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో నెలకొల్పిన మెట్రో సిటీలో ప్లాట్లు కేటాయించారు. కానీ ఇప్పుడు ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కేందుకు ప్రీకాస్ట్ యార్డును రియల్ వెంచర్‌గా అభివృద్ధి చేయనున్నారు. ఈ నిధులను ఆర్థిక కష్టాల్లో ఉన్న మెట్రో సంస్థ వివిధ అభివృద్ధి పనులకు వినియోగించనుంది. నూతన రియల్ వెంచర్లో 200, 300, 600 చదరపు అడుగుల విస్తీర్ణంలో ప్లాట్లు ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. అదే తరహాలో.. రియల్ బూమ్.. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం కోకాపేట్లో భూముల వేలం ద్వారా సుమారు రెండు వేల కోట్లకు పైగా రెవెన్యూ ఆదాయాన్ని రాబట్టిన విషయం విదితమే. భూముల వేలంతో గ్రేటర్ పరిధిలో మళ్లీ రియల్ బూమ్‌కు రెక్కలొచ్చాయి. ఇదే తరుణంలో ఉప్పల్ ప్రీకాస్ట్ యార్డ్ ప్రాంగణంలో హెచ్ఎంఆర్ సంస్థ ఏ ర్పాటు చేసే రియల్ వెంచర్‌కు కూడా భారీగా డిమాండ్ ఉంటుందని రియల్టీ వర్గాలు అంచనా వే స్తున్నాయి. ఈ వెంచర్ ఏర్పాటు ద్వారా రూ.600 కో ట్లు రాబట్టాలని మెట్రో వర్గాలు ఆదాయ అంచనాలు రూపొందిస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. సదుపాయాలు ఇలా.. ► ప్రీకాస్ట్ యార్డు స్థలంలో ఏర్పాటు చేయనున్న వెంచర్లో హెచ్ఎండీఏ మార్గదర్శకాల ప్రకారం 40, 60, 100 ఫీట్ల వైశాల్యంతో సువిశాలమైన రహదారులు, గ్రీన్ స్పేస్, పబ్లిక్ పార్కులు, తాగునీరు, మురుగునీటి పారుదల వ్యవస్థలను ఏర్పాటు చేయనున్నారు. హెచ్ఎండీఏ నిబంధనల మేరకు 30 శాతం విస్తీర్ణంలో రహదారులు మరో 10 శాతం విస్తీర్ణంలో ఇతర సదుపాయాలు కల్పించాల్సి ఉంటుంది. ► మిగతా 55–60 శాతం విస్తీర్ణంలో రియల్ వెంచర్ ఏర్పాటు కానుంది. ఇందులో మార్కెట్ డిమాండ్‌ను బట్టి నివాస, వాణిజ్య సముదాయాలు ఏర్పాటు చేసుకునేందుకు వీలుగా ప్లాట్ల విస్తీర్ణాన్ని నిర్ణయించనున్నారు. మెట్రో ప్రాజెక్టుకు ప్రయాణికుల ఆదాయం ద్వారా 50 శాతం, రియల్టీ, రవాణా ఆధారిత అభివృద్ధి ప్రాజెక్టుల ఏర్పాటు ద్వారా మరో 45 శాతం, వాణిజ్య ప్రకటనల ద్వారా మరో 5 శాతం ఆదాయాన్ని రాబట్టాలని 2011లో కుదిరిన నిర్మాణ ఒప్పందంలో నిర్ణయించిన విషయం విదితమే. -
లంకె బిందె.. అరుదైన ఆభరణాలు; మాకూ వాటా కావాలి!
జనగామ: రెండోరోజైన గురువారం జరిపిన తవ్వకాల్లోనూ అరుదైన పగడాలు, రాతిపూసలు, నాగుపాము ఆకారంలో ఉన్న బంగారు ఆభరణాలు బయటపడ్డాయి. జనగామ జిల్లా పెంబర్తి గ్రామశివారు టంగుటూరు రోడ్డు సమీపంలో వెంచర్ కోసం భూమిని చదును చేస్తుండగా గురువారం లంకె బిందె, అందులో గుప్తనిధులు బయటపడ్డ సంగతి తెలిసిందే. ఈ మేరకు పురావస్తు శాఖ వరంగల్ అసిస్టెంట్ డైరెక్టర్ బి.మల్లునాయక్ నేతృత్వంలో ఉద్యోగులు భానుమూర్తి, బాబు శుక్రవారం ఈ ప్రాంతాన్ని సందర్శించి మట్టిని జల్లెడ పట్టించారు. ఈ సందర్భంగా కోరల్ బీడ్(ఎముకలతో తయారు చేసిన పూసలు), రాతి పూసలు(మహిళలు పుస్తెలతాడులో వేసుకునే పగడాలు), ల్యాపిన్ లాజ్యులీ స్టోన్(స్టోన్ రకానికి చెందిన పగడం), నాగుపాము ఆకారంలో ఉన్న బంగారు ఆభరణాలు వెలుగుచూశాయి. మట్టిలో దొరికిన ఆభరణాలను ప్రత్యేక కవర్లో ప్యాక్ చేసి ఉన్నతాధికారులకు అందజేశారు. ఇక అధికారులు ఆభరణాలను సేకరించే సమయంలో రైతులు అక్కడికి చేరుకుని తమకు కూడా వాటా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎస్సై రవికుమార్ సర్దిచెప్పగా వారు వెనక్కి తగ్గారు. అమ్మవారి ఆభరణాలు కావు! వ్యవసాయ క్షేత్రంలో బయటపడినవి అమ్మవారికి అలంకరించే ఆభరణాలు కాకపోవచ్చని పురావస్తు శాఖ అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. 1930– 40 ప్రాంతంలో రజాకార్ల దాడుల్లో సంపన్న కుటుంబాలు భద్రత కోసమే బండరాళ్ల మధ్య వీటిని దాచిపెట్టాయా.. లేక దారి దోపిడీ దొంగలు ఎత్తుకొచ్చి ఇక్కడ పాతిపెట్టారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వీటిల్లో ఎక్కువగా మహిళలు, పిల్లలు వినియోగించే ఆభరణాలు ఉండటం గమనార్హం. కాగా, గురువారం రాత్రి ఈ ప్రాంతంలో ఎలాంటి నిఘా లేకపోవడంతో బంగారు ఆభరణాల కోసం పలువురు పోటీపడి తవ్వినట్లు సమాచారం. కొందరికి బంగారు ఆభరణాలు లభించాయని తెలిసింది. ఈరోజు తవ్వకాల్లో వెలుగుచూసిన ఆభరణాల వివరాలు ►బంగారు ఆభరణాలు: 6 తులాల 300 మి.గ్రా. ►వెండి ఆభరణాలు: 2 తులాల 800 మి.గ్రా. ►కోరల్ బీడ్స్: 7 తులాల 200 మి.గ్రా. చదవండి: జనగామ: బయటపడ్డ లంకె బిందె.. బంగారం, వెండి లభ్యం! -
జనగామ: బయటపడ్డ లంకె బిందె.. 5 కిలోల బంగారం!?
సాక్షి, జనగామ: వెంచర్ ఏర్పాటు కోసం భూమిని చదును చేస్తుండగా బంగారు, వెండి ఆభరణాలతో కూడిన లంకె బిందె బయటపడింది. ఐదు కిలోల బరువైన బిందె బయటపడగా, అందులో మూడు కిలోలకుపైగా మట్టి ఉంది. మిగతా బంగారు, వెండి ఆభరణాలు ఉండగా, అధికారులు వాటిని స్వాధీనం చేసుకుని ట్రెజరీకి తరలించారు. శుక్రవారం నుంచి ఆ ప్రాంతంలో తవ్వకాలు చేపట్టాక, హైదరాబాద్‌లో పరిశీలన అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని తెలిపారు. తొలుత ఇవి నిజాం కాలం నాటి ఆలయాల్లోని ఆభరణాలుగా ప్రచారం జరిగినా, పురావస్తు శాఖ అధికారులు మాత్రం 50 ఏళ్ల క్రితం నాటివేననే నిర్ధారణకు వచ్చినట్లు తెలిసింది. వెంచర్ కోసం భూమి కొనుగోలు జనగామ మండలం పెంబర్తి శివారు టంగుటూరు క్రాస్ రోడ్డు 399, 409 సర్వే నంబర్లోని 11.06 గుంటల భూమిని సంకటి ఎల్లయ్య, ప్రవీణ్, నర్సయ్య. పర్శరాములు, దేవరబోయిన యాదగిరి, రాంచందర్, సత్తెయ్య తదితరులు ఇటీవల అమ్మారు. మేడ్చల్ జిల్లా కీసర మండలం బోగారం గ్రామానికి చెందిన మెట్టు నర్సింహ, దుర్గాప్రసాద్, నాగరాజులు ఈ భూమిని కొనుగోలు చేయగా, కొంతమొత్తంలో నగదు అందజేసి వెంచర్ కోసం బుధవారం పనులు ప్రాంభించారు. తొలుత జేసీబీ సాయంతో భూమిలో ఉన్న బండరాళ్లను తొలగిస్తుండగా చిన్న బిందె కనపడటంతో పెద్దగా పట్టించుకోలేదు. మళ్లీ గురువారం ఉదయం పనులు ప్రారంభించగానే ఆ బిందె పగిలి అందులో నుంచి ఆభరణాలు బయటపడడంతో గుప్త నిధులుగా భావించి పోలీసులు, అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో అదనపు కలెక్టర్ ఎ.భాస్కరరావు, ఏసీపీ వినోద్ కుమార్, ఇతర అధికారులు అక్కడికి చేరుకున్నారు అమ్మవారి అలంకరణ నగలని కొందరు.. రాగి బిందెలో బయటపడిన బంగారం, వెండి ఆభరణాలు అమ్మ వారికి అలంకరణ కోసం ఉపయోగించిన నగలుగా, మొత్తంగా 5 కిలోల బంగారం బయల్పడినట్లుగా తొలుత ప్రచారం జరిగింది. నిజాం కాలం నాటి ఆభరణాలుగా మరికొందరు చెప్పుకొచ్చారు. స్వర్ణకారుడు మాచర్ల బాలకృష్ణను పిలిపించి పంచనామా చేయించగా.. 18.7 తులాల బంగారు ఆభరణాలతో పాటు కిలోన్నర వెండి ఆభరణాలు, ఏడు గ్రాముల పగడాలు ఉండడంతో ప్రత్యేక బాక్స్‌లో భద్రపరిచి కలెక్టరేట్‌కు తరలించారు. హారాలు, చెవి కమ్మలు, కాళ్ల కడియాలు, నాగపడిగెలు, పూజలు చేసే సమయంలో చేతి వేళ్లకు పెట్టుకునే శివలింగంతో కూడిన ఉంగరాలు ఈ ఆభరణాల్లో ఉన్నాయి. వీటిని చూసేందుకు అనేక గ్రామాల నుంచి వందలాది మంది తరలిరావడంతో వారిని అదుపు చేసేందుకు పోలీసులు శ్రమించాల్సి వచ్చింది ట్రెజరీ స్ట్రాంగ్ రూమ్‌కు తరలింపు జిల్లా కలెక్టర్ కె.నిఖిల వాటిని పరిశీలించిన అనంతరం, వరంగల్ అర్బన్ జిల్లా ట్రెజరీ స్ట్రాంగ్ రూంలో భద్రపరిచేందుకు పోలీసు బందోబస్తు మధ్య పంపించారు. అంతకుముందే హైదరాబాద్ నుంచి పురావస్తు శాఖకు చెందిన డిప్యూటీ డైరెక్టర్ రాములునాయక్ తదితరులు తవ్వకాలు చేపట్టిన ప్రాంతాన్ని పరిశీలింన అనంతరం కలెక్టర్‌తో సమావేశమయ్యారు. అక్కడ ఆభరణాలను పరిశీలించి ఇవి యాభై ఏళ్ల క్రితం నాటివేనని నిర్ధారణకు వచ్చినట్లు తెలిసింది. స్థానికుల్లో స్థితిమంతులెవరైనా వీటిని తమ పిల్లల కోసం దాచి పెట్టి ఉంటారనే అభిప్రాయానికి వచ్చినట్లు సమాచారం. చదవండి: బయటపడ్డ 1100 ఏళ్ల నాటి బంగారు నాణేలు -
అనుమతులు లేని రియల్ దందా
కొణిజర్ల : సాధారణంగా ఓ వ్యక్తి ఇల్లు కట్టుకోవాలంటే అధికారులు సవాలక్ష నిబంధనలు పెడతారు. ఆ ధ్రువ పత్రం కావాలి, ఈ అధికారి అనుమతి కావాలి అంటూ కార్యాలయాల చుట్టూ తిప్పించుకుంటారు. అదే రియల్ ఎస్టేట్ పేరుతో వ్యాపారం చేస్తున్న వారికి మాత్రం అధికారులకు నిబంధనలు పట్టవు. కనీసం వారి వైపు కూడా తిరిగి చూడ కుండా ఉంటారు. మండలంలోని పలు గ్రామాల్లో నిబంధనలకు విరుద్ధంగా రియల్ ఎస్టేట్ వెంచర్లు వెలియడమే ఇందుకు నిదర్శనం. ఎటువంటి అనుమతులు లేకుండా భారీ భవనాలు నిర్మిస్తున్నా, వ్యాపారాలు నిర్వహిస్తున్నా అధికార్లు ఏమీ పట్టనట్టు ఉంటున్నారని విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. మండలం లోని కొణిజర్ల,తనికెళ్ల, అమ్మపాలెం, దుద్దెపూడి , పల్లిపాడు,చిన్నమునగాల తదితర గ్రామాల్లో రియల్ ఎస్టేట్ వెంచర్లు కుప్పలు తెప్పలుగా విస్తరిస్తున్నాయి.వీటిలో ఒక్కదానికి కూడా ప్రభుత్వ అనుమతి లేదు. కొన్ని వ్యవసాయ భూముల నుంచి వ్యవసాయేతర భూమిగా కూడా మార్పు చేయలేదు. అయినా దర్జాగా ప్లాట్ల వ్యాపారం కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా రాష్ట్రీయ రహదారి పక్కన ఉన్న భూములు రూ. కోట్లలో ధరలు పలుకుతుంటడంతో రియల్ ఎస్టేట్ వ్యాపారాలకు అడ్డూ అదుపులేకుండా పోతుంది. ఎవరైనా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలంటే అందుకు ప్రభుత్వం నుంచి 5 రకాల అనుమతులు పొందవలసి ఉంటుంది.ఈ ధ్రువపత్రాలు వివిధ శాఖల నుంచి తీసుకువచ్చి పంచాయతీరాజ్ వారికి ఇచ్చి వారి నుంచి అనుమతి పొందాలి.కాని అటువంటిది ఏమీ లేకుండా ముందు ప్లాట్లు చేసి అమ్మేద్దాం ఎవరైనా వచ్చి అడిగితే అప్పుడు చూసుకుందాములే అన్నట్లుగా వ్యవ హరిస్తున్నారు రియల్టర్లు. ఈ పత్రాలు తప్పని సరిగా ఉండాలి. వెంచర్లకు సంబంధించి ఆర్డీఓ నుంచి వ్యవసాయ భూమిని వ్యవసాయేత భూమిగా భూమార్పిడి పత్రం తీసుకోవాలి.గ్రామ కార్యదర్శి అనుమతి పత్రం, ఈసీ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్, ఇండివిడ్యువల్ అప్రూవల్, మండల సర్వేయర్ ఇచ్చే టోపోప్లాన్ రిపోర్టు అనే అయిదు రకాల ధ్రువపత్రాలు తప్పని సరిగా ఇవ్వవలసి ఉంటుంది. ఎవ్వరూ కూడా వీటి కోసం దరఖాస్తు చేసుకోరు కేవలం ల్యాండ్ కన్వర్షన్ చేసుకుని ప్లాట్లుగా విభజిస్తారు. ఈ అయిదు రకాల ధ్రువపత్రాలు పంచాయతీ రాజ్ శాఖకు ఇచ్చి వారి నుంచి అనుమతి పొందాలి. ఇందుకోసం మొత్తం వెంచర్ వేసే భూమిలో 10 శాతం గ్రీన్ బె ల్ట్ కోసం గ్రామ పంచాయతీ పేరమీద రిజిస్ట్రేషన్ చేయించి ఇవ్వాలి.ఇవేమీ లేకుండా ఇష్టానుసారంగా వెంచర్లు వేస్తున్నారు. అనుమతులు లేకుండా వేసిన వెంచర్లలో ఇండ్లు , ప్లాట్లు కొన్నవారికి నష్టం జరుగుతుందని ప్రభుత్వం నుంచి ఎటువంటి లోన్ సౌకర్యం ఉండదని చెప్పే టౌన్ ప్లానింగ్ అధికార్లు వెంచర్లపై మాత్రం చర్యలు తీసుకోవడం లేదు. వాతావరణ కాలుష్యం బాగా పెరిగి పోతున్న తరుణంలో చెట్లు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించి హరిత హారం పథకాన్ని ప్రవేశ పెట్టింది, అయితే ఉన్న చెట్లనే నరికి వెంచర్లు తయారు చేసి మొక్కల పెంపకాన్ని పట్టించుకోని రియల్ ఎస్టేట్ వ్యాపారులపై అధికార్లు ఎటువంటి చర్యలు తీసుకోవడడం లేదు. వెంచర్లు,పరిశ్రమలు, ఇతర ప్రాజెక్ట్‌లకు సంబంధించి గ్రీన్ బెల్ట్ ఖచ్చితంగా అమలు చేయాలి.కాని మండలంలో వెంచ ర్లు వేసిన వారు రోడ్లను గ్రీన్ బెల్ట్ కింద చూపి మాయ చేస్తున్నారు. గ్రీన్ బెల్ట్ కింద భూమిని తీయకుండా ప్లాట్ల అమ్మకాలు సాగిస్తున్నారు. ఇప్పటికైనా అధికార్లు స్పందించి గ్రీన్ బెల్ట్ స్టలాలను స్వాధీనం చేసుకుని చెట్టు పెంచాలని పలువురు కోరుతున్నారు. -
రూ.లక్షలు హాంఫట్
ఫొటోలో కనిపిస్తున్నది ఏదో రియల్ ఎస్టేట్ వెంచర్ అనుకుంటే పొరపాటు. అధికారుల దృష్టిలో ఇది ఎస్సీ, ఎస్టీలు నివసించే ప్రాంతం. అదేంటి అసలు ఇండ్లే లేవు.. ఎవరు నివసిస్తున్నారు అని ప్రశ్నించుకునేరు.? అక్రమాల్లో ఆరితేరిన అధికారుల దృష్టిలో ఇది ఎస్సీ, ఎస్టీ కాలనీనే. ఈ కాలనీలో దళిత, గిరిజనులు నివసిస్తున్నారని రికార్డులు సృష్టించారు. వారికి మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ఈ సీసీ రోడ్లు, డ్రెయినేజీలు నిర్మించినట్లు పేర్కొన్నారు. ఈ సీసీ రోడ్డును చూడండి.. ఎప్పుడో పదేళ్ల క్రితం వేసిన రోడ్డు కాదు.. ఏడాది క్రితమే నిర్మించినా పగుళ్లు తేలి ఇలా తయారైంది. ఈ రోడ్లపై ఇప్పటివరకు ఒక్క వాహనం కూడా తిరిగిన దాఖలాల్లేవు. కానీ.. అప్పుడే ఎక్కడికక్కడ పెచ్చులూడిపోయాయంటే ఆ పనుల్లో నాణ్యత అర్థం చేసుకోవచ్చు. ఘనత వహించిన అధికారులు ఈ పనుల కోసం అక్షరాల సుమారు రూ.69 లక్షలు ఖర్చు చేసినట్లు నిధులు డ్రా చేశారు. సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : ప్రజాప్రతినిధులు, నేతలతో చేతులు కలిపి ప్రజాధనాన్ని ఇష్టారాజ్యంగా ఖర్చు చేసిన వ్యవహారం ఎట్టకేలకు అధికారుల మెడకే చుట్టుకుంటోంది. ప్రజల అవసరాలతో నిమిత్తం లేకుండా, పర్సెంటేజీలే ధ్యేయంగా నేతలతో చేతులు కలిపి రూ.లక్షల నిధులను పక్కదారి పట్టించిన అక్రమార్కులపై ఎట్టకేలకు పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారులు చర్యలకు ఉపక్రమించింది. వివరాల్లోకి వెళితే.. సమస్యలతో సహజీవనం చేస్తున్న దళిత, గిరిజనులు నివసిస్తున్న ప్రాంతాల అభివృద్ధికి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. ఇందులో భాగంగా జిల్లాకు రూ.వందల కోట్లలో నిధులు వచ్చాయి. వీటితో ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో సీసీ రోడ్లు, డ్రెయినేజీల నిర్మాణం చేపట్టారు. మండలానికి ఒక్కో గ్రామాన్ని ఎంపిక చేసి ఈ పనులు చేపట్టారు. ఇందులో భాగంగా తానూరు మండల కేంద్రానికి వచ్చిన రూ.69 లక్షల నిధులను అధికారులు, నేతలు కలిసి పక్కదారి పట్టించారు. తూతూ మంత్రంగా పనులు చేసి దళిత, గిరిజనుల అభివృద్ధికి వినియోగించాల్సిన నిధులను అ ప్పనంగా కాజేశారు. నిబంధనలను తుంగలో తొక్కి పెద్ద ఎత్తున అక్రమాలకు తెరలేపారు. ఉపాధి హామీ చట్టం ప్రకారం ఈ నిధులతో ఎస్సీ, ఎస్టీలు నివసిస్తున్న ప్రాంతాల్లో మాత్రమే పనులు చేపట్టాలి. కానీ స్థానికులను మభ్యపెట్టి బోగస్ తీర్మాణాలు సృష్టించి ఎవ రూ నివాసముండని ఈ నిర్మానుష్య ప్రాంతం లో పనులు చేపట్టారు. దీంతో రూ.లక్షలు వెచ్చించి నిర్మించిన ఈ పనులతో ఏ ఒక్క దళిత, గిరిజనులకు ప్రయోజనం చేకూరకపోగా, నేతలు, అధికారులు మాత్రం పర్సెంటేజీల రూపంలో జేబులు నింపుకున్నారు. నాణ్యత గాలికి.. ఈ పనుల్లో నాణ్యత ప్రమాణాలను గాలికొదిలేశారు. నేతలతో చేతులు కలపడంతో అడిగే నాథుడే ఉండడని ఇష్టారాజ్యంగా పనులు చేపట్టారు. ఈ సీసీ రోడ్లపై ఒక్క వాహనం కూడా తిరిగిన దాఖలాలు లేకపోయినా ఎక్కడికక్కడ పెచ్చులూడి పోయాయి. ఈ డ్రెయినేజీల్లో పిచ్చిమొక్కలు పెరుగుతున్నాయి. ఈ పనుల్లో నాణ్యత పాటించకపోయినా రూ.లక్షల్లో బిల్లులు డ్రా చేశారు. ఈ వ్యవహారంలో ముథోల్ నియోజకవర్గానికి చెందిన ముఖ్య నేతల ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. విచారణ చేపట్టిన కమిషనర్ ఈ వ్యవహారంపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందడంతో పంచాయతీరాజ్ శాఖ విచారణకు ఆదేశించింది. ఈ మేరకు రెండు నెలల క్రితం ఈ పనులపై విచారణ చేపట్టిన ఆ శాఖ కమిషనర్ వెంకటేశం ఇటీవల నివేదికను ప్రభుత్వానికి అందజేశారు. ఈ నివేదిక మేరకు చర్యలకు ఉపక్రమించిన ఆ శాఖ ఉన్నతాధికారులు వివరణ ఇవ్వాలని పంచాయతీరాజ్ నిర్మల్ డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ జె.వెంకట్రావును ఆదేశించినట్లు సమాచారం. ఈ పనుల విషయంలో అన్ని నిబంధనల ప్రకారమే జరిగాయని పంచాయతీరాజ్ అధికారులు పేర్కొంటుండటం గమనార్హం. -
బడా టౌన్షిప్
ఇంటిగ్రేటెడ్ టౌన్‌షిప్‌కు ఉడా ప్రతిపాదన అటవీ భూముల్లో భారీ హౌసింగ్ వెంచర్ ప్రతిపాదనలు సిద్ధం చేసిన అధికారులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు అందజేత ఉడా చరిత్రలో ఇదే భారీ ప్రాజెక్టు సాక్షి, విజయవాడ : విజయవాడ, గుంటూరు, తెనాలి, మంగళగిరి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ(వీజీటీఎం ఉడా) మరో భారీ ప్రాజెక్టుకు ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఈసారి సుమారు 1,400 ఎకరాల్లో ఇంటిగ్రేటెట్ టౌన్షిప్ ఏర్పాటుచేయాలని నిర్ణయించింది. రూ.700 కోట్ల అంచనాతో ఈ మెగా హౌసింగ్ వెంచర్‌ను ప్రతిష్టాత్మకంగా నిర్మించాలని అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ ప్రాజెక్టును తమకు అనుకూలంగా ఉన్న అటవీ భూమిలో ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సహకరిస్తే ఆ భూములను అటవీ శాఖ చట్టం 1980 సెక్షన్(2) కింద కన్వర్షన్ చేయవచ్చని అధికారులు చెబుతున్నారు. ప్రతిపాదనలు ఇవీ.. మొత్తం 1,400 ఎకరాల భూమిలో 700 ఎకరాల్లో నిర్మాణాలు చేపట్టాలని నిర్ణయించారు. 350 ఎకరాల విస్తీర్ణంలో ఇళ్ల నిర్మాణం, మిగిలిన 350 ఎకరాల్లో పార్కు, బ్యాంకులు, పోలీసుస్టేషన్ తదితర అన్ని కార్యాలయాలకు అనువుగా భవనాలు నిర్మించాలని ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఇప్పటివరకు ఉడా సిద్ధం చేసిన ప్రతిపాదనల్లో ఇదే అత్యంత పెద్దది కావడం విశేషం. రాజధానితో లింకు..! ఉడా అధికారులు ప్రతి ప్రతిపాదనకు రాష్ట్ర రాజధానితో ముడిపెడుతున్నారు. ఇప్పటికే విజయవాడను తాత్కాలిక రాజధానిగా ప్రకటించిన క్రమంలో అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. శాశ్వత రాజధాని కూడా ఇక్కడే ఏర్పాటయ్యే అవకాశం ఉండటంతో ప్రభుత్వం కూడా ఉడా ప్రతిపాదనలకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో తమ ప్రాజెక్టులకు నిధులు మంజూరు చేయాలని ఉడా అధికారులు రాష్ట్ర ప్రభుత్వంతోపాటు కేంద్రాన్ని కూడా కోరుతున్నారు. ఏక కాలంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రతిపాదనలు పంపుతున్నారు. ఎక్కడి నుంచి నిధులు వచ్చినా తక్షణమే ప్రతిపాదనలను అచరణలోకి పెట్టాలని భావిస్తున్నారు. ల్యాండ్ బ్యాంక్ కొరత ఉడాకు మొదటి నుంచి ల్యాండ్ బ్యాంకు కొరత అధికంగా ఉంది. గతంలోనూ అనేక ప్రాజెక్టులు సిద్ధం చేయడంతోపాటు లక్షలాది రూపాయలు ఖర్చు చేసి డిటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టు కూడా రూపొందించినా భూమి కొరత వల్ల ముందుకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలోనే ప్రభుత్వ భూములు కేటాయించాలని ఉడా విస్తరించి ఉన్న రెండు జిల్లాల కలెక్టర్లకు అధికారులు విన్నవించినా ప్రయోజనం లేకపోయింది.